red sandalwood
-
చెట్ల అక్రమ రవాణాను ఎవరూ అడ్డుకోవడం లేదు: రాజగోపాల్ రెడ్డి
-
446 కిలోల ఎర్రచందనం స్వాధీనం
శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): అక్రమంగా తరలిస్తున్న 446 కిలోల ఎర్రచందనాన్ని ఆదివారం తెల్లవారుజామున తిరుపతి జిల్లాలో అటవీ శాఖ సిబ్బంది స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో తిరుపతి అటవీ క్షేత్ర అధికారి, సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున రేణిగుంట మండలం మాముండూరు సౌత్ బీటు వద్ద తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో టయోటా క్వాలిస్ వాహనం అతివేగంగా రావడాన్ని గమనించిన సిబ్బంది.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ అందులోని దుండగులు వాహనాన్ని వదిలేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వాహనంలో 446 కిలోల బరువున్న 15 ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు.వెంటనే ఎర్రచందనంతో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో అటవీ క్షేత్ర అధికారి సుదర్శన్‌రెడ్డి, గౌస్ఖరిమ్, శరవన్ కుమార్, సుబ్రమణ్యం, జాన్ శామ్యూల్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.4.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
తిరుపతి మంగళం: అక్రమంగా తరలిస్తున్న రూ.4.5 కోట్ల విలువైన ఏడు టన్నుల ఎర్రచందనాన్ని తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకుని ముగ్గురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గురువారం తిరుపతిలోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయం వద్ద పట్టుబడిన ఎర్రచందనాన్ని టాస్క్‌ఫోర్స్ ఎస్పీలు సుబ్బరాయుడు, శ్రీనివాస్‌లు పరిశీలించారు. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తూరు–వేలూరు రోడ్డులో పానాటుర్ సమీపంలోని అండర్ బ్రిడ్జ్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మికంగా వాహనాలను తనిఖీలు నిర్వహించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులను చూసి కంటైనర్ లారీని కొద్ది దూరంలో ఆపి ముగ్గురు స్మగ్లర్లు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని అదుపులోకి తీసుకుని కంటైనర్‌లో పరిశీలిస్తే ఎర్రచందనం ఉన్నట్టు గుర్తించారు. ఎర్రచందనాన్ని తమిళనాడు రాష్ట్రం సేలం సమీపంలోని గోడౌన్‌కు తరలించి అక్కడి నుంచి అసోంకు తరలిస్తున్నట్లు విచారణలో స్మగ్లర్లు చెప్పారు. నిందితుల్లో తమిళనాడుకు చెందిన నరేంద్రకుమార్, అసోంకు చెందిన బినోయ్కుమార్భగత్, రాజస్తాన్‌కు చెందిన విజయ్జోషి ఉన్నారు. -
గుంటూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత
-
నిజమైన ఎర్రచందనం స్మగర్లు టీడీపీ వాళ్లే
-
రక్షిత వృక్ష జాతుల్లో ఎర్రచందనం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో మాత్రమే పెరిగే ఎర్రచందనం వృక్షాలను రాష్ట్ర ప్రభుత్వం రక్షిత వృక్ష జాతిగా, అరుదైన చెట్లున్న ప్రాంతాలను రక్షిత ప్రాంతాలుగా ప్రకటించినట్లు కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. అంతరించిపోతున్న జంతు, వృక్ష జాతుల అంతర్జాతీయ వాణిజ్య ఒడంబడిక జాబితాలో ఎర్రచందనాన్ని చేర్చిన కారణంగా ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని నియంత్రిస్తుందని చెప్పారు. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజరస్ స్పీసెస్ (సెట్స్) స్టాండింగ్ కమిటీ ఎర్రచందనాన్ని ముఖ్యమైన వాణిజ్య ప్రక్రియ సమీక్ష నుంచి తొలగించాలని సూచించిందన్నారు. గ్రామీణ ప్రజలు, చిన్న, సన్నకారు రైతులకు ఉపాధి, ఆదాయ మార్గాల సృష్టి, ఉత్పాదకత మెరుగుపరచడానికి పరిపూర్ణమైన, సమగ్ర పద్ధతిలో చెట్ల పెంపకాన్ని విస్తరించే లక్ష్యంతో ఆగ్రో ఫారెస్ట్రీని ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఆగ్రో ఫారెస్ట్రీలో భాగంగా ఎర్రచందనం, టేకు వంటి వృక్ష జాతులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. పులికాట్ సరస్సు నిర్వహణకు ప్రణాళిక ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని పులికాట్ సరస్సు సహా చిత్తడి నేలల నిర్వహణకు ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్లాన్ (ఐఎంపీ) ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు మంత్రి అశ్వినికుమార్ చౌబే తెలిపారు. రాయదొరువు వద్ద సరస్సు ప్రవేశద్వారం నీటి ప్రవాహాన్ని అధ్యయనం చేయడంతోపాటు, ఇతరత్రా రక్షణ చర్యలను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్నాయని వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో వివరించారు. ఆ న్యాయమూర్తుల వివరాలు ప్రత్యేకంగా లేవు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంలో ఎలాంటి రిజర్వేషన్లు లేవని, అందువల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ న్యాయమూర్తుల వివరాలేమీ ప్రత్యేకంగా నిర్వహించడం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్ర బోస్, ఆర్.కృష్ణయ్య ప్రశ్నకు మంత్రి ఈమేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. -
ఎర్ర బంగారం ఇక ఎంతైనా ఎగుమతి!
ఎర్ర చందనం.. ప్రపంచంలో కేవలం మన దేశంలో మాత్రమే ఉన్న అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన జాతి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో విస్తరించిన తూర్పు కనుమల్లోని అడవుల్లో సహజ సిద్ధంగా ఎర్ర చందనం అనాదిగా పెరుగుతోంది. దీనితోపాటు, కొందరు రైతులు వర్షాధార భూముల్లో ఎర్రచందనం తోటలను చాలా ఏళ్లుగా సాగు చేస్తున్నారు. అంతరించిపోయే ప్రమాదం అంచుల్లో ఉన్న అరుదైన జాతి కావటంతో ఎర్రచందనం కలప ఎగుమతిపై 19 ఏళ్లుగా అంతర్జాతీయంగా పరిమితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల కృషి మేరకు ఎర్రచందనం ఎగుమతులపై పరిమితులు ఇటీవలే తొలగిపోయాయి. ఇక ఎంతయినా రైతులు ఎగుమతి చేయొచ్చు. మంచి ధర వచ్చే వరకు నిల్వ చేసుకొని మరీ ఎగుమతి చేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల్లో ఎర్రచందనం సాగు పుంజుకునేందుకు దోహదపడనున్న ఈ తాజా పరిణామంపై ప్రత్యేక కథనం. అంతర్జాతీయంగా ఆర్థికంగా ముఖ్యమైన చెట్ల జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఎర్రచందనం చేవ కర్రకు ఔషధ గుణాలు ఉన్నాయి. మన దేశంలోని తూర్పు కనుమలు విస్తరించిన దక్షిణ ప్రాంతంలో సహజ అడువుల్లో విస్తారంగా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. రైతులు కూడా తమ భూముల్లో సాగు చేస్తున్నారు. సుదీర్ఘకాలం పెంచాల్సి రావటం, చెట్లు నరకడానికి, అమ్మకానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉండటం వంటి పరిమితులు ఉన్నప్పటికీ.. అంతర్జాతీయంగా గిరాకీ, అధిక ధర, మార్కెట్ డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవటం వల్ల ఎర్రచందనం సాగుకు కొంత మంది రైతులు ఆసక్తి చూపుతూ వచ్చారు. ఎగుమతిపై పరిమితులు ఇటీవల రద్దయిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు మరింత పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది నిపుణుల మాట. ఎర్రచందనం చెట్టు కాండం మధ్యలో పెరిగే ఎర్రటి చేవ కర్రను వస్త్రాలు, ఆహారం, ఔషధాల్లో సేంద్రియ రంగు కోసం వాడుతున్నారు. ఖరీదైన ఫర్నీచర్, బొమ్మలు, సంగీత వాయిద్యాల తయారీకి వాడుతున్నారు. షుగర్, చర్మవ్యాధులకు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఎర్రచందనానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పెరుగుతున్నది. జపాన్, చైనా, ఐరోపా దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతోంది. అడవుల్లోని ఎర్రచందనం చెట్లను స్మగ్లర్లు గతంలో విచక్షణారహితంగా నరికివేసిన కారణంగా ఈ వృక్ష జాతి అంతరించిపోయే ముప్పును ఎదుర్కొనే దశకు చేరింది. అందువల్ల ఎర్రచందనం జాతిని అంతరించిపోకుండా పరిరక్షించడానికి ప్రత్యేక చర్యలు అవసరమయ్యాయి. 2004 నుంచి ఎగుమతిపై పరిమితులు జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ చట్టబద్ధ సంస్థ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్డేంజర్డ్ స్పెసీస్ (సిఐటిఇఎస్ – ‘సైట్స్’)లో 1976 నుంచి భారత్ సభ్యదేశంగా కొనసాగుతోంది. ఎర్రచందనం దుంగల ఎగుమతిపై 2004లో ‘సైట్స్’ పూర్తిగా నిషేధించలేదు గానీ, పటిష్టమైన సంరక్షణ చర్యల్లో భాగంగా పరిమితిని విధించింది. ఏటేటా ఈ జాతి చెట్ల స్థితిగతులను పరిశీలించి ఎగుమతి పరిమాణాన్ని సైట్స్ స్థాయీ సంఘం నిర్దేశిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎర్రచందనం పరిరక్షణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి ఈ చెట్ల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టింది. మరోవైపు అటవీ భూముల్లో ఎర్రచందనం మొక్కలు నాటడం కూడా జరిగింది. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు గుజరాత్లో కూడా కొందరు రైతులు బంజరు భూముల్లో ఎర్రచందనాన్ని దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. అటవీ భూముల్లోని ఎర్రచందనం చెట్లను పరిరక్షించటంతో పాటు రైతుల భూముల్లోనూ సాగు చేస్తుండటంతో ఈ జాతి అంతరించే ముప్పు నుంచి బయటపడింది. 19 ఏళ్ల తర్వాత.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నివేదికల ఆధారంగా తాజా పరిస్థితిని నవంబర్ 6–10 తేదీల్లో జెనీవాలో జరిగిన ‘సైట్స్’ 77వ స్థాయీ సంఘం సమావేశం సమీక్షించి సంతృప్తిని వ్యక్తం చేసింది. మన దేశం నుంచి సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా తరఫున అడిషినల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్.పి. యాదవ్ సారథ్యంలోని ఉన్నతాధికార బృందం ఈ సమావేశంలో పాల్గొని పరిస్థితిని వివరించింది. దీంతో, భారత్ నుంచి ఎర్రచందనం ఎగుమతులపై 19 ఏళ్లుగా అమల్లో ఉన్న పరిమితిని తొలగిస్తూ ఈ సమావేశం నిర్ణయం తీసుకుంది. దీంతో, జెనీవాలోని సైట్స్ స్థాయీ సంఘానికి బదులు.. ఇక మీదట ఎర్రచందనం ఎగుమతుల వ్యవహారాలపై న్యూఢిల్లీలోని సైట్స్ మేనేజ్మెంట్ అథారిటీ–ఇండియా నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కలిగింది. రైతులకు గొప్ప ప్రోత్సాహం ఎర్రచందనం ఎగుమతిపై పరిమితిని రద్దు చేస్తూ సైట్స్ స్థాయీ సంఘం తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అధికారికంగా ప్రకటించారు. మన దేశం గత 19 ఏళ్లుగా సైట్స్ నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించటమే కాకుండా ఎర్రచందనం వృక్ష జాతి పరిరక్షణ చర్యలు సమర్థవంతంగా పాటించినందున సైట్స్ సానుకూల నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. ‘ఈ పరిణామం ఎర్రచందనం తోటలు సాగు చేసే రైతులకు గొప్ప ప్రోత్సాహాన్నిస్తుంద’ని ఆయన అన్నారు. ఎర్రచందనం సాగు పద్ధతులు ఎగుమతిపై పరిమితి తొలగిన నేపథ్యంలో ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతుల్లో ఆసక్తి నెలకొంది. హైదరాబాద్ దూలపల్లిలోని అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) ఎర్రచందనం సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ ఇస్తోంది. గత ఏడాది కరదీపికను వెలువరించింది. ఆ వివరాలు...ఎర్రచందనం ప్రకృతిసిద్ధంగా తక్కువ నీటి వనరులున్న కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. అంతగా సారవంతం కాని గ్నీస్, క్వార్ట్జైట్, లాటరైట్ లోమ్ నేలలు బాగా అనుకూలం. సారవంతమైన నేలలు, నీటి సదుపాయం ఉన్న నేలలు ఎర్రచందనం సాగుకు అనువైనవి కావు. ఈ నేలల్లో సాగు చేస్తే చెట్లు బాగా ఎత్తుగా, లావుగా పెరుగుతాయి. అయితే, కాండం లోపల చేవదేలడానికి చాలా ఎక్కువ కాలం పడుతుంది. చేవను బట్టే ఎర్రచందనం నాణ్యత, ధర ఆధారపడి ఉంటాయి. పాక్షిక శుష్క ఉష్ణమండలంలోని ఆకురాల్చే అడవులు పెరిగే ప్రాంతం దీనికి అనుకూలం. 700 నుంచి 1200 ఎం.ఎం. మేరకు వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. కనీసం 700 ఎం.ఎం. వర్షం అవసరం. ఏడాదిలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతూ ఉండే ప్రాంతాలు ఎర్రచందనం సాగుకు అనుకూలం. అధిక వర్షపాత ప్రాంతాలు అనుకూలం కాదు. పొడి వాతావరణంతో పాటు 26–28 డిగ్రీల సెల్షియస్ (గరిష్టంగా 48 డిగ్రీల సెల్షియస్) ఉష్ణోగ్రతలు ఉండాలి. నర్సరీ బెడ్లపై పెంచిన 1–2 ఏళ్ల నారు మొక్కల్ని నాటుకోవాలి. ఎర్రచందనం గింజలు చాలా తక్కువ శాతం మొలకెత్తుతాయి. అందువల్ల వీటికి బదులు కొందరు ప్రైవేటు నర్సరీ వాళ్లు రైతులకు ఏగిశ మొక్కల్ని ఎర్రచందనం మొక్కలని నమ్మబలికి అంటగడుతూ ఉంటారని, రైతులు అప్రమత్తతంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏగిశ మొక్కలు కొన్ని సంవత్సరాల వరకు ఎర్రచందనం మాదిరిగానే కనిపిస్తాయట. కాండం కూడా ఎరుపు రంగులోనే ఉంటుంది. కాబట్టి మొక్కలను కొనుగోలు చేసేటప్పుడే రైతులు జాగ్రత్తవహించాలి. అటవీ శాఖ ద్వారా మొక్కల్ని కొనుగోలు చేయటం ఉత్తమం అని ఐఎఫ్బి శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. 30 ఏళ్లలో చెట్టుకు 59 కిలోల చేవ అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి) సమాచారం ప్రకారం.. ఎర్రచందనం మొక్కల్ని 3“3 మీటర్ల దూరంలో (హెక్టారుకు 1,111 మొక్కలు) నాటుకోవచ్చు. ఎర్రచందనం చెట్టు కోతకు రావటానికి 30 ఏళ్లు పడుతుందని ఐఎఫ్బి నిపుణులు తెలిపారు. నాటిన 20 ఏళ్లకు కాండం లోపలి భాగం (హార్డ్ వుడ్) చేవదేలటం ప్రారంభమవుతుంది. కాండంపై బెరడు కింద తెల్ల చెక్క ఉంటుంది. దాని లోపల ఎర్రగా చేవదేలి ఉంటుంది. ఆ ఎర్రని చేవ గల కర్రే విలువైనది. 30 ఏళ్ల వయసున్న చెట్టు నుంచి 59 కిలోల చేవగల ఎర్రచందనం దుంగ వెలువడుతుంది. పోయిన చెట్లు పోగా 30 ఏళ్లకు హెక్టారుకు కనీసం 275 చెట్లు మిగులుతాయి. ఈ లెక్కన హెక్టారుకు 16.2 మెట్రిక్ టన్నుల బరువైన ఎర్రచందనం లభిస్తుంది. 40 ఏళ్లకు 38 మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని ఐఎఫ్బి అంచనా. 2017లో ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ వేలంలో మెట్రిక్ టన్ను ఎర్రచందనం దుంగలు రూ. 27.8 లక్షలకు అమ్ముడయ్యాయి. రాళ్ల భూముల్లో పెరుగుతుంది! ఎర్రచందనం ఎగుమతిపై పరిమితులు రద్దవటం వల్ల రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతులు నేరుగా ఎగుమతిదారులను సంప్రదించడానికి వీలవుతుంది. ఎర్రచందనం తోటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో ఇతరత్రా పంటలు సాగుకు అనువుకాని రాళ్లు రప్పలతో కూడిన మెట్ట భూములు, గుట్టల్లో ఎర్రచందనం చెట్లు పెరుగుతాయి. ఒక సంవత్సరం మొక్కల్ని నీరు పోసి రక్షిస్తే చాలు. తర్వాత వాటికవే పెరుగుతాయి. ఎరువులు అవసరం లేదు. 30 ఏళ్లలో కోతకు వస్తాయి. ఐఎఫ్బిలో ఎర్రచందనం మీద చాలా ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్నాం. వన విజ్ఞాన కేంద్రం ద్వారా ప్రతి ఏటా రైతులు, అటవీ సిబ్బంది, విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఎర్రచందనం పెంపకం మాన్యువల్, ఎర్రచందనం–ఏగిశ (బిజసాల్) మధ్య వ్యత్యాసాలు, ఎర్రచందనాన్ని ఆశించే చీడపీడలు, నియంత్రణ చర్యలపై కరపత్రాలను విడుదల చేశాం. – వెంకట్‌రెడ్డి, సంచాలకులు, అటవీ జీవవైవిధ్య సంస్థ (ఐఎఫ్బి), దూలపల్లి, హైదరాబాద్ director_ifb@icfre.org ఎర్రచందనం రైతులకు ప్రయోజనకరం అంతరించిపోయే ప్రమాదం ఎదుర్కొంటున్న జీవజాతుల పరిరక్షణ చర్యలను జెనీవాలోని ‘సైట్స్’ అనే అంతర్జాతీయ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎర్రచందనం దుంగలను ఈ సంస్థ నిర్ణయించే పరిమితి మేరకే ఏటా ఎగుమతి జరుగుతోంది. దీంతో ఆ కోటా కన్నా ఎక్కువ ఎర్రచందనం మన రైతుల దగ్గర ఉన్నా ఎగుమతి చేసే వీలుండేది కాదు. కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల కృషి మేరకు ఎగుమతిపై ఉన్న పరిమాణాత్మక పరిమితిని ‘సైట్స్’ ఇటీవల రద్దు చేసింది. దీంతో ఎర్రచందనం ఎగుమతుల నియంత్రణ అంశం మన దేశంలోని ‘సైట్స్’ ఇండియా అథారిటీ పరిధిలోకి వచ్చింది. ఎర్రచందనం ఎగుమతిదారులు ఇక మీదట సైట్స్ ఇండియా అనుమతి తీసుకుంటే సరిపోతుంది. ఎర్రచందనం సాగు చేసే రైతులకు ఇది ప్రోత్సాహకర పరిణామం. సాగు చేసిన ఎర్రచందనం దుంగలను అప్పటికప్పుడు అమ్మెయ్యాల్సిన అవసరం లేదు. నిల్వ చేసి అయినా మంచి ధరకు రైతులు అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది. ఎర్రచందనం సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. – వై. మధుసూదన్ రెడ్డి, అటవీ దళాల అధిపతి (పిసిసిఎఫ్), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ (చదవండి: పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!) -
'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా
ప్రముఖ నటుడు వెట్రి కొత్త సినిమా 'రెడ్ శాండిల్ వుడ్'. జేఎన్ సినిమాస్ పతాకంపై జే.పార్థసారథి నిర్మించిన విచిత్రానికి గురు రామానుజమ్ దర్శకత్వం వహించారు. నటుడు ఎంఎస్ భాస్కర్ గణేష్ వెంకట్రాం కేజీఎఫ్ ఫేమ్ రామ్ కబాలి విశ్వ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈసందర్భంగా శుక్రవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ చెల్లెలు ఎవరో తెలుసా..?) ఇది ఎర్రచందనం స్మగ్లింగ్ ఆరోపణలు పేరుతో బలేనా అమాయకుల నేపథ్యంలో సాగే యథార్థ సంఘటనల ఇతివృత్తంతో కూడిన కథా చిత్రం అని దర్శకుడు తెలిపారు. 2015లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఆయన చెప్పారు. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలను తయారు చేసి క్యాన్సర్ నివారణకు ఉపయోగపడే గంధపు చెక్కలను విదేశాలకు చేస్తూ చైనా నుంచి ప్లాస్టిక్ బొమ్మలను దిగుమతి చేసుకునే పరిస్థితి నెలకొందని చిత్ర కథానాయకుడు వెట్రి పేర్కొన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ.. ట్రైలర్ చూడగానే మనసు ద్రవించిందన్నారు. ఎక్కడ చూసినా సమస్యలు, అకారణంగా బాధింపునకు గురైన, శిక్షించబడిన వారే కనిపిస్తున్నారన్నారు. అలాంటి సంఘటన వెనుక ఎవరో ఉంటున్నారన్నారు. వారి వల్ల అమాయకపు తమిళ ప్రజలే బాధింపునకు గురవుతున్నారు అన్నారు. ఇప్పుడు పెద్ద హీరోలు నటించిన చిత్రాలు లేదా, సహజత్వంతో కూడిన చిత్రాలు మాత్రమే విజయాన్ని సాధిస్తున్నాయన్నారు. అలా ఈ చిత్రం జాతీయ అవార్డులు అందుకోవాలని కోరుకుంటున్నాను అని పేరరసు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: విజయ్ క్యారెక్టర్‌పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
భూమిపై పెరిగే బంగారం! టేబుల్ రేటు రూ.7కోట్లు.. కుర్చీ రూ.2 కోట్లు!
‘భూ మండలంలో యాడా పెరగని చెట్టు మన శేషాచలం అడవుల్లో పెరగుతుండాది. ఈడ నుంచి వేల కోట్ల సరుకు విదేశాలకు ఎళ్తుండాది. గోల్డ్ రా ఇది. భూమిపై పెరిగే బంగారం పేరు ఎర్ర చందనం’ పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ప్రపంచమంతా ట్రెండింగ్ అయ్యింది. నిజంగా ఎర్ర చందనానికి ఉండే క్రేజ్ అలాంటిది మరి. చైనాలో అయితే.. ఎర్ర చందనంతో చేసిన కుర్చీ రూ.2 కోట్ల ధర పలుకుతోందట. ఈ మధ్య చైనా వెళ్లిన ఏపీ అటవీ శాఖ అధికారులకు అక్కడ ఎర్ర చందనం ధరలు తెలిసి మతిపోయినంత పనైందట. ఎర్ర చందనానికి చైనాలో ఉన్న మోజు అంతా ఇంతా కాదు. తమ ఇళ్లలో ఆ కలపతో చేసిన ఫర్నిచర్, గృహాలంకరణ వస్తువులు ఉండటం చాలా గొప్పగా భావిస్తారు. అందుకే ధర ఎంతైనా ఎర్ర చందనంతో తయారు చేసిన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు. బీజింగ్‌లోని ఓ ఫర్నిచర్ షాపులో ఎర్ర చందనంతో చేసిన డైనింగ్ టేబుల్ ధర రూ.7 కోట్లు. ఒక సోఫా సెట్ రేటు రూ.5 కోట్లు. కుర్చీ ధర రూ.2 కోట్లు. ఎర్ర చందనం మార్కెట్‌పై అధ్యయనం చేసేందుకు ఇటీవల చైనా వెళ్లిన మన రాష్ట్ర అటవీ శాఖాధి కారులు అక్కడి రేట్లు చూసి నివ్వెరపోయారు. మన రాష్ట్రంలో ఎర్ర చందనం అక్రమ రవాణా ఎందుకు జరుగుతుందో, దాని కోసం స్మగ్లర్లు ప్రాణాలకు తెగించి మరీ ఎందుకు రిస్కు తీసుకుంటారో చైనాలోని ఫర్నిచర్ షాపుల్లోని వస్తువుల ధర చూసి అధికారులకు అవగతమైంది. గ్రేడ్లను బట్టి రేటు అంతర్జాతీయ మార్కెట్లో ఎర్ర చెక్క సి గ్రేడ్ అయితే టన్ను రూ.30 లక్షలు ఉంటుంది. మధ్యస్థంగా ఉంటే రూ.45 లక్షలు పలుకుతుంది. నాణ్యమైన ఏ గ్రేడ్ చెక్క అయితే రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు పలుకుతుంది. చైనా వ్యాపారులు, అంతర్జాతీయ స్మగ్లర్లు ఈ ధరకు ఎర్ర చందనాన్ని కొనుగోలు చేస్తారు. జపాన్, మయన్మార్ వంటి తూర్పు ఆసియా దేశాల్లో దీనికి డిమాండ్ ఉంది. అందుకే ప్రాణాలకు తెగించి శేషాచలం అడవుల్లో స్మగ్లర్లు ఆ చెట్లు నరకడానికి ప్రయత్నాలు చేస్తారు. గత కొన్నేళ్లుగా అక్రమ రవాణాను అడ్డుకుని సీజ్ చేసిన 8 వేల టన్నుల ఎర్ర చందనం దుంగల్ని గతంలో అటవీ శాఖ వేలం వేసింది. ఇంకా 5,400 టన్నుల కలప ఉండగా రెండు నెలల క్రితం వేలం వేసి 320 టన్నుల్ని వేలం ద్వారా విక్రయించగా రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. ఇంకా 5,100 టన్నుల కలపను త్వరలో వేలం వేయనున్నారు. త్వరలో గ్లోబల్ టెండర్లు పిలుస్తాం చైనాలో ఎర్ర చందనం వస్తువులకు మహా మోజు ఉంది. అక్కడి మార్కెట్ గురించి అధ్యయనం చేశాం. అందుకు అనుగుణంగా అటవీ శాఖ వద్ద ఉన్న కలపను వేలం వేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. తొలిసారి వేలంలో మంచి రేటు వచ్చింది. వచ్చే నెలలో మిగిలిన 5 వేల టన్నులకుపైగా దుంగల్ని వేలం వేసేందుకు మరోసారి గ్లోబల్ టెండర్లు పిలుస్తాం. ఎంఎస్టీసీ ద్వారా ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్ నిర్వహిస్తాం. మంచి రేటు వచ్చే అవకాశం ఉంది. – మధుసూదన్‌రెడ్డి, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ ఎంత ఎర్రగా ఉంటే అంత నాణ్యం ఈ డిమాండ్‌కు అనుగుణంగా ఆ చెట్లను ఇష్టానుసారం నరికి అక్రమంగా రవాణా చేస్తుండటంతో ఎర్ర చందనం వృక్షాలు అంతరిస్తున్న జాబితాలోకి చేరాయి. అందుకే మన ప్రభుత్వం అడవుల్లో చెట్లను నరకడం చట్ట విరుద్ధంగా పేర్కొంది. అయినా అది సరిహద్దులు దాటిపోతూనే ఉంది. శేషాచలం అడవుల్లో సుమారు 5 వేల చదరపు కిలోమీటర్ల పరిధిలో ఎర్ర చందనం చెట్లు ఉన్నాయని అంచనా. అవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. వాటికి అంతా అనుకూలంగా ఉన్నచోట తొలి మూడేళ్లు వేగంగా పెరుగుతాయి. ఆ తర్వాత నెమ్మదిగా పెరుగుతుంటాయి. కనీసం 30 సంవత్సరాలకు గానీ మధ్యలోని చెక్క రంగు ఎరుపు రంగులోకి మారదు. అదే వంద నుంచి రెండు వందల సంవత్సరాలపాటు పెరిగితే లోపలి భాగం మరింత ఎర్రగా, వెడల్పుగా ఉంటుంది. కాబట్టి చెట్టుకు ఎన్నేళ్లుంటే అది అంత ఖరీదు. శేషాచలం అడవుల నేలలో అమ్ల శాతం, పోషకాలు, నీరు ఈ చెట్లు పెరగడానికి సరిపోతాయి. ఆ నేలలో ఉండే క్వార్ట్జ్ రాయి కూడా ఈ చెట్లు పెరగడానికి దోహదపడుతుంది. ఇక్కడ నేలలో ఉన్న సమ్మేళనం మరెక్కడా ఉండదని, నేలతోపాటు వాతావరణం అవి పెరగడానికి దోహదపడతాయని నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి -
ఆ ఎర్రచందనం మాదే.. మాకూ వాటా ఇవ్వండి
సాక్షి, అమరావతి : అక్రమంగా రవాణా అవుతూ ఇతర రాష్ట్రాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలు ఏపీలోనివే కాబట్టి వాటిలో తమకూ వాటా ఉంటుందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. స్మగ్లింగ్ చేస్తుండగా వివిధ రాష్ట్రాల్లో పట్టుకున్న ఎర్రచందనాన్ని వేలం వేసినప్పుడు వచ్చిన సొమ్ములో సగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే కేంద్ర అటవీ శాఖ, ఇతర రాష్ట్రాల అటవీ శాఖాధికారులతో సంప్రదింపులు జరిపింది. కేంద్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 14న తిరుపతిలో జరిగే అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్టŠస్ (పీసీసీఎఫ్)ల సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. శేషాచలం అడవుల్లో పెరిగే ఎర్ర చందనం చెట్లు ప్రపంచంలో మరెక్కడా ఉండవు. ప్రత్యేకమైన వాతావరణంలో పెరిగే ఈ వృక్షాలు అత్యంత అరుదైనవి. ఇతర ప్రాంతాల్లోనూ ఎర్రచందనం పెరుగుతుంది. కొన్ని చోట్ల తోటల్లో కూడా పెంచుతారు. అయితే, శేషాచలం చెట్లతో పోల్చితే అవి నాసిరకం. వీటిని సి గ్రేడ్‌గా పిలుస్తారు. అత్యంత నాణ్యంగా ఉండే ఎ గ్రేడ్ ఎర్రచందనం శేషాచలంలోనిదే. దీనికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అందుకే ఈ చెట్లను అక్రమంగా నరికి విదేశాలకు, ముఖ్యంగా చైనా, థాయ్‌లాండ్ తదితర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. ఈ వేలంలో విదేశీ కంపెనీలు కూడా పాల్గొంటాయి. వీటి ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం వస్తుంది. ఈ ఎర్రచందనం ఏపీలో పెరిగిన అరుదైన వృక్షజాతి కాబట్టి అది దేశంలో ఎక్కడ దొరికినా అందులో సగం ఇవ్వాలని రాష్ట్రం కోరుతోంది. అవసరమైతే వేలం వేసే దుంగల్ని పరిశీలించి ఎక్కడివో నిర్ధారించాలని సూచించింది. దుంగలను చూడగానే అది ఎక్కడిదో చెప్పవచ్చని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏ గ్రేడ్ సరుకు అయితే ఎక్కువ వెడల్పు, ఎక్కువ బరువుతోపాటు లోపల ఎర్ర రంగు ఉంటుంది. ప్రస్తుతం మన రాష్ట్రం వద్ద 5,376 టన్నుల ఎర్రచందనం దుంగలు ఉండగా, ఇతర రాష్ట్రాలు, సంస్థల వద్ద సుమారు 8 వేల టన్నులు ఉంది. బయట ఉన్న సరుకులో సగం వాటా మనకు వస్తే దాదాపు రూ. 2 వేల కోట్ల ఆదాయం లభించే అవకాశం ఉంది. 50 శాతం వాటా అడుగుతున్నాం ఇతర రాష్ట్రాల్లో సీజ్ చేసిన ఎర్రచందనంలో సగం ఏపీకి ఇవ్వాలని కేంద్ర అటవీ శాఖను కోరుతున్నాం. త్వరలో జరిగే జాతీయ స్థాయి సమావేశంలో దీనిపై గట్టిగా పట్టుబడతాం. దేశంలో అక్రమంగా రవాణా అవుతూ దొరికిన సరుకంతా ఇక్కడిదే. దాన్ని చూడగానే చెప్పొచ్చు. అందుకే దానిపై మన రాష్ట్రానికి హక్కు ఉంటుంది. – మధుసూదన్ రెడ్డి, అటవీదళాల అధిపతి, పీసీసీఎఫ్ -
వేలానికి 5 వేల టన్నుల ఎర్ర చందనం
సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం 5 వేల మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం దుంగల్ని వేలం వేయనుంది. ఇటీవలే 300 టన్నులు వేలం వేసిన రాష్ట్ర ప్రభుత్వం రూ. 175 కోట్ల ఆదాయం పొందింది. ఇప్పుడు మరో 5 వేల టన్నులు వేలానికి సిద్ధం చేసింది. అక్రమ రవాణాదారుల నుంచి స్వాదీనం చేసుకున్న ఈ ఎర్ర చందనం నిల్వలను కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయనుంది. స్మగ్లర్ల నుంచి స్వాదీనం చేసుకున్న ఎర్ర చందనం ఏ రాష్ట్రంలో ఎంత మేర ఉన్నాయో గుర్తించి దాన్నిబట్టి వేలం కోటాను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ నిర్దేశిస్తుంది. అలా మన రాష్ట్రంలో ఉన్న 8 వేల మెట్రిక్ టన్నుల దుంగల వేలానికి పదేళ్ల క్రితం అనుమతి ఇ చ్చింది. అప్పటి నుంచి విడతలవారీగా వేలం వేస్తున్నారు. చివరగా 2021 సంవత్సరంలో అప్పటికి మిగిలిపోయిన 318 మెట్రిక్ టన్నుల దుంగల్ని ఆన్లైన్లో వేలం వేశారు. ఆ తర్వాత పట్టుబడిన మరో 5,400 మెట్రిక్ టన్నుల దుంగలను తిరుపతిలోని అటవీ శాఖ సెంట్రల్ గోడౌన్లో భద్రపరిచారు. వీటి వేలానికి అనుమతి ఇవ్వాలని చాలా రోజులుగా రాష్ట్రం కోరుతోంది. గత డిసెంబర్లో దేశవ్యాప్తంగా 13,301 మెట్రిక్ టన్నుల ఎర్ర చందనం వేలానికి కేంద్రం అనుమతి ఇ చ్చింది. అందులో ఏపీ నుంచే 5,376 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. దీంతో ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 300 టన్నులు ఆన్లైన్లో విక్రయించారు. మిగిలిన నిల్వల్ని వెంటనే వేలం వేయాలని భావించినప్పటికీ, ఎర్ర చందనం మార్కెట్ అంతా చైనాదే కావడం, అక్కడ కరోనా తీవ్రంగా ఉండటంతో ముందడుగు పడలేదు. ఇప్పుడు అక్కడ పరిస్థితులు కుదుటపడటంతో వేలానికి అధికారులు చర్యలు చేపట్టారు. చైనాలో అధ్యయనం చేసిన ఉన్నతాధికారులు ఈసారి వేలంలో చైనా కంపెనీలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేలా చేయడం ద్వారా ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి, పీసీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి ఇతర అధికారుల బృందం ఇటీవలే చైనాలో పర్యటించింది. అక్కడ ఎర్ర చందనానికి ఉన్న మార్కెట్, వ్యాపారులు, కంపెనీలు ఏం కోరుకుంటున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటే ఎక్కువ కంపెనీలు వేలంలో పాల్గొంటాయో అధ్యయనం చేసి ఈ బృందం ఒక ప్రణాళిక రూపొందించింది. దీనిపై సీఎం వైఎస్ జగన్‌తో చర్చించి ఆయన ఆమోదం తర్వాత ఈ నెలాఖరు లేదా జూన్ మొదటి వారంలో వేలం ప్రక్రియ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఎంఎస్టీసీ ద్వారా దశలవారీగా అంతర్జాతీయ ఆన్లైన్ బిడ్డింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. వేలం పూర్తయితే ప్రభుత్వానికి మంచి ఆదాయం సమకూరుతుందని పీసీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. -
ఎర్ర చందనమే వారికి వరకట్నం
భాకరాపేట (తిరుపతి జిల్లా): చైనాలోని కుటుంబ వ్యవస్థల్లో ఎర్ర చందనానికి ఉండే విలువ అంతాఇంతా కాదు. ఎర్ర చందనంతో చేసిన వస్తువులను వరకట్నంగా ఇవ్వడాన్ని అక్కడి వారు చాలా గొప్పగా, గర్వంగా ఫీలవుతుంటారు. ఎర్ర చందనాన్ని గౌరవాన్ని పెంచే చిహ్నంగా భావిస్తారు. ఎర్ర చందనంతో చేసిన పూసలను బౌద్ధ భిక్షువులు మెడలో ధరిస్తారు. అక్కడ ఒక కేజీ ఎర్ర చందనం దుంగ నుంచి కీ చైన్లు, పూసలు తయారుచేసి అమ్మితే సుమారు రూ.25 వేలు వస్తుంది. టన్ను ఎర్ర చందనం ధర అక్కడ రూ.2.50 కోట్లు పలుకుతోంది కాబట్టే విదేశాలకు అక్రమ రవాణా అడ్డూ అదుపు లేకుండా సాగిపోతోంది. అదృష్టం తెస్తుందని.. ఎర్ర చందనాన్ని చైనా, మలేషియా, జపాన్, సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ దేశాలకు ఎక్కువగా తరలిస్తారు. బౌద్ధులు దీనిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇంట్లో ఎర్ర చందనం ముక్క ఉంటే.. అదృష్టాన్ని తీసుకొస్తుందని నమ్ముతారు. బొమ్మలు, ఇంటి వస్తువులు, సంగీత వాయిద్యాలు, దేవుడి బొమ్మలు, బుద్ధుడి బొమ్మలు, గడియారాలు, టీ కప్పులు తదితర వస్తువుల తయారీకి దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ సౌందర్యం కోసం క్రీమ్‌లు, పౌడర్‌గానూ వాడుతున్నారు. ఆయుర్వేద గుణాలు ఎక్కువగా ఉండడంతో ఔషధాల తయారీలోనూ వినియోగిస్తున్నారు. ఎర్ర చందనంతో చేసిన గ్లాసుల్లో నీటిని ఉంచి తాగితే బీపీ, షుగర్ వ్యాధులు తగ్గుముఖం పడతాయని నమ్ముతారు. మన దేశంలో తప్ప ఎక్కడా దొరకదు మన దేశంలో తప్ప ప్రపంచంలో ఎక్కడా ఎర్ర చందనం దొరకదు. మన దేశంలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న శేషాచలం అటవీ ప్రాంతంలోనే ఎర్ర చందనం ఉంది. దాదాపు 6.50 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. శేషాచలం అటవీ ప్రాంతంలో పెరిగే ఎర్ర చందనానికి ఉన్న గిరాకీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ పెరిగినా లేదు. ఎర్ర చందనం, శ్రీగంధం వేర్వేరు ఎర్ర చందనం, శ్రీ గంధం వృక్షాలు రెండూ సుగంధ ద్రవ్య వృక్షాలే అయినా వృక్ష శాస్త్రపరంగా రెండూ ఒకే జాతికి చెందినవి కావు. ఎర్ర చందనానికి వాసన కన్నా రంగు ఎక్కువ. దీనిని వృక్ష శాస్త్రంలో టెర్రోకార్పస్ శాంటాలీనస్ అంటారు. ఎర్ర చందనం మధ్య భాగం చాలా ధర పలుకుతుంది. ఘనపుటడుగు దాదాపు రూ.లక్షల్లో ఉంటుంది. చాలా దృఢంగాను, ముదురు ఎరుపు రంగులో ఉండటం వల్ల ఈ కలపను ఖరీదైన నిర్మాణాల్లోను, చైనా ఇతర దేశాలు వారు తినడానికి వాడే పుల్లల తయారీలోనూ, ఎర్రని పౌడర్ తయారీలోను ఎర్రచందనాన్ని వాడుతున్నారు. శ్రీగంధం చెట్టును శాస్త్రీయంగా శాంటాలమ్ పేనిక్యూలాటమ్ అంటారు. ఇవి ఎర్రచందనం లాగా దృఢంగా ఉండవు. గరుకుగా ఉన్న బండపై నీరు పోసి రాస్తే పసుపు రంగులో ఉన్న లేపనం లభిస్తుంది. ఈ చెట్టు నుంచి తీసిన నూనె సుగంధ ద్రవ్యాలు, సబ్బుల తయారీలోనూ వాడుతారు. – ప్రభాకర్‌రెడ్డి, ఫారెస్ట్ రేంజర్ -
‘సంకల్ప’ స్కాం
ఒకటికి పది రెట్లిస్తాం.. డబ్బులే డబ్బులు!! బంగారం.. స్థలాలు.. కట్టిన సొమ్మంతా తిరిగిస్తాం... ఎర్ర చందనం మొక్కలతో చెట్లకు డబ్బులు కాయిస్తాం!! తెలిసిన వారిని చేరిస్తే కమీషన్ కూడా ఇస్తాం.. మీరు మునగండి.. మీ పక్కవారినీ ముంచండి! యాప్‌లో ఒకరి తరువాత ఒకరుగా మోసపోయిన గొలుసు కట్టు గోల్మాల్ బాగోతమిదీ.. – సాక్షి ప్రతినిధి, విజయవాడ యాప్ ద్వారా.. విజయవాడలో సంకల్ప సిద్ధి మార్ట్ పేరుతో ఏర్పాటైన చెయిన్ లింక్, మల్టీలెవల్ మార్కెటింగ్ సంస్థ మోసాలు బహిర్గతమయ్యాయి. సీతారాంపురంలోని దుర్గా అగ్రహారంలో ఏడాది క్రితం ఓ అద్దె ఇంట్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఈ సంస్థ యాప్ ద్వారా రూ.కోట్లలో డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసింది. పది రోజులుగా యాప్ పని చేయకపోవడంతో అనుమానం వచ్చిన బాధితులు మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు వేల సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. ఐదు రకాల స్కీంలతో చెయిన్ చీటింగ్ ► సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులు సభ్యత్వం కోసం రూ.3 వేలు చొప్పున బాధితుల నుంచి వసూలు చేసి నమ్మకం కలిగించేందుకు సరుకులు ఇచ్చారు. రోజుకు రూ.10 చొప్పున 300 రోజుల్లో కట్టిన డబ్బంతా వెనక్కు వస్తుందని నమ్మించారు. ► రూ.లక్ష డిపాజిట్ చేస్తే రోజుకు రూ.వెయ్యి చొప్పున 300 రోజుల్లో రూ.3 లక్షలు ఇస్తామనేది రెండో స్కీం ► రూ.లక్ష నగదు చెల్లిస్తే లక్ష విలువైన బంగారం ఇవ్వడంతో పాటు రోజుకు రూ.100 చొప్పున 300 రోజుల్లో రూ.30 వేలు ఇస్తామని మూడో స్కీం ద్వారా ఆశ చూపారు. ► రూ.2.5 లక్షలు ఇస్తే 25 ఎర్ర చందనం మొక్కలతో కూడిన స్థలం ఇవ్వడంతోపాటు 15 ఏళ్లకు రూ.1.75 కోట్లు వస్తాయంటూ వసూళ్లకు పాల్పడ్డారు. ► రూ.5 లక్షలు చెల్లిస్తే సెంటు భూమి ఇవ్వడంతోపాటు 300 రోజుల్లో తిరిగి రూ.2.5 లక్షలు చెల్లిస్తామని మరో ఎర వేశారు. పోలీసుల అదుపులో నిందితులు దుర్గా అగ్రహారం, బందర్ రోడ్డులోని కార్యాలయం, నిడమానూరులోని సంకల్పసిద్ధి మార్ట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సంస్థకు చెందిన సాఫ్ట్వేర్ డేటాను సీజ్ చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బ్యాంకు లావాదేవీలను స్తంభింపజేసి రూ.2.5 కోట్ల నగదును సీజ్ చేశారు. సంస్థ చైర్మన్ గుత్తా వేణుగోపాల్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. న్యాయం చేస్తాం.. చట్టపరమైన చర్యలు తీసుకొని సంకల్ప సిద్ధి డిపాజిటర్లకు న్యాయం జరిగేలా చూస్తాం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. – టి.కె.రాణా, సీపీ -
ఎర్ర దుంగలపై దొంగలు!
పెనుకొండ మండలం పులేకమ్మ గుడి వెనుక భాగంలోని (చిగ్రాల్) అటవీ ప్రాంతంలో పలు చెట్లను 5 రోజుల క్రితం అక్రమంగా కొందరు వ్యక్తులు రంపంతో కోసేశారు. అనంతరం దుంగలుగా మార్చి కారులో బెంగళూరు తరలించేందుకు సిద్ధమయ్యారు. దుంగలను కారులో తీసుకెళ్లడంపై అనుమానపడిన ఓ గొర్రెల కాపరి సోమందేపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వెంటనే దాడులు నిర్వహించారు. వెలగమాకులపల్లి క్రాస్ వద్ద 44వ జాతీయ రహదారిపై స్వాధీనం చేసుకున్నారు. తీరా దొంగలను ఆరా తీస్తే పట్టుబడింది ఎర్రచందనం దుంగలని తేలింది. 40 దుంగల విలువ సుమారు రూ. 5 లక్షలకుపైగా ఉంటుందని పోలీసులు తేల్చారు. బెంగళూరు తరలించి అక్కడి నుంచి స్మగ్లర్ల ద్వారా విదేశాలకు తరలించేందుకు తీసుకెళ్తునట్లు విచారణలో బయటపడింది. పెనుకొండ: పెనుకొండ రేంజ్ పరిధిలో 26 వేల హెక్టార్లలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. బుక్కపట్నం 33,803, కదిరి 49,391, కళ్యాణదుర్గం రేంజ్ పరిధిలో 24,224 హెక్టార్లలో అటవీప్రాంతం ఉంది. 2000 సంవత్సరం నుంచి 2009 మధ్య కాలంలో పలు విడతలుగా అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో ఎర్రచందనం మొక్కలు నాటారు. అప్పట్లో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కోత దశకు చేరుకున్నాయి. విలువైన సంపదపై స్మగ్లర్ల కన్ను.. భూ మండలంపై అత్యంత అరుదుగా దొరికే సంపదలో ఎర్రచందనం ఒకటి. విదేశీ మార్కెట్లో దీనికి ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఎర్రబంగారంగా ఎర్రచందనాన్ని అభివర్ణిస్తారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా ఎర్రచందనం అంటే శేషాచలం కొండలు గుర్తొస్తాయి. ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు జిల్లాలో విస్తరించిన ఈ అటవీ ప్రాంతంపైనే స్మగ్లర్ల కన్ను ఎక్కువగా ఉంటుంది. కానీ, ఇప్పుడు పెనుకొండ ప్రాంతంలోనూ ఇలాంటి వారి ఆనవాళ్లు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ పోలీసులు, అటవీ అధికారులే గుర్తించని ఎర్రచందనం చెట్లపై వీరి గొడ్డలివేటు పడడం కలకలం సృష్టించింది. ఎర్రదొంగలు ఇచ్చిన సమాచారంతో చెట్లను లెక్కించే పనిలో పడిన అటవీ శాఖ అధికారులు.. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెరిగే ఎర్రచందనం చెట్లు ఈ ప్రాంతంలో ఇంత భారీగా ఎలా పెరిగాయన్న ఆలోచనల్లో మునిగిపోయారు. సిబ్బంది కొరతతో సతమతం.. అంతర్జాతీయ స్థాయిలో భారీ రేటు పలికే ఎర్ర చందనం జాడ ఉనికిలోకి రావడంతో ఇప్పుడు వాటి సంరక్షణ అటవీ అధికారులకు తలకు మించిన భారంగా పరిణమించింది. పెనుకొండ రేంజ్ పరిధిలో అటవీశాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. ఇక్కడ శాశ్వత‡ రేంజర్ లేకపోగా కళ్యాణదుర్గం రేంజర్ రాంసింగ్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక డిప్యూటీ రేంజర్ కానీ, బీట్ ఆఫీసర్ కానీ లేరు. ఇటీవల డీఆర్ఓ రామకృష్ణ, బీట్ ఆఫీసర్ గంగాధర్ అవినీతి ఆరోపణలతో సస్పెండ్ కావడంతో మరింత భారం పడింది. వారి స్థానంలో ఇప్పటికీ ఎవరినీ నియమించలేదు. 10 మంది బీట్ ఆఫీసర్లకు గానూ, 8 మంది ఉన్నారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు 10 మందికి, ఇద్దరు ఉన్నారు. దీంతో ఎర్రచందనం చెట్ల సంరక్షణ ప్రమాదంలో పడింది. ఎంతో విలువైన సంపదగా పేరుగాంచిన ఎర్రచందనాన్ని పోలీసులతో సమన్వయం చేసుకుంటూ అటవీ శాఖ అధికారులు కాపాడాల్సి ఉంది. గస్తీ పెంచుతాం ఎర్రచందనం చెట్ల మనుగడకు ఎలాంటి ఇబ్బంది రానీయం. కొన్ని చెట్లు కోత దశలో ఉన్నట్లు కనిపించినా, పూర్తిగా ఆ స్థితికి చేరుకునేందుకు చాలాకాలం పడుతుంది. తగినంత మంది సిబ్బందిని కేటాయించాలని ఉన్నతాధికారులను కోరాం. గస్తీ పెంచి ఎర్రచందనం చెట్లను సంరక్షిస్తాం. – శామ్యూల్, సబ్ డీఎఫ్ఓ, పెనుకొండ -
‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్
సాక్షి రాయచోటి : అన్నమయ్య జిల్లాలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు జిల్లా పోలీసుశాఖ నిఘాను ముమ్మరం చేసింది. సీసీ కెమెరాల ఏర్పాటు మొదలుకొని అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అడవుల్లో అత్యధికంగా విస్తరించిన ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా స్మగ్లర్లు ఎర్రచందనం కూలీలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని రౌడీషీటర్లు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచడంతోపాటు ఇసుక దొంగలు, మట్కా, గ్యాంబ్లింగ్, దొంగతనాలకు పాల్పడిన పాత నేరస్తులను స్టేషన్‌కు పిలిచి బైండోవర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం అన్ని స్టేషన్లలో నిర్వహించేలా ఎస్పీ హర్షవర్దన్‌రాజు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. వేళ్లూనుకున్న నాటుసారా స్థావరాలను కూకటివేళ్లతో పెకలించేలా పోలీసులను కదిలిస్తున్నారు. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. గ్రామాల్లో గొడవలకు సంబంధించి అనుమానాస్పద వ్యక్తులుగా ముద్రపడిన వారితోపాటు రౌడీషీటర్లు, దొంగతనాలకు పాల్పడే పాత నేరస్తులు, ఇసుక దొంగలు, పేకాట, మట్కా, క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారు. బైండోవర్‌లో భాగంగా రూ. 50 వేల నుంచి రూ. లక్ష, కేసులను బట్టి రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకు బైండోవర్ చేస్తున్నారు. అయితే పాత నేరస్తులకు గతం గతించింది...ఇప్పుడు ప్రశాంతంగా ఉండండి...అలా కాకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే కచ్చితంగా బైండోవర్ ప్రకారం కేసులతోపాటు పూచీకత్తు కింద రాసిన సొమ్మును చెల్లించాల్సి ఉంటుందని కరాఖండిగా వివరిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు నెల రోజుల వ్యవధిలో 850 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేయడం విశేషం. జిల్లాలో నాటుసారా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులతో కలిసి పోలీసులు సంయుక్త దాడులు చేస్తున్నారు. నాటుసారా కాస్తున్న ప్రాంతాలకు వెళ్లి బట్టీలను ధ్వంసం చేయడంతోపాటు నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటివరకు 95 నాటుసారా బట్టీలను ధ్వంసం చేయడమే కాకుండా 35 మందిపై కేసులు నమోదు చేశారు. గ్రామాల్లోకి వెళ్లి నాటుసారా వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ఎవరూ కూడా బట్టీలు ఏర్పాటు చేయకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ‘ఎర్ర’బంగారం వైపు చూస్తే ఖబడ్దార్ జిల్లాలోని రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో విస్తరించిన శేషాచలం, పాలకొండలు ప్రాంతాల్లోని ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారంపై ఎస్పీ ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ రవాణా నిరోధానికి సంబంధిత స్మగ్లర్లతోపాటు కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పాత కేసులు ఉన్న వారిని కూడా డీఎస్పీ స్థాయి అధికారుల ద్వారా హెచ్చరిస్తున్నారు. జిల్లాలోని సుమారు 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలు, సానుభూతి పరులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు అక్రమ వ్యవహారానికి పాల్పడితే పీడీ యాక్టు నమోదు లాంటి కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాల జోలికి వెళ్లొద్దు జిల్లాలో శాంతి భద్రతలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేలా వాతావరణం కల్పిస్తున్నాం. రౌడీ షీటర్లు, సమస్యలు సృష్టించేవారు, ఇసుక అక్రమ రవాణా చేసేవారు, దొంగతనాలకు పాల్పడే వారిపై ఇప్పటికే పెద్ద ఎత్తున బైండోవర్ కేసులు పెట్టాం. అలా కాదని మళ్లీ నేరాలకు పాల్పడితే కేసులతోపాటు కఠిన చర్యలు ఉంటాయి. ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. చెక్‌పోస్టులతోపాటు పోలీసుల వ్యూహాలు అమలు చేస్తున్నాం. ఇప్పటికే 250 మందికి పైగా స్మగ్లర్లు, కూలీలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చాం. ప్రతిరోజు ప్రత్యేకంగా అక్రమ రవాణా అడ్డుకోవడం కోసమే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళవారం రౌడీషీటర్లు, ఇతర నేరస్తులు స్టేషన్‌కు వచ్చి సంతకాలు చేసేలా చర్యలు తీసుకున్నాం. నాటుసారాపై కొరడా ఝళిపిస్తున్నాం. – వి.హర్షవర్దన్‌రాజు, జిల్లా ఎస్పీ -
Seshachalam Hills: మాట వినం..తాట తీస్తాం!
శేషాచల అడవుల్లో ఎర్ర స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి ఇష్టారాజ్యంగా అడవుల్లోకి చొరబడుతున్నారు. ఎర్రచందనం దుంగల నాణ్యత పరిశీలించేందుకు మొదట వాటి బెరడు తీసేస్తున్నారు. ఆపై నాణ్యత లేకుంటే అలాగే వదిలేస్తున్నారు. బెరడ తీసేయడంతో వందలాది వృక్షాలు నిలువునా ఎండిపోతున్నాయి. వీటి సంరక్షణ కోసం అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతుండడం విమర్శలకు తావిస్తోంది. సాక్షి, తిరుపతి జిల్లా: శేషాచలం అడవుల్లో గొడ్డళ్ల చప్పుడు ఆగనంటోంది. తమిళ కూలీలు ఇష్టారాజ్యంగా చొరబడుతూ ఎర్రచందనం చెట్లను నేలకూల్చుతున్నారు. వాటిని గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దు దాటించి జేబులు నింపుకుంటున్నారు. ఇందులో బడా స్మగ్లర్ల హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసుల కళ్లుగప్పుతున్నట్టు తెలుస్తోంది. క్వాలిటీ కోసం చంపేస్తున్నారు గతంలో ఎర్రచందనం వృక్షాలకు చిన్న పాటి రంధ్రం వేసి నాణ్యతను పరీక్షించేవారు. క్వాలిటీ ఉన్న చెట్లును నరికి తరలించేవారు. ఇప్పుడు కొత్త పంథాలో నాణ్యతను పరిశీలిస్తున్నారు. చెట్టును నరకకుండా పైన ఉన్న బెరడును తొలిచి నాణ్యతను చూస్తున్నారు. నాణ్యత లేకుంటే అలానే వదలేస్తున్నారు. బెరడు తీసేయడంతో ఎర్రచందనం చెట్లు నిలువునా ఎండిపోతున్నాయి. శేషాచలం మొత్తంగా కొన్నివందల చెట్లు ఇలా చనిపోయి ఉన్నట్టు తెలుస్తోంది. చదవండి: నెరవేరబోతున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కల.. టన్ను రూ.1.5 కోట్లు ఎర్ర స్మగ్లర్లు నం.1 క్వాలిటీకే మెుదట ప్రాధాన్యత ఇస్తున్నారు. అడవిలో ఎన్ని కిలోమీటర్లు అయినా వెళ్లి నాణ్యమైన దుంగలు ఎంచుకుంటున్నారు. బహిరంగ వేలంలో నం.1(గ్రేడ్–1) ఎర్ర దుంగలు టన్ను రూ.1.5 కోట్లు పలుకుతున్నట్టు సమాచారం. ఆయుధాలతో ఎదురుదాడి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌కు వెళ్లిన వారిపై తిరుగుబాటుకు సైతం కూలీలు లెక్కచేయడంలేదు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో దాడికి దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఎర్రకూలీలను పూర్తిస్థాయిలో ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాపాడుకుంటాం ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తాం. ఇప్పటికే ప్రభుత్వ, డిపార్టుమెంట్ ఆదేశలను పాటిస్తూ నిఘా పెట్టాం. వివిధ శాఖలతోపాటు అటవీసరిహద్దు గ్రామాల ప్రజల సహకారంతో ఎర్రచందనాన్ని కాపాడుకుంటాం. – పట్టాభి, రేంజర్, భాకరాపేట .. -
AP Forest Department: ఆదాయం అదరహో!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటవీ శాఖ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. రెండేళ్లుగా రూ.15–20 కోట్ల మధ్య ఉన్న ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.193.31 కోట్లుగా నమోదైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి అటవీ శాఖ ఆదాయం రూ.200 కోట్లుగా నమోదవుతుందని సామాజిక ఆర్థిక సర్వే 2020–21 అంచనా వేసింది. అంతర్జాతీయ వేలం విధానంలో ఎర్ర చందనం అమ్మకం ద్వారా రూ.175 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చి చేరింది. చదవండి: Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’ ఇదే సమయంలో ఫర్నిచర్ తయారీలో అత్యధిక డిమాండ్ ఉండే టేకు కలప విక్రయం ద్వారా రూ.10.98 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద రూ.6.83 కోట్ల విలువైన టేకు కలపను విక్రయించారు. ఈ రెండింటి తర్వాత వెదురు అమ్మకం ద్వారా డిసెంబర్ నాటికి అటవీ శాఖకు రూ.6.53 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద వెదురు అమ్మకం ద్వారా రూ.850 కోట్లు ఆర్జించింది. ఇవికాకుండా ఇతర కలప, బీడీ ఆకులు, జీడి మామిడి విక్రయాల ద్వారా అటవీ శాఖ ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,603.39 చదరపు కిలోమీటర్లలో అడవి విస్తరించి ఉండగా, ఇందులో 1,994.28 చదరపు కిలోమీటర్లలో దట్టమైన అటవీ ప్రాంతం, 13,861.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాధారణ అడవులు ఉన్నాయి. -
వైరల్: ‘పుష్ప’ స్టైల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్.. చివర్లో షాకిచ్చిన పోలీసులు
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇందులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన తగ్గేదేలే డైలాగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. సినిమా వచ్చినప్పటి నుంచి ప్రతి చోట, అందరి నోటా ఈ డైలాగే వినిపిస్తోంది. తాజాగా అచ్చం పుష్ప సినిమాను ఆదర్శంగా తీసుకొని ఓ వ్యక్తి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే పక్కా ప్లాన్‌తో వెళ్లిన ఆ స్మగ్లర్‌కు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని బెంగుళూరు సమీపంలోని అనేకల్‌కు చెందిన సయ్యద్ యాసిన్ అనే స్మగ్లర్ పోలీసులకు చిక్కకుండా ఎర్ర చందనాన్ని అనుకున్న గమ్యానికి చేరవేయడంలో దిట్ట. అచ్చం పుష్ప సినిమా మాదిరే పోలీసులకు అనుమానం రాకుండా చాకచక్యంగా వ్యవహరిస్తూ ప్రతి చెక్ పోస్ట్ దాటిస్తూ సరుకును రవాణా చేస్తుంటాడు. ఎప్పటిలాగే తన ట్రక్కులో కర్ణాటక-ఆంధ్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు మార్గమధ్యంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేందుకు బయలు దేరాడు. చదవండి: వివాహేతర సంబంధం: 16 ఏళ్ల క్రితం పెళ్లి, భర్త అడ్డొస్తున్నాడనే ప్రియుడితో కలిసి.. లారీ ముందు భాగంలో కోవిడ్ బాధితులకు పండ్లు సరఫరా చేసేవాహనం అని రాయించి.. లారీలో ఎర్ర చందనం దుంగలతో పాటు కొన్ని పండ్లు కూడా లోడ్ చేయించుకుని బయలు దేరాడు. ఆంధ్ర, కర్ణాటక చెక్ పోస్టుల్లో అధికారుల కళ్లు కప్పి జనవరి 31న మహారాష్ట్రకు చేరుకున్నాడు. మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా మీరజ్ నగర్ వద్ద సరిహద్దు దాటుతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు తనిఖీ చేసి అతని నుంచి రూ.2.45 కోట్ల విలువైన చందనంతో పాటు రూ.10 లక్షల విలువైన లారీని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: స్కూల్ భవనం వెనక్కి తీసుకెళ్లి.. విద్యార్థినిపై ఆరుగురు టీనేజర్ల లైంగిక దాడి -
ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులో సీబీఐ కేసు నమోదు
-
బడా స్మగ్లర్ కోసం వేట.. ‘ఆపరేషన్ మాణిక్యం’ ప్రారంభం
తమిళనాడుకు చెందిన ఇతను ఎలా ఉంటాడో తెలియదు.. కనీసం ఇప్పటి వరకు సరైన ఆనవాళ్లు కూడా లేవు. అయితే పోలీసులు వారం కిందట మాణిక్యం ఇద్దరు కొడుకులతో పాటు జిల్లాలో అతని ముఖ్య అనుచరుడు, టీడీపీ నేతల దన్ను దండిగా ఉన్న నాయుడును వల వేసి పట్టుకున్నారు. దీంతో ఇప్పుడు టార్గెట్ మాణిక్యం ఆపరేషన్‌ను పోలీసులు వేగవంతం చేశారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: రెండుమూడేళ్ల కిందట అడపాదడపా ఎర్రచందనం దుంగలను పట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం అలవాటైన పోలీసులు ఇప్పుడు రూటుమార్చారు. దుంగలతోపాటు ఎర్రచందనం దొంగలను కూడా పట్టుకుని స్మగ్లర్ల గుండెల్లో నిద్రపోతున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టి స్మగ్లర్ల వేటలో పడ్డారు. ఈ క్రమంలోనే ఎర్రచందనం ప్రధాన స్మగ్లర్ తమిళనాడుకు చెందిన మాణిక్యం ఇద్దరు కుమారులతో పాటు ఆ ముఠాలో కీలకంగా ఉన్న జిల్లాకు చెందిన దేవానంద నాయుడును అరెస్టు చేశారు. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లికి చెందిన నాయుడు తెలుగుదేశం పార్టీ నేతలకు సన్నిహితుడు. ఓ రకంగా చెప్పాలంటే ఆ పార్టీ కార్యకర్త అన్నది బహిరంగ రహస్యం. దాదాపు పదేళ్ల కిందట ఎర్రచందనం అక్రమ రవాణాలోకి అడుగుపెట్టిన నాయుడు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెలరేగిపోయాడు. అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ నేతల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగి.. స్మగ్లింగ్‌లో ఆరితేరాడు. ప్రధాన స్మగ్లర్ మాణిక్యంకు ముఖ్యమైన అనుచరుడిగా వ్యవహరిస్తున్నాడు. ముఠాలో ఆ నలుగురే కీలకం శేషాచలం అటవీ ప్రాంతంలోని విలువైన ఎర్ర బంగారం కోసం స్మగ్లర్లు కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో తిష్ట వేయడం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన మాణిక్యం అక్కడి నుంచి రూటు మార్చి శేషాచలంలోని ఎర్రచందనంపై కన్నేశాడు. ఇందుకు అవసరమైన బ్యాచ్‌ని సిద్ధం చేసుకున్నాడు. ఆ బ్యాచ్‌లో రాజకీయ పలుకుబడి, ఐదేళ్ల క్రితం అధికారంలో ఉన్న టీడీపీ ముఖ్య నేతలతో సత్సంబంధాలు ఉన్న వారిని ఎంచుకున్నాడు. వీరిలో ప్రముఖమైన వ్యక్తి ఐతేపల్లి వాసి దేవానంద నాయుడు. ఇతనితో పాటు తన ఇద్దరు కుమారులు ఎం.మనోజ్‌కుమార్, ఎం.అశోక్‌కుమార్‌ను ఆ ముఠాలో చేరి్పంచాడు. మొత్తంగా ఈ నలుగురు ముఠా సభ్యులను లీడ్ చేస్తూ విచ్చలవిడిగా స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. శేషాచలంలో నాణ్యమైన ఎర్రచందనం ఎక్కడ దొరుకుతుంది, ఆ ప్రాంతానికి ఎలా వెళ్లాలి.. అనేది నాయుడు స్కెచ్ గీస్తాడు. ఇక మాణిక్యం కొడుకులు ముఠాతో కలిసి ఆ ఎర్రచందనం చెట్లను నరకడం, తర్వాత వాటిని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం వంటి పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత వాటిని తరలించేందుకు పక్కా ప్రణాళికలు రూపొందిస్తారు. చెట్లు నరికేందుకు అడవిలో ఉన్న కూలీలకు నిత్యావసర సరుకుల సరఫరా పని కూడా చేస్తారు. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా ఓ పథకం ప్రకారం ఆ నలుగురూ చేస్తూ వస్తున్నారు. ముగ్గురు చిక్కారు కరోనా లాక్డౌన్ సమయంలో అడవిలోకి చొరబడిన స్మగ్లర్లు భారీగా ఎర్రచందనం చెట్లను నరికి దుంగలను సిద్ధం చేశారు. వాటిని తరలించే వరకు అడవిలోని పలు ప్రాంతాల్లో పూడ్చిపెట్టారు. వారం రోజుల కిందట వాటిని బయటకు తీసి చెన్నైకి తరలిస్తుండగా జిల్లా పోలీసులు కాపుకాచి తమిళనాడులోని వేలూరు సమీపంలో పట్టుకున్నారు. కంటైనర్‌తో పాటు ఐతేపల్లికి చెందిన నాయుడు, మాణిక్యం ఇద్దరు కుమారులు కూడా పోలీసులకు పట్టుబడ్డారు. ఇక కంటైనర్‌లో ఉన్న ఎర్రచందనం దుంగలన్నీ నాణ్యమైనవే అని పోలీసులు తేల్చారు. పోలీసులు స్వా«దీనం చేసు కున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.5 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు పట్టుబడిన వారి నుంచి సమాచారం తీసుకున్న పోలీసులు మాణిక్యం వేటలో ఉన్నట్టు సమాచారం. -
ఎర్ర చందనం స్మగ్లర్ల ఎత్తుగడ.. కార్గో కస్టమ్స్ అధికారుల చిత్తు!
యశవంతపుర: బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో రూ.కోట్ల విలువైన ఎర్ర చందనం దుంగలు పట్టుబడ్డాయి. వివరాలు... ముంబైకి చెందిన ఒక వ్యాపారవేత్త దుబా య్కు అక్రమంగా ఎర్రచందనం తరలించేం దుకు ప్లాన్ వేశాడు. దుంగలను ముక్కలు చేసి చెక్కపెట్టెల్లో ప్యాక్ చేసి బెంగళూరులోని ఒక రవాణా ఏజెన్సీ ద్వారా ఎయిర్‌పోర్టుకు తరలించారు. ఇనుప పైపులు ఎగుమతి చేస్తున్నట్లు ఎయిర్ కార్గో కస్టమ్స్ అధికారులను నమ్మించారు. అయితే ఇనుప పైపులకు పకడ్బందీ ప్యాక్‌పై అనుమానంతో తనిఖీ చేయగా.. ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి. వీటి విలువ దాదాపు రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితుల కోసం గాలిస్తున్నారు. -
318 టన్నుల ఎర్రచందనం.. రూ.182 కోట్ల ఆదాయం
సాక్షి, అమరావతి: అంతర్జాతీయ డిమాండ్ ఉన్న ఎర్రచందనం విక్రయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల రూ.182 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం వచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో అమ్మగా మిగిలిన 318 మెట్రిక్ టన్నుల దుంగలకు ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ధిసంస్థ (ఏపీఎఫ్డీసీ) ద్వారా కొద్దిరోజుల కిందట విడతల వారీగా గ్లోబల్ టెండర్లు పిలిచి వేలం నిర్వహించారు. గతం కంటే డిమాండ్ బాగుండడంతో సుమారు రూ.100 కోట్ల ఆదాయం లభిస్తుందని మొదట అధికారులు భావించారు. చైనా ఇతర దేశాల మార్కెట్లో ఈ దుంగలకు మంచి ధర ఉండడంతో 80 శాతం ఎక్కువ ఆదాయం లభించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం పదేళ్ల కిందట రాష్ట్రానికి ఇచ్చిన ఎర్రచందనం అమ్మకాల కోటా పూర్తయింది. 10 ఏళ్లలో 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకం ఎర్రచందనం అమ్మకానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఆయా రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న సరుకును బట్టి కేంద్రం రాష్ట్రాలకు అమ్మకపు కోటా నిర్దేశిస్తుంది. 10 సంవత్సరాల కిందట రాష్ట్ర కోటా కింద 8,498 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. 2019 వరకు విడతల వారీగా గత ప్రభుత్వాల హయాంలో 8,180 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను విక్రయించారు. ఈ అమ్మకాలతో సుమారు రూ.1,700 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ తర్వాత కేంద్రం నిర్దేశించిన కోటాలో మిగిలిన 318 టన్నుల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల రూ.182 కోట్లకు అమ్మారు. దీంతో కేంద్రం ఇచ్చిన కోటా పూర్తయింది. ప్రస్తుతం అటవీశాఖ ఆధీనంలో ఇంకా 5,376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఉంది. శేషాచలం అడవుల్లో అక్రమంగా నరికి స్మగ్లింగ్ చేస్తున్న ఎర్ర చందనం దుంగల్ని అటవీశాఖ ఇటీవల కాలంలో భారీఎత్తున పట్టుకుని సీజ్ చేసింది. ఈ సరుకును అటవీశాఖ ఆధీనంలోని తిరుపతి సెంట్రల్ గోడౌన్లో భద్రపరిచారు. కేంద్రం కొత్త కోటా నిర్దేశిస్తే ఈ సరుకును కూడా అమ్మడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. ఇప్పటికే తమ వద్ద ఉన్న ఎర్ర చందనం నిల్వల గురించి చెప్పి అమ్మకానికి అనుమతి ఇచ్చే కొత్త కోటా నిర్దేశించాలని కేంద్ర అటవీ మంత్రిత్వశాఖను కోరింది. గతంలో కేటాయించిన కోటాకు సంబంధించిన వివరాలను మిగిలిన రాష్ట్రాలు పూర్తిగా ఇవ్వకపోవడంతో కొత్త కోటాను నిర్దేశించడానికి కేంద్రం జాప్యం చేస్తోంది. ఈ నేపథ్యంలో గత కోటా ప్రకారం పారదర్శకంగా విక్రయాలు జరిపిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాలకు కొత్త కోటా ఇవ్వాలని ఏపీ అటవీశాఖ కోరింది. -
ఎర్రచందనం వేలం విజయవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన ఎర్ర చందనం దుంగల వేలం ప్రక్రియ విజయవంతమైంది. అమ్మకానికి పెట్టిన దుంగల్లో 95 శాతం అమ్ముడుపోయాయి. ఏపీఎఫ్డీసీ (ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్) గ్లోబల్ టెండర్లు పిలిచి ఈ నెల 9న ఆన్లైన్లో వేలం నిర్వహించింది. ఎర్ర చందనానికి ప్రధాన మార్కెట్ అయిన చైనా వ్యాపారులకు తెలిసేలా అంతర్జాతీయ మేగజైన్లలో ప్రకటనలు ఇచ్చింది. దీంతో వారితోపాటు ఇతర దేశాలకు చెందిన పలువురు వ్యాపారులు వేలంలో పాల్గొని అమ్మకానికి పెట్టిన 318 టన్నుల్లో 302 టన్నుల్ని కొనుగోలు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. టన్ను ఎంత ధరకు విక్రయించారనే విషయాన్ని అధికారవర్గాలు ఇంకా బయటపెట్టలేదు. గతం కంటే మంచి ధర వచ్చినట్లు చెబుతున్నారు. ఎంఎస్టీసీ ద్వారా పారదర్శకంగా వేలం ఎర్రచందనం అమ్మకం, ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంది. పదేళ్ల క్రితం 8,498 టన్నుల అమ్మకానికి కేంద్రం అనుమతి ఇవ్వగా అందులో 8,180 టన్నుల దుంగల్ని 13 విడతల్లో విక్రయించారు. ఆ కోటాలో మిగిలిన 318 టన్నుల దుంగల్ని అమ్మేందుకు గడువు ముగియడంతో ఇటీవలే దాన్ని కేంద్రం ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పొడిగించింది. దీంతో ఈలోపే అమ్మకాలు జరిపి ఎగుమతులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ (మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్) ద్వారా పారదర్శకంగా వేలం నిర్వహించారు. మార్కెట్ బాగుండడంతో వేలానికి మంచి స్పందన లభించింది. మిగిలిన 16 టన్నుల అమ్మకానికి 16వ తేదీన రెండో విడత ఆన్లైన్ వేలం నిర్వహించనున్నారు. వేలం వేసిన సరుకు కాకుండా అటవీ శాఖ దగ్గర ఇంకా 5 వేల టన్నుల ఎర్ర చందనం నిల్వలున్నాయి. ఇటీవలి కాలంలో అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లను పట్టుకోవడంతో నిల్వలు పెరిగాయి. వీటిని అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి సాధించే ప్రక్రియను అటవీ శాఖ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ దుంగల్ని అమ్మితే సుమారు రూ.2 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. -
318.447 టన్నుల ఎర్రచందనం వేలానికి గ్లోబల్ టెండర్లు
సాక్షి, అమరావతి: తన వద్ద మిగిలిన 318.447 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచింది. అమ్మకం ప్రక్రియ పారదర్శకంగా, పోటీతత్వంతో జరిగేలా ఇ–టెండర్ కమ్ ఇ–వేలం నిర్వహణకు షెడ్యూల్ రూపొందించింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 9 ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆన్లైన్లో మొదటి విడత వేలం నిర్వహించనున్నారు. ఈ వేలంలో మిగిలిన ఎర్రచందనం నిల్వలకు ఏప్రిల్ 16న రెండో విడత, ఆ తర్వాత కూడా మిగిలితే ఏప్రిల్ 23న మూడో విడత ఇ–వేలం నిర్వహిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులను తెలిసేలా జాతీయ, అంతర్జాతీయ పబ్లికేషన్లు, జర్నల్స్‌లో ఏపీఎఫ్డీసీ (ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎండీ టెండర్ ప్రకటన ఇస్తారు. ప్రధానంగా చైనాలోని కొనుగోలుదారులకు తెలుసుకునేలా టెండర్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఎటువంటి విమర్శలకు అవకాశం లేకుండా, సాధ్యమైనంత ఎక్కువ మంది వేలంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన టెండర్ కమిటీ ఎర్రచందనం అమ్మకం ద్వారా ఎక్కువ లాభం వచ్చేలా చర్యలు తీసుకోనుంది. వేలం ప్రక్రియలో ఎంఎస్టీసీ సేవలను ఏపీఎఫ్డీసీ వినియోగించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. -
ఏడు కొండలని, ఎర్రచందనాన్ని కాపాడాలి
సాక్షి, తిరుమల: బీజేపీ నేషనల్ సెక్రటరీ సునీల్ ధియోదర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడాలని, త్వరగా వ్యాక్సిన్ రావాలని కలియుగ దైవం వేంకటేశ్వరున్ని కోరుకున్నాను. ప్రజలకు సేవలందిస్తున్న ప్రధాని, హోమ్ మంత్రి ఆరోగ్యంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నాను. (ఏపీలో కొత్త చరిత్ర) సహజసిద్ధంగా శేషాచలం అటవీ ప్రాంతంలో మాత్రమే ఎర్రచందనం మొక్కలు పెరుగుతాయి. ఎర్రచందనం స్వామి వారి సంపద, కానీ కొందరు స్మగ్లర్లు శతాబ్ధాలుగా వాటి ద్వారా అక్రమంగా ధనార్జన చేస్తున్నారు. ఎర్రచందనం రక్షణ కోసం సెంట్రల్ ఫోర్స్ ఇవ్వాలని ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలి. ఏడు కొండలని, ఎర్రచందనంను కాపాడాలని పీఎం నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తున్నట్లు' సునీల్ ధియోదర్ తెలిపారు. -
స్మగ్లింగ్‌కు 'రెడ్' సిగ్నల్
సాక్షి, అమరావతి: ఎర్ర చందనాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తే స్మగ్లింగ్ తగ్గుతోంది. ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వని కాలంలో మాత్రం అక్రమ రవాణా భారీగా పెరిగిపోతోంది. ఎర్ర చందనంతో తయారుచేసిన వస్తువుల్ని కలిగి ఉండటాన్ని చైనా, జపాన్ దేశాల్లో సంపన్నులు స్టేటస్ సింబల్‌గా, శుభప్రదంగా భావిస్తుంటారు. అందువల్ల ఎర్ర చందనం దుంగలకు ఆ దేశాల్లో డిమాండ్ ఎక్కువ. మన రాష్ట్రం నుంచి ఆ దేశాలకు అధికారికంగా ఎర్ర చందనం ఎగుమతి చేస్తే స్మగ్లర్లను ఆశ్రయించి కొనుగోలు చేయాల్సిన అవసరం అక్కడి వ్యాపారులకు ఉండదు. దీనివల్ల స్మగ్లింగ్ తగ్గిపోతోంది. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కలపను ఎగుమతి చేయని సమయంలో అక్కడి వ్యాపారులు స్మగ్లర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతంలోని ఎర్రచందనం చెట్లను నరికించి అక్రమ మార్గాల్లో చైనా, జపాన్ దేశాలకు దొడ్డిదారిన ఎగుమతి చేస్తున్నారు. ఆ సంవత్సరాల్లో భారీగా స్మగ్లింగ్.. 2009–10 నుంచి 2013–14 వరకూ ఎర్రచందనం ఎగుమతి చేయలేదు. దీంతో ఆ కాలంలో చైనా, జపాన్ దేశాలకు భారీగా స్మగ్లింగ్ జరిగింది. ఆ సంవత్సరాల్లో అటవీ శాఖ అధికారులు దాడులు చేసి అధిక పరిమాణంలో ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ సంవత్సరాల్లో ఎక్కువ స్మగ్లింగ్ జరిగినందునే దాడుల్లో ఎక్కువ కలప దొరికిందని అటవీ శాఖ అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 2005–06 నుంచి గణాంకాలు పరిశీలిస్తే చట్టబద్ధంగా ఎర్రచందనం ఎగుమతులు చేసిన సంవత్సరాల్లో స్మగ్లింగ్ తక్కువగా ఉంది. వైఎస్ రాజశేఖరరెడ్డి సర్కారు ఎర్రచందనం ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చింది. అప్పట్లో స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకుని అటవీ శాఖ గిడ్డంగుల్లో దాచి ఉంచిన ఎర్ర చందనం దుంగల్ని 2014–15 నుంచి 2018–19 వరకూ ఏటా అటవీ శాఖ టెండర్ల ద్వారా విక్రయించి విదేశాలకు తీసుకెళ్లే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఆ సంవత్సరాల్లో అక్రమ రవాణా తగ్గిపోయింది. ఆయా సంవత్సరాల్లో అటవీ శాఖ దాడుల్లో దొరికిన కలప, నమోదైన కేసులు తక్కువగా ఉండటం స్మగ్లింగ్ తగ్గిందనడానికి నిదర్శనమని అటవీశాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు. దేశంలోనే అరుదైనది దేశంలోనే అరుదైన ఎర్ర చందనం వృక్ష సంపద మన రాష్ట్రంలోని చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 5.83 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. నల్లమల కొండల్లో ఎర్ర చందనం అధికంగా లభ్యమవుతోంది. ఈ వృక్షాల పెరుగుదలకు ఈ ప్రాంతం అనువైనది కావడమే ఇందుకు కారణం. అనుమతి కోసం కేంద్రానికి వినతి చైనా, జపాన్ దేశాలకు ఎర్ర చందనం ఎగుమతి చేసిన కాలంలో స్మగ్లింగ్ తగ్గిపోయింది. స్మగ్లింగ్ కట్టడి కోసం ఏటా వెయ్యి టన్నుల ఎర్ర చందనాన్ని విక్రయించి.. విదేశాలకు ఎగుమతి చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి త్వరలో విజ్ఞప్తి చేయనుంది. – ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
రెచ్చిపోయిన ఎర్రచందనం స్మగర్లు
-
ఎర్రచందనం గ్యాంగ్ అరెస్ట్..
-
ఎర్రచందనం గ్యాంగ్ అరెస్ట్..
సాక్షి, రేణిగుంట: ఎర్రచందనం అక్రమ రవాణ చేస్తున్న ముఠాను ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం అంజనేయపురం చెక్ పోస్టు వద్ద ఫారెస్టు సిబ్బంది తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో అటువైపుగా వచ్చిన తమిళనాడుకి చెందిన TN 21BC 1806 కారును సిబ్బంది చెక్ చేశారు. ఆ కారులో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. కారులో ఉన్న 25 ఎర్ర చందనం దుంగలను ఫారెస్టు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తనీఖీల్లో భాగంగా వారు కారు ఆపకుండా వెళ్లే ప్రయత్నాం చేశారు. సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి యత్నించారు. ఆ సమయంలో స్థానికులు ఫారెస్టు సిబ్బందికి సహాకరించారు. దీంతో సిబ్బంది స్మగ్లర్లను అరెస్టు చేసి విచారణ చేపట్టారు. -
శ్రీవారిమెట్టు వద్ద కలకలం
-
అటవీ అధికారులపై తమిళ కూలీల దాడి
చిత్తూరు: శేషాచల అడవుల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న అటవీశాఖ అధికారులపై తమిళ కూలీలు దాడలు చేశారు. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న ఎర్రకూలీలు తారసపడటంతో వారిని అదుపులోకి తీసుకునే యత్నం చేయగా.. వారుఅధికారులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రెండు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. శ్రీవారి మెట్టు సమీపంలోని గుర్రాల బావి వద్ద బుధవారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈసంఘటన ఎదురైంది. ఈ ఘటనలో తమిళ కూలీని అరెస్ట్ చేయడంతో పాటు వారి వద్ద నుంచి 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో సుమారు 30 మంది తమిళ కూలీలు పాల్గొన్నట్లు సమాచారం. -
బ్యాడ్ పోలీస్!
►ఒత్తిడి వస్తే తప్ప కేసుల్ని పట్టించుకోని వైనం ►పేకాట, ఎర్రచందనం, బెట్టింగ్ దందాల వెనుక ఖాకీల హస్తం ►దిగువ నుంచి డీఎస్పీ వరకు ముడుపులు ►వేలాదిగా పెండింగ్ కేసులు ►23 మందికి ఏకకాలంలో చార్జి మెమోలు నెల్లూరు : ‘ఎర్ర చందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దు రాష్ట్రం నుంచి బియ్యం స్మగ్లింగ్ ఏమాత్రం ఆగటం లేదు. ఇసుక అక్రమాలకు అడ్డే లేదు. పేకాట స్థావరాలు, బెట్టింగ్ రాకెట్, మట్కా కార్యకలాపాలు.. నిషేధిత గుట్కా విక్రయాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఇవి కాకుండా కిడ్నాప్ కేసులు, బంగారం చోరీ వంటి కేసులు వేల సంఖ్యలో పెండింగ్ పడ్డాయి. అరాచకం రాజ్యమేలుతోంది. పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదు. మనం ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా..’ ఇటీవల నిర్వహించిన జిల్లా నేర సమీక్ష సమావేశంలో నూతన ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఆగ్రహంతో అన్న మాటలివి. 10 గంటల పాటు ఏకబిగిన సమావేశం సాగింది. ఆ వెంటనే 23 మంది పోలీసు అధికారులకు చార్జి మెమోలు జారీ చేశారు. ఈ వ్యవహారం జిల్లా పోలీస్ విభాగంలో చర్చనీయాంశంగా మారింది. ఒత్తిళ్లు వస్తే తప్ప.. జిల్లా పోలీస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఎస్సై స్థాయి నుంచి ఏఎస్పీ స్థాయి అధికారి వరకు 23 మందికి ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ఏకకాలంలో చార్జి మెమోలు జారీ చేశారు. ఏదైనా దుమారం చెలరేగడం లేదా పైస్థాయి నుంచి ఒత్తిళ్లు వస్తే తప్ప పోలీసులు స్పందించరనే విమర్శ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్పీ రామకృష్ణ పోలీసుల పనితీరు, వాళ్లు సాగిస్తున్న మామూళ్ల వ్యవహారం తదితర అంశాలపై దృష్టి సారించారు. అసాంఘిక శక్తులపైనా వరుస కేసులు నమోదు చేస్తూ హడలెత్తిస్తున్నారు. ప్రత్యక్షంగా ఎస్పీ రంగంలోకి దిగి కేసులు నమోదు చేయిస్తుండటం కిందిస్థాయి అధికారులకు కొంత ఇబ్బందికరంగా మారింది. వాస్తవానికి పోలీస్ శాఖలో దిగువస్థాయి నుంచి అధికారి వరకు ప్రతినెలా వివిధ రూపాల్లో మామూళ్లు వసూలు చేయడంతోపాటు పైస్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకు వ్యక్తిగత పనులు చేయించటం జిల్లాలో పరిపాటిగా ఉంది. ఇప్పుడు మద్యం మొదలుకొని ఎర్రచందనం, ఇసుక, బెట్టింగ్ వంటి అన్ని వ్యవహారాలపై ఎస్పీ సీరియస్‌గా వ్యవహరిస్తుండటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. మామూళ్ల వ్యవహారాలు ఎక్కడ బయటకు వస్తాయో, ఎవరి పేర్లు ఉంటాయో అన్న ఆందోళనతో ఉన్నారు. తాజాగా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాల్లో కీలక వ్యక్తి కృష్ణసింగ్‌ను నాలుగు రోజుల క్రితం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో అనేక మందికి సన్నిహిత సంబధాలు ఉన్నాయని, అధికారులకు, కొందరు వ్యక్తులకు భారీగా సొమ్ములిచ్చాడనే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కిందిస్థాయి నుంచి డీఎస్పీ స్థాయి వరకు కొందరు అతని నుంచి సొమ్ములు తీసుకున్నారన్న విషయం బయటకొచ్చింది. ఈ నేపథ్యంలో సింగ్ కేసు ముగింపు ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కీలక కేసులూ పెండింగే.. ఇతర కీలక కేసుల విషయంలో నూ పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు ఉన్నాయి. జిల్లాలో 2,600 కేసులు పెండింగ్‌లో ఉండగా.. వీటిలో కొన్ని కీలక కేసుల నూ మరుగున పడేశారు. ముఖ్యం గా నాలుగు కిడ్నాప్ కేసుల మిస్టరీ ఇప్పటికీ తేలలేదు. బంగారం చోరీ కేసులు సైతం పదుల సంఖ్యలో మరుగునపడ్డాయి. వీటి సంగతి తేల్చాలని ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. -
రెడ్ టార్గెట్
►ఎర్ర చందనం స్మగ్లింగ్ నిరోధంపై పోలీసుల దృష్టి ►ఓఎస్డీ నేతృత్వంలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు ►అటవీ ప్రాంతంలో ఇక నిరంతర కూంబింగ్ ►50 మంది సిబ్బందితో ప్రత్యేక బృందం ►తాజాగా రూ.13.40 లక్షల విలువైన 22 దుంగలు పట్టివేత నెల్లూరు : జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా మళ్లీ మొదలైంది. నెల రోజులుగా స్మగ్లర్ల హడావుడి పెరగటంతో పోలీసులు వారి కదలికలపై దృష్టి సారించారు. జిల్లా సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉన్నాయి. వీటిపై కన్నేసిన స్మగ్లర్లు అధికార పార్టీ నేతల సహకారంతో చెలరేగిపోతున్నారు. జిల్లా నూతన ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన పీహెచ్డీ రామకృష్ణ ఎర్ర చందనం అక్రమ రవాణ నిరోధంపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. పోలీస్ ప్రత్యేక విధుల అధికారి (ఓఎస్డీ) టీపీ విఠలేశ్వరరావును ఇన్చార్జిగా నియమించి పూర్తిస్థాయి ప్రణాళికతో స్మగ్లింగ్‌ను కట్టడి చేయాలని నిర్ణయించారు. జిల్లాలోని వెంకటగిరి, డక్కిలి, రాపూరు మండలాల్లోని వెలుగొండ అటవీ ప్రాంతంతోపాటు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని సీతారామపురం, ఉదయగిరి మండలాల్లోనూ ఎర్ర చందనం చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా సరిహద్దున ఉన్న కడప, చిత్తూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఎర్ర చందనం స్మగ్లర్లు తమిళనాడు కూలీల సాయంతో యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. ఏటా 100 టన్నుల పైనే.. ఏటా సగటున జిల్లా నుంచి 100–150 టన్నుల ఎర్ర చందనం స్మగ్లింగ్ అవుతోందని అంచనా. రెండు నెలలుగా జిల్లాలో ఎర్ర చందనం ఆక్రమ రవాణా అధికమైంది. గ్రామాల్లోని టీడీపీ నేతల సహకారంతో ఈ వ్యవçహారం సాగుతోంది. గత నెల 23న వెంకటగిరి మండలం వల్లివేడు సమీపంలో టీడీపీ గ్రామ నేతకు చెందిన నీళ్ల ట్యాంకర్లో అక్రమంగా తరలిస్తున్న 24 ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే రోజు డక్కిలి మండలం చీకిరేణిపల్లి వద్ద వ్యాన్‌లో తరలిపోతున్న మరో 11 దుంగలను పట్టుకున్నారు. వెంకటగిరి మండలం వల్లివేడు సమీపంలో ఎర్రచందనం దుంగలతో పట్టుబడిన నీళ్ల ట్యాంకర్ వెంకటగిరికి చెందిన టీడీపీ కీలక నేతది కావటంతో దీని వెనుక ఆయన ప్రత్యక్ష సహకారం ఉందనే విమర్శలు వెల్లువెత్తాయి. దీనిని వెంకట గిరి సమీపంలో పట్టుకున్నా డక్కిలి పోలీస్ స్టేషన్‌కు తరలించటం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఈ వ్యవహారాన్ని నీరుగార్చటానికి అధికార పార్టీ నేతలు అనేక రకాలుగా ప్రయత్నించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. తాజాగా 22 దుంగల పట్టివేత తాజాగా సోమవారం సాయంత్రం 340 కిలోల బరువైన 22 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేసి ఒక వాహనాన్ని సీజ్ చేశారు. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన జగనాథ్ మోహన్, వెంకటగిరి మొక్కలపాడు గ్రామానికి చెందిన మన్నేటి ఈశ్వరయ్యతో కలిసి కొంతకాలంగా ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తుండగా.. వెంకటగిరి సీఐ మద్ది శ్రీనివాసులు ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది. వెంకటగిరి–నాయుడుపేట రోడ్డులోని మోడల్ స్కూల్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అటవీ ప్రాంతం నుంచి 240 కేజీల బరువైన 13 ఎర్ర చందనం దుంగల్ని తరలిస్తున్న వ్యక్తులు వాహనాన్ని వేగంగా నడు పుతూ పోలీసులపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించి పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో స్మగ్లర్ల బృందంలోని తమిళనాడు ప్రాంతానికి చెందిన అన్నామలై పరమశివంను చెన్నైలో గాంధీనగర్ వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరమశివం నుంచి వంద కేజీల బరువున్న 9 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ బృందంలో మరికొందరు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. -
హెరిటేజ్ వ్యాన్‌లో ఎర్రచందనం దుంగలు
తిరుపతి: ఎర్రచందనం స్మగ్లంగ్ కొంతపుంతలు తొక్కుతోంది. ఏకంగా హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నారు. తిరుపతి టాస్క్ఫోర్క్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. హెరిటేజ్ వాహనాలను ఎర్రచందనం రవాణాకు ఉపయోగిస్తున్నారని చాలా రోజుల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే అనుమానాలు నిజం చేస్తూ హెరిటేజ్ వాహనాన్ని స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించారు. వివరాలు.. తిరుపతి శివారులో గ్రాండ్ వరల్ఢ్ జీవకోన అటవీప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్రి నుంచి కూంబింగ్ నిర్వహించారు. ఈ కూంబింగ్‌లో మంగళవారం తెల్లవారుజామున ఎర్రచందనం స్మగ్లర్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను గమనించిన స్మగ్లర్లు పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దాదాపు వంద మంది ఎర్రచందనం స్మగ్లర్లు వాహనాలు వదిలి పరారయ్యారు. అయితే స్మగ్లర్లు వదిలి వెళ్లిన వాహనాలు హెరిటేజ్ సంస్థకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. కాగా హెరిటేజ్ వాహనంలో దుంగల రవాణాపై పోలీసులు స్పష్టమైన సమాచారం ఇవ్వడం లేదు. పట్టుబడిన వాహనాలు రెండు నంబర్లతో రిజిస్టర్ అయినట్టు తెలుస్తోంది. ఒకటి ఏపీకి సంబందించిన రిజిస్ట్రేషన్ కాగ, మరొకటి తమిళనాడుది గా గుర్తించారు. తమిళనాడుకు చెందిన రిజిస్టర్ నంబర్ కనిపించకుండా స్మగ్లర్లు పెయింటింగ్ వేశారు. అయితే ఈ అంశంపై పోలీసులు పూర్తి సమాచారం సేకరించేందుకు విచారణ చేపట్టారు. -
11 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు క్రైం: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న వారికోసం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి శేషాచలం అడవుల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రగట్టు వద్ద కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసిన కూలీలు ఎర్రచందనం దుంగలను అక్కడే వదిలి పరారయ్యారు. 11 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
'ఎర్ర' ఇన్ఫార్మర్ అంటూ..
చిత్తూరు: ఎర్ర చందనం ఇన్ఫార్మర్ అన్న నెపంతో పి.కాటయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన క్రాంతి, రమేష్ అనే ఇద్దరు దాడికి యత్నించిన సంఘటన చిత్తూరు జిల్లా కేవీబీ పురం మండలం అంజూరులో చోటు చేసుకుంది. బాధితుడు కాటయ్య కథనం మేరకు ఈ నెల మొదటి వారంలో అంజూరు అడవుల్లో ఆరుగురు వ్యక్తులు ఎర్రచందనం చెట్లను నరుకుతున్నారు. దీనిని గుర్తించిన డీఆర్ఓ పట్టాభి చెట్ల నరుకుతున్న వారిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందులో ఐదుగురు పరారీ కాగా యుగంధర్(40) అనే వ్యక్తిని మాత్రం అదుపులోకి తీసుకొన్నారు. పట్టుబడ్డ యుగంధర్‌తో పాటు మిగిలిన ఐదుగురిపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు శిక్ష అనుభవించిన నిందితులు ఈ నెల 21న బెయిలుపై విడుదలై గ్రామానికి వచ్చారు. తమను గ్రామంలో మోహన్, గురవయ్య అనే ఇద్దరు పోలీసులకు పట్టించారని పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. గ్రామ పెద్దలు ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన మోహన్, గురవయ్యలకు చెరో రూ.5 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఇది జరిగి రెండు రోజులు కూడా గడవక ముందే అదే గ్రామానికి చెందిన కాటయ్యపై ఎర్రచందనం కేసులో నిందితులైన రమేష్, క్రాంతిలు దాడికి యత్నించారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చావని అంటూ ఈ విషయాన్ని ఫారెస్టు అధికారులే తమకు చెప్పారని.. చంపేస్తామని బెదిరించారు. చుట్టు పక్క ఉన్న స్థానికులు వీరిని అడ్డుకోవడంతో సమస్య సద్దుమణిగింది. ఈ సంఘటనపై కాటయ్య కేవీబీ పురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తన ప్రాణానికి రక్షణ కల్పించాలని కోరాడు. కాటయ్య ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని స్థానిక ఎస్ఐ పరశురాం తెలిపారు. ఈ సంఘటన అంజూరులో కలకలం రేపింది. తనపై జరిగిన దాడి యత్నాన్ని స్థానిక పోలీసులతో పాటు అటవీశాఖ ఉన్నతాధికారులకు, మంత్రికి కాటయ్య ఫిర్యాదు చేశాడు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
► ఇద్దరు అరెస్టు నందలూరు: ఎర్రచందనాన్ని అక్రమరవాణా చేస్తున్న ఇద్దరు స్మగ్లర్లను నందలూరు పోలీసులు అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు నందలూరు యస్ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం 4–30 గంటల సయమంలో చింతలకుంట అటవీ ప్రాంతంలో తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన సెల్వం, అన్నామలైతోపాటు మరికొంతమంది ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం అందిందన్నారు. పక్కా సమాచారంతో దాడి చేశామని, ఇద్దరు దొరకగా మిగిలిన వారు పరారయ్యారని ఆయన తెలిపారు. నాలుగు ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.2లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసి ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
అమ్మ, నాన్న..ఇద్దరు కొడుకులు.. ఓ ‘ఎర్ర’ గ్యాంగ్
చిత్తూరు: అమ్మా, నాన్న.. వారి ఇద్దరు కుమారులు ముఠాగా ఏర్పడి ఎర్రచందనం తరలిస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారు. చివరికి పోలీసులకు దొరికిపోయారు. ఎస్పీ శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం .. తమిళనాడులోని వేలూరు అళగిరి నగర్‌కు చెందిన నాగేంద్రన్(48), జ్యోతి(43), దంపతులు ఎర్ర చందనం స్మగ్లర్లు. వీరికి విశ్వనాథన్ (24), వీరాస్వామి (22) అనే ఇద్దరు కుమారులున్నారు. వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో విశ్వనాథన్ బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా వీరాస్వామి ఎంఎస్ చదువుతున్నాడు. నాగేంద్రన్, జ్యోతి 2013 నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచలంలో ఎర్రచందనం చెట్లను నరకడానికి తమిళనాడులోని జవ్వాదిమలై నుంచి కూలీలను పిలిపించుకుని, నరికిన దుంగలను బెంగళూరులోని మాలూర్ భాషాకు విక్రయిస్తుంటారు. ఇలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు ఎర్రచందనం దుంగల్ని ఎగుమతి చేస్తుంటారు. వెనుక లారీలో ఎర్రచందనం దుంగలు వస్తుంటే ముందర స్కార్పియో వాహనంలో కుటుంబ సమేతంగా పైలట్‌లా వ్యవహరించి పోలీసుల నిఘాను పసిగడుతూ చాకచక్యంగా తప్పించుకుంటారు. అయితే, ఆదివారం సాయంత్రం ముందస్తు సమాచారం మేరకు బెంగళూరు– తిరుపతి బైపాస్ రోడ్డులోని పి.కొత్తూరు వద్ద లారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అందులో టన్ను బరువున్న 30 ఎర్రచందనం దుంగలను గుర్తించారు. ఈ సందర్భంగా నిందితులను పట్టుకున్నారు. జ్యోతి, నాగేంద్రన్తోపాటు వారి ఇద్దరు కుమారులు, జ్యోతి చెల్లెలి కొడుకు వెట్రివేల్ (22)లతో పాటు డ్రైవర్ కె.కుమార్ (22)ను అరెస్టు చేశారు. నాగేంద్రన్ దంపతులపై జిల్లాలో నాలుగు కేసులు ఉన్నాయి. వీరు వంద టన్నుల వరకు ఎర్రచందనం దుంగల్ని అక్రమంగా తరలించి రూ.20 కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. వేలూరులో ఎర్రచందనం కేసులో అక్కడి పోలీసులు ఓ డీఎస్పీను సైతం అరెస్టు చేసినట్లు సమాచారం. -
రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం..
చిత్తూరు క్రైం: కర్ణాటక రాష్ట్రంలోని మాలేరులో రూ.30 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను చిత్తూరు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. తమిళనాడులోని వేలూరుకు చెందిన జ్యోతి(43), ఆమె భర్త నాగేంద్ర, వేలూరులో బీటెక్ చదువుతున్న ఆమె ఇద్దరు పిల్లలు, మరో ఇద్దరిని పోలీసులు సోమవారం ఉదయం వేలూరులో అరెస్టు చేశారు. వీరంతా ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆరితేరారు. వీరిని చిత్తూరు తరలించిన పోలీసులు ఎస్పీ సమక్షంలో విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
యర్రావారిపాలెం(చిత్తూరు): చిత్తూరు జిల్లా యర్రావారిపాలెం మండలం తలకోన అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న నలుగురు తమిళ కూలీలను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తలకోన అటవీ ప్రాంతంలో తమిళ కూలీలు ఎర్రచందనం తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసుల కూంబింగ్ నిర్వహించారు. ఎర్రచందనం తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న మరో 11 మంది కూలీల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా భారీగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
ఇద్దరు తమిళ కూలీలు అరెస్ట్
తిరుపతి: చిత్తూరు జిల్లా శేషాచలకొండల్లో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. జీవకోన, ఎర్రగుంట అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. కారులో తరలించడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర దుంగలను పోలీసులు గుర్తించారు. కారుతో పాటు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
‘ఎర్ర’ స్మగ్లర్ అరెస్ట్
వైఎస్సార్ కడప: జిల్లాలోని గోపవరం మండల పరిధిలోని లక్కవారిపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచిన ఆరు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ వెనుక ఉన్న చవ్వ రమణారెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఔటర్ రింగ్ రోడ్డులో ఎర్రచందనం స్వాధీనం
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఆటోలో తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులు ఆటోను వదిలి పారిపోయారు. ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. -
టాస్క్ ఫోర్స్ పై ఎర్రకూలీల రాళ్లదాడి
తిరుపతి: చిత్తూరు జిల్లా భాకరాపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం కూలీలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భాకరాపేట సమీపంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న ఎర్ర కూలీలు పోలీసులకు తారసపడ్డారు. అప్రమత్తమైన టాస్క్ ఫోర్స్ పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. పోలీసులపై రాళ్లతో దాడిచేసి ఎర్రచందనం కూలీలు అక్కడినుంచి పరారయ్యారు. రూ.20 లక్షలు విలువ చేసే ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులపై 'ఎర్ర' కూలీల దాడి : ఇద్దరి అరెస్ట్
-
టాస్క్ ఫోర్స్ దాడులు.. స్మగ్లర్ అరెస్ట్
తిరుపతి: జూపార్క్ సమీపంలో టాస్క్ ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. స్థానిక జూపార్క్ ప్రాంతంలో ఆకస్మిక దాడులు చేపట్టి.. ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ఓ స్మగ్లర్ ను అరెస్ట్ చేసి వారి ముఠావద్ద నుంచి రూ.20 లక్షల విలువైన ఎర్రచంద్రనం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తమిళ కూలీల ఖాతాల్లో ఎర్రస్మగ్లర్ల నల్లధనం
టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు వెంకటగిరి: రాష్ట్రంలోని ఎరచ్రందనం స్మగ్లర్ల నల్లధనం తమళనాడులోని జవాదమలై గ్రామానికి చెందిన ఎరచ్రందనం కూలీల ఖాతాల్లో జమ అయినట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని ఎరచ్రందనం అక్రమరవాణా నివారణ విభాగం ఏపీ ఇన్చార్జ్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు చెప్పారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువాదిమలై గ్రామంలో ఉన్న బ్యాంకులో ఎన్నడూ లేనివిధంగా కూలీలుగా జీవనం సాగిస్తున్న వారి ఖాతాల్లో సుమారు రూ.కోటి వరకు జమ అయినట్లు తెలిపారు. -
ఎర్రచందనం దుంగల పట్టివేత
తిరుపతి: పట్టణ శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసులు రూ.20లక్షలు విలువజేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రచందనం అక్రమరవాణా జరుగుతోందనే సమాచారంతో పట్టణ శివారులో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ చేపట్టారు. జూ పార్క్ సమీపంలో కూడా తనిఖీలు చేపట్టడంతో ఇది గమనించిన ఎర్రచందనం కూలీలు దుంగలను వదిలేసి పారిపోయారు. దీంతో కూలీలు వదిలేసి పారిపోయిన దుంగలను, బొలేరో వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. -
సూళ్లురుపేటలో భారీగా ఎర్రచందనం పట్టివేత
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లురుపేటలో పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా అక్రమంగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని తీసుకు వెళ్తున్న మినీ వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. అయితే వ్యాన్ డ్రైవర్‌తోపాటు నిందితులు పరారైయ్యారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
ఇద్దరు కూలీలు అరెస్ట్: ఎర్రచందనం స్వాధీనం
కడప : రైల్వేకోడూరు మండలం పుల్లగూరపెంట అటవీ ప్రాంతంలో బుధవారం పోలీసులు, టాస్క్‌పోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన... ఎర్రచందనం తమిళ కూలీలు.. వారిపై గొడ్డళ్లతో దాడికి యత్నించారు. ఆ క్రమంలో పోలీసులు వెంటనే స్పందించి... తమిళ కూలీల దాడిని అడ్డుకుని.. ఇద్దరు కూలీలను అరెస్ట్ చేశారు. మరో 21 మంది కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ సందర్భంగా 20 లక్షల విలువు చేసే ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అరెస్ట్ చేసిన ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టాస్క్‌ఫోర్స్ దాడులు: తమిళ కూలీలు అరెస్ట్
చిత్తూరు: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ముంగిలిపట్టు రైల్వేస్టేషన్ సమీపంలో టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 27 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ఇద్దరు తమిళ కూలీలను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్ల దాడి
తిరుపతి: టాస్క్‌ఫోర్స్ పోలీసులపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడి చేశారు. సోమవారం కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు స్మగ్లర్లు కంటపడ్డారు. లొంగిపొమ్మని హెచ్చరికలు చేసినా పట్టించుకోకుండా వారు.. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీసుకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో పోలీసులు ఓ రౌండ్ గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ సంఘటన ముంగిలిపట్టు పరిధిలోని అక్కన్న దొన ఏరియాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ కొనసాగుతోంది. -
చిత్తూరు బైపాస్‌లో భారీగా ఎర్రచందనం పట్టివేత
చిత్తూరు : చిత్తూరు బైపాస్ రోడ్డులో శుక్రవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా దుంగలను తరలిస్తున్న మినీ లారీని వదిలి నిందితులు పరారైయ్యారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ రూ. 45 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టాస్క్ పోర్స్ కూంబింగ్.. ముగ్గురి అరెస్ట్
తిరుపతి: బాక్రాపేట అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ కూంబింగ్ నిర్వహిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ సమాచారం అందుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు ఆదివారం రంగంలోకి దిగారు. ముగ్గురు ఎర్రచందనం కూలీలను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం కూలీల వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
పోలీసుల కూంబింగ్ : ఎర్రచందనం కూలీలు పరారీ
తిరుపతి: చిత్తూరు జిల్లా తిరుపతి నగర శివారులోని మంగళం అటవీ ప్రాంతంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం కూంబింగ్ నిర్వహించారు. ఆ విషయాన్ని గమనించిన ఎర్రచందనం కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. అక్కడ ఉన్న వాహనం నుంచి 14 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వాహనాన్ని సీజ్ చేశారు. పరారీలో ఉన్న ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు చేపట్టారు. -
ఎర్రచందనం కోసం కార్పొరేషన్!
* మార్కెటింగ్‌కు చైనాలో డిపో * ఎర్రచందనం, మొక్కల పెంపకంపై సమీక్షలో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేని ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌కు సొంతమని, దీనిద్వారా మరింత ఆదాయం పెంచుకునేందుకు కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఎర్రచందనం, మొక్కలు పెంపకంపై గురువారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఎర్రచందనం మొక్కల పెంపకం, స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను భద్రపరచడం, వేలం వంటి వ్యవహారాలను కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామని చెప్పారు. ఎర్రచందనాన్ని స్మగర్ల బారి నుంచి రక్షించేందుకు జియోట్యాగింగ్, డ్రోన్లను విస్తృతంగా వినియోగించుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,095 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలు ఉన్నట్టు అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఎర్రచందనం వేలంలో ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వచ్చేలా విదేశాల్లో మార్కెట్ సృష్టించాలని, చైనాలో డిపో ఏర్పాటు చేయడంతోపాటు చైనీస్ కరెన్సీలో కూడా వేలం వేసే యోచన చేయాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 23.04శాతమే ఉందని, నాలుగేళ్లలో 12లక్షల హెక్టార్లలో మొక్కలు పెంచాలని చెప్పారు. పనులు పూర్తి కాకపోతే కఠిన చర్యలు పుష్కర పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సకాలంలో పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. గురువారం ఉదయం ఆయన ఇంద్రకీలాద్రి, పుష్కరఘాట్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఇకమీదట ప్రతి వారమూ పనుల్ని పరిశీలిస్తానని చెప్పారు. పలు రంగాల్లో ఆస్ట్రియా సహకారం వ్యవసాయం, జలశుద్ధి రంగాల్లో తాము అభివృద్ధి చేసిన నూతన సాంకేతిక ఆవిష్కరణలను రాష్ర్టంలో ప్రవేశపెట్టేందుకు ఆస్ట్రియా దేశం ముందుకొచ్చింది. ఈ విషయమై ఆస్ట్రియా ఉప రాయబారి జార్జ్ జెట్నర్ నేతృత్వంలోని బృందం గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యింది. వివిధ అంశాల్లో కలిసి పనిచేయడానికి 2003లో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలిదేశం తమదేనని, మళ్లీ అదే సీఎం సారథ్యంలో ముందుకెళ్లే అవగాహనకు వచ్చామని తెలిపారు. అమరావతిలో బ్రిటన్ ఆస్పత్రికి అనుమతి అమరావతిలో బ్రిటన్ సహకారంతో ఏర్పాటుచేయనున్న హాస్పిటల్ ప్రాజెక్టుకు త్వరలో అనుమతులిస్తామని సీఎం తెలిపారు. భారత్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అస్క్విత్ బృందం గురువారం సీఎంతో సమావేశమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలోని 10 ఉత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దుతామని చెప్పారు. అమరావతిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై బ్రిటన్ హైకమిషనర్‌కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. -
ఎర్రచందనం కూలీలు అరెస్ట్ : వాహనాలు సీజ్
నెల్లూరు : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో ఇద్దరు ఎర్రచందనం కూలీలను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 26 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు వాహనాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని.. సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం కూలీలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
19 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
బద్వేల్ (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 19 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్‌జిల్లా బద్వేల్ మండలం పెద్దచెరువు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. అదుపులోకి తీసుకున్నవారిలో నలుగురు నెల్లూరుకు చెందిన వారు కాగా.. మరో ఇద్దరు కడప జిల్లా వాసులని పోలీసులు తెలిపారు. -
24 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి : తిరుమలలోని అన్నదమ్ముల బండ సమీపంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీ డ్యామ్ సమీపంలో 24 ఎర్రచందనం దుంగలను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం కూడా టాస్క్‌ఫోర్స్ పోలీసులు సదరు ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా దాదాపు 40 మంది ఎర్రచందనం కూలీలు పోలీసులకు ఎదురుపడ్డారు.దీంతో కూలీలు అక్కడి నుంచి పరారైయ్యారు. పోలీసులు వారి కోసం రెండో రోజు ఆదివారం కూడా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. -
శ్రీకాళహస్తిలో ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి నలుగురు ఎర్రచందనం కూలీలను పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారు ప్రయాణిస్తున్న కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. 20 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్మగ్లర్ల అడ్డాలో.. ధీర వనిత..
చిత్తూరు/కడప: చుట్టూ దట్టమైన శేషాచలం అడవులు నిత్యం క్రూరమృగాలు, ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి పెనుసవాళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఓ మహిళా ఫారెస్ట్ అధికారణి సమర్ధంగా నిర్వహిస్తోంది. కడప, చిత్తూరు జిల్లాల్లో 20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మొగిలిపెంట బీట్‌ను చేరుకోవడం అంత సులువు కాదు. ప్రస్తుతం ఎర్రచందనం స్మగ్లర్లకు ఆవాసంగా ఉన్న ఈ ఏరియా.. ఎగుడుదిగుడుగా ఉండే శేషాచలం కొండల మధ్య కడప జిల్లాలో ఉంది. రాగాల సుబ్బలక్ష్మీ(25)ను రైల్వే కోడూరు డివిజన్లో బాలుపల్లె పరిధిలోని మొగిలిపెంట బీట్‌కు అధికారిణిగా నియమించారు. కష్టసాధ్యం ఆమె ప్రయాణం.. బాలుపల్లె నుంచి 60 కిలోమీటర్ల పాటు రోడ్డు ప్రయాణం తర్వాత తిరుమల కొండలను చేరుకుని అక్కడి నుంచి దుర్భేధ్యమైన అడవిలో కడపకు చేరుకోవడానికి 35 కిలోమీటర్ల మార్గంలో శిఖరాలు, వాలు ప్రదేశాలు, లోయల మీదుగా ట్రెక్కింగ్ చేస్తూ రెండు రోజుల పాటు ప్రయాణిస్తోంది సుబ్బలక్ష్మీ. తనతో పాటు ఉండాల్సిన మహిళా అసిస్టెంట్ పోస్టురెండు సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంటున్నా.. కీకారణ్యంలో ఒంటరిగా.. ఎటువంటి ఆయుధాలు లేకుండా ధైర్యసాహసాలతో నిత్యం ప్రమాదాల(ఎర్రచందనం స్మగ్లర్లు, క్రూర జంతువులు) అంచున విధులు నిర్వహిస్తోంది. మానవసాధ్యం కాదు.. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా ఆమె నిర్వహిస్తున్న విధులు మానవసాధ్యం కానివి. అధికారులు ఆమె రోజూ విధులకు హాజరుకాలేకపోయినా ఒత్తిడి తీసుకురావడం లేదు అని తిరుపతి డివిజినల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ టీవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రిటిష్ కాలంలో బాలుపల్లె, మొగిలిపెంటల మధ్య మోటరు వాహానాలకు ట్రాక్ ఉండేదని చెప్పారు. -
పోలీస్‌లు కూంబింగ్ : ఎర్రచందనం దుంగల స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా నారావారిపల్లె సమీపంలో ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు కూలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.వారి వద్ద నుంచి రూ. 20 విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు ఘటనా స్థలానికి చేరుకుని... పరిశీలించారు. నారావారిపల్లె సమీపంలో తరచుగా ఎర్రచందనం దుంగలు పట్టుబడటంపై డీఐఈ కాంతారావు విచారణ జరుపుతున్నారు. -
నలుగురు ‘ఎర్ర’ స్మగ్లర్లపై పీడీయాక్ట్
ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్‌లో ఉన్న నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లపై బుధవారం పోలీసులు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు నమోదుచేశారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు తమిళనాడుకు చెందిన ఆర్ముగకుమార్ (48), చిత్తూరుకు చెందిన ఏ.కమల్‌కిషోర్ (32), కర్ణాటకకు చెందిన మీర్జాబేగ్ (39), సప్జర్ షరీఫ్ (29) అనే స్మగ్లర్లపై పీడీ నమోదు చేసినట్లు చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. వీరిలో ఆర్ముగకుమార్, కమల్‌కిషోర్, మీర్జాబేగ్ అంతర్జాతీయ స్మగ్లర్లు. నిందితులు నలుగురు ఇప్పటివరకు విదేశాలకు 430 టన్నుల ఎర్రచందనం దుంగలను జిల్లా నుంచి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇప్పటికే జుడీషియల్ కస్టడీలో ఉన్న నలుగురిని కడప కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. -
రూ. 40 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం వేణుగోపాలపురం వద్ద అటవీశాఖ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రచందనం తరలిస్తున్న ట్రాక్టర్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఎర్రచందనం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ట్రాక్టర్ డ్రైవర్ మాత్రం పరారీలో ఉన్నాడు. మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. -
పోలీసులపై రాళ్లు రువ్విన ఎర్రచందనం కూలీలు
తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో బాలుపల్లి రేంజ్ కందిమడుగు వద్ద టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఎర్రచందనం కూలీలు తారసపడ్డారు. అయితే పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు ఎర్రచందనం కూలీలను రక్షించేందుకు ప్రయత్నించారు. అందులోభాగంగా పోలీసులపైకి ఎర్రచందనం కూలీలు రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై.... గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో కూలీలు పరారైయ్యారు. పోలీసులు వారి కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో కూంబింగ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
తిరుమల అడవుల్లో కూంబింగ్ : కూలీలు అరెస్ట్
తిరుమల : తిరుమల అడవుల్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున కూంబింగ్ నిర్వహించారు. అందులోభాగంగా వేద పాఠశాల సమీపంలోని అన్నదమ్ములబండ వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని టాస్క్‌ఫోర్స్ పోలీస్ స్టేషన్‌కి తరలించారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ ఎం. కాంతారావు నేతృత్వంలో కూంబింగ్ కొనసాగుతుంది. -
అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
వైఎస్సార్ జిల్లా: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబులవారిపల్లె మండలం గాజల అటవీప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి ఓ కారు, రెండు స్కూటర్లు, రూ.10 లక్షల విలువైన 16 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తమిళనాడు, కర్ణాటకకు చెందిన వారితో పాటు ఇద్దరు స్థానికులు ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు రాజంపేట డీఎస్పీ తెలిపారు. -
ఎర్రచందనం అక్రమ రవాణా: ఐదుగురి అరెస్ట్
చంద్రగిరి (చిత్తూరు జిల్లా) : ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ఐదుగురిని చంద్రగిరి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఒక వాహనంతోపాటు 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తిరుపతి వెస్ట్ డీఎస్పీ వెంకటనారాయణ చెప్పారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందన్నారు. నిందితులను తిరుపతి కోర్టుకు తరలించారు. వీరిపై గతంలోనూ ఎర్రచందనం అక్రమరవాణా కేసులున్నాయని తెలిపారు. -
పోలీసుల అదుపులో మంత్రి బొజ్జల అనుచరుడు
చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాబట్లపల్లె సమీపంలో భారీగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడి హస్తం ఉందని డ్రైవర్... పోలీసులకు తెలిపాడు. దీంతో బొజ్జల అనుచరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ రూ. కోటి ఉంటుందని పోలీసులు చెప్పారు. -
తమిళ కూలీలు పరారీ: ఎర్రచందనం స్వాధీనం
కడప : వైఎస్ఆర్ జిల్లా రాయచోటి మండలం అనుంపల్లి అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలోని తమిళకూలీలు... అటవీశాఖ అధికారులపై రాళ్ల దాడి చేశారు. దీంతో సదరు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. దీంతో తమిళ కూలీలు పరారైయ్యారు. అనంతరం అటవీ ప్రాంతంలో పోలీసులు, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. తమిళ కూలీల కోసం వారు తనిఖీలు చేస్తున్నారు. -
31మంది తమిళ కూలీలు అరెస్ట్
రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా) : అక్రమంగా ఎర్ర చందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న 31 మంది తమిళ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన వైఎస్సార్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం కుప్పలదొడ్డి సమీపంలో శనివారం చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి సీఐ రసూల్ సాబ్ బృందం అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా.. రైల్వే ట్రాక్ సమీపంలో ఎర్రచందనం దుంగలను తరలించడానికి ప్రయత్నిస్తున్న కూలీలు తారసపడ్డారు. దీంతో పోలీసులు 31 మంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 34 ఎర్ర చందనం దుంగలతో పాటు, ఓ కారు, ఓ లారీ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సీఐ శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
రూ. 3 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత
కడప : వైఎస్ఆర్ కడప జిల్లా బాలుపల్లి చెక్‌పోస్ట్ వద్ద అటవీశాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని అటవీశాఖ అధికారులు విచారిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 3 కోట్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. -
శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్
తిరుపతి : ఎర్రచందనం తరలింపును నిరోధించడానికి పోలీసులు రంగంలోకి దిగారు. చిత్తూరు జిల్లా తిరుపతి శేషాచలం అడవుల్లో ఆదివారం తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడుకు చెందిన పలువురు కూలీలను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 40 ఎర్ర చందనం దుంగలతోపాటు, ఓ లారీ, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే అటవీ సంపదను కొల్లగొట్టిన స్మగ్లర్ల ఆటకట్టించడానికే ఈ కూంబింగ్ నిర్వహిస్తున్నామని ఎస్పీ గోపినాథ్ తెలిపారు. -
నెల్లూరు జిల్లాలో ఎర్ర్రచందనం డంప్ పట్టివేత
-
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చంద్రగిరి మండలం మూలపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వ్యాన్‌లో 36 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూంబింగ్ : ఎర్రచందనం దుంగలు స్వాధీనం
తిరుపతి: చిత్తూరు జిల్లా బాకారాపేట శ్యామల రేంజ్ అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్‌కి టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వం వహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. -
'ఎర్రచందనం అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోంది'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణ ఇంకా కొనసాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి శుక్రవారం తిరుమలలో ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నడకదారిన వచ్చే భక్తులకు 8 గంటలు, సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి, తిరుమల, రేణుగుంట ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. -
కారుతో సహా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు : చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లి వద్ద కారులో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారుతోపాటు 11 ఎర్రచందనం దుంగలను పోలీస్ స్టేషన్‌కి తరలించి పోలీసులు సీజ్ చేశారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. -
నలుగురు 'ఎర్ర' స్మగ్లర్ల అరెస్ట్
చిత్తూరు అర్బన్ : చిత్తూరు పోలీసులు సోమవారం నలుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకొన్నారు. చిత్తూరు పోలీసులు సోమవారం మధ్యాహ్నం మురకంబట్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఓ కారును తనిఖీ చేయగా ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకుని కారులో ఉన్న పూతలపట్టు మండలం నచ్చుపల్లెకు చెందిన రోహిణీకుమార్(36), గంగాధరనెల్లూరుకు చెందిన ఎస్.సుధాకర్(36), చిత్తూరు లాలూగార్డెన్‌కు చెందిన షేక్ అబ్దుల్ రఫీ(41), తమిళనాడు గుడియాత్తంకు చెందిన జి.మునిరత్నం(34)ను అరెస్టు చేశారు. వారిని నుంచి కారు, ఒక రివాల్వర్, నాలుగు రౌండ్ల బుల్లెట్లు, రూ.25 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు, రూ.9 వేలు స్వాధీనం చేసుకున్నారు. -
ఏడుగురు అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్లు అరెస్ట్
కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఏడుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప- కర్నూలు హైవేపై దౌలతాపురం గ్రామం వద్ద వారు పట్టుబడ్డారని ఓఎస్డీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఫోర్డ్ కారులో వెళ్తున్న వారిని కాపు కాసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 768 కిలోల బరువైన 30 దుంగలతోపాటు ఒక ల్యాప్‌టాప్,11సెల్ఫోన్లు, విదేశీ, స్వదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఏడుగురిలో ఇద్దరు చైనీయులు కాగా, ముగ్గురు న్యూఢిల్లీ, ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బలగాలు, జిల్లా పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.