ఏడుగురు అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్లు అరెస్ట్ | Cops arrest international Red sandalwood smugglers | Sakshi
Sakshi News home page

ఏడుగురు అంతర్జాతీయ 'ఎర్ర' స్మగ్లర్లు అరెస్ట్

Published Tue, Dec 1 2015 5:51 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

Cops arrest international Red sandalwood smugglers

కడప అర్బన్ (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఏడుగురు అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్లు పట్టుబడ్డారు. వైఎస్సార్ జిల్లా కడప- కర్నూలు హైవేపై దౌలతాపురం గ్రామం వద్ద వారు పట్టుబడ్డారని ఓఎస్డీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఫోర్డ్ కారులో వెళ్తున్న వారిని కాపు కాసి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

వారి నుంచి రూ.15 లక్షల విలువైన 768 కిలోల బరువైన 30 దుంగలతోపాటు ఒక ల్యాప్‌టాప్,11సెల్‌ఫోన్లు, విదేశీ, స్వదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఏడుగురిలో ఇద్దరు చైనీయులు కాగా, ముగ్గురు న్యూఢిల్లీ, ఇద్దరు మధ్యప్రదేశ్‌కు చెందినవారు. టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్ బలగాలు, జిల్లా పోలీసులు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement