'ఎర్రచందనం అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోంది'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణ ఇంకా కొనసాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి శుక్రవారం తిరుమలలో ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది.
31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నడకదారిన వచ్చే భక్తులకు 8 గంటలు, సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి, తిరుమల, రేణుగుంట ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.