T BJP Leader
-
'కేసీఆర్.. ఖాసీం రజ్వీ వారసుడు'
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ ఖాసీం రజ్వీ వారసుడుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శనివారం నగరంలోని అసెంబ్లీకి ఎదురుగా ఉన్న సర్దార్ వల్లబాయి పటేల్ విగ్రహానికి నాగం జనార్దన్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ... ఖాసీం రజ్వీ వారసులకు భయపడి విమోచన దినం అధికారంగా నిర్వహించడం లేదని కేసీఆర్‌పై మండిపడ్డారు. హైదరాబాద్ సంస్థానాన్ని దక్కన్ పాకిస్థాన్‌గా మార్చాలనుకున్న నిజాం ఆలోచనలను నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయి పటేల్ పోలీస్ చర్యల ద్వారా అడ్డుకున్నారని ఈ సందర్బంగా నాగం జనార్దన్‌రెడ్డి గుర్తు చేశారు. -
మల్లన్నసాగర్ పక్కదారి పట్టించేందుకే...
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్‌రావు బుధవారం హైదరాబాద్‌లో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మనస్తాపం చెందని కేసీఆర్... హైకోర్టు విభజన విషయంలో మనస్తాపం చెందరా? అని సందేహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ప్రజల్లో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. జీవో 123 మంచిదా ? లేక 2013 భూసేకరణ చట్టం మంచిదా ? అనే విషయంపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావుకు రఘునందనరావు సవాల్ విసిరారు. మల్లన్నసాగర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైకోర్టు విభజనను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు చర్చించుకుంటే హైకోర్టు సమస్యకు పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో దీక్ష ఎప్పుడు చేస్తారలో కేసీఆర్ చెప్పాలని రఘునందనరావు డిమాండ్ చేశారు. -
'ఎర్రచందనం అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోంది'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణ ఇంకా కొనసాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి శుక్రవారం తిరుమలలో ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నడకదారిన వచ్చే భక్తులకు 8 గంటలు, సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి, తిరుమల, రేణుగుంట ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. -
చాలారోజులకు పార్టీ కార్యాలయానికి నాగం
హైదరాబాద్ : బీజేపీ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి విచ్చేశారు. పార్టీ కార్యాలయంలోని నేతలు, కార్యకర్తలతో నాగం భేటీ అయ్యారు. గతేడాది శాసనసభ ఎన్నికల ముందు నాగం టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసీ ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావడం కూడా పూర్తిగా మానివేశారు. ఓ వేళ ప్రెస్ మీట్లు పెట్టాలంటే పార్టీ కార్యాలయంలో కాకుండా ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు నాగంకు మధ్య పొసగడం లేదని ప్రచారం సాగుతోంది. టీడీపీలో ఉన్నప్పుడు పలు కీలక మంత్రి పదవులు చేపట్టి ఓ వెలుగు వెలిగిన నాగం ఆ తర్వాత కమలతీర్థం పుచ్చుకుని సైలంట్ అయిపోయారని తెలంగాణలో ప్రచారం సాగుతోంది.