హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్రావు బుధవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మనస్తాపం చెందని కేసీఆర్... హైకోర్టు విభజన విషయంలో మనస్తాపం చెందరా? అని సందేహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను ప్రజల్లో చర్చకు పెట్టాలని డిమాండ్ చేశారు. జీవో 123 మంచిదా ? లేక 2013 భూసేకరణ చట్టం మంచిదా ? అనే విషయంపై చర్చకు సిద్ధమా అని హరీష్ రావుకు రఘునందనరావు సవాల్ విసిరారు.
మల్లన్నసాగర్ అంశాన్ని పక్కదారి పట్టించేందుకే హైకోర్టు విభజనను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలు చర్చించుకుంటే హైకోర్టు సమస్యకు పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో దీక్ష ఎప్పుడు చేస్తారలో కేసీఆర్ చెప్పాలని రఘునందనరావు డిమాండ్ చేశారు.