శ్రీకాళహస్తి రూరల్ (రేణిగుంట): అక్రమంగా తరలిస్తున్న 446 కిలోల ఎర్రచందనాన్ని ఆదివారం తెల్లవారుజామున తిరుపతి జిల్లాలో అటవీ శాఖ సిబ్బంది స్వాదీనం చేసుకున్నారు. వివరాలు.. ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారంటూ తమకు అందిన విశ్వసనీయ సమాచారంతో తిరుపతి అటవీ క్షేత్ర అధికారి, సిబ్బంది ఆదివారం తెల్లవారుజామున రేణిగుంట మండలం మాముండూరు సౌత్ బీటు వద్ద తనిఖీలు చేపట్టారు.
ఇదే సమయంలో టయోటా క్వాలిస్ వాహనం అతివేగంగా రావడాన్ని గమనించిన సిబ్బంది.. దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కానీ అందులోని దుండగులు వాహనాన్ని వదిలేసి.. అక్కడి నుంచి పరారయ్యారు. ఆ వాహనంలో 446 కిలోల బరువున్న 15 ఎర్రచందనం దుంగలను అధికారులు గుర్తించారు.
వెంటనే ఎర్రచందనంతో పాటు వాహనాన్ని స్వా«దీనం చేసుకున్నారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో అటవీ క్షేత్ర అధికారి సుదర్శన్‌రెడ్డి, గౌస్‌ఖరిమ్, శరవన్ కుమార్, సుబ్రమణ్యం, జాన్ శామ్యూల్, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment