సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అటవీ శాఖ ఆదాయంలో భారీ వృద్ధి నమోదైంది. రెండేళ్లుగా రూ.15–20 కోట్ల మధ్య ఉన్న ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నాటికి రూ.193.31 కోట్లుగా నమోదైంది. 2021–22 ఆర్థిక సంవత్సరానికి అటవీ శాఖ ఆదాయం రూ.200 కోట్లుగా నమోదవుతుందని సామాజిక ఆర్థిక సర్వే 2020–21 అంచనా వేసింది. అంతర్జాతీయ వేలం విధానంలో ఎర్ర చందనం అమ్మకం ద్వారా రూ.175 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చి చేరింది.
చదవండి: Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’
ఇదే సమయంలో ఫర్నిచర్ తయారీలో అత్యధిక డిమాండ్ ఉండే టేకు కలప విక్రయం ద్వారా రూ.10.98 కోట్ల ఆదాయం సమకూరింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద రూ.6.83 కోట్ల విలువైన టేకు కలపను విక్రయించారు. ఈ రెండింటి తర్వాత వెదురు అమ్మకం ద్వారా డిసెంబర్ నాటికి అటవీ శాఖకు రూ.6.53 కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు ఏడాది మొత్తం మీద వెదురు అమ్మకం ద్వారా రూ.850 కోట్లు ఆర్జించింది. ఇవికాకుండా ఇతర కలప, బీడీ ఆకులు, జీడి మామిడి విక్రయాల ద్వారా అటవీ శాఖ ఆదాయాన్ని ఆర్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,80,603.39 చదరపు కిలోమీటర్లలో అడవి విస్తరించి ఉండగా, ఇందులో 1,994.28 చదరపు కిలోమీటర్లలో దట్టమైన అటవీ ప్రాంతం, 13,861.27 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సాధారణ అడవులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment