G.Kishan reddy
-
కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలోనే విమోచన ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది కూడా హైదరాబాద్ విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తున్నారు. రెండేళ్లక్రితం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో తొలిసారిగా ఈ ఉత్సవాలను కేంద్రం అధికారికంగా నిర్వహించినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ముఖ్యఅతిథిగా పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ వేడుకలకు అమిత్‌షా హాజరవుతారని రాష్ట్ర పార్టీ నేతలు గట్టిగా విశ్వసించారు. అయితే ఈ నెల 17న పరేడ్‌గ్రౌండ్స్‌లో కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అధ్యక్షతన విమోచన వేడుకలు నిర్వహించనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. గతేడాది కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా చారిత్రక గోల్కొండ కోటలో సైనికదళాల పరేడ్‌తో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన విషయం విదితమే.ఈ ఏడాది కూడా కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆయనతో పాటు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొననున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం... పారా మిలటరీ దళాలు, సైనిక దళాలు పరేడ్‌ను నిర్వహించనున్నాయి. హైదరాబాద్ సంస్థానం విముక్తి కోసం జరిగిన పోరాటానికి సంబంధించిన చారిత్రక అంశాలతో వివిధ సాంస్కృతిక ప్రదర్శనలను కళాకారులు ఇవ్వనున్నారు. ఇదిలా ఉంటే...17న హైదరాబాద్ విమోచన సందర్భాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించడాన్ని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో 17న ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వడాన్ని కేంద్రమంత్రి సంజయ్, బీజేఎలీ్పనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. 17న రాష్ట్ర ప్రభుత్వమే విమోచన ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్‌తో సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ శాసనసభాపక్షం సిద్ధమవుతోంది. -
రామగుండం ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి
పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్‌లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. .. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. -
అలరించిన జాతీయ సంస్కృతి మహోత్సవాలు (ఫొటోలు)
-
అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యంగా ముందుకెళతామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కలిసికట్టుగా ముందుకుసాగుతూ తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగేలా పోరాడుతామన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచినా మరింత గట్టిగా పోరాడి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు సాధించేలా ఇప్పటి నుంచే పట్టుదలతో కృషి ప్రారంభిస్తామని చెప్పారు. ఎంతో కష్టపడినా అనుకున్న స్థాయిలో ఫలితాలు రాలేదని, ఈ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించిందని, 7 నుంచి 14 శాతానికి ఓటు బ్యాంకు పెరిగిందన్నారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే 100 శాతం ఓటింగ్ పెరిగిందని చెప్పారు. పార్టీ నేతలు కాసం వెంకటేశ్వర్లుయాదవ్, ప్రేంసింగ్‌రాథోడ్, చింతా సాంబమూర్తి, ప్రకాష్‌రెడ్డి తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడారు. ఓడిన స్థానాలపై జాతీయస్థాయి నుంచి జిల్లా, మండల, బూత్ స్థాయి వరకు సమీక్ష జరిపి వచ్చే లోక్‌సభ ఎన్నికలకల్లా లోటుపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. లోక్‌సభకు ఓటేస్తామన్నారు : అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నేతలు వెళ్లినప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు మద్దతు తెలిపే ఓటర్లు తాము అసెంబ్లీకి ఎవరికి ఓటేసినా పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి వేస్తామని చెప్పారన్నారు. తాము గెలిచింది 8 స్థానాలే అయినా, 80 మంది ఎమ్మెల్యేల బలాన్ని ప్రజలు ఇచ్చారని చెప్పారు. క్రియాశీల ప్రతిపక్ష పార్టీ పాత్ర పోషిస్తామని, ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని తెలి పారు. అధికార బీఆర్ఎస్పై ఐదేళ్లుగా బీజేపీ సాగించిన పోరు వల్ల కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో లాభం పొందిందన్నా రు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై గట్టిగా పోరాడుతూ రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా మారేందుకు కృషి చేస్తామన్నారు. బీజేపీపై పడి ఏడ్చి బురదచల్లిన వారు ఈ రోజు ఫామ్‌హౌస్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని (మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) వ్యాఖ్యానించారు. అక్కడ కాంగ్రెస్‌కు ఆ పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్న పరిస్థితి ఛత్తీస్‌గఢ్, రా జస్తాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నా రు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని బీజేపీ చేజిక్కించుకుందని, మధ్యప్రదేశ్‌లో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ సాధించిందని చెప్పారు. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సీఎం అభ్యర్థి అని చెబుతున్న రేవంత్‌రెడ్డిని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఓడించి రికార్డు సృష్టించారన్నారు. ఇలాంటి రికార్డు దేశంలో మరే రాష్ట్రంలోనూ సాధ్యం కాలేదన్నారు. పార్టీ పోటీచేసిన స్థానాల్లో ఓటమికి దారి తీసిన కారణాలను విశ్లేషించుకుంటామని, ఢిల్లీ వెళ్లి జాతీయ నాయకత్వంతో సమావేశమై రాష్ట్రంలో ఎన్నికల సరళి, ప్రభావం చూపిన అంశాలు, తదితర విషయాలపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాలు, రాబో యే లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం కావడం, తెలంగాణ ఎన్నికల తీరుతెన్నులపై సవివరంగా తెలియజేస్తామన్నారు. తమ పార్టీ వారే తనను ఓడించారని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఒక విలేకరి ప్రస్తావించగా, ఆ వ్యాఖ్యలు తన దృష్టికి రాలేదని కిషన్‌రెడ్డి సమాధానమిచ్చారు. బీఆర్ఎస్, మజ్లిస్ కుట్రలను తిప్పికొట్టారు: కిషన్‌రెడ్డి రాజాసింగ్ నివాసానికి వెళ్లి అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సాక్షి, హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల అధినేతలు కేసీఆర్, అసదుద్దీన్ ఎన్ని కుట్రలు చేసినా ఎమ్మెల్యే రాజాసింగ్ బలమైన విశ్వాసం, ధైర్యంతో తిప్పికొట్టారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రశంసించారు. ముఖ్యంగా మజ్లిస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం కొనసాగిస్తూ, ప్రజల ఆశీస్సులతో రాజాసింగ్ మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెడుతున్నారని అన్నారు. అధికార దురి్వనియోగం, కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టినా గోషామహల్లో ధర్మం, జాతీయ భావజాలమే గెలిచింద ని పేర్కొన్నారు. సోమవారం గోషామహల్లో రాజా సింగ్ నివాసానికి వెళ్లిన కిషన్‌రెడ్డి ఆయనను అభినందించారు. తప్పుడు ప్రచారాలతో అనేక శక్తులు పన్ని న కుట్రలను ఎదుర్కొని బీజేపీ ఎమ్మెల్యేగా రాజాసింగ్‌ను గెలిపించిన గోషామహల్ ప్రజలకు, ఆయన విజయం కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్నరోజుల్లో పార్టీ మరింత విస్తరణకు రాజాసింగ్ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకుంటామన్నారు. 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ విజయం కోసం కృషి చేస్తామని కిషన్‌రెడ్డి తెలిపారు. -
తెలంగాణలో సభపెట్టే నైతికత సోనియాకు లేదు
సాక్షిప్రతినిధి, వరంగల్ / రసూల్‌పుర: కాంగ్రెస్, బీఆర్ఎస్లు తెలంగాణ చరిత్ర, విమోచనదినం ప్రాధాన్యతను వక్రీకరిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమె త్తారు. సెప్టెంబర్ 17న తెలంగాణలో మీటింగ్ పెట్టే నైతికత కాంగ్రెస్ పార్టీకి, సోనియాకు లేవని, హైదరాబాద్‌లో మీటింగ్ పెట్టుకోవాలంటే భాగ్య లక్ష్మి ఆలయం వద్ద నెహ్రూ కుటుంబం రక్తం వచ్చేలా ముక్కు నేలకు రాయాలన్నారు. అధికారంలోకి రాకముందు విమోచన దినోత్సవాన్ని జరపా లన్న కేసీఆర్.. ఆ మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను ‘విమోచన దినోత్సవం‘గా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని డిమాండ్ చేస్తూ సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్ నుంచి చేపట్టిన బైక్‌ర్యాలీ శుక్రవారం సాయంత్రం హనుమకొండ జిల్లా పరకాల అమరథామం వద్ద ముగిసింది. అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం పరకాల అంగడి గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను దాచిపెట్టిన మొదటి ముద్దాయి కాంగ్రెస్ అని, తెలంగాణ ప్రజలకు ఆ పార్టీ సమాధానం చెప్పాలని లేకుంటే సోనియాగాంధీ కుటుంబ అడుగుపెట్టే అర్హత లేదన్నారు. సీఎం కేసీఆర్‌ను మజ్లిస్ ఆత్మ ఆడిస్తుందని, ఆ పార్టీకి భయపడే నాడు కాంగ్రెస్, నేడు బీఆర్ఎస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదని కిషన్‌రెడ్డి ఆరోపించారు. నైజాం ఓడిపోయిన దినం ఎలా సమైక్యత దినం అవుతుందో ఆ రెండు పార్టీలు తెలంగాణ ప్రజలకు చెప్పాలని, తెలంగాణ విమోచన దినాన్ని సమైక్య దినంగా వక్రీకరిస్తున్న కేసీఆర్ పరకాలకు వస్తావా తేల్చుకుందాం? అని సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వచ్చే సంవత్సరం సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని, పరకాల అమరధామం వద్ద అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహిస్తామన్నారు. బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కూడా అప్పటి నిజాంలాగా అరెస్టులు చేస్తూ నిర్బంధాలు విధిస్తున్నారని, స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం బ్రిటిష్ పాలనలో, నిజాం పాలనలో ఉండేది కాదని, ఇప్పుడు ఇక్కడా అదే పరిస్థితి ఉందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ, రావుల కిషన్లతోపాటు పలువురు పాల్గొన్నారు. పరేడ్ గ్రౌండ్ టు పరకాల తెలంగాణ విమోచన ఉత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ నుంచి పరకాల అమరధామం వరకు బీజేపీ బైక్‌ర్యాలీని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాశ్ జవదేకర్ జెండా ఊపి శుక్రవారం ప్రారంభించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్వయంగా బైక్ నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ ప్రారంభానికి ముందు ఆయన పరేడ్ గ్రౌండ్లో విమోచన దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించారు. పరేడ్ మైదానం నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్, ఓయూ. తార్నాక, ఉప్పల్, భువనగిరి, జనగాం, పరకాల వరకు 200 కిలోమీటర్లు ఏడు గంటల పాటు బైక్‌ర్యాలీ కొనసాగింది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అడుగడుగునా పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. -
TS: సంఘ్ పెద్దలతో బీజేపీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సమన్వయంపై ఆ పార్టీ నేతలు సంఘ్ పెద్దలతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కే.లక్ష్మణ్, బండి సంజయ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో సంఘ్ పరివార్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా వెంటనే చేయాల్సిన పనులేంటో ఈ సందర్భంగా సంఘ్ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి స్వల్ప అస్వస్థత!
సాక్షి, ఢిల్లీ: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి(58) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆదివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు ఆయన వెళ్లారు. అయితే ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నట్లు నిర్ధారించుకున్న వైద్యులు.. చికిత్స అందించారు. ఛాతి ప్రాంతంలో నొప్పిగా అనిపించడంతో ఆయన రాత్రి 11 గం. ప్రాంతంలో ఎయిమ్స్‌కు వెళ్లారు. కార్డియోన్యూరో సెంటర్లోని కార్డిక్ కేర్ యూనిట్లో ఆయనకు పరీక్షలు జరిగాయి. అనంతరం ఆయనకు గ్యాస్ట్రిక్ సమస్యే ఉన్నట్లు వైద్యులు తేల్చి.. అడ్మిట్ చేసుకున్నారు. చికిత్స అనంతరం సోమవారం ఉదయం ఆయన్ని డిశ్చార్జి చేయొచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: సూపర్ సీనియర్లు కూడా పోటీ నై!! -
దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా
సాక్షి, ఢిల్లీ: కరోనా నివారణకు కేంద్రం అన్నిచర్యలు తీసుకుంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిరోజూ అన్నిరాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రాల్లో పర్యవేక్షణ కోసం జాయింట్ సెక్రటరీలను నియమించామని తెలిపారు. జనవరి 26 నుంచి అన్ని విమానాశ్రయాల్లో పరీక్షలు ప్రారంభించామని పేర్కొన్నారు. కరోనా అనుమానితులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. (కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు) రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. ఓడల ద్వారా వచ్చే సరకు రవాణాను నిషేధించామని వెల్లడించారు. విదేశాల్లో ఉన్న రాయబారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో కట్టుదిట్టుమైన నిఘా పెట్టామని తెలిపారు. మనీలాలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిలలో సామూహిక ప్రార్థనలు సాధ్యమైనంత వరకు తగ్గించాలని కోరారు. కరోనా నేపథ్యంలో జనగణన ను వాయిదా వేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. (ఇటలీ వీధుల్లో కరోనా విజృంభణ) -
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సహకారం
-
ముస్లిం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా, నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని బీజేఎల్పీ నేత జి.కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాజ్యాంగబద్ధమైన ఎస్టీ బిల్లును, ముస్లిం రిజ ర్వేషన్ల బిల్లులను కలిపి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే బిల్లుగా అసెంబ్లీలో పెట్టేందుకు నిర్ణయించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోం దన్నారు. ముస్లిం రిజర్వేషన్ల కల్పన బిల్లును హైకోర్టు రెండు సార్లు కొట్టేసిందని, అయినా ఈ రిజర్వేషన్లపెంపునకు ప్రయత్నించడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు స్టే మాత్రమే ఇచ్చిందని, దీనిపై కోర్టులో వాదనలు వినిపించాల్సిన సందర్భంలో బిల్లును తీసుకురావడం ఏమిటని నిలదీశారు. శనివారం బీఏసీ సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా, దానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. -
బడాయి బడ్జెట్ ఇది
ఈ బడ్జెట్ వాస్తవ విరుద్ధంగా ఉంది. ఇది భారీ బడ్జెట్ కాదు... బడాయి బడ్జెట్. నిధులు ఎలా సమకూర్చుకుంటారో చెప్పలేదు. మిషన్ భగీరథ, రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి పంపిణీకోసం నామమాత్రంగా నిధులు కేటాయించారు. కొత్త జిల్లాల్లో మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు కేటాయించడంలో నిర్లక్ష్యం వహించింది. రాష్ట్రం బాకీల తెలంగాణగా మారుతోంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రూ.77వేల కోట్ల అప్పు పెరిగింది. ఏటా రూ.16వేల కోట్లు వడ్డీలు, అప్పులకే సరిపోతోంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. వాటి వివరాలు వెల్లడించాలి. -
పాలకుల పాపం, ఓయూకు శాపం
సందర్భం శత వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఆలస్యంగా మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ తూతూ మంత్రంగా వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తున్నారు. శతాబ్ది వేడుకలంటే భవంతులకు సున్నాలు కొట్టి, లైటింగ్ ఏర్పాటు చేస్తే చాలునని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. దేశంలోనే ఒకనాడు అత్యుత్తమ విశ్వవిద్యా లయం. అసంఖ్యాక విద్యా కుసుమాలు విర బూసిన క్షేత్రం. ప్రధానమంత్రి సహా, ఎందరో మేధావులను అందించిన చైతన్య నిలయం. ఉద్యమాలకు పురిటిగడ్డ. స్వాతంత్య్రోద్యమ కాలంలో నిజాంను ఎదిరించి వందేమాతరం నినాదంతో ప్రతిధ్వనించిన ప్రదేశం. 1969 తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు. మలి దశ ఉద్యమానికి ఆలవాలం. ఇదంతా ఉస్మానియా విశ్వవిద్యాలయం గత వైభవం. శతాబ్ది ఉత్సవా లకు సిద్ధమవుతున్న ఈ మహా విద్యా కేంద్రం దుస్థితిని గమనిస్తే మాత్రం దుఃఖం కలుగుతుంది. ఇందుకు ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎంత కారణమో, ప్రత్యేక రాష్ట్రం తరువాత గద్దెనెక్కిన ‘మన పాలకులు’ కూడా అంతే కారణం. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఉస్మానియాయే కేంద్ర స్థానం. విద్యార్థుల పోరాటం, అసమాన త్యాగం, లాఠీ దెబ్బలకు వెరవని ధీరత్వం, తుపాకీ గుళ్లకు సైతం చెదరని గుండె ధైర్యం కారణంగా తెలం గాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైంది. అందుకే ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం వస్తుందని అంతా ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఆశల మీద నీళ్లు చల్లింది. అసలు విద్యా రంగాన్నే నిర్లక్ష్యం చేసింది. అన్ని విద్యాలయా లతో పాటు చరిత్రాత్మకమైన ఉస్మానియాను కూడా భ్రష్టు పట్టించింది. శత వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ ఆలస్యంగా మేల్కొన్న ముఖ్య మంత్రి కేసీఆర్ తూతూ మంత్రంగా వేడుకలకు ఏర్పాట్లు చేయిస్తు న్నారు. శతాబ్ది వేడుకలంటే భవంతులకు సున్నాలు కొట్టి, లైటింగ్ ఏర్పాటు చేస్తే చాలునని ఈ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక విశ్వవిద్యాలయం దుస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఓయూ న్యాక్ గుర్తింపును సాధించడంలో విఫలమైంది. దీనితో యూజీసీ నుంచి రావలసిన నిధులు ఆగిపోయాయి. మూడేళ్ల వరకు ఈ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకోకపోవడం అంటే పడిపో తున్న ప్రమాణాలకు నిదర్శనమే. అయినా దిద్దుబాటు చర్యలు తీసుకో వాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోయింది. విశ్వవిద్యాలయాన్ని పర్యవేక్షించే వైస్‌చాన్స్‌లర్‌ను నియమించకుండా రెండేళ్లు గడపడం ఈ ధోరణికి పరాకాష్ట. రెండేళ్ల తరువాత వీసీని నియమించినా, ఆ ప్రక్రియను కూడా సక్రమంగా చేపట్టలేకపోయింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. వీసీల నియామ కంలో యూజీసీ నిబంధనలను అతిక్రమించినందుకు హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకుంది. ఓయూ వీసీ సహా ఎనిమిది మంది వీసీల పరిస్థితి ఇప్పుడు డోలాయమానంగా ఉంది. విశ్వవిద్యాలయా లకు గవర్నర్ చాన్స్‌లర్‌గా ఉండడం సంప్రదాయం. రాష్ట్ర ప్రభుత్వం దీనిని కూడా తుంగలో తొక్కి తమకు అనుకూలురైన బయటి వ్యక్తులను చాన్ం్సలర్లుగా నియమించేందుకు జీవో జారీ చేసింది. ఈ విషయం లోనూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని హైకోర్టు తప్పుపట్టింది. అయినా పద్ధతి మార్చుకోకుండా సుప్రీంకెళ్తే అక్కడా చుక్కెదురైంది. ఓయూకు గత 5 సంవత్సరాల నుంచీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లేదు. గత 26 ఏళ్లలో ఓయూలో రెండుసార్లు మాత్రమే నియామకాలు చేపట్టారు. 1990 తర్వాత 17 ఏళ్లకు 2007లో తొలిసారి రిక్రూట్ మెంట్లు చేపట్టారు. అనంతరం 2013లో మరోసారి జరిగింది. రిటై ర్మెంట్లు మాత్రం యథావిధిగా ఉన్నాయి. గత రెండున్నర సంవత్సరా లుగా 125 మందికి పైగా ప్రొఫెసర్లు రిటైరయ్యారు. ఇతర రాష్ట్రాల్లో యూనివర్సిటీల టీచింగ్ ఫ్యాకల్టీ రిటైర్మెంట్ వయస్సు 65 సంవత్స రాలు.æ తెలంగాణలో మాత్రం 60 సంవత్సరాలే. దీంతో మొత్తం 60 డిపార్ట్మెంట్లుంటే 56 డిపార్ట్మెంట్లలో సరిపోయినంత బోధనా సిబ్బంది లేదు. 8 డిపార్ట్మెంట్లలో బోధనా సిబ్బంది ఒక్కరు కూడా లేరు. ఫ్రెంచ్, జర్మన్, రష్యన్, తమిళ్, థియేటర్ ఆర్ట్స్, బోటనీ, హోమ్ సైన్స్, ఆర్సీయూ అండ్ ఈఎస్ లాంటి డిపార్ట్మెంట్లు మూతపడినట్టే. 42 డిపార్ట్మెంట్లలో అసోసియేట్ ప్రొఫెసర్లే హెచ్ఓడీలు. ఇంజనీ రింగ్‌లో ఈసీఈ, బయో మెడికల్ ఇంజనీరింగ్, జియో ఫిజిక్స్, మైక్రో బయాలజీ లాంటి కీలకమైన విభాగాల్లోనూ ప్రొఫెసర్లు లేరు. ఉస్మానియాలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1,264 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం 560 మందే ఉన్నారు. 704 పోస్టులు ఖాళీ. 290 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. యూజీసీ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ టీచింగ్ స్టాఫ్ 10 శాతం మించరాదు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లోనూ ఇదే పరిస్థితి. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో మొత్తం 1,524 పోస్టులు ఖాళీగా ఉన్నాయనీ స్వయంగా సీఎం కేసీఆరే ప్రకటించారు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న వారిలో 1,300 మందికి పైగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. ప్రొఫెసర్లు లేకపోవడంతో యూనివర్సిటీలో పరిశోధనలూ అటకె క్కాయి. పీహెచ్డీ అడ్మిషన్ల కోసం 2013లోనే ఇవ్వాల్సిన నోటిఫికేషన్‌ను 2014లో ప్రకటించి, 2015లో ప్రవేశ పరీక్ష నిర్వహించి, 2017లో ఇంట ర్వూ్యలు నిర్వహిస్తూ ఓయూలో పరిశోధనలంటేనే విద్యార్థులు విసుగెత్తే పరిస్థితి తెచ్చారు. విద్యార్థులకు సదుపాయాలు, మౌలిక వసతులూ అంతంత మాత్రమే ఉన్నాయి. ఆర్ట్స్ కాలేజీ నిర్వహణను ఈ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. బిల్డింగ్ కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. వర్షం వస్తే చాలా గదుల్లో నీళ్లు కారే పరిస్థితి. ఆర్ట్స్ కాలేజీ ఇలా ఉంటే ఇతర భవనాల్లో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకోవడం కష్టమేమీ కాదు. హాస్టల్లో ఉండే విద్యార్థులకు రేకుల షెడ్డులే గతి. పూర్తి స్థాయి మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో విద్యార్థులు చెంబులు పట్టు కుని బహిర్భూమికి వెళ్తున్నారు. స్నానాలు బయటే చేయాల్సిన దుస్థితి. సరైన బోధనా సిబ్బంది లేకుండా అత్యున్నత విద్యా ప్రమాణాలు ఎలా ఆశించగలం? ఇటీవల నిర్వహించిన కొన్ని సర్వే ఫలితాల్లో విస్తు పోయే విషయాలు వెలుగు చూశాయి. రాష్ట్రంలో ప్రొఫెషనల్ కోర్సు పూర్తి చేసిన వారిలో 70 శాతం పైగా అభ్యర్థులకు ఉద్యోగ సామర్థ్యం లేదని స్పష్టమైంది. పటిష్టమైన వ్యవస్థ, జవాబుదారీతనం గలిగిన సమర్థవంతమైన పాలనా సామర్థ్యం, మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య లేకుండా విద్యార్థుల సామర్థ్యం ఎలా పెంపొందుతుంది? వృత్తి ఉద్యోగాల్లో ఎలా రాణించగలరు? - జి. కిషన్ రెడ్డి వ్యాసకర్త ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు, తెలంగాణ ‘ మొబైల్ : 99490 99997 -
తిరంగా యాత్రను విజయవంతం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తిరంగా యాత్రను రాష్ట్రంలో విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్రశాఖ నిర్ణయించింది. ఆదివారం పార్టీ సీనియర్ నేత ఎన్.ఇంద్రసేనారెడ్డి అధ్యక్షతన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డిలతో పాటు పలువురు ముఖ్యనేతలు సమావేశమయ్యారు. దేశ స్వాతంత్య్ర సంగ్రామాన్ని స్మరించుకునేందుకు.. ప్రజల్లో విస్తృతమైన అవగాహన కల్పించేందుకు ఆగస్టు 16 నుంచి 21 వరకు జిల్లాల వారీగా రౌండ్‌టేబుల్ సమావేశాలు.. వర్క్‌షాపులు నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 1నుంచి 14 వరకు ముఖ్య పట్టణాలలో బైక్ ర్యాలీలు, కాగడాల ప్రదర్శనలు చేపట్టాలని తీర్మానించారు. అలాగే తిరంగా యాత్ర ద్వారా తెలంగాణ విమోచన దినోత్సవ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు నిర్ణయించారు. అందుకోసం కరపత్రాలు, వాల్‌పోస్టర్లు సిద్ధం చేసి విస్తృత ప్రచారం కల్పించాలని తీర్మానించారు. -
రాష్ట్రంలో కుటుంబపాలన
బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశానికి హాజరైన కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మోదీ సభకు జన సమీకరణపై చర్చ రాష్ట్రంలో టీఆర్ఎస్ అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తోంది. ప్రతిపక్షాలు లేకుండా చేస్తూ కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నారు.. ప్రజావ్యతిరేక పాలనపై పోరాటానికి ఈ నెల 7న జరిగే మోదీ సభలో బీజేపీ శంఖారావం పూరిస్తాం. ఎంసెట్-2 లీకేజీతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధం కావాలి. - బీజేపీ శాసనసభా పక్షనేత కిషన్‌రెడ్డి శంషాబాద్ రూరల్: టీఆర్ఎస్ పాలనతో రాష్ట్రంలో విద్యా రంగ వ్యవస్థ నిర్వీర్యం అయిందని బీజేపీ శాసనసభా పక్షనేత జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్ మండలంలోని బహదూర్‌గూడ సమీపంలో ఉన్న ఓ ఫంక్షన్‌హాలులో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. యూనివర్సిటీలకు వైస్ చాన్స్లర్ల నియామకం, ఎంసెట్-2 లీకేజీ వ్యవహారాలతో విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గ్రామాల్లో ఇసుక, ల్యాండ్ మాఫియా రెచ్చిపోతోందని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా రాజ్యాంగ విరుద్దంగా పాలన కొనసాగిస్తున్నారని, టీడీపీలో 15 మంది ఎమ్మెల్యేలుంటే ఇద్దరుముగ్గుర్ని వదిలి అందర్నీ చేర్చుకున్నారన్నారు. రెండు పడకల ఇళ్లు పథకం సచివాలయం దాటి రావడంలేదన్నారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలనపై పోరాటం చేయడంతో పాటు టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతూ ప్రజల గొంతుకై సమస్యలపై పోరాటానికి సిద్ధమవుతామన్నారు. ఇందుకు ఈ నెల 7న జరిగే మోదీ సభను వేదికగా చేసుకుంటామని చెప్పారు. 2019లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాహుల్‌తో కాంగ్రెస్ ముక్తీ భారత్.. ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ ముక్తీ భారత్‌గా ఉంటుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం పోయిందని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదని జోస్యం చెప్పారు. హిమాచల్, ఉత్తరాంచల్, కర్ణాటకలో ఎప్పడు ఎన్నికలు జరిగినా బీజేపీ గెలుపు ఖాయమన్నారు. మోదీ నేతృత్వంలో భారత్ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. మోదీ సభను విజయవంతం చేద్దాం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభను విజయవంతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. 2013లో మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటి సభను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించామని, అదేస్థాయిలో ఇప్పుడు సభకు భారీగా జన సమీకరణ చేపట్టాలన్నారు. అన్ని వర్గాల వారిని సభకు తరలించాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ కార్యదర్శి కృష్ణదాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మోహన్‌రెడ్డి, జిల్లా ఇన్చార్జి ఎండల లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రేమ్‌రాజ్, అంజన్‌కుమార్, నాయకులు నందకిషోర్, ప్రశాంత్, మండల అధ్యక్షుడు వెంకటయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
కిషన్ రెడ్డికి కీలక బాధ్యతలు!
హైదరాబాద్: అసెంబ్లీలో పాయింట్ టు పాయింట్ తీవ్ర స్వరంతో అధికారపక్షాన్ని నిలదేసేందుకు విపక్షంలో కొత్త గొంతుక చేరనుంది. ఆ స్వరం మరెవరిదోకాదు తెలంగాణ బీజేపీ 'మాజీ' అధ్యక్షుడు కిషన్ రెడ్డిది. అంబర్ పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కిషన్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమించేందుకు ఆ పార్టీ అన్నివిధాలా సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆ పార్టీ ఎల్పీ నేతగా కొనసాగుతున్న డాక్టర్ కె. లక్ష్మణ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి గా నియమితులుకావటమే ఈ మార్పునకు ప్రధాన కారణం. బీజేపీ సంస్థాగత నియమాల ప్రకారం ఒక వ్యక్తి జోడు పదవులు నిర్వహించడానికి వీలులేదు. లక్ష్మణ ఇప్పుడు పార్టీకి సారథ్యం వహిస్తారు కాబట్టి, అసెంబ్లీలో లెజి స్లేటివ్ పార్టీ నాయకత్వ బాధ్యతలు కిషన్ రెడ్డికి కట్టబెట్టాలని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తున్నది. పైగా ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యేలు అందరిలోకీ కిషన్ రెడ్డే సీనియర్ కావటం మరో సానుకూల అంశం. ఈ మేరకు ఆయన నియామక ఉత్తర్వులు ఒకటిరెండు రోజుల్లో వెలువడతాయని సమాచారం. కిషన్ రెడ్డికి గతంలోనూ బీజేఎల్పీ నేతగా పనిచేసిన అనుభవం ఉంది. పార్టీ కొత్త అధ్యక్షడిగా ఎంపికైన లక్షణ్ హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు లక్షణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. -
'ఎర్రచందనం అక్రమ రవాణా ఇంకా కొనసాగుతోంది'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణ ఇంకా కొనసాగుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి శుక్రవారం తిరుమలలో ఆరోపించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. అంతకుముందు కిషన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇదిలా ఉంటే వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. నడకదారిన వచ్చే భక్తులకు 8 గంటలు, సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ దర్శనాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. అలాగే తిరుపతి, తిరుమల, రేణుగుంట ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. -
వరంగల్ ఉప ఎన్నిక కోసమా ఇదంతా ?
హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వం కేంద్రమంత్రుల పర్యటనను అడ్డుకుంటుందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు. శనివారం హైదరాబాద్‌లో కేసీఆర్ మాట్లాడుతూ... ఈ రోజు గడ్కరీ పర్యటనకు సీఎం కేసీఆర్ సమయం లేదన్నారు. ఈ నేపథ్యంలో రూ. 1900 కోట్ల యాదాద్రి - వరంగల్ హైవే శంకుస్థాపన వాయిదా పడిందన్నారు. వరంగల్ ఉప ఎన్నిక కోసమా ఇదంతా అని కేసీఆర్ ప్రభుత్వాన్ని కిషన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనే రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. తమ పార్టీ చేపడుతున్న రైతు దీక్ష ఈ నెల 7న నిజామాబాద్, 8న హైదరాబాద్‌లో చేపట్టనున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. ఆధిపత్యపోరు కేసీఆర్ కుటుంబంలోనే ఉందని.. తమ పార్టీలో కాదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
'టీఆర్ఎస్, మజ్లిస్ పొత్తు ఎండగట్టాలి'
హైదరాబాద్: జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా ఎగురవేయడానికి కృషి చేయాలని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి కార్యకర్తలకు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, సభ్యత్వ నమోదుపై చర్చించారు. ఈ సందర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ... అధికార టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మధ్య పొత్తును ఎండగట్టాలని నాయకులు, కార్యకర్తలకు తెలిపారు. ఆచరణ సాధ్యం కాని హామీలిస్తున్న టీఆర్ఎస్... మాటలకే మాత్రమే పరిమితమైందని ఆరోపించారు. రాజయ్య బర్త్రఫ్పై ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి ఈ సందర్బంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ప్రతిష్టాత్మకంగా బీజేపీ సభ్యత్వ నమోదు
జిల్లా అధ్యక్షులు, ఇన్చార్జిలతో కిషన్‌రెడ్డి సమీక్ష సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో బీజేపీ చేపట్టిన ఆన్లైన్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సూచించారు. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇన్చార్జిలతో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఆన్లైన్ సభ్యత్వం, జిల్లాల వారీగా స్పందన, 35 లక్షల నిర్దేశిత లక్ష్యం వంటి అంశాలపై సమీక్షించారు. తెలంగాణలో సభ్యత్వం మందకొడిగా ఉందని అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోందని ఆయన వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి, లోపాలను సరిదిద్దుకోవాలని నేతలకు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లాలో గురు, శుక్రవారాల్లో నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ అగ్రనేతలు పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. జీవితకు నామినేటెడ్ పదవిపై పెదవి విరుపు.. కేంద్రంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో ఎవరికీ నామినేటెడ్ పదవులు పెద్దగా దక్కడం లేదని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పార్టీలో చేరిన నటి జీవితకు నామినెటెడ్ పదవి ఎలా వచ్చిందంటూ కొందరు జిల్లా అధ్యక్షులు కిషన్‌రెడ్డిని నిలదీశారు. అయితే ఆమె నియామకానికి పార్టీ రాష్ట్ర శాఖకు సంబంధం లేదని ఆయన బదులిచ్చారు. జిల్లాల అధ్యక్షులు, పార్టీ సీనియర్ల జాబితాను జాతీయ నాయకత్వానికి అందిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి మురళీధర్‌రావు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
గ్యాస్ సబ్సిడీని వదులుకుంటున్నా:కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌కు ఇస్తున్న సబ్సిడీని తాను వదులుకుంటున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్యాస్ వినియోగదారుల అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని ఇంధనశాఖకు తెలియజేస్తానన్నారు. -
మాఫియా నాయకులంతా 'కారు' ఎక్కుతున్నారు
హైదరాబాద్: మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లో చేరుతున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షడు కిషన్‌రెడ్డి గురువారం హైదరాబాద్‌లో ఆరోపించారు. ఇసుక, అక్రమ సారా మాఫియా నాయకులంతా టీఆర్ఎస్లోనే ఉన్నారని ఆయన విమర్శించారు. బెల్ట్ షాపులపై వైఖరి ఏమిటో వెల్లడించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ ధరలు పెంచడానికే కేసీఆర్ హెలికాప్టర్ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 4వ తేదీ వరకు బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు చేస్తామని... అలాగే 5వ తేదీన సమీక్ష నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి వివరించారు. -
ఆన్లైన్లో బీజేపీ సభ్యత్వం
పార్టీలో బెల్లయ్యనాయక్ సహా పలువురి చేరిక సాక్షి, హైదరాబాద్: ఈ నెల 12 నుంచి మార్చి 31 దాకా పార్టీ సభ్యత్వం ఆన్లైన్ ద్వారా మాత్రమే జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేత కె.లక్ష్మణ్ తెలిపారు. గురువారం రాష్ట్ర కోర్ కమిటీ, పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత వారు మీడియాతో వేర్వేరుగా మాట్లాడారు. ఆన్లైన్ సభ్యత్వం మాత్రమే చేయాలన్న పార్టీ జాతీయ విధానం మేరకు దీనిపైనే పూర్తి గా దృష్టికేంద్రీకరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ హామీలను నిలబెట్టకునే విధంగా ఒత్తిడి చేస్తామన్నారు. రాష్ట్రంలో కొన్ని శక్తులు మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో పార్టీ శాఖకోసం కలిసికట్టుగా కృషిచేస్తామని వారు చెప్పారు. బెల్లయ్య సహా పలువురి చేరిక లంబాడీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకుడు బెల్లయ్య నాయక్‌తో పాటు పలువురు నాయకులు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జెడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినీ రెడ్డి, రిటైర్డు ఐపీఎస్ అధికారి గంగాధర్, కాంగ్రెస్ నేత సురేశ్ నాయుడు, లోక్‌సత్తానేత శ్రీనివాసరావు తదితరులు పార్టీలో చేరారు. ఎస్సీ వర్గీకరణ చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేయకుండా మోసం చేసిందని, ఇప్పుడైనా వెంటనే వర్గీకరణ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాను కలిసిన మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ కో ఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ కోరారు. -
మిస్డ్‌కాల్‌తో బీజేపీ సభ్యత్వం
రాష్ట్ర మహిళా మోర్చా ఇన్చార్జ్ సాధ్వీ నందమయి పురి సాక్షి, హైదరాబాద్: ఒక్క మిస్డ్ కాల్‌తో భారతీయ జనతాపార్టీ, అనుబంధ సంస్థలలో సభ్యత్వం పొందవ చ్చునని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర మహిళా మోర్చా ఇన్చార్జ్ సాధ్వీ నందమయి పురి తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై నిర్వహించిన వర్క్‌షాప్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీజేపీ సభ్యత్వ నమోదు కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18002662020 కు మిస్డ్‌కాల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదు జరిగిపోతుందన్నారు. ‘‘ఘర్‌ఘర్, గావ్ గావ్’’ నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు పద్మజారెడ్డి పాల్గొన్నారు. -
వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: అంగవికలుర సమస్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వాలు అన్ని రంగాల్లోనూ వికలాంగులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వారికి సంబంధించిన 34 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. వికలాంగులకు అందాల్సిన ఫలాలు పక్కదారి పట్టినా, అవినీతి జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. అనంతరం ట్రైసైకిళ్లను, వాకింగ్ స్టిక్‌లను కిషన్‌రెడ్డి వికలాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, అందె రాంబాబు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. -
పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం: కిషన్ రెడ్డి
హైదరాబాద్: పేదల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అదనపు విద్యుత్ కోసం కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని సంప్రదించడం లేదని ఆయన అన్నారు. వాస్తవాలకు విరుద్ధంగా ప్రభుత్వ కార్యాచరణ నడుస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. సమగ్ర సర్వే చేసిన తర్వాత వృద్ధులు, వికలాంగుల నుంచి కొత్త దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. వృద్ధులు, వికలాంగుల పాపం కేసీఆర్ కు తగులుతుందని కిషన్ రెడ్డి అన్నారు. -
బంగారు తెలంగాణ అంటే లాఠీఛార్జీ చేయడమా?
హైదరాబాద్: బంగారు తెలంగాణ అంటే రైతులపై లాఠీఛార్జీ చేయడమా అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. రైతుల నెత్తురు చిందడం తెలంగాణకు మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు. రైతులపై లాఠీ చార్జీకి నైతిక బాధ్యతగా కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలో నిజాం నియంతృత్వ ధోరణి స్పష్టంగా కనబడుతోందని ఆయన అన్నారు. మెదక్ లాఠీఛార్జ్‌లో గాయపడ్డ రైతులను మీడియా ముందుకు బీజేపీ నేతలు తీసుకొచ్చారు. -
గ్రేటర్‌పై బీజేపీ జెండా ఎగురవే యాలి
సాక్షి, హైదరాబాద్: రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ కార్యాలయంపై బీజేపీ జెండా ఎగురవేయాలని, అందుకు పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గోల్నాకలోని అశోక ఫంక్షన్హాల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ గ్రేటర్ డివిజన్ ఇన్చార్జీల సమావేశంలో వారు ప్రసంగించారు. ఈసారి నగరంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడిందని, టీఆర్ఎస్-ఎంఐఎం కూటమిని దీటుగా ఎదుర్కోవాలని సూచించారు. గ్రేటర్‌లోని అన్ని డివిజన్లలో ఓట్లు సమానంగా ఉండేలా డీలిమిటేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కోర్టు ఆదేశాల మేరకైనా ఓట్లను విభజించి డివిజన్లను ఏర్పాటు చేయాలన్నారు. పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బి.వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్లు బంగారి ప్రకాశ్, సహదేవ్‌యాదవ్, జితేందర్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అరుణజ్యోతి, ప్రధాన కార్యదర్శులు భావర్‌లాల్‌వర్మ, రాజశేఖరరెడ్డి, ఉమామహేందర్, బాలప్రకాశ్, శ్యాంసుందర్‌గౌడ్, నందు, సీకే శంకర్రావు, రామన్‌గౌడ్, రవిప్రసాద్‌గౌడ్, రాహుల్‌చంద్ర, మహేందర్ వ్యాస్, జయశ్రీ, బండారి రాధిక, బి.నరసింహ, మాచెర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
సానియాకు ఇచ్చినట్లే మిగతా క్రీడాకారులకు ఇవ్వాలి
టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎల్బీ స్టేడియం: రాష్ట్రంలోని క్రీడాకారులకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగావకాశాలు రాకపోవడం విచారకరమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, అంబర్పేట్ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ (టీకేఏ) ఆధ్వర్యంలో బషీర్‌బాగ్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం టీకేఏ చైర్మన్ అయిన జి.కిషన్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్నిస్ క్రీడాకారిణి సానియాకు ఇచ్చిన భారీ నజరానాను ఇతర క్రీడాకారులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జాతీయ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు, కోచ్‌లకు ఉపాధి కల్పించగలమనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలని ఆయన కోరారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికైన క్రీడాకారులు తమ స్పానర్షిప్ కోసం రాజకీయ పార్టీల ఆఫీసులు, ఎమ్మెల్యేల చుట్టు తిరిగే అవసరం లేకుండా చూడాలన్నారు. అలాగే రాష్ట్రంలోని పార్టీలు రాజకీయాలకు అతీతంగా క్రీడాకారులను ఆదుకునే చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ మాట్లాడుతూ నేడు ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని అందిస్తున్న కబడ్డీని ఒలింపిక్ క్రీడల్లో చేర్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటమొద్దు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి డిమాండ్ రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వ నిర్ణయం అనైతికం రైతు రుణ మాఫీపై వెంటనే స్పష్టతనివ ్వండి హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపుల విషయంలో తండ్రీకొడుకు (కేసీఆర్, కేటీఆర్)లు పూటకో మాట మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్భంద విద్యను అమలు చేస్తామని ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర సమితి అధికార పగ్గాలు చేపట్టాక 14 లక్షల మంది విద్యార్థుల చదువును అటకెక్కించిందని విమర్శించారు. బుధవారం నాంపల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, అధికార ప్రతినిధులు ప్రకాష్‌రెడ్డి, కుమార్‌తో కలసి మాట్లాడారు. కీలక సమయంలో రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, మహాత్మాగాంధీ, తెలంగాణ, అంబేద్కర్ యూనివర్సిటీలకు వైస్ చైర్మన్లను సైతం నియమించలేని దుస్థితి నెలకొం దన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గొడవలతో విద్యార్థులను బలి చేయవద్దని కిషన్‌రెడ్డి కోరారు. బకాయిపడిన రూ.1250 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పడు చెల్లిస్తుందో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 1956 ముందు ఇక్కడ పుట్టినవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వ పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలో స్థానికతను చూశారా.. అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. లక్ష రూపాయల్లోపు రైతుల రుణాలను మాఫీ చేస్తామన్న ప్రభుత్వం ఈ విషయంలో నాన్చుడు ధోరణి అవలంబించడం తగదని ఆయన అన్నారు. -
‘బంగారు తెలంగాణ’కు కేంద్రం చేయూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని... దీనికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకురావాల్సి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర నుంచి నిధులు, ప్రాజెక్టులు పొందే విషయంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ ప్రభుత్వం వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు చెందిన బీజేపీ నేతల బృందం రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించి 14 మంది కేంద్ర మంత్రులను కలుసుకొని.. తెలంగాణ అభివృద్ధికి ఉపయోగపడే ప్రతిపాదనలను అందజేసినట్టు ఆయన వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘ఏ’ గ్రేడు కోల్పోకుండా చూడాలని తాము చేసిన విన్నపానికి మంచి స్పందన వచ్చిందని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. దాని అభివృద్ధికి రూ. 200 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కోరామన్నారు. -
మాజీ సీఎం కిరణ్ తో కిషన్ రెడ్డి భేటి!
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజకీయాలు మాట్లాడలేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాకు వెళ్లడించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో కిషన్ రెడ్డి సమావేశమవ్వడం రాజకీయవర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. గత కొద్దిరోజులుగా కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటికి ప్రాధాన్యత ఏర్పడింది. కేంద్ర నామినేటెడ్ పోస్టుల విషయంలో తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలని త్వరలో పార్టీ నాయకత్వాన్ని కలుస్తామని ఓ ప్రశ్నకు జవాబిచ్చింది. మెదక్ ఎంపీ అభ్యర్థి విషయంలో రాష్ట్ర పార్టీ ఇంకా చర్చించలేదని కిషన్ రెడ్డి మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. -
రైల్వే ఛార్జీలు పెంచడం మోడీకి ఇష్టం లేదు: కిషన్ రెడ్డి
హైదరాబాద్: రైల్వే ఛార్జీలు పెంచడం ప్రధాని నరేంద్రమోడీకి ఇష్టంలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అలాగే సిమెంట్ ధరలు పెంచడం ఏకపక్షమేనని, ధరల పెంపు ప్రజలకు భారంగా మారుతుందని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నెలకొన్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పంద రద్దు, ఇతర అంశాలపై కిషన్ రెడ్డి స్పందించారు. విద్యుత్, నీటి పంపకాలపై ఏపీ, తెలంగాణ సీఎంలు సానుకూలంగా చర్చించుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు. -
ప్రభుత్వం మాటలకే పరిమితం కావద్దు
బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హైదరాబాద్: తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో స్పష్టమైన వైఖరితో ముందుకు సాగాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. శాసనసభలో ఇచ్చిన హామీలపై స్పష్టత ఇవ్వడంతో పాటు పాలనలో వేగం పెంచాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లో 10 తీర్మానాలను తూతూ మంత్రంగా ఆమోదించారే తప్ప.. కనీస చర్చ జరపలేదన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో పాత రుణం చెల్లిస్తే గానీ, బ్యాంకులు కొత్త రుణాలు మంజూరు చేసే పరిస్థితి లేదని, దీనిని దృష్టిలో పెట్టుకొని రుణమాఫీపై ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాల వంటి వాటి విషయంలో సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని, ఇళ్ల నిర్మాణ పథకం నిలిచిపోయిందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టిస్తామని ప్రకటించడంతో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారని చెప్పారు. అలాగే, ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, దీంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అడ్మిషన్ల విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీలో కూడా బెల్టు షాపులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోలేదని, గత ప్రభుత్వం వైన్‌షాపుల నుంచి బార్లను వేరు చేయకపోవడంతో టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ముస్లిం రిజర్వేషన్లు అమలు జరిగే ప్రసక్తే లేదని, దీనిని తాము అడ్డుకుంటామన్నారు. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. సోమవారం నగరంలో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరుగుతుందని, రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి సతీష్జీ పర్యవేక్షణలో ఈ సమావేశం జరుగుతుందన్నారు. రాష్ట్ర పదాధికారులు, జాతీయ నాయకులు, జిల్లాల అధ్యక్షులు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకాష్‌రెడ్డి, ప్రదీప్ కుమార్, భీంరావు తదితరులు పాల్గొన్నారు. -
నేడు హైదరాబాద్‌కు నిర్మలా సీతారామన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. ఆమె ఉదయం ఎనిమిదిన్నర గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి బీజేపీ నాయకులు ఆమెను ర్యాలీగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి తీసుకెళతారు. అక్కడ నిర్మలా సీతారామన్‌కు సన్మానం జరుగుతుంది. ఆ తరువాత విలేకరుల సమావేశంలో పాల్గొని సీతారామన్ అనంతరం బర్కత్‌పురలోని బీజేపీ నగర కార్యాలయాన్ని సందర్శిస్తారు. ఇదిలా ఉంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణకు ప్రత్యేకంగా హైకోర్టును సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. -
అభివృద్ధి చెందని జనగామ
జనగామ, న్యూస్‌లైన్ : జనగామను అభివృద్ధి చేయడంలో టీపీసీసీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య విఫలమయ్యాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. జనగామలోని ప్రెస్టెన్ మైదానంలో జనగామ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశాడని, జనం పొన్నాలను మోస్తే.. ఆయన మాత్రం డబ్బు సంచులను మోసుకున్నాడని విమర్శించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన పొన్నాల జనగామకు కనీ సం తాగడానికి నీళ్లు అందించలేదన్నారు. అన్ని విధాలా వెనుకబడ్డ జనగామను అభివృద్ధి చేస్తామన్నారు. జనగామ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, భువనగిరి ఎంపీ అభ్యర్థి నల్లు ఇంద్రసేనారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బహిరంగ సభకు వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణ, వన్నాల శ్రీరాములు, నాయకులు కేవీఎల్ఎన్ రెడ్డి, సౌడ రమేష్, జనగాం సోమిరెడ్డి, పెద్దోజు జగదీష్, ఉడుగుల రమేష్, శివరాజ్‌యాదవ్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎడబోయిన బస్వారెడ్డి, జనగామ పట్టణ అధ్యక్షుడు పొకల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు. -
హామీలలో దానకర్ణుడు.. తదుపరి కుంభకర్ణుడు
కేసీఆర్‌పై బీజేపీ నేత కిషన్‌రెడ్డి విసుర్లు జనగామ, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ బొమ్మా బొరుసులాంటి పార్టీ అని, దాన్ని పట్టుకుంటే.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికలప్పుడు హామీలలో దానకర్ణుడని.. తదుపరి కుంభకర్ణుడని విమర్శించారు. ఆయన మాటలు నమ్మొద్దన్నారు. కేసీఆర్ ఉద్యమంలో పాల్గొని చేసింది తక్కువేనని చెప్పారు. నరేంద్ర మోడీని విమర్శిస్తే సహించమన్నారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అని, ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కు లేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌తో తెలంగాణ రాలేదని, 1100 మంది ఆత్మబలిదానాలు, ప్రజాపోరాటంతోనే వచ్చిందన్నారు. -
బీజేపీతోనే తెలంగాణ పునర్నిర్మాణం : కిషన్‌రెడ్డి
చెన్నూర్/చెన్నూర్ రూరల్/మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : బీజేపీ మద ్దతుతోనే తెలంగాణ రాష్ర్టం ఏర్పడిందని, భవిష్యత్తులోనూ పునర్నిర్మాణం తమతోనే సాధ్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో సినీనటులు రాజశేఖర్, జీవితలతో కలి పి పర్యటించారు. మంచిర్యాలలో రోడ్ షో నిర్వహించగా, చెన్నూర్‌లోని జైహింద్ ఆఫీసర్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన సభలో మట్లాడారు. ఈ సందర్భంగా వారికి బీజేపీ, టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. తదుపరి రోడ్ షో, సభల్లో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం, రాష్ట్రంలో సుస్థిర పాలన బీజేపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. పదేళ్లుగా నిత్యావసర సరకులు, పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరలు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నడ్డి విరిచిందన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానలను అవలంబిస్తున్నాయని ఆరోపించారు. కేసీఆర్ ఒక కుటుంబ రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర, దే శ భవిష్యత్తు ప్రజల చేతిలోనే ఉందని, ఓటు ద్వారా దానిని నిరూపిం చుకనే అవకాశం వచ్చిందన్నారు. బీజేపీ పార్టీ గెలిస్తే మంచిర్యాలను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేస్తామన్నారు. చెన్నూర్ ప్రాంతాలో మూసివేసిన సింగరేణి గనులను తెరిపించి యువతకు ఉపాధి ఆవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అంతే కాకుండా సూపర్ స్పెషలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. అణగారిన వర్గం నుంచి వచ్చిన మోడీ ప్రధానమంత్రి అయితే మన దేశ భవిష్యత్తు బాగుంటుందన్నారు. పెద్దపెల్లి నియోజకవర్గం నుంచి బీజేపీ, టీడీపీ పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి జానపాటి శరత్‌బాబును, చెన్నూర్ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్ధి రాంవేణులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొనె శ్యాంసుందర్ రావు, జిల్లా నాయకులు దీక్షితులు, అందుగుల శ్రీనివాస్, తంగెడిపల్లి శ్యాంసుందర్, తెలుగు యువత నాయకులు సంజయ్‌కుమార్, రాంరెడ్డి, భాస్కర్‌రెడ్డి, మధునయ్య, కొండపాక చారి, నర్సింహులు, మోహన్, రాజన్న పాల్గొన్నారు. కేసీఆర్ విమర్శిస్తే సహించం కేసీఆర్ తమను, తమ పార్టీపై విమర్శలు చేస్తే సహించేది లేదని మంచి ర్యాల రోడ్ షోలో కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కోసం పోరాడాను అంటున్న కేసీఆర్‌పై కేసులే లేవని, తనపై ఢిల్లీతోపాటు రాష్ట్రం లోనూ అనేక కేసులున్నాయన్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లుకు బీజేపీ పట్టుబట్టి మద్దతుగా నిలివడమే కాకుండా బిల్లు ఆమోదానికి సుష్మస్వరాజ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ధరల నియంత్రణ, అవినితిని రూపుమాపడం, రైతాంగ సంక్షేమం, నిరుద్యోగులకు అండ బీజేపీ పార్టీతోనే సాధ్యమని అన్నారు. సింగరేణి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించడం, ఆదాయ పన్నును పూర్తిగా రద్దు చేసేలా కూడా బీజేపీ సాధ్యమవుతుందని అన్నారు. మొదటి సారి పిల్లలను వదిలివచ్చాను : రాజశేఖర్ తనకు చావు అంటే భయమని ఎటు వెళ్లినా అంతా కలిసి వెళతామని అయితే మొదటిసారి ఇద్దరు పిల్లలను వదిలి మంచిర్యాలకు వచ్చానని సినీ నటుడు రాజశేఖర్ అన్నారు. చనిపోతే అంతా ఒకేసారి కలిసి చని పోవాలి అంతే కాని ఒకరు విడిచి ఒకరు ఉంటే ఆ బాధలు భరించడం కష్టమన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం కోసం ఇక్కడకు వచ్చానని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అనేక డ్రామాలతో తెలంగాణ ప్రజలను మోసం చేశాయని ఆరోపిం చారు. వేల మంది ఆత్మబలిదానాలను గుర్తించకుండా ఎప్పుడో ప్రకటించాల్సిన తెలంగాణ నేడు స్వార్థం కోసం ఎన్నికల సమయంలో తెలంగాణ ఇచ్చారని తెలిపారు. వేల మంది చావుకు కారణం కేసీఆర్, కాంగ్రెస్‌లేనని అన్నారు. బీజేపీ ద్వారానే తెలంగాణ నవ నిర్మాణం సాధ్యమని తెలిపారు. బీజేపీ వల్లే మహిళా సంక్షేమం : జీవిత నేడు మహిళలపై పెరుగుతున్న ఆకృత్యాలు అన్నీఇన్నీ కాదని, మహిళా సంక్షేమం, సాధికారత బీజేపీతోనే సాధ్యమని సినీ నటి జీవిత రాజశేఖర్ అన్నారు. రోడ్ షోలో బీజేపీ మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ముల్కల్ల మల్లారెడ్డి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి శరత్‌బాబు, నాయకులు గోనె శ్యాంసుందర్‌రావు, కెవి ప్రతాప్, పురుషోత్తంజాజు, కృష్ణమూర్తి, మున్నారాజసిసోధ్య, జీవీఆనంద్కృష్ణ, గోళిరాము, తులా ఆంజనేయులు, బోకుంట ప్రభ, ముల్కల్ల సునీతారెడ్డి పాల్గొన్నారు. -
టీఆర్ఎస్ చిల్లర పార్టీ
దుబ్బాక, న్యూస్‌లైన్: టీఆర్ఎస్ చిల్లర పార్టీ అని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఉద్యమకారులను కాకుండా ఇతరులకు టికెట్లు అమ్ముకున్నాడని బీజేపీ మెదక్ లోక్‌సభ అభ్యర్థి నరేంద్రనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం దుబ్బాకలో పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రఘునందన్‌రావు అధ్యక్షతన బీజేపీసమరభేరి సభ జరిగింది. ఈ సందర్భంగా నరేంద్రనాథ్ మాట్లాడుతూ టీఆర్ఎస్తోపాటు కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మెదక్ లోక్‌సభకు పోటీ చేస్తున్న కేసీఆర్ ఓటమి భయంతోనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దమ్ముంటే తనపై గెలవాలని సవాల్ విసిరారు. చిల్లర పార్టీ అయిన టీఆర్ఎస్లోకి తాను వెళ్లేది లేదన్నారు. ప్రా ణం ఉన్నంత వరకు తాను బీజేపీలోనే కొనసాగుతానని చెప్పారు. దుబ్బాక చేనేతలను ఆదుకునేందుకు ఈ ప్రాం తంలో పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి వాటర్ ప్లాంట్ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పారు. చేనేతలకిచ్చిన హామీ ఏది? దుబ్బాక చేనేతలను ఆదుకునేందుకు రూ.25లక్షలతో ట్రస్టు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ గత ఎన్నికల్లో ప్రకటించినా ఇప్పటివరకు నేరవేర్చలేకపోయారని దుబ్బాక అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ పాలనను కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. డబ్బులున్న వారికి టికె ట్లు అమ్ముకున్న ఘనుడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్, కాం గ్రెస్‌లు మోసపూరిత పార్టీలని ఆ పార్టీల నేతలు చెప్పే మాటలను నమ్మవద్దని ప్రజలను కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బుచ్చిరెడ్డి, బీజేపీ, టీడీపీ నాయకులు బాలేష్‌గౌడ్, నరేష్, గిరీష్‌రెడ్డి, శ్రీనివాస్, కమలాకర్‌రెడ్డి, బక్కి వెంకటయ్య, రమేశ్ పాల్గొన్నారు. సమర భేరికి కిషన్‌రెడ్డి గైర్హాజర్ బీజేపీ సమరభేరి సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌రెడ్డి, సినీనటి జీవిత గైర్హాజరు కావడంతో ఆ పార్టీ శ్రేణులు, ప్రజలు నిరాశ చెందారు. కిషన్‌రెడ్డి, జీవిత సభకు విచ్చేస్తున్నారంటూ స్థాని కంగా గత రెండు రోజులుగా పార్టీ నా యకులు ప్రచారం చేశారు. సభ ప్రారంభమైనా వారు రాకపోవడంతో బీజేపీ, టీడీపీ కార్యకర్తలతోపాటు స్థానికులు అసంతృప్తికి లోనయ్యారు. సమయభావం కారణంగా వారు రావడం లేదని నాయకుల ప్రసంగాల ద్వారా తెలుసుకున్న జనం కొద్ది కొద్దిగా అక్కడి నుంచి జారుకునే ప్రయత్నం చేశారు. -
వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ మాయం
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వచ్చే ఎన్నికల నాటికి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ ఉనికి ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీ బిల్లు పార్లమెంట్లో చర్చిస్తున్నప్పుడు కేసీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో కిషన్‌రెడ్డి ప్రసంగించారు. మోడీ లేదు గీడీ లేదు.. అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఒక కేసీఆర్ వల్లనే సిద్ధించలేదని, వందలాది మంది అమరుల త్యాగం.. ఉద్యమాల ఫలితంగానే వచ్చిందని పేర్కొన్నారు. తెలంగాణలో దిక్కుతోచని స్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యామ్నాయం లేకనే ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిందన్నారు. తెలంగాణ కోసం బీజేపీ చిత్తశుద్ధితో ఉద్యమించిందని, తెలంగాణ జేఏసీలో జాతీయ పార్టీగా కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాహుల్ రాజకీయ అవగాహన లేని దద్దమ్మ అని, పప్పుసుద్ద అని ఎద్దేవా చేశారు. ప్రధాని మన్మోహన్ ముఖంలో ఏనాడూ చిరునవ్వులు చూడలేదని ఆయన పేర్కొన్నారు. ప్రధాని నవ్వకపోతే ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని ఎద్దేవా చేశారు. సోనియా, రాహుల్‌గాంధీలు మోడీ తుఫానులో కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. రజాకారుల వారసత్వమే ఎంఐఎం పార్టీ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ పార్టీ నేత అక్బరొద్దీన్ గతంలో నిర్మల్‌లో మెజార్టీ ప్రజల పండుగలను అవహేళన చేస్తూ మాట్లాడారని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రజలు ఉద్యమిస్తే కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్లి సూట్‌కేసులు తెచ్చుకున్నారని సభలో పాల్గొన్న సినీ నటి జీవిత రాజశేఖర్ విమర్శించారు. -
నేడు మోడీ రాక
జిల్లా కేంద్రంలో బహిరంగభ భారీ బందోబస్తు చర్యలు విజయవంతం చేయండి : పల్లె గంగారెడ్డి సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : భారతీయ జనతా పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్రమోడీ మంగళవారం జిల్లాకు రానున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నిజామాబాద్ నగరంలోని గిరిరాజ కళాశాల సమీపంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మోడీతో పాటు ఈ సభకు బీజేపీ జాతీయ నాయకుడు ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌లు వస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి ‘సాక్షి’కి తెలి పారు. మధ్యాహ్నం 12 గంటలకు మోడీ బహిరం గ సభకు హాజరవుతారని పేర్కొన్నారు. కాగా మోడీ సభ ఏర్పాట్లను ఇప్పటికే బీజేపీ నాయకు లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, గుజరాత్ ఇంటలిజెన్స్ అధికారులు పర్యవేక్షించారు. సభాస్థలికి దూరంగా వేసిన హెలిపాడ్‌ను సైతం అధికారులు పరిశీలించి బందోబస్తు చర్యలపై సమీక్షిం చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మోడీ సభను విజయవంతం చేయాలని పల్లెగంగారెడ్డి ప్రజలను, పార్టీ శ్రేణులను కోరారు. సభకు హాజర య్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గుజరాత్ పోలీసుల ఆధీనంలో వేదిక నిజామాబాద్క్రైం : నరేంద్ర మోడీ సభకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోడీ ఉదయం 11 గంటలకు నాందేడ్‌లో (మహారాష్ట్ర) సభ ముగిసిన అనంతరం నేరుగా జిల్లా కేంద్రానికి మధ్యహ్నం 1.45 గంటలకు చేరుకోనున్నారు. ఇప్పటికే సభ జరిగే ప్రాంతాన్ని, వేదికను గుజరాత్ స్పెషల్ పోలీస్ అధికారులు(ఐఏఎస్‌లు) స్వాధీనం చేసుకున్నారు. సభ ప్రాంగణం చుట్టూ పరిసరాలను సోమవారం బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బందోబస్తుకు జిల్లాకు చెందిన ఎస్పీ,ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు, 14 మంది సీఐలు, 15 మంది ఎస్సైలు, 1062 మంది కానిస్టేబుళ్లు, 30 మంది మహిళ కానిస్టేబుళ్లు, 120 మంది హోంగార్డులు నియమించారు. మోడి కలిసే నాయకులకు వీఐపీలకు పాస్‌లు జారీ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం వినాయక్‌నగర్ : మోడీ సభకు అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉంది. అగ్నిమాపక జిల్లా సహాయ అధికారి సతీష్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యాలయ ఆవరణలో మాక్‌డ్రిల్ కూడా నిర్వహించారు. -
లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు
సాక్షి, హైదరాబాద్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. పార్టీ నేతలు రెండు బృందాలుగా ఏర్పడి బుధవారమిక్కడ తెలంగాణకు చెందిన ఎనిమిది జిల్లాల కమిటీల నుంచి ప్రతిపాదిత అభ్యర్థుల పేర్లను సేకరించారు. పార్టీ నేతల ప్రాథమిక సమా చారం మేరకు అత్యంత గోప్యంగా జరుగుతున్న ఈ కసరత్తులో ఓ బృం దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, మరోబృందానికి బండారు దత్తాత్రేయ నాయకత్వం వహిస్తున్నారు. కిషన్‌రెడ్డి, డాక్టర్ కె.లక్ష్మణ్, మంత్రి శ్రీనివాస్ బృందం ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో భేటీ అయి ఖమ్మం, కరీంనగర్, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల పేర్లను సమీక్షిం చింది. బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, రవీంద్రరాజు బర్కత్‌పురా పార్టీ కార్యాలయంలో భేటీ అయి వరంగల్, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల జాబితాను పరిశీలించారు. వీటి తర్వాత రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలో పోటీ చేసే వారి జాబితాను ఖరారు చేయనున్నారు. పొత్తులు, ఎత్తులతో నిమిత్తం లేకుండా ఎ,బి కేటగిరీలుగా మొత్తం 17 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను రూపొందిస్తున్నారు. డబ్బులుంటే టిక్కెట్లిస్తారా? నిజామాబాద్ జిల్లా బాల్కొండ నేతలు పార్టీ నాయకుడు, ఎన్నికల కమిటీ సభ్యుడు మంత్రి శ్రీనివాస్‌పై స్థానిక నేతలు మండిపడ్డారు. డబ్బులున్నోళ్లకే టిక్కెట్లు ఇచ్చేటట్లయితే ఇక తామెందుకని ప్రశ్నించారు. ఇటీవలి వరకు టీఆర్ఎస్లో ఉండి ఎన్నికల వేళ పార్టీలో చేరిన సునీల్‌రెడ్డిని బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జిగా ఎలా నియమిస్తారని నిలదీశారు. దీంతో బిత్తరపోయిన మంత్రిశ్రీనివాస్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. 14న సదస్సు, గడ్కరీ రాక ‘తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర’ అనే అంశంపై పార్టీ లీగల్ సెల్ ఈనెల 14న హైదరాబాద్‌లో నిర్వహించే సదస్సు కు పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు నితిన్‌గడ్కరీ హాజరవుతున్నట్టు కార్యవర్గ సభ్యుడు ఎన్.రామచంద్రరావు తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పార్టీ నాయకత్వం సూచించిన పేర్లు ఇలా ఉన్నాయి! ఎ-కేటగిరి : సికింద్రాబాద్: దత్తాత్రేయ, డాక్టర్ లక్ష్మణ్ మల్కాజ్గిరి : ఇంద్రసేనారెడ్డి, ఎన్.రామచంద్రరావు మహబూబ్‌నగర్: నాగం జనార్దన్‌రెడ్డి భువనగిరి : కె.ప్రతాప్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీరాం నిజామాబాద్: యెండల లక్ష్మీనారాయణ కరీంనగర్ : సీహెచ్ విద్యాసాగరరావు, పి.మురళీధర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి బి-కేటగిరి : చేవెళ్ల: బద్దం బాల్‌రెడ్డి, శైలేష్‌రెడ్డి, డాక్టర్ ప్రేంరాజ్ హైదరాబాద్ : సతీష్ అగర్వాల్, నంద బిలాల్ వ్యాస్, రాజాసింగ్ మెదక్ : సీహెచ్ నరేంద్రనాథ్ జహీరాబాద్ : ఆలే భాస్కర్, పటేల్, పెదపల్లి : ఎస్.కుమార్, బోడ జనార్దన్ వరంగల్ : ఆర్.పరమేష్, చింతా సాంబమూర్తి,వి.జైపాల్ మహబూబాబాద్: కృష్ణవేణి నాయక్, చందా లింగయ్య దొర, ఉషాకిరణ్ ఖమ్మం : డాక్టర్ విజయ, కపిలవాయి రవీందర్ నల్లగొండ : వెదిరే శ్రీరాం, జి.మధుసూదన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ : శృతి, పుష్పలీల ఆదిలాబాద్ : శ్రీ రాం నాయక్ -
ఇదే రాష్ట్ర శాఖ నిర్ణయం: కిషన్‌రెడ్డి
-
బీజేపీది ఒంటరి పోరే
ఇదే రాష్ట్ర శాఖ నిర్ణయం: కిషన్‌రెడ్డి టీడీపీ లీకులకు రోజూ జవాబులు చెప్పలేం బీజేపీ సభ్యత్వం తీసుకున్న జీవిత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేయాలన్నదే బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కి షన్‌రెడ్డి పునరుద్ఘాటించారు. పార్టీ జాతీయ నాయకత్వం తమను సంప్రదించకుండా పొత్తులపై ఎటువంటి నిర్ణయం తీసుకోదని తెలిపారు. సినీ నటి జీవిత సోమవారం కిషన్‌రెడ్డి సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. పొత్తులపై వస్తున్న కథనాలను ఖండించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో తాను రోజూ మాట్లాడుతుంటానని, ఆయనెప్పుడూ పొత్తుల గురించి ప్రస్తావించలేదని చెప్పారు. తమ పార్టీతో పొత్తుపై టీడీపీ లీకులిస్తూ పత్రికల్లో రాయించుకుంటున్న కథనాలకు రోజూ జవాబు చెప్పలేమని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాష్ట్రంలోనూ బీజేపీకి సానుకూల పవనాలు ఉన్నాయని, అనేక మంది నేతలు తమ పార్టీలోకి వస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పార్టీ అభ్యర్థుల ఎంపిక కొనసాగుతోందన్నారు. తెలంగాణలోని లోక్‌సభ నియోజకవర్గాలకు చాలా మంది పోటీ పడుతున్నారని చెప్పారు. కొన్ని స్థానాలకు ఐదారుగురు పోటీ పడుతున్నారన్నారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే పార్టీ ఎంతకాలం ఉంటుందన్నది భవిష్యత్‌లో తేలుతుందని చెప్పారు. విభజన నేపథ్యంలో రెండు ప్రాంతాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు కాకపోయినప్పటికీ, అభ్యర్థుల ఎంపికకు పార్టీ నేతల మధ్య పని విభజన జరిగిందని తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీమాంధ్రలో జరిగే ఎంపిక కార్యక్రమాలలోనూ తాను పాల్గొంటానని తెలిపారు. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, ఇతర ప్రలోభాలకు తావు లేకుండా ఉండేందుకు కౌన్సిలర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున, లేదంటే ఆ మరుసటి రోజున చైర్పర్సన్ల ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, పుష్పలీల తదితరులు పాల్గొన్నారు. దేశ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే : దేశ సమగ్రాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సోమవారం పార్టీ రాష్ర్ట కార్యాలయంలో బీజేపీ ఎన్జీవోస్ విభాగం కన్వీనర్ వరలక్ష్మి ఆధ్వర్యంలో డాక్టర్ ఎం.ఆర్.సి.నాయుడు, డాక్టర్ జి.ఎల్.ఎన్.మల్లేశ్వరరావు, ధర్మకీర్తి, వేణుగోపాలరావు, రాము తదితరులు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు. టీడీపీతో పొత్తు ఖాయం.. రఘురామ కృష్ణంరాజు వచ్చే ఎన్నికల్లో టీడీపీతో తమ పార్టీ పొత్తు దాదాపు ఖరారైనట్టేనని ఇటీవల బీజేపీలో చేరిన రఘురామకృష్ణంరాజు చెప్పారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాలు ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన సోమవారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజనపై తాను సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ త్వరలోనే విచారణకు రానుందని తెలిపారు. నేడు బీజేపీ తెలంగాణ ఆవిర్భావ సభ నిజాం కాలేజీ మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం... సాక్షి, హైదరాబాద్: బీజేపీ మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ఆవిర్భావ సభ నిర్వహించనుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజనాథ్సింగ్, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. నిజాం కళాశాల మైదానంలో మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మంగళవారం మధ్యాహ్నం రాజ్‌నాథ్, అరుణ్ జైట్లీ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకుంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత బీజేపీనిర్వహిస్తున్న తొలి కార్యక్రమమిదే. ఈ సభ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల శంఖారావం కూడా పూరించనుంది. సభకు జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం సాయంత్రం కిషన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ గ్రేటర్ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఇతర నాయకులు పరిశీలించారు. సభను ప్రజలు జయప్రదం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. -
తెలంగాణతోనే తిరిగొస్తాం!
బీజేపీ తెలంగాణ నేతలు ఆపడం ఎవరితరమూ కాదు చర్చకు పట్టుబడతాం.. బిల్లుకు పూర్తిగా సహకరిస్తామని వెల్లడి కిషన్‌రెడ్డి, రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఢిల్లీకి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధనతోనే తాము ఢిల్లీ నుంచి తిరిగొస్తామని బీజేపీ తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు పేర్కొన్నారు. ఇక తెలంగాణను ఆపడం ఎవరితరమూ కాదని వ్యాఖ్యానించారు. పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో.. పార్టీ జాతీయ నాయకులకు అందుబాటులో ఉండేందుకు సుమారు 40 మంది బీజేపీ తెలంగాణ నేతలు సోమవారం ఢిల్లీ వెళ్లారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఉద్యమ కమిటీ చైర్మన్ టి.రాజేశ్వరరావు ఆధ్వర్యంలో రెండు బృందాలుగా.. బండారు దత్తాత్రేయ, సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, కె.లక్ష్మణ్, టి.ఆచారి, నరహరిరెడ్డి, మురళీధర్‌రావు, ఎన్.రామచంద్రరావు, పి.చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీనారాయణ, యెన్నం శ్రీనివాసరెడ్డి తదితరులు ఢిల్లీ వెళ్లారు. తెలంగాణపై లోక్‌సభలో చర్చకు తమ పార్టీ పట్టుబడుతుందని, అనంతరం జరిగే ఓటింగ్‌లో పాల్గొంటుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సహకరించాలని రాజేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ తమ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటోందని, తాము ఆ అవకాశం ఇవ్వబోమని పేర్కొన్నారు. బిల్లుకు తమ పార్టీ నేతలు పూర్తిగా సహకరిస్తారని చెప్పారు. కాగా.. తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకూ ఎవరూ నోరు మెదపొద్దని, ఏదైనా చెప్పాల్సివస్తే పార్టీ జాతీయ నేతలే మీడియా ముందుకు వస్తారని కిషన్‌రెడ్డి ద్వితీయశ్రేణి నాయకుల్ని ఆదేశించారు. కేంద్ర నాయకత్వం అసహనం! రాష్ట్రం నుంచి పార్టీ నేతలు పదేపదే ఢిల్లీ రావడం పట్ల బీజేపీ జాతీయ నాయకులు పలువురు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘మీరందరూ వచ్చి ఎవరి మీద ఒత్తిడి తేవాలనుకుంటున్నారు? మా పనిలో మేముంటాం. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బాధపడతారు. ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని పదేపదే మార్చుకోవడం మన పార్టీలో ఉండదు కదా?..’ అని సుష్మాస్వరాజ్ సహా పలువురు నేతలు అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మా సమస్యలూ పట్టించుకోవాలి: సీమాంధ్రులు రాష్ట్ర విభజనకు తాము వ్యతిరేకం కాదని, సీమాంధ్ర సమస్యల్ని పరిష్కరించాలనే కోరుతున్నామని బీజేపీ సీమాంధ్ర ఉద్యమ కమిటీ ప్రకటించింది. పోలవరం నిర్మాణానికి చట్టబద్ధత కల్పించాలన్న తమ ప్రధాన డిమాండ్‌పై తమ పార్టీ సభ్యులు పట్టుబడతారని కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్సే స్పీడ్ బ్రేకర్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ఏర్పాటుకు స్పీడ్ బ్రేకర్ తాము కాదని, కాంగ్రెస్ పార్టీయే అని బీజేపీ దుయ్యబట్టింది. ఇరు ప్రాంతాల వారితో కాంగ్రెస్ డబుల్ గేమ్ ఆడుతోందని మండిపడింది. శాంతియుతంగా తెలంగాణ ఇవ్వాలని, సీమాంధ్రకు న్యాయం చేయలనేది తమ వైఖరి అని, దాని నుంచి తప్పుకోలేదని పునరుద్ఘాటించింది. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సీమాంధ్ర, తెలంగాణ బీజేపీ నేతలు హరిబాబు, యెండల లక్ష్మీనారాయణల, శ్రీరామ్ వెధిరెలతో కలసి బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. వాజ్‌పేయి మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేస్తే, కాంగ్రెస్ ఒక్క రాష్ట్రాన్ని సరైన రీతిలో ఏర్పాటు చేయలేకపోతోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఆ పార్టీ ఉద్దేశం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అది ప్రాయోజిత ధర్నా: విద్యాసాగర్‌రావు రాష్ట్ర సమైక్యత కోసం రామ్‌లీలామైదాన్‌లో జరిగిన ధర్నా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమమని బీజేపీ రాష్ట్ర నేత విద్యాసాగర్‌రావు విమర్శించారు. పార్లమెం టు వెలుపల సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ వెనుకంజ వేసినట్టు ప్రచారం జరగడాన్ని ఖండించారు. -
‘బాబు’కు రెండు నాల్కలు
మోర్తాడ్, న్యూస్‌లైన్: తెలంగాణకు తాము వ్యతిరేకం కాదంటూనే రాష్ట్రాన్ని విభజించవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్న మాటలకు ఏ డిక్షనరీలోనూ అర్థం దొరకడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. తె లంగాణ జాగృతి జిల్లా మాజీ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి పార్టీలో చేరుతున్న సందర్భంగా బుధవారం మోర్తాడ్‌లో నిర్వహించిన బీజేపీ సమర శంఖారావసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. తెలంగాణకు వ్యతిరేకం కాదంటూనే రాష్ట్ర విభజనకు అంగీకరించబోమని చెప్పటంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సీ మాంధ్ర ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి సిగ్గుమానం ఉంటే పదవికి రా జీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటకు బీజేపీ కట్టుబ డి ఉందని మరోమారు స్పష్టం చేశారు. చిన్నరాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని, సాగు, తాగునీటి సమస్యలు ఉండవన్నారు. ఇప్పుడు దేశమంతా మోడీ గాలి వీస్తోందని, ఈ దెబ్బకు కాంగ్రెస్ కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తుందన్నారు. గుజరాత్ లాగే దేశాభివృద్ధి -యెండల లక్ష్మీనారాయణ, బీజేపీ శాసనసభ పక్షనేత నరేంద్రమోడీ నాయకత్వంలో గుజరాత్‌లాగే దేశమంతా అభివృద్ధి కానుందని, బీజేపీ అధికారంలోకి వస్తే రైతుఆత్మహత్యలు ఉండవని బీజేపీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీనారాయణ అన్నారు. గుజరాత్ నుంచి టమాటలు పలు దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, కచ్ ఎడారిలో పరిశ్రమలు స్థాపించి విద్యుత్, నీటి సౌకర్యాన్ని అందించిన ఘనత నరేంద్రమోడీకి దక్కుతుందన్నారు. ఆయన ప్రధాని అయితే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీలోకి సునీల్‌రెడ్డి సమర శంఖరావం సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా మాజీ అధ్యక్షుడు సునీల్‌రెడ్డి బీజేపీలో చేరగా, ఆయనకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కండువా వేసి ఆహ్వానించారు. సభకు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జీ రుయ్యాడి రాజేశ్వర్ అధ్యక్షత వహించారు. పార్టీ నాయకులు లోక భూపతిరెడ్డి, పెద్దోల్ల గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, ఆలూరు గంగారెడ్డి, కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, డాక్టర్ భూపతి రెడ్డి, అమృతలతారె డ్డి, నాంచారి శైలజ, గడ్డం ఆనంద్‌రెడ్డి, టక్కరి హన్మం త్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ఢమాంకర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. -
బీజేపీతోనే దేశాభివృద్ధి
మర్రిగూడ, న్యూస్‌లైన్: బీజేపీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం మర్రిగూడలో బీజేవైఎం ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గస్థాయి యువభేరిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ప్రజల కష్టాలు పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం అంతా అవినీతి, కుంభ కోణాల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. తొమ్మిది సంవత్సరాల పరిపాలన కాలంలో 10లక్షల కోట్ల రూపాయలను దోచుకుందని విమర్శించారు. రాష్ట్రంలో కిరణ్, చంద్రబాబు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకుండా శాసనసభలో అడ్డుపడుతున్నారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం ఖాయమన్నారు. 1100మంది యువకుల ఆత్మహత్యకు కారణమైన సొనియాగాంధీకి తెలంగాణలో గుడి కడతామనడం బాధాకరమన్నారు. తెలంగాణ రాష్ర్టం అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. నల్లగొండ జిల్లా ప్రజలు 60ఏళ్ల నుండి ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడడానికి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నాయకులేనని విమర్శించారు. ఫ్లోరోసిస్‌ను పూర్తిగా నివారించాలంటే తాగునీటితో పాటు సాగునీరు అందించాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నక్కలగండి, డిండి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి ఈ ప్రాంతంలో సాగు నీరు అందిస్తామని చెప్పారు. నేడు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి జనం ఇబ్బందులు పడుతున్నా వాటిని తగ్గించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజల కష్టాలు తీరాంటే నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలన్నారు. పార్టీ రాష్ట్ర కోశాధికారి గంగడి మనోహార్‌రెడ్డి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందన్నారు. పాలకుల నిర్లక్ష్యం మూలంగా వే లాదిమంది ఫ్లోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ కిరణ్‌కుమార్‌రెడ్డి యువ కిరణాల పేరుతో గాంధీ కుటుంబ సభ్యులు పేర్లను ప్రచారం చేశాడు తప్ప.. యువతకు ఒరిగిందేమీ లేదన్నారు. అంతకు ముందు మర్రిగూడ బస్టాండ్ వద్ద స్వామి వివేకానందుని విగ్రహాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు. సభలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్, కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్‌రెడ్డి, నాయకులు పల్లె శ్యాసుందర్, యాస అమరేందర్‌రెడ్డి, దోనూరి వీరారెడ్డి, తూటపల్లి రవికుమార్, కిరణ్‌కుమార్, చెన్నగోని రాములు, కూతురు లకా్ష్మరెడ్డి, దూడల భిక్షం, పాలకూర్ల జంగయ్య, నల్ల యాదయ్య, బండి వెంకట్, నర్రా పరమేష్, చెరకు శ్రీరాములు, దుబ్బ కాశయ్య, మెండు మోహన్‌రెడ్డి, పిట్టల పాండు, పగుడాల నాగేష్, భవనం మధుసూదన్‌రెడ్డి కోమటి వీరేశం, వెంకటంపేట శేఖర్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలూ... మీ హాజరు ఇదీ!
=గళమెత్తడం తర్వాత...హాజరూ అంతంతే... = నగరంలోనే ఉంటూ అసెంబ్లీకి వెళ్లని ఎమ్మెల్యేలు ఎక్కువే! = లిస్ట్‌లో మణెమ్మ టాప్ తర్వాత స్థానాల్లో నందీశ్వర్, విష్ణు సాక్షి, సిటీబ్యూరో: 2009 మే లో ఆరంభమైన ఆంధ్రప్రదేశ్ 13వ శాసనసభ పదవీకాలం మరో మూడు నెలల్లో ముగియనుంది. ఈ కాలంలో శాసనసభ 12 సార్లు(ప్రస్తుత సభ కాకుండా) సమావేశం కాగా 173 రోజుల పాటు శాసనసభా సమావేశాలు జరిగాయి. శాసనసభ రికార్డుల ప్రకారం 38.21 గంటల సమయం వృథా అయింది. 583 .29 గంటల పాటు సభా కాలం సాగింది. ఈ సభలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 శాసనసభా స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సభ్యులు రాజధాని నగరంలో నెలకొన్న సమస్యలపై అడపాదడపా గళం విప్పే ప్రయత్నం చేసినా ఉద్యమాల నేపథ్యంలో మనవాళ్లకు దక్కిన సమయం కొంతే. అయితే గళాలు విప్పకపోయినా... ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే తమ నియోజకవర్గాల ప్రజలకు కనిపించేందుకు గానీ... పార్టీ పరంగా ‘మంద బలం’లో కనిపించేందుకైనా.... అసెంబ్లీకి హాజరవడం రివాజు. అయితే గ్రేటర్ ఎమ్మెల్యేలు పార్టీ కండువాలు కప్పుకొని ‘షో’ చేసే తొలిరోజు సమావేశాలకు హాజరై మిగతా రోజుల్లో అధిక శాతం ఢుమ్మా కొట్టిన వారే ఎక్కువ. జిల్లాల్లో ప్రజల మధ్య ఉండి వందల కిలోమీటర్ల దూరంలో ఉండే హైదరాబాద్‌లోని శాసనసభకు హాజరు కాలేదంటే ఓ అర్థముంది. నగరంలోనే ఉంటూ పక్కనే ఉన్న శాసనసభకు సమావేశాల సమయంలో కూడా హాజరు కాని తీరు ప్రజల సమస్యల పట్ల, నగర అభివృద్ధి పట్ల అన్నింటికన్నా ముఖ్యంగా తమను ఎన్నుకొన్న నియోజకవర్గ వాసుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అద్ధం పడుతోంది. శాసనసభకు హాజరైనా హాజరుకాకపోయినా... మన ఎమ్మెల్యేలకు నెలవారీగా వచ్చే జీత భత్యాల వివరాలివీ... నెల జీతం: రూ. 12, 000 నియోజకవర్గ భత్యం: రూ. 83, 000 వసతి భత్యం: రూ. 25, 000 ఒకవేళ శాసనసభకు హాజరై రిజిస్టర్లో సంతకం చేస్తే రోజుకు రూ. 800 173 రోజుల్లో... 39 రోజులే మణెమ్మ హాజరీ... రాష్ట్ర 13వ శాసనసభ 2009 మేలో కొలువు దీరితే తొలి సమావేశాలు జూన్ 3 నుంచి ఐదు రోజుల పాటు సాగాయి. కొత్త మురిపెంతో ఒకటి రెండు రోజులు మినహా దాదాపుగా అన్ని రోజులు సభ్యులు హాజరయ్యారు. రెండో విడత జులై, ఆగస్టుల్లో సాగగా...అక్కడి నుంచే హాజరీ శాతం తగ్గడం మొద లై... 12వ సెషన్స్ వరకు కొనసాగుతూనే వచ్చింది. ఈ 12 సార్లు సమావేశమై 173 రోజులు సాగిన సభలో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి ఎన్నికైన టి. మణెమ్మ హాజరు కేవలం 39 రోజులే. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా ఆమె 2009 నుంచి 2011 వరకు గైర్హాజరు 76 రోజులు మాత్రమే కాగా, 2012 నుంచి ఇప్పటి వరకు 47 రోజుల సమావేశాలకు ఒక్కరోజు కూడా కాలేదు. ప్రస్తుతం సాగుతున్న 13వ విడత సమావేశాలకు కూడా ఆమె దూరంగానే ఉన్నారు. విష్ణూ సార్... ఏంటి మీరూనా..? పి. జనార్దన్ రెడ్డి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రజల ఘోషను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారు. ఐదేళ్ల అసెంబ్లీ సమావేశాల రోజుల్లో ఆయన దాదాపు సగం రోజులు (80) హాజరు పట్టికలో సంతకం కూడా చేయలేదు. ఇదే కోవలో పటాన్చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చేరారు. ఆయన కూడా ఏకంగా 85 రోజులు శాసనసభకు రాలేదు. వీరి తర్వాత రాజేంద్రనగర్ నుంచి టీడీపీ తరఫున గ్రేటర్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్(45 రోజుల గైర్హాజరు), సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ(41 రోజులు), చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఒవైసీ(40 రోజులు), కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్(37 రోజులు)లను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. శాసనసభా పక్ష నేతలు సైతం... రాష్ట్ర అసెంబ్లీలో నగరానికి చెందిన అంబర్‌పేట ఎమ్మెల్యే జి. కిషన్ రెడ్డి బీజేపీ శాసనసభా పక్ష నేతగా, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పక్ష నేతగా కొనసాగుతున్నారు. లోక్‌సత్తా నుంచి ఏకైక ఎమ్మెల్యే డాక్టర్ జయప్రకాశ్ నారాయణ(కూకట్పల్లి) ఒ క్కరే. వీరిలో జయప్రకాశ్ నారాయణ ఒక్కరే ఆరు రోజులు మినహా ఇప్పటివరకు 12 విడతలుగా శాసనసభ కొనసాగినన్ని రోజులు హాజ రయ్యారు. ఇక బీజేపీ నేత కిషన్ రెడ్డి 24 రోజు లు, అక్బరుద్దీన్ ఒవైసీ(ఎంఐఎం పక్షనేత) ఏ కంగా 40 రోజులు సభకు హాజరు కాలేదు. అక్బరుద్దీన్‌పై జరిగిన దాడి నేపథ్యంలో 2012లో హాజరీ శాతం తక్కువగా ఉందని చెప్పవచ్చు. పాషా ఖాద్రీ, ఆకుల రాజేందర్ భేష్ చార్మినార్ నుంచి ఎమ్మెల్యేగా మూడోసారి ఎన్నికైన పాషా ఖాద్రీ ఈ 13వ శాసనసభలోనే అత్యధిక రోజులు సభకు హాజరైన రికార్డు సొంతం చేసుకున్నారు. ఆయన 173 రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే సభకు హాజరుకాలే దు. ఆయన తర్వాత స్థానంలో మల్కాజిగిరి నుం చి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆకుల రాజేంద ర్, నాంపల్లి ఎమ్మెల్యే విరాసత్ రసూల్‌ఖాన్ కేవ లం నాలుగురోజులు మాత్రమే సభకు రాలేదు. యాకుత్‌పురా ఎమ్మెల్యే మోజం ఖాన్ ఐదు రోజు లు తక్కువ గైర్హాజరీతో ఉన్నారు. వీరు సమస్యలపై గొంతెత్తకున్నా... సభకు సంఖ్యాబలంలో నైనా తమ వంతు సహకారం ఇచ్చారని చెప్పవచ్చు. -
తెలంగాణ బిడ్డల త్యాగాలు పట్టవా?
సాక్షి, కరీంనగర్ : రాహుల్‌గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసమే సోనియాగాంధీ తెలంగాణ ఇస్తానంటున్నారని, పన్నెండువందల మంది తెలంగాణ బిడ్డల త్యాగాల వల్లకాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. అమరుల త్యాగాలపై సోనియా ఎన్నడూ నోరు తెరవలేదని, పార్లమెంటులో బీజేపీ లోక్‌సభాపక్ష నేత సుష్మాస్వరాజ్ మాత్రమే ఇక్కడి బిడ్డల త్యాగాలను వివరించి కేంద్రం మెడలు వంచారని అన్నారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణను ప్రకటించి వెన్నుపోటు పొడవడం వల్లనే వందలాది మంది ఆత్మత్యాగాలు చేశారన్నారు. తెలంగాణ బిడ్డల బలిదానాలకు కారణమయిన సోనియాగాంధీకి గుడి కట్టేందుకు కాంగ్రెస్ నాయకులకు సిగ్గుందా అని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ ఎడవల్లి విజయేందర్‌రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా గురువారం కరీంనగర్ సర్కస్‌గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ పోరు జాతర సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు బీజేపీ కట్టుబడి ఉందని, కాంగ్రెస్‌కు దమ్ము ధైర్యముంటే శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లుపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రేమంతా ఓట్లు, అధికారంపైనేనని, కానీ 2014లో రాజకీయ ప్రభంజనం వస్తుందని, అందులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతోపాటు ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలన్నీ కొట్టుకుపోతాయని అన్నారు. కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి పెట్టనికోట అని, ఈ జిల్లాతో బీజేపీకి అవినాభావ సంబంధం ఉందని అన్నారు. ఇక్కడి ప్రజలు బీజేపీ ఎంపీని గెలిపించి చరిత్ర సృష్టించారని, పలు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు బ్రహ్మరథం పట్టారని గుర్తుచేశారు. ఉద్యమాల పురిటిగడ్డ అయిన కరీంనగర్‌పై తమకు గౌరవం ఉందని, బీజేపీ అధికారంలోకి వచ్చాక జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అన్నారు. సింగరేణి, చేనేత, వ్యవసాయ రంగాల అభివృద్ధిపై దృష్టి పెడతామని, కరువు వల్ల గల్ఫ్‌దేశాలకు వలస వెళ్లిన వారి సంక్షేమానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నరేంద్రమోడీ కరీంనగర్ కు వస్తారని, 2014 ఎన్నికలకు ముందు గానీ, ఎన్నికల సందర్భంగా గానీ ఇక్కడకు వచ్చి మాట్లాడతారని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, ఉత్తర తెలంగాణ పూర్తిగా వెనుకబడిందని విమర్శించారు. అభివృద్ధికి మారుపేరు బీజేపీయేనని, వాజ్‌పేయి హయాంలో దేశం ప్రగతి సాధించిందని, ఇప్పుడు గుజరాత్లో మోడీ నాయకత్వంలో ప్రజలు అభివృద్ధి చూస్తున్నారని వివరించారు. గుజరాత్లో 24గంటల విద్యుత్ ఇస్తున్నారని, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి జరుగుతుందని వివరించారు. మోడీ ప్రధాని కావడానికి, ఆయన నాయకత్వంలో తెలంగాణ పునర్నిర్మాణానికి కరీంనగర్ నుంచి ఎంపీలను ఎమ్మెల్యేలను గెలిపించాలని ఆయన కోరారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిని కావాలని కోరుకుంటున్నట్టు చెప్తున్నారని, ఆయన విభజనకు అనుకూలమయితే అదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీకి ప్రధాని అయ్యే పస లేదని, ఆయనో పప్పుముద్దలాంటి వాడని ఆరోపించారు. ఈ సభలో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి పొల్సాని మురళీధర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్.విద్యాసాగర్‌రావు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు మీస అర్జున్‌రావుతోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
నేడు భువనగిరిలో బీజేపీ యువగర్జన
భువనగిరి, న్యూస్‌లైన్ : భువనగిరిలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో యువగర్జన నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పీవీ ఫౌండేషన్ అధినేత పీవీ శ్యాంసుందర్‌రావు పార్టీలో చేరుతున్న సందర్బంగా ఈ సభను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హాజరువుతున్నారని తెలిపారు. ఆయనతో పాటు నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, చింతా సాంబమూర్తి, రవీంద్రరాజు, ప్రేమ్‌కుమార్‌యాదవ్‌లు కూడా పాల్గొంటారని వివరించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యే యువ గర్జన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వివరించారు. భువనగిరి నియోజకవర్గంతోపాటు జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు యువగర్జన సభ జరిగే భువనగిరి జూనియర్ కళాశాల మైదానాన్ని బీజేపీ నాయకులు మంగళవారం పరిశీలించారు. సభావేదికతోపాటు, మైదానంలో కుర్చీల ఏర్పాటు, సభ కోసం వచ్చే కార్యకర్తలకు అవసరమైన ఏర్పాట్లను సమీక్షించారు. సమారు 10 వేల మంది కార్యకర్తలు హాజరవుతారని, ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో పెద్దఎత్తున నాయకుల కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. -
సొంతపార్టీలో ఒంటరి, రాజీనామాకు సిద్ధపడిన కిషన్‌రెడ్డి!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పార్టీలో ఒంటరి అయ్యారు. ఒకవైపు సీనియర్ల నుంచి కొరవడిన మద్దతు, మరోవైపు సీమాంధ్ర, తెలంగాణ నేతలతో సమన్వయలోపం ఆయనను ఒంటరిని చేశాయి. ఈ నేపథ్యంలో ఒకదశలో పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు కూడా ఆయన సిద్ధపడ్డారు. ఈ మేరకు కేంద్ర నాయకత్వానికి సమాచారం కూడా అందించారు. పార్టీ నిర్ణయం మేరకే తెలంగాణ ఉద్యమాన్ని నడిపానని, ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదని ఆయన తన అనుచరుల వద్ద వాపోతున్నారు. తాను పాల్గొన్న అన్ని వేదికలపైనా సీమాంధ్ర సమస్యల్ని ప్రస్తావించినప్పటికీ తన దిష్టిబొమ్మల్ని దగ్ధం చేయడం, తనకు సమాధులు కట్టడం ఆయనకు ఏ మాత్రం మింగుడుపడకుండా ఉంది. సీమాంధ్ర సమస్యలపై సదస్సులు పెట్టకపోవడంలో తన తప్పేమీ కాదని, ఆ ప్రాంత నేతలు పెడితే తాను కాదనలేదని వాదిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని సీమాంధ్ర నేతలు చెప్పినందునే తాను వెనకాడానని, అయినా తననే ఆ ప్రాంత విలన్‌గా చిత్రీకరిస్తున్నారన్నారు. ఢిల్లీకి తమతో పాటు తెలంగాణ నేతల్ని పంపవద్దని సీమాంధ్రులు కోరితే వారందర్నీ ఆపానని, అయినా ముగ్గురు ఎమ్మెల్యేలు నాగం, యెండల, యెన్నం వెళితే తానేం చేయగలనని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తెలంగాణ నేతల నుంచి కూడా ఆయనకు పూర్తిస్థాయి మద్దతు లభించడం లేదు. సీమాంధ్ర నేతలు ఇటీవల తనపై ధ్వజమెత్తిన సమయంలో ప్రొఫెసర్ శేషగిరిరావు, వి.వి.రామారావు, యెండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు వంటి సీనియర్లు ఉన్నప్పటికీ తనకు అండగా నిలవకపోవడం కిషన్‌రెడ్డిని మరింత క్షోభకు గురిచేసిందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ ఆ సమయంలో పార్టీ కార్యాలయంలో ఉండి కూడా సమావేశానికి రాకపోవడం కూడా పార్టీ అధ్యక్షుణ్ణి బాధించింది. ఇదిలా ఉంటే, కిషన్‌రెడ్డి పని తీరే ఆయన్ను పార్టీలో ఒంటరి చేసిందన్నది సీనియర్ల వాదనగా ఉంది. జిల్లా యాత్రలు మొదలు రథయాత్రల వరకు ఆయనే సొంతంగా నిర్వహించుకుంటున్నప్పుడు తాము చేయగలిగిందేముంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. 5న తెలంగాణ ఉద్యమ కమిటీ భేటీ: సీమాంధ్ర ప్రాంత నేతలు తమ సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తెలంగాణ బిల్లుకు మద్దతివ్వొద్దని అగ్రనాయకత్వానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు ఈనెల 5న హైదరాబాద్‌లో భేటీ అయి భవిష్యత్ కార్యాచరణ చర్చించనున్నారు. పార్టీ తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన తేదీలు కూడా ఈ భేటీలో ఖరారు చేస్తారని తెలిసింది. -
మలుపులు తిరుగుతున్న ‘విభజన’: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మున్ముందు పలు మలుపులు తిరగవచ్చని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమని, మరోటని ఇప్పటికే మీడియాలో పలు రకాలుగా కథనాలు వెలువడుతున్నాయన్నారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలన్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 21న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించ తలపెట్టిన సభకు మద్దతివ్వాలంటూ ఎమ్మార్పీస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో పలు విద్యార్ధి సంఘాల నేతలు శనివారం కిషన్‌రెడ్డితో భేటీ అయ్యారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతుగా ఎమ్మార్పీఎస్ సెప్టెంబర్ 29న గుంటూరులో నిర్వహించే సభకు కూడా పూర్తిస్థాయిలో బీజేపీ సహకారాన్ని కోరారు. ఓయూ సభకు తమ పార్టీ మద్దతిస్తుందని కిషన్‌రెడ్డి వారికి చెప్పారు. గుంటూరు సభలోనూ తమ పార్టీ శ్రేణులు పాల్గొంటాయని హామీ ఇచ్చారు. ‘తెలంగాణపై కేబినేట్ నోట్ తయారీకి కేవలం 60 నిమిషాలు చాలు. కానీ కేంద్రంలో చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఉండటం వల్లే ఇంత ఆలస్యం జరుగుతోంది. సీమాంధ్ర ఉద్యమం ఆ ప్రాంత అభివృద్ధికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం’ అని అన్నారు. కాగా, సీమాంధ్రలో బీజేపీ కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే ఏపీ ఎన్జీవోలు గానీ, ఇతర పార్టీలు గానీ ఎందుకు స్పందించడం లేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా సీమాంధ్రలో తమ పార్టీ నిర్వహించే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నా లు జరుగుతుంటే ఎందుకు ఖండిం చడం లేదని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబును ప్రశ్నించారు. -
కాంగ్రెస్ ఇస్తుందన్న నమ్మకం లేదు: కిషన్‌రెడ్డి
మీట్ ది ప్రెస్‌లో బీజేపీ నేత కిషన్‌రెడ్డి తెలంగాణపై సోనియా, చంద్రబాబు నాటకం ఆడిస్తున్నారు కేసీఆర్ వ్యాఖ్యలు తెలంగాణకు విఘాతమే సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు పార్టీలు ప్రయత్నించాలి ఎల్లకాలం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కుదరదు సాక్షి, హైదరాబాద్: కుట్రలు, కుతంత్రాలకు మారుపేరైన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఇప్పటికీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు. సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత 2009 నాటి పరిస్థితిని పునరావృతం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు. సోనియా గాంధీ, చంద్రబాబే ఈ నాటకం ఆడిస్తున్నారని, వీళ్లకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోడయిందని విమర్శించా రు. ఇప్పుడు సమైక్యాంధ్ర అంటున్న కాంగ్రెస్, టీడీపీ నేతలు ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. తెలంగాణపై మాట తప్పని నేరానికి తమను సీమాంధ్రలో దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణను ప్రకటించినప్పటికీ పార్లమెంటులో బిల్లు పెడితే తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని చెప్పారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం బుధవారమిక్కడ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రకటన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లక తప్పదని, ఎటువంటి ఆప్షన్లు ఉండవని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రక్రియకు విఘాతమేనని పునరుద్ఘాటించారు. కేసీఆర్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని స్పష్టం చేశారు. ఉద్రిక్తతలు, నిరసనలు వ్యక్తమవుతున్న దశలో కేసీఆర్ సంయమనం పాటించాలని సూచించారు. రాజ్యాంగం కల్పించిన విధివిధానాల మేరకు ఉద్యోగుల విభజన ఉంటుందని, ఎవరూ భయపడాల్సిన పనిలేదని భరోసా ఇచ్చారు. ప్రాణాలను అడ్డం పెట్టయినా తెలంగాణలోని సీమాంధ్రుల్ని కాపాడతామన్నారు. 2009 డిసెంబర్ 9 ప్రకటన తర్వాత జరిగిన మరణాలకు బాధ్యులైన వారిపై కోర్టుల్లో ప్రాసిక్యూషన్‌కు అవకాశం ఉందని, ప్రజలు ఆ హక్కును ఉపయోగించుకుంటే సంతోషిస్తానని చెప్పారు. కలసికట్టుగా సముదాయిద్దాం: సీమాంధ్రలో నిరసనలను చల్లార్చేందుకు అన్ని పార్టీలు నడుంకట్టాలని కిషన్‌రెడ్డి పిలుపిచ్చారు. ‘‘రాష్ట్ర విభజన ఆవశ్యకతను తెలియజెప్పి, ఉద్యమకారులను బుజ్జగించేందుకు కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐ, బీజేపీ, టీడీపీల అధ్యక్షులు కలిసికట్టుగా సీమాంధ్రలో పర్యటించాలి. ప్రజల్లో అనుమానాలను పోగొట్టాలి. కేంద్ర సహకారంతో 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి. 2 రాష్ట్రాలైతే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి. వేలాది పరిశ్రమలు వస్తాయి. రాయలసీమ వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు మంచి ప్యాకేజీ రాబడదాం. పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాకు కృషిచేద్దాం. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎల్లకాలం కొనసాగించడం కుదరదు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తామని కేంద్రం అంటే అప్పుడు స్పందిస్తాం’’ అని చెప్పారు. మీడియా సహకరిస్తే సీమాంధ్ర ఉద్యమకారుల్ని సముదాయించడం సులువేనని అభిప్రాయపడ్డారు. మజ్లిస్‌కు ఇష్టమున్నా లేకున్నా తెలంగాణ ఏర్పడితే బీజేపీదే అధికారమన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కుపోయాయన్నారు. 2014లో అధికారం తమదేనని, మోడీయే భావి ప్రధానిగా తమ పార్టీ ప్రకటించక మునుపే ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. సమావేశానికి టీజేఎఫ్ అధ్యక్షుడు అల్లం నారాయణ అధ్యక్షత వహించగా పల్లె రవికుమార్, క్రాంతికుమార్, పీవీ శ్రీనివాస్, శైలేష్‌రెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు.