వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి: కిషన్‌రెడ్డి | will help to solve for disabilities problems, says Kishan reddy | Sakshi
Sakshi News home page

వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి: కిషన్‌రెడ్డి

Published Wed, Nov 12 2014 1:01 AM | Last Updated on Wed, Aug 15 2018 8:06 PM

వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి: కిషన్‌రెడ్డి - Sakshi

వికలాంగుల సమస్యల పరిష్కారానికి కృషి: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: అంగవికలుర సమస్యలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. బీజేపీ వికలాంగుల విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వాలు అన్ని రంగాల్లోనూ వికలాంగులకే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వారికి సంబంధించిన 34 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.
 
 వికలాంగులకు అందాల్సిన ఫలాలు పక్కదారి పట్టినా, అవినీతి జరిగినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి మాట్లాడుతూ వికలాంగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు. అనంతరం ట్రైసైకిళ్లను, వాకింగ్ స్టిక్‌లను కిషన్‌రెడ్డి వికలాంగులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, అందె రాంబాబు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement