పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్‌లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన.
.. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్‌లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment