Ramagundam
-
రామగుండం సింగరేణి గనిలో ప్రమాదం.. కార్మికుడు మృతి
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని సింగరేణిలో ప్రమాదం కారణంగా ఓ కార్మికుడు మృతిచెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఠాకూర్ మక్కాన్ సింగ్.వివరాల ప్రకారం.. రామగుండం సింగరేణి సంస్థ 7 ఎల్ఈపీ గని వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఇసుక బంకర్లో హెడ్ ఓవర్ మెన్ సత్యనారాయణ దుర్మరణం చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోవడంతో ఆయన మృతిచెందాడు. ఈ నేపథ్యంలో సింగరేణి రెస్క్యూ టీం.. బంకర్ నుండి మృతదేహాన్ని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తోంది.మరోవైపు.. గని పరిసరాల్లోనే ఉన్న స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరణించిన ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది ఆయన హామీ ఇచ్చారు. -
ఊగిసలాటకు తెరపడేదెప్పుడో!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని జీవితకాలం ముగిసిన బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో 800 మెగావాట్ల కొత్త పవర్ ప్లాంట్ స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ఇటీవల రామగుండంలో పర్యటించి ప్లాంట్ సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు. సుమారు రూ.10 వేల కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ నెలకొల్పేందుకు నిర్ణయించారు. అయితే, జెన్కో, సింగరేణి సంయుక్త భాగస్వామ్యంలో గణాంకాలు తేలకపోవడంతో ప్లాంట్ పనుల్లో జాప్యమవుతోందని ఉద్యోగులు అంటున్నారు.డీపీఆర్ కోసం..పెద్దమొత్తంలో పెట్టుబడి భరించే అవకాశం లేదని సింగరేణి, తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ(జెన్కో) సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన విధివిధానాలను సింగరేణితో కలిసి వారంలోగా రూపొందించాలని జెన్కోకు రాష్ట్ర ఇంధనశాఖ గత సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీచేసింది. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)ను నెలలోగా తయారు చేయాలని జెన్కోకు సూచించింది. ఈ క్రమంలో రెండ్రోజుల క్రితం డిజిగ్ అనే సంస్థ డీపీఆర్ తయారు చేసేందుకు ప్లాంట్‌ను సందర్శించింది. పాత విద్యుత్ కేంద్రాన్ని తొలగించేందుకు వివిధ విభాగాలకు చెందిన ఇంజనీర్లను జెన్కో ప్రత్యేకంగా నియమించినట్టు విశ్వసనీయ సమాచారం.1971 నుంచి బీ–థర్మల్‌లో విద్యుత్ ఉత్పత్తిఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో రామగుండంలో 1965 జూలై 19న అప్పటి సీఎం కాసు బ్రçహ్మానందరెడ్డి 62.5 మెగావాట్ల సామర్థ్యం గల బీ–థర్మల్ పవర్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. 1971లో ఇది విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. ప్లాంట్ నిర్మాణానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం రూ.14.80 కోట్లు ఖర్చు చేసింది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ(సీఈఏ) నిబంధనల ప్రకారం 1996 వరకే ఈ ప్లాంట్‌ను నడిపించాల్సి ఉంది.కానీ, దాని జీవితకాలం పొడిగిస్తూ వచ్చారు. మరోవైపు కొన్నేళ్లుగా ప్లాంట్‌లో బాయిలర్ ట్యూబ్స్ లీక్‌కావడం, మిల్స్, టర్బైన్ విభాగాల్లో తరచూ సమస్యలు తలెత్తడంతో గుదిబండగా మారింది. విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. తరచూ షట్‌డౌన్ కావడం, ఆ తర్వాత పునరుద్ధరించేందుకు ప్రతీసారి బాయిలర్ మండించేందుకు సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో నిర్వహణ భారమైంది. అంతేకాదు.. దాని జీవితకాలం ముగియటంతో ప్లాంట్‌ను మూసి వేశారు.భాగస్వామ్యంపై పీటముడిపాత ప్లాంట్ పరిధిలో 560 ఎకరాల స్థలం, అనుభవం కలిగిన ఇంజనీర్లు, శ్రామిక శక్తి ఉన్న జెన్కోను కాదని, సింగరేణి భాగస్వామ్యంతో ప్లాంట్ ఏర్పాటు చేయడాన్ని జెన్కో ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. గతనెలలో వివిధ రూపాల్లో నిరసన తెలియజేశారు. అయినా, ప్రభుత్వం సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించేందుకు ఆసక్తి చూపుతోంది. మరోవైపు.. జెన్కో 76 శాతం, సింగరేణి 24 శాతం వాటాతో ప్లాంట్ నిర్మించేందుకు జెన్కో ఇంజనీర్లు సముఖత వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే, సింగరేణి సంస్థ తమకు 50 శాతం వాటా ఇవ్వాలని ఉన్నతస్థాయి సమావేశంలో పట్టుబట్టినట్టు సమాచారం. భాగస్వామ్యం లెక్కలు తేలి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరితేనే కొత్త ప్లాంట్ శంకుస్థాపనకు అవకాశం ఉంటుంది. అప్పుడే జెన్కో పాలకమండలి పాత ప్లాంట్‌ను మూసివేసినట్టుగా ఆమోదం తెలిపే అవకాశాలుంటాయని జెన్కో ఉద్యోగులు చెబుతున్నారు. జెన్కో, సింగరేణి సీఎండీల మధ్య సయోధ్య కుదుర్చేంచేందుకు ఉపముఖ్యమంత్రి సాయంతో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ప్రయత్నాలు చేశారు. మధ్యేమార్గంగా నిర్ణయానికి వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసేందుకు సిద్ధమయ్యేలా చూడాలని ఆయన సూచించారు. -
కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సెక్రటేరియట్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారు. కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు గ్రీన్ సిగ్నల్హైదరాబాద్- విజయవాడ రోడ్ల విస్తరణకు కేంద్రం అంగీకారంనారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేస్తాంమూసీ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారుమూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్,బీజేపీలు రాజకీయం చేస్తున్నాయిరేపు వరంగల్ రూ.4వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేస్తారువరంగల్కు ఎయిర్ పోర్ట్ 1999 నుంచి వింటున్నాం...కానీ ఏర్పాటు జరగలేదు. ఇప్పుడు ఆ కల సాకారం అయ్యిందిఎయిర్ పోర్ట్ పనులను 8 నెలల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తాంమొదటి ఏడాది లోపే విమానాల రాకపోకలు ప్రారంభమయ్యేలా పనులు పూర్తి చేస్తాంఏడాదిన్నర కాలంలోనే తిరుపతి, బెంగుళూరు, ముంబై, ఢిల్లీ లాంటి పట్టణాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయబోతున్నాం.భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్హైదరబాద్తో పాటు మరో మూడు ఎయిర్‌పోర్ట్‌లను వచ్చే నాలుగేళ్లలో సాధించుకుంటాంహైదరాబాద్ - విజయవాడ 6 లైన్ రోడ్డు వచ్చే జనవరిలో డీపీఆర్ పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో పనులు మొదలు పెట్టే ప్రయత్నం చేస్తాంఉప్పల్ ఫ్లైఓవర్ పనులు ఆలస్యంపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తిఫ్లైఓవర్ నిర్మాణాలు ప్రారంభమై ఏళ్లు గడుస్తున్నా 30 శాతం పనులు మాత్రమే అయ్యాయికేంద్రంతో మాట్లాడి వచ్చే ఏడాదిన్నర లోపు ఫ్లైఓవర్ పనులు పూర్తి చేసే ప్రయత్నం చేస్తాంవర్షాలు పడితే ఫ్లైఓవర్ కింద చాల మంది మరణించారు.. గత ప్రభుత్వం పట్టించుకోలేదురీజినల్ రింగ్ రోడ్డు పనులపై 2018లో బీఆర్ఎస్ ప్రకటన చేసింది. కానీ పనులు పూర్తి కాలేదురీజినల్ రింగ్ రోడ్డు భూ సేకరణ పనులు వచ్చే నెలలో మొదలు పెడతాంశ్రీశైలం ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తాం -
హైదరాబాద్‌కు ఆక్సిజన్ ఆగనున్నదా?
దామగుండం... గత పక్షం రోజులుగా తెలంగాణలో ఈ పేరు కలకలం రేపుతోంది. విశ్వనగరం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రక్షిత అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రమాదంలో పడింది. దేశ రక్షణ శాఖ ఆధ్వర్యంలో భారత నావికాదళానికిసంబంధించి ‘లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడార్ స్టేషన్’ను నిర్మించడానికి 2900 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ అటవీభూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఈ అడవిలో ఇప్పుడు ఈ రాడార్ కేంద్రం నిర్మాణానికి 12 లక్షల అద్భుతమైన వృక్షాలను నేలమట్టం చేయబోతున్నారు.2007లోనే రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం భారత నావికా దళం అధికారులు వచ్చి సర్వే చేసుకొని వెళ్లారు. అయితే అటవీ భూముల బదలాయింపులకు కావలసిన గ్రామ సభలు, పంచా యతీ తీర్మానాలు వంటి ప్రక్రియలన్నీ గత పదేళ్ల ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయని అంటు న్నారు. అయితే పర్యావరణ ప్రేమి కులు వేసిన ప్రజావాజ్యాలతో కోర్టులో స్టే ఉండడంతో భూమి బదలాయింపు మాత్రం జరగలేదు. కాగా గత జన వరి 24న రాష్ట్ర ప్రభుత్వం, నావికా దళానికి భూమి బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయడంతో ఇప్పుడు నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకొంటున్నాయి. ఈ విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు తులసీ చందు వెలుగులోకి తేవడంతో మళ్లీ ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవాదులు సంఘ టితం అవుతున్నారు. దామగుండం సముద్ర తీరప్రాంతానికి దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 400 మీటర్ల ఎత్తులో ఉంది. కాగా ఇంతకంటే దగ్గర, ఇంతకంటే మెరుగైన ప్రాంతాలు సముద్ర తీరప్రాంతానికి దగ్గరగా దేశంలో చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇదే వికారాబాద్ జిల్లాలో ఎన్నో ఎకరాల ఖాళీ భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వాలు వీటిని పరిశీలించకుండా ఈ పచ్చని అటవీభూమిని నావికా దళానికి అప్పజెప్పడంలో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.అటవీప్రాంతాన్ని పెనవేసుకొని ఉన్న 20 గ్రామాలు, దాదాపు 60 వేల మంది ప్రజలు అడవిని కోల్పోతున్నందుకు, పశువులకు మేత భూములు పోతున్నందుకు బాధపడుతున్నారు. దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అడవిలో 500 రకాల వైవిధ్యమైన చెట్లు, 150 రకాల ఔషధ వృక్షాలు నేల కూలుతున్నాయి. వీటితో పాటు ఎంతో అరుదైన చుక్కల జింకలు, తోడేళ్లు, ఆసియాలోనే అతిపెద్ద జింక అయిన నీల్ గాయ్, అడవిపందులు, పెద్ద కొమ్ముల సాంబార్ జింకలు, చింకారా జాతిజింకల వంటి జంతువులతో పాటు వేల రకాల పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతున్నాయి. దీనితో పాటు ఈ రాడార్ స్టేషన్ వలన వెలువడే రేడియేషన్ ప్రభావంతో చుట్టుప్రక్కల ప్రజలకు కంటి చూపు సమస్యలు, సొమాటిక్ లక్షణాలు, ఆందోళన, నిద్ర లేమి, మానసిక రుగ్మతలు, సంతానలేమి, వంధత్వం, చర్మ సమస్యలు, అవయవాల పనితీరుపై ప్రభావం, ఎలక్ట్రికల్ షాక్ వంటి సమ స్యలు పొంచివున్నాయి. దామగుండం అడవిని ఆనుకునే ఉన్న వికారాబాద్ అనంతగిరి అడవులే మూసీ నదికి జన్మస్థలం. ఈ నది ఇక్కడి నుంచే మొదలై విశ్వనగరం హైదరాబాద్ మీదుగా దాదాపు 240 కిలోమీటర్లు ప్రవహించి, నల్లగొండ జిల్లా వజీరాబాద్ సమీపంలో కృష్ణానదిలో కలుస్తుంది. ఈ రాడార్ స్టేషన్ నిర్మాణం వల్ల మూసీ నదీ పరివాహక ప్రాంతానికి, ఆ నదితో పాటు పుట్టిన ఈసా, కాగ్నా నదుల అస్తిత్వం కూడా ప్రమాదంలో పడింది.ఈ దామగుండం అటవీప్రాంతం విశ్వనగరం హైదరాబాద్‌కు కేవలం 75 కిలోమీటర్ల దూరంలోఉంది. రాజధాని నగరానికి ప్రధాన ఆక్సిజన్ వనరులు కూడా ఇక్కడ విస్తరించి ఉన్న అడవులే. ఇప్పుడు 2,900 ఎకరాలలో పచ్చదనం కోల్పోవడం అంటే విశ్వనగరానికి ఆక్సిజన్ సిలిండర్ తీసివేస్తున్నట్లే! ఇలాంటి ప్రాజెక్టుల విషయంలో సమగ్ర పరి జ్ఞానం తెలియని గ్రామీణ ప్రజలను, ఆ యా పంచాయతీ పెద్దలను గ్రామ సభలు, తీర్మా నాల పేరుతో తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మోసం చేస్తుంటే వారు ఎవరికి చెప్పుకోగలరు? ఇప్పుడీ దామగుండం పరిరక్షణ పర్యావరణ బాధ్యత స్థానిక ప్రజలే తేల్చుకోవాలి. వారికి సరియైన దిశానిర్దేశం చేయా ల్సిన బాధ్యత పర్యావరణ పరిరక్షకులు, ప్రజాస్వామ్యవాదులపై ఎంతైనా ఉంది.– మోతె రవికాంత్ ‘ సేఫ్ ఎర్త్ ఫౌండేషన్ అధ్యక్షులు -
చెల్లికి ఫోన్ చేసి.. బావను చంపేసిన అన్న
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): ప్రేమపెళ్లి వ్యవహారం ఓ యువకుడి ప్రాణం తీసింది. ‘నిన్ను చూడాలని ఉంది చెల్లీ.. సద్దుల బతుకమ్మకు మీ ఇంటికి వస్తున్నా’అని తన చెల్లికి ఫోన్ చేశాడు ఓ అన్న. నిజమేనని నమ్మిన ఆ చెల్లి.. తన భర్తను ఎదురు పంపించింది. అయితే అన్నతోపాటే, ఆమె మాజీ భర్త ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే చెల్లిని ఓ గదిలో బంధించిన అన్న.. బయట గడియపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో చెల్లి భర్తపై దాడిచేసి చంపేశాడు.పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఏసీపీ రమేశ్ కథనం ప్రకారం.. యైటింక్లయిన్‌కాలనీలోని హనుమాన్‌నగర్‌కు చెందిన వడ్డాది వినయ్‌కుమార్(25) గోదావరిఖని సింగరేణి ఏరియా ఆస్పత్రిలో స్కావెంజర్‌గా పనిచేస్తున్నాడు. అదే ఏరియాకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితతో అతడికి పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకోగా, రెండు కుటుంబాలు అంగీకరించలేదు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ సాగుతుండగానే వినయ్ ఆ వివాహితను పెళ్లి చేసుకున్నాడు. యైటింక్లయిన్‌కాలనీ హనుమాన్‌నగర్‌లో ఇంట్లో ఇద్దరూ అద్దెకు ఉంటున్నారు. అయితే తమ కొడుకు ఇష్టాన్ని కాదనలేక వినయ్ తల్లిదండ్రులు అద్దె ఉంటున్న ఇంటి వివరాలు ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు.చదవండి: కట్టుకున్నోడే కాలయముడయ్యాడుఅయితే సద్దుల బతుకమ్మ వేడుకను సాకుగా తీసుకున్న ఆ వివాహిత సోదరుడు.. ఆమెకు ఫోన్‌చేసి చూడాలని ఉందన్నాడు. అడ్రస్ తెలియదని, వినయ్‌ను తన వద్దకు పంపించాలని కోరాడు. ఇది నిజమని నమ్మిన ఆమె వినయ్‌కు విషయం చెప్పి తన అన్నను తీసుకురమ్మని పురమాయించింది. వినయ్ వివాహిత అన్నను తీసుకొని ఇంటికొచ్చాడు. ఆయన వెంట మాజీ భర్త కూడా వచ్చాడు. ఇంటికి రాగానే వివాహిత అన్న, మాజీ భర్త వినయ్‌పై విచక్షణా రహితంగా దాడిచేశారు. కత్తితో పొడిచి హత్య చేశారు. ఏసీపీ రమేశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ ప్రసాద్‌రావుతో కలిసి వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మిన్నంటిన రోదనలుకాగా కాలనీలో ఒక వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా మరో వైపు హత్య జరగడంతో సంచలనంగా మారింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన ఏకైక కుమారుడు హత్యకు గురికావడంతో ఆ కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి. ప్రేమపెళ్లే తన కుమారున్ని పొట్టనబెట్టుకుందని మతుని తండ్రి కుమార్ రోధిస్తూ వెల్లడించారు. -
రామగుండంలో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్: భట్టి విక్రమార్క
సాక్షి,పెద్దపల్లిజిల్లా: రామగుండంలో 800 మెగావాట్ల జెన్కో పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శనివారం(ఆగస్టు31) భట్టి విక్రమార్క రామగుండం ప్రాంతంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జెన్కో పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ‘భవిష్యత్తులో సింగరేణి సంస్థ, జెన్కో సహకారంతో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం. ఇక్కడ ఉన్న పాత ప్లాంటు 50 ఏళ్లుగా రాష్ట్రానికి వెలుగులు ఇచ్చింది. ఈ ప్రాంతంలో పర్యటించిన సమయంలో నేను ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ ప్రభుత్వంలో ప్లాంటు ప్రారంభించి మాట నిలబెట్టుకుంటా. వీలైనంత త్వరగా ప్లాంట్ నిర్మాణం ప్రారంభిస్తాం’అని భట్టి తెలిపారు. -
తల్లీ సాహితీ.. మాకు దిక్కెవరమ్మా..!
జ్యోతినగర్(రాముండం): ‘అమ్మా సాహితీ.. మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా తల్లీ.. నీవు చక్కగా చదువుకుని భవిష్యత్‌లో ఎంతో ఎదగాలని ఆశించాం.. కానీ మమ్మల్ని ఇలా విడిచి వెళ్తావని అనుకోలేదమ్మా’ అని ఆ తల్లి లక్ష్మి రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. ఎన్టీపీసీ ఆపరేషన్ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న మల్లెపల్లి రాజలింగు–లక్ష్మి దంపతులకు సాత్విక, సాహితి కుమార్తెలు ఉన్నారు. పర్మినెంట్ టౌన్షిప్లో నివాసం ఉంటున్నారు. పెద్దకుమార్తె సాత్విక డిగ్రీ చదువుతోంది. చిన్నకుమార్తె సాహితి(15) ఎన్టీపీసీ పీటీఎస్‌లోని సెయింట్ క్లేర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి సాహితి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు వెంటనే టౌన్‌షిప్‌లోని ధన్వంతరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రికి రెఫర్ చేశారు. అయితే, అక్కడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాహితి సోమవారం తెల్లవారుజామున మృతి చెందింది. ఆమె మృతికి సంతాప సూచకంగా హైస్కూల్‌కు సెలవు ప్రకటించారు.వైద్యులపై గుర్తింపు సంఘం గరం?సాహితి గుండెపోటుతో మృతి చెందడంతో వైద్య బృందంపై ఉద్యోగ గుర్తింపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్పిస్తే సరైన వైద్యం అందించ లేదని ఆరోపించారు. ప్రథమ చికిత్స సైతం తూతూమంత్రంగా చేసి కరీంనగర్‌కు రెఫర్ చేశారని ధ్వజమెత్తారు. ప్రమాదకర పరిస్థితిలో ఉన్న విద్యార్థినికి చికిత్స అందించడంతో ఆస్పత్రి వర్గాలు విఫలమయ్యాయని విమర్శించారు. జాతీయ రంగ సంస్థ ఎన్టీపీసీ ఆస్పత్రిలో సరైన సమయంలో సరైన వైద్యం అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. గుండెపోటు వచ్చిన విద్యార్థినిని కరీంనగర్‌కు రెఫర్ చేయడంతో ఆమెకు సరైన సమయంలో చికిత్స అందకపోవడంతోనే మృతి చెందిందని ఆరోపించారు. వైద్యుల తీరుపై యాజమాన్యం విచారణ చేపట్టాలని వారు కోరారు. -
రామగుండం ఓపెన్‌కాస్ట్‌లో ప్రమాదం, ఇద్దరు మృతి
పెద్దపల్లి, సాక్షి: రామగుండంలోని ఓపెన్ కాస్ట్ గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓసీపీ-2లో పైప్‌లైన్ లీకేజీని అరికట్టేందుకు నలుగురు కార్మికులు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు మీదపడ్డాయి. మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు కార్మికులు ఊపిరి ఆడక మృతి చెందారు. మృతులు ఫిట్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ మజ్దూర్ విద్యాసాగర్‌గా గుర్తించారు. మృతదేహాలను గోదావరి ఖని ఆస్పత్రికి తరలించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతని వివరాలు తెలియాల్సి ఉంది.ఈ ప్రమాదం గురించి తెలియగానే కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. రామగుండం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ -2 గనిలో పైప్‌లైన్ మరమ్మత్తులు చేస్తుండగా మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మృతిచెందిన ఘటన విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఒక ప్రకటన విడుదల చేశారాయన. .. వర్షాకాలం గనుల్లో నిలిచిపోయే నీటిని తోడి వేసేందుకు అవసరమైన పంపులు, వాటర్ పైప్లైన్ల మరమ్మత్తుల సందర్భంగా ఈ ఘటన జరిగిందని తెలిసింది. కార్మికుల భద్రత విషయంలో అలసత్వానికి తావు లేకుండా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సింగరేణి అధికారులకు సూచిస్తున్నాను’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. -
అంతలో వెళ్లమని.. ఇంతలో ఆగమని..
సాక్షి, హైదరాబాద్: రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేతపై రాజకీయ రగడ జరుగుతోంది. 1971లో 62.5 మెగావాట్ల విద్యుదుత్పత్తితో ప్రారంభమైన ఈ విద్యుత్ కేంద్రం జీవితకాలం ఎప్పుడో ముగిసింది. అయినా మరమ్మతులు చేస్తూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సాంకేతిక సమస్యలతో గత నెల 4వ తేదీ నుంచి విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఇకపై మరమ్మతులు చేసినా ఫలితం ఉండదనే భావనకు జెన్కో వచ్చింది. అక్కడున్న 65 మంది ఇంజనీర్లు, 230 మంది అపరేషన్స్ అండ్ మెయింటనెన్స్(ఓ అండ్ ఎం) సిబ్బంది, మరో 40 మంది అకౌంట్స్, పీఎంజీ విభాగాల్లో పనిచేస్తుండగా, జూన్ 4 నుంచి వీరికి పనిలేకుండా పోయింది. అక్కడి సబ్‌స్టేషన్, ఇతర అత్యవసర వ్యవస్థల నిర్వహణకు అవసరమైన సిబ్బంది మినహా మిగిలిన ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులకు విడతల వారీగా రాష్ట్రంలోని ఇతర విద్యుత్ కేంద్రాలకు బదిలీ చేయాలని జెన్కో నిర్ణయం తీసుకుంది.తొలిదఫాలో 44 మంది ఇంజనీర్లు, నలుగురు కెమిస్ట్‌లను నిర్మాణదశలో ఉన్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి డెప్యూటేషన్‌పై బదిలీ చేస్తూ గత నెలలో జెన్కో ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఉత్తర తెలంగాణకు చెందిన ఓ మంత్రి, మరో ఎమ్మెల్యే ఒత్తిడితో రెండురోజులకే ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ మరో ఉత్తర్వులు జారీ చేయాల్సి వచ్చింది. ఈ విద్యుత్ కేంద్రానికి సంబంధించిన ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు నెలకు రూ.4 కోట్లకు పైగా వ్యయం అవుతుండగా, ఉత్పత్తి నిలిచిపోయి ఉద్యోగులందరూ ఖాళీగా ఉండడంతో జెన్కోకు ఆర్థికంగా భారంగా మారింది. కొత్త విద్యుత్ కేంద్రంనిర్మించే వరకు వారిని అక్కడే కొనసాగించాలని ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్టు చర్చ జరుగుతుండగా, కొత్త కేంద్రం నిర్మాణానికి 4 నుంచి 8 ఏళ్లు పట్టనుందని జెన్కో అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నా...రామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్వహణ భారంగా మారినా స్థానికంగా వస్తున్న రాజకీయ ఒత్తిళ్లతో గత ఐదేళ్లుగా నెట్టుకొస్తున్నారు. 2019 మార్చి 31లోగా ఈ విద్యుత్ కేంద్రాన్ని మూసివేయాలని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) గతంలో ఆదేశాలు జారీ చేయగా, రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తితో గడువును 2029 వరకు పొడిగించింది. 62.5 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి జరగడం లేదు. గరిష్టంగా 45 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేస్తుండగా, అధిక బొగ్గు వినియోగిస్తుండడంతో ఆర్థికంగా గిట్టుబాటు కావడం లేదు. కాలుష్యం సైతం అనుమతించిన స్థాయికి మించి జరుగుతోంది. దాదాపుగా రూ.2 కోట్లు ఖర్చు చేసి బయటి నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతులు నిర్వహిస్తే 15 రోజుల్లో ఉత్పత్తిని ప్రారంభించి మరికొన్ని రోజుల పాటు నెట్టుకు రావొచ్చని, పూర్తిస్థాయిలో మరమ్మతుల నిర్వహ ణకు కనీసం రూ.30కోట్లకు పైగా ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు పేర్కొంటున్నాయి. అయినా ఎంత కాలం పనిచేస్తుందో చెప్పలేని పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో జెన్కో ఆర్థిక ప్రయోజనాల రీత్యా ఈ విద్యుత్ కేంద్రాన్ని శాశ్వతంగా మూసివేయక తప్పని పరిస్థితి నెలకొంది. ‘సూపర్ క్రిటికల్’ నిర్మాణ బాధ్యతపై జెన్కో అభ్యంతరంరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థానంలో అక్కడే 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనపై జెన్కో ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరే కిస్తున్నారు. కొత్త విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ఆధ్వ ర్యంలోనే నిర్మించాలని కోరుతున్నారు. వాస్తవా నికి నైజాం ప్రభుత్వం 1931లో రామగుండంలో ఏ–థర్మల్, బీ–థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణా నికి 3000 ఎకరాలు కేటాయించింది. ఏ– థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని గతంలోనే మూసివే యగా, ఇందుకు సంబంధించిన స్థలంలో దాదాపు 1200 ఎకరాలను 90వ దశకం మధ్యలో బీపీఎల్ అనే సంస్థకు కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం కోసం ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇక బీ–థర్మల్ కేంద్రానికి దాదాపు 700 ఎకరాల స్థలం ఉండగా, కబ్జాలు పోగా 550 ఎకరాలే మిగిలాయి. 800 మెగావాట్ల కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఈ స్థలం సరిపోదు. బీపీఎల్‌కు కేటాయించిన స్థలంలో కొంత స్థలాన్ని జెన్కోకు అప్పగిస్తే కొత్త విద్యుత్ కేంద్రం నిర్మించుకుంటామని జెన్కో ఉద్యోగులు కోరుతున్నారు. -
మూసివేత దిశగా రామగుండం బీ– థర్మల్ విద్యుత్ కేంద్రం?
రామగుండం: నిర్వహణ భారం..జీవితకాలం ముగియడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 62.5 మెగావాట్ల బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. వారంరోజులు క్రితం 38 మంది ఇంజనీర్లు, ఐదుగురు సబ్ ఇంజనీర్లు, ఒకరు సీనియర్ కెమిస్ట్, నలుగురు కెమిస్ట్‌లను యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)కు డిప్యుటేషన్ పేరిట బదిలీ చేశారు. దీంతో మూసివేత తప్పదనే ప్రచారం జరుగుతోంది. యూనిట్ ట్రిప్ అయినా... ఈ నెల 4వ తేదీన యూనిట్‌లోని మిల్స్ విభాగంలో సాంకేతిక సమస్యతో తలెత్తింది. దీంతో యూనిట్ ట్రిప్ అయ్యి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. విద్యుత్ సౌధ నుంచి అనుమతులు రాకపోవడంతో పునరుద్ధరణ చేపట్టలేదు. పదిరోజులుగా ఖాళీగా ఉంటున్న ఇంజనీర్లు, ఉద్యోగులను యాదాద్రి, భద్రాద్రి, కేటీపీఎస్ తదితర జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. 1965లో ప్లాంట్ ప్రారంభం » అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం కాసు బ్రహా్మనందరెడ్డి 1965 జూలై 19న రామగుండంలో 62.5 మెగావాట్ల సామర్థ్యంగల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించారు. కరెంట్ ఉత్పత్తితోపాటు పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్) సాధిస్తూ రికార్డులు నమోదు చేసింది. అయితే విద్యుత్ కేంద్రం స్థాపించి ఆరు దశాబ్దాలు కావడంతో నిర్వహణ భారంగా మారింది. » బాయిలర్, టర్బయిన్, మిల్స్, ట్రాన్స్ఫార్మర్ తదితర విభాగాల్లో ఏడాదిగా తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో తరచూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. » ఈ జనవరి నుంచి సమస్య మరింత జటిలమైంది. కాలం చెల్లిన విద్యుత్ కేంద్రం కావడంతో విడిభాగాల లభ్యత లేదు. పాతవాటితోనే సర్దుబాటు చేసి విద్యుత్ కేంద్రాన్ని ఉత్పత్తి దశలోకి తీసుకొస్తున్నారు. » సాంకేతిక సమస్యలతో మళ్లీమళ్లీ ట్రిప్పవుతూనే ఉంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి పునరుద్ధరణకు రూ.25 లక్షలకుపైగా వ్యయం అవుతోంది. ఆదాయం కన్నా వ్యయమే అధికంగా ఉండడంతో మూసివేతే పరిష్కారమని భావిస్తున్నట్టు సమాచారం. ∙వాస్తవానికి థర్మల్ విద్యుత్ కేంద్రాల జీవితకాలం 25 ఏళ్లే. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ జీవితకాలం ఎప్పుడో ముగిసిపోయింది. కొత్త ప్లాంటు ఏర్పాటు తప్పనిసరిరామగుండం బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం సమీపంలోనే 800 మెగావాట్ల సామర్ధ్యం గల కొత్త విద్యుత్ కేంద్రం స్థాపిస్తాం. అప్పటివరకు పాత విద్యుత్ కేంద్రాన్ని కొనసాగించాలని ఎనర్జీ సెక్రటరీ రిజ్వీ, డైరెక్టర్లను కలిసి విన్నవించా. అత్యధిక సంఖ్యలో ఇంజనీర్లు ఉండడంతో కొందరిని యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాలకు డిప్యుటేషన్‌పై బదిలీ చేస్తున్నారు. – మక్కాన్‌సింగ్ ఠాకూర్, రామగుండం, ఎమ్మెల్యే -
కరెంట్ కొంటారా .. లేదా ?
సాక్షి, హైదరాబాద్: రామగుండంలోని రెండో థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నేషనల్ థర్మల్ పవర్‌కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు సమ్మతి తెలపకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలకు ఆ విద్యుత్‌ను సరఫరా చేస్తామని హెచ్చిరించింది. రెండో విడత విద్యుత్ కేంద్ర నిర్మాణంలో పురోగతిపై సమాచార హక్కుచట్టం కింద జర్నలిస్టు ఇనగంటి రవికుమార్ వివరాలు కోరగా, ఎన్టీపీసీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది. ఎన్టీపీసీ విధించిన గడువు ముగిసినా, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలియజేయలేదు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధనశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయ పరిశీలనలో ఉన్నట్టు తెలిసింది. మూడు లేఖలు రాసినా స్పందించని రాష్ట్రం తెలంగాణలో విద్యుత్ కొరత తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టం–2014లో కేంద్రం హామీ ఇవ్వగా, తొలి విడత కింద రామగుండంలో 1600(2గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇటీవల ఎన్టీపీసీ పూర్తి చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఉంటేనే కొత్త విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి బ్యాంకులు రుణాలు అందిస్తాయి. తొలి విడత ప్రాజెక్టులోని 1600 మెగావాట్ల విద్యుత్‌లో 85 శాతం కొనుగోలు చేసేందుకు తెలంగాణ డిస్కంలు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఎన్టీపీసీతో ఒప్పందం(పీపీఏ) చేసుకున్నాయి. ఈ ఒప్పందం ఆధారంగానే బ్యాంకుల నుంచి రుణాలు సమీకరించి తొలి విడత విద్యుత్ కేంద్రాన్ని ఎన్టీపీసీ నిర్మించింది. రెండో విడత కింద 2400 (3గీ800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పనులు ప్రారంభించడానికి ఎన్టీపీసీ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు అవసరమైన రుణాల సమీకరణకు విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ గతేడాది అక్టోబర్ 5న లేఖ రాసింది. స్పందన లేకపోవడంతో మళ్లీ గత జనవరి 9న రెండోసారి లేఖ రాసింది. అయినా స్పందన లేకపోవడంతో జనవరి 29న మూడోసారి రాసిన లేఖలో 12రోజుల్లోగా అనగా, గత ఫిబ్రవరి 10లోగా సమ్మతి తెలపాలని అల్టిమేటం జారీ చేసింది. సమ్మతి తెలపని పక్షంలో తెలంగాణ రెండో విడత ప్రాజెక్టు నుంచి విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా లేదని భావించి ఇతరులకు ఆ విద్యుత్ సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఆసక్తి చూపిస్తే తొలి ఏడాది యూనిట్‌కు రూ.4.12 చొప్పున విద్యుత్ విక్రయిస్తామని తెలిపింది. దేశంలో గణనీయంగా పెరిగిన విద్యుత్ డిమాండ్‌కు తగ్గట్టూ విద్యుదుత్పత్తి సామర్థ్యం పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని, సత్వరంగా ఒప్పందం చేసుకోవాలని సూచించింది. తొలి విడత ప్రాజెక్టు వ్యయం రూ.11,572 కోట్లు రెండో విడత ప్రాజెక్టుకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్టుకు ఆమోదం లభించిందని, టెక్నికల్ స్టడీ పురోగతిలో ఉందని ఎన్టీపీసీ తెలిపింది. ఎల్లంపల్లి బ్యారేజీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నీటి కేటాయింపులు చేసిందని వెల్లడించింది. శక్తి పాలసీ కింద ఈ ప్రాజెక్టుకు సింగరేణి బొగ్గు కేటాయిస్తూ గత జనవరి 3న స్టాండింగ్ లింకేజీ కమిటీ నిర్ణయం తీసుకుందని చెప్పింది. 1600 మెగావాట్ల తొలి విడత ప్రాజెక్టు నిర్మాణానికి గత జనవరి 31 వరకు రూ.11,572 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. -
రామగుండంలో సీ అండ్ టీ ట్రాక్‌పై తప్పిన ప్రమాదం
పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే అండర్ బ్రిడ్జ్ సమీపంలోని క్యారేజ్&వాగన్ (C&W) ట్రాక్‌పై తప్పిన ప్రమాదం. లూప్ లైన్లో నిలిచి ఉన్న మిషన్‌ను గూడ్స్ రైలు భోగీలు ఢీకొట్టాయి. గూడ్స్ రైలు నుంచి లింకు ఊడిపోవడంతో 8 భోగీలు వేరు అయ్యాయి. కిందకు విడిపోయిన భోగీలు వేగంగా వెళ్లాయి. యూటీ మిషన్‌ను ఢీకొట్టడంతో ట్రాక్ ఎండ్ గోడపైకి యూటీ మిషన్ దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో ఆపరేటర్ మిషన్‌లో నిద్రిస్తున్నాడు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి ఆపరేటర్ బయటపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
‘నాన్నా.. వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి’
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): ‘నాన్నా.. కట్నం వేధింపులు భరించలేకపోతున్నా.. చావుతోనే నాకు విముక్తి.. అందుకే నా బాబుతో కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నా.. (రియల్లీ ఐ వాంట్ టూ డై విత్ మై బేబీ) నన్ను క్షమించండి’అంటూ ఓ వివాహిత తండ్రికి మెసేజ్ పంపి ఆత్మ హత్య చేసుకుంది. పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై వెంకట్ కథనం ప్రకారం.. రామగుండం రైల్వేస్టేషన్ ఏరియా భరత్‌నగర్‌కు చెందిన మాణిక్యాల సదానందరెడ్డి కూతురు ధనశ్రీ.. అదే కాలనీకి చెందిన దండుగుల రాకేశ్ ప్రేమించుకున్నారు. కుటుంబ సభ్యులు కాదనడంతో వారిని ఎదిరించిన ధనశ్రీ గతేడాది మేలో రాకేశ్‌ను ఆదర్శ వివాహం చేసుకుంది. అయితే, కొంతకాలం తర్వాత ధనశ్రీకి పుట్టింటితో సఖ్యత కుదిరింది. రెండు కుటుంబాలు కలిసి పోయాయి. అయితే పెళ్లి తర్వాత రాకేశ్ ఏ నిచేయకుండా నిత్యం మద్యం తాగడం, కట్నం తేవాలని భార్యను వేధించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు బాధితురాలు మొరపెట్టుకోగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి రూ.50 వేలను ధనశ్రీ అత్తింటి వారికి అప్పగించారు. ధనశ్రీ కూడా ఇంటివద్ద ట్యూషన్లు చెబుతూ కొంత ఆదాయం సంపాదిస్తోంది. ఇలా సాఫీగానే సాగిన క్రమంలో వారికి కుమారుడు (4 నెలలు) పుట్టాడు. అయినప్పటికీ రాకేశ్ ప్రవర్తనలో మార్పురాలేదు. భర్త మద్యం తాగి కట్నం కోసం వేధించడం, అత్తామామల సూటిపోటి మాటలతో ధనశ్రీ విసిగిపోయింది. ఆదివారం తన తల్లిగారింటికి వెళ్లి అత్తింటి వేధింపులపై వారితో మొరపెట్టుకుంది. వారు సర్దిచెప్పగా సాయంత్రానికి తిరిగి అత్తగారింటికి వచి్చన ధనశ్రీ.. గదిలో ఎవరూ లేని సమయంలో తాను బిడ్డతో కలిసి చనిపోతున్నానంటూ తండ్రికి ఫోన్లో మెసేజ్ పెట్టింది. తొలుత బాబుతో కలిసి ఉరివేసుకోవాలని అనుకున్నా.. బిడ్డపై మమకారంతో బాబును వదిలేసి తానే దూలానికి చీరతో ఉరి వేసుకుంది. చప్పుడు కావడంతో గదిలోకి వచ్చిన కు టుంబ సభ్యులు.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ధనశ్రీని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రవీకరించారు. తన కూతురు మృతికి ఆమె అత్తింటివారే కారణమని సదా నందరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
రామగుండం విద్యుత్ కేంద్రంలో మంటలు
రామగుండం: పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 50 ఏళ్ల నాటి బీ–థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి దాటాక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో టర్బయిన్, బాయిలర్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. నిప్పురవ్వలు ఎగసిపడటంతో... రామగుండంలోని బీ–థర్మల్ విద్యుత్ కేంద్రంలో కాలం చెల్లిన పరిజ్ఞానం వినియోగిస్తు న్నారు. ఇందులోని మిల్స్ నుంచి బాయిలర్‌లోకి బొగ్గును డంపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో వివిధ యంత్రాలు, కంట్రోల్ రూం వరకు బొగ్గుపొడి (కోల్‌డస్ట్) వెదజల్లి నట్లుగా నిండిపోతూ ఉంటుంది. అయితే బాయిలర్ ప్రాంగణంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, నిప్పురవ్వలు బొగ్గుపొడిపై పడటంతో మంటలు చెలరేగి సమీపంలోని రబ్బర్ కేబుల్స్‌కు అంటుకొని విద్యుత్ కేంద్రం ట్రిప్ అయిందని అధికారులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సకాలంలో ఫైరింజిన్ ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చిందని చెప్పారు. పునరుద్ధరించిన కొన్ని గంటల్లోనే ట్రిప్.. ఈ కేంద్రంలో సెప్టెంబర్ 12 నుంచి వార్షిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు వాటిని నెల రోజుల్లో పూర్తిచేసి విద్యుత్ కేంద్రాన్ని తిరిగి ఉత్పత్తి దశలోకి తీసుకురావాలనుకున్నా పరిస్థితులు అనుకూలించక 45 రోజులు పట్టింది. ఈ నెల 20న అర్ధరాత్రి ఉత్పత్తి దశలోకి తీసుకురాగా కొన్ని గంటలపాటు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. ఈ క్రమంలోనే భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో మరోసారి విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మళ్లీ పునరుద్ధరణ పనులు పూర్తి చేసేందుకు కనీసం 10 రోజులపైనే పడుతుందని అధికారులు అంటున్నారు. మరోవైపు ఆస్తి నష్టం వివరాలను అధికారులు ఇంకా వెల్లడించలేదు. సాధారణంగా విద్యుత్ కేంద్రం జీవితకాలం 25 ఏళ్లుకాగా బీ–థర్మల్ విద్యుత్ కేంద్రం స్థాపించి సుమారు 50 ఏళ్లు గడుస్తోంది. విద్యుత్ సౌధకు చెందిన పలువురు నిపుణులు ఇటీవల ఈ ఉత్పత్తి కేంద్రాన్ని పరిశీలించి 2029 వరకు దీన్ని కొనసాగించేందుకు అవకాశం ఉందని అంచనా వేశారు. -
Karimnagar: విమానం ఎగిరేనా? ఏళ్లుగా పరిష్కారం నోచుకొని సమస్యలు ఇవే..
సాక్షి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 31,12,283 లక్షల మంది ఓటర్లు ఈసారి ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్ల సంఖ్య రాష్ట్రం మొత్తం ఓటర్లలో 10వ శాతం కావడం గమనార్హం. పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్లో కరీంనగర్.. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం నుంచే తన ఘనత చాటుకుంటోంది. రాజకీయంగా ప్రభావం చేయగలిగిన ఈ జిల్లాలో కొన్ని సమస్యలు ఏళ్లుగా పరిష్కారం నోచుకోకుండా మిగిలిపోయాయి. గోదా‘వర్రీ’ పెద్దపల్లి జిల్లాలో ప్రవహించే గోదావరి నదీజలాలు కాలుష్యపు కోరల్లో చిక్కుకున్నాయి. రామగుండం కార్పొరేషన్ డ్రైనేజీ నీరు, రసాయనాలను నేరుగా నీటిలోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం బ్యారేజీల నిర్మాణంతో ఏడాది పొడువునా నీరు నిల్వ ఉంటుంది. రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోజుకు సుమారు 70మిలియన్ లీటర్ల నీటిని ప్రజలు వినియోగిస్తున్నారు. అందులోంచి రోజుకు 40మిలియన్ లీటర్ల మురుగు గోదావరిలో కలుస్తుంది. ఆదాయపన్ను, మారుపేర్లు, ప్రైవేటీకరణ భూతం రామగుండం సింగరేణిలో రెండున్నర దశాబ్దాల కాలంగా మారుపేర్ల మార్పిడికి చట్టబద్ధత కోసం కోసం కార్మికులుఎదురుచూస్తున్నారు. గతంలో ఈ సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చినా ఇంకా అమలుకు నోచుకోలేదు. మరోవైపు తమకు ఆదాయపు పన్ను మినహాయించాలని డిమాండ్ కోరుతున్నారు. అలాగే కోల్ బ్లాకులను ప్రైవేటు పరం చేయవద్దని కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. విమానం ఎగిరేనా..? 1980లో కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ అధినేత బీకే బిర్లా వచ్చేందుకు 294 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయం నిర్మా ణం చేపట్టారు. 21 సీట్ల సామర్థ్యం ఉన్న చిన్న విమానాలు రాకపోకలు సాగించేవి. 2009లో దీన్ని రామగుండం ఎయిర్‌పోర్టు పేరిట అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు నడిచినా అవి అటకెక్కాయి. 2016లో ఉడాన్ పథకంలో భాగంగా 2020లో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ఇండియా రాష్ట్ర ప్రభుత్వంతో పలు భౌగోళిక సర్వేలు నిర్వహించినా అడుగు ముందుకు పడలేదు. నాలుగోసారి నిర్వాసితులు.. కరీంనగర్ జిల్లాలో అదనపు టీఎంసీ కాలువ పనుల్లో భాగంగా రామడుగు, గంగాధర మండలాల్లో పలువురు నిర్వాసితులు నాలుగోసారి భూమిని కోల్పోతున్నారు. ఎవరైనా ఒకసారి కోల్పోవడం సాధారణం, రెండుసార్లు కోల్పోవడమే అరుదు. కానీ, ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల వల్ల ఈ మండలాల్లో కొన్ని గ్రామాలవారు నాలుగు తరాలుగా నిర్వాసితులుగా మారిపోయారు. ఈఎస్ఐ ఆస్పత్రి కావాలి.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది బీడీ కారి్మకులు ఉన్నారు. మున్సిపల్, పలు పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రతి నెలా వేతనం నుంచి ఈఎస్ఐ కట్ అవుతుంది. కానీ, ఈఎస్ఐ ఆస్పత్రి ఉమ్మడి జిల్లాలో రామగుండంలో ఉంది. అసలు రామగుండంలో ఈఎస్ఐ ఆస్పత్రి ఉందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అత్యవసరాల్లో శస్త్రచికిత్స సమయంలో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి అప్పులపాలవుతున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఒక ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని లక్షలాది మంది కార్మికులు కోరుతున్నారు. తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండటం విశేషం. ఆ కుటుంబం పదిమార్లు లోక్‌సభకు సలావుద్దీన్ 1962 నుంచి అయిదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా అయిదు సార్లు గెలిచారు. 1999 లో తండ్రి లోక్‌సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నేండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించారు. చదవండి: -
పని పూర్తి చేసే సంస్కృతి మాది
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శంకుస్థాపన చేస్తే ఆ పనిని కచ్చితంగా పూర్తి చేయాలనే సంస్కృతిని తమ ప్రభుత్వం పాటిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. మంగళవారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని రూ.8 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే విద్యుత్ కీలకమని.. ఉత్పత్తి, సరఫరా నిరంతరాయంగా ఉంటే పరిశ్రమల వృద్ధికి ఆలంబన అవుతుందని చెప్పారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల యూనిట్‌ను ప్రస్తుతం ప్రారంభించుకున్నామని, త్వరలో రెండో యూనిట్ సైతం ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో ఉత్పత్తయ్యే విద్యుత్‌లో అధిక భాగం తెలంగాణ ప్రజలకు దక్కుతుందన్నారు. ధర్మాబాద్– మనోహరాబాద్– మహబూబ్‌నగర్– కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణతో రైళ్ల సరాసరి వేగం, రాష్ట్రంలో కనెక్టివిటీ మరింత పెరుగుతాయని చెప్పారు. మనోహరాబాద్– సిద్దిపేట మధ్య కొత్త రైల్వేలైన్‌తో పరిశ్రమలు, వ్యాపారానికి తోడ్పాటు అందుతుందన్నారు. ఇక ప్రతి జిల్లాలో వైద్య సదుపాయాల నాణ్యత కోసం పీఎం ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ తీసుకొచ్చామని.. తెలంగాణలోని 20 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాకులు ఏర్పాటు చేస్తున్నామని ప్రధాని వివరించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో తెలంగాణలో 50 పెద్ద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేశామని, ప్రజల ప్రాణాలను కాపాడటంలో అవి కీలక పాత్ర పోషించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, కె.లక్ష్మణ్, ధర్మపురి అరి్వంద్, సోయం బాపూరావు తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోదీకి పసుపు రైతుల సన్మానం పసుపు బోర్డు ఏర్పాటు ప్రకటన నేపథ్యంలో పసుపు రైతులు నిజామాబాద్ సభా వేదికపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ సన్మానం చేశారు. పసుపు కొమ్ములతో తయారు చేసిన ప్రత్యేక దండ వేసి, పసుపు మొక్కలను అందించారు. మోదీ ఆ మొక్కలను పైకెత్తి ప్రదర్శించారు. తెలుగులో ప్రారంభించి.. ప్రధాని మోదీ నిజామాబాద్ సభలో తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు ‘నా కుటుంబ సభ్యులారా..’అని ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఆయన ప్రసంగిస్తున్నంత సేపు మోదీ.. మోదీ.. అంటూ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తూ కనిపించారు. ఓ చిన్నారి భరతమాత వేషధారణలో వచ్చిన విషయాన్ని చూసి.. ‘‘ఓ చిన్ని తల్లి రూపంలో భారతమాత ఇక్కడికి వచ్చింది. ఆ చిన్నారికి నా తరఫున అభినందనలు..’’అని పేర్కొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ.. ప్రధాని మోదీ నిజామాబాద్‌లోని సభా స్థలిలో విడిగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి రూ.8 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేశారు. అనంతరం సమీపంలో ఏర్పాటు చేసిన మరో వేదికపై సభను ఉద్దేశిస్తూ రాజకీయ ప్రసంగం చేశారు. తొలి వేదికపై ప్రధాని అభివృద్ధి కార్యక్రమాలివీ.. రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్‌లో 800 మెగావాట్ల యూనిట్ జాతికి అంకితం. ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలోని 20 జిల్లా ఆస్పత్రుల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన. ∙మనోహరాబాద్ – సిద్దిపేట మధ్య కొత్త రైల్వే లైన్ ప్రారంభం.. సిద్దిపేట–సికింద్రాబాద్ రైలు సర్వీస్‌కు పచ్చజెండా.. ధర్మాబాద్ – మనోహరాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూల్ మధ్య రైల్వే విద్యుదీకరణ పనుల ప్రారంభం -
రామగుండం: ఇక్కడి తీర్పు విలక్షణం.. ఈసారి కార్మికుల కన్ను ఎవరిపై?
రాష్ట్రంలోనే విలక్షణమైన తీర్పు వస్తూ ఉంటుంది. కోల్ బెల్ట్ ప్రాంతమైన పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ ఓటర్ల తీర్పు అంతుపట్టకుండా ఉంటుంది. కార్మికులు ఎవరిని పాపం అంటే వారే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తారు. ఇక్కడ కార్మిక నాడి ఎవరికీ అంతుపట్టదు. 2004 వరకు మేడారం నియోజకవర్గం 2009లో రామగుండం నియోజకవర్గంగా మారింది. ► 2009లో జనరల్ సీట్‌గా మారిన రామగుండం నియోజకవర్గంలో 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణను కార్మికులు గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచిన సత్యనారాయణ.. రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరిన సత్యనారాయణ 2014లో టీఆర్ఎస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ► 2018 ఎన్నికల్లో రెబెల్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ సత్యనారాయణపై వెయ్యి ఓట్లతో విజయం సాధించారు. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రామగుండం నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. రామగుండం ముఖచిత్రం రామగుండం నియోజకవర్గంలో గతంలో రామగుండం కార్పొరేషన్‌తో పాటు రామగుండం మండలం ఉండేది. కొత్తజిల్లాల విభజన తర్వాత రామగుండం కార్పోరేషన్‌తో పాటు అంతర్గాం మండలంలో 14 గ్రామాలు ఉన్నాయి . ► రామగుండం కార్పోరేషన్లో 50 డివిజన్లు, పాలకుర్తి అంతార్గం రామగుండం లో 2018 ఆగస్టు వరకు లక్ష 61 వేల 850 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇందులో పురుషులు 83,458, స్తీలు 78,368 కాగా గత ఎన్నికల్లో రెండు లక్షల 20 వేల పైచిలుకు ఉంటే అందులో 60 వేలకు పైగా ఓట్లు గల్లంతయ్యాయి. ప్రస్తుతం లక్ష 61 వేల 850 మంది మాత్రమే ఓట్లు ఉన్నాయి. సామాజిక వర్గాల రామగుండం నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో పద్మశాలి గౌడ కాపు పెరిక ముదిరాజ్ చాకలి కులస్తులు ఉన్నారు.ఇందులో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వారే బలంగా ఉన్నప్పటికీ ఐక్యత లేకపోవడంతో ఓట్ల శాతం తక్కువగా నమోదవుతున్నాయి. ఎమ్మెల్యే బలం బలహీనతలు ప్రజల్లో ఉద్యమకారునిగా మంచి పేరు ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో రామగుండం ఎరువుల కర్మాగారం ఉద్యోగాలు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎమ్మెల్యేలు ఇరకాటంలోకి నెట్టు తున్నాయి. ఇసుక దందా బూడిద దందా తో పాటు అనేక అవినీతి ఆరోపణలు రావడంతో జనంలో ఎమ్మెల్యే పై వ్యతిరేకత ఉంది. పార్టీలో మొదటి నుండి పని చేసిన ఉద్యమకారులను ద్వితీయ శ్రేణి నాయకులను తొక్క పెడుతున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు కందుల సంధ్యారాణి, మిర్యాల రాజిరెడ్డి, పాతిపెల్లి ఎల్లయ్య, కొంకటి లక్ష్మినారాయణ, ఎమ్మెల్యే కు వ్యతిరేకంగా పని చేస్తున్నారు ఎమ్మెల్యే కింద ఉన్న కొంతమంది చోటా మోటా నాయకులు ఎమ్మెల్యేల తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ రావడం వల్ల సప్తగిరి కాలనీ, న్యూ మారేడుపల్లి ప్రధాన సమస్యగా మారాయి. నీటిలో ఇండ్లు మునిగిన గాని ఇప్పటివరకి సమస్య సమస్యగానే ఉంది.పనులు ఎక్కడ వేసిన గొంగలి లా ఉన్నాయి. బీఆర్.ఎస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు వ్యతిరేక వర్గీయులు పోరాటాలు ఈసారి ఎమ్మెల్యేకు మైనస్‌గా మారే అవకాశం. ఉంది కాంగ్రెస్ పార్టీ కూడా ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు కాంగ్రెస్ రంగంలోకి దిగుతుంది. ప్రధానంగా బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ మధ్యనే పోటీ ఉండవచ్చు. ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్నవారు! బీఆర్ఎస్ కోరుకంటి చందర్ కాంగ్రెస్ పార్టీ రాజ్ ఠాగూర్ మక్కాన్‌సింగ్ జనక్ ప్రసాద్ ( ఐ.ఎన్.టి.యు. సి.) బీజెపి సోమరపు సత్యనారాయణ (మాజీ ఆర్టీసీ చైర్మన్) కౌశిక్ హరి కాసిపేట లింగయ్య (మాజీ ఎమ్మెల్యే) భౌగోళిక పరిస్థితులు: రామగుండం నియోజకవర్గంలో రాముని గుండాలు ఇక్కడ ప్రత్యేకం జనగామ శివారులో 500 సంవత్సారాల క్రితం ఉన్నా త్రిలింగ రాజరాజేశ్వర స్వామి మూడు లింగాలు ఉండడం ఇక్కడి ప్రత్యేకం. -
నెలాఖరులోగా గ్రిడ్‌కు ‘సూపర్ థర్మల్’!
సాక్షి, హైదరాబాద్: ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా రామగుండంలో నిర్మిస్తున్న 1,600 (2 *800) మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు తొలి దశలోని 800 మెగావాట్ల యూనిట్‌ను ఈ నెలాఖరులో గా గ్రిడ్‌కు అనుసంధానం చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. తొలి యూనిట్ ద్వారా గత రెండు వారాలుగా 650 మెగావాట్ల వరకు నిరంతరం విద్యుదుత్పత్తి చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొత్తగా నిర్మించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరు, సామర్థ్యం పరీక్షల్లో భాగంగా నిరంతరంగా 72 గంటల పాటు పూర్తి స్థాపిత సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే వాణిజ్యపరమైన ఉత్పత్తికి అర్హత సాధించిన తేదీ(కమర్షియల్ ఆపరేటింగ్ డేట్/సీఓడీ)ని ప్రకటిస్తారు. సీఓడీ ప్రకటన తర్వాత విద్యుత్ కేంద్రాన్ని గ్రిడ్ కు అనుసంధానం చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27 నుంచి 800 మెగావాట్ల పూర్తి స్థాపిత సామర్థ్యంతో తొ లి యూనిట్లో విద్యుదుత్పత్తి చేసేందుకు ఎన్టీపీసీ ఏ ర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను 27 నుంచి గ్రిడ్‌కు సరఫరా చేసేందుకు తెలంగాణ ట్రాన్స్‌కోలోని లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎల్డీసీ) నుంచి ఇటీవల స్లాట్లను పొందింది. అంతా సవ్యంగా జరిగితే ఈ నెలాఖరులోగా తొలి యూనిట్ సీఓడీ ప్రకటన ప్రక్రియ పూర్తి చేసుకుని గ్రిడ్‌కు అనుసంధానం కానుంది. వచ్చే అక్టోబర్‌లో రెండో యూనిట్‌కు సీఓడీ ప్రక్రియ నిర్వహించాలని ఎన్టీపీసీ లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణంలో మూడున్నరేళ్ల జాప్యం ! ఎన్టీపీసీ తొలి యూనిట్ నుంచి జూన్ 2020, రెండో యూనిట్ నుంచి నవంబర్ 2020 నాటికి వాణిజ్యపరంగా విద్యుదుత్పత్తి (సీఓడీ) ప్రారంభం కావాల్సి ఉంది. అయితే నిర్మాణంలో జాప్యంతో తొలి యూనిట్ గడువును 2023 మార్చి, రెండో యూనిట్ గడువును జూలై 2023కు పొడిగించారు. యూనిట్–1 నిర్మా ణం దాదాపు 8 నెలల కిందటే పూర్తయింది. కాగా, బాయిలర్‌లోని రీహీటర్ ట్యూబ్స్‌కు పగుళ్లు రావడంతో గత డిసెంబర్లో జరగాల్సిన సీఓడీ ప్రక్రియను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. మరమ్మతుల్లో భా గంగా ట్యూబ్స్‌కు పగుళ్లు వచ్చి న చోట కట్ చేసి వెల్డింగ్‌తో మళ్లీఅతికించారు. ఏకంగా 7,500 చోట్లలో వెల్డింగ్ చేయాల్సి రావడంతో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్రం ఇచి్చన హామీ మేరకు తెలంగాణలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4,000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాల్సి ఉండగా, తొలి దశ కింద 1,600 మెగా వాట్ల కేంద్రాన్ని నిర్మి స్తున్న విషయం తెలిసిందే. రూ.10,599 కోట్ల అంచనా వ్య యంతో తొలి దశ ప్రాజెక్టును చేపట్టగా, గత మార్చి నాటికి రూ.10,437 కోట్ల వ్య యం జరిగింది. పనుల్లో జాప్యంతో అంచనా వ్యయా న్ని రూ.10,998 కోట్లకు పెంచారు. డిస్కంలకు ఊరట..! ఎన్టీపీసీ తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే నిరంతరం పెరుగుతున్న రాష్ట్ర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు వీలుపడుతుంది. విద్యుత్ డిమాండ్ గరిష్టంగా పెరిగే వేళల్లో అవసరమైన అదనపు విద్యుత్‌ను రాష్ట్ర పంపిణీ సంస్థ (డిస్కం)లు అధిక ధరలతో పవర్ ఎక్ఛ్సేంజీల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి యూనిట్ అందుబాటులోకి వస్తే విద్యుత్ కొనుగోళ్ల భారం కొంత వరకు తగ్గుతుందని అధికారులు చెపుతున్నారు. -
కేటీఆర్ పేషీలో ‘రామగుండం’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ.. టికెట్ల లొల్లి ముదురుతోంది. అధికార పక్షం బీఆర్ఎస్లో నిజయోకవర్గాల వారీగా అసమ్మతి సెగలు ఒక్కొక్కటి బయటపడతున్నాయి. రాజధానికి చేరి.. అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగుండం అసమ్మతి నేతలు మంత్రి కేటీఆర్‌తో శుక్రవారం భేటీ అయ్యారు. అసెంబ్లీ కేటీఆర్ పేషీలోనే గంటల తరబడి వీళ్ల సమావేశం జరిగింది. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై అసమ్మతి నేతలు కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. కోరుగంటి చందర్‌కు ఎట్టి పరిస్థితుల్లో టికెట్ ఇవ్వొద్దని కేటీఆర్‌కు చెప్పారు వాళ్లు. కావాలనుకుంటే జిల్లా అధ్యక్షునిగా కోరుకంటి కొనసాగినా పర్వాలేదని.. కానీ, ఎమ్మెల్యే టికెట్ మాత్రం వేరేవాళ్లకు ఇవ్వాలని అసమ్మతి నేతలు కేటీఆర్‌ను కోరారు. ఈ తరుణంలో అధ్యక్షుడిగా కోరుకంటి ఉంటే మీకు ఓకేనా? అని అసమ్మతి నేతల్ని కేటీఆర్ అడగడం గమనార్హం. అయితే.. కలిసి పనిచేయాలా? వద్దా? అనేది కోరుకంటిపై ఆధారపడి ఉంటుందని అసమ్మతి నేతలు కేటీఆర్‌కు బదులిచ్చినట్లు సమాచారం. అంతేకాదు అధిష్టాన నిర్ణయంపైనే తమ రాజకీయ భవిష్యత్ ఉంటుందని కూడా వాళ్లు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పార్టీకి నష్టం కలిగించే పనులు చేయొద్దంటూ అసంతృప్తి నేతలకు సూచిస్తూనే.. సర్వేలు ఎవరికి అనుకూలంగా ఉంటే వారికే టికెట్ ఇస్తాం. ఎమ్మెల్యే కాబట్టి ఆయనతో మాట్లాడితే నాకు ఆయన దగ్గర అనుకుంటే ఎలా?’’ అని అసమ్మతి నేతలను ఆయన ప్రశ్నించారు. అయితే.. ఎమ్మెల్యే తమపై కేసులు పెట్టి వేధించాడని నేతలు చెప్పగా.. సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే కేసులు పెట్టి వేధించిన విషయం తనకు తెలువదన్న కేటీఆర్ వాళ్లతో అన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్స్ పెట్టొద్దని ఆయన అసమ్మతి నేతలకు సూచించారు. ఇక.. అసమ్మతి నేతలతో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్తోనూ కేటీఆర్ భేటీ అయ్యి ఈ పరిణామాలపై చర్చించారు. ఆపై ‘‘నేను చెప్పాల్సింది చెప్పిన.. ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ కోసమే పనిచేస్తా.. అంటూ ఎమ్మెల్యే కోరుకంటి వ్యాఖ్యానించడం గమనార్హం. కేటీఆర్‌తో భేటీ అనంతరం.. మంత్రి కొప్పుల ఈశ్వర్తోనూ రామగుండం అసమ్మతి నేతలు భేటీ కావడం గమనార్హం. ఇదీ చదవండి: తెలంగాణలో కులగజ్జి, మతపిచ్చి లేదు -
గులాబీ కోటలో కొత్త టెన్షన్.. ఆ ఐదు సెగ్మెంట్లలో ఏం జరుగుతోంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గులాబీ పార్టీకి కంచుకోటగా మారింది. ప్రత్యర్థులకు ఆనవాళ్ళు కూడా లేకుండా చేశాయి బీఆర్ఎస్ శ్రేణులు. కానీ ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థులు తయారయ్యారు. ముఖ్యంగా అయిదు సెగ్మెంట్లలో గులాబీ పార్టీ నేతలు కుమ్ములాడుకుంటున్నారు. ప్రతిపక్షాలు లేని కొరతను సొంత పార్టీ వారే తీరుస్తున్నారు. నియోజకవర్గాల్లో రణరంగాన్ని సృష్టిస్తున్నారు. ఇంతకీ ఆ ఐదు సెగ్మెంట్ల కథేంటీ... ఉత్తర తెలంగాణలో కీలకమైన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఐదు నియోజవర్గాల్లో గులాబీ పార్టీలో అంతర్గత కలహాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. రామగుండం నియోజకవర్గంలో ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై గెలిచిన కోరుకంటి చందర్ తర్వాతి కాలంలో కారెక్కి విహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చందర్‌కు సీటిస్తే మద్దతిచ్చే ప్రసక్తి లేదని ఆయన వ్యతిరేకులు గులాబీ పార్టీ నాయకత్వానికి తేల్చి చెప్పేశారు. బీఆర్ఎస్కు చెందిన పలువురు నేతలు కోరుకంటి చందర్‌కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. కేసీఆర్‌ను మళ్ళీ సీఎం చేయాలంటూ ఆశయసాధన పేరుతో యాత్ర చేస్తున్న అసమ్మతి నేతలు ఎమ్మెల్యే ఫోటోను మాత్రం పెట్టలేదు. మరోవైపు ఎమ్మెల్యే వర్గం కూడా పాదయాత్ర నిర్వహించగా.. రెండు వర్గాలు రామగుండంలో వీధిపోరాటానికి దిగాయి. చదవండి: డోలాయమానంలో గడల శ్రీనివాసరావు రాజకీయ భవిష్యత్ నిర్వేదంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రాజన్న కొలువై ఉన్న వేములవాడలోనూ గులాబీ పార్టీలో గ్రూప్‌లు ఏర్పడి కుమ్ములాడుకుంటున్నాయి. నియోజకవర్గంలో రెండు పార్టీ ఆఫీసులతో భిన్నమైన పరిస్థితి కొనసాగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు టిక్కెట్‌కు చల్మెడ లక్ష్మీనర్సింహారావు అడ్డుపడుతున్నారు. కొద్దికాలంగా రమేష్ బాబు వర్సెస్ చల్మెడ ఎపిసోడ్ వేములవాడ రాజకీయాల్ని రసవత్తరంగా మార్చాయి. ఇద్దరి మధ్యా ఉప్పునిప్పూ అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. ఈ క్రమంలో ఈసారి రమేష్ బాబు టికెట్‌కు గండి కొట్టి.. చల్మెడకే కన్ఫర్మ్ అనే టాక్ వేములవాడలో చాలా రోజులుగా నడుస్తోంది. టికెట్ రాదేమోనన్న నిర్వేదంతో పాటు.. పార్టీలోని ప్రత్యర్థులపై అక్కసు, ఆక్రోశమూ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేష్ బాబు మాటల్లో కనిపిస్తోంది. తనను ధిక్కరించిన ఈటల రాజేందర్‌కు ఈసారి ఎలాగైనా చెక్ పెట్టాలని గులాబీ బాస్ కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. ఈటలతో యుద్ధానికి పంపిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి నిత్యం వివాదాలతో సహవాసం చేస్తూ కేసీఆర్ ఆశల్ని తుంచేస్తున్నారు. కౌశిక్‌రెడ్డిని నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తొలగించాలంటూ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి వంటివారు మీడియా ముందుకు రావడం.. ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తే.. మరింత రెబల్‌గా సమ్మిరెడ్డి మాట్లాడిన తీరు ఇప్పుడు హుజూరాబాద్ రాజకీయాల్లో బీఆర్ఎస్ పరిస్థితిని కళ్లకు కడుతోంది. అంతేకాదు కొందరు సర్పంచులు, ఎంపీటీసీలు కూడా కౌశిక్‌కు వ్యతిరేకంగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో హుజూరాబాద్‌లో అభ్యర్థెవ్వరన్న ప్రశ్నలతో పాటు.. ఎవరు అభ్యర్థిగా బరిలో ఉన్నా.. మిగిలిన వర్గాలు ఎంతవరకూ మద్దతిస్తాయన్నది కూడా సందేహమే. ఇక పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తీరుపై కూడా పార్టీలో అంతర్గతంగా అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రాజయ్య ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే దాసరి తీరుపై అలిగి ఆయన కీలక అనుచరుడైన ఉప్పు రాజ్ కుమార్ పార్టీనుంచే బయటకు వెళ్ళిపోయాడు. అయితే అతణ్ని బ్రతిమాలి మళ్ళీ పార్టీలోకి తీసుకువచ్చారు. చదవండి: ఎల్లారెడ్డిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ... స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భానుప్రసాద్ రావు కూడా ఈసారి టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డీతో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌కు సఖ్యత లేకపోవడం వల్ల ఆయనకు ప్రత్యర్థులు పెరిగిపోతున్నారు. ఈసారి బీసీలకే పెద్దపెల్లి టిక్కెట్ ఇవ్వాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో పాటు.. సామాజిక సమీకరణలు కూడా పార్టీకి తలబొప్పి కట్టిస్తున్నాయి. జూలపల్లి జెడ్పీటీసి లక్ష్మణ్ కేసీఆర్ సేవాదళం పేరుతో కార్యక్రమాలు చేస్తూ.. ఎమ్మెల్యే దాసరిపై కనిపించని యుద్ధం చేస్తున్నారు. జూలపల్లి జడ్పీటీసీ కూడా పెద్దపల్లి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. పైకి సిట్టింగ్ ఎమ్మెల్యేకే టిక్కెట్ అని ప్రచారం జరుగుతున్నా..వెనుక పెద్ద పెద్ద గోతులు తవ్వుతున్నట్టు టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక ఎవ్వరినీ కలుపుకుపోలేని ఆయన తీరు, అవినీతి, అక్రమాల ఆరోపణలతో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు టిక్కెట్ వస్తుందా, రాదా అనే చర్చ జరుగుతోంది. రవిశంకర్‌కు టిక్కెట్ ఇస్తే పార్టీ పరంగానే మద్దతు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయి. పైగా చొప్పదండిలో పోటీకి రెండు మూడు పేర్లను నియోజకవర్గ నేతలు తెరపైకి తెస్తున్నారు. మొత్తంగా ఈ ఐదు నియోజకవర్గాల్లో ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. క్యాడర్ బలంగా ఉన్నా.. లీడర్స్ మధ్య సమన్వయం లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఇక్కడి గులాబీ కోటకు ప్రమాదమే అన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మరి గులాబీ బాస్ తన కోటకు మరమ్మతులు చేస్తారా? రాబోయే ప్రమాదాన్ని నివారిస్తారా? వేచి చూడాల్సిందే. -
రామగుండం బొగ్గుగనిలో ప్రమాదం.. సింగరేణి కార్మికుడు మృతి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండంలోని బొగ్గుగనిలో ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్ పనులు చేస్తుండగా సిలిండర్ పేలి కార్మికుడు మృతిచెందాడు. వివరాల ప్రకారం.. రామగుండం ఆర్జీ3 పరిధిలోని ఓసీపీ-1 గనిలో పేలుడు సంభవించింది. గనిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో సింగరేణి కార్మికుడు జయంత్ కుమార్ మృతి చెందినట్టు సమాచారం. దీంతో, మృతుడి కుటుంబానికి న్యాయం జరగాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. -
అభివృద్ధి మంత్రం.. రాజకీయ తంత్రం
రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ఓ వైపు అధికార టీఆర్ఎస్పై పదునైన విమర్శలతో రాజకీయ అస్త్రాలు సంధిస్తూనే.. మరోవైపు అభివృద్ధి మంత్రాన్ని బలంగా చాటుతూ ద్విముఖ వ్యూహంతో రాష్ట్రంలో ప్రధాని మోదీ పర్యటన సాగింది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాను వ్యక్తం చేయడంతోపాటు.. రాష్ట్రంలో అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు చరమగీతం పాడే దిశగా ముందుకు సాగాలని పార్టీ కేడర్‌కు మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీకి ప్రజల మద్దతు స్పష్టంగా కనిపిస్తోందనీ చెప్పారు. ఇదే సమయంలో కేంద్రంపై, తనపై, బీజేపీపై చేస్తున్న రాజకీయ దాడులకు తగినరీతిలో సమాధానం చెప్తామన్నారు. రాబోయే రోజుల్లో యుద్ధం రసవత్తరం కాబోతోందంటూ రాజకీయపరమైన హెచ్చరికలూ చేశారు. మూఢ నమ్మకాలను విమర్శిస్తూ.. గతంలో ఐఎస్బీ స్నాతకోత్సవం కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీ.. టీఆర్ఎస్ సర్కార్, ప్రభుత్వ అధినేతపై సునిశిత విమర్శలు చేయడంతోపాటు మూఢ నమ్మకాలను నమ్ముకున్నారంటూ ఆరోపణలు గుప్పించారు. తాజాగా శనివారం బేగంపేట సభలోనూ మూఢ నమ్మకాల అంశాన్ని లేవనెత్తారు. గవర్నమెంట్ ఆఫీసులు ఎక్కడుండాలి, ఎలా ఉండాలన్న విషయంలోనూ మూఢ నమ్మకాలను పాటించడం బాధాకరమన్నారు. రామగుండం సభలో ఒకవైపు కేంద్రం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూనే.. సింగరేణిని ప్రైవేటీకరిస్తున్నారంటూ కేంద్రంపై దుష్ప్రచారం చేస్తున్నారన్న విషయాన్ని నొక్కి చెప్పారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకునే దిశలో పరుగులు పెడుతోందని.. నిర్దేశించుకున్న లక్ష్యాలు పెద్దవైనందున కేంద్రం నూతన పోకడలతో ముందుకు సాగుతోందని రామగుండంలో అభివృద్ధి మంత్రం జపించారు. ప్రజలు ఆశీర్వదించాలంటూ.. గత ఎనిమిదేళ్లుగా జాతీయస్థాయిలో రాజకీయాలకు అతీతంగా చాలా చేశామని.. రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలున్నాయా, ప్రతిపక్ష సర్కార్లున్నాయా అన్న పక్షపాతం లేకుండా అభివృద్ధికి తోడ్పడ్డామన్నారు. తెలంగాణలో వివిధ రంగాల్లో కేంద్రం సాయంతో వచ్చిన ప్రగతే దీనికి నిదర్శనమంటూ ఆకట్టుకున్నారు. తెలంగాణను అభివృద్ధిపథంలో మరింత ముందుకు తీసుకెళతామని, ప్రజలు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు : ప్రధాని మోదీ
-
రామగుండం వేదికగా రైతులకు శుభవార్త చెప్పిన ప్రధాని మోదీ
(రామగుండం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ‘‘తెలంగాణలో కొందరు రాజకీయ స్వార్థంతో వదంతులు పుట్టిస్తున్నారు. సింగరేణిని ప్రైవేటుపరం చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ అబద్ధాలు వారికే ఇబ్బంది అవుతాయని తెలియదేమో. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వ వాటా 51%, కేంద్రం వాటా 49%. అలాంటప్పుడు కేంద్రం ఎలా విక్రయిస్తుంది? ఏమైనా చేస్తే రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న ఆలోచన ఏదీ కేంద్రం వద్ద లేదు. ఇలా అబద్ధాలు చెప్పేవారిని హైదరాబాద్‌లోనే ఉంచండి..’’ అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. నకిలీ ఎరువులు, బ్లాక్ మార్కెటింగ్ వంటి సమస్యల నుంచి రైతులను గట్టెక్కించేందుకు దేశవ్యాప్తంగా ఒకేలా ‘భారత్’ బ్రాండ్‌తో యూరియాను అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. శనివారం రామగుండంలో ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. ‘ఈ సభకు విచ్చేసిన రైతులు, సోదర, సోదరీమణులకు నమస్కారాలు’ అంటూ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. తర్వాత హిందీలో మాట్లాడారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రామగుండం నేల నుంచి యావత్ తెలంగాణకు నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ భాగస్వాములైన రైతులకు స్వాగతం. ఇక్కడ ప్రారంభించిన ఎరువుల ఫ్యాక్టరీ, రైలు, రోడ్డు మార్గాలతో వ్యవసాయం, వాణిజ్య వ్యాపార రంగాలు అభివృద్ధి చెంది.. తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రైతులు, యువతకు ఎంతో మేలు కలుగుతుంది. ఆర్థిక పరిపుష్టి సాధిస్తాం. మూడు జాతీయ రహదారుల విస్తరణతో చెరుకు, పసుపు, ఇతర రైతులకు మేలు చేకూరుతుంది. ఒకే బ్రాండ్ యూరియాతో.. దశాబ్దాలుగా వివిధ బ్రాండ్ల పేరిట నకిలీ ఎరువులు, నల్ల బజారులో విక్రయాలతో దేశంలోని రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. దీనికి పరిష్కారంగా ఇక నుంచి దేశంలో కేవలం ఒకే ‘భారత్’ బ్రాండ్ యూరియాను నాణ్యత, తక్కువ ధరతో కేంద్రం అందుబాటులోకి తెస్తోంది. రామగుండం ప్లాంట్ ద్వారా తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల రైతులకు ఎరువుల సరఫరా జరుగుతుంది. రామగుండం ప్రాంతంలో రవాణా, లాజిస్టిక్ రంగాలు అభివృద్ధి చెంది ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఎరువుల ధరలు పెరుగుతున్నప్పటికీ భారత్‌లో పెంచలేదు. ప్రతి యూరియా బస్తాపై రూ.1,472, డీఏపీ బస్తాపై రూ.2,500 కేంద్రం సబ్సిడీగా అందిస్తోంది. ఎరువుల కోసం 8 ఏళ్లలో దాదాపు రూ.10 లక్షల కోట్లు, ఈ ఏడాది రెండున్నర లక్షల కోట్లను కేంద్రం ఖర్చు చేసింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి రూ.6 వేలు అందిస్తున్నాం. శరవేగంగా అభివృద్ధి కరోనా, యుద్ధాలు, ఇతర ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఉద్భవించే దిశగా వేగంగా పరుగులు పెడుతోంది. ఇంతకుముందటి 30 ఏళ్లతో పోలిస్తే గత 8 ఏళ్లలో దేశం అన్ని రంగాల్లో ఎక్కువగా అభివృద్ధి సాధించింది. ఎనిమిదేళ్లలో వివిధ రంగాల్లో సాధించిన పురోగతే ఇందుకు సాక్ష్యం. దేశంలో పాలన తీరు మారింది. సర్కారీ ప్రక్రియలు, ఆలోచనలు మారాయి. మౌలిక సదుపాయాలు వృద్ధి చెందాయి. దేశాభివృద్ధికి దోహదపడే మరో ముఖ్యమైన అంశం రవాణా సదుపాయాల పెంపు. అందుకే అన్ని రాష్ట్రాల్లో రహదారులు, రైల్వే, ఎయిర్ వే, వాటర్ వే అభివృద్ధి పనులు చేపట్టాం. గత ఎనిమిదేళ్లలో రెట్టింపైన జాతీయ రహదారుల కనెక్టివిటీ.. అన్ని రంగాల్లో వృద్ధికి మార్గం సుగమం చేసింది. భద్రాద్రి–సత్తుపల్లి రైల్వేలైన్‌ను రూ.990 కోట్లతో నాలుగేళ్లలో పూర్తి చేశాం. తక్కువ ఖర్చుతో బొగ్గు రవాణా వల్ల విద్యుత్ రంగంలో, వ్యాపార రంగంలో అనేక లాభాలు కలుగుతాయి. జాతీయ రహదారుల విస్తరణ ద్వారా హైదరాబాద్–వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, కాకతీయ మెగా టెక్సై్టల్ పార్క్, పసుపు, మిర్చి రైతులకు ప్రయోజనం కలుగుతుంది..’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఒక రైలు మార్గం.. మూడు హైవేలు శనివారం రామగుండం ఎన్టీపీసీ మహాత్మాగాంధీ స్టేడియంలో ప్రజల సమక్షంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఆర్ఎఫ్సీఎల్ ప్లాంట్, భద్రాచలం– సత్తుపల్లి కొత్త రైలు మార్గాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలో రూ.2,268 కోట్లతో నూతనంగా విస్తరిస్తున్న మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు (హైవే నంబర్ 765డీజీ), బోధన్ నుంచి బాసర మీదుగా భైంసా వరకు (హైవే నంబర్ 161 బీబీ), సిరోంచ నుంచి మహదేవ్పూర్ వరకు (హైవే నంబర్ 353 సి) మూడు నేషనల్ హైవేల విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్‌లో ఉన్న కొందరికి ఈ రాత్రి నిద్రపట్టదేమో! ‘రామగుండం సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరుకావడంతో హైదరాబాద్‌లో కొందరికి ఇవాళ నిద్ర పట్టదేమో’ అని టీఆర్ఎస్ పెద్దలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని, తెలంగాణ అభివృద్ధి కోసం మీ అందరి ఆశీర్వాదం కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
RFCL ప్లాంట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ