
గోదావరిఖనిటౌన్(రామగుండం): శివశివ ఏమి త్రిలింగేశ్వరాలయ దుస్థితి. తెలంగాణ ప్రాంతంలోనే అతి పురాతనమైన కట్టడాల్లో ప్రత్యేకస్థానం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం లోని త్రిలింగేశ్వరాలయం. కాకతీయులు 12 శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. గతంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ ఆలయం కొంతకాలంక్రితం మూ త పడింది. గ్రామస్తుల చొరవతో పదేళ్లక్రితం పున: ప్రారంభమైంది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తాత్కాలిక పనులు చేపట్టి ఆలయంలో తిరిగి పూజలు జరిగేలా చూస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆలయంలో భాగమైన భీమన్న ఆలయం పూర్తిగా కూలిపోయింది. ఆలయం కూలి వారం రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సందర్శించలేదు. ఇప్పటికి ఎ లాంటి చర్యలు జరపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పురాతన ఆలయ సంపదను కాపాడుకోవాలని కోరతున్నారు. ఎండోమెంట్ అధికారులు, పాలకులు చొరవ తీసుకొని తిరిగి పున:నిర్మించాలని కోరుతున్నారు.
పర్యటన తప్ప చేసిందేమీ లేదు
గతంలో రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ విశాలాచ్చి జనగామ త్రిలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి త్రీడి విధానంతో పున: నిర్మించి ప్రత్యేకత చాటుతామని చెప్పి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురాతన కట్టడాలకు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతీ కట్టడానికి నంబర్లు వేశా రు. కొన్ని కట్టడాలు తొలగించి ఆలయ ప్రాంగణం లో పెట్టారు. కొంతకాలంగా ఆదరణ లేక కొన్ని విగ్రహాలు ఆరుబయటే ఉంటున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఇతర సంస్థల సహకారంతో పూర్వ వైభవం తీసుకొస్తామని డైరెక్టర్ విశాలాచ్చి, ఇతర అధికారులు హామీఇచ్చారు. ఆలయంలో మరుగుదొడ్లు, సేద తీరేందుకు ప్రత్యేక గదులు, బాత్ రూంలు, కల్యాణ మందిరం, పార్కింగ్ స్థలం, ఇతర సౌకర్యా లు లేవు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ఆలయ నిర్మాణంకోసం కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు.