Kakatiya dynasty
-
మురిసిపోయిన కాకతీయులు నడయాడిన నేల (ఫొటోలు)
-
కాకతీయ ఉత్సవాలు అద్భుతం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘మా పూర్వీకులు పరిపాలించిన గడ్డ మీదకు రావడం సంతోషంగా ఉంది. 700 ఏళ్ల కిందటి మా వంశస్థుల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహించడం గర్వంగా ఉంది. నన్ను ఆహ్వానించిన ప్రభుత్వానికి, నాయకులకు నా ధన్యవాదాలు. ఓరుగల్లు ప్రజలు మా పట్ల చూపిన ఆదరణ అమోఘం. త్వరలో కుటుంబ సమేతంగా వస్తా..’’ అని కాకతీయుల 22వ వారసుడు, బస్తర్ రాజు రాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్ సంతోషం వ్యక్తం చేశారు. కాకతీయ వైభవ సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం వరంగల్‌కు వచ్చిన కమల్ చంద్ర భంజ్‌దేవ్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘జనరంజక పాలన అందించి, ప్రజాసేవకు అంకితమైన పూర్వీకుల స్ఫూర్తితో బస్తర్‌లో సమాజ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. కాకతీయుల స్ఫూర్తి, ఉత్సాహం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సప్తాహం వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉంది. దేశ చరిత్రలో ఇదొక మరపురాని రోజు..’’ అని భంజ్‌దేవ్ పేర్కొన్నారు. కాకతీయులు రోల్ మోడల్‌గా తెలంగాణలో అనేక పథకాలు నడుస్తున్నాయని, మిషన్ కాకతీయ పథకం అద్భుతమని కొనియాడారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాకతీయులు ఆదర్శంగానే పాలన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాకతీయుల చరిత్రను భావి తరాలకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాకతీయుల చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని.. వారి వారసుడిని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ అంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల ఆదర్శంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కాకతీయ ఘన చరిత్రను మరుగునపడేలా చేశాయని, కేసీఆర్ పట్టుదలతో నేడు ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఇక తాను కాకతీయ గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఓరుగల్లు కోటలో సప్తాహం షురూ.. భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం కమల్‌చంద్ర భంజ్‌దేవ్.. రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వరంగల్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై భంజ్‌దేవ్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎమ్మెల్యే నరేందర్ ఊరేగారు. వరంగల్ కోట, కళా తోరణాలు, సాంస్కృతిక వైభవాన్ని పరిశీలించిన భంజ్‌దేవ్ భావోద్వేగానికి గురయ్యారు. వరంగల్ కోటలో బెలూన్లను ఎగురవేసి ‘కాకతీయ వైభవ సప్తాహం’ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేయి స్తంభాల గుడిలో అభిషేకం నిర్వహించారు. అగ్గిలయ్య గుట్టను సందర్శించి మొక్కలు నాటారు. అక్కడి నుంచి కాకతీయ హరిత హోటల్‌కు చేరుకుని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, వినయభాస్కర్, కలెక్టర్లకు బస్తర్ పరిపాలన జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. (క్లిక్: ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుండి 13 తేదీ వరకు వారం రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తుండటం ముదావహం. మధ్యయుగం (12–14 శతాబ్దాలు)లో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాకతీయుల నిర్మాణాలైన దేవాలయాలు, కోటలు; తవ్వించిన చెరువులు, వారి కళాపోషణ వంటివాటి గురించి ఈ తరానికి స్ఫూర్తినందించే విధంగా కార్యక్రమాలు రూపొందాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా చందుపట్లలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చిన రుద్రమదేవి మరణాన్ని తెలియజేసే శాసనం ఉంది. వరంగల్ జిల్లాలో ఉన్న అనేక కాకతీయ కట్టడాలు, చెరువుల దగ్గర మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్‌ను పూర్వం ‘ఏకశిలా నగరం’, ఓరుగల్లు అనీ పిలిచేవారు. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటివారు ఈ రాజుల్లో పేరుపొందినవారు. వీరు వ్యవసాయం కోసం వేలాది చెరువు లను తవ్వించారు. అందులో ముఖ్యమైనవి పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు. వరంగల్ కోట, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్ప దేవాలయం వంటి ప్రసిద్ధ దేవాల యాలు, అనేక తోరణాలు – వీరి కాలంలోనే నిర్మితమయ్యాయి. అందులో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా లభించింది. అలనాడు తవ్విన అనేక చెరువులు ఇప్పటికీ తెలంగాణలో వ్యవసాయానికి ప్రాణాధారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాటి చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్ కాకతీయ’ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా కాకతీయుల ‘తోరణా’న్ని గ్రహించారు. హంసలు, పూర్ణకుంభం, గర్జించే సింహాలు, మొసలి వంటి శిల్పాలు ఈ తోరణంపై ఉన్నాయి. – ఈదునూరి వెంకటేశ్వర్లు, వరంగల్ -
వరంగల్ గడ్డపై అడుగుపెట్టిన కాకతీయ వంశ 22వ వారసుడు
సాక్షి, హైదరాబాద్: ఓరుగల్లు కేంద్రంగా రాజ్యపాలన సాగించిన కాకతీయ రాజులు ప్రజల మెరుగైన జీవనం కోసం తెచ్చిన పథకాలు, చేపట్టిన నిర్మాణాలు ఇప్పటికీ ఆదర్శనీయమే. ఈ నేపథ్యంలో తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాన్ని 700 ఏళ్ల తరువాత కాకతీయ వంశానికి చెందిన 22వ మహారాజు కమల్‌చంద్ర బంజ్‌దేవ్ దర్శించుకోనున్నారు. నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ వైభవ సప్తాహం’ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా బంజ్‌దేవ్ గురువారం ఉదయం వరంగల్‌కు విచ్చేసి భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తమ వంశస్థుల గడ్డకు రావడం సంతోషంగా ఉందని భంజ్‌దేవ్ తెలిపారు. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. తనను ఆహ్వానించిన నాయకులకు కమల్ చంద్ర భంజ్‌దేవ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారువరంగల్ రాకపై ‘సాక్షి’ ప్రత్యేకంగా మహారాజుతో ముచ్చటించింది. పూర్వీకులు సాగించిన పాలన, ఓరుగల్లు వైభవం గురించి ఆయన అభిప్రాయాలు తెలుసుకుంది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... తల్లి చెంతకు చేరుకున్నట్లు ఉంది... కాకతీయ వంశ వారసునిగా ఓరుగల్లును సందర్శించే అవకాశం రానుండటం చూస్తుంటే తిరిగి నా తల్లి చెంతకు చేరుకున్నట్లు అనిపిస్తోంది. మాటల్లో చెప్పలేని ఆనందంతో మనస్సు నిండిపోయింది. వరంగల్ ప్రజలతో వీడదీయరాని ఆత్మీయ సంబంధం ఎప్పటికీ ఉంటుంది. వరంగల్ గురించి, కాకతీయ వైభవం గురించి నాకు ఎప్పటి నుంచో అవగాహన ఉంది. నేను ఉన్నతవిద్య కోసం లండన్ వెళ్లా. మాస్టర్స్ ఇన్ ఇంటర్నేషనల్ సైన్స్, మాస్టర్స్ ఇన్ పొలిటికల్ సైన్స్ పూర్తి చేశా. 2009లో తిరిగి భారత్‌కు వచ్చా. ఇప్పుడు నా మూలాలను వెతుక్కుంటూ మళ్లీ ఓరుగల్లుకు వస్తున్నా. విద్యుత్ దీపాల వెలుగుల్లో హనుమకొండ కలెక్టర్ కార్యాలయం ప్రజాపాలన సాగించింది మా పూర్వీకులే... రాచరిక చరిత్రలో ప్రజాపరిపాలన సాగించింది కేవలం కాకతీయులు మాత్రమే. మా పూర్వీకులు ప్రజల కోసం ఎన్నో బహుళార్ధ ప్రాజెక్టులు, నిర్మాణాలు, చారిత్రక కట్టడాలు నిర్మించారు. అందుకే ప్రజలు మా వంశీయులని రాజుగా కాకుండా దేవుడిగా చూస్తారు. కాకతీయ రాజుగా ఉన్నందుకు గర్విస్తున్నాను. వరంగల్ ప్రజలు ఎప్పుడూ నా వాళ్లే. వారి కోసం ఏం చేయడానికైనా నేను సిద్ధం. తెలంగాణలోని టార్చ్ ఎన్జీఓ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేయనున్నా. కాకతీయ సంస్కృతిని పరిరక్షించి భావి తరాలకు అందించాల్సిన అవసరముంది. కాకతీయ గత వైభవానికి సంబంధించిన సమాచారాన్ని గ్రంథస్తం చేస్తా. బస్తర్ కేంద్రంగానే కాకతీయుల పాలన... బస్తర్ వేదికగా రాజ్య పరిపాలన ప్రారంభించింది కాకతీయ రాజులే. 22 తరాలుగా మా వంశీయులు కాకతీయ మూలాలతోనే రాజ్య పరిపాలన చేశారు. మేము కాకతీయ రాజులమేనని పలు శాసనాల్లో ఆధారాలున్నాయి. నాటి బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన మెమొరాండం ఆఫ్ ది ఇండియన్ స్టేట్స్ పుస్తకంలో కూడా మేము కాకతీయ రాజులమేనని ప్రస్తావించింది. బస్తర్ వేదికగా ఉన్న పలు శాసనాల్లో కూడా మా వంశం గురించి పొందుపరిచారు. నేటికీ మా సామ్రాజ్యం బస్తర్‌లో విస్తరించి ఉంది. నేను జగదల్పూర్లో ఉన్న కోటలో ఉంటున్నా. అన్ని ఆయుధాలూ వాడగలను.. నాకు అన్ని రకాల ఆయుధాలు వాడటంలో ప్రావీ ణ్యముంది. గోల్ఫ్, ఆర్చరీ, పోలో ఆడతాను. ఫైరింగ్ అంటే ఇష్టం. నేను శాకాహారిని, మద్యపానం అలవాటులేదు. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో కలుస్తుంటా. అందులో సామాన్యులు ఉన్నారు.. ఐఏఎస్, ఐపీఎస్, రాజకీయ నాయకులూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు.. కాకతీయ వైభవ సప్తహం కార్యక్రమాలకు నన్ను ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. జగదల్పూర్లోని నా ప్యాలెస్‌కి వచ్చి ప్రత్యేకంగా ఆహ్వానించిన చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్, తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు హరికృష్ణకు ప్రత్యేక ధన్యావాదాలు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాకతీయ సప్తాహాం.. ఓ కొత్త కోణం
కాకతీయులకు ఏడు అంకెపై మక్కువ ఎక్కువ. కాకతీయుల చరిత్ర, వారి జీవనశైలి, ఆనాటి పాలన పద్దతులు తదితర అంశాలను పరిశీలిస్తే అంతర్లీనంగా అన్నింటా ఏడు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. గుండయ నుంచి రుద్రమమీదుగా ప్రతాప రుద్రుడి వరకు కాకతీయులు ఏడుకు ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇచ్చారనే అంశాలపై కచ్చితమైన వివరణ, సమాధానాలు లభించలేదు. కానీ ఏడుకు ప్రత్యేక స్థానం అయితే లభించింది. అందుకు అద్దం పట్టే ఉదాహరణలను కోకొల్లలుగా చూపించవచ్చు. మచ్చుకు కొన్ని ఇలా ఉన్నాయి. కాకతీయ శిల్ప కళావైభవానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన కాకతీయ శిలా తోరణ ద్వారాల్లోని మధ్య భాగంలో తామర మొగ్గల లాంటి నిర్మాణాలు ఏడు ఉన్నాయి . కాకతీయ కళాతోరణ పరిణామ క్రమంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్న తోరణాలు ఏడు. అవి 1. అనుమకొండ కోట ప్రవేశ ద్వారాలు 2.కొలనుపాక తోరణం 3. వెల్దుర్తి తోరణం 4. ఐనవోలు దేవాలయ తోరణాలు 5. నందికంది తోరణం 6. రామగుండం తోరణం 7. వరంగల్ కీర్తి తోరణం ఏడు కోటలు కాకతీయుల రాజధాని అయిన ఓరుగల్లు నగరం చుట్టూ ఏడు కోటలు ఉండేవి. అందుకే ఓరుగల్లు కోటకు సప్త ప్రకార పరివేష్టిత నగరమని ఏకామ్రనాథుడు రాసిన 'ప్రతాపరుద్రచరిత్ర' పేర్కొంది. ఈ ఏడు కోటలు ఇలా ఉన్నాయి. 1 .మట్టి కోట 2. పుట్ట కోట 3. కంప కోట 4. కంచు కోట 5. గవని కోట 6. రాతి కోట 7. కత్తికోట ఇందులో ప్రస్తుతం రాతి కోట, మట్టి కోట దాదాపు పూర్తిగా కనపడుతుండగా పుట్ట కోట వరంగల్ నగర పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. గిరి దుర్గాలు రాజ్యం సరిహద్దుల్లో గోదావరి నది పరీవాహక ప్రాంతాల్లో పటిష్ఠమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న కాకతీయులు అక్కడ ఉన్న కొండలపై సైనిక స్థావరాలుగా ఏడు గిరి దుర్గాలను నిర్మాణం చేసుకున్నారు . అవి 1. ప్రతాపగిరి కోట 2. గొంతెమ్మ గుట్ట 3. కాపురం గుట్టలు 4. నందిగామ కోట 5. మల్లూరు గుట్ట 6. రాజుపేట గుట్టలు 7. ధర్వాజల గుట్టగా ఉన్నాయి. ఇలా ఏడు గిరి దుర్గాలను ఏర్పాటు చేయడంలో మాత్రమే కాకుండా ఆ కోటల నిర్మాణంలో కూడా ఏడు సంఖ్య ఉండడం విశేషం. ఇక్కడా ఏడుకే ప్రాధాన్యం ప్రతాపగిరి కోటకు ఏడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. మల్లూరు కోట గోడ ఏడు కిలోమీటర్లు విస్తరించి ఉంది. దర్వాజల గుట్ట మీద ఏడు దర్వాజలు ఉన్నాయి. ప్రముఖ కాకతీయ ఆలయాలన్ని ఏడు రాతి పలకల వరుసల వేదికపై నిర్మాణం చేయబడ్డాయి. హన్మకొండలోని ప్రముఖ జైన కేంద్రమైన అగ్గలయ్య గుట్ట మీదనున్న జైన తీర్ధంకరుల శిల్పాల సంఖ్య ఏడు. వరంగల్ కోటలోని ప్రసిద్ద శంభుని గుడి ప్రాంగణంలో ఉన్న మంటపం ఏడు స్తంభాలతో నిర్మాణం జరిగింది. పాలనలో కాకతీయులు వారి నిర్మాణాలల్లో మాత్రమే కాకుండా పాలనా విధానంలో కూడా ఏడు సంఖ్యను ఉపయోగించారు. వారి పాలనా కాలంలో ప్రజా సంక్షేమంకోసంగాను సప్త సంతానాల కల్పన కోసం కృషిచేశారు. సప్త సంతానాలు: 1. స్వసంతానం 2. వన ప్రతిష్ఠ 3. దేవాలయ నిర్మాణం 4. అగ్రహార నిర్మాణం. 5. ప్రబంధ రచన 6. ఖజానా అభివృద్ధి 7. తటాక నిర్మాణం. సప్త మాతృకలు శైవ మతాన్ని ఎక్కువగా అవలంబించిన కాకతీయ పాలకులు పరాశక్తి స్వరూపమైన అమ్మవార్లను కూడా ఆరాధించారు . ఆ అమ్మవార్లు ఏడుగురు ఉండడం విశేషం. సప్తమాతృకలు : 1.బ్రహ్మాణి 2. మహేశ్వరి 3. కౌమారి 4. వైష్ణవి 5. వారాహి 6. నారసిమ్హి 7. ఐంద్రీలుగా పూజించారు. సరస్సుల్లోనూ ఇలా పై అంశాలన్నింటిని పరిశీలించి చూస్తే కాకతీయ పాలకులు ఏడు అనే సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారని తెలుస్తోంది. కాకతీయులు తవ్వించిన ప్రముఖ సరస్సులు 1. రామప్ప 2. పాఖాల 3. గణపసముద్రం 4. లక్నవరం 5. బయ్యారం 6. ఉదయ సముద్రం 7. రంగ సముద్రం. ఏడు బావులు నీటి పారుదల రంగానికి అత్యంత ప్రాముఖ్యత ఇచ్చిన కాకతీయ పాలకులు ఓరుగల్లు రాతి కోట పరిధిలో 7 మెట్ల బావులను నిర్మాణం చేశారు. శృంగార బావి 2. మెట్ల బావి 3. ఈసన్న బావి 4. అక్కా చెల్లెళ్ళ బావి 5. సవతుల బావి 6. కోడి కూతల బావి 7. గడియారం బావి. కోటలో ఆలయాలు చారిత్రక ప్రసిద్ధి పొందిన ఓరుగల్లు రాతి కోట నుండి మధ్య కోట భాగంలో ప్రస్తుతం కాకతీయ కాలం నాటి ఏడు చారిత్రక కట్టడాలు ఉండడం విశేషం. శివాలయం 2. విష్ణు ఆలయం 3. వెంకటేశ్వర ఆలయం 4. కొండ మసీదు 5. నేల శంభుని అలయం 6.అశ్వ శాల 7. వీరభద్ర ఆలయం కాకతీయులు- కొండపాక సిద్దిపేట జిల్లాలో ఒక మండల కేంద్రం కొండపాక. జిల్లా కేంద్రం సిద్దిపేటకు 17 కి.మీ. దూరంలో ఉంటుంది. కొండ పక్క ఉండటంతో దీన్ని ‘కొండపక్క’ అని పిలిచేవారని, అదే క్రమంగా ‘కొండపాక’గా స్థిరపడిందని తెలుస్తోంది. కొండపాకలోని రుద్రేశ్వరాలయం ప్రాచీనమైంది. సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం కాకతీయ రుద్రదేవుడి కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. కాకతీయుల కాలంలో ఇది సైనికుల విడిది ప్రదేశంగా ఉండేదట. ఏడు సంఖ్యతో కొండపాకకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఏడు గ్రామాలు కలిసి ఇది ఏర్పడింది. ఏడు చెరువులు, ఏడు ఆంజనేయస్వామి ఆలయాలు, ఏడు పోచమ్మ గుళ్లు, ఊరి చుట్టూ ఏడు గుట్టలు, గ్రామం మధ్యలో ఏడు నాభి శిలలు నెలకొల్పారు. ఊరికి పశ్చిమంగా రాముని గుట్టలు అనే కొండల వరుస ఉంది. వీటిలో ఒకదాని మీద రామాలయం నిర్మించారు. పశ్చిమ చాళుక్యులు,కాకతీయులకు చెందిన శాసనాలు ఇక్కడి శివాలయ స్తంభాల మీద కనిపిస్తాయి. - ఖమ్మం జిల్లా జూలూరుపాడు ప్రాంతంలో కాకతీయుల కాలంలో నిర్మించిన పోలారం చెరువుకు అనుసంధానంగా ఏడు చెరువులు, కుంటలను గొలుసుకట్టుగా నిర్మించారు. - 1296లో నిర్మాణం చేయబడ్డ మెదక్ కోట ఏడు ప్రవేశ ద్వారాలతో నిర్మాణం చేయబడడం గమనార్హం . - వరంగల్ రురల్ జిల్లాలోని కోగిల్వాయి సమీపంలోని చారిత్రిక చంద్రగిరి గుట్టల్లో కాకతీయ కోట ఆనవాళ్లతో పాటు ఏడు నీటి గుండాల నిర్మాణం జరిగింది. - హిడింబాశ్రమంగా పేరుగాంచిన మెట్టు గుట్టపై సైతం ఏడూ గుండాలు ఉండడం విశేషం. - కాకతి రుద్రదేవుడు ప్రస్తుత సిద్ధిపేట జిల్లాలోని వెల్డుర్తిలో స్వయంగా ప్రతిష్టాపన చేసాడని చెప్పబడే గొనె మైసమ్మకి ( దేవతల చెరువు సమీపంలోని ఆలయంలో ఉన్న అమ్మవారు ) ఏడు సంవత్సరాలకొకసారి ఏడు రోజుల పాటు జాతర నిర్వహించడం తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. కాకతీయుల కాలంలో వాణిజ్య రంగంలో 7 రకాల నాణేలు చలామణిలో ఉండేవి. ఇలా కాకతీయుల కాలంలో ఏడుకు ప్రత్యేక స్థానం దక్కిందనే భావనకు మద్దతుగా అనేక ఉదాహారణలు చరిత్రలో కనిపిస్తున్నాయి. వరహాలు : వరహా ముద్ర కలిగిన బంగారు నాణేలు. గద్యానం : వరహా మాడ : వరహా లో సగం రూక : మాడలో పదవ భాగం పణం : వెండినాణెం (1, 1/2, 1/4, 1/8 విలువ కలిగినవి) చిన్నం : వరహాలో 8 వ భాగం తార : అతి చిన్న నాణెం -
ఆశ్చర్యం! కాకతీయ వారసులకు సమ్మక్క సారే
కాకతీయుల రాజులతో పోరాడి అమరులై ఆ తర్వాత దైవత్వం సాధించుకున్న వీర వనితలుగా సమ్మక్క సారలమ్మలకు పేరుగాంచారు. వారి వీరత్వం, త్యాగాలకు స్మరిస్తూ ప్రతీఏడు జాతర జరుపుకోవడం వందల ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది. అయితే గతాన్ని పక్కన పెట్టి కొత్త సంబంధాలకు తెర తీశారు సమ్మక్క పూజారులు. కాకతీయు వారసులకు సమ్మక్క తరఫున సారెను పంపారు. ప్రతాపరుద్రుడి మరణంతో వరంగల్ కేంద్రంగా కొనసాగిన కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అయితే ప్రతాపరుద్రుడి కుటుంబ సభ్యులు గోదావరి తీరం వెంట సాహాస ప్రయాణం చేస్తూ దండకారణ్యం చేరుకున్నారు. కాకతీయ వారసుడిగా అన్నమదేవ్ జగదల్పూర్ కేంద్రంగా కొత్త సామ్ర్యాజ్యం స్థాపించాడు. బ్రిటీష్ వారి చారిత్రక పరిశోధనల్లోనూ అన్నమదేవ్ కాకతీయ వారసుడిగా తేలింది. ప్రస్తుతం అన్నమదేవ్ పరంపరలో చంద్రదేవ్భంజ్ కొనసాగుతున్నారు. రాజరికం అంతరించినా.. జగ్దల్పూర్ కోటలో ఉంటూ స్థానిక పండుగుల్లో గత సంప్రదాయాలను, వైభవాలను కొనసాగిస్తున్నారు. ఇటీవల సమ్మక్క సారలమ్మ జాతర మేడారంలో ఘనంగా జరిగింది. ఫిబ్రవరి 16న మొదలైన జాతర ఫిబ్రవరి 23న తిరుగు వారం పండుగతో ముగిసింది. జాతర ముగిసిన తర్వాత సమ్మక్క పూజారులుగా చెప్పుకునే సిద్ధబోయిన వంశస్తులు కాకతీయ వారుసుడైన చంద్రదేవ్భంజ్కి సమ్మక్క సారెగా బంగారం (బెల్లం), గాజులు, కుంకుమ భరిణి, చీర, కండువాలను పంపించారు. వందల ఏళ్ల క్రితమే ఉన్న బంధాన్ని మరోసారి తట్టి లేపారు. మేడారం జాతర, బస్తర్ దసరా వేడుకలపై పరిశోధనలు చేస్తున్న టార్చ్ సంస్థ కన్వీనర్ అరవింద్ పకిడె ద్వారా ఈ సారేను సమ్మక్క పూజారులు పంపించారు. తిరుగువారం పండుగ ముగిసిన వెంటనే వీటిని తీసుకుని టార్చ్ బృందం జగదల్పూర్ వెళ్లింది. కాగా ఫిబ్రవరి 25 శుక్రవారం రాజమాత కృష్ణకుమారి దేవికి ఈ సారెను సమ్మక్క తరఫున అందించారు. పరిశోధనలు జరగాలి - సిద్ధబోయిన అరుణ్‌కుమార్ (సమ్మక్క పూజారుల సంఘం అధ్యక్షుడు) కాకతీయ రాజులు, సమ్మక్క కుటుంబీల మధ్య ఉన్న సంబంధాలు నెలకొన్న వివాదాలపై అనేక అంశాలు ప్రచారంలో ఉన్నాయి. దీనిపై విస్తారమైన పరిశోధనలు జరగలేదు. పైపై విషయాలకే ఎక్కువ ప్రచారం దక్కింది. కానీ ఆనాదిగా దండకారణ్యంతో ఆదివాసీలకు వారిలో ఒకరైన సమ్మక్క ఆమె కుటుంబ సభ్యులకు సంబంధాలు ఉన్నాయి. మా పూర్వీకులు మాకు అదే విషయం చెప్పారు. మరోవైపు కాకతీయ రాజులకు దండకారణ్యంతో సంబంధాలు ఉన్నాయి. దీంతో కాకతీయ వారసులకు సారెను పంపి కొత్త బంధవ్యాలకు తెర తీశాం. వచ్చే జాతరకు వారిని ఆహ్వానించే విషయాన్ని పరిశీలిస్తున్నాం. మహిళా శక్తికి ప్రతిరూపం - చంద్రదేవ్భంజ్ (కాకతీయుల వారసుడు) వీర నారీమణి, త్యాగానికి మరోపేరైన సమ్మక్క సారేను మా కుటుంబం అందుకున్నందుకు ఆనందంగా ఉంది. దండకారణ్యంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యం ఉంటుంది. ఆనాదిగా మేము స్త్రీలను శక్తి స్వరూపాలుగా చూస్తున్నాం. సమ్మక్కను ఇక్కడ సడువలిగా కొలుస్తారు. ఇక్కడే దంతేశ్వరి ఆలయం కూడా ఉంది. వరంగల్ - దండకారణ్యంల మధ్య ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సారెతో అవి మరింత బలపడనున్నాయి. -
ఒకప్పుడు అష్టైశ్వర్యాలు.. కలరా దెబ్బతో నిర్మానుష్యమైన గ్రామం
బుట్టాయగూడెం: అనగనగా ఓ ఊరు. కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు పాలించిన గడ్డ. ఆనాటి చారిత్రక ఆనవాళ్లు నేటికీ ఆ గ్రామంలో పదిలంగా ఉన్నాయి. రెడ్డి రాజుల సామ్రాజ్యంగా ఉన్న ఆ ఊరు రత్నాలు, రాసులతో అలరారినది. అటువంటి ఊరు నేడు నిర్మానుశ్యంగా మారింది. ఇలా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఘనతకెక్కింది రెడ్డిగణపవరం. నాడు రెడ్డి రాజుల సామ్రాజ్య పాలనలో అష్టైశ్వర్యాలతో అలరారిన గ్రామం నేడు నిర్మానుష్యంగా మారడం వెనుక ఉన్న కథను ఒక్క సారి పరిశీలిద్దాం... పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం ఎంతో చారిత్రక నేపథ్యం గలది. ఈ గ్రామం 11వ శతాబ్దంలో ఏర్పడింది. ఓరుగల్లు కాకతీయుల పాలనలో రుద్రమదేవి ఆధీనంలోనే ఈ ప్రాంతమంతా ఉండేదని పూర్వీకులు చెప్తున్నారు. ఆ తర్వాత రెడ్డి రాజులు వంశానికి చెందిన గణపతి రెడ్డి ఆధీనంలోకి వచ్చి ప్రత్యేక సామ్రాజ్యంగా ఏర్పడింది. గణపతి రెడ్డి పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధిలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడంతో పాటు అష్టైశ్వర్యాలతో అలలారినట్లు చరిత్ర చెప్తుంది. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న వారికి నాటి కాలానికి సంబంధించిన గుర్తులు నేటికీ లభిస్తున్నాయి. రెడ్డి రాజులు, సుల్తాన్లు కాలం నాటి నాణాలు, బంగారపు వస్తువులు తవ్వకాల్లో లభించగా ఈ వస్తువులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పునరావస్తు శాఖకు అప్పగించడం జరిగింది. గణపతి రెడ్డి పాలన: రెడ్డి రాజులు పాలన రెడ్డి గణపవరం కేంద్రంగా బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర ప్రాంతాలను సుమారు 65 కిలోమీటర్లు పరిధిలో సాగిందని చరిత్ర తెలిసిన పూర్వీకులు చెపుతున్నారు. రెడ్డి రాజులు పాలనలో ఇక్కడ రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మణులు అధికంగా అండగా, ఇతర కులాల వారు తక్కువుగా ఉండేవారని చెప్తున్నారు. సుమారు రెండు వందల సంవత్సరాల పాటు సుభిక్షంగా అలరారుతున్న, ప్రశాంతంగా ఉన్న రెడ్డి గణపవరం గ్రామంపై 13వ శతాబ్దంలో ముస్లింలు పలుసార్లు దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రలో గణపతి రెడ్డి కట్టించిన ఆలయాలు, మండపాలు ధ్వంసం అయ్యాయి. ముస్లింల దండయాత్రలో విజయం సాధించిన గణపతి రెడ్డి విజయానికి గుర్తుగా రెడ్డి గణపవరంలో కనక దుర్గమ్మ తల్లి గుడి కట్టించారు. కలరా సోకి ఖాళీ అయిన గ్రామం: 13వ దశాబ్ద కాలంలో ముస్లిం దండయాత్ర తర్వాత రెడ్డిగణపవరం గ్రామంలో కలరాసోకి ఒక్కొక్కరిగా మృత్యువాతన పడుతూవచ్చారు. దీనితో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు ఒక్కొక్కరిగా గ్రామం విడిచి బయటగ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళినవారిలో ఎక్కువ మంది వైశ్యులు లక్కవరంలోనే స్థిరపడినట్లు పూర్వీకులు చెప్తున్నారు. -
ఇలాంటివి కుతూహలం కలిగిస్తాయి: విజయ్ దేవరకొండ
తక్కువ టైంలో దక్కిన క్రేజ్‌ను నిలబెట్టుకుంటూ ప్యాన్ ఇండియన్ లెవల్‌కు వెళ్లిపోయాడు ‘రౌడీ హీరో’ విజయ్ దేవరకొండ. ప్రస్తుతం పూరీ డైరెక్షన్లో లైగర్‌తో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా ఓరుగల్లు ఘనత మీద ట్విటర్లో ఒక పోస్ట్ చేశాడు. ‘చరిత్ర గురించి ఎప్పుడూ ఒక కుతూహలం ఉంటుంది. 800 సంవత్సరాల చరిత్ర, కాకతీయ సామ్రాజ్యపు వైభవపు గుర్తు రామప్ప గుడి ప్రపంచ వారసత్వ హోదా రేసులో నిలబడింది’ అంటూ ఓ ట్వీట్ చేశాడు. అలా సొంత నేల చారిత్రక ఘనతపై తన ఆసక్తిని ప్రదర్శించాడు. Have always been very intrigued by the historic past.. The 800 year old Ramappa Temple built by the Kakatiya dynasty is now in the race for world heritage status! https://t.co/ItwPIoDdXe — Vijay Deverakonda (@TheDeverakonda) July 10, 2021 కాగా, అద్భుత శిల్ప సంపదకు నెలవైన రామప్ప ఆలయం అంతర్జాతీయ ఖ్యాతికి ఆమడ దూరంలో నిలిచింది. కొత్తగా వరల్డ్ హెరిటేజ్ ప్రాంతాలను గుర్తించేందుకు యూనెస్కో బృందం జులై 16న సమావేశమవుతోంది. రామప్ప గుడి గనుక ఈ ఘనత సాధిస్తే తెలంగాణలోనే మొట్టమొదటి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేరుతుంది. జులై 24-26 మధ్య డబ్ల్యూహెచ్‌సీ కమిటీ వోటింగ్ మీదే మిగతాదంతా ఆధారపడి ఉంటుంది. చదవండి: రామప్ప గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసా? -
Shanigaram Village: చరిత్రకెక్కిన శనిగరం
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్‌కు 20 కి.మీ. దూరంలో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో శనిగరం గ్రామం ఉంది. ఇక్కడి పురాతన శిథిల శివాలయంలో అరుదైన ఆధారాలు బయటపడ్డాయి. నిర్మాణశైలి ప్రకారం ఈ గుడి కాకతీయుల శైలికి చెందింది. నాలుగు అడుగుల ఎత్తయిన జగతిపై ఆలయ నిర్మాణం జరిగింది. 16 కాకతీయ శైలి స్తంభాలతో కూడిన అర్ధమంటపం ఉంది. అలాగే, అంతరాలం, గర్భగుడులు ఉన్నట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యులు రమేష్‌శర్మ, ఉజ్జేతుల రాజు వెల్లడించారు. కొత్త కాకతీయ శాసనం శనిగరంలో కొత్త కాకతీయ శాసనం ఒకటి లభించింది. ఈ శాసనం ఒక గ్రానైట్ రాతిస్తంభం మీద మూడు వైపుల చెక్కి ఉంది. సూర్యచంద్రులు, శివలింగం, ఆవులు శాసనం పైవైపు చెక్కి ఉన్నాయి. శాసనాన్ని చూసి రాసుకున్న దాని ఆధారంగా ఈ శాసనం రామనాథ దేవాలయానికి ఆ ఊరిప్రజలు.. బ్రాహ్మణుల సమక్షంలో కొంత భూమి దానం చేసినట్లు గుర్తించారు. మహామండలేశ్వరుడు కాకతీయ ప్రతాపరుద్రుడు ఓరుగల్లులో రాజ్యం చేస్తున్నపుడు మన్మథనామ సంవత్సరం (క్రీ.శ.1295)లో వేసిన శాసనంగా భావిస్తున్నారు. ద్వారస్తంభం మీద కలశాలు చెక్కి ఉన్నాయి. గుడి కప్పుకు ప్రత్యేకమైన కాకతీయశైలి ప్రస్తరం (చూరు) కనిపిస్తుంది. ఈ గుడిలోని స్తంభాలపై చెక్కిన అర్థశిల్పాలు ప్రత్యేకం. ఇవి రామప్పగుడిలోని స్తంభశిల్పాలకన్నా ముందరి కాలానికి చెందినవి. విశేషమైన శిల్పం ఒక స్తంభం మీద కనిపించింది. ఈ స్తంభశిల్పంలో ఒకవైపు విల్లు ధరించిన చెంచులక్ష్మి కాలికి గుచ్చుకున్న ముల్లు తీస్తున్న దృశ్యం, ఇంకోవైపు ఎద్దులతో రైతు కనిపించడం విశేషం. ఇది ఏరువాకకు చెందిన శిల్పమే. ఇక కొన్ని ఆధారాలను పరిశీలిస్తే కాకతీయుల పాలనలో ప్రధాన కేంద్రం ఇదేనని ప్రాథమికంగా భావిస్తున్నారు. రామప్పను తలపించేలా.. ఈ స్తంభ శిల్పాల్లో ఒక స్తంభంపై ముగ్గురు నృత్యకారులు నాలుగు కాళ్లతో కనిపించే శిల్పం రామప్పగుడి మాదిరిగానే ఉంది. మరో స్తంభంపై ఏనుగులు తొండాలతో పోట్లాడుతున్నట్టు, ఇంకో స్తంభం మీద హంసలు ఉన్నాయి. వైష్ణవమత ప్రతీకైన గండభేరుండం, శైవమతంలో పేర్కొనబడే శరభేశ్వరుల శిల్పాలను ఎదురుపడినట్లుగా చెక్కిన శిల్పం మరో స్తంభంపై చూడొచ్చు. ఒక స్తంభంపై రెండు గుర్రాలమీద స్వారీ చేస్తూ ఆయుధాలతో ఇద్దరు వీరులు కనిపిస్తున్నారు. దేవాలయ స్తంభాలపై యుద్ధ దృశ్యం చాలా అరుదైంది. రామాయణాన్ని తలపించే లేడివేట దృశ్యం.. విల్లమ్ములతో వీరుడు, అమ్ముదిగిన జింకను తీర్చిదిద్దారు. ఏనుగును వధిస్తున్న వీరుడితో పాటు ఆలయ ప్రాంగణంలో హనుమంతుని శిల్పం, ఒక శాసనఫలకం ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం కింద ఉన్న శాసనలిపిలో సింమ్వ సింగ్గన అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. అది హనుమాన్ శిల్పాన్ని ప్రతిష్టించిన వ్యక్తి పేరై ఉంటుందని భావిస్తున్నారు. ఇలా కాకతీయుల పాలనకు అద్దంపట్టే అనేక శిల్పాలు రామప్ప గుడిని తలపిస్తున్నాయి. కాగా చాళుక్యల శైలి నిర్మాణవాస్తుతో కట్టిన గుడి ఆనవాళ్లు, గుడిస్తంభాలు ఉన్నాయని, వాటిమీద ఇనుమును కరగదీసిన ఆనవాళ్లు, నలుపు ఎరుపు కుండపెంకులు, రాగి నాణేలు లభించాయని శ్రీరామోజు హరగోపాల్ చెప్పారు. -
కట్టగూరు పొలం గట్టున అలనాటి చరిత్ర
సాక్షి, హైదరాబాద్: ఒకే శిల.. రెండు శాసనాలు.. ఒకటి ముత్తాత, మరోటి మునిమనవడు రాయించారు. అవి ఒకే దేవాలయానికి దానం ఇచ్చే క్రమంలో రూపొందినవే. ఆ శాసనాల వయసు 718 ఏళ్లపై మాటే.. కానీ, అవి నేటికీ పొలం గట్టు మీద పదిలం. అనగనగా ఓ ఊరు.. రచ్చబండ మీద ఓ బృందం కూర్చుంది. ఆ ఊరి దేవుడికి ఉత్సవాలకు పన్ను ద్వారా డబ్బులు వసూలు చేయాలనేది ఆ బృందం సంకల్పం. ఆ బృందం మాటను చక్రవర్తి కూడా సమ్మతించి ఆ మేరకు ఓ శాసనం రాయించారు. ఆయన మునిమనవడు చక్రవర్తి అయ్యాక అదే దేవాలయానికి పన్నురూపంలో నిధి సేకరణ ద్వారా దేవుడికి దానం ఇస్తూ తానూ శాసనం చేశారు. దానిని ముత్తాత రాయించిన శిలకే మరోవైపు రాయించారు. ఆ ముత్తాత కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు.. ఆ మునిమనవడు రాణిరుద్రమ మనవడు ప్రతాపరుద్రుడు. ఆ పల్లె కట్టగూరు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలో ఉంది. ప్రస్తుతం అక్కడ శాసనాల స్తంభం ఉన్నా ఆలయం మాత్రం లేదు. ఇదీ కథ.. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి కాలంలో ఈ ఊళ్లో దేవాలయ నిర్మాణాన్ని చేపట్టారు(శాసనం ఆధారంగా గుర్తింపు). తిరుప్రతిష్ట కోసం దానం ఇచ్చినట్టుగా క్రీ.శ.1258లో శాసనం లిఖించి ఉంది. బుర్ర సుంకం (తల పన్ను.. ప్రతి మనిషి చెల్లించాల్సిన పన్ను) నుంచి దేవాలయానికి చెల్లించాలని అందులో పేర్కొన్నారు. పౌర సేవలకు గాను విధించే పన్ను నుంచి అదనంగా కొంత రాబడి చేసుకుని దేవాలయ నిర్వహణకు చెల్లించాలన్నది ఆ శాసన ఉద్దేశం. సరిగ్గా 45 ఏళ్ల తర్వాత 1303లో అదే శిలపై మరోవైపు మునిమనవడు ప్రతాపరుద్రుడి కాలంలో అదే దేవాలయానికి దానం ఇస్తూ మరో శాసనం వేయించారు. ఆ ఊళ్లోని అష్టాదశ ప్రజలు (18 రకాల వృత్తులవారు) మహాజనులు(బ్రాహ్మణులు), నగరము (వ్యాపారుల సంఘం), కాపులు, బలంజి సెట్టిల ఆస్థానం ఈ దాన ప్రక్రియను రూపొం దించినట్టుగా అందులో ఉంది. అంటే ప్రత్యేక కమిటీలాంటిదన్నమాట. కట్టంగూరి మల్లేశ్వర, కేశవ దేవరుల భోగాలకు ఒక్కొక్క మాడ(మాడకు ఐదు రూకలు)కు ఐదు వీసాల(రూకలో 16వ వంతు) చొప్పున ఆ చంద్రార్కం చెల్లేట్టు పన్ను నుంచి చెల్లించాలని ఉంది. రెండు శాసనాల్లో గోపీనాథస్వామి పేరు ఉంది. అంటే ఇక్కడ శైవ, వైష్ణవాలయాలు ఉండేవన్నమాట. మొత్తం మూడు శాసనాలు ఈ గ్రామంలో మొత్తం మూడు దాన శాసనాలున్నాయని 1956లో ప్రచురితమైన ‘ఏ కార్పస్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ది తెలంగాణ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’హైదరాబాద్ ఆర్కియోలాజికల్ సీరీస్ 19వ సంపుటంలో నమోదై ఉంది. ఆ మూడింటిలో రెండు ఇవే. మరోటి లభించాల్సి ఉంది. శిథిలాలు ఆ ఆలయానివే: కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఇటీవల కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కట్టా శ్రీనివాస్ ఈ శాసనాలను పరిశీలించారు. దానిపై లిఖించిన విషయాన్ని ఆ బృందం మరో ప్రతినిధి శ్రీరామోజు హరగోపాల్ పరిష్కరించారు. అవి ఆ పుస్తకంలో పేర్కొన్న మూడు శాసనాల్లో భాగమేనని వారు పేర్కొన్నారు. తాజా పరిశీలనలో అక్కడ ఆ ఆలయానికి సంబంధించిన కొన్ని శిథిల విగ్రహాలను గుర్తించారు. శాసన శిలకు చేరువలో.. శిశువులను ఎత్తుకుని ఇద్దరు స్త్రీమూర్తులు శ్రీదేవీభూదేవిల విగ్రహాలున్నాయి. ఆ రెంటి మధ్య ఖాళీ స్థలంలో రెండు పాదాల ఆనవాళ్లు ఉన్నాయి. అది వేణుగానముద్రలో ఉన్న గోపాలకృష్ణుడి విగ్రహం, మరోటి శాసనాల్లో పేర్కొన్న గోపీనా«థుడి విగ్రహమని తెలిపారు. మరో పక్కన శివలింగానికి చెందిన పానవట్టం, నంది విగ్రహాలున్నాయి. ఇలాంటి ప్రాంతాలను పరిశోధించి అవశేషాలు వెలుగులోకి తెస్తే, అలనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులు, దేవాలయాలకు దానాలు, వాటిల్లోని విశేషాలు తెలుస్తాయని, ఆ మేరకు ప్రభుత్వం పూనుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
రుద్రమ దేవి ధైర్యసాహసాలతో...
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రాణి రుద్రమదేవి ధైర్య సాహసాలను బుల్లి›తెరపై ఆవిషరించేందుకు సిద్ధమైంది స్టార్ మా ఛానెల్. బుల్లి తెరపై మునుపెన్నడూ లేని ప్రమాణాలతో ‘రుద్రమదేవి’ కథను సీరియల్ రూపంలో తీసుకొస్తున్నారు. ‘‘ఈ రుద్రమదేవి కథా కాలాన్ని యథాతథంగా తెర మీదకు తీసుకు వచ్చేందుకు వందల మంది కృషి చేశాం. ఇది మన తెలుగు కథ. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కథ’’ అని స్టార్ మా బృందం పేర్కొంది. ‘రుద్రమదేవి’ సీరియల్ జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ మా చానెల్లో ప్రసారం కానుంది. -
ఎటు చూసినా కాకతీయుల జ్ఞాపకాలే..
కాకతీయుల కాలం నాటి శివాలయాలను పలు గ్రామాల్లో చూస్తుంటాం. కానీ వారు పరిపాలించిన కాలంలో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పవచ్చు. రాతిస్తంభాలపై చెక్కిన శిల్పాలు, నంది విగ్రహం, నాగేంద్రుడి విగ్రహం, ఎత్తైన యాదవరాజుల విగ్రహాలు, శాసనాలు ఇక్కడ కనిపిస్తాయి. జెడ్పీఎస్‌ఎస్‌లో భద్రంగా.. కాకతీయుల కాలం శాసనాలు కలిగిన రాతి స్తంభాన్ని స్థానిక జెడ్పీఎస్ఎస్ స్కూల్ ఆవరణలో ఉంచారు. కాకతీయుల ఆనవాళ్లు కాలగర్భంలో కలిసిపోకుండా గ్రామస్తులు స్వచ్ఛందంగా కృషి చేస్తున్నారు. పగిలిన విగ్రహాలు, విరిగిన స్తంభాలతో పాటు నంది విగ్రహాన్ని మరమ్మతు చేసి పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన ఇంటి ఆవరణంలో ఇంకుడుగుంత కోసం తవ్వుతుండగా కల్యాణ మండపం, పూల చిత్రాల రాళ్లు బయటపడ్డాయి. ఆరు ఫీట్ల వైశాల్యంతో రెండుఫీట్ల మందంతో ఉన్న ఈ రాతి విగ్రహంపై వృత్తాకారంలో చెక్కిన తీరును చూసి గర్భగుడిలోని కల్యాణ మండపం రాయిగా గుర్తించారు. అదే విధంగా పూలచిత్రాలు కలిగిన రాళ్లు, ఆలయంలో రాతిస్తంభాలు బయటపడ్డాయి. ఇక అప్పట్లో చనిపోయిన వారిని ఖననం చేసిన, సమాధి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఇలా అనేక ఆనవాళ్లు గ్రామంలో కనిపించడంతో కాకతీయుల కాలంలో ఇనుగుర్తి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నట్లు చెబుతారు. ప్రభుత్వం గుర్తిస్తే కాకతీయుల నాటి ఆనవాళ్లు మరిన్ని వెలుగుచూసే అవకాశం ఉన్నందున ఆ దిశగా ప్రయత్నించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇంకా ఎన్నో.. ఇనుగుర్తి గ్రామ శివారులో ఉన్న గుంటిచెరువు వద్ద కాకతీయుల నాటి కాలంలో నాటిన చెట్లు, చెరువు మధ్యలో ఉయ్యాలను రాతిస్తంభాలతో ఏర్పాటు చేయడాన్ని చూడొచ్చు. చెరువుపక్కనే యాదవరాజుల విగ్రహాలు, బతుకమ్మలు పేర్చినట్లు బిందెపై బిందె పెట్టినట్లుగా చెక్కిన రాతి నిర్మాణాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అయితే ఇక్కడ రెండు దేవాలయాలు ఉండటం మూలంగా ఇనుంగుడి అనే పేరు గ్రామానికి వచ్చిందని, అది కాస్త్త కాలక్రమంలో ఇనుగుర్తిగా మారినట్లు చెబుతారు. -
కూలుతున్న త్రిలింగేశ్వరాలయం
గోదావరిఖనిటౌన్(రామగుండం): శివశివ ఏమి త్రిలింగేశ్వరాలయ దుస్థితి. తెలంగాణ ప్రాంతంలోనే అతి పురాతనమైన కట్టడాల్లో ప్రత్యేకస్థానం రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ గ్రామం లోని త్రిలింగేశ్వరాలయం. కాకతీయులు 12 శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. గతంలో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ ఆలయం కొంతకాలంక్రితం మూ త పడింది. గ్రామస్తుల చొరవతో పదేళ్లక్రితం పున: ప్రారంభమైంది. ఎండోమెంట్ ఆధ్వర్యంలో ప్రభుత్వం తాత్కాలిక పనులు చేపట్టి ఆలయంలో తిరిగి పూజలు జరిగేలా చూస్తున్నారు. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలతో ఆలయంలో భాగమైన భీమన్న ఆలయం పూర్తిగా కూలిపోయింది. ఆలయం కూలి వారం రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు మాత్రం సందర్శించలేదు. ఇప్పటికి ఎ లాంటి చర్యలు జరపలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పురాతన ఆలయ సంపదను కాపాడుకోవాలని కోరతున్నారు. ఎండోమెంట్ అధికారులు, పాలకులు చొరవ తీసుకొని తిరిగి పున:నిర్మించాలని కోరుతున్నారు. పర్యటన తప్ప చేసిందేమీ లేదు గతంలో రాష్ట్ర పర్యాటకశాఖ డైరెక్టర్ విశాలాచ్చి జనగామ త్రిలింగేశ్వర ఆలయాన్ని సందర్శించి త్రీడి విధానంతో పున: నిర్మించి ప్రత్యేకత చాటుతామని చెప్పి రెండేళ్లు దగ్గర పడుతున్నా ఇప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పురాతన కట్టడాలకు పురావస్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతీ కట్టడానికి నంబర్లు వేశా రు. కొన్ని కట్టడాలు తొలగించి ఆలయ ప్రాంగణం లో పెట్టారు. కొంతకాలంగా ఆదరణ లేక కొన్ని విగ్రహాలు ఆరుబయటే ఉంటున్నాయి. సింగరేణి, ఎన్టీపీసీ, ఇతర సంస్థల సహకారంతో పూర్వ వైభవం తీసుకొస్తామని డైరెక్టర్ విశాలాచ్చి, ఇతర అధికారులు హామీఇచ్చారు. ఆలయంలో మరుగుదొడ్లు, సేద తీరేందుకు ప్రత్యేక గదులు, బాత్ రూంలు, కల్యాణ మందిరం, పార్కింగ్ స్థలం, ఇతర సౌకర్యా లు లేవు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ఆలయ నిర్మాణంకోసం కృషి చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రాజరికపు జ్ఞాపకం... అనుభూతుల సంతకం
న్యూ ఇయర్ పార్టీ మూడ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. దానిని ఈ వీకెండ్ దాకా సిటీ కంటిన్యూ చేస్తోంది. ఉర్రూతలూగించిన నైట్‌పార్టీకి తోడుగా ప్రశాంతతను, రొటీన్‌కు భిన్నమైన ఆనందాన్ని పొందేందుకు వీకెంట్ టూర్ చేయాల్సిందే. ఇలా ఆలోచించేవారికి సిటీకి అతి చేరువలో ఉన్న భువనగిరి కోట ఒక చక్కని గమ్యం. - ఓ మధు గిరులు కోటలకు ఆవాసాలుగా మారిన తార్కాణాలెన్నో... గోల్కొండ, చంద్రగిరి, భువనగిరి ఆ కోవలోకి వచ్చే కోటలే... 12 వ శతాబ్దంలో కట్టిన ఈ కోట నేటికి రాచఠీవి కోల్పోకుండా తన దర్పాన్ని చూపిస్తుంది. సిటీకి దగ్గరగా... రొటీన్‌కు దూరంగా... నల్లగొండ జిల్లాలో సిటీకి 48 కి.మీ దూరంలో ఉన్న ఈ కోట సిటిజనులకు చక్కటి వీకెండ్ స్పాట్. ఈ కోట నిర్మాణ కౌశలం నేటికి ఆకట్టుకుంటోంది. చాళుక్య త్రిభువనమల్ల విక్రమాదిత్య ఈ కోటను నిర్మించాడని ఆయన పేరు మీదనే ఈ కోటకు త్రిభువనగిరి అని పిలిచేవారని చరిత్ర. తర్వాత కాలంలో ఇది భువనగిరికోటగా స్థిరపడింది. విశేషాలెన్నో... మత్తగజంలా కనిపించే శిలపై నిర్మించిన ఈ కోట మనను దూరం నుంచే ఆహ్వానిస్తున్నట్లుంటుంది. అంతటి నునుపైన శిలపై కోట ఎలా నిర్మించారో అర్థం కాదు. మొత్తం 50 ఎకరాలలో, 500 అడుగుల ఎత్తున్న ఏకశిల చూస్తే ప్రకృతి విచిత్రమే అనిపిస్తుంది. ఈ శిలకు రెండు వైపులా ద్వారాలున్నాయి. మెట్ల ద్వారా లేదా ట్రెక్కింగ్ చేస్తూ కోటకు చేరుకోవాల్సి ఉంటుంది. నేల మాలిగలు, ఆయుధాలు దాచే రహస్య స్థావరాలు, శత్రువులను తప్పు దోవ పట్టించే మార్గాలు, లోతైన కందకం ఇలా కోటలో విశేషాలు అనేకం. ఆవరణలో 2 తటాకాలు, కొన్ని లోతైన బావులు ఉన్నాయి. వాన నీటిని నిలువ చేసేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్లో తామర తుండ్లు వికసించటం నేటికి చూడవచ్చు. భువనగిరి నుంచి గోల్కొండకు రహస్య మార్గం ఉండేదని అంటారు. రుద్రమదేవి, ఆమె మనవడు ప్రతాపరుద్రుడి కాలంలో ఎంతో వైభవంగా వెలిగింది ఈ కోట. ఎన్నోసార్లు శత్రువుల దాడులకు లోనయినా, దుర్భేద్యంగా నిలిచిన భువనగిరి కోట 15 వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్ల చేతికి చిక్కింది. వారి ఫిరంగులు, గన్‌పౌడర్ దాడులకు తలొగ్గాల్సి వచ్చింది. వారి ఏలికలో ఇస్లామిక్ శైలిలో కోటకు కొన్ని మార్పులు జరిగాయి. ఆ తర్వాత 18 శతాబ్దం నుంచి ఎటువంటి మార్పు చేర్పులు లేకుండా ఉన్న ఈ కోట నేడు దాదాపు శిథిలావస్థకు చేరింది. అయినప్పటికీ ఈ కోట ఆర్కిటెక్చర్ ఆధునికులను ఆశ్యర్యపరుస్తుంది. కోట పై భాగానికి చేరి భువనగిరి నగరాన్ని వీక్షిస్తుంటే, గతం మిగిల్చిన జ్ఞాపకాల నుంచి బయటపడి కొత్త ఏడాదిలోకి ప్రయాణం మొదలు పెట్టడానికి కావలసిన బలాన్ని, ఉత్తేజాన్ని అక్కడి గాలి మనకు అందిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడికి చేరువలోనే యాదగిరి గుట్ట, సురేంద్రపురి మ్యూజియం ఉన్నాయి. -
డిసెంబర్ 27 నుంచి కాకతీయ ఉత్సవాలు
హన్మకొండ అర్బన్ (వరంగల్): వచ్చే నెల 27, 28, 29వ తేదీల్లో కాకతీయ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చిందని వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. కాకతీయ ఉత్సవాలపై హన్మకొండ లోని కలెక్టరేట్లో శుక్రవారం సాయంత్రం ఆయన ముందస్తు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ మాట్లాడుతూ కాకతీయ సామ్రాజ్యం విస్తరించి ఉన్న తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఉత్సవాలను ఘనంగా నిర్వహిం చేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు చేపడుతున్న ఏర్పాట్లపై సమీక్షిం చేందుకు ప్రభుత్వం శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.మధ్యాహ్నం 12గంట లకు ప్రారంభమయ్యే సమావేశానికి ప్రభుత్వ సలహాదారులు కేవీ.రమణాచారి, పాపారావు, టూరిజం, కల్చరల్ సెక్రటరీ బీపీ.ఆచార్య, సమా చార శాఖ కమిషనర్ చంద్రవదన్, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు ఇతర ఉన్నతాధి కారులు హాజరుకానున్నట్లు వివరించారు. వరంగల్ జిల్లాలోని రామప్ప, గణపురం, ఖిలా వరం గల్, వేయిస్తంభాల ఆలయంతోపాటు నల్లగొండ జిల్లా పొనగల్లు, ఖమ్మం జిల్లా పెర్టు, మెదక్ జిల్లా కోలచలను, హైదరాబాద్‌లోని లలిత కళాతోరణం, కరీంనగర్‌లోని ఎలగందుల పోర్టు, రంగారెడ్డిలోని అనంతగిరి, ఆదిలాబాద్‌లోని గాంధారికోట, మహబూబ్‌నగర్‌లోని అలం పూర్, నిజామాబాద్‌లోని డిచ్పల్లి ప్రదేశాల్లో నిర్వహించాలని ప్రతిపాదనలు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. -
కాకతీయుల కోటలో మువ్వన్నెల జెండా
ఖిలా వరంగల్‌లో పంద్రాగస్టు వేడుకలు సర్కారు గోల్కొండ స్ఫూరితో నిర్ణయం సాక్షి ప్రతినిధి, వరంగల్: వ్యవసాయానికి, భక్తికి ప్రాధాన్యత ఇచ్చి సుదీర్ఘపాలన సాగించిన కాకతీయుల రాజధాని కేంద్రం ఖిలావరంగల్‌లో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. తెలంగాణ రాష్ర్టంలో తొలిసారిగా జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి లో గోల్కొండ కోట ఆవరణలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే స్ఫూర్తి తో గత వైభవాన్ని గుర్తు చేసేలా వరంగల్లోనూ కాకతీయ కోటలో ఆగస్టు 15 వేడుకలకు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. కోట ప్రాంతం ఆవరణలోని ఖుష్‌మహల్ పక్క న ఖాళీ ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మేరకు ఖిలావరంగల్ ప్రాంతం స్వాతంత్య్ర వేడుకలకు ముస్తాబవుతోంది. కాకతీయుల్లో ముఖ్యురాలైన రాణిరుద్రమదేవి హయాం(1261)లో ఈ కోట నిర్మాణం పూర్తి అయ్యింది. కాకతీయుల శకం ముగిసిన తర్వాత నిజాం నవాబుల పరిపాలనలో షితాబ్‌ఖాన్ సైన్యాధికారిగా ఉన్నప్పుడు ఖిలావరంగల్‌లో ఖుష్‌మహల్ ను నిర్మించారు. కీర్తి తోరణాలు, ఖుష్‌మహల్ మధ్య ఉన్న ఖాళీ ప్రదేశంలో స్వాతంత్య్ర వేడుకలు జరగనున్నాయి.