
కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని, రాణి రుద్రమదేవి ధైర్య సాహసాలను బుల్లి›తెరపై ఆవిషరించేందుకు సిద్ధమైంది స్టార్ మా ఛానెల్. బుల్లి తెరపై మునుపెన్నడూ లేని ప్రమాణాలతో ‘రుద్రమదేవి’ కథను సీరియల్ రూపంలో తీసుకొస్తున్నారు. ‘‘ఈ రుద్రమదేవి కథా కాలాన్ని యథాతథంగా తెర మీదకు తీసుకు వచ్చేందుకు వందల మంది కృషి చేశాం. ఇది మన తెలుగు కథ. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన కథ’’ అని స్టార్ మా బృందం పేర్కొంది. ‘రుద్రమదేవి’ సీరియల్ జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు స్టార్ మా చానెల్‌లో ప్రసారం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment