స్టార్‌ మాలో మరో కొత్త సీరియల్‌ | Geetha LLB Serial Telecast On Star Maa On December 2 | Sakshi
Sakshi News home page

స్టార్‌ మాలో మరో కొత్త సీరియల్‌

Published Sat, Nov 30 2024 4:32 PM | Last Updated on Sat, Nov 30 2024 4:32 PM

Geetha LLB Serial Telecast On Star Maa On December 2

మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న "గీత ఎల్ ఎల్ బి" పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం.

ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ "గీత ఎల్ ఎల్ బి" సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతోంది’ అని మేకర్స్‌ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9.30 గంటలకు స్టార్‌ మాలో ఈ సీరియల్‌ ప్రసారం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement