serial
-
ప్రముఖ బుల్లితెర నటి అక్షత నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
Pavithra B Naik: హల్దీ ఫంక్షన్లో సీరియల్ నటి జోరు (ఫోటోలు)
-
బుల్లితెర ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త సీరియల్ వచ్చేస్తోంది!
స్టార్ మా సపరివారంలో సరికొత్తగా మరో సీరియల్ వచ్చి చేరనుంది. 'నువ్వుంటే నా జతగా' అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించనుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయనుంది.'నువ్వుంటే నా జతగా' అనే సీరియల్ ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథగా తీసుకొస్తున్నారు. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి.. గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ సీరియల్ సోమవారం(డిసెంబర్ 16) నుంచే రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని ఈ సీరియల్ ద్వారా చూపించనున్నారు.ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ మూడుముళ్లతోనే కరిగిపోతే? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే ఈ కథ స్టార్ మా బుల్లితెర ప్రేక్షకులను అలరించబోతోంది. -
స్టార్ మాలో మరో కొత్త సీరియల్
మహిళలు ఏ రంగంలో అయినా తమ ప్రతిభతో రాణించడానికి ఇప్పుడు ఆకాశమే హద్దు. ఎందరో ఇలా నిరూపించుకుని చరిత్ర సృష్టించారు. ఈ పరంపరలో ఎల్ ఎల్ బి చదువుకుని, లాయర్ గా తన వాదన వినిపించడానికి వస్తున్న గీత కథ ఇప్పుడు ప్రతి తెలుగు లోగిలినీ ప్రత్యేకంగా అలరించబోతోంది. ధైర్యసాహసాలతో, ఆత్మవిశ్వాసంతో లక్ష్య సాధన కోసం నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఆచరించే “స్టార్ మా” సీరియల్ కథల పరంపరలో రానున్న "గీత ఎల్ ఎల్ బి" పూర్తిగా ఒక విలక్షణమైన కథ. బంధాలకు విలువ ఇచ్చి, వాటిని నిలబెట్టాలనుకునే అమ్మాయి జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు, తడబడినా నిలబడడానికి ఆ అమ్మాయి చేసే ప్రయత్నాలు, ఎదురైన రకరకాల మనుషులు అన్నీ కలిస్తే ఈ గీత జీవితం.ఒక సగటు అమ్మాయి జీవితంలో.. ఎవరు తనకు ప్రేరణ అనుకుందో అతనితోనే గొడవకు దిగాల్సి రావడం ఆమెకు ఎదురైన అతిపెద్ద సవాలు. న్యాయాన్ని గెలిపించడానికి ఆ అమ్మాయి పడే తపన, కొన్నిసార్లు ఆమె అనుభవించే సంఘర్షణ "గీత ఎల్ ఎల్ బి" సీరియల్ ని విభిన్నమైన సీరియల్ గా నిలబెట్టబోతోంది’ అని మేకర్స్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ఈ సీరియల్ ప్రసారం కానుంది. -
బుల్లితెర ప్రియులకు సరికొత్త సీరియల్.. ఎప్పుటినుంచంటే?
తెలుగులో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఆదరిస్తున్న ఛానల్ "స్టార్ మా". సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోంది. తాజాగా "ఇల్లు ఇల్లాలు పిల్లలు" అనే సరికొత్త సీరియల్‌తో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథే ఇల్లు ఇల్లాలు పిల్లలు.ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే... ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథేంటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటోసరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చూడాల్సిందే.ఈ సీరియల్ ఈ నెల 12 నుంచి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు ప్రారంభం కానుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రసారం చేయనున్నారు. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ. తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు నిర్మాత, ప్రభాకర్ ఈ సీరియల్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు.ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చూపించనున్నారు. -
వెకేషన్లో గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
చీరలో ఉంగరాల జుట్టుతో సీరియల్ బ్యూటీ విష్ణుప్రియ (ఫొటోలు)
-
వరలక్ష్మి పూజలో తెలుగు సీరియల్ బ్యూటీస్ (ఫొటోలు)
-
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ సీరియల్ డైరెక్టర్ ఆత్మహత్య
ప్రముఖ దర్శకుడు చనిపోయాడు. సీరియల్, సినిమాకు దర్శకత్వం వహిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఇతడు.. ఇలా ఉన్నట్టుండి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీలో విషాదం నింపింది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ఇలా ప్రాణాలు తీసుకోవడానికి కారణం ఏమై ఉండొచ్చని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)గత 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న వినోద్ దొండాలే.. నన్నరాసి రాధే, గంగే గౌరి, కరిమణి తదితర సీరియల్స్‌తో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు. కొన్నాళ్ల క్రితం 'అశోక్ బ్లేడ్' అనే సినిమా కూడా మొదలుపెట్టాడు. దీని షూటింగ్ కూడా చివరి దశలో ఉంది. శుక్రవారం కూడా షూటింగ్ విషయమై హీరో సతీష్, నిర్మాతలతో కలిసి మాట్లాడాడు. శనివారం ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.సినిమా, సీరియల్ నిర్మాణంలోనూ వినోద్ ఎంటరయ్యాడని, దీని తర్వాత నష్టాలు ఎక్కువయ్యావని తెలుస్తోంది. ఈ క్రమంలోనే అప్పుల బాధ తట్టుకోలేక ఇలా ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సీనియర్ దర్శకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. (ఇదీ చదవండి: OTT: ‘ఫ్రీలాన్స్’ హాలీవుడ్ మూవీ రివ్యూ) -
కొత్త సీరియల్ సివంగి.. ఎప్పటినుంచి ప్రారంభమంటే?
సీరియల్స్ అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. అందుకే వారికి నచ్చేలా, వారు మెచ్చేలా ఎన్నో రకాల సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో జెమిని టివి "సివంగి” అనే సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. దీన్ని మార్చ్ 25 నుంచి ప్రసారం చేయనుంది. కథేంటంటే.. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్థికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. ఊళ్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్లిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని, అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన అక్క పెళ్లి చేయగలిగిందా? తిరిగి తన ఊరు వెళ్లగలిగిందా? అనేది తెలియాలంటే సివంగి సీరియల్ చూడాల్సిందే! ఈ ధారావాహిక మార్చి 25న ప్రారంభమవుతోంది. ప్రతిరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం కానుంది. "సివంగి” సీరియల్లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు. -
ఏవండోయ్..! శ్రీమతి గారు సీరియల్ టీమ్ తో చిట్ చాట్
-
Brahmamudi Serial Actors Photos: కూకట్‌పల్లిలో బ్రహ్మముడి సీరియల్ నటుల గ్రాండ్ బారాత్ (ఫోటోలు)
-
14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి
రేగ్యావిక్: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్లాండ్ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. ఐస్లాండ్ మెట్ ఆఫీస్ తెలిపిన దాని ప్రకారం రిక్టర్ స్కేల్‌పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్ దేశంలో 33 యాక్టివ్ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్‌లోనే ఇది అత్యధికం. ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత -
పాక్‌లో ఏం జరుగుతోంది? టెర్రరిస్టుల హత్యల్లో అంతుచిక్కని రహస్యం?
కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాదులు హతమైన అనంతరం పాకిస్తాన్‌లోనూ అదే తరహా ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మౌలానా జియావుర్ రెహ్మాన్ అనే మతపెద్ద కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్లోని ఒక పార్కులో పట్టపగలు హత్యకు గురయ్యాడు. రెహ్మాన్ లష్కరే కార్యకర్త. ఇద్దరు గుర్తుతెలియని దుండగులు రెహమాన్‌ను కాల్చిచంపారు. రెహ్మాన్ సాయంత్రం వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఈ హత్య జరిగింది. ఈ హత్య అతని బంధువులు, స్నేహితులు, అనుచరులను ఆందోళనకు గురిచేసింది. పాకిస్తాన్లో మతపెద్దలు.. మతపరమైన కార్యక్రమాలతో పాటు ఇతర సామాజిక కార్యక్రమాలలోనూ పాల్గొంటారు. ఖలిస్థాన్ కమాండో ఫోర్స్ చీఫ్ పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్ హత్య తీరులోనే లష్కర్ కార్యకర్త రెహ్మాన్ హత్య జరిగింది. ఉగ్రవాద ఆరోపణలతో భారత్ మోస్ట్ వాటెండ్‌గా ప్రకటించిన పంజ్వార్ను గత మే నెలలో లాహోర్‌లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. BIG BREAKING NEWS - Maulana Tariq Jameel's son Asim Jameel shot dead by UNKNOWN MEN in Talamba, Mian Chunnu of Pakistan 🔥🔥 Radical Maulana Tariq Jameel is well known for his hate speeches against Hindus and Bharat. All Terrorists in fear, ISI shocked after back to back such… pic.twitter.com/xRQ2hrhZUn — Times Algebra (@TimesAlgebraIND) October 29, 2023 పాక్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ, టెర్రర్ బాస్‌లు ఈ రెండు హత్యల్లోనూ సారూప్యతలను గమనించారు. ఈ నేపధ్యంలో ఐఎస్ఐ దాదాపు డజను ‘ఆస్తులను’.. ‘సేఫ్ హౌస్’లో ఉంచినట్లు ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్న నిఘా వర్గాలు తెలిపాయి. రావల్కోట్లో అబూ ఖాసిమ్ కాశ్మీరీ, నజీమాబాద్‌లో ఖరీ ఖుర్రామ్ షాజాద్ అనే మరో ఇద్దరు ఎల్ఈటీ కార్యకర్తల హత్యల కారణంగా బహుశా ముందుజాగ్రత్త మరింత అవసరమని ఐఎస్ఐ భావించి ఉండవచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవలే హత్యకు గురైన రెహ్మాన్.. జామియా అబూ బకర్ అనే మదర్సాలో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నాడని సమాచారం. పాకిస్తాన్ పోలీసులు తమ ప్రెస్ నోట్లో ఈ హత్యను ఉగ్రవాద దాడిగా అభివర్ణించారు. దేశంలో ఉగ్రవాదుల పాత్రను ఇది సూచిస్తోందని పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ పోలీసులు దీనిని టార్గెట్ కిల్లింగ్‌గా పరిగణిస్తున్నారు. రెహ్మాన్ హత్య కరాచీలో మత బోధకులపై వరుస దాడుల్లో భాగమని భావిస్తున్నారు. ఈ బోధకులంతా ఐఎస్ఐ ద్వారా ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలను ఏర్పరుచుకున్నారు. వీరు యువతను సమూలంగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తగిన శిక్షణ అనంతరం యువతను భారత్‌పై దాడికి పంపిస్తారని తెలుస్తోంది. కాగా గత మార్చి 1న, ఐసీ-814 ఇండియన్ ఎయిర్‌లైన్స్ హైజాకర్ అయిన పైలట్ జహూర్ ఇబ్రహీంను కాల్చి చంపారు. ఈ జైషే మహ్మద్ ఉగ్రవాదిపై గుర్తుతెలియని ముష్కరులు అతి సమీపం నుంచి రెండుసార్లు కాల్పులు జరిపారు. ఈ హత్యల పరంపర పాకిస్తాన్ చట్ట అమలు సంస్థలను, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐని కలవరపరిచింది. అయితే ఈ హత్యలు ప్రత్యర్థుల కారణంగా జరిగాయని కూడా ఐఎస్ఐ పూర్తిగా విశ్వసించడం లేదు. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయో వేచిచూడాలి. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్‌తో యుద్ధం.. హమాస్ కీలక ప్రకటన 🚨 Breaking : Sadiq, Sher Afzal, Fiyaz, Ghulam Rasool & Hafizullah, all Terπ0rists belonging to Lashkar-e-Taiba, have been abducted by #Unknown Gunmen in Neelum Valley, #PoK. News Source : Unknown (not confirmed yet)#IndianArmy #Kashmir#Pakistan #Hamas #ISIS pic.twitter.com/uhrybSj4qf — शून्य (@Shunyaa00) October 28, 2023 -
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
గణేష్ మండపాల వద్దకు టీవీ సీరియల్ నటీనటులు.. ఎవరో తెలుసా?
హైదరాబాద్‌లో వినాయకుడి పండుగ ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగా బొజ్జ గణపయ్య మండపాలు వేల సంఖ్యలో ఉంటాయి. వినాయకుడి పండుగ సందర్భంగా జెమిని టీవీలో ప్రసార అయ్యే 'ఒంటరి గులాబి' సీరియల్ టీమ్ వారు ఒక విభిన్నమైన ప్రచారానికి తెరలేపారు. వారందరూ కలిసి హైదరాబాద్‌లోని ప్రతి వినాయకుడి మండపాన్ని సందర్శించనున్నారు. నగరంలోని నలుమూలలా ఉండే గణేష్ మండపాలను స్వయంగా వారు సందర్శించనున్నారు. అంతేకాకుండా అక్కడ గణేష్ పూజలో పాల్గొని.. అక్కడి నిర్వాహకులతో పాటు భక్తులను స్వయంగా కలిసి వారితో ముచ్చటిస్తారు. అలా మీ ప్రేక్షక అభిమాన నటినటులు మీ వీధి, మీ కాలనీ, మీ గల్లికీ త్వరలో రాబోతున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాజాగా దిల్సుఖ్నగర్ వివేకానంద ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్, సరూర్ నగర్ నవజీవన్ యూత్ అసోసియేషన్ గణేష్ మండపాలను 'ఒంటరి గులాబి' సీరియల్లో లీడ్ రోల్లో నటించిన నటీనటులు సందర్శించారు. ఈ సీరియల్లో హీరో,హీరోయిన్గా నటిస్తున్న బాలు (రాహుల్ రవి), రోజా (సుప్రిత) నేరుగా గణేష్ మండపానికి వచ్చి సందడి చేశారు. వారితో ఫోటోలు దిగిన స్థానికులు ఎంతో సంబరపడుతున్నారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సీరియల్ మేకర్స్‌కు వచ్చిన విభిన్నమైన ఆలోచనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. -
పెళ్లయ్యాక కోడలిని చదవనిస్తారా?.. సరికొత్త కథనంతో 'మామగారు'!
తెలుగు రాష్ట్రాలలో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోన్న స్టార్ మాలో మరో కొత్త సీరియల్ వచ్చేసింది. సరికొత్త కథనంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు "మామగారు" అనే సరికొత్త సీరియల్‌తో పలకరించింది. ఈ నెల 11 నుంచి ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతోంది. స్టార్ మాలో ప్రసారమయ్యే వినూత్నమైన కథనం కలిగిన ఈ సీరియల్.. అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉండనుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని.. ఉన్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె. చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధ ల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్లు కావటం... ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటం తో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి.. చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది. అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయస్థితి ఏర్పడటం... డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రిని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య .. సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య.. తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? అనేది సీరియల్ చూస్తేనే తెలుస్తుంది. తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ.. ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు... నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో మామగారు సీరియల్ మిమ్మల్ని అలరించేందుకు వచ్చేసింది. -
ఏళ్ల తరబడి షూటింగ్.. సుజితకు అరకొర పారితోషికం?!
బాలనటిగా కెరీర్ ఆరంభించిన సుజిత ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేసింది. చిన్నప్పటినుంచే నటనలో ఓనమాలు నేర్చుకున్న ఆమె బుల్లితెరపై అనేక సీరియల్స్ చేసింది. వదినమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇది తమిళంలోని పాండియన్ స్టోర్స్‌కు తెలుగు రీమేక్. అక్కడ కూడా సుజిత ధనుషే ధనలక్ష్మి అనే ప్రధాన పాత్రలో నటిస్తోంది. దాదాపు 5 ఏళ్లుగా ఈ ధారావాహిక విజయవంతంగా కొనసాగుతోంది. తను ఎంత బిజీగా ఉన్నా ఈ సీరియల్ షూటింగ్ కోసం టైం కేటాయించేది సుజిత. మొదటి నుంచి ఇప్పటివరకు ఎంతోమంది ఆర్టిస్టులు మారుతూ వచ్చారు, కానీ కొన్ని పాత్రలు, నటులు మాత్రం అలాగే ఉండిపోయారు. తాజాగా ఆమె ఈ సీరియల్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందట. అంతేకాదు, ఈ సీరియల్‌కు సీక్వెల్లోనూ నటించనని తెగేసి చెప్పేసిందట! చాలాకాలం నుంచి తనకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా ఎగ్గొట్టడంతోనే ఆమె ఈ నిర్ణయం తీసుకుందట. ఈ విషయం తెలిసిన సీరియల్ మేకర్స్ వెంటనే ఆమెను సంప్రదించి ఇక మీదట ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని హామీ ఇచ్చారట. దీంతో సుజిత సీరియల్ నుంచి తప్పుకోవాలన్న ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి డబ్బులు ఇవ్వకుండా విసిగించడం వల్లే తనకు సీరియల్ నుంచి తప్పుకోవాలనే ఆలోచన వచ్చిందంటూ ప్రచారం జరుగుతోంది. ఇకపోతే సుజిత దర్శకనిర్మాత ధనుష్‌ను పెళ్లాడింది. వీరికి ధన్విన్ అనే బాబు ఉన్నాడు. సుజిత అన్నయ్య ప్రముఖ డైరెక్టర్ సూర్యకిరణ్ అన్న సంగతి తెలిసిందే! చదవండి: ఇలాంటి సినిమాలకు అవార్డులు ఇస్తే దేశసమైక్యత దెబ్బతింటుంది -
ఆ హీరోతో నటించాలని కోరిక.. కానీ ఆ పాత్ర చేయను: రాశి
సీనియర్ హీరోయిన్ రాశి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సూపర్ హిట్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. బాలనటిగా ఎంట్రీ ఇచ్చి అగ్ర హీరోలందరీ సరసన నటిచింది. గోకులంలో సీత, శుభాకాంక్షలు చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న రాశి కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరమైంది. అయితే ఆ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. పలు చిత్రాల్లోనూ కనిపించింది. (ఇది చదవండి: జైలర్ సినిమాలో మెగాస్టార్ ఉండాల్సింది, సైడ్ చేసిన రజనీకాంత్!) రీ ఎంట్రీ ఇచ్చిన రాశి.. సినిమాలతో పాటు సీరియల్స్‌లోనూ నటించింది. జానకి కలగనలేదు సీరియల్ రాశికి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె నటిస్తోన్న ఈ సీరియల్ చివరిదశకు చేరుకుంది. ఈ సందర్భంగా నటీనటులంతా యూట్యూబ్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా రాశి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో తన ఆల్ టైం ఫేవరెట్ హీరో శోభన్ బాబు, చిరంజీవి అని వెల్లడించింది. అయితే ప్రస్తుతం యంగ్ హీరోల్లో ప్రభాస్ అంటే ఇష్టమని తెలిపింది. ఆయనతో నటించాలని ఎంతో ఆసక్తిగా ఉందని రాశి చెప్పుకొచ్చింది. రాశి మాట్లాడుతూ.. 'ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో నటించాలనేది నా కోరిక. అది కూడా హీరోయిన్గా అయితే నటిస్తా. తల్లి లాంటి పాత్రలంటే మాత్రం ఒప్పుకోను. ఇప్పటివరకు నేను ప్రభాస్‌తో ఎప్పుడు మాట్లాడలేదు. అడవి రాముడు షూటింగ్ సమయంలో ఒకే హోటల్లో ఉన్నాం. ఆ విషయం తెలిసి నేను ఎగిరి గంతేశా. అయితే ప్రభాస్‌ను కలవాలని అనుకున్నా. కానీ కుదరలేదు. అయితే.. ఆయన ఉన్న రూమ్‌కు కాల్ చేసి మాట్లాడా. అయితే ప్రభాస్ సీనియర్స్‌కు చాలా మర్యాద ఇస్తారని విన్నా.' అని తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: కొత్త కారు కొన్న రణబీర్ కపూర్ - ధర తెలిస్తే అవాక్కవుతారు!) -
‘స్టార్ మా’లో సరికొత్త సీరియల్
భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మా ప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ "పలుకే బంగారమాయెనా". పుట్టుకతోపరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్. ‘గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు ఉంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులు ఉంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనేతపన ఉన్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది "పలుకేబంగారమాయెనా" కథ’ అని సీరియల్ బృందం పేర్కొంది. -
సీరియల్ షూటింగ్లో చిరుతపులి బీభత్సం!
సినిమా లేదా సీరియల్ షూటింగ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అన్ని సమకూర్చుకుని స్టూడియోల్లో షూటింగ్ చేస్తుంటారు. హైదరాబాద్‌లో చాలాచోట్ల ఇలానే జరుగుతుంటాయి. ముంబయిలో మాత్రం చిత్రీకరణలో పాల్గొంటున్న యాక్టర్స్ తెగ భయపడిపోతున్నారు. దానికి కారణం.. సెట్లోకి పాములు, కొండచిలువ, చిరుతల్లాంటివి ఎంట్రీ ఇస్తున్నాయి. ఇప్పుడూ అలాంటి సంఘటనే జరిగింది. (ఇదీ చదవండి: 'బ్రో' ఫ్యాన్స్ అందరికీ బ్యాడ్ న్యూస్!) ముంబైలోని గోరేగావ్ ఫిల్మ్ సిటీలో చిరుతపులి బీభత్సం సృష్టించింది. 'సుఖ్ మాంజే కాయ్ ఆస్తా' అనే మరాఠీ సీరియల్ షూటింగ్ మంగళవారం జరుగుతుండగా, సాయంత్రం 4 గంటల టైంలో చిరుతపులి సెట్లోకి వచ్చింది. చిన్న చిరుత పిల్లతో కలిసి అటు ఇటు తిరుగుతూ యాక్టర్స్‌తో పాటు మిగతా అందరినీ భయపెట్టింది. దీంతో అక్కడున్న దాదాపు 200 మంది ప్రాణభయంతో పరుగెత్తారు. ఈ విషయాన్ని ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా మీడియాకు చెప్పారు. గత 10 రోజుల్లో ఇలా చిరుతలు సెట్ లోకి రావడం ఇది నాలుగోసారి అని సురేష్ శ్యామ్ లాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలోనూ ఈయన ఇదే విషయాన్ని చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు జరిగిన సంఘటనతో అర్థమవుతోంది. గతంలో ఇలానే 'అజుని' సీరియల్ షూటింగ్ జరుగుతుండగా చిరుతపులి వచ్చింది, 'గుమ్ హై కిసీ కే ప్యార్ మే' షో జరుగుతుండగా ఏకంగా కొండచిలువ ప్రత్యక్షమైంది. ఇలా వరస సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ బెదిరిపోతున్నారు. #WATCH | A leopard, along with its cub, entered the sets of a Marathi TV serial in Goregaon Film City, Mumbai yesterday. All Indian Cine Workers Association president Suresh Shyamlal Gupta says, "More than 200 people were present at the set, someone could have lost life. This… pic.twitter.com/m1YgSXARl6 — ANI (@ANI) July 27, 2023 (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి 22 సినిమాలు) -
'ఆదిపురుష్' ఎఫెక్ట్.. ఆ 'రామాయణం' మళ్లీ రిలీజ్
ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమా విడుదలై పదిరోజులు దాటిపోయింది. కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. జనాలు ఈ చిత్రం గురించి మాట్లాడుకోవడం మెల్లగా తగ్గించేస్తున్నారు. కానీ వివాదాలు మాత్రం వదలట్లేదు. తాజాగా అలహాబాద్ హైకోర్ట్ చిత్రబృందంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. డైలాగ్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇదలా ఉండగానే 'రామాయణ్' మరోసారి విడుదలకు సిద్ధమైంది. డేట్ కూడా ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. వివాదాలే వివాదాలు! 'ఆదిపురుష్' సినిమాని రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ ఆధారంగా తీశారు. టీజర్ విడుదలైనప్పుడు రావణుడి గెటప్ వల్ల విపరీతంగా విమర్శలు వచ్చాయి. దీంతో ట్రైలర్స్ లో అతడిని అస్సలు చూపించలేదు. థియేటర్లలోకి సినిమా వచ్చిన తర్వాత రావణుడి కంటే.. గ్రాఫిక్స్, డైలాగ్స్ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయిపోయాయి. ఇది కాదన్నట్లు డైలాగ్ రైటర్ మనోజ్.. 'ఈ సినిమా రామాయణం కాదు', 'హనుమంతుడు దేవుడు కాదు' లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. (ఇదీ చదవండి: ప్రభాస్ 'ప్రాజెక్ట్- కె'.. ఆ విషయంలో ఆదిపురుష్‌ను దాటేయనుందా?) 'రామాయణ్' మరోసారి మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేశాడని 'ఆదిపురుష్' డైలాగ్ రైటర్ మనోజ్‌ని చంపేస్తామని కొందరు బెదిరించారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీశారని కొందరు కేసు వేశారు. ఇలా 'ఆదిపురుష్' సినిమాపై లెక్కలేనంత నెగిటివిటీ వచ్చింది. ఈ క్రమంలోనే దయానంద్ సాగర్ 'రామాయణ్' సీరియల్ ని మరోసారి టీవీల్లో స్ట్రీమింగ్ చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ రాత్రి! బాక్సాఫీస్ దగ్గర 'ఆదిపురుష్' కాస్త తగ్గిన నేపథ్యంలో 'రామాయణ్' సీరియల్ ని ఆ ఛానెల్ లో జూలై 3 నుంచి ప్రతిరోజూ రాత్రి 7:30 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. గతంలో పలుమార్లు ఈ సీరియల్ రీ రిలీజ్ చేస్తే ప్రేక్షకులు చాలా బాగా ఆదరించారు. లాక్‌డౌన్‌లోనూ ప్రసారం చేస్తే అప్పుడు విశేషాదరణ దక్కింది. 'ఆదిపురుష్' ఎఫెక్ట్ నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి? (ఇదీ చదవండి: 'విరూపాక్ష' డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్.. ఎన్ని లక్షలో తెలుసా?) -
ఆదిపురుష్ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్’ సీత
ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం ఆదిపురుష్. ఈ మూవీ టీజర్ నుంచి సినిమా రిలీజైన కూడా వివాదాలు వదలడం లేదు. మొదటి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రంపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రంలోని హనుమంతుని డైలాగ్స్, పాత్రల వేషధారణను తప్పుబడుతున్నారు. అసలు రామాయణాన్ని వక్రీకరించారంటూ రోజు రోజుకు ఆదిపురుష్‌పై చిత్రబృందంపై మండిపడుతున్నారు. ఇప్పటికే శక్తిమాన్ నటుడు ముకేశ్ ఖన్నా దర్శకుడు ఔం రౌత్‌కు రామాయణం గురించి కొంచెం కూడా అవగాహన లేదని విమర్శించారు. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) తాజాగా రామాయణం సీరియల్లో సీత పాత్ర పోషించి నటి దీపికా చిక్లియా ఆదిపురుష్ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై పురాణ, ఇతిహాసాలైన రామాయణంపై సినిమాలు తీయడం ఆపేయాలని దీపికా విజ్ఞప్తి చేశారు. ఆదిపురుష్‌పై మాట్లాడుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారమె. పాఠశాలల్లో విద్యార్థులకు పురాణాన్ని తప్పనిసరిగా బోధించాలని సూచించారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణం సీరియల్లో దీపిక సీత పాత్ర పోషించింది. దీపికా మాట్లాడుతూ.. ఆదిపురుష్ సినిమా గురించి నేను కామెంట్స్ చేయదలచుకోలేదు. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నా. రామాయణం మన వారసత్వం. దీనిపై ఇక నుంచి సినిమాలు చేయకూడదనేది నా ఉద్దేశం. రామాయణంపై సినిమా చేసిన ప్రతిసారీ ఏదో ఒక వివాదం తలెత్తుతోంది. రామాయణం మనకు చాలా పవిత్రమైనది. ఈ విషయంలో ఎవరినీ నొప్పించకూడదనుకుంటున్నా. మన విశ్వాసాన్ని మనం గౌరవించుకుందాం. రామాయణం అనేది వినోదానికి సంబంధించినది కాదు.' అని అన్నారామె. కాగా.. ఇప్పటికే దీపికా సహనటుడు అరుణ్ గోవిల్ కూడా ఆదిపురుష్ హాలీవుడ్ కార్టూన్ సినిమా అంటూ ఎద్దేవా చేశారు. కాగా.. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: చరణ్ కంటే ఉపాసన ఆస్తుల విలువే ఎక్కువా? ఎన్ని కోట్లో తెలిస్తే..) View this post on Instagram A post shared by Dipika (@dipikachikhliatopiwala) -
టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె వలసరవాక్కంలో దంపతుల మధ్య ఏర్పడిన కుటుంబకులహాల కారణంగా ప్రముఖ టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చైన్నె వలసరవాక్కము అన్బునగర్ రెండవ వీధిలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న నాగరత్నం (47). ఇతను టీవీ సీరియల్ డైరెక్టర్. ప్రముఖ ప్రైవేటు చానల్లో ప్రసారం అవుతున్న పాండవర్ ఇల్లం అనే సీరియల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పైగా వాణి రాణి, సెవ్వంది అనే టీవీ సీరియల్ లోను డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతని భార్య పద్మావతి (37). వీరి సొంత ఊరు కోవై జిల్లా పొల్లార్చి. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వీరికి నవీనేషు (15), సాయి ఆదర్శ (8) ఇద్దరు కుమారులు. ప్రస్తుతం పాఠశాలలలకు సెలవులు కావడంతో నాగరత్నం కుటుంబంతో కలిసి సొంతూరు పొల్లాచ్చికి వెళ్లారు. తర్వాత ఇద్దరు కుమారులను అక్కడ వదిలిపెట్టి భార్యతో కలిసి నాగరత్నం చైన్నెకి వచ్చారు. ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టి ఏదైనా వ్యాపారం చేపడతామని నాగరత్నంతో భార్య పద్మావతి చెప్పింది. ఈ విషయంగా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి టీవీ సీరియల్ షూటింగ్‌కు వెళ్లి నాగరత్నం గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య భర్త మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు గురువారం ఉదయం పొల్లాచ్చి నుంచి చైన్నెకి తిరిగి వచ్చారు. వారిని తీసుకొచ్చేందుకు నాగరత్నం కోయంబేడు బస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కుమారులను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గదిలో పద్మావతి ఉరి వేసుకొని వేలాడుతుండడం చూసి దిగ్బ్రాంతి చెందాడు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రకి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమె అప్పటికే మృతిచెందిన్నట్లు తెలిపారు. విషయం తెలిసి వలసరవాక్కం పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సీరియల్ షూటింగ్లో అగ్నిప్రమాదం.. పూర్తిగా కాలిబూడిదైన సెట్
ప్రముఖ హిందీ సీరియల్ సెట్స్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ముంబైలోని ఫిలిం సిటీలో 'ఘమ్ హై కిసికీ ప్యార్ మే' సీరియల్ సెట్లో భారీగా మంటలంటుకున్నాయి. దాదాపు సెట్ అంతా ధగ్దమైనట్లు కనిపిస్తోంది. ఈ సెట్ పరిసరాల్లోనే సీరియల్ యూనిట్ షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సెట్ సమీపంలో శూన్య స్క్వేర్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న మరో సెట్‌కు సైతం ఈ మంటలు వ్యాపించాయి. కాగా సీరియల్ యూనిట్ అంతా ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే ఓ బ్లాస్ట్‌కు సంబంధించిన సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. నటీనటులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై సెట్ బయటకు పరుగులు తీయగా వారికి సంబంధించిన వస్తువులు మాత్రమే సెట్లోనే ఉండిపోయినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
‘అలా జరిగి ఉంటే.. బాహుబలిలో రాజమాత పాత్ర నేను చేసేదాన్ని’
చాలా గ్యాప్ తర్వాత సీనియర్ నటి, అలనాటి హీరోయిన్ జయచిత్ర మణిరత్నం పొన్నియన్ సెల్వన్‌లో మెరిశారు. 70, 80లలో గ్లామరస్ హీరోయిన్గా తెలుగు తెరపై అలరించిన వారిలో ఆమె ఒకరు. శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలందరి సరసన హీరోయిన్గా నటించి మెప్పించారు ఆమె. ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన జయచిత్ర అత్త, తల్లి పాత్రలతో రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్న ఆమె తాజాగా పొన్నియన్ సెల్వన్‌లో ఓ ప్రధాన పాత్రలో కనిపంచారు. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో జయచిత్ర తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. చదవండి: హీరోతో లిప్‌లాక్ సీన్.. రాత్రిళ్లు ఉలిక్కి పడి లేచేదాన్ని: రష్మిక ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించి.. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా స్టార్ హీరోలకు అత్త పాత్రలు వంటి పవర్ఫుల్ రోల్స్ చేసిన తనకు ఇప్పటికి ఓ అసంతృప్తి ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ సీరియల్లో నటించే అవకాశం కొల్పోయానంటూ జయచిత్ర వాపోయారు. ‘నేను హీరోయిన్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన సినిమాలు నేను చేసుకుంటూ వెళ్లేదాన్ని. కానీ ఓ సీరియల్లో అవకాశం చేజారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఆ సీరియల్ పేరు ‘మంగమ్మగారి మనవరాలు’. దర్శకుడు రాఘవేంద్రరావుగారి ఫ్యామిలీకి చెందినవారే ఆ సీరియల్ చేశారు. ఆ సీరియల్‌కి సంబంధించిన విషయాలను మాట్లాడటానికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. అదే సమయంలో నేను ఫోన్లో అదే సీరియల్ కథను వింటున్నాను’ అని చెప్పారు. చదవండి: ప్రభాస్‌కు ఏమైంది? ఫ్యాన్స్ ఆందోళన ‘‘అయితే వచ్చిన వారిలో ఒకరు నా గురించి ఆసత్య ప్రచారం చేసి ఆ సీరియల్ అవకాశం పోయేలా చేశారు. నేను ఫోన్లో ఆ సీరియల్ కథ వింటుండగానే వచ్చిన వారిలో ఓ వ్యక్తి ‘నేను సీరియల్ చేయనన్నాననీ, ఫారిన్ వెళ్లిపోయే ఉద్దేశంతో ఉన్నానని’ అవతలివారికి చెప్పేశారు. రాజమౌళి గారి గెస్టు హౌస్‌లో ఉంటూ ఆ సీరియల్ చేయడానికి ఒప్పుకున్నప్పటికీ, రాఘవేంద్రగారికి లేనిపోనివి చెప్పారు. అలా ఆ ప్రాజెక్టులో నేను లేకుండా పోయాను. ఒకవేళ ఆ సీరియలక్లో నేను నటించి ఉంటే ‘బాహుబలి’ సినిమాలో రాజమాత పాత్ర నాకు దక్కి ఉండేదేమో. ఇన్ని సినిమాలు చేసిన నాకు ఒక సీరియల్ ఇలా మిస్సయిందే అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చారు. -
'కార్తీకదీపం' ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన డైరెక్టర్
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసి నాలుగేళ్లుగా దిగ్విజయంగా దూసుకుపోతుంది ఈ సీరియల్. అయితే తాజాగా ఈ సీరియల్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డైరెక్టర్. వంటలక్క(దీప), డాక్టర్ బాబు(కార్తీక్)ల కథ విషాదంగా ముగించారు. ఓ రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ చనిపోయినట్లు సీరియల్లో చూపించారు.దీంతో ఇకపై కార్తీకదీపంలో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరు. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ బాబు ఫేం నిరుపమ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కార్తీకదీపం సీరియల్‌కి గుడ్‌బై అంటూ సెట్లో చివరి రోజు షూటింగ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లుగా తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.ఈ విషయం తెలిసి కార్తీక దీపం ఫ్యాన్స్ ఉద్వేగానికి గురవుతున్నారు. సీరియల్లో ట్విస్ట్ ఇవ్వడానికి వంటలక్క, డాక్టర్ బాబును చంపేయడం ఏంట్రా అంటూ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే సీరియల్ చూడమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీరియల్ హైలెట్ రోల్స్ అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేయడంతో ఇకపై కార్తీకదీపం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెక్ట్స్ జనరేషన్లో హిమ దీపలా మారుతుందని, మోనిత కొడుకు డాక్టర్ బాబులా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala) -
బుల్లితెరపై నటుడిగా అలరించబోతున్న సింగర్ మనో, ఏ సీరియల్లో అంటే..
సాక్షి, హైదరాబాద్: అమ్మతనంలోని గొప్పతనాన్ని ఏ కళ కూడా పూర్తిగా ప్రతిబింభించలేదని ప్రముఖ సీరియల్ నటి హారిత తెలిపారు. నటిగా తనకు తల్లి, అత్త క్యారెక్టర్లే మంచి గుర్తింపునిచ్చాయని పేర్కొన్నది. జీ తెలుగు వేదికగా ఈ నెల 31వ తేదీ నుంచి ‘కళ్యాణం కమనీయం’ ధారావాహిక ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన లాంచింగ్ కార్యక్రమాన్ని రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ సందర్భంగా నటి హారిత మాట్లాడుతూ.. కలవారి కోడలు, ముద్దమందారంతో జీ తెలుగులో మంచి అభిమానం పొందిన రెండేళ్ల తర్వాత కళ్యాణం కమనీయంలో అమ్మగా మళ్లీ వస్తుండటం సంతోషంగా ఉందని, జీ తెలుగుకు తోబుట్టువులా మారానని తెలిపింది. నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ.. మొదటిసారి ఒక సీరియల్లో సింగర్ మనో నటిస్తున్నారని అన్నారు. ఈ ధారావాహికలో ముఖ్యతారాగణంగా మేఘన లోకేశ్, రాక్‌స్టార్‌గా మధు విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటారని అన్నారు. ఒక సినిమాకుండే విలువలతో ఈ సీరియల్ రూపొందించారని నటీ మేఘన తెలిపింది. గత కొంత కాలంగా ఎదురు చూస్తున్న డ్రీమ్ రోల్ కళ్యాణం కమనీయంలో దొరికిందని మధు అన్నారు. -
ప్రియురాలితో పెళ్లి కోసం.. టీవీ షో చూసి దొంగతనం.. చివరకు
న్యూఢిల్లీ: సాధారణంగా టీవీలలో, సీరియల్స్లలో కల్పిత పాత్రలతో క్రైమ్ వార్తలను ప్రసారం చేస్తుంటారు. దొంగతనాలు, కిడ్నాప్‌లు ఆయా ఘటనలకు సంబంధించి కల్పిత పాత్రలను.. ప్రేక్షకుల కంటికి కట్టినట్లు చూపించడానికి టీవీలలో అనేక కార్యక్రమాలు చేస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాల వలన నేరం చేస్తే.. పడే శిక్షలను పరోక్షంగా చూపిస్తుంటారు. కొందరు వీటిని చూసి తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటే.. మరికొందరు కేటుగాళ్లు మాత్రం టీవీలలో చూపించే కల్పిత దృశ్యాలను అనుసరించి అడ్డంగా బుక్కైపోతారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి న్యూఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మొహమ్మద్ ఫహీముద్దీన్ అనే వ్యక్తి లాహోరి గేట్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇతను జనవరి 18న వ్యక్తిగత పనుల కోసం బయటకు వెళ్లాడు. ఆ తర్వాత రాత్రికి ఇంటికి చేరుకుని చూసేసరికి ఇంటి మెయిన్ గేట్ తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించాడు. వెంటనే షాక్‌కు గురైన ఫహీముద్దీన్.. అదే రోజు తన ఇంట్లో డబ్బు, బంగారం పోయినట్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆ ప్రాంతాలలోని దాదాపు 200ల సీసీ కెమెరాలను పరిశీలించారు. చివరకు నిందితుడిని కాట్రా హిందు ప్రాంతంలో కనుగొన్నారు. నిందితుడిని ఫయాజ్గాను.. అతడికి 20 ఏళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతని ఇంట్లో నుంచి దాదాపు 2,15,000 డబ్బు స్వాధీనం చేసుకున్నారు. రెండు బంగారు గొలుసులు, ఒక రింగ్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు పలు ఆసక్తికర విషయాలను తెలిపాడు. స్థానిక టీవీ క్రైమ్ షో ‘సావధాన్ ఇండియా’ స్ఫూర్తితో చోరీకి పాల్పడినట్లు తెలిపాడు. ఆ షోలో చోరీచూసి ఎలా తప్పించుకోవచ్చో చూశానని .. అలానే చేశానని తెలిపాడు. తాను.. నెలకు 8వేలను సంపాదిస్తున్నానని.. అది చాలకే చోరీల బాట ఎంచుకున్నట్లు వివరించాడు. వచ్చే ఫిబ్రవరి 14న తన ప్రియురాలిని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా తెలిపాడు. అతగాడి సమాధానాలు విని పోలీసులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చదవండి: ప్రేయసి కోసం కిడ్నీ దానం చేసిన ప్రియుడు.. ట్విస్ట్ ఏంటంటే -
సీరియల్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నటి ఆమని
సీనియర్ నటి, ఒకనాటి టాప్ హీరోయిన్ ఆమని చిన్నితెరపై దర్శనమివ్వనున్నారు. తొలిసారిగా ఆమె నటించిన తెలుగు సీరియల్ జీ తెలుగులో శనివారం (ఆగస్టు 21,2021) నుంచి ప్రసారం కానుంది. అదే విధంగా ఉప్పెన ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన కృతి శెట్టి తొలిసారిగా ఈ సీరియల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుండడం మరో విశేషం. ఈ సందర్భంగా ఆమని మాట్లాడుతూ... తొలిసారిగా తెలుగు చిన్నితెరకు పరిచయం అవుతున్నందుకు, కుటుంబ ప్రేక్షకులకు మరింత చేరువ అవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. వినూత్న కధాంశంతో తెరకెక్కిన ఈ సీరియల్లో కధానాయిక పాత్ర కీలకం. సంప్రదాయాలకు విలువనిచ్చే నవతరం యువతి ఆలోచనల నేపధ్యంలో ఈ సీరియల్ సాగుతుందని రూపకర్తలు తెలిపారు. పెళ్లయ్యాక తనతో పాటు మెట్టినింటికి తల్లీదండ్రులను కూడా తీసుకెళ్లాలని ఆశించే గీత పాత్రలో నటి నిషామిలన్ కనిపిస్తారు. ఈ సీరియల్ రాత్రి 7.30గంటలకు ప్రసారం అవుతుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. చదవండి : 'డైరెక్టర్ కంటే డిజైనర్‌గానే ఎక్కువ సంపాదించా' చిరు బర్త్‌డే : స్పెషల్ సాంగ్‌తో చాటుకున్న అభిమానం -
"అమ్మకు తెలియని కోయిలమ్మ" స్టార్ మాలో
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న స్టార్ మా.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్ గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది ? ఎవరి కథ ఎందుకలా అయింది ? అసలు ఎందుకు ఇలా జరిగింది ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో .. అనుబంధాల ఆధారంగా విశ్లేషించే కథ ఇది. తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ ముఖ్యమైన కేరక్టర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు. జులై 19 న రాత్రి 9.30 గంటల నుంచి స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ప్రేక్షకుల్ని అలరించబోతోంది. -
బుల్లితెరపై శివగామిలా అదరగొడుతున్న రాశీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
సీనియర్ నటి రాశీ అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాశీ తన అందం, అభినయంతో ఎంతోమంది అబిమానులను సొంతం చేసుకుంది. శ్రీదేవి, మీనల తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాశీ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. 1997లో జగపతిబాబుతో నటించిన శుభాకాంక్షలు సూపర్ హిట్ కావడంతో ఇండస్ర్టీని తన వైపుకు తిప్పుకుంది. ఆ తర్వాత బాలకృష్ణ, పవన్ కల్యాణ్, శ్రీకాంత్ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన రాశీ 90వ దశకంలో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. టాప్ డైరెక్టర్లు కూడా ఈమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే రాశీ పాపులారిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు విలన్ పాత్రలతోనూ మెప్పించింది. తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో నెగిటివ్ రోల్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటివరకు ఫ్యామిలీ ఆడియోన్స్‌కు దగ్గరైన రాశీ నిజ సినిమాతో ఓ వర్గం నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన రాశీ ప్రస్తుతం ఓ బుల్లితెర ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. మాటీవీలో ప్రసారమవుతున్న 'జానకి కలగనలేదు' అనే సీరియల్లో జ్ఞానాంబగా అలరిస్తుంది. ప్రస్తుతం ఈ సీరియల్ టీఆర్పీ రేటింగులో దూసుకుపోతుంది. ముఖ్యంగా రాశీ పాత్రకు ఆడియోన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారట. హిందీ సీరియల్ దియా ఔర్ బాతి హమ్కు రీమేక్‌గా వచ్చిన ఈ సీరియల్‌తో తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన రాశీకి మరోసారి అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. తన నటనతో బుల్లితెర శివగామిగా పేరు గాంచిన రాశీ ఈ సీరియల్ కోసం భారీ రెమ్యునరేషనే తీసుకుంటుందట. ఆమెకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని వారానికి దాదాపు లక్ష రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వల్లే సీరియల్లో నటిస్తుందనే వార్తలను రాశీ ఖండించినట్లు సమాచారం. చదవండి : సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత అందుకే అనసూయ పాత్రను తిరస్కరించాను: రాశి -
Devatha Serial : సత్యని నందా ఎక్కడకి తీసుకెళ్లాడు?
రోజురోజుకూ రసవత్తరంగా సాగుతున్న దేవత సీరియల్ నేడు (మే6)న 226వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్లాడు? సత్య గురించి రుక్మిణితో ఆదిత్య ఏం చెప్పాడు? కమల పడుతున్న బాధను భాగ్యమ్మ పసిగట్టిందా లాంటి వివరాలు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఒక అద్భుతం చూపిస్తా బయటకు వెళ్దామని నందా సత్యని అడగ్గా మొదట నో చెప్తుంది. అయితే తనలో దాచుకున్న అగ్ని పర్వతం లాంటి నిజాన్ని భాగ్యమ్మకు చెబుతానంటూ నందా బ్లాక్మెయిల్ చేయడంతో సరే నంటుంది సత్య. ఇక దేవుడమ్మకు ఎలాగైనా బుద్ది చెప్పాలని పథకాలు పన్నే రంగా మరో ఐడియాను తెరమీదకు తీసుకొచ్చాడు. తన భార్య సొంతూరుకు బంతిని తీసుకెళ్తే అటు దేవుడమ్మ పరువుతో పాటు తన భార్య పరువు కూడా పోతుందని, ఇలా ఇద్దరికి ఒకేసారి బుద్ది చెప్పినట్లువుతుందని బంతితో తన పథకం గురించి వివరిస్తాడు. ఈ ప్లాన్‌తో తనకు కూడా కలిసి వస్తుందనుకున్న బంతి రంగాను పొగడ్తలతో ముంచెత్తుతుంది. ఇక సీన్ కట్ చేస్తే సత్యని పంతులు దగ్గరికి తీసుకెళ్లిన నందా తమ పెళ్లికి సంబంధించి మంచి ముహూర్తం పెట్టమని కోరాడు. మరో వారం రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు చెప్పగా, ఆ తర్వాత జరగాల్సిన తంతుకు కూడా ముహూర్తాలు పెట్టమని అడిగిన నందాకు పంతులు చివాట్లు పెడతాడు. ఇక నందా తీరుతో సత్య బాధపడిపోతుంటుంది. మరోవైపు నందా సత్యని ఎక్కడకి తీసుకెళ్లాడో తెలియక ఆదిత్య కంగారు పడిపోతుంటాడు. ఇది గమనించిన రుక్మిణి ఏమైందని అడగ్గా తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు. సీన్ కట్ చేస్తే సత్య జీవితం గురించి తలుచుకుంటూ కమల కుంగిపోతుంటుంది. రుక్మిణి జీవితం బాగుండటం కోసం సత్య ఇంకెన్ని త్యాగాలు చేస్తుందో అని తలుచుకొని తనలో తానే బాధపడిపోతుంటుంది. ఇది గమనించిన భాగ్యమ్మ కొన్ని రోజులుగా కమల ఎందుకు అలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే అకస్మాత్తుగా నందా సత్య జీవితంలోకి రావడం వల్ల అసలు అతను ఎవరో ఏంటో పూర్తిగా తెలుసుకునే అవకాశం లేకుండా పోయిందని, సత్య జీవితం ఎలా ఉంటుందో అన్న బాధ ఉందని సమాధానం ఇస్తుంది. -
Devatha serial: నందా అసలు స్వరూపాన్ని బయటపెట్టేసిన కమల
సత్య-ఆదిత్యల ప్రేమాయణంబయటపెట్టాస్తానంటూనందా బెదిరిస్తుండటం, సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఎవరో తెలుసుకోవాలని రాజేశ్వరి ఆరాటపడుతుంటంతో ఎపిసోడ్ రోజు రోజుకి ఆసక్తిగా మారిపోయింది. మరోవైపు సత్య-నందాలకి పెళ్లి చేయాలని దేవుడమ్మ నిర్ణయించడం, ఈ గండం నుంచి సత్యను ఎలా బయటపడేయాలో అని ఆదిత్య ఆరాటపడుతుండం ప్రేక్షకులను రక్తి కట్టిస్తుంది. ఈ నేపథ్యంలో దేవత సీరియల్ నేడు (మే 5)న 225వ ఎపిసోడ్‌లోకి ఎంటర్ అయిపోయింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం కారణం ఎవరో తెలుసుకోవాలని రాజేశ్వరి తెగ ఆరాటపడుతుంటుంది. ఈ నిజం తెలుసుకొని దేవుడమ్మను దెబ్బకొట్టాలని నందాతో కలిసి చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇదే విషయంపై నందాను పిలిపించి అడుగుతుంది. సత్య కడుపుకి కారణం ఎవరో చెప్పు? ఈ నిజం నాకు తెలియాలి అంటూ నందాను నిలదీస్తుంది. అయితే రహస్యాలు చెప్పుకునేంత ర్యాపో ఇద్దరి మధ్యా లేదని, ఇలాంటి ఆణిముత్యాలాంటి నిజాల్ని చెప్పాలంటే ముందు మీపై నాకు నమ్మకం కలగాలి అని నందా బదులిచ్చాడు. దీంతో ఆ నమ్మకం ఎలా వస్తుంది అంటూ ఒకింత ఫైర్ అవుతుంది రాజేశ్వరి. ఓ 50 వేల రూపాయలు ఇవ్వండి మీరిచ్చిన డబ్బు చూసినప్పుడల్లా మీకు నిజం చెప్పానిపిస్తుంటుంది అని నందా పేర్కొనగా.. కడుపుకి అన్నం తింటావా? లేక డబ్బులు తింటావా అంటూ రాజేశ్వరి ఫైర్ అయ్యింది. సీన్ కట్ చేస్తే.. సత్య.. భాగ్యమ్మ కూతురు కాదన్న నిజం నందాకి తెలిసిపోయిందని, అంతేకాకుండా సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణం ఆదిత్యే అన్న నిజం కూడా బయటపెడ్తానని నందా బెదిరిస్తున్నాడని చెబుతూ కమల బాధ పడుతుంటుంది. మా అక్కా చెల్లెళ్లకు ఏదో దరిద్రం పట్టినట్లుంది అందుకే మా తలరాత ఇలా అయ్యింది అంటూ కుమిలిపోతుంటుంది. నందా నిజ స్వరూపం తెలుసుకున్న భాషా అతడిని చావబాదుతుంటగా నేను సత్యకి కాబోయే భర్తను.. సత్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రిని అంటూ నందా అమాయకుడిలా నటిస్తుంటాడు. దీంతో మరింత కోపోద్రిక్తుడైన భాషా.. నీ బాగోతం ఏంటో తనకు తెలుసని అసలు నీ వెనకున్నది ఎవరో చెప్పాలని నందాని అడుతుతాడు. అయితే దీనికి ఆన్సర్ ఇవ్వక పోగా తనతో చేతులు కలిపితే లెక్కలేనంత డబ్బు ఇస్తానని నందా డీల్ మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. దీంతో రుక్కు కోసం తాను ప్రాణాలు ఇస్తానని, అలాంటిది నీ బెదిరింపులకు లొంగనని చెప్పాడు. నిజం చెబుతా అని బెదిరిస్తున్నావ్ కదా అసలు నిన్నే లేకుండా చేస్తే నిజం ఎలా చెబుతావంటూ నందాని బాష కత్తితో పొడిచాడు. అయితే ఇదంతా నిజం కాదు. కేవలం కల మాత్రమే. తనకు వచ్చిన పీడకలతో గట్టిగా అరుస్తుంది కమల. దీంతో ఏమైందని భాగ్యమ్మ అడిగినా జవాబు చెప్పకుండా దాటవేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే నందా పెడుతున్న టాచ్చర్ నుంచి కొన్ని రోజులు తప్పించుకోవాలని, తన ఇంటికెళ్తే కాస్త ప్రశాంతంగా ఉంటుందని సత్య ఆలోచిస్తుంటుంది. ఈలోగా నందా వచ్చి 'ఏంటీ అంత డీప్‌గా ఆలోచిస్తున్నావ్? నన్ను ఎలా చంపాలా అని ప్లాన్ చేస్తున్నావా? అంతలా ఆలోచించకు దీనికి నీ మాజీ ప్రియుడు, మీ బావ ఆదిత్య వద్దే చాలా ప్లాన్స్ ఉంటాయ్ అంటూ' మాటలతో హింసిస్తుంటాడు.. ఇక ఓ అద్భుతం చూపిస్తానని, బయటకు రావాలంటూ సత్యని అడుగుతాడు. మరి ఆ ఆద్బుతం ఏంటి? సత్యని నందా ఎక్కడికి తీసుకెళ్దాం అనుకుంటున్నాడు అన్నది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. -
Intinti Gruhalakshmi: దివ్య ఆత్మహత్యాయత్నం!
కళ్ల ముందే కట్టుకున్నోడిని ఒకరు ఎగరేసుకుపోతుంటే ఏ భార్యా సహించదు. భూదేవి అంత సహనమున్న ఓ మహిళ కూడా తనకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకపోయింది. పైగా తన భర్త కావాలనుకుంటోంది ఓ జిత్తులమారి నక్కను అని తెలిసి అతడిని కాపాడాలనుకుంది. ఈ ప్రయత్నంలో భర్తకు, ఏకంగా ఇంటిల్లిపాదికే ఆమె శత్రువుగా మారింది. అయినా సరే తన భర్తను తిరిగి తన సొంతం చేసుకునేందుకు పోరాడుతున్న తులసి కథే "ఇంటింటి గృహలక్ష్మి". మూడు వందలకు పైగా ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న ఈ సీరియల్లో తులసి కష్టాలు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయే తప్ప తగ్గడం లేదు. ఏడ్చి ఏడ్చి ఆమె కన్నీళ్లు ఇంకిపోయినా బాధలు ఆమెను వదిలి పెట్టడం లేదు. మరి నేటి(మే 5న) ఎపిసోడ్లో ఏం జరిగిందో చదివేయండి.. నందు.. తులసికి దూరం కావాలన్న కసితో పక్కా ప్లాన్‌తో ఇల్లు వదిలి పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది లాస్య. దీనికంతటికీ కారణం తులసే అంటూ భార్య మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నందు. దీనికి తోడు లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి వీడియోను చూపించడంతో విడాకులు ఇచ్చి తీరుతానని శపథం చేశాడు. నాలుగు నెలల తర్వాత ఎవరి దారి వారిదేనని తేల్చి చెప్పాడు. అలా లాస్య ప్లాన్ అనుకున్నదానికంటే బాగా సక్సెస్ అయింది. ఇక కళ్లెదుటే తల్లిదండ్రులు విడిపోవడం గురించి మాట్లాడటం జీర్ణించుకోలేకపోయిన తులసి కూతురు దివ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. అమ్మ ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదని తండ్రిని నిలదీసింది. దీనికి సమాధానం చెప్పలేకపోయిన నందు నువ్వు చిన్నపిల్లవి అంటూ తను మారు మాట్లాడకుండా చేవాడు. ఎవరినైతే తన చెంతకు చేర్చుకోవాలని ప్రయత్నిస్తుందో అతడే విడాకులు తథ్యం అని చెప్పడంతో కూలబడిపోయింది తులసి. అన్నీ తలచుకుని ఒంటరిగా తనలో తానే కుమిలిపోయింది. తనను అలా చూసి చలించిపోయిన తులసి చిన్నకొడుకు మంచి రోజు వస్తుందంటూ తల్లికి ధైర్యం చెప్పాడు. మరోవైపు దివ్యకు మెడిసిన్ సీటు వచ్చింది, కానీ అందులో జాయిన్ చేయడానికి నందు పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదు. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమైంది దివ్య. మరి సూసైడ్‌కు ప్రయత్నించిన దివ్యను తులసి కాపాడుకుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్లో తేలనుంది. చదవండి: హిందీలోకి దృశ్యం 2 రీమేక్ 'ఆయనతో సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా' -
karthika Deepam : మోనిత ప్లాన్ సక్సెస్, కన్నీరు పెట్టుకున్న కార్తీక్
‘కార్తీకదీపం’.. ఈ సిరీయల్ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు లేరు. వంటలక్క, డాక్టర్ బాబుల కలయిక అనే ఒక్క థీమ్‌తో సీరియల్‌ను రోజురోజుకు ఎంతో రక్తి కట్టిస్తున్నాడు డైరెక్టర్. ఇప్పటి వరకు 1000 ఏపీసోడ్‌లకు పైగా ఈ సీరియల్ టెలికాస్ట్ అయినప్పకీ డాక్టర్ బాబు, వంటలక్కలు కలిసింది లేదు. ప్రస్తుతం దీప ఆరోగ్య పరిస్థితి క్షిణించడంతో డాక్టర్ బాబు కాస్తా దిగి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీరియల్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే డాక్టర్ పూర్తిగా ఎప్పుడు మారతాడో, లేదంటే ఆలోపే దీప చనిపోతుందేమో అనే ఆందోళన ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ క్రమంలో గత మూడు రోజుల ఎపీసోడ్‌ల్లా నుంచి మోనితా దీపను చంపేందేకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్వయంగానే కార్తీక్‌యే ఈ టాబ్లెట్‌ను దీపకు ఇచ్చేల మోనిత చేసింది. ఇక నేటి ఏపిసోడ్‌లో మరి మోనిత ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో ఒకసారి తెలుసుకుందాం. ఈ రోజు ఏపీసోడ్లో.. కార్తీక్ మోనిత ఇచ్చిన హైడోస్ డ్రగ్ టాబ్లెట్‌ను దీపను వేసుకొమ్మని కోరడంతో ఆమె వేసుకుంటుంది. ఆ తర్వాత సీతారాముల కల్యాణం జరిపించడానికి కార్తీక్‌తో కలిసి దీప పీటల మీద కుర్చుంటుంది. ఈ నేపథ్యంలో కాసేపటికి దీప కళ్లు తిరిగుతూ వింతగా ప్రవర్తించడం చూసి మోనితా తన పని ఇంత ఈజీ అయిపోతుందని తెగ సబ్బరపడిపోతుంది. ఇంతలో దీప కళ్లకు మైకం రావడంతో కార్తీక్‌పై పడిపోతుంది. ఆ తర్వాత డాక్టర్‌బాబు కంగారు పడుతూ దీపను తట్టి లేపుతుంటాడు. ఇంతలో దీపను ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిందే కార్తీక్ అని డాక్టర్ భారతి చెబుతుంది. దీంతో కార్తీక్ దీపను ఆస్పత్రికి తీసుకుని బయలుదేరుతాడు. అయితే సౌందర్య కూడా వస్తానడంతో కార్తీక్ తల్లిని వద్దని చెప్పి తాను మాత్రమే వెళతాడు. ఇక వారు అటు బయలుదేరగానే.. సౌందర్య మనసులోనే మధనపడుతూ.. ‘వుడా నా కోడలుకు ఏమైంది. తన వెనకా ఎదో కుట్ర జరుగుతుంది. అదెంటో కార్తీక్ రాగానే నిలదీస్తా’ అనుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన అనంతరం సౌందర్య, ఆనందరావు, ఆదిత్యలు కుర్చోని అప్పటి వరకు బాగానే ఉన్న దీప కళ్లు తిరిగి పడిపోవడం ఏంటి అని ఆలోచిస్తారు. ఇంతలో ‘వదినకు మోనిత ఇచ్చిన టాబ్లెట్ వల్లే ఇలా జరిగిందనిపిస్తోంది’ అని అంటాడు ఆదిత్య. ఆ వెంటనే సౌందర్యకు.. మోనిత టాబ్లెట్ విషయంలో ఆమె చేసి హడావిడి ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంది. ఇదిలా ఉండగా సాయంత్రానికి ఆస్పత్రి నుంచి దీపను ఇంటికి తీసుకుస్తాడు కార్తీక్. మరోవైపు.. దీప బతికిపోవడంతో మోనితలో అలజడి మొదలవుతుంది. ‘ఇక దీప చనిపోతుందని అనుకుంటే కార్తీక్ చావనిచ్చేట్టుగా లేడు, కార్తీక్ తలుచుకుంటే దీప బతకడం ఖాయం. అతనిలో దీప మీద జాలి కాదు.. ప్రేమ కనిపిస్తుంది.. ఎంతైనా కట్టుకున్న భర్త కదా.. దీపను బతికించడం తన బాధ్యత అనుకుంటాడు.. అదే నిజమైతే.. దీప బతికితే.. నా పరిస్థితి ఏంటి’ అంటూ పెద్దగా అరుస్తూ రచ్చ చేస్తుంది మోనిత. ఇక రేపటి ఎపిసోడ్లో సౌందర్య.. దీపి ఆరోగ్యానికి సంబంధించిన రహస్యంపై కార్తీక్‌ను ప్రశ్నిస్తుంది. ‘చెప్పారా ఏ సమస్య నిన్ను చిత్ర విచిత్రంగా ఉండేట్టు చేస్తుంది.. ఎందుకు నిజాన్ని దాస్తున్నావు. నా కోడలికి ఏమైంది’ అని కాలర్ పట్టుకుని నిలదీస్తుతంది తల్లి. దీంతో కార్తీక్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనవుతూ.. ‘ఎందుకంటే నీ కోడలు బతకదని డాక్టర్లు చెప్పారు కాబట్టి’ అసలు రహస్యాన్ని సౌందర్యతో చెబుతూ కన్నీరు పెట్టుకుంటాడు. అటూ దీప కూడా ‘నాకు ఏమౌతుందని.. ఎప్పటినుంచో ఉన్న అనారోగ్యాన్ని వీళ్లు ఎందుకు బూతద్దంలో పెట్టి చూపిస్తున్నారు. అసలు నాకెమైందని, నేను ఎంత మొండిదాన్నో చూపిస్తా’ అని తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. మరి దీప బతకదనే విషయం తెలుసుకున్న సౌందర్య ఏం చేస్తుంది.. దీపకి చెప్తుందా? అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
‘పాపే మా జీవనజ్యోతి’ అంటోంది స్టార్ మా
స్టార్ మా సరికొత్త భావోద్వేగాలతో కూడిన ఓ కొత్త కథ తో సరికొత్త ధారావాహిక రూపొందించింది. ఈ సారి అమ్మ అనే ఎమోషన్ తో వినూత్నమైన కథను అందిస్తోంది. ఆ సీరియల్ పేరు "పాపే మా జీవనజ్యోతి". టైటిల్ లో జీవన పాప అయితే, జ్యోతి తల్లి. ఆనందంగా సంతోషంగా వున్న ఓ పెద్ద కుటుంబం.. అందులో అందరికీ ముద్దుల మురిపాలు పంచే ఓ పాప. కొన్ని సంవత్సరాలుగా ఆ ఇంట్లో ఆడపిల్ల లేని లోటు తీర్చిన పాప ఆ అమ్మాయి. దానితో ఇంట్లో అందరూ కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటారు ఆ పాపని. కానీ ఇంతలోనే ఊహించని సంఘటన. కొన్ని కారణాల వాళ్ళ ఆ పాప ఇంటి నుంచి మిస్ అయింది. ఎవరో ఎత్తుకుపోయారు. ఏ తల్లి సహించలేనిది. ఏ కుటుంబం భరించలేనిది. ఇంతకీ ఎవరి పని ఇది? తరవాత పరిస్థితులు ఎలా మారాయి? పాప ఏమైంది? ఎవరి చేతుల్లో వుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు. అన్నిటికీ జవాబులిస్తుంది "పాపే మా జీవనజ్యోతి" సీరియల్. పల్లవి, ప్రీతమ్, ప్రీతీ నిగమ్ తదితరులు నటిస్తున్న ఈ ధారావాహికని శాండల్ వుడ్ మీడియా నిర్మిస్తోంది. మాధవ్ దర్శకులు. ఏప్రిల్ 26 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా లో ఈ ధారావాహికి ప్రసారం అవుతుంది. -
జానకి ఏమిటి? ఆమె కల కనకపోవడమేంటి?
సెంటిమెంట్, ఎమోషన్ లేకపోతే జీవితం చాలా చప్పగా ఉంటుంది. కష్టాలు, కన్నీళ్లు లేని జీవితం చాలా సాఫీగా ఉంటుంది. అవి ఉంటేనే మజా.. వాటిని తట్టుకుని నిలబడడంలోనే మనిషి వ్యక్తిత్వం దాగి ఉంటుంది. అలాగే కలలు లేని జీవితం కూడా పెద్ద ఆసక్తిగా అనిపించదు. జీవితంలో సాధించడానికి ఏదో ఒక లేకపోతే జీవితం ఒక చోట ఆగిపోతుంది. ఈ మూడు విషయాలు కలిసిన కథ "జానకి కలగనలేదు". ఎవరు ఎవరిని కలుస్తారో, ఎవరితో ఎవరికీ ముడి పడుతుందో ఎవరి ఊహకూ అందదు. కలిసే వరకూ ఏమీ తెలియకపోవడమే దాని అందం. తండ్రి వ్యాపారం కోసం తన చదువుని ఆపేసిన కుర్రాడు, ఉన్నత స్థాయిని చేరుకోవాలని ప్రతి క్షణం పుస్తకాలు వదలిపెట్టని అమ్మాయి.. ఈ ఇద్దరూ నడిపించే కథ. బాధ్యతకు కలకి మధ్య లో ఇరుక్కున్న ఆ ఇద్దరు ఎవరి కోసం ఒకరు ఏం చేసారు అనేదే ధారావాహిక. ఈ నెల 22న (సోమవారం) ఈ సీరియల్ ప్రారంభం అవుతోంది. సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 9 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది. చదవండి: ‘ఆహా’లో జాంబిరెడ్డి, ఎప్పటినుంచంటే.. -
‘అది ఖచ్చితంగా బ్యాడ్ టచే.. నాకు తెలుసు’
సోమవారం రాత్రి కలర్స్ టీవీలో ‘బారిస్టర్ బాబు’ సీరియల్ చూస్తున్నవారికి 8 ఏళ్ల బందితను అమాంతం ఎత్తుకుని ముద్దు పెట్టుకోవాలన్నంతగా భావావేశం కలిగి ఉంటుందనే అనిపిస్తోంది. ఇలా అనిపించడానికి కారణం ఆ మర్నాటి నుంచీ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతున్న Anidita Against Molestation అనే ట్యాగ్. బందిత భర్త (అవును భర్తే) 22 ఏళ్ల అనిరుథ్ పేరు కూడా కలిపి Anidita అనే మాటను ట్విటిజెన్‌లు కాయిన్ చేసి తాజా ట్రెండ్ ను నడిపిస్తున్నారు. ‘లా’ చదివి సమాజంలోని దురాచారాలపై పోరాటం చేస్తున్న అనిరుథ్.. బందితను బాల్య వివాహం నుంచి కాపాడే ప్రయత్నంలో ఆమెను తన భార్యగా చేసుకోవలసి వస్తుంది. భర్తగా ఉండలేడు కనుక ప్రొటెక్టర్ గా ఉంటాడు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతాడు. అలా చెప్పాక ప్రసారం అయినదే సోమవారం నాటి ఎపిసోడ్. అందులో ఓ పెద్దమనిషి బందితను టచ్ చేస్తాడు. ఫాలో అప్‌గా బందిత.. ఇంట్లో అందరిముందూ అతడిని నిలబెట్టి ఎంతో ఆవేశంగా, ఆగ్రహంగా, ఆవేదనగా, పెద్దగా ఏడుస్తూ బ్యాడ్ టచ్‌ని ప్రశ్నించిన తీరులోని డైలాగ్ డెలివరీ, ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రేక్షకుల హృదయానికి హత్తుకున్నాయి. ఆ అమ్మాయిలో అంతగా కాన్షస్నెస్ కలిగించిన ఆమె భర్తను కూడా ఎత్తుకుని ముద్దాడాలనిపిస్తుంది. (ఇఫ్ పాజిబుల్). ఈ భార్యాభర్తల పేరుతో ట్రెండింగ్‌లో ఉన్న ట్విట్టర్ మూవ్మెంట్ పై స్టోరీ. పందొమ్మిదో శతాబ్దపు ఆరంభం నాటి థీమ్‌తో ఈ నెల 11 నుంచి కలర్స్ టీవీలో ‘బారిస్టర్ బాబు’ అని ఒక బెంగాలీ సీరియల్ వస్తోంది. ఏ శతాబ్దంలో ఉన్నాం అనిపించవచ్చు. ఉండటానికి మనం 21వ శతాబ్దంలోనే ఉన్నప్పటికీ బాల్య వివాహాలనేవి ఇప్పటికీ ఉన్నాయి కనుక మనం ఇంకా ఆనాటి కాలంలోనే ఉన్నట్లు.. స్వాతంత్య్ర సంగ్రామ సమరానికి పూర్వపు కాలంలో! దాస్యం నుంచి విముక్తి లభించింది కానీ.. దురాచారాలనే వదిలించుకోలేకున్నాం. చట్టాలున్నా అవి మనిషిని మార్చడం లేదు. ఇప్పుడీ బారిస్టర్ బాబు కొంచెం మార్చేట్లే ఉంది. మార్చడం అంటే ఆలోచనలోకి నెట్టేయడం. నెట్లో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ సీరియల్ చూస్తున్నవారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ట్విటిజెన్‌లు ఒక జట్టు కట్టారు. ఆ జట్టుకు ‘అనిదిత అగైన్స్ట్ మోలెస్టేషన్’ అని ఒక పేరు పెట్టారు. అదిప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఉంది కాదు. ట్రెండింగ్ అవుతూ ఉంది. ‘అనిదిత అగైన్స్ట్ మోలెస్టేషన్’ అంటే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా అనిదిత పోరాటం అని. అనిదిత ఎవరు? ఒకరు కాదు ఇద్దరు. బందిత. అనిరుథ్. ఇద్దర్నీ కలిపి అనిదిత అంటున్నారు. సీరియల్లో ఇద్దరూ కలిసి మహిళా సమస్యలపై మాట్లాడతారు. వేలు చూపిస్తారు. బందితకు 8 ఏళ్లు. పూర్తి పేరు బందితాదాస్. అనిరుథ్‌కు 22 ఏళ్లు. అనిరుథ్ రాయ్ చౌధరి. ఇద్దరూ భార్యాభర్తలు! అదేంటి ? బాల్యవివాహాలకు వ్యతిరేకంగా తీసిన సీరియల్లో బాల్య వివాహం ఏమిటి? దానికో కథ లేకుండా ఉంటుందా? ∙∙ ‘బారిస్టర్ బాబు’ సీరియల్ మొదలై పదిహేను రోజులు అవుతున్నప్పటికీ మొన్నటి ఎపిసోడ్‌తో మాత్రమే కథలో ఫోర్స్ మొదలైంది! ఆ ఫోర్స్‌కు మొదలెక్కడో తెలియకపోతే ట్విటిజెన్‌లు ఎందుకు ఇంతలా ఈ సీరియల్లోని భార్యాభర్తలకు మద్దతుగా స్పందిస్తున్నారో అర్థకాదు. అనిరుథ్ లండన్‌లో ‘లా’ చదివి ఇండియా వస్తాడు. సమాజంలోని దురాచాలను, మూఢ నమ్మకాలను, లింగవివక్ష, స్త్రీ, పురుష అసమానతలను నిర్మూలించాలని అతనికి బలంగా ఉంటుంది. ఆ సమయంలో.. బందితను బాల్య వివాహం నుంచి కాపాడే ప్రయత్నంలో తనే ఆమెకు భర్త అవాల్సి వస్తుంది. ఇకప్పుడు బందితకు లోకం తీరు గురించి చెప్పడం, ఆమెను లోకం నుంచి సంరక్షించడం అతడి తొలి బాధ్యత అవుతుంది. భర్తగా ఉండలేడు. రక్షకుడిలా ఉంటాడు. మొదట ఆ చిన్నారికి గుడ్ టచ్‌కి, బ్యాడ్ టచ్‌కి ఉండే తేడాను అర్థమయ్యేలా చెబుతాడు. ఆ తర్వాత జరిగిన కథే మొన్న ప్రసారం అయిన ఎపిసోడ్. ఆ ఇంట్లో ఠాకూర్ అనే యాభై ఏళ్లు దాటిన పెద్ద మనిషి ఓ రోజు బందితను టచ్ చేస్తాడు. అది బ్యాడ్ టచ్! ఒంటిమీద బ్యాడ్ టచ్ పడినప్పుడు మౌనంగా ఉండకూడదని, బ్యాడ్ టచ్ చేసినవాళ్లెవరో భయపడకుండా అందరికీ చెప్పాలనీ, నీకు నువ్వుగా కూడా బ్యాడ్ టచ్ చేసినవాళ్లను సహించకూడదు అని బందితకు చెప్పి ఉంటాడు అనిరుథ్. అతడు స్నానానికి వెళ్లొచ్చేలోగా ఠాకూర్ ఆమెపై చెయ్యి వేస్తాడు. బందిత పెద్దగా అరుస్తుంది. అనిరుథ్కి విషయం తెలిసి ఠాకూర్‌పై చెయ్యి చేసుకుంటాడు. వెక్కిళ్లు పెడుతున్న బందిత వైపు చూసి, ‘ఠాకూర్ చేసిన తప్పుకు ఏం శిక్ష వేస్తావో వెయ్యి’ అని అంటాడు. బందిత కూడా ఠాకూర్‌ని చెంపదెబ్బ కొడుతుంది. తనకేం తెలియదని అమాయకత్వం నటిస్తాడు ఠాకూర్. బందిత కోపం పట్టలేకపోతుంది. అతడిది కచ్చితంగా బ్యాడ్ టచ్చేనని, అది తనకు తెలుసునని పెద్దగా అరిచి చెబుతుంది. అలా చెబుతున్నప్పుడు ఆవేశం, ఆగ్రహం, దుఃఖం బందితను ఊపేస్తాయి. అతి సున్నితమైన ఆ సన్నివేశం చూసి ప్రేక్షకులు బాగా కదలిపోయారు. పర్యవసానమే ట్విట్టర్లో ప్రారంభమైన ‘అనిదిత అగైన్స్ట్ మోలెస్టేషన్’. నవ వధూవరులైన పాత్రలు.. బందిత, అనిరుద్‌లకు సపోర్ట్‌గా వేల ట్వీట్లు వస్తున్నాయి. ‘బాలికలకు రక్షణగా వారిని కనిపెట్టుకుని ఉండటమే కాదు, వారిని వారు కనిపెట్టుకుని ఉండటం ఎలాగో కూడా వారికి నేర్పాలి’ అనేది ఆ ట్వీట్లలోని అంతస్సారం. అలాగే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే అంశాన్ని బందిత పాత్రతో టచింగ్‌గా చెప్పించినందుకు ఈ సీరియల్ నిర్మాతల్ని, దర్శకుల్ని నెటిజెన్లు ప్రశంసిస్తున్నారు. యు ఆర్ జెమ్ మ్యాన్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై ఆ ఎపిసోడ్ ప్రసారం అయ్యాక బందితకు, అనిరుథ్ రాయ్ చౌధురికి ఫ్యాన్స్ ఒక్కసారిగా పెరిగిపోయారు. వాళ్లపై అభినందనల ట్వీట్లు కురుస్తున్నాయి. ‘ఎ.ఆర్.సి.. యు ఆర్ ఎ జెమ్ మ్యాన్’ అని అనిరుథ్ని ఒకరంటే, బందితా.. ‘నీకంత కోపం రావడం సహజమే’ ఇంకొకరు సపోర్ట్ చేశారు. ‘‘భయం వల్ల మన ఆడపిల్లలం ఏదీ పైకి చెప్పుకోలేం. కానీ మనం మౌనంగా ఉండిపోకూడదు. బందితలా అందరికీ వినిపించేలా పెద్దగా చెప్పాలి’ అని షానామా అనే నెట్ యూజర్ కామెంట్ పెట్టారు. స్వాతంత్య్రానికి పూర్వం ఎ.ఆర్.సి.లు అవసరం అయ్యారు. (అనిరుథ్ రాయ్ చౌధురి). ఇప్పుడూ ఎ.ఆర్.సి.లు అవసరం అవుతున్నారు’ అని మోనా అనే ట్విటిజన్ ఆవేదన చెందారు. ‘‘అబ్బ! మొన్నటి ఎపిసోడ్ ఫాంటాస్టిక్. అదెలాగుందో చెప్పడానికి నాకసలు మాటలే రావడం లేదు. ఠాకూర్‌పై అలా అరిచేస్తుంటే చిన్నారి బందితలో నాకు ఒక శక్తిమంతమైన మహిళ కనిపించింది. సచ్ యాన్ అమేజింగ్ ఎపిసోడ్’ అని అవని అనే నెటిజెన్ షేర్ చేసుకున్నారు. బందితగా బాల నటి ఆరా భట్నాగర్ బడోని, అనిరుథ్గా ప్రవిష్ట్ మిశ్రా నటించిన ఈ ‘బారిస్టర్ బాబు’ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ రాత్రి గం. 8.30 కి ప్రసారం అవుతోంది. అరగంట ఎపిసోడ్. -
వంటలక్కను ఢీ కొట్టనున్న కృష్ణ తులసి!
టాలీవుడ్ సినీ దిగ్గజం, అగ్రదర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. దాదాపుగా అందరు అగ్రహీరోలతోనూ బాక్సాఫీస్ హిట్స్ కొట్టిన ఆయన గత కొంత కాలంగా సినిమా దర్శకత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో టాప్‌లో వెలిగిన దర్శకేంద్రుడు తాజాగా ఓ తెలుగు టీవీ సీరియల్‌కు దర్శక పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆర్కే టెలీ షో ద్వారా జీ తెలుగు చానెల్లో ప్రసారం కానున్న 'కృష్ణ తులసి' సీరియల్‌కు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ కావడం తనను ఆకట్టుకుందన్నారు. సీరియల్లో కృష్ణతులసి పాత్ర తన హృదయానికి దగ్గరగా అనిపించిందని, ఈ పాత్ర తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్ జీ తెలుగులో ఫిబ్రవరి 22 నుంచి ప్రసారం కానుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతానికైతే ఈ సీరియల్‌కు దండిగా ప్రచారం చేస్తున్నారు. పైగా రాఘవేంద్రరావు బరిలో దిగారంటే వంటలక్క సీరియల్‌కు ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే కృష్ణ తులసి సీరియల్ టీఆర్పీలో కార్తీక దీపాన్ని దాటేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా చేశారు -
ఆ సూట్‌కేస్‌ను చూడకపోతే ఏం జరిగేది?
భారత్‌లో సినిమాలతో పాటు సీరియల్స్‌కు కూడా ఎంతో క్రేజ్. సోమవారం నుంచి శనివారం వరకూ రోజులో దాదాపు 10 గంటలపాటే సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే సీరియల్స్‌లో కొన్ని సీన్లు చూస్తే.. పిచ్చెక్కిపోతుంది. వీసమెత్తు లాజిక్ కూడా ఉండదు. తాజాగా ఓ సీరియల్ సీన్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. నెటిజనులు రకరకాల ప్రశ్నలు కురిపిస్తున్నారు. అదేంటో మీరు చూడండి. కలర్స్ టీవీలో ప్రసారం అయ్యే ఇష్క్ మెయిన్ మార్జావన్ 2లోని ఓ సన్నివేశానికి సంబంధించిన వీడియో ఇది. దీనిలో రిధిమా (నటి హెల్లీ షా ఈ పాత్ర పోషించినది) కాళ్లకు సూట్‌కేస్ తగిలి ముందుకు తూలి పడుతుంది. దాంతో గోడకు గుద్దుకుంటుంది. స్పృహ కోల్పోయి సూట్‌కేస్‌లో పడుతుంది.(చదవండి: ఖాళీ కుక్కర్‌ను గ్యాస్ స్టౌపై పెట్టింది ఎవరు?) In case you haven't noticed what's happening in indian dramas these days. pic.twitter.com/5GfrCjYY5r — . (@Bellona__) September 21, 2020 ఇంతలో వైట్ హ్యాండ్ గ్లౌజులు ధరించిన ఓ వ్యక్తి ఆ సూట్‌కేస్‌ని తీసుకెళ్లి స్విమ్మింగ్ ఫూల్లో పడేస్తాడు. ఇంతలో వంశ్(రాహుల్ సుధీర్) సూట్‌కేస్ స్విమ్మింగ్ ఫూల్లో మునిగిపోవడం గమనిస్తాడు. ఇక్కడితో వీడయో అయిపోతుంది. అయితే దీనిపై నెటిజనులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అసలు సూట్‌కేస్ చూడకపోయుంటే ఏం జరిగేది.. దాని జిప్ ఎవరు పెట్టారు.. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆ సూట్‌కేస్ పూర్తిగా మునిగిపోతుంది.. 200 ఎపిసోడ్ల తర్వాత ఆమెకు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఫన్ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజనులు. -
డాక్టర్ బాబుకి వంటలక్క అంటే కోపమెందుకమ్మా?
బుల్లితెరపై కార్తీక దీపం సీరియల్‌కు ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచుతున్న ఈ సీరియల్ ఇప్పటికే వందల ఎపిసోడ్లను పూర్తిచేసుకుంది. తాజాగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ ఈ సీరియల్‌కి సంబంధించి ట్విటర్లో ఓ పోస్ట్ చేశాడు. ‘ఎందుకమ్మా అంత మంచి డాక్టర్ బాబుకి ఇంత మంచి వంటలక్క అంటే కోపం’ అని ఓ డైలాగ్‌ను ప్రస్తావించాడు. దీంతో ఆ ట్వీట్ కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. కిషోర్ ట్వీట్‌పై ‘స్టార్ మా’ చానల్ కూడా స్పందించింది. (నెపోటిజమ్‌కు కేరాఫ్‌గా సడక్-2 ) ‘త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు’ అంటూ ట్వీట్ చేసింది. కాగా, 'స్టార్ మా'లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్‌కు చాలా మంది ప్రముఖులు సైతం అభిమానులున్న సంగతి తెలిసిందే. (ఈ రెండింటిలో.. ఏ ఫొటోలో కంగన బాగుంది!? ) త్వరలోనే డాక్టర్ బాబు వంటలక్క మంచితనాన్ని అర్ధం చేసుకుంటారని కోరుకుందాం కిషోర్ గారు 😀😀#KarthikaDeepam #StarMaaSerials https://t.co/SL31NmTdM8 — starmaa (@StarMaa) July 2, 2020 -
తొలి అమెరికా పెళ్లికొడుకు
అబ్బాయికి అన్నీ ఉన్నాయి తాళి కట్టించుకోవడానికి ఒక ఆడపిల్ల మెడ తప్ప... అన్నట్టు ఉంటుంది ఈ సీరియల్. ఎన్.ఆర్.ఐలు ఇండియాకు వచ్చి ఇక్కడ వధువును వెతుక్కోవడానికి అమ్మాయిలను కలిసి వారి గురించి నిర్ణయం తీసుకోవడానికి ఎలా సతమతమవుతారో ‘మిస్టర్ యోగి’ సీరియల్ 1980లలో దూరదర్శన్ ద్వారా ఇంటింటికీ చూపించింది. నవ్వులు పూయించింది. నేటి యువత పొరుగూరుకు వెళ్లినంత సులువుగా విదేశాలకు వెళ్లి వచ్చేస్తున్నారు. పై చదువులు, ఉద్యోగాలు, అక్కడే సెటిల్ అవడం.. వంటి విషయాలు చాలా సాధారణమై పోయాయి. కానీ, పెళ్లి విషయానికి వచ్చేసరికి దాదాపు ప్రతి ఒక్కరూ స్వదేశంవైపు దృష్టి సారిస్తున్నారు. ఒక్కరుగా వచ్చి పెద్దలు చూసిన పెళ్లి సంబంధాన్ని చేసుకొని జంటగా తిరిగి వెళ్లిపోతున్నారు. అలా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ‘మిస్టర్ యోగి’ విదేశాల్లో విమానం ఎక్కి స్వదేశానికి తిరిగి వచ్చాడు. పెద్దవాళ్లు అప్పటికే సిద్ధంగా ఉంచిన ఓ డజను పెళ్లి సంబంధాలను మన యోగి ముందుంచారు. పన్నెండు సంబంధాలంటే.. 12 మంది అమ్మాయిలను కలవాలి. వారిలో ఎవరిని ఓకే చేసినా తమకు ‘ఓకే’ అన్నారు అమ్మానాన్న. ‘సరే’ అని బయల్దేరాడు యోగి. ఆ పన్నెండు మంది అమ్మాయిలను కలుసుకునే క్రమంలో అతను పడిన ప్రయాసలే ‘మిస్టర్ యోగి’ సీరియల్. బుల్లితెరపై మొట్టమొదటి కామెడీ ఆద్యంతం నవ్వులు పూయించిన ఈ సీరియల్ ‘కామెడీ’కి బుల్లితెర మొదటిసారి వేదికయ్యింది. ఆ తర్వాత ఎన్నో కామెడీ సీరియల్స్‌కి, షోస్‌కి మార్గం సుగమం చేసింది. హాస్యపూరితమైన సన్నివేశాలు, సంఘటనలు ప్రేక్షకుడిని అమితంగా ఆకట్టుకుంటాయని రుజువు చేసింది మిస్టర్‌యోగి. చిన్నా పెద్దా నవ్వుల కేరింత ఇది ఇప్పటి మాట కాదు 80ల చివరి కాలం. భారతీయులు అప్పుడప్పుడే కొందరు పై చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లినవారు, వెళుతున్నవారూ ఉన్నారు. అలాంటి రోజుల్లో వచ్చిన ‘మిస్టర్ యోగి’ సీరియల్ మిలియన్ల మంది భారతీయుల మనస్సులను గెలుచుకుంది. ‘మిస్టర్ యోగి’ దూరదర్శన్ నిర్మించిన సీరియల్స్ అన్నింటిలోనూ ఓ మైలురాయి కావడం విశేషం. 80ల కాలంలో దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్ అన్నీ భారతీయ మధ్య తరగతి మానసిక వ్యధకి సంబంధించినవై ఉండేవి. ఆ సమయంలో సమాజంలోని వాస్తవ సంస్కృతిని కళ్లకు కట్టింది మిస్టర్ యోగి సీరియల్. మిస్టర్ యోగి కథ రచయిత ‘మథు రై’ రాసినది. ఈ కథాంశాన్ని ఓ నవల నుంచి తీసుకున్నారు రచయిత. దర్శకుడు కేతన్ మెహతా ఈ సీరియల్‌ను తీసిన విధానం అనేక విధాలుగా ప్రేక్షకుడి నోట అద్భుతం అనిపించింది. ఈ సీరియల్‌ను ముఖ్యంగా నాటి ఆధునిక యువతతో పాటు పెద్దలు కూడా చూడటానికి ఇష్టపడ్డారు. ఆ రోజుల్లో దూరదర్శన్ ప్రసారం చేస్తున్న అనేక సీరియల్స్‌తో పోల్చితే యోగి సీరియల్ అత్యంత తక్కువ వ్యవధిలో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 80ల కాలంలో వచ్చిన సీరియల్స్‌తో పోల్చితే ఇది చాలా తక్కువ బడ్జెట్‌తో కూడినది. అంతేకాదు, ఇది వాస్తవ పద్ధతులకు చాలా దగ్గరగా ఉండేది.. ఓమ్పురి గొంతుకతో... ప్రతి ఎపిసోడ్‌కు ముందు బాలీవుడ్ అగ్రనటుడు దివంగత ఓమ్పురి యోగి ఏం చేయబోతున్నాడో చెబుతూ ఉండటం ఈ సీరియల్లో మరో విశేషం. ఆ విధంగా మిస్టర్ యోగి ఎపిసోడ్స్ అన్నీ తర్వాత రాబోయే సంఘటననూ క్తుప్తంగా చూపిస్తుంది. ఏ సీరియల్స్‌లోనూ ప్రయత్నించని భిన్నమైన స్టైల్ ఇది. మొత్తం 13 ఎపిసోడ్లు. వీటిలోని ప్రతీ సన్నివేశం ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూయించింది. తక్కువ బడ్జెట్‌తో తీసినప్పటికీ, భావోద్వేగాలను చాలా చక్కగా చూపుతుంది. అంతేకాదు, ఈ సీరియల్ ద్వారా చాలా మంది నటీనటులు పరిచయమయ్యారు. వరుడు మిస్టర్ యోగి బక్కపలచగా ఉండే వ్యక్తి బుల్లితెరపై కనిపించినప్పుడు ఇతడేం అలరిస్తాడు ప్రేక్షకులను అనుకున్నారు అంతా. 1988లో బుల్లితెర ద్వారా నట్టింట్లో అడుగుపెట్టిన యోగి నాలుగునెలల పాటు ప్రేక్షకులను అమితంగా అలరించాడు. ఎంబిఎ చేసి అమెరికాలో సెటిల్ అయిన యోగేష్ ఐశ్వర్యాలాల్ పటేల్ అనే మిస్టర్ యోగి 12 మంది అమ్మాయిలను కలిసే క్రమంలో ప్రతి వధువు దగ్గర తన గురించి చెప్పుకోవడం, అతి మర్యాదలు, అసందర్భాలు.. అనేక సందర్భాల్లో ప్రేక్షకులను నవ్విస్తాయి. వీరిలో యోగి ఎవరిని తనకు సరి జోడీగా ఎంచుకుంటాడా అని ఎదురు చూడటం ఆసక్తిగా మారింది ప్రేక్షకులకు. మోహన్ గోఖలే 80ల కాలంలో అత్యంత ప్రతిభావంతులైన కళాకారులలో మోహన్ గోఖలే ఒకరు. భారతీయ సినిమా, టెలివిజన్, నాటకం, ఆర్ట్ ఫిల్మ్స్‌లో పేరొందిన మోహన్ మిస్టర్ యోగి సీరియల్ ద్వారా దేశవ్యాప్త పేరు సంపాదించుకున్నారు. మరాఠీ టీవీ సీరియల్స్, సినిమాల్లోనూ నటించిన మోహన్ దూరదర్శన్‌లో ‘భారత్ ఏక్ ఖోజ్’ సీరియల్లోనూ నటించారు. మోహన్ కుటుంబ సభ్యుల్లో దాదాపు అందరూ సినిమా, థియేటర్ రంగాలలో ఉన్నవారే. తండ్రి సీనియర్ జర్నలిస్ట్. సోదరుడు విక్రమ్ గోఖలే మరాఠీ నాటకాల్లో పేరొందిన నటుడు. భార్య శుభాంగి మరాఠీ నాటకం, సినిమా, టెలివిజన్ నటి. కూతురు సఖి గోఖలే మరాఠీ టెలివిజన్, థియేటర్ ఆర్టిస్ట్. మోహన్ 45వ ఏట గుండెపోటుతో మరణించారు. వధువు.. పల్లవి జోషి హీరోతో పాటు హీరోయిన్ పల్లవి జోషి కూడా ఈ సీరియల్ ప్రముఖ పాత్ర పోషించారు. పల్లవి జోషి ఇండియన్ నటిగా అప్పటికే దేశమంతా ఆమె పరిచయం. యోగి సీరియల్లో ఆమె నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలను అందుకున్నారు.– ఎన్.ఆర్ -
అభిమానాల బజార్
అక్కడ ఆస్తులు లేవుఅంతస్తులు లేవు డిగ్రీలు లేవు కులమతాలు లేవు ఉన్నదల్లా మనుషులువారి మధ్య నెలకొన్నఅభిమానాలుఅవే, ‘నుక్కడ్’ సీరియల్‌ని సంపన్నం చేశాయి. ప్రేక్షకుల మదిలో చిరకాలం నిలిచి పోయాయి. మన కాలనీలోని కార్నర్ ప్లేస్‌లో ఏమేం దుకాణాలు ఉంటాయో ఎప్పుడైనా గమనించారా. ఓ చాయ్ బండి, దానిని ఆనుకొని ఫాస్ట్‌ఫుడ్ బండి, ఓ పాన్ షాప్, ఆ పక్కనే ఎలక్ట్రిక్ వస్తువుల రిపేర్ షాప్, వస్తువులను తాకట్టు పెట్టుకొని పదో పరకో ఇచ్చే సేట్ షాప్, ఒకవైపు కూరగాయలు, మరోవైపు ఇస్త్రీ షాప్, షూ షాప్, సెలూన్ షాప్.. ఇలా చిన్న చిన్న దుకాణాలన్నీ ఉంటాయి. ఆ షాపుల్లో పనిచేసేవారంతా సాయంత్రమైందంటే ఓ చోట చేరుతారు. వేడి వేడి చాయ్ చప్పరిస్తూనో, బీడీ ముక్కను నోట్లో పెట్టుకొని పొగ ఊదుతూనో పక్కవారితో బాతాఖాని వేస్తుంటారు. అంతా దిగువతరగతి. అక్కడ ఒకరి కష్టం అందరిది. ఒకరి ఆనందమూ అందరిది. ప్రపంచాన్ని దర్శించాలంటే ఇలా వీధి మూలన ఉన్న జీవితాలతో ఓ అరగంట గడిపితే చాలు. నగరాల్లో తక్కువ ఆదాయపు ప్రజల సాంఘిక, ఆర్థిక పోరాటాలను 80ల కాలంలోనే కళ్లకు కట్టింది దూరదర్శన్. వారం వారం శ్రమ జీవుల కష్టాన్ని, వారు పంచుకున్న ఆనందాన్ని హాస్యభరితంగా ఆవిష్కరించింది. నిరంతరం ఆర్థికసమస్యలతో, నెరవేరని కలలతో పోరాటం చేస్తుండే కార్నర్ జీవితాలను ‘నుక్కడ్’ సీరియల్‌గా మూడు దశాబ్దాల క్రితం 40 ఎపిసోడ్లలో పరిచయం చేసింది చిన్నతెర. గరీబుల కార్నర్ ఎలక్ట్రీషియన్ గురు నుక్కడ్ గ్యాంగ్‌కి చిన్నపాటి లీడర్. నుక్కడ్‌లో ఎవరికి ఏ కష్టం వచ్చినా పరిష్కరించడంలో తను ముందుంటాడు. కదేరిభాయ్ తినుబండారాల షాప్ ఓనర్. నుక్కడ్‌లో ఉన్నవారంతా ఇతని షాపు ముందే చేరుతుంటారు. మరీ తిండికి లేని వారికి ఉచితంగా టీ, స్నాక్న్ ఇచ్చే మంచి మనసు ఉన్నవాడు. హరికి చిన్న సైకిల్ రిపేర్‌షాప్ ఉంటుంది. ఇతడు గుప్తా సేత్ కూతురును ప్రేమిస్తుంటాడు. గోపాల్ అనే వ్యక్తి తాగుబోతు. కానీ అందరినీ ప్రేమించే గుణం ఉన్న వ్యక్తి. నేనేదైనా చేయగలను అని సూటు బూటులో కనిపించే వ్యక్తి రాజా పటేల్. చిన్న హెయిర్‌కటింగ్ సెలూన్‌ని నడుపుకునే బార్బర్ కరీమ్. నుక్కడ్లోని ఇళ్లలో పనిచేస్తూ, అందరికీ పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటుంది రాధ. సింగిల్ ఉమెన్ మారియా టీచర్. గురు–మారియాలు ప్రేమించుకుంటారు. కానీ, తమ ప్రేమను ఒకరికొకరు చెప్పుకోరు. దుఖియా షాయర్ నిరుద్యోగి. గురు దగ్గర ఉంటూ అందరినీ పదో పరకో అడుక్కుంటూ జీవితం గడుపుతుంటాడు. ఘనశ్యామ్ బిక్షగాడు. చౌరాషియా పాన్వాలా. గుప్తాసేత్ కిరణా, మానిక్లాల్సేత్ ఆభరణాల షాప్‌ను నిర్వహిస్తుంటారు. వీరితో పాటు అలా ఇలా వచ్చిపోయే మరో పది మంది మనుషులతో నుక్కడ్ సందడిగా కనిపిస్తుంది. పండగతో మొదలు పేద–ధనిక బేధం లేకుండా ఆనందాన్ని పంచుకునేవే పండగలు. మరి నగరాల్లో దీపావళి పండగ అంటే.. టపాసులకు, కొత్త బట్టలకు వేలల్లో డబ్బు ఖర్చు పెట్టాలి. అంతంత మాత్రంగా ఉండే శ్రమజీవుల సంపాదనతో పూట గడవడమే కష్టం. అలాంటిది టపాసులు కొనుగోలు చేయాలంటే పెద్ద యుద్ధమే. అందుకే నుక్కడ్‌లో ఉండేవారంతా తలా కొంత చందా వేసుకుంటారు. గుప్తా, సేట్లు మాత్రం ఒక్కొక్క టపాసు అందరి మధ్య భయం భయంగా కాల్చడం నవ్వు తెప్పిస్తుంది. టపాస్ కాదు బాంబ్ అంటూ దబాయించే పోలీసు హడావిడి, చర్చ ఆసక్తికరంగా ఉంటుంది. చందా డబ్బుతో మిఠాయిలు కొనుక్కొని దీపావళి పండగ జరుపుకుంటారు అంతా. ఇలాగే అన్ని పండగలు అందరూ కలిసి జరుపుకుంటారనే విషయాన్ని నుక్కడ్ జనం పరిచయం చేస్తారు. పంచుకునే ప్రేమలు పెళ్లిళ్లకు ట్రాపెంట్ వాయించే బ్యాండ్ మాస్టర్ ఎందరిచేతనో గౌరవం అందుకున్న వ్యక్తే. ముసలివాడైపోతాడు. కానీ, పూట గడవక తానెంతో ఇష్టపడే ట్రాంపెట్ను 200 రూపాయలకు సేట్‌కి అమ్మేస్తాడు. ‘వృద్దాప్యంలో చివరకు ట్రాంపెట్ కూడా లేకపోతే ఎలా బతుకుతావు’ అని అడిగితే ‘నా రెక్కల కష్టమ్మీద బతికేస్తా..’ అని దుఖిస్తాడు. గురు, మిగతా బృందమంతా కలిసి బ్యాండ్ మాస్టర్ ట్రాంపెట్ను తాకట్టు నుంచి విడిపించి, అతని చేత ట్రాంపెట్ను వాయించేలా చేయాలనుకుంటారు. కానీ, మాస్టర్ నిపించుకోడు. చివరకు ట్రాంపెట్ను అతను వాయించడం, అతని చుట్టూ చేరి నుక్కడ్ జనం అంతా గంతులేస్తూ ఆనందాన్ని పంచుకుంటారు. ఒకరి కష్టం అందరూ పంచుకుంటే జీవితం ఎంత సింపుల్‌గా గడిపేయొచ్చో దీంట్లో తెలుసుకోవచ్చు. నాయకులను నిలదీసే నైజం నుక్కడ్కి రాజకీయ నేత వస్తాడు ఈ సారీ ఓట్లు వేసి గెలిపించమని. గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీస్తారు ఒక్కొక్కరు. మారియా టీచర్ రాజకీయనాయకుడిని ‘మీ కొడుకు ఎక్కడున్నాడ’ని అడుగుతుంది. అమెరికాలో ఉన్నాడని, అక్కడే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యాడని గర్వంగా చెబుతాడు. పదవుల కోసం వచ్చే నాయకులు చెప్పేవి ఒకటి, చేసేది ఒకటి అంటూ క్లాస్ తీసుకుంటుంది టీచర్. తనను తప్పుపడుతున్నారనే కోపంతో మండిపడుతూ అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు రాజకీయ నాయకుడు. హామీలు ఇచ్చి నెరవేర్చని నాయకుల దుమ్ము దులపాలంటే అందుకు సామాన్యులే సరైనవారని చూపుతారు. దొంగ నుంచి మంచి నుక్కడ్‌లో దొంగతనం జరుగుతుంది. అక్కడి జనానికి పట్టుబడిన వ్యక్తి తాను దొంగగా మారిన పరిస్థితుల గురించి వివరిస్తాడు. పోలీసులు దొంగను పట్టుకోవడానికి వస్తే అతను తమకు పరిచయం ఉన్న వ్యక్తే అని, దొంగ కాదని టీచర్ చెప్పడంతో అంతా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత నుక్కడ్‌లో అతనూ ఓ మెంబర్ అవుతాడు. ఏ వ్యక్తీ పుట్టుకతో చెడ్డవాడు కాదని, పరిస్థితులే వారనలా మారుస్తాయని, మంచి మనుసుల మధ్య ఉంటే దొంగలైనా మంచివారుగా మారుతారనే నిజాన్ని కళ్లకు కడతారు. ఇలా ఒక్కో వారం ఒక్కో సమస్య నుక్కడ్ జనాల మధ్య నడుస్తూ ఉంటుంది. ఆ సమస్య నుంచి ఓ పరిష్కారం చూపుతుంది. కొన్ని పరిష్కారం లేని సమస్యలూ ఉంటాయి. అందరి కళ్లలోనూ భవిష్యత్తు పట్ల అందమైన కలలు. అవి నెరవేరేవి కావని తెలిసినా నిరుత్సాహపడకుండా ఆనందంగా గడిపే జీవితాలు నుక్కడ్‌లో దర్శించవచ్చు. మన జీవితానికి కావాల్సిన పాఠాలనెన్నో నుక్కడ్ బజార్లో వెతుక్కోవచ్చు. – ఎన్.ఆర్. ∙మూడు దశాబ్దాల క్రితం శ్రామిక జీవుల జీవితాలను తరచి చూసి, తెరకెక్కించారు దర్శకులు కుందన్ షా, సయీద్ అక్తర్ మిర్జా. ఈ సీరియల్‌కి ప్రబో«ద్ జోషి, అనిల్ చౌదరి తమ రచనా సహకారాన్ని అందించారు ∙దిలీప్ ధావన్, పవన్ మల్హోత్రా, సంగీతానాయక్, రమా విజ్, అవతార్గిల్లు ప్రధాన పాత్రదారుల్లో కనిపించి నుక్కడ్ని సుసంపన్నం చేశారు ∙1986–86లో 40 ఎపిసోడ్లతో ఫస్ట్ సీజన్ వచ్చిన నుక్కడ్, ఆ తర్వాత 1993లోనయానుక్కడ్ పేరుతో సీక్వెల్ సీరిస్ వచ్చింది. -
అక్క.. చెల్లెలు.. చైత్ర
ఒకే ఇంటికి చెందిన ఒకేలా ఉన్న ఇద్దరు కవల పిల్లల కథే అక్కాచెల్లెళ్లు. ఈ ఇద్దరూ ఒకే అత్తారింటికి చేరుతారు. ‘జీ తెలుగు’లో వచ్చే ఈ సీరియల్లో శ్రావణిగా, భరణిగా తానే నటిస్తోంది చైత్రారాయ్. ‘ద్విపాత్రాభినయం అనేది ఓ పెద్ద ఛాలెంజ్’ అంటూ తన మనసులోని మాటలు ఇలా చెప్పుకొచ్చింది చైత్ర. అష్టాచమ్మా, మనసున మనసై సీరియల్స్ ద్వారా తెలుగువారికి సుపరిచితురాలైన చైత్ర పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కన్నడ సీరియల్స్‌తో ఆకట్టుకున్న నటన ఆమెను తెలుగు బుల్లితెరకు పరిచయం చేసింది. రొటీన్‌కి భిన్నంగా.. ఒకప్పుడు వేరే ఆర్టిస్టులు ద్విపాత్రాభినయం చేస్తున్నప్పుడు అలాంటి రోల్ ఒకటి నాకూ వస్తే బాగుండనే ఆశ ఉండేది. ఇన్నాళ్లకి రెండు పాత్రల్లోనూ నేనే లీడ్ రోల్లో నటించడం చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్ అనగానే పాజిటివ్‌గానూ, కొంచెం రొటీన్‌గానూ ఉంటుంది. దీనికి భిన్నమైన ఆపోజిట్ క్యారెక్టర్ చాలా ఛాలెంజ్డ్గా ఉంది. ఇలా రెండు పాత్రలు ఒకేసారి చేయడంతో చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతున్నాను. అయితే, ఇందులో కొంచెం రిస్క్ కూడా ఉంటుంది. ఇద్దరమ్మాయిల లుకింగ్‌లో చాలా డిఫరెన్స్ చూపించాలి. క్యాస్ట్యూమ్స్లోనూ, అలాగే యాక్టింగ్‌లోనూ ఇద్దరికీ ఏ మాత్రం పోలిక లేకుండా చూపించాలి. కానీ, కష్టపడితేనే మంచి పేరొస్తుంది. అలాంటి అవకాశం ఇప్పుడు నాకొచ్చింది అని సంతోషంగా ఉంది. కన్నడ అమ్మాయిని తెలుగులో నా మొదటి సీరియల్ ‘అష్టాచెమ్మా.’ అంతకు ముందు కన్నడ సీరియల్స్ చేసేదాన్ని. ఉంటున్నది బెంగుళూరులోనే. షూటింగ్స్ సమయంలో హైదరాబాద్ వస్తుంటాను. కానీ చాలా మంది నేను ఇక్కడి అమ్మాయినే అనుకుంటారు. అంతగా ఇక్కడివారు నాతో కలిసిపోయారు. మొదట హైదరాబాద్ వచ్చినప్పుడు భయపడ్డాను. భాష రాదు, ఎవరేం మాట్లాడినా నాకు అర్థమయ్యేది కాదు. నన్ను ఇక్కడి నుంచి రిజెక్ట్ చేస్తున్నారేమో లేదంటే నా గురించి ఏమనుకుంటున్నారో అని ఫీలయ్యేదాన్ని. ఇప్పుడు నేనుగా చెబితే తప్ప ఎవరూ నేను కన్నడ అమ్మాయినని అనుకోరు. కన్నడ సీరియల్ చేస్తున్నప్పుడు ఆ షాట్‌గ్యాప్‌లో ‘అష్టాచమ్మా’ సీరియల్‌కి ఆడిషన్స్ చేస్తున్నారు. ఆ సమయంలో నా చేత కన్నడలోనే రెండు డైలాగ్స్ చెప్పమన్నారు. అలా నేను సెలక్ట్ అయ్యి, తెలుగులోకి ఎంటర్ అయ్యాను. ఈ ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లయ్యింది. కానీ, నా జర్నీ హైదరాబాద్‌లోనే ఎక్కువ ఉందనిపిస్తుంది. ఇక్కడే మంచి మంచి సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నాయి. భవిష్యత్తు గురించిన ఆలోచనే లేదు హోటల్ మేనేజ్మెంట్కోర్స్ చేసేటప్పుడు అక్కడికి సీరియల్ టీమ్ వచ్చారు షూటింగ్‌కి. సీరియల్స్‌లో యాక్ట్ చేయడానికి ఇంట్రస్ట్ ఉందా అని అడిగారు. కానీ, నేనేమీ చెప్పలేదు. డైరెక్ట్‌గా మా అమ్మను కలిసి విషయం చెప్పారు. అమ్మ ఓకే చేయడం, నేను సీరియల్స్‌లో యాక్ట్ చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఫ్యూచర్ గురించి పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు. పదవతరగతి అయిపోయాక ఇంటర్ చేయాలి, ఆ తర్వాత డిగ్రీ చేయాలని మాత్రమే అనుకునేదాన్ని. ఒకసారి మాత్రం టీచర్ అయితే బాగుంటుంది అనుకున్నాను. కానీ, ఇలాగే నా లైఫ్ ఉండాలనే ఆలోచన అయితే లేదు. ఈ సీరియల్లో డ్యుయెల్ రోల్లో యాక్ట్ చేస్తునప్పుడు నాకూ ఒక చెల్లి ఉంటే ఇద్దరమూ స్క్రీన్‌ని షేర్ చేసుకునేవాళ్లం కదా అనిపిస్తుంది. ఆ వెంటనే నవ్వుకుంటాను. నాకు చెల్లెలు లేదు కానీ ఓ తమ్ముడు ఉన్నాడు. వాడి చదువు పూర్తయ్యింది. ఈ ఫీల్డ్ అంటే వాడికీ ఇంట్రస్ట్ ఉంది. అక్కగా నా ఎక్స్‌పీరియెన్స్ వాడితో షేర్ చేసుకుంటుంటాను. నా నటనకు సంబంధించిన మొదటి క్రిటిక్ కూడా మా తమ్ముడే. మంచి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. – నిర్మలారెడ్డి -
భర్త ఎలా ఉన్నా అంగీకరించాలా?
‘మన సమాజం కొన్ని శతాబ్దాలుగా అమ్మాయిలను మంచి భార్యలుగా తీర్చిదిద్దడానికే కృషి చేసింది. అబ్బాయిలను మంచి భర్తలుగా తీర్చిదిద్దాలని ఆలోచించలేదు. ఫలితంగా సమాజంలో చెడ్డ భర్తలే చాలామంది ఉన్నారు’’ అన్నారు ప్రముఖ నటి జయప్రద. ‘పర్ఫెక్ట్ పతి’ అనే హిందీ సీరియల్లో ఆమె నటించారు. ఓ వారం క్రితం ఈ సీరియల్ ముగిసింది. ఈ షోలో తన కోడలిని ఇబ్బందిపెడుతున్న కొడుకుని చంపేస్తుంది ఆమె పాత్ర. ‘‘మామూలుగా కొడుకులో తప్పులు ఉన్నా అతన్ని సమర్థించి, కోడలిని హింసించే అత్తలనే మనం సమాజంలో చూస్తుంటాం. కొడుకుని గుడ్డిగా నమ్మడం తప్పు. అతని తప్పులను ఒప్పుగా అనుకుని కోడలిని వేధించడం ఇంకా తప్పు. ‘పర్ఫెక్ట్ పతి’లాంటి మంచి సీరియల్ ద్వారా ఉత్తరాది చిన్ని తెరకు అడుగుపెట్టడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లిగా, అత్తగా పాజిటివ్ సైడ్‌ని చూపించే క్యారెక్టర్ని ఇందులో చేశాను. సీరియల్లో కొడుకు, కోడలి కాపురం హాయిగా సాగడంలేదని తెలుసుకున్న రాజ్యశ్రీ (జయప్రద పాత్ర పేరు) దానికి కారణం తెలుసుకుని, కొడుకుదే తప్పని గ్రహిస్తుంది. కోడలికి న్యాయం చేయడానికి తప్పు చేసిన కొడుకుని చంపేస్తుంది. సమస్యకి కారణమైనవారిని చంపా లని చెప్పడంలేదు. అయితే ఆ సీరియల్లో కొడుకుని అలా చేయడమే కరెక్ట్’’ అన్నారు జయప్రద. ఇంకా సమాజం గురించి మాట్లాడుతూ –‘‘మెట్టినింటి నుంచి పుట్టింటికి వెళ్లేటప్పుడు అమ్మాయి ఓ సంస్కారవంతమైన కోడలిగా పేరు తెచ్చుకోవాలనే తపనతో తల్లిదండ్రులు పెంచుతారు. అది తప్పు కాదు. కానీ అబ్బాయిలు మంచి అల్లుడిగా, మంచి భర్తగా ఉండాలనే ఆలోచనతో వాళ్లను పెంచరు. అలాగే భర్త ఎలా ఉన్నా ఆ భార్య అంగీకరించాలనే ఆలోచనతో ఉంటారు. అది సరి కాదు. మంచి భార్యలను ఇస్తున్న మన సమాజం మంచి భర్తలను ఇవ్వడంలో విఫలమవుతోందని నా అభిప్రాయం. అఫ్కోర్స్ మంచి భర్తలు లేరనడంలేదు. అయితే ఎక్కువగా లేరంటున్నాను’’ అన్నారు జయప్రద. -
శ్రమే నా సుకృతం
ఎలాంటి బాధ్యతలు లేకుండా కాలేజీకి వెళ్లే ఒక బెంగాలీ అమ్మాయికి తల్లి ఒక్కత్తే ఆలంబన. అలాంటిది తల్లి చనిపోవడంతో ఒంటరిదవుతుంది. అనుకోకుండా బెంగాల్ నుంచి తెలుగు నేలకు చేరిన ఆ అమ్మాయి జీవితంలో చోటుచేసుకునే పరిణామాలే ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్ కథ చెబుతుంది. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. ఇండిపెండెంట్, ఎమోషనల్ గర్ల్‌గా ప్రధాన పాత్రలో సుకృత నటిస్తోంది. వెండితెర మీద వెలిగి బుల్లితెర ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన సుకృత పరిచయం ఆమె మాటల్లోనే.. యాంకర్ నుంచి సినిమా ‘పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. కాలేజీ చదువు అయిపోవడంతోనే కన్నడ టీవీ ఛానెల్లో యాంకర్‌గా చేరాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా ప్రితియా రాయబారి అనే కన్నడ సినిమాలో అవకాశం వచ్చింది. అమ్మనాన్న బాగా చదువుకున్నవారు. లోకం గురించి వారికి బాగా తెలుసు. ఆడపిల్లను అని ఎక్కడా నాకు అడ్డంకులు చెప్పకుండా ప్రోత్సహించారు. అలా కన్నడ సినిమాలకు పరిచయం అయ్యాను. అటు తర్వాత కన్నడలోనే నాలుగైదు సీరియల్స్ చేశాను. కన్నడ సీరియల్లో ‘రాజకుమారి’ పాత్ర నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అట్నుంచి తెలుగులో ‘నేను–నా ఫ్రెండ్స్’ అనే సినిమాలో నటించాను. ఆ తర్వాత తెలుగు స్టార్ మా ‘కనులు మూసినా నీవాయే’ సీరియల్లో నటించడానికి అవకాశం వచ్చింది. అలా ఈ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉండే భయాలు ఇప్పుడు లేవు. ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇక్కడ మంచి స్కోప్ ఉంటుంది. సినిమా నుంచి సీరియల్ ఇది చిన్న పని, అది పెద్ద పని అని లెక్కలు వేసుకోను. నాకు పని ఉండాలి. పని చేస్తూ ఉంటే మంచి ఫలితాలు అవే వస్తాయి అని గట్టిగా నమ్ముతాను. అదీ కాకుండా ఈ రోజుల్లో సీరియల్ అమ్మాయి, సినిమా అమ్మాయి అనే తేడా లేదు. క్రియేటివిటీ, చార్మ్‌ను అందరూ గుర్తిస్తున్నారు. అలా చాలా మంది తమ వర్క్‌లో చాలా ఎఫర్ట్ పెడుతున్నారు. ఒకటే తేడా ఏంటంటే.. సినిమాలో అయితే రోజులో ఒకట్రెండు సీన్స్ వుంటాయి. అదే సీరియల్ అయితే రోజులో ఎనిమిది సీన్లు కూడా ఉంటాయి. ఆ విధంగా ఉదయం నుంచి రాత్రి వరకు పనితోనే సరిపోతుంది. సినిమా వర్క్ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటే, సీరియల్ వర్కింగ్ చాలా హోమ్లీగా ఉంటుంది. సినిమాలో హీరో హీరోయిన్స్ సీన్స్ ఎక్కువ ఉంటాయి. కానీ, కుటుంబానికి సంబంధించిన సీన్లన్నీ సీరియల్స్‌లోనే ఎక్కువ. సీరియల్ నుంచి రియల్ వర్క్ సీరియల్స్ తర్వాత నా వర్క్ బ్యుటిషియన్ చుట్టూతానే తిరుగుతుంటుంది. ఈ ఫీల్డ్కి రాకముందు బ్యుటిషియన్ కోర్సు చేశాను. నాకు ఆ వర్క్ అంటే చాలా ఇష్టం. ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా బ్యూటిషియన్‌కు సంబంధించిన కొత్తవివరాలు సేకరిస్తూ ఉంటాను. అంతేకాదు, సినిమా హీరోయిన్స్‌కి కూడా బ్యూటీ వర్క్ చేస్తాను. వంట చేయడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అన్ని డిష్‌లను కొత్తగా వండి వార్చడం కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాను. స్విమ్మింగ్ మాత్రం పిచ్చి. అవకాశాలు వస్తే సీరియల్స్, సినిమాలూ రెండూ చేస్తాను. సీరియల్, సినిమా ఏదైనా స్ట్రాంగ్ క్యారెక్టర్స్ చేయాలనేది నా యాంబిషన్. పేరులో మార్పు నా పేరులో అంజనా దేశ్‌పాండే అని ముందు ఉండేది. అంజనా సుకృత అని నా పూర్తి పేరు. ఇప్పుడు సుకృత అని మాత్రమే మార్చుకున్నాను. పేరులో ప్రత్యేకత ఉంటుందని అలా మార్చుకున్నాను. మా నాన్న బ్యాంక్ మేనేజర్, అమ్మ హౌజ్‌వైఫ్. ఈ ఫీల్డ్ గురించి వాళ్లెప్పుడూ భయపడలేదు. నా గురించి వాళ్లకు బాగా తెలుసు. నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు. – ఎన్.ఆర్ -
ప్రేమ ప్రిన్సీ
‘సంప్రదాయ కుటుంబ నేపథ్యంతో కూడిన పాత్రల్లో నటించడమంటే ఇష్టం’ అని చెప్పారు చిన్నితెర నటి ప్రిన్సీ. ‘కుంకుమ పువ్వు’ సీరియల్లో ‘అమృత’ పాత్రధారిగా టీవీ ప్రేక్షకులకు చిరపరిచితమైన ప్రిన్సీ గత కొంత కాలంగా తెలుగు సీరియళ్లలో రాణిస్తున్నారు. తాజాగా జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఫిక్షన్ సీరియల్ ‘ప్రేమ’లోని పాత్ర ద్వారా ప్రాచుర్యం పొందిన ప్రిన్సీ ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఇవీ.. అమ్మ దిద్దించిన అభినయం మేం జన్మతః మలయాళీలం అయినా కర్ణాటకలో సెటిలయ్యాం. మా అమ్మకు నటన అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇంట్లో రకరకాల కేరక్టర్లను అనుకరిస్తూ అభినయిస్తుంటే చూస్తూ, రకరకాల డ్రెస్సులవీ వేసి ర్యాంప్‌వాక్ చేయిస్తూ మురిసిపోయేది. అలా అలా నేనూ యాక్టింగ్ పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఓ రకంగా మా అమ్మగారు నటన వైపు నన్ను ఫోర్స్ చేశారనే చెప్పాలి. సరదాగా ఓకే చెప్పా! యాక్టింగ్ అభిరుచిగా ఉన్నా... చదువులో కూడా మంచి మార్కులే తెచ్చుకునేదాన్ని. నిజానికి ఐఎఎస్ ఆఫీసర్ కావాలనేది నా లక్ష్యం. అయితే టీనేజ్లోనే ఓ సీరియల్ నిర్మాతలు సంప్రదించడంతో చిన్నప్పటి అభిరుచి తీర్చుకుందామని సరదాగా ఓకే చెప్పాను. అనుకోకుండా ఆ సీరియల్ ద్వారా నాకు మంచి పేరు రావడం, తర్వాత తర్వాత సీరియల్స్‌లో బిజీ కావడంతో చదువుకు స్వస్తి చెప్పక తçప్పలేదు. అలాగే తెలుగు టీవీకి కూడా పరిచయం అయ్యాను. ఇక్కడ కూడా మంచి అవకాశాలు వస్తుండడంతో ప్రస్తుతం కర్ణాటకలోని షిమోగ నుంచి హైదరాబాద్‌కు రాకపోకలు సాగిస్తున్నాను. షూట్స్ ఉన్న సమయంలో వచ్చి వెళ్తుంటాను. చిన్నితెరే సురక్షితం అమ్మాయిలకు వేధింపులు అనేవి అన్ని రంగాల్లో ఉన్నాయి. అయితే సినీ నటీ నటులకు ఆదరణ ఎక్కువ కావడంతో సహజంగానే వారిపై కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. దీంతో వారికి సంబంధించిన విషయాలే ఎక్కువ ప్రచారంలోకి వస్తుంటాయి. మిగతా వాటితో పోల్చితే చిన్నితెర అమ్మాయిలకు మరింత సురక్షితమైనదని నా అభిప్రాయం. చాలావరకూ అవుట్ డోర్ షూటింగ్స్ ఉండవు. సినిమాల్లో నటించకూడదని ఏమీ అనుకోవడం లేదు, అలాగే చేసి తీరాలనే లక్ష్యాలు కూడా ఏమీ లేవు. ఒకవేళ మంచి అవకాశాలు వచ్చి అవీ ట్రెడిషనల్ పాత్రలైతే తప్పక చేస్తాను. అలాగే అవుదామనుకుని కాలేకపోయిన ఐఎఎస్ ఆఫీసర్ పాత్ర వస్తే మాత్రం వదులుకోను. తెలుగొచ్చేసింది సీరియల్స్‌లో మాటలు దానికి తగ్గ హావభావాలు, బరువైన సన్నివేశాలు సహజం. దీంతో భాష రాకపోవడం వల్ల మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. అయితే నాకు తమిళ్ బాగా వచ్చు. దీనివల్ల తమిళం వచ్చినవారు నాకు ట్రాన్స్‌లేట్ చేసి చెప్పేవారు. అలా అలా ఇప్పుడు తెలుగు కూడా బాగానే వచ్చేసింది. కన్నడ, మలయాళం, తమిల్, ఇంగ్లిష్, తెలుగు భాషలు వచ్చు. రెండు అవార్డులు తెలుగులోనే వచ్చాయి. దాంతో అక్కడ సాధించలేనిది ఇక్కడ సాధించానని హ్యాపీగా ఉంది. – నిర్మలారెడ్డి -
కార్తీక దీప
ప్రేమి విశ్వనాథ్ అంటే మనవాళ్లకు అంతగా తెలియకపోవచ్చు. కానీ, ‘కార్తీకదీపం’ సీరియల్ ‘దీప’ అనగానే ఇట్టే గుర్తుపట్టేస్తారు. నల్లటి రూపంతో చిన్నితెర మీద ప్రముఖ నటిగా వెలుగొందుతున్న ప్రేమి విశ్వనాథ్ పుట్టినిల్లు కేరళలోని ఎర్నాకులం. మలయాళం టెలివిజన్‌లో ‘కరతముత్తు’ (తెలుగు కార్తీక దీపం) అనే సీరియల్ ద్వారా ప్రేమి అక్కడివాళ్లకు కార్తీకగా పరిచమయ్యింది. బ్లాక్బ్యూటీగా మనవారిచేత అభినందనలు అందుకుంటున్న దీప ఆఫ్‌స్క్రీన్‌లో ఫెయిర్‌గా ఉంటుంది. అంతే ఫెయిర్‌గా తన మనసులోని విషయాలను పంచుకుంటుంది. సీరియల్లో ఈ పాత్రను మీరెలా ఒప్పుకున్నారు? సినిమానే కాదు టెలివిజన్ పరిశ్రమ కూడా గ్లామర్‌నే చూపిస్తుంది. ఫెయిర్‌గా ఉండే హీరోయిన్సే ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తారు. అయితే, ఈ సీరియల్లోని ప్రధాన పాత్ర ఒంటి రంగు నలుపుగా ఉండటం ఇందులోని కాన్సెప్ట్. దాన్నే సవాల్‌గా తీసుకున్నాను. తెలుగు సీరియల్లో డాక్టర్ కార్తీక్ (నిరుపమ్ పరిటాల) భార్యగా నటించాను. మీ గురించి తెలుసుకోవచ్చా? మా అమ్మనాన్నలు విశ్వనాథ్, కాంచన. భర్త డా.టి.ఎస్.వినీత్ భట్. అతను ప్రముఖ ఆస్ట్రాలజర్. నేను లా చేశాను. కొచ్చిలో ఒక ప్రైవేటు సంస్థలో లీగల్ అడ్వైజర్‌గా పనిచేసేదాన్ని. మా అన్నయ్య శివప్రసాద్ ఫొటోగ్రాఫర్, ఆర్టిస్ట్ కూడా. ఆ విధంగా నాకూ ఫొటోగ్రఫీ అబ్బింది. పెళ్లిళ్లకు ఫొటోలు తీసేదాన్ని. ఫొటోగ్రఫీ అంటే నాకు పిచ్చి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని కెమెరాలో బంధించడం చాలా ఇష్టం. నేనో ట్రావెల్ ఏజెన్సీని కూడా నడుపుతున్నాను. ‘కరతముత్తు’ (మలయాళం సీరియల్) లో కెమెరా ముందు నటించడానికి మా స్టూడియోలో కెమెరా ముందు చేసిన మోడలింగ్ బాగా ఉపయోగపడింది. ‘దీప’ గురించి చెప్పండి.. ‘కరతముత్తు’ సీరియల్ 2013లో మలయాళం టెలివిజన్‌లో మొదలయ్యింది. ఆ తర్వాత తెలుగులో 2017లో రీమేక్ అయ్యింది. ‘కరతముత్తు’లో నా పాత్రకు ఎంత మంచి పేరు వచ్చిందో తెలుగులో దీప (కార్తీకదీపం) క్యారెక్టర్‌కి అంతే మంచి పేరొచ్చింది. ఈ సీరియల్ కోసం మేకప్‌కి, క్యాస్టూమ్స్కి కనీసం రెండు గంటలు పడుతుంది. నా కుటుంబం, స్నేహితులకు నేను తెలిసినప్పటికీ నాకు ఇంతగా గుర్తింపు వచ్చింది మాత్రం సీరియల్ ద్వారానే. ఈ సీరియల్ ద్వారా ఏషియానెట్ టెలివిజన్ అవార్డ్, స్టార్ మా పరివార్ అవార్డ్స్ అందుకోవడం మర్చిపోలేని అనుభూతి. ఫ్యూచర్ గురించి ఫుల్ టైమ్ యాక్టర్‌గానే ఉంటాను. ఈ సీరియల్ ఉన్నంతవరకు ఇందులోనే కొనసాగుతాను. సీరియల్ రేటింగ్ పెరగడానికి స్టోరీ లైన్లో మార్పుల కోసం నేనూ చర్చలో పాల్గొంటుంటాను. కొత్త విషయాల గురించి తెలుసుకుంటుంటాను. ఆ తర్వాత అంటారా.. ఏదైనా వ్యాపారం కొనసాగిస్తాను. సినిమాల్లో యాక్ట్ చేయచ్చు. నేను డ్యాన్సర్‌ని కూడా. స్టేజ్ షోల మీద నృత్యప్రదర్శనలు కూడా ఇచ్చాను. -
టీవీ నటి టవల్ డ్యాన్స్.. ఊహించని ట్విస్ట్!
న్యూఢిల్లీ: ‘కుండలి భాగ్య’.. ఇప్పుడు హిందీ టీవీ చానెళ్లలో టాప్ టీఆర్పీ రేటింగ్ ఉన్న సీరియల్. సీరియల్ క్వీన్ ఏక్తా కపూర్ నిర్మాణ సారథ్యంలో వస్తున్న ఈ సీరియల్ చాలా పాపులర్ అయింది. ఇంతకముందు సూపర్ పాపులార్ అయిన ‘‘కుమ్కుమ్ భాగ్య’ సీరియల్ నుంచి కాన్సెప్ట్‌ను డెవలప్ చేసి ‘కుండలి భాగ్య’ సీరియల్‌ను తీసుకురావడం.. హిందీ సీరియళ్లలో ఒక కొత్త ఐడియాకు తెరలేపినట్టు అయింది. ఇప్పుడీ సీరియల్ గురించి ఉపోద్ఘాతం ఎందుకంటే.. ఈ సీరియల్‌తో బాగా పాపులర్ అయిన శ్రద్ధ ఆర్య గురించి చెప్పుకోవడానికే. ‘కుండలి భాగ్య’ సీరియల్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చిన శ్రద్ధ ఆర్య ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పాత వీడియో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో శ్రద్ధతోపాటు ఆమె స్నేహితులు టవల్ కట్టుకొని... రాణి ముఖర్జీ, ప్రీతి జింటా పాట ‘పియా పియా’కు స్టెప్పులు వేశారు. ప్రారంభంలో చూడటానికి ఈ వీడియో క్యూట్‌గా అనిపించినప్పటికీ అంత అనుకున్నట్టు సాగలేదు. ముగ్గురు దగ్గరగా ఉండి.. స్టెప్పులు వేస్తుండటంతో సమన్వయం కొరవడి.. ఒక డ్యాన్సర్ చేయి.. గట్టిగా శ్రద్ధ కంటికి తగిలింది. దీంతో తను బాధతో అరవడం.. ఆమె స్నేహితులు కూడా షాక్ తినడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. -
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్: జీవీ
సాక్షి, విజయవాడ: వంగవీటి రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు టెలీ సీరియల్ నిర్మించనున్నట్లు సినీ నటుడు జి.వి.సుధాకర్‌నాయుడు ప్రకటించారు. ప్రజల గుండెల్లో ఉన్న ఆయన గురించే ఈ సీరియల్ ఉంటుందన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్కులో గల ఆయన విగ్రహానికి జీవీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీరియల్లో అన్నీ వాస్తవాలే ఉంటాయన్నారు. ఇందుకు దేవినేని అనుమతి అవసరం లేదని, అభ్యంతరాలు చెబితే వారిని కూడా కలుస్తానని చెప్పారు. వర్మ తనకున్న మేథాశక్తి మేరకే వంగవీటి సినిమా తీశారని, అందులో కొన్ని తీశారు.. కొన్ని దాచారని అన్నారు. వర్మ దగ్గర మరో సినిమా ఉందంటూ అది ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవాలు కటువుగా ఉంటాయి.. అందరి పేర్లు పెట్టే సీరియల్ చేస్తాను.. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని వ్యాఖ్యానించారు. దాసరి నారాయణరావు నా గురువు.. వంగవీటి రంగాపై సినిమా తీయాలని ఆయన చివరి దశలో నన్ను కోరారని చెప్పారు. రంగా చరిత్ర మొత్తం ఆరున్నర గంటలపాటు చిత్రీకరించాల్సి ఉందని, అందుకే సినిమాగా కాక టెలీ సీరియల్‌గా తీస్తున్నామని, 150 ఎపిసోడ్ల వరకు ఉంటుందని జీవీ వివరించారు. -
ప్రతీ ప్రయాణానికి ముగింపు ఉంటుంది : శ్వేతా బసు
కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన శ్వేతా బసు ప్రసాద్ తరువాత వివాదాలతో వెండితెరకు దూరమైంది. లాంగ్ గ్యాప్ తరువాత సిల్వర్ స్క్రీన్ మీద రీ ఎంట్రీకి ట్రై చేసినా ఆశించిన స్థాయిలో అవకావాలు రాలేదు. దీంతో బుల్లితెర మీద దృష్టిపెట్టింది. ఏక్తా కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన చంద్రనందిని సీరియల్ ప్రధాన పాత్రలో నటించింది. అయితే ఈ సీరియల్ షూటింగ్ పూర్తి కావటం సోషల్ మీడియాలో స్పందించిన శ్వేతా ఆవేదన వ్యక్తం చేసింది. ‘ప్రతీ ప్రయాణానికి ఒక ముగింపు ఉంటుంది. ప్రస్తుతం నా భావాలను చెప్పేందుకు మాటలు సరిపోవటం లేదు. నాకు ఈ అవకావం ఇచ్చిన ఏక్లా కపూర్ కు కృతజ్ఞతలు. చంద్రనందిని సీరియల్ కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా కృతజ్ఞతలు. సీరియల్‌ను ఆదరించిన అభిమానులకు కూడా థ్యాంక్స్’ అంటూ తన ఫేస్ బుక్ పేజ్‌లో సుధీర్ఘమైన స్పందనను తెలిపింది. Every journey comes to an end and so has the journey of Chandra Nandini. I fail to find words to express my mixed emotions right now. Thank you @ektaravikapoor for this lovely experience. I thank the entire cast and crew of Chandra Nandini - the creative team, the directors, co actors, make up, hair, setting, camera, spot, production departments ❤️ I thank my friends and family for their constant love and support. And above all, I bow my head and join my hands to thank all the Chandra Nandini fans, our audience for so much love and making Maharani Nandini so unforgettable 🙂 @starplus #chandranandni 🤗 Sujata Rao Chloe Ferns Ruchikaa Kapoor Anil Jha Arpit Ranka Papia Sengupta Saanvi Talwar Manoj Kolhatkar Ranjan Singh Mukesh Kumar Singh Hamavvand Chwda Pankhuri Priyadarshani 🙏🏻 Posted by Shweta Basu Prasad on Wednesday, November 1, 2017 -
ఉరవకొండలో వరుస చోరీలు
ఉరవకొండ: ఉరవకొండలో సోమవారం అర్ధరాత్రి దొంగలుపడ్డారు. వేర్వేరు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. స్థానిక లాలూస్వామి ఆలయం వద్ద నివాసముంటున్న రాజేశ్వరి అనే మహిళ ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి, అందులోని రూ.50 వేల నగదు, రెండు తులాల బంగారు, వెండి నగలను అపహరించారని ఏఎస్ఐ మహేంద్ర తెలిపారు. ఆ సమయంలో ఆమె ఇంటి బయట నిద్రిస్తున్నట్లు వివరించారు. ఆ తరువాత మల్లేశ్వరస్వామి ఆలయంలోనూ దొంగలు ప్రవేశించారు. స్వామి వారి హుండీని ధ్వంసం చేసి, అందులోని వేలాది రూపాయల నగదును ఎత్తుకెళ్లారని చెప్పారు. అర్చకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా డాగ్‌స్కా్వడ్‌ను రప్పించి రాజేశ్వరి ఇంట్లో తనిఖీ నిర్వహించారు. త్వరలోనే దొంగలను గుర్తించి పట్టుకుంటామని ఆయన చెప్పారు. -
లక్నవరంలో ‘మూగమనసులు’ షూటింగ్
గోవిందరావుపేట : మండలంలోని లక్నవరం సరస్సు వద్ద మూగమనసులు సీరియల్ షూటింగ్ శనివారం లక్నవరం సరస్సు వద్ద హీరో ఆదిత్యవర్మ, హీరోయిన్ ధరణి, మరికొందరిపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. గగన్ టెలిషో సమర్పణలో గుత్తా వెంకటేశ్వరరావు నిర్మిస్తుండగా శ్రావణభాస్కర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్‌ను ఉయ్యాలవంతెన, రెస్టారెంట్ వద్ద గార్డెన్, బోటుపై వివిధ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ లక్నవరంలో ప్రకృతి అందాలు బాగున్నాయని, వీటిని పరిశీలించి షూటింగ్‌కు ఎంతో మంచి ప్రదేశంగా భావించామని తెలిపారు. ఇప్పటికే 590 ఎపిసోడ్లు పూర్తయ్యాయని వివరించారు. ఆదివారం గోవిందరావుపేటలోని కోదండరామాలయంలో షూటింగ్ జరుపనున్నట్లు తెలిపారు. బృందంలో ఆర్టిస్టులు సత్తిపండు, ఆకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత కృష్ణకాంత్, రచయిత బీవీ.రామారావు, శ్రీదేవిలు ఉన్నారు. -
జెమిని టీవీలో... శ్రీ ఆంజనేయం
రామాయణం.. ఇందులో చిన్నవాళ్ల నుంచీ పెద్దవాళ్ల వరకూ అందర్నీ ఆంజనేయుని పాత్ర ఆకట్టుకుంటుం ది. ఈ హనుమంతుని చుట్టూ ఎన్నో కథలు, సీరియల్స్ వచ్చాయి. అందులో ఎక్కువ శాతం రామాయణ కాలంలోని హనుమాన్ పాత్ర గురించి వచ్చినవే. కానీ, దాని తర్వాత చిరంజీవిగా ఉన్న ఆంజనేయుని చరిత్ర చాలామందికి తెలియదు. ఈ చరిత్రనే జెమిని టీవీ ‘శ్రీ ఆంజనేయం’ అనే మెగా సీరియల్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. మే 9న ఆరంభమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రసారం అవుతుంది. ఇందులో అద్భుతమైన కథ, కథనమే కాదు, అబ్బురపరిచే గ్రాఫిక్స్ కూడా ఉంటాయి. ఈ సీరియల్ వేసవిలో పిల్లలకు మంచి వినోదం అందించబోతోంది అనడంలో సందేహమే లేదు. -
చిన్న ఊళ్లు పెద్ద కలలు
ఫ్యాన్ ఉండేది గదిలో గాలాడకపోతే వేసుకోవడానికి. జీవితంలో గాలాడకపోతే ఉరేసుకోవడానికి కాదు. జంషడ్‌పూర్ అంటే ఉక్కు పట్టణం. స్టీల్. మనుషులు కూడా గట్టిగా పరిస్థితులను ఎదుర్కొనడంలో ఉక్కులా నిలబడాలి. కాని తికమకపడిపోతున్నారు. కళవళపడిపోతున్నారు. పారిపోతున్నారు. ముఖ్యంగా అక్కడి అమ్మాయిలు పెద్ద కలలు విసిరే వలల్లో చిక్కుబడి దారి వెతుక్కోలేక తప్పులు చేసేస్తున్నారు. హైదరాబాద్‌లో ‘అసంగతమైన’ పనులు చేస్తూ దొరికిపోయి చట్టబద్ధమైన దండనను ఫేస్ చేసిన శ్వేత బాసు ప్రసాద్ జంషడ్‌పూర్ అమ్మాయే. వీరభద్ర వంటి పెద్ద సినిమాలో బాలకృష్ణ వంటి హీరో పక్కన యాక్ట్ చేసి కూడా సౌత్‌లో కాని ముంబైలో కాని తగిన పాత్రలతో స్థిరపడలేక సతమతమవుతున్న తనుశ్రీ దత్తా కూడా జంషడ్‌పూర్ అమ్మాయే. తాజాగా ప్రత్యూష బెనర్జీ. ఓటమి మీద ప్రతీకారం ప్రాణాలు తీసుకోవడమే అని భావించింది. ఎంకి పెళ్లి సుబ్బి కల్యాణానికి వచ్చింది. టెలివిజన్‌లో కోట్లాది ప్రేక్షకులను కట్టిపడేసిన ‘బాలికా వధు’ సీరియల్లో ‘ఆనంది’ అనే చిన్నారి చిన్న వయసులోనే పెళ్లికూతురు అవుతుంది. అక్కణ్ణుంచి ఆ చిన్నారి జీవితం ఏమవుతుంది అనేది దేశ ప్రజల తక్షణ సమస్య అయ్యింది. ఆ పాత్రను పోషించిన చైల్డ్ అవికా గౌర్ పెద్ద స్టార్ అయ్యింది. అయితే ఆ పాత్ర యుక్త వయసులోకి వస్తుండగా దానిని ఎవరు పోషించాలన్న విషయం పై సీరియల్ నిర్మాతలు ఏకంగా ఒపీనియన్ పోల్‌నే నిర్వహించారు. ఆడిషన్స్ ద్వారా ముగ్గురు యువతలను ఎంపిక చేసి వీరిలో ఎవరో తేల్చుకోండి అనంటే లక్షలాది ఓట్లు ఒకే పేరును తేల్చాయి- ప్రత్యూష బెనర్జీ. ఒక తార జన్మించింది అని అంటూ ఉంటారు. కాని అంతలోనే అస్తమించింది. తెల్లవారు జామున నాలుగ్గంటల సమయంలో పుట్టిందట ప్రత్యూష. అందుకని ఆ అమ్మాయికి ప్రత్యూష అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ పిచ్చి. జట్టు సరిచేసుకోవడం, గోళ్లు సరి చేసుకోవడం, ముక్కు ముఖం అందంగా చూసుకోవడం... జంషడ్‌పూర్‌లో ‘లోకల్ టాలెంట్’గా అందరి గుర్తింపు పొందింది. కాని అంతకు మించి ఎదగడానికి ఎత్తు ఒక సమసై కూచుంది. ఐదు అడుగుల ఒక అంగుళం. ఈ ఎత్తుతో ఏదైనా ఎలా సాధిస్తారు గ్లామర్ ఫీల్డ్‌లో అని అందరూ అడిగేవారు. సాధించగలను అని ముంబై చేరుకుంది ప్రత్యూష. చిన్న ఊరు అమ్మాయి. లోఖండ్ వాలాలో చిన్న గది తీసుకొని దిగితే అంతా ఉక్కిరిబిక్కిరి. కొంతమంది అమ్మాయిలు స్నేహితులయ్యారు. ఇదిగో ఇలాంటి బట్టలు వేసుకోవాలి... ఇలా నంగి నంగిగా మాట్లాడాలి... కనపడ్డ ప్రతి అడ్డమైన వెధవని హగ్ చేసుకుంటూ పలకరించాలి... అన్నీ నేర్చుకుంది. కాని పాత్రను ఇచ్చింది మాత్రం కేవలం ఆమె చురుకుదనం, ప్రతిభ, ఏదైనా సరే చేసి తీరాలి అనే పట్టుదల. ఫేస్‌బుక్‌లు రావడం అందులోనే తన ప్రొఫైల్ పిక్చర్ చూసి ఆడిషన్‌కు పిలవడం చివరకు బాలికా వధుకు ఎంపిక కావడం వేగంగా జరిగిపోయాయి. సీరియల్లో తన పాత్ర మొదలైంది. రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయింది. అందరూ పలకరించేవారే. అందరూ పలకరించాలనుకునేవారే. భారీ ఫేమ్. బాలికా వధు... అనే మాటే ఎంత పెద్ద పార్టీలోకైనా ఎంట్రీ కార్డ్. ఒక బాయ్ ఫ్రెండ్... పేరు మకరంద్ మల్హోత్రా. కొన్నాళ్లకు ఇబ్బందులు వచ్చాయి. అతడి మీద పోలీస్ కేస్ పెట్టేంత వరకూ వెళ్లి గోల అయ్యింది. ఆ తర్వాత మరో బాయ్ ఫ్రెండ్ రాహుల్ రాజ్. అతడు ఏదో కారు లోన్ విషయంలో ఆమెను మోసం చేశాడని వార్తా. మరోవైపు బాలికా వధులో ఎపిసోడ్ వెంట్ ఎపిసోడ్ చేసుకుంటూ మొహం మొత్తి బయటకు వచ్చాక హీరోయిన్ అవుదామని అంతకు మించి ఎదుగుదామని భావించాక అలాంటి అవకాశాలు రాలేదు. వచ్చిన ఒకటి రెండు సీరియల్స్ చానెల్స్‌లో నిలబడలేదు. లేదా ఆ పాత్రల్లో ఆమె నిలబడలేదు. ఈ లోపు పెద్ద డబ్బు ఎరచూపే ‘బిగ్‌బాస్’ షోలో ఆమె పాల్గొనడం పెద్ద ప్రతికూలత అయ్యింది. వ్యక్తిత్వానికి ఒక నమూనాగా నిలిచిన బాలికా వధు పాత్రను పోషించిన అమ్మాయి బిగ్ బాస్ షోలో అందరు మనుషుల్లానే రకరకాల బలహీనతలు ప్రదర్శిస్తూ అపరిణితంగా వ్యవహరిస్తూ ఉంటే జనం చూడలేకపోయారు. అయ్యో అనుకున్నారు. అందులో నుంచి బయటకు వచ్చాక కూడా కెరీర్ ఆశావహంగా అనిపించలేదు. అవకాశాల కోసం ప్రయత్నించడం... ప్రయత్నించడం...కాని అవకాశాల కంటే కూడా సీలింగ్‌కు ఉన్న ఫ్యానే దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. జంషడ్‌పూర్ దేశంలోని అన్ని చిన్న పట్టణాలలాగే ఒక చిన్న పట్టణం. అక్కడి అమ్మాయిలకు ఒక సంరక్షణాయుతమైన వాతావరణంలో పెరుగుతారు. ఏవైనా సమస్యలు వస్తే ఊరే అయినవారే నిలబడి సాయం చేస్తారు. కాని పెద్ద పెద్ద నగరాల్లో పెద్ద పెద్ద కలల్లో అడుగు పెట్టాక అందుకు అవసరమైన తర్ఫీదు, చదువు, పరిణితి లేక వచ్చిన పేరును చూసి పొంగిపోయి పేరు పోతే కుంగిపోయి ఏవైనా సమస్యలు ఎదురైతే ఎలా వాటిని ఎదుర్కొనాలో తెలియక పలాయనంలోకి వెళుతున్న నేటి తరం యువతకు ప్రతినిధి ప్రత్యూష బెనర్జ్జీ అని అనిపిస్తుంది. బిహార్, జార్ఖండ్‌లు తల ఎత్తుకునేలా చేస్తాను అన్న అమ్మాయి శవాన్ని అందరూ తలెత్తి చూడాల్సి వచ్చింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ‘త్వరలోనే మీకో సర్ప్రైజ్ ఇస్తాను’ అని కెరీర్‌కు సంబంధించి చేసిన వ్యాఖ్య ఇలాంటి సర్ప్రైజ్ మారడం విషాదం. ‘కాంట్రవర్సీలు సృష్టించడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ సృష్టించదలుచుకుంటే ఈ చిన్నాచితకా బాయ్‌ఫ్రెండ్ కాంట్రవర్సీలు కాదు. పెద్ద కాంట్రవర్సీనే సృష్టిస్తాను’ అందామె. కాని ఆమె మృత్యువే ఆమె కోరిన అతి పెద్ద కాంట్రవర్సి కావడం నిజంగానే విషాదం. ఫ్యాన్ ఉన్న గది మాత్రమే లోకం కాదు. బయట చాలా ఉంది.చూడ్డానికి పెను గాలులూ సుడిగాలులూ ఎదురుగాలులూ కనిపించవచ్చు. ఆ గాలిలోనే మనం బతకడానికి అవసరమైన ప్రాణవాయువు కూడా ఉందని గ్రహిస్తే ఇవి కేవలం వచ్చి పోయే సమస్యలు.కలలు కలాలి. నిజం చేసుకోవడానికి ప్రాథమికంగా జీవించి ఉండాలి. జీవించి ఉండటమే నేటి తరానికి అతి పెద్ద కెరీర్. - సాక్షి ఫ్యామిలీ బిహార్, జార్ఖండ్‌లు తల ఎత్తుకునేలా చేస్తాను అన్న అమ్మాయి శవాన్ని అందరూ తలెత్తి చూడాల్సి వచ్చింది. -
ఇద్దరూ ఇద్దరే!
ఇద్దరు అమ్మాయిలు. ఒకరు మలయ పవనమైతే ఒకరు సుడిగాలి. ఒకరు మంచుముక్క అయితే ఒకరు నిప్పుకణిక. వారిద్దరూ తారసపడితే? ఒకరితో ఒకరు పోటీ పడితే? ఒకరికొకరు ఎదురు నిలిస్తే? ఏమవుతుందో తెలుసుకోవాలంటే ‘ముత్యాలముగ్గు’ సీరియల్ చూడాలి. అసలు ‘ముత్యాలముగ్గు’ అన్న పేరు విన్నప్పుడే మన మనసులో దాని మీద ఆసక్తి ఏర్పడుతుంది. ఓ గొప్ప సినిమా పేరు పెట్టారు, కథ కథనాలు ఎలా ఉంటాయో, పాత్రల చిత్రణ ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సుకత ఉంటుంది. అందుకే ‘ముత్యాలముగ్గు’ సీరియల్ పట్ల మొదటే అందరికీ ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తికి తగ్గట్టుగానే ఉందా ధారావాహిక. రెండు విభిన్నమైన కుటుంబాలు, రెండు విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన హీరోయిన్లు, వారి మధ్య వచ్చే వివాదాలు, పరిష్కారాలు, సర్దుబాట్ల మేళవింపు ఈ సీరియల్. ఈ మధ్యనే మొదలైంది. ఆసక్తికరంగా సాగిపోతోంది. మరి ముందు ముందు ఎలాంటి మలుపులు తిరుగుతోందో చూడాలి! -
అసలు సిసలు ప్రేయసీ!
టీవీ టైమ్ కుటుంబ కలహాలు, బాంధవ్యాల మధ్య విభేదాలు, ప్రేమ కోసం పోరాటాలు, పగలు ప్రతీకారాలు... ఏ సీరియల్ అయినా ఉండేవి ఇవే. కానీ వాటిని ఎంత డిఫరెంట్‌గా చూపించాం, ఎంత కొత్తగా అల్లుకున్నాం అన్నదాని మీదే సక్సెస్ ఆధారపడివుంటుంది. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని తీసినట్టుగా ఉంటుంది ‘ఇది ఒక ప్రేమకథ’ సీరియల్. ఎన్ని ప్రేమకథలు చూడలేదు? అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం, అంతస్తుల భేదాల వల్ల వారి ప్రేమలో అవరోధాలు ఏర్పడటం, ఆ తర్వాత రకరకాల సమస్యలు... చాలా సీరియళ్లు ఇలా నడిచాయి. అయితే ‘ఇది ఒక ప్రేమకథ’లో మాత్రం పాత్రల చిత్రణ బాగుంది. హీరో సాఫ్ట్ నేచర్, హీరో తల్లిగా జ్యోతి అద్భుతమైన అభినయం, చక్కని సంభాషణలు కలగలసిన ధారావాహిక అది. ఉత్కంఠను రేకెత్తించే కథనం కూడా బలాన్ని చేకూరుస్తోంది. అన్నిటికంటే ముఖ్యంగా హీరోయిన్ శ్రీవాణి తన పాత్రకి చక్కగా సరిపోయింది. పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయింది. స్ట్రాంగ్‌గా కనిపిస్తూనే సున్నితత్వాన్ని కూడా ప్రదర్శిస్తూ మార్కులు కొట్టేస్తోంది. అసలు ప్రేయసి అంటే ఇలానే ఉండాలి అనిపించేలా చేస్తోంది. అందుకే ఆ సీరియల్ సక్సెస్‌లో శ్రీవాణి భాగం కాస్త ఎక్కువే! -
అమెరికా అమ్మాయి అదుర్స్!
అప్పుడెప్పుడో వచ్చిన ‘అమెరికా అమ్మాయి’ సినిమా మనవాళ్లకి చాలా నచ్చేసింది. ఓ విదేశీయురాలు మన దేశానికి వచ్చి, మన సంస్కృతిని మెచ్చి ఫాలో అవడం చూసి గర్వంగా ఫీలయ్యాడు ప్రతి తెలుగు ప్రేక్షకుడూ. ఇప్పుడు అదే పేరుతో ఓ సీరియల్ వస్తోంది. అయితే కథ అలా ఉండదు. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘ముద్దుల మనవరాలు’ టైపులో ఉంటుంది. ఆ సినిమాల్లో హీరోయిన్ విదేశీయురాలు కాదు. మన దేశానికే చెందిన దంపతులకు పుట్టి, అమెరికాలో పెరిగిన అమ్మాయి. ఈ సీరియల్లో కూడా అంతే. హీరోయిన్ అమెరికాలో పుడుతుంది. అనుకోని కారణాల వల్ల మన దేశానికి వస్తుంది. తనకు అంతగా దగ్గర కాని తనవాళ్ల దగ్గర ఉండాల్సి వస్తుంది. అక్కడ్నుంచి ఆమెకు ఎదురయ్యే అనుభవాలు, ఆమె చుట్టూ అల్లుకునే అనుబంధాలతో కథ ఆసక్తిగా సాగిపోతుంది. ముఖ్యంగా ఇంటి పెద్దగా తాళ్లూరి రామేశ్వరి కనిపించడం పెద్ద ఎసెట్! -
సుజన చచ్చిపోతుందా?!
సీరియల్‌కి ప్రాణం పోసే ఒక పాత్ర ఉన్నట్టుండి మాయమైపోతే చాలా వెలితి ఫీలవుతారు ప్రేక్షకులు. తమ ఇంట్లోని ఒక మనిషే దూరమైపోయినట్టుగా బాధపడిపోతారు. అందుకేనేమో, దర్శకులు అప్పుడప్పుడూ ఒక్కో ముఖ్యమైన పాత్రని చంపేస్తుంటారు. ‘మనసు పలికే మౌనగీతం’లో అలానే జరగబోతోంది. హీరోయిన్ ఇషిత తరువాత అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ అయిన సుజన చచ్చిపోనుంది. అహంకారంతో భర్తను వదిలేసుకుని, అతడు మరో స్త్రీకి భర్తయిన తర్వాత సాధించాలని చూస్తుంది సుగుణ. దానికోసం రకరకాల పన్నాగాలు పన్నుతుంది. ఈ మధ్యనే తన దుష్టబుద్ధి కారణంగా పిల్లలకు కూడా దూరమైపోయింది. అయితే ఆమె పాత్ర అక్కడితో అయిపోలేదు. ముందు ముందు ఆమె పాత్ర మరింత కీలకంగా మారబోతోంది. ఆ తర్వాత ప్రాణమూ కోల్పోనుంది. ఇది సీరియల్‌కి దెబ్బ కాకపోయినా, ఆ పాత్రను ప్రేమించే అభిమానులకు మాత్రం పెద్ద లోటే. సుజన పాత్రను అద్భుతంగా పోషింది అనిత. అహంకారానికి నిలువెత్తు రూపంలో కనిపించే ఆమె పాత్ర అర్ధంతరంగా ముగిసిపోవడానికి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి! -
అత్త లేని కోడలు... ఉత్తమురాలే!
ఏడుగురు మగవాళ్లు ఉండే ఇల్లు అది. తాత... తండ్రి... ఐదుగురు కొడుకులు. పెద్ద కొడుకు భార్య వల్ల వచ్చిన సమస్యలతో మనసు వికలమైన తండ్రి... తన ఇంటి మీద ఎప్పటికీ ఆడనీడ పడకూడదనుకుంటాడు. ఇక ఎవ్వరినీ పెళ్లి గురించి ఆలోచించవద్దంటాడు. కానీ రెండో కొడుకైన హీరో హీరోయిన్‌తో ప్రేమలో పడతాడు. తండ్రికిష్టం లేక పోయినా ఎలాగో పెళ్లాడి భార్యను ఇంటికి తీసుకొస్తాడు. అత్త కూడా లేని ఆ ఇంటికి తను అమ్మ అవుతుంది హీరోయిన్. అందరికీ సేవలు చేస్తుంది. అందరి మనసుల్లోనూ స్థానం సంపాదిస్తుంది. కానీ ఆమెలా మరొకరు ఉండరు కాబట్టి ఇంకెవరికీ పెళ్లిళ్లు చేయనంటాడు తండ్రి. అయినా మిగతావాళ్లూ ప్రేమలో పడతారు. వాళ్లందరికీ ఆ కోడలు ఎలా పెళ్లిళ్లు చేసింది, బావగారి కాపురాన్ని ఎలా చక్కదిద్దింది, సమస్యలన్నీ ఎలా పరిష్కరించింది అనేది ‘సాస్ బినా ససురాల్’ సీరియల్లోని మిగతా కథ. ఈ సీరియల్ ఇటీవలే ‘అత్త లేని కోడలు ఉత్తమురాలు’గా తెలుగులో మొదలైంది. చక్కని కుటుంబ కథనాలను మనవాళ్లు ఎంతో ఇష్టపడతారు కాబట్టి తప్పకుండా వాళ్ల మనసులను గెలుచుకునే అవకాశమూ ఉంది. మరీ ముఖ్యంగా ఆదర్శనీయంగా ఉండే హీరోయిన్ పాత్ర అందరికీ నచ్చి తీరుతుంది. -
తనే నాకు తగిన జోడీ!
కలర్స్ కళ్యాణ్ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చే సీరియల్ రాధ- మధు. ఆ సీరియల్లో నటి మౌనిక పక్కన కళ్యాణ్ ఎంతో ముచ్చటగా కనిపిస్తూ ఇంటింటికీ ఆత్మీయుడైపోయాడు. లయ, కన్యాదానం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే వంటి సీరియల్స్‌తో కెరీర్ కొనసాగించిన కళ్యాణ్ కొంత విరామం తర్వాత మళ్లీ బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రంగం గురించి, అందులోని సాధక బాధకాల గురించి ‘సాక్షి’తోపంచుకున్నారు... ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అని టైటిల్ పెట్టారు. కానీ సీరియల్లో మీ మాటలు తేడాగా ఉన్నాయే? (నవ్వుతూ) అవును. పేరుకే హీరోని గానీ క్యారెక్టర్ పరంగా విలన్ని. వేరే అమ్మాయి కోసం భార్యని దారుణంగా మోసగించే పాత్ర. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించి కనిపించి బోర్ కొట్టింది. అందుకే నెగిటివ్ రోల్ ఎంచుకున్నా. ఆమధ్య బుల్లితెర మీద కనిపించలేదెందుకని? కావాలనే రెండేళ్లు గ్యాప్ తీసుకున్నా. ఈ ఇండస్ట్రీలో ఏదీ శాశ్వతం కాదు. ఒక్కరోజులో ఎత్తేస్తారు, ఒక్కరోజులో పడేస్తారు. కాబట్టి భవిష్యత్తు కోసం మరొక ఆప్షన్ పెట్టుకోవడం అవసరమనిపించింది. అందుకే నటనకు కామా పెట్టి బిజినెస్ సెటప్ చేసే ప్రయత్నాల్లో పడ్డాను. అంతలో మంచి ఆఫర్ రావడంతో మళ్లీ మేకప్ వేసుకున్నాను. చూస్తుంటే ఇండస్ట్రీ మిమ్మల్నేదో ఇబ్బంది పెడుతున్నట్టుంది? లేదు.. నేను అలా అనలేదు. సెకెండ్ ఆప్షన్ అవసరం అని చెప్పానంతే. అయినా సమస్యలన్నవి అన్ని చోట్లా ఉంటాయి. ఇష్టపడి చేస్తే ఏదీ కష్టంగా అనిపించదు. నాకు నటనంటే ఇష్టం. ఇండస్ట్రీ అంటే ఇష్టం. కాబట్టి దీన్ని ఎప్పటికీ కష్టమనుకోను, వదలను. ఈ ఇష్టం మీరు నటుడయ్యాక పెరిగిందా... లేక ఇష్టంతోనే నటుడయ్యారా? నిజానికి ఇండస్ట్రీకి ఇష్టంతో రాలేదు, యాక్సిడెంటల్‌గా వచ్చాను. నేను హైదరాబాద్‌లో పుట్టి పెరిగాను. ఎంబీయే చేసి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు చిన్నా అనే అసిస్టెంట్ డెరైక్టర్ ద్వారా ‘రాధ-మధు’ సీరియల్ హీరోగా చాన్స్ వచ్చింది. నటించడం మొదలెట్టాక అందులోని ఆనందం తెలిసి వచ్చింది. పైగా అది పెద్ద హిట్. తర్వాత చేసిన ‘లయ’ కూడా మంచి హిట్ కావడంతో ఇక వెనక్కి తిరిగి చూడలేదు. సినిమాల్లోకి కూడా వెళ్లారుగా? అవును. ‘గోపి గోపిక గోదావరి’లో సెకెండ్ హీరోగా చేశాను. నిజానికి అంతకంటే ముందే వాన, లక్ష్మి, సై, మనోరమ లాంటి కొన్ని సినిమాల్లో మంచి రోల్స్ కోసం అడిగారు. టైమ్ కుదరక చేయలేదు. కానీ వంశీగారి సినిమా అంటే వదులుకోలేకపోయాను. కానీ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు? చెప్పానుగా నటనకు కామా పెట్టానని. దానివల్లే సీరియల్స్‌తో పాటు సినిమాలకీ దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్లీ మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. అన్నీ కలిసొస్తే లీడ్ రోల్ చేసే చాన్స్ కూడా ఉంది. సినిమా మీద ఆశతో కెరీర్‌ని పాడు చేసుకున్న సీరియల్ నటులు చాలామంది ఉన్నారు. మరి మీరు..? మీరన్నది నిజమే. కానీ టీవీ నుంచి వెళ్లి సక్సెస్ అయినవాళ్లూ ఉన్నారు. రాజీవ్ కనకాల, రావు రమేష్ అందుకు మంచి ఉదాహరణ. ఓ మంచి క్యారెక్టర్ దొరికినప్పుడు నటుడి లైఫ్ దానంతటదే టర్న్ అవుతుంది. అయితే ఒకటి. నేను సినిమాల కోసం సీరియళ్లను వదిలేసుకోవాలని అనుకోవడం లేదు. నేనెవరో అందరికీ చెప్పిందీ, నాకింత పేరు తెచ్చిందీ టీవీయే కదా! సినిమాలు హీరో చుట్టూ తిరిగితే... సీరియళ్లు హీరోయిన్ చుట్టూ తిరుగుతాయి. మరి సీరియల్ హీరోగా మీకెంత ప్రాధాన్యత ఉంది? సీరియల్ అంటే కుటుంబ కథ. వాటిలో కనిపించే పాత్రలన్నీ తమ ఇళ్లలోనే కనిపిస్తుంటాయి అందరికీ. ప్రతి ఇంటికీ ఇల్లాలు ముఖ్యం. అందుకే హీరోయిన్ పాత్రకి కాస్త ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలా అని మిగతా సభ్యులంతా లేకపోతే కుటుంబం అవ్వదు. సందర్భాన్ని బట్టి ఒక పాత్ర బరువవుతుంది. ఓ పాత్ర తేలికవుతుంది. అంతే తప్ప ప్రాధాన్యత లేకపోవడం అంటూ ఉండదు. ఒకవేళ సీరియల్లో సడెన్‌గా ఓ పాము ఎంటరయ్యిందనుకోండి. దానివల్ల టీఆర్పీ పెరిగితే పాము ప్రధాన పాత్రగా మారిపోతుంది. దాన్ని మిగతావాళ్లంతా అంగీకరించి తీరాలంతే. ఇండస్ట్రీలో మహిళలకు ఇబ్బందులున్నాయనేది అందరూ ఒప్పుకునే వాస్తవం. మరి మగవాళ్లకి? ఎదిగే క్రమంలో సమస్యలు అందరికీ ఉంటాయి. అధిగమించుకుంటూ వెళ్తేనే సక్సెస్. నా వరకూ నన్ను ఇబ్బంది పెట్టే విషయమైతే రూమర్స్. ఎవరితో కాస్త క్లోజ్‌గా ఉన్నా వాళ్లతో ముడిపెట్టేస్తారు. అంతకాలం కంటిన్యుయస్‌గా ఓ హీరోయిన్‌తో పని చేస్తున్నప్పుడు కాస్త స్నేహం ఏర్పడుతుంది. చనువుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. దానికి విపరీతార్థాలు తీసి, దారుణంగా కామెంట్లు చేయడం బాధనిపిస్తుంది. (నవ్వుతూ) పైగా నేను ఇద్దరు హీరోయిన్లు లేకుండా ఇప్పటి వరకూ ఏ సీరియల్ చేయలేదేమో... ఈ పుకార్ల బాధ కాస్త ఎక్కువే. వాటికి మీ ఇంట్లోవాళ్ల స్పందన? నా భార్య శ్రీలేఖ యాంకర్. కాబట్టి తనకు ఇలాంటివన్నీ తెలుసు. సో, ప్రాబ్లెమ్ లేదు. వేరే సీరియల్స్ చూస్తారా? మీ కాంటెంపరరీస్లో మీకు నచ్చే నటుడు ఎవరు? ‘వరూధినీ పరిణయం’ చాలా నచ్చుతుంది నాకు. రెండు వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్న భార్యాభర్తల జీవితాలను ముడివేసి చూపించే విధానం చాలా బాగుంది. అలాగే హిందీలో ‘బాలికావధు’, ‘ఆనంది’ క్యారెక్టర్ని బ్యాలెన్స్డ్గా చూపించే తీరు అద్భుతం. ఇక హీరోలంటారా... వాళ్ల పరిధి మేరకు అందరూ బాగానే చేస్తారు. ఎవరి స్టైల్ వారిది. డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా? సీరియళ్లలో లేదు కానీ సినిమాల్లో ఉంది. ‘సాగర సంగమం’లో కమల్‌గారి పాత్ర లాంటిది చేయాలి. నిజానికి ఆయన చేసే పాత్రలు ఆయన మాత్రమే చేయగలరు. అంత గొప్పగా మరెవరూ చేయలేరు. అంతలో కొంత చేయగలిగితే చాలు... నటుడిగా జీవితం ధన్యమైనట్టే. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీని చూస్తున్నారు. ఇక్కడ ఏదైనా మారాల్సి ఉందని మీకనిపిస్తోందా? డబ్బింగ్ సీరియల్ సంస్కృతి మారాలి. ఒక్క సీరియల్ మీద కనీసం ఓ యాభై కుటుంబాలు ఆధారపడి జీవిస్తాయి. ఓ సీరియల్‌ని డబ్ చేసే బదులు రీమేక్ చేస్తే ఆ యాభై కుటుంబాలూ కడుపు నిండా తిండి తింటాయి. అది పట్టించుకోకుండా టపటపా ఇతర భాషా సీరియళ్లను దించేస్తున్నారు. ఇది ఆగాలి. నటన... బిజినెస్... ఇవేనా, ఇంకేమైనా ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా? ట్రాఫిక్ సిగ్నళ్ల దగ్గర చిన్న చిన్న పిల్లలు బిచ్చమెత్తుకుంటుంటే మనసు అదోలా అయిపోతుంది. వాళ్ల కోసం ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ నా ఒక్కడి వల్లే అది సాధ్యం కాకపోవచ్చు. ప్రభుత్వం అందుకు పూనుకోవాలి. నిజంగా వాళ్లు ఏదైనా చేస్తే... అందులో పాలు పంచుకునే మొదటివాణ్ని నేనే అవుతాను. - సమీర నేలపూడి -
కాపీయే కాదు... హిట్టూ కొట్టారు!
సీరియల్ అనుకోండి... కథ, కథనాలు కాపీ కొడతారు. గేమ్ షోలు అనుకోండి... కాన్సెప్ట్ కాపీ కొడతారు. కానీ మరీ టైటిల్ కూడా కాపీ కొట్టాలా? క్యాప్షన్‌ని కూడా కాపీ కొట్టాలా? ఇలాగే అడగాలనిపిస్తుంది... ‘13’ షో నిర్వాహకుల్ని. ఫియర్ ఫ్యాక్టర్, ఖత్రోంకే ఖిలాడీ లాంటి కార్యక్రమాల కాన్సెప్ట్ మనకు తెలిసిందే. పార్టిసిపెంట్స్‌తో రకరకాల సాహసాలు చేయిస్తుంటారు. తద్వారా మనల్ని ఎంటర్టైన్ చేయాలని చూస్తుంటారు. ‘13’ అనే షో కూడా అలాంటిదే. ‘ఫియర్ ఈజ్ రియల్... రిస్క్ ఈజ్ థ్రిల్’ అనే క్యాప్షన్‌తో ప్రసారమవుతోన్న ఈ షో అందరినీ బాగానే ఆకట్టుకుంటోంది. అయితే దీన్ని ఓ ఇంగ్లిష్ షో నుంచి తీసుకున్నారు. కాన్సెప్ట్ కొట్టేస్తే ఫర్వాలేదు. కానీ అక్కడున్న టైటిలే పెట్టారు ‘13’ అని. అక్కడున్న క్యాప్షనే వాడుకున్నారు... ‘ఫియర్ ఈజ్ రియల్’ అని. అయితే కాపీ కొట్టినా హిట్టు కూడా కొట్టడం గురించి మాత్రం మనం చెప్పుకుని తీరాలి. ఆద్యంతం ఆసక్తికరంగా ఉండేలా షోను తీర్చిదిద్దుతోన్న తీరును మెచ్చుకోవాలి కూడా. ముఖ్యంగా యాంకర్ ఆ షోకి ప్లస్. సీరియస్ లుక్స్‌తో, పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్‌తో అతడు తనదైన స్టైల్లో షోని విజయం వైపుగా పరిగెత్తి స్తున్నాడు! -
సీరియల్ శ్రీమతి...
సతి బాధ బిచ్చం వేయాల్సి వస్తుందని మా అపార్ట్మెంట్ వాళ్లు అసలు పిల్లులే లేకుండా చేశారు. కొంచెం పిసినారులు. కాని ఎందుకనో చాలాసేపుగా పిల్లి ఏడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. పిల్లి ఏడవడం గతంలో విన్నావా అని అడగొద్దు. వినలేదు. కాని అది మాత్రం పిల్లి ఏడుపే అనిపించింది. నిద్ర లేచాను. పూర్వం అంటే అందరూ దిండు పక్కన హనుమాన్ చాలీసానో పోతన భాగవతమో లేదంటే యద్దనపూడి సులోచనారాణి నవల- జీవన తరంగాలలో పెట్టుకుని నిద్రపోయేవారు. ఇప్పుడవన్నీ లేవుగా. సెల్‌ఫోన్ ఉంటుంది. పట్టుకొని నొక్కి చూశాను. రెండున్నర! దేవుడా... ఇంత రాత్రి వేళ ఈ భయంకరమైన పిల్లి ఏడుపు ఏమిటి? అసలే ఆ పూట టీవీలో ‘రాజుగారి పాత వరండా’ వేశారు. భయంతో చచ్చాను. ఇప్పుడీ ఏడుపుకు మళ్లీ చస్తున్నాను. వింజమూరి రవీంద్రనాథ్ సీరియల్ ‘లవంగదళం’ ప్రకారం అసంతృప్త ఆత్మలు పిల్లి రూపం దాలుస్తాయి. ఇప్పుడు కూడా... వ..వ..వణుకుతూ పక్కన చూశాను. మా మణిమకుటం నిండా రగ్గు కప్పుకుని ఈ లోకం ఎటైనా తగలడనీ అనే తాత్త్విక చింతనతో నిద్రపోతూ ఉంది. ఇప్పుడు నా గతి ఏమిటి? అద్దం వైపు చూశాను. ఎవరో అద్దం ముందు కూచుని తీరిగ్గా తల దువ్వుకుంటూ పిల్లిలా ఏడుస్తున్నారు. అద్దిరి పడి లేచి మంచం మీద నుంచి ఒక్క దూకు దూకి లైట్ వేశాను. మా ఆవిడ!మంచం మీద చూశాను. ఖాళీ రగ్గు.‘ఎ..ఎ.. ఏమిటి... ఏమిటిది?’ ఆశ్చర్యపోయింది. ‘ఏమైంది మీకు ఎందుకంత కంగారు పడుతున్నారు’...‘ఇంత రాత్రి పూట ఎందుకలా ఏడుస్తున్నావ్?’ ‘ఏడుస్తున్నానా? పాడుకుంటూ బాధ పడుతున్నాను’.‘పాడుకుంటున్నావా?’ ‘అవును. ‘మూగరాగం’ సీరియల్లో హీరోయిన్ని తలుచుకుని బాధ పడుతున్నాను. తను ఇవాళ చచ్చిపోయింది.’ ‘చచ్చిపోయిందా?’ ‘సీరియల్లో చచ్చిపోయింది. అందుకని తను సీరియల్లో డైలీ పాడే ‘ఆడజన్మ అతి సుందరలాల బహుగుణం... మమతం.. జయలలితం... చంద్రికా కుమారతుంగం’... అని పాడుకుంటూ ఉన్నాను’... ‘దానికి ఈ టైమే దొరికిందా’... ‘ఎనిమిదిన్నరకు చచ్చిపోయింది. ఈ విషాదం సింక్ కావడానికి టైమ్ పట్టింది. లేచి గుర్తు చేసుకుంటూ కూచున్నాను’ ‘మరి తల దువ్వుకోవడం ఏమిటి?’ ‘వస్తూ వస్తూ మెడికేర్ షాంపూ తెమ్మంటే తెచ్చారా? పేలతో చస్తున్నాను. ఎలాగూ టైమ్ దొరికింది కదా అని...’ ఆ రాత్రి నా నిద్ర సీరియల్ తన్నుకుపోయింది. ఒకటో తారీఖు వచ్చింది. సరుకుల పట్టి తెచ్చి ఇచ్చింది. చదివి ఉలిక్కి పడ్డాను.‘ఏమిటిది?’‘ఏమిటి ఏమిటిది?’ ‘ఇదేమిటి?’... వేలు పెట్టి చూపించాను.‘విషం’...‘అదే విషం ఏమిటి?’ ‘నా తల కొట్టేసినట్టుగా ఉంటోంది’ ‘అంటే’ ‘మీరు చూళ్లేదా? ప్రతి సీరియల్లోనూ కిచెన్ కప్‌బోర్డులో విషం అని రాసిన సీసా ఉంటుంది. ఇంత పెద్ద కిచెన్ చేయించారు. కాని ఒక్క విషం సీసా కూడా లేదు. ఇంకా కొనుక్కోలేదా అని ఇవాళ జరిగిన కిట్టీ పార్టీలో ఆ త్రీనాట్ టూ, ఫోర్ నాట్ సెవన్ చుప్పనాతులు నన్ను ఎగతాళి చేశారు. వాళ్లంతా ఎప్పుడో కొనేసుకున్నారట. అసలు విషం సీసా లేని కిచెనూ ఒక కిచనేనా అని తెగ నవ్వుతున్నారు’‘విషం అని రాసిన సీసా ఎవరు అమ్ముతారు?’‘ఏమో నాకేం తెలుసు’ ‘ఒక పని చెయ్. మొన్న వద్దు వద్దంటున్నా వినకుండా గులాబ్‌జాములు చేశావుగా. ఆ జీరా తీసి సీసాలో వేసి పెట్టుకో. సరిపోతుంది’ ‘దానిని మీ అమ్మ కోసం దాచాను’ ‘హర్ని... అమ్మ నా కోడలు పిల్ల కమలాక్షి’ ‘కోడలు పిల్ల కమలాక్షి కాదు... పంకజం. ఆ రోల్ తమిళ నటి పొన్నరుసు వేస్తోంది’ ‘ఇప్పుడేమంటావ్? ‘నా హోదాకు తగ్గట్టుగా కిచెన్‌లో విషం సీసా ఉండాల్సిందే’. మొన్న ఆఫీసు నుంచి వచ్చేసరికి అలిగి కూచుని ఉంది. మూడు గంటల ఏడు నిమిషాల సేపు బతిమిలాడినా మాట్లాడలేదు. తర్వాత అసలు కారణం చెప్పింది. మా బంధువుల అమ్మాయికి ఫోన్ చేసిందట. తనకు రెండు వారాల క్రితం పాప పుట్టింది. ఆ పాపకు ఎలాగైనా సరే ‘ద్విక్తా కపూర్’ అనే పేరు పెట్టాలని పట్టుపట్టిందట. ఆ అమ్మాయి అంత కంటే మొండి పట్టుదలతో నేనెందుకు పెడతాను... బిందు నాయుడో మంజులా నాయుడో అని పెడతాను అని అడ్డం తిరుక్కుందట. ‘మీరే చెప్పండి. నేను ఏక్తా కపూర్ అని పెట్టమంటే కాదనడంలో అర్థముంది. అంతకంటే ఒక ఆకు ఎక్కువ చదవాలని ద్విక్తా అని చెప్పాను. బిందు, మంజులా లోకల్ కదండీ. ముంబై లెవల్లోకి వెళ్లొద్దా. ‘కాదంటే కూర చేయాల్సింది కమలత్తే’ అని కే సెంటిమెంట్‌తో ఒక సీరియల్ కొడితే ఎలా గ్రాండ్‌గా ఉంటుందంటారు’... నేను బాత్రూమ్లో దాక్కున్నాను. మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. పిల్లలంటే ప్రాణం. ఇక మా అమ్మన్నా... చెల్లెలన్నా... చెప్పుకోవడం ఎందుకు... ఒక్క క్షణం కూడా వాళ్ల నోటి నుండి మాట పెగలనివ్వదు. అన్ని సద్గుణాలు ఉన్నా ఇదో దుర్గణం ఉంది. సీరియల్స్ చూడటం. ఎక్కువ చూస్తుందని చెప్పను కాని మధ్యాహ్నం ఒన్ టు సిక్స్ మళ్లీ సాయంత్రం సిక్స్ టు టెన్ చూస్తుంది. వద్దంటే నా సంగతి చూస్తుంది. మొన్నొక రోజు ఆఫీస్ నుంచి వస్తూనే అడిగింది. ‘ఏమండీ... మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఆమెకేదైనా ఫ్యాక్టరీ ఉందా?’‘లేదు. ఏం?’ ‘ఛ’ డిప్రెస్ అయి కూచుంది. ‘ఏమైందో చెప్పరాదా?’ ‘మీకు గర్ల్‌ఫ్రెండ్ ఉంటే ఆ గర్ల్‌ఫ్రెండ్‌కు ఫ్యాక్టరీ ఉంటే నాకు ఆ సంగతి తెలిసి నేను కూడా ఫ్యాక్టరీ పెట్టి ఆమె ఫ్యాక్టరీని దివాలా తీయించడానికి అందులో నా మనిషిగా మీ దూరపు బంధువు బాజీరావు మస్తానీని పెట్టి తను పాపర్ పట్టి పోయి బ్లాక్ శారీ కట్టుకుని జుట్టు విరబోసుకొని బంజారా హిల్స్ రోడ్డు నంబర్ 11లో రెండు కాళ్ల మీద నడుచుకుంటూ పోతుంటే నేను కారు దిగి హాహాహా అని పెద్దగా నవ్వి- చూశావా శర్మిష్టా... నా వాణ్ణి నీవాడుగా చేసుకోవాలనుకున్నావ్. కాని నావాడు నావాడే నీవాడు కాడు నీ వాడు కావాలనుకుంటే నావాడు కాక మునుపే చూసుకోవాల్సింది ఇప్పుడు నావాడు అయిపోయాక కాదు నా వాడు నా వాడు కావాల్సిందే అని పట్టుపడితే నాలోని సతి బయటకు వచ్చి శతమానం భవతికి భాష్యం చెప్పదా. నాతిచరామికి నవీన రూపం ఇవ్వదా. పాణి గ్రహణం అనే మాటకు పెద్ద ఎక్స్పోజర్ కల్పించి’...అయ్యా. అదీ సంగతి. - భా.బా (భార్యా బాధితుడు) గమనిక: నేను సన్మానాలకు దూరం. రాజమండ్రికి రండి... ఉండ్రాజవరం రండి అని ఫోన్లు చేస్తున్నారు. సారీ. ఇందులో నా గొప్పదనం లేదు. ఉంటే గింటే నా శ్రీమతిదే అని ఆమెకు తెలిసేలా భయభక్తులతో విన్నవించుకుంటున్నాను. -
గీత... ద ఘోస్ట్!
రాత్రి, అర్ధరాత్రి, దెయ్యాల వేట, భయం భయం... హారర్ సీరియల్ అనగానే ఇలాంటి పేర్లే కనిపిస్తుంటాయి మనకి. హిందీలో అయితే ఆహట్, భూత్ ఆయా, ఫియర్ ఫైల్స్ అంటూ దెయ్యాల్ని మన మీదికి వదులుతున్నారు కొన్ని చానెళ్లవారు. అయితే వీటిని చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకేనేమో... ఓ కొత్త టైటిల్‌తో, కొత్త కాన్సెప్ట్‌తో, సరికొత్త కథనంతో ఓ సీరియల్ తీశారు. అదే... ‘గీతాంజలి’. * ఇద్దరు అక్కాచెల్లెళ్లు. చెల్లెలు మహా నెమ్మదస్తురాలు. అక్క పరమ భయంకరురాలు. అన్నీ తాను అను కున్నట్టే జరగాలంటుంది. అన్నింట్లో కల్పించుకుని చెల్లెలికి సంతోషమన్నదే లేకుండా చేస్తుంది. చివరికి ఊహించని పరిస్థితుల్లో చనిపోతుంది. మామూలుగానే కుదురుండనిది, దెయ్యమయ్యాక ఊరుకుంటుందా? నానా రభసా చేస్తోంది. ఆ రభస చూస్తే గుండెల్లో గుబులు పుడుతోంది. అందుకే గీతాంజలి సక్సెస్ఫుల్ సీరియళ్ల లిస్టులో చేరిపోయింది. * అయితే ఈ సీరియల్ సక్సెస్‌లో ముఖ్యభాగం హీరోయిన్ రూపకే చెందుతుంది. ‘చిన్న కోడలు’ సీరియల్‌తో సుపరిచితమైన ఈ అమ్మాయి... అంజలిలా అమాయకంగా ఆకట్టుకుంటూనే, దెయ్యంగా హడలెత్తిస్తోంది. ఆమె పర్ఫార్మెన్సే ఈ సీరియల్‌కి ప్రాణం పోసిందని ఒప్పుకుని తీరాలి! -
చెప్పిందే చెబుతారేంటో!
టీవీ టైమ్ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి. జీవితం గురించి ఎన్నో కలలు కంటుంది. భర్త, కాపురం, పిల్లల గురించి ఏవేవో ఊహించుకుంటుంది. అయితే దైవం మరొకటి తలుస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె ఓ బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తిని పెళ్లాడాల్సి వస్తుంది. అదే కష్టమనుకుంటే... అత్తారిల్లు అల్లకల్లోలంగా ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఉంటారు. ఒక్కో రకంగా ఆమెను హింసిస్తూ ఉంటారు. ఇక చాలు చెప్పింది, ఈ కథ మాకు తెలుసులే అనబోతున్నారు కదూ! అవును మరి. ఇదే స్టోరీని చాలా సీరియళ్లలో చూశాం. అయినా కూడా మళ్లీ ఓ కొత్త సీరియల్‌గా ప్రసారమవుతోంది. అదే జెమినీ చానెల్లో వచ్చే ‘నా మొగుడు’ సీరియల్. చాలాసార్లు చూసిన, తెలిసిన పాత కథకి కొత్త హంగులు అద్ది, కొన్ని కొత్త రంగులు పులిమి తీసినట్టుగా ఉందా సీరియల్. కనీసం ముందు ముందు అయినా ఏవైనా కొత్త మలుపులు వస్తాయో లేక ఆ మలుపులు కూడా మరో పాత కథను గుర్తుకు తెస్తాయో చూడాలి! -
వెరైటీ మిస్సవుతోంది వరూధినీ!
ఆనాడు ‘మనుచరిత్ర’లో ప్రవరాఖ్యుడి ప్రేమ కోసం పరి పరి విధాల ప్రయత్నించింది వరూధిని. భర్త ఆదరణను, నమ్మకాన్ని చూరగొనడం కోసం పడరాని పాట్లు పడుతోంది నేటి వరూధిని. అదేనండీ... బుల్లితెర వరూధిని. జీ తెలుగులో ప్రసారమవుతోన్న ‘వరూధినీ పరిణయం’లో హీరోయిన్. అమ్మాయిలంటే ఏమాత్రం ఇష్టపడని హీరోకి భార్య అవుతుంది హీరోయిన్. మొదట్లో పిల్లీ ఎలుకల్లా పోట్లాడుకున్నా, మెల్లగా ఇద్దరి మనసులూ కలుస్తాయి ఒకరిపై ఒకరికి ప్రేమాభిమానాలూ పెరుగుతాయి. హమ్మయ్య, అంతా బాగుంది అనుకునేలోపే రకరకాల సమస్యలు. చెప్పలేనని కష్టాలు. మళ్లీ ఇరువురి మధ్యా దూరం. దానికి తోడు ఆమె క్యారెక్టర్‌నే వేలెత్తి చూపించే అపనిందలు. అబ్బబ్బబ్బ... ఒక్కటి కాదు, వంద కష్టాలు వరూధినికి. కాకపోతే సమస్య ఏమిటంటే... ఈ కష్టాలన్నీ ఆల్రెడీ చాలా సీరియళ్లలో, సినిమాల్లో హీరోయిన్లు పడినవే కావడం. మొదట్లో సరికొత్త పాయింట్‌తో చక్కగా మొదలైన ఈ సీరియల్... ఉండేకొద్దీ పాత మూసలోకి మారిపోయింది. ఓ మామూలు సీరియల్ తరహాలోనే సాగిపోతోంది. ఆ విషయాన్ని గమనించి దర్శకుడు కాస్త ఆసక్తి కరమైన మలుపులు సృష్టిస్తే మంచిదేమో! -
రాములమ్మ ఫ్రమ్ సిరిసిల్ల
బుల్లితార రాములమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన దామెర శిరీషకు టీవీలో నటించే అవకాశం అప్రయత్నంగానే వచ్చింది. అక్క రజిత టీవీనటి. మరో అక్క సౌజన్య కూడా బుల్లితెర నటి. అయితే ‘ఎంబీఏ చేసి ఉద్యోగంలో స్థిరపడాలనుకున్నాను తప్ప నటిని కావాలనుకోలేదు. యాదృచ్ఛికంగా జరిగిపోయింది’ అంటారు శిరీష. ‘మాది కరీంనగర్ జిల్లా సిరిసిల్ల. నైన్త్ క్లాస్ వరకు అక్కడే చదువుకున్నాను. టెన్త్ నుంచి హైదరాబాద్‌లోనే. బీకామ్ సెకండియర్‌లో ఉండగా ‘అడగక ఇచ్చిన మనసు’ ఆడిషన్స్కెళ్లాను. అక్కయ్యలిద్దరూ ఈ రంగంలో ఉండడంతో ఆ స్క్రీన్ టెస్టు అదీ ఎలాగుంటుందో చూడాలనే సరదాతోనే వెళ్లాను. అయితే సెలెక్ట్ అయిన తర్వాత సీరియస్‌గా కెరీర్ మీదనే దృష్టి పెట్టాను. రజితక్క... నటనలో మెలకువలు చెప్పింది’ అందామె. అమ్మానాన్నా అనుకోలేదు ‘అమ్మ దేవి గృహిణి. నాన్న పాపయ్య రిటైర్డ్ టీచర్. మమ్మల్ని నటులను చేయాలని మా పేరెంట్స్ ఎప్పుడూ అనుకోలేదు. కాని అక్కకు మాత్రం నటి కావాలనే కోరిక గట్టిగాఉండటంతో మేమంతా ఆ ఫీల్డ్‌లోకి వచ్చాం. అన్నయ్య మా సొంతూర్లోనే స్థిరపడ్డారు. ఇంట్లో చిన్నదాన్ని కావడంతో అమ్మకు ఇప్పటికీ నా మీద బెంగే. ఏదైనా షూటింగ్ లేటయ్యి టైమ్‌కి రాలేకపోతే ఫోన్ చేస్తూనే ఉంటుంది’. స్కూల్ నుంచి స్టుడియో వరకు ‘నాకు స్టేజ్ ఫియర్ అస్సలు లేదు. చిన్నప్పుడు స్కూల్లో ప్రతి ప్రోగ్రామ్‌లో డాన్స్ చేసేదాన్ని. టీచర్లు నా పేరు రాసేసుకుని తర్వాత చెప్పేవాళ్లు. అయితే అక్కడ డాన్సు చేయడానికి, ఇప్పుడు కెమెరా ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. వేదిక మీద పెర్ఫామ్ చేసేటప్పుడు డాన్సుని ఎంజాయ్ చేస్తాం. కెమెరా ముందు సీన్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి’. సౌందర్య ప్రభావం ఎక్కువ! ‘నాకు ప్రభాస్, సౌందర్యల నటన బాగా ఇష్టం. సౌందర్య నటనను అధ్యయనం చేసినట్లు చూస్తాను. ఆ ప్రభావం నా మీద తప్పకుండా ఉంటుందనిపిస్తోంది. ఈ మూడేళ్లలో ఆరు సీరియల్స్‌లో నటించాను. ఇప్పుడు ‘రాములమ్మ’ సీరియల్ చేస్తున్నాను. లీడ్ రోల్స్ చేశాను. అవకాశం వస్తే పోలీస్, సీఐడీ పాత్రల్లో నటించాలని ఉంది’. టీవీ రంగం ఫ్యామిలీలాంటిది! ‘మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో’ సినిమాలో నటించాను. నాకెందుకో టీవీ రంగమే బాగుందనిపించింది. సినిమా ఇండస్ట్రీలాగ గ్లామరస్ పోకడలు ఉండవు. స్కిన్ షో చేయాల్సిన అవసరం ఉండదు. టీవీ రంగంలోకి వచ్చే వారికి ఒక్కమాట మాత్రం కచ్చితంగా చెప్పగలను... మనం కచ్చితంగా ఉంటే మనల్ని పక్కకు తోసేసేవాళ్లుండరు. నటించాలనే కోరిక ఉన్న చాలామంది పరిశ్రమ ఎలా ఉంటుందోననే భయంతో వెనుకడుగు వేస్తుంటారు. కానీ మన పాత్ర వరకు చూసుకుని ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకపోతే ఏ సమస్యా ఉండదు. అందుకు నేనే ఉదాహరణ’. జీవిత భాగస్వామి! ‘నన్ను పెళ్లి చేసుకునే అబ్బాయి నా కుటుంబానికి గౌరవం ఇచ్చి నన్ను బాగా చూసుకునే వాడై ఉండాలని కోరిక. ఇండస్ట్రీలో వ్యక్తిని చేసుకోవాలనుకోవడం లేదు. ఉద్యోగం, వ్యాపారం చేసుకునే అబ్బాయి అయితే బావుణ్ణనుకుంటున్నాను. ఏదైనా మరో రెండేళ్ల తర్వాతే’. -
బుల్లితెర నటుడు బాజీ అరెస్టు
హైదరాబాద్ : కుటుంబ కలహాల నేపథ్యంలో బుల్లితెర నటుడు బాజీని విజయవాడ గన్నవరం పోలీసులు బుధవారం జూబ్లీహిల్స్‌లో అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్-1లోని చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సమీపంలో బుధవారం బాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న స్వాతిచినుకులు సీరియల్ షూటింగ్ జరుగుతుండగా జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్టుచేశారు. బాజీ భార్య సోమ ఇటీవల భర్తపై గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై సెక్షన్ 380, 406 కింద అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు గతంలో ఆడదే ఆధారం సీరియల్లోనూ ప్రధానపాత్ర పోషించడంతోపాటు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించినట్లు పోలీసులు తెలిపారు. -
'అత్తో అత్తమ్మ కూతురో' నిర్మాతపై దావా
హైదరాబాద్ : 'అత్తో అత్తమ్మ కూతురో' సీరియల్ నిర్మాతలపై సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కోర్టుకు వెళ్లనున్నారు. ఆ సీరియల్ నిర్మాతలపై రూ.50 లక్షల పరిహారం కోరుతూ దావా వేస్తున్నట్లు ఆయన శుక్రవారమిక్కడ తెలిపారు. జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న 'అత్తో అత్తమ్మ కూతురు' సీరియల్లో ఇంకా రిలీజ్ కాని 'తులసీదళం' సినిమా ట్రాక్‌లను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆయన చెప్పారు. కాగా జూన్ నుంచి ప్రసారమవుతున్న ఈ సీరియల్ లో అలనాటి నటి నిరోష, జాకి, మహర్షి తదితరులు నటిస్తున్నారు. సీరియల్ ప్రారంభమై గట్టిగా 2 నెలలు గడవక ముందే వివాదంలో చిక్కుకుంది. -
‘మా' టీవీలో ‘సీతాకోకచిలుక'
మనోహర్ ఓ సాధారణ మధ్యతరగతి జీవి.అతని వైవాహిక బంధంలో ఏదో వెలితి. ఆ సమయంలోనే ప్రేరణ అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత ఏమైందో తెలియాలంటే ‘సీతాకోకచిలుక' సీరియల్ చూడాలని మా చానల్ ప్రతినిధులు తెలిపారు. శ్రీ భాను, సాయి మిత్రా, చంద్రలక్ష్మణ్ నటించిన ఈ సీరియల్ ‘మా' టీవీలో మార్చి రెండో తేదీ నుంచి (సోమ నుంచి శుక్రవారం దాకా రాత్రి 10కి) ప్రసారం కానుంది. -
తమాషా పదాలు... తీరైన సంభాషణలు
తమాషా పేర్లు, కోర్ట్ సీన్స్‌తో మొదలైన ఇది మల్లాది సీరియల్ అనే నమ్మకం మొదట్లో కుదరలేదు. మెక్‌డోనాల్డ్స్‌లో కోక్ ఎన్నిసార్ల్లైనా నింపుకోవడం లాంటివి మనలో చాలామంది గమనించి ఉండరు. సినిమాటిక్‌గా ఒక్కో హీరో ఒక్కో కథతో ఎంట్రీ, వీరందర్నీ పాత స్నేహితులుగా అతికించినట్లు కనిపించింది. కాలేజ్ ఫంక్షన్‌లోని జోక్స్ ఫేస్‌బుక్‌తో పరిచయం లేని పాఠకులకి ఉపయోగం. గోలచందర్ కథ, దుర్యోధన్‌ని త్రీమంకీస్ బెదిరించడం, వాటర్ క్యూబ్స్‌ని వాటర్ విత్ కార్నర్స్గా చెప్పడం లాంటి తమాషా పదాలు సీజనాత్మకం. పట్టయ్య అంత్యాక్షరి ద్వారా చెప్పిన పాత సినిమా పాటలు నాకు హాయిగా అనిపించాయి. పోలీసులకి, దొంగలకి మధ్య వానర్ మధ్యవర్తిత్వం హాస్యంగా సాగింది. వాళ్ళు అన్ని కోట్లు సులువుగా కొట్టేసినా ‘ఈజీ మనీ నాట్ క్రేజీ’ అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే ముందుగానే ‘డబ్బు తాబేలులా వస్తుంది. కుందేలులా పోతుంది’ అని చెప్పారు కదా! బియాండ్ లిమిట్స్‌కి వెళ్ళకుండా, పరుగులు పెట్టకుండా కథని నడపడం మల్లాది ప్రత్యేకత. ఒకే ఒక్క ఫోన్‌కాల్‌తో సీరియల్‌ని ముగింపుకి తెచ్చేశారు. దీన్లోని పాత్రలన్నీ ఒక ఎత్తు. వేమన పాత్ర ఒక ఎత్తు. ఇలాంటి సీరియల్లో అలాంటి పాత్ర ద్వారా వేదాంత సారాన్ని చేర్చడం అభినందనీయం. ‘నీకో సమస్య ఉందని దేవుడికి చెప్పకు. సమస్యకి నీకో దేవుడున్నాడని చెప్పు’ లాంటి ఎక్స్లెంట్ డైలాగ్స్ చాలా రాశారు. - వి శశికళ, నాయుడుపేట (నెల్లూరు జిల్లా) త్రీమంకీస్ సీరియల్‌పై పాఠకుల అభిప్రాయాలు మా ప్రకటనకు స్పందనగా త్రీ మంకీస్ సీరియల్ మీద చాలామంది పాఠకులు తమ విలువైన అభిప్రాయాలను పంపించారు. వాటిలో ఉత్తమమైనవిగా రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి ఎంపిక చేసిన మూడిటిని రోజుకొకటి చొప్పున ప్రచురిస్తున్నాం. నిన్న మొదటి అభిప్రాయం ప్రచురించాం. ఇవాళ్టిది రెండోది. ఇలా ఎంపిక చేసిన ముగ్గురికి ముందుగా ప్రకటించినట్లు ఒక్కొక్కరికి రూ. 500/- నగదు బహుమతి రచయిత పంపుతారు. వీటిని పుస్తక రూపంలో వచ్చే నవలలో కూడా ప్రచురిస్తారు. -
ఆమే ప్లస్... ఆమే మైనస్!
స్టార్‌ప్లస్ చానెల్లో ప్రసారమవుతోన్న ‘దీయా ఔర్ బాతీ హమ్’ సీరియల్ (తెలుగులో ‘ఈతరం ఇల్లాలు’గా వస్తోంది) 2011లో ప్రారంభమయ్యింది. అనతి కాలంలోనే సూపర్ హిట్ అయ్యింది. బలమైన కథ, ఆసక్తికరమైన కథనాలు సీరియల్‌ని రక్తి కట్టిస్తే... హీరోయిన్ దీపికాసింగ్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. సీరియల్లో ఆమె పాత్ర పేరు సంధ్య. ఆమెకి పోలీసాఫీసర్ కావాలని కోరిక. అయితే అనుకోని పరిస్థితుల్లో స్వీట్స్ వ్యాపారం చేసే సూరజ్‌తో పెళ్లవుతుంది. ఓ పేదపిల్లను కోడలిగా అంగీకరించలేని సూరజ్ తల్లి, సంధ్యని నరకయాతన పెడుతుంది. అన్నిటినీ ఓపికగా భరించి అత్తగారి మనసును గెలుచుకుంటుంది సంధ్య. పోలీసాఫీసర్ అవ్వమంటూ అత్తగారు ప్రోత్సహించడంతో కష్టపడి చదివి ఐపీఎస్ పాసవుతుంది. ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరిస్తుంది. అయితే తర్వాత ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అన్నదే కథ. మూడేళ్లపాటు అత్తగారి ఆరళ్లతోనే సాగిపోయింది సంధ్య జీవితం. ఆ తర్వాత పోలీస్ అయ్యింది. అయ్యిందన్నమాటే కానీ... సంధ్యలో ఆ హుందాతనం లేదు. పోలీసులో ఉండాల్సిన కరకుదనం కాస్తయినా కనిపించడం లేదు. ఏవైనా సవాళ్లు ఎదురైనప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు ఓ కోడలిగా ఉన్నప్పుడు ఇచ్చిన బేల ఎక్స్‌ప్రెషన్సే ఇస్తూ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఆవేశాన్ని ప్రదర్శిస్తుంది కానీ... అక్కడా ఆమెలో సాఫ్ట్‌నెస్ మాత్రమే కనిపి స్తోంది. దాంతో ఒకప్పుడు సీరియల్‌కి ప్లస్ అయిన ఆమే ఇప్పుడు సీరియల్‌కి మైనస్ అయ్యిందా అనిపిస్తోంది. కాబట్టి ఆమెతో ఏవేవో సాహసాలు చేయించేద్దామని చూడకుండా... దర్శకుడు వీలైనంత త్వరగా కథకు ఫుల్స్టాప్ పెడితే మంచిది! -
ఆమెతో కలిసి నటించడం అదృష్టం
అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో ఓ వెలుగు వెలిగిన నటి సోనాలీ బింద్రే త్వరలో బుల్లితెరపై ఓ సీరియల్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వెండితెర నుంచి నిష్ర్కమించిన తరువాత అప్పుడప్పుడూ టీవీ రియాలిటీ షోలలో జడ్జీగా కనిపించినప్పటికీ డెయిలీ సీరియల్లో నటించడం ఇదే మొదటిసారి. ఏక్తా కపూర్ రూపొందిస్తున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్లో సోనాలీ అపూర్వ అగ్నిహోత్రితో కలిసి జంటగా నటిస్తున్నారు. సోనాలీకి తాను పెద్ద అభిమానినని అపూర్వ అంటున్నాడు. ఆమె అద్భుతమైన నటి అని, నటనలో ఎంతో అనుభవమున్నప్పటికీ సెట్స్‌లో ఆమె చిన్న పిల్లలాగానే వ్యవహరిస్తుందని అన్నాడు. ఆమెతో కలిసి నటించడం తన అదృష్టమని చెప్పాడు. లైఫ్ ఓకే చానెల్లో త్వరలో ప్రసారం కానున్న ‘అజీబ్ దాస్తాన్ హై యే’ సీరియల్ ఇద్దరు అపరిచితుల మధ్య కథ అని అపూర్వ చెప్పాడు. అదృష్టం కొద్దీ కలిసిన వీరిద్దరు ఆ తరువాత ఒక్కటవుతారని అన్నాడు. ఇదివరకు జస్సీ జైసీ కోయీ నహీ సీరియల్ నటించిన అపూర్వ అగ్నిహోత్రి ఈ సీరియల్లో తన పాత్ర ఎంతో సవాలుతో కూడుకున్నదని అన్నాడు. ఏక్తాకపూర్కు చెందిన బాలాజీ సంస్థలో పని చేయడం ఇదే మొదటిసారి అన్నాడు. తొలుత వెండితెరపై కనిపించిన అపూర్వ అక్కడ తనకు అదృష్టం కలిసి రాకపోవడంతో బుల్లితెరపైకి వచ్చాడు. సినిమాల్లోకి మళ్లీ వస్తారా అన్న ప్రశ్నకు నటునిగానైతే రానని, దర్శకునిగా ప్రయత్నిస్తానని చెప్పాడు. ఒకరకంగా బిగ్‌బాస్ షో అపూర్వ జీవితాన్ని మార్చివేసిందని చెప్పవచ్చు. ఆ షోలో అపూర్వ తన భార్యతో కలిసి పాల్గొన్నాడు. బిగ్‌బాస్ షోలో పాల్గొనే అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుందని అపూర్వ చెప్పాడు. ఆ అవకాశం తొమ్మిదేళ్ల పాటు నిర్మితమైన ప్రతిష్టను 90 రోజుల్లో దిగజార్చవచ్చని అన్నాడు. తాను, తన భార్య మంచి పేరుతో ఆ షో నుంచి బయటపడటం తమ అదృష్టమని అపూర్వ పేర్కొన్నాడు. -
ఇప్పుడంతా వారసత్వ నటనే..
సినీ నటుడు కోట శంకర్రావు నటనలో అన్నయ్యకు సాటి.. నాటకంలో మేటి.. ఏ క్యారెక్టర్‌కైనా సరిపోయే రూపం.. క్లిష్టమైన డైలాగులను సునాయూసంగా చెప్పగలిగే వ్యాఖ్యానం నటుడు కోట శంకర్రావుకు పెట్టని ఆభరణాలు. సోదరుడు కోట శ్రీనివాసరావుకు ఏమాత్రం తీసిపోని ఆయన నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. విలక్షణమైన అభినయంతో అటు వెండితెర వీక్షకులను, ఇటు బుల్లితెర ప్రేక్షకులను, నాటకరంగ అభిమానులను మెప్పిస్తున్న ఘనాపాఠి ఆయన. ఈ నేల-ఈ గాలి సీరియల్ షూటింగ్లో పాల్గొనేందుకు గుడ్లవల్లేరు మండలం కౌతవరం వచ్చిన ఆయన సోమవారం ‘సాక్షి’తో ముచ్చటించారు. తన స్వస్థలం జిల్లాలోని కంకిపాడు అని చెప్పారు. - కౌతవరం (గుడ్లవల్లేరు) సాక్షి : నటనకు ముందు మీరేం చేసేవారు? శంకర్రావు : స్టేట్‌బ్యాంక్ మేనేజర్‌గా 30ఏళ్లు పనిచేశా. సాక్షి : నాటకాల్లో ప్రవేశం ఉందా? శంకర్రావు : 1965 నుంచి నాటకరంగంలో ఉన్నాను. ఆ అనుభవం వల్లే సినిమాల్లో అవకాశం వచ్చింది. సాక్షి : సినీరంగ ప్రవేశం ఎప్పుడు జరిగింది? శంకర్రావు : 1986లో ‘నాకూ పెళ్లాం కావాలి’ నా మొదటి సినిమా. సాక్షి : ఇప్పటివరకు ఎన్ని సినిమాల్లో నటించారు? శంకర్రావు : 80 సినిమాలు చేశాను. సాక్షి : మీకు పేరు తెచ్చిన సినిమాలు? శంకర్రావు : అంకురం, సూత్రధారులు, హలోబ్రదర్, చీమలదండు మంచి పేరు తెచ్చాయి. సాక్షి :: సీరియల్స్‌లోకి ఎప్పుడు అడుగుపెట్టారు? శంకర్రావు : సినిమాల కంటే ముందే సీరియల్స్‌లోకి వచ్చాను. 1983లోనే సీరియల్స్‌లో నటించా. ఇప్పటివరకు 53 సీరియల్స్‌లో నటించే అవకాశం వచ్చింది. సాక్షి : ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? శంకర్రావు : సినిమాలేమీ చేయట్లేదు. ఐదు సీరియల్స్ చేస్తున్నాను. సాక్షి : ఏ సీరియల్స్‌లో మీకు పేరొచ్చింది? శంకర్రావు : కలిసుందాం రా, జయం, శ్రీమతి, గాయత్రి, యోగి వేమన, విశిష్ట విశ్వామిత్ర సీరియల్స్‌లో మంచి పేరొచ్చింది. సాక్షి : నటనా రంగానికి కొత్తగా వచ్చే వారికి మీరిచ్చేసలహా? శంకర్రావు : సినిమాలు, సీరియల్స్‌లో నటించేందుకు కొండంత టాలెంట్ ఉంటే చాలదు. ఆవగింజంత అదృష్టం ఉండాలి. అదే ముఖ్యం. నటనలో ఏకే47లా పనిచేయాలి. అవకాశం ఎప్పుడు తలుపు తడుతుందో తెలియదు. కానీ, ఆ అవకాశం వస్తుంది. నిత్య సాధన చేస్తూ నటన అనే విద్యకు పదును పెట్టుకుంటూ ఉండాలి. సినీ సత్సంబంధాల్ని మెరుగు పరుచుకుంటూ వాటిని కొనసాగిస్తే, తప్పక లక్ష్యం సాధించవచ్చు. సాక్షి : సినీ పరిశ్రమలో ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి? శంకర్రావు : అవకాశాలు ఇచ్చే విషయంలో కొందరు వారసత్వానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. -
‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరొచ్చింది
పాలకొల్లు : ‘అమ్మమ్మ డాట్ కామ్’ సీరియల్‌తో తనకు మంచి పేరొచ్చిందని.. బుల్లితెర రంగంలో స్థిరపడగలిగానని నటుడు మంత్రిప్రగడ నాగరవిశంకర్ అన్నారు. మంచిని స్వాగతిస్తూ ప్రేక్షకాదరణ లభించే పాత్రలు చేయడమే లక్ష్యమని చెప్పారు. దాసరి నారాయణరావు సారథ్యంలో కాపుగంటి రాజేంద్ర దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గోకులంలో సీత’ సీరియల్లో హీరోగా నటిస్తున్న ఆయన పాలకొల్లులో విలేకరులతో ముచ్చటించారు. ప్రశ్న : పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు రవిశంకర్: 2002 నంది అవార్డుల ప్రదానోత్సవ సభలో అల్లూరి సీతారామరాజు వేషం వేశా. దాంతో సీరియల్లో నటించే అవకాశాలు వచ్చాయి. ప్రశ్న : బుల్లితెర నటుడు కావాలని ఎందుకు అనుకున్నారు రవిశంకర్: నాకు ఎవరూ గాడ్ఫాదర్లు లేరు. మాది శ్రీకాకుళం. బీకాం చదువుకున్నా. యాక్టింగ్ నేర్చుకోవాలని 2002లో రూ.10 వేలు పట్టుకుని హైదరాబాద్ వెళ్లా. మీడియా వర్కుషాపు ఆన్ యాక్టింగ్‌లో చేరా. శిక్షణ అనంతరం నెలరోజులే లక్ష్యంగా పెట్టుకున్నా. 30వ రోజు రాత్రి 11 గంటలకు కెమెరా ముందు నిలుచునే అవకాశం వచ్చింది. లేకపోతే వెనక్కి వెళ్లిపోయేవాడిని. ప్రశ్న : డిగ్రీ పూర్తికాగానే ఏమి చేశారు రవిశంకర్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేశా. సునామీ డేటా వింగ్‌లో విధులు నిర్వర్తించా. ప్రశ్న : నటించిన తొలి సీరియల్.. గుర్తింపు తెచ్చింది ఏది రవిశంకర్: అలౌఖిక సీరియల్‌తో బుల్లితెరకు పరిచయమయ్యా. ‘నువ్వువస్తావని’లో నెగిటివ్ రోల్ చేశా. ‘అమ్మమ్మ డాట్ కామ్’తో పేరువచ్చింది. ప్రశ్న : ఇప్పటివరకు ఏయే సీరియల్స్‌లో నటించారు రవిశంకర్: నిజం-నిజం, అపరాధి, నమ్మలేని నిజాలు, అలౌఖిక, నువ్వువస్తావని, అమ్మమ్మ డాట్ కామ్, ఏడడుగులు, శ్రావణమేఘాలు, లయ, యువ, సావిరహే, ఇట్లు ప్రేమతో అమ్మ.., అభిషేకం, కుంకుమరేఖ, నెం.23 మహాలక్ష్మి నివాసం, చిన్నకోడలు, బంగారు కోడలు, అష్టాచమ్మాలో నటించాను. ప్రశ్న: సినిమా అవకాశాలు రవిశంకర్: కథ (జెనీలియా ఫేం), స్నేహితుడా (నాని హీరో) సినిమాల్లో నటించాను. సీరియల్స్‌లో బిజీ అవ్వడం వల్ల సినిమా అవకాశాల కోసం ఎదురుచూడలేదు. ఆర్టిస్టుగా స్థిరపడడానికి కారణమైన సీరియల్ అమ్మమ్మ డాట్ కామ్, లయ, అభిషేకం. ప్రశ్న : ఏయే అవార్డులు తీసుకున్నారు రవిశంకర్ :‘అభిషేకం’లో నటనకు వంశీ, ఉగాది, ఆరాధన అవార్డులు, ‘చిన్నకోడలు’లో నటనకు మా టీవీ, జెమినీ టీవీ, ఈటీవీ అవార్డులు అందుకున్నా. -
టైటిల్‌ని లైట్‌గా తీసుకుంటున్నారేం?!
టీవీక్షణం సినిమాకైనా, సీరియల్‌కైనా టైటిల్ ప్రాణమనే చెప్పాలి. ప్రేక్షకుడిని మొదట కట్టిపడేసేది, ఆకర్షించేది, తన దగ్గరకు రప్పించుకునేది, చూసేందుకు ప్రోత్సహించేది అదే. అందుకే దానికంత ప్రాధాన్యత! అయితే ఈ మధ్య సీరియళ్లకి సినిమా పేర్లు తెచ్చి పెట్టేస్తున్నారు. మంచుపల్లకి, చక్రవాకం, చిన్నకోడలు, రాధాకళ్యాణం, పెళ్లినాటి ప్రమాణాలు, బృందావనం, అమ్మ, అన్నాచెల్లెళ్లు, అష్టాచెమ్మా, కలసివుంటే కలదు సుఖం, నువ్వేకావాలి, మూగ మనసులు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, బొమ్మరిల్లు, గోరింటాకు, సుందరకాండ... ఒక్కటి కాదు, దాదాపు అన్నీ సినిమా పేర్లే. విచిత్రం ఏమిటంటే... కొన్నింటికి అసలు ఆ పేరు ఎందుకు పెట్టారో అర్థమై చావదు. దేవత టైటిల్ చూసి హీరోయిన్‌ది దేవతలాంటి వ్యక్తిత్వమేమో అనుకుంటారంతా. కానీ ఆ హీరోయిన్లో కోపం, ఆవేశం, అపార్థం చేసుకోవడం లాంటి బోలెడు మైనస్‌లుంటాయి. ‘బానీ’ అనే డబ్బింగ్ సీరియల్‌కి ‘పవిత్రప్రేమ’ అని పేరు పెట్టారు. అదసలు ప్రేమకథే కాదు. ఓ అబ్బాయి హీరోయిన్ని ప్రేమిస్తాడు. అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ అనుకుని ఆమె చెల్లెలిని పెళ్లాడతాడు. మోసం చేసి తనని అంటగట్టారంటూ ఆమెని ద్వేషిస్తాడు. హీరోయిన్ని భర్త మోసగించి వదిలేస్తాడు. ఆమె అతడికి బుద్ధి చెబుతుంది. ఎప్పటికో మారతాడు. ప్రేమ అనేది ఉన్నా... ఎవరూ ఎవరి కోసమూ త్యాగాలు చేసేంత పవిత్ర ప్రేమ లేదందులో. అలాగే మమతల కోవెల. అనుకోని పరిస్థితుల్లో తన స్నేహితుడి చెల్లెల్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు హీరో. అది అతడి తల్లికి నచ్చదు. కోడల్ని ద్వేషిస్తుంది. ఆమె అన్నయ్యేమో తన కూతురు ఉండాల్సిన స్థానాన్ని కాజేసిందన్న కోపంతో హీరోయిన్ని ముప్పుతిప్పలు పెడతాడు. ఆ తర్వాత కుట్రలు, కుతంత్రాలు, కన్నీళ్లతో బాగా సా...గు... తుం...ది. మమతలు, మమకారాలతో ఇల్లు నిండిపోయిన సన్నివేశమే కనిపించదు. మరి మమతల కోవెల అని ఎందుకన్నారో తెలియదు. అయితే అన్నీ అలానే ఉన్నాయని కాదు. కొన్ని కథకు తగ్గట్టుగానే ఉంటాయి. కానీ చాలావరకూ మాత్రం పేరు బాగుందని పెట్టేశారేమో అనిపిస్తోంది. దానికి తోడు సినిమా పేర్లు తెచ్చి పెట్టడం వల్ల కొత్తదనాన్ని ఫీలయ్యే పరిస్థితి లేదు. ఒకప్పుడు మనిషి, ఎండమావులు, ప్రియసఖి, అన్వేషిత, కళంకిత, విధి, రుతురాగాలు, కలలతీరం, ఆగమనం అంటూ క్యాచీగా, కాస్త ఆసక్తికరంగా అనిపించే పేర్లు ఆలోచించి పెట్టేవారు. ఇప్పుడు కనీసం అలాంటివైనా పెట్టడం లేదు. వెండితెర మీదా అవే, బుల్లితెర మీదా అవే! మొదటి ఇంప్రెషన్ టైటిల్ వల్లే పడుతుందని తెలిసి కూడా ఎందుకు వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారో... కాస్త కొత్తగా ఎందుకు ఆలోచించడం లేదో... వైవిధ్యభరితమైన పేర్లు ఎందుకు పెట్టడం లేదో ఏమో మరి!! -
కథ పాతది... కిక్కు మాత్రం కొత్తది!
సోనీ చానెల్లో ప్రసారమయ్యే ‘మై న భూలూంగీ’ సీరియల్ కథ వింటే ‘గౌతమి’ అనే తెలుగు సినిమా గుర్తొస్తుంది. సుహాసిని ప్రధాన పాత్రలో నటించిన ఆ సిన్మాలో భర్త ఆమెను చంపాలనుకుంటాడు. ఆమె తప్పించుకుంటుంది. కానీ ముఖం కాలిపోతుంది. తర్వాత స్నేహితుడి సాయంతో అందంగా తయారై, వేషభాషలు మార్చుకుని వచ్చి పగ తీర్చుకుంటుంది. అచ్చు ఈ కథతో తీసిందే ‘మై న భూలూంగీ’. అయితే కథ పాతదే అయినా కథనంలో మాత్రం కొత్త కిక్కు ఉంది. రోజుకో కొత్త ట్విస్ట్‌తో ఉత్కంఠను రేకెత్తించే విధంగా సాగుతోంది. శిఖా తెలివైన అమ్మాయి. వ్యాపారవేత్త సమీర్‌తో ప్రేమలో పడుతుంది. వారి వివాహం జరుగుతుంది. బాబు పుడతాడు. అయితే సమీర్ నిజ స్వరూపం... అతడు తనను చంపాలని ప్రయత్నించిన తర్వాత గానీ తెలియదు శిఖాకి. అతడి అసలు పేరు ఆదిత్య జగన్నాథ్ అని, తనను ఓ పథకం ప్రకారం పెళ్లాడాడని తెలుసుకుంటుంది. హత్యా ప్రయత్నంతో వికారంగా తయారైన తన ముఖాన్ని అందంగా మార్చుకుని, ఓ కొత్త రూపంలో అతడి ముందుకొస్తుంది. సమైరాగా పేరు మార్చుకుని, మోడల్‌గా పరిచయం చేసుకుంటుంది. అతడి కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి అతడికి దగ్గరవుతుంది. అతడితో ఆడుకుంటోంది. ఈ సీరియల్‌కి ప్రధాన ఆకర్షణ... ఐశ్వర్యా సకూజా. అమాయకురాలైన ‘శిఖా’గా, మైండ్‌గేమ్ ఆడే ‘సమైరా’గా ఆమె నటనకు హ్యాట్సాఫ్ చెప్పి తీరాలి. గతంలో ‘సాస్ బినా ససురాల్’తో మంచి మార్కులు కొట్టేసిన ఆమె... ఇప్పుడీ సీరియల్‌తో టెలివిజన్ ప్రేక్షకుల మనసుల్లో శాశ్వతస్థానం సంపాదించింది. ఆదిత్యగా వికాస్, సమైరా స్నేహితుడు నీరజ్‌గా అవినేష్ రేఖీల నటన కూడా ప్రశంసనీయమైనది. మరి ముందు ముందు కథ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే! -
పుస్తకాలొచ్చేశాయ్!
రేపు ప్రపంచ పుస్తక దినోత్సవం ‘‘ఈ మధ్య ఏ పుస్తకం చదివారు వదినా?’’ అనే మాట వినక ఎంతకాలమైంది...తనలో తాను అనుకుంది రజనీబాయి. పుస్తకాలు విపరీతంగా చదివే బంగారు కాలం ఒకటి ఉండేది. తాము చదవడమే కాదు పక్కింటి వాళ్లతో కూడా చదివించేవారు. వినోద మాధ్యమాల దెబ్బతో - ‘‘ఈ మధ్య ఏ సీరియల్ చూశావు’’ అనే మాట తప్ప వేరే మాట వినిపించని పరిస్థ్థితిలో పుస్తకపఠనం అనే మంచి అలవాటును తిరిగి కొనసాగించడానికి నడుం బిగించింది కేరళలోని కోజిక్కోడ్‌కు చెందిన రజనీ. చేతి నిండా, బ్యాగు నిండా పుస్తకాలు సర్దుకొని వారంలో ఆరురోజులు ఊరూరూ తిరుగుతుంది. రోజూ పాతిక ఇళ్లకు తక్కువ కాకుండా వెళుతుంది. తన చేతుల్లో ఉన్న పుస్తకాల గురించి చెబుతుంది. కొందరు వారానికి రెండు, కొందరు మూడు పుస్తకాలు తీసుకుంటారు. రజనీని ‘మొబైల్ లైబ్రేరియన్’ అని కూడా పిలుస్తుంటారు. ఆమె దగ్గర ఉన్న పుస్తకాలలో కాలక్షేప సాహిత్యంతో పాటు, సామాజికస్పృహతో కూడిన సాహిత్యపుస్తకాలు కూడా ఉంటాయి. పాఠకుల అభిరుచికి తగ్గ పుస్తకాలను అద్దెకిస్తుంటుంది. పుస్తకాల అద్దె నెలకు 20 రూపాయలు. పుస్తకాల అద్దె ద్వారా నెలకు రూ. 1200 గడిస్తుందామె. ‘‘నాకు వచ్చే ఆదాయం తక్కువ కావచ్చు. తృప్తి మాత్రం చాలా ఎక్కువ’’ అంటుంది రజని చిరునవ్వుతో. అవును కదా! -
సాగర్‌లో టీవీ సీరియల్ షూటింగ్
నాగార్జునసాగర్,న్యూస్‌లైన్ : మల్లెబాల బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘మనసు-మమత’ డెయిలీ తెలుగు టీవీ సీరియల్ షూటింగ్ శనివారం నాగార్జున సాగర్‌లో జరిగింది. దీనికి అనిల్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నటీనటులు ప్రీతం-లలిత, నాగార్జున-శృతిలపై పలు సన్నివేశాలను సాగర్ కొత్త బ్రిడ్జి, శివాలయం, పాతబ్రిడ్జి, లాంచీ స్టేషన్ ప్రాంతాల్లో చిత్రీకరించారు. అసిస్టెంట్ డెరైక్టర్ కృష్ణ, కో-డెరైక్టర్లు శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు.