వంటలక్కను ఢీ కొట్టనున్న కృష్ణ తులసి! | Raghavendra Rao New Serial Krishna Tulasi Premieres On February 22 | Sakshi
Sakshi News home page

త్వరలో రాఘవేంద్రరావు కొత్త సీరియల్‌

Published Thu, Feb 18 2021 5:04 PM | Last Updated on Thu, Feb 18 2021 5:44 PM

Raghavendra Rao New Serial Krishna Tulasi Premieres On February 22 - Sakshi

రాఘవేంద్రరావు మాట్లాడుతూ కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ కావడం తనను ఆకట్టుకుందన్నారు.

టాలీవుడ్‌ సినీ దిగ్గజం, అగ్రదర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియనివారు ఉండరు. దాదాపుగా అందరు అగ్రహీరోలతోనూ బాక్సాఫీస్‌ హిట్స్‌ కొట్టిన ఆయన గత కొంత కాలంగా సినిమా దర్శకత్వానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. సినిమా రంగంలో టాప్‌లో వెలిగిన దర్శకేంద్రుడు తాజాగా ఓ తెలుగు టీవీ సీరియల్‌కు దర్శక పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టడం విశేషం. ఆర్కే టెలీ షో ద్వారా జీ తెలుగు చానెల్‌లో ప్రసారం కానున్న 'కృష్ణ తులసి' సీరియల్‌కు కె.రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణ చేయనున్నారు.

ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ కృష్ణ తులసి అనేది ఒక స్ఫూర్తి దాయక మహిళకు చెందిన వైవిధ్యమైన జీవిత కధ కావడం తనను ఆకట్టుకుందన్నారు. సీరియల్‌లో కృష్ణతులసి పాత్ర తన హృదయానికి దగ్గరగా అనిపించిందని, ఈ పాత్ర తప్పనిసరిగా తెలుగు ప్రేక్షకులకు నచ్చుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సీరియల్‌ జీ తెలుగులో ఫిబ్రవరి 22 నుంచి ప్రసారం కానుందని జీ తెలుగు ప్రతినిధులు తెలిపారు. 

ప్రస్తుతానికైతే ఈ సీరియల్‌కు దండిగా ప్రచారం చేస్తున్నారు. పైగా రాఘవేంద్రరావు బరిలో దిగారంటే వంటలక్క సీరియల్‌కు ఏమైనా ఎఫెక్ట్‌ పడుతుందేమోనని అభిప్రాయపడుతున్నారు. మరి నిజంగానే కృష్ణ తులసి సీరియల్‌ టీఆర్పీలో కార్తీక దీపాన్ని దాటేస్తుందా? లేదా? అనేది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే!

చదవండి: నాన్న దగ్గర రాఘవేంద్రరావు అసిస్టెంట్‌గా చేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement