
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసి నాలుగేళ్లుగా దిగ్విజయంగా దూసుకుపోతుంది ఈ సీరియల్. అయితే తాజాగా ఈ సీరియల్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డైరెక్టర్. వంటలక్క(దీప), డాక్టర్ బాబు(కార్తీక్)ల కథ విషాదంగా ముగించారు. ఓ రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ చనిపోయినట్లు సీరియల్‌లో చూపించారు.దీంతో ఇకపై కార్తీకదీపంలో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరు.
ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ బాబు ఫేం నిరుపమ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కార్తీకదీపం సీరియల్‌కి గుడ్‌బై అంటూ సెట్‌లో చివరి రోజు షూటింగ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లుగా తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.ఈ విషయం తెలిసి కార్తీక దీపం ఫ్యాన్స్ ఉద్వేగానికి గురవుతున్నారు. సీరియల్‌లో ట్విస్ట్ ఇవ్వడానికి వంటలక్క, డాక్టర్ బాబును చంపేయడం ఏంట్రా అంటూ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా అయితే సీరియల్ చూడమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీరియల్ హైలెట్ రోల్స్ అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేయడంతో ఇకపై కార్తీకదీపం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెక్ట్స్ జనరేషన్‌లో హిమ దీపలా మారుతుందని, మోనిత కొడుకు డాక్టర్ బాబులా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment