Telugu Serial
-
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ యాక్టర్స్
అప్పట్లో తెలుగులో 'నువ్వే కావాలి', 'ప్రేమించు' సినిమాల్లో నటించిన సాయికిరణ్.. ప్రస్తుతం తెలుగు సీరియల్స్‌తో బిజీగా ఉన్నాడు. 'కోయిలమ్మ', 'గుప్పెడంత మనసు' తదితర ధారావాహికల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఇతడు తన తోటి నటి స్రవంతిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: విన్నర్ ప్రైజ్‌మనీ కంటే ఎక్కువే సంపాదించిన విష్ణు!)దిగ్గజ గాయని పి.సుశీలకు.. సాయికిరణ్ మనవడు వరస అవుతాడు. ఇతడి తండ్రి సింగర్. అలా ఇండస్ట్రీ వాతావారణంలోనే పెరగడంతో 'నువ్వే కావాలి' మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. కాకపోతే ఎక్కువగా సినిమాలు చేయలేకపోయారు. కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సీరియల్స్ చేస్తున్నారు. గతంలోనే వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. వీళ్లకు ఓ పాప కూడా ఉంది.మనస్పర్థలు కారణంగా కొన్నాళ్ల క్రితమే సాయికిరణ్-వైష్ణవి విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి ఒంటరిగానే ఉంటున్న సాయికిరణ్.. కొన్నాళ్ల క్రితం తనతోపాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో ప్రేమలో పడ్డాడు. ప్రేమకాస్త ఇప్పుడు పెళ్లి వరకు వచ్చింది. ఇప్పుడు భార్యభర్తలయ్యారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ నటీనటులు కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు) View this post on Instagram A post shared by Sai Kiran Ram (@saikiran_official_23) -
పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు
తెలుగులో ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి సాయి కిరణ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తున్న ఇతడు.. తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో యాక్ట్ చేస్తున్న స్రవంతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు నటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.దిగ్గజ గాయని పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు పాడారు. దీంతో సాయికిరణ్ సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా.. 'జగపతి', 'షిరిడి సాయి', 'నక్షత్రం', 'గోపి గోడమీద పిల్లి' సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)ఓవైపు సినిమాల్లో ఆడపాదడపా నటిస్తూనే సీరియల్ నటుడిగానూ సాయి కిరణ్ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం ఇలా తెలుగు క్రేజీ సీరియల్స్‌లో కీలక పాత్రలు చేస్తూ బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.2010లోనే సాయికిరణ్‌కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సడన్ సర్ప్రైజ్ అన్నట్లు 46 ఏళ్ల సాయికిరణ్.. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక) View this post on Instagram A post shared by Actress Sravanthi (@sravanthi.official) -
సీరియల్ హీరోయిన్ బేబీ బంప్ ఫొటోలు వైరల్
సీరియల్ నటి దేవలీనా ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ విషయాన్ని కొన్నిరోజులు ముందు బయటపెట్టింది. ఇప్పుడు మరోసారి బేబీ బంప్ ఫొటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇందులో భర్తతో కలిసి క్యూట్ అండ్ స్వీట్ పోజుల్లో కనిపించింది. 2002 డిసెంబరులో ఈమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉంది.(ఇదీ చదవండి: మరో ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా)'కోడలా కోడలా కొడుకు పెళ్లామా' అనే డబ్బింగ్ సీరియల్‌తో తెలుగు వాళ్లకు పరిచయమైన నటి దేవలీనా భట్టాచార్జి. చాన్నాళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఈమె.. తన జిమ్ ట్రైనర్ షాన్వాజ్ షేక్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మతాలు వేరు అయినప్పటికీ చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి సందర్భం వచ్చిన ప్రతిసారీ భర్తతో ఉన్న ఫొటోలని దేవలీనా పోస్ట్ చేస్తూనే ఉంటుంది.తాజాగా ఆగస్టు 15న తన ప్రెగ్నెన్సీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. ఆ తర్వాత కొన్నిరోజులకు పుట్టినరోజు జరుపుకొంది. ఇలా ప్రతిసారి తన పిక్స్ పోస్ట్ చేస్తూనే ఉంది. కానీ ఇప్పుడు బేబీ బంప్ క్లియర్‌గా కనిపిస్తున్న ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీంతో ఈమెకు పలువురు నెటిజన్లు విషెస్ చెబుతున్నారు.(ఇదీ చదవండి: కారు ప్రమాదంలో టాలీవుడ్ హీరోయిన్ భర్తకి తీవ్ర గాయాలు) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) View this post on Instagram A post shared by Devoleena Bhattacharjee (@devoleena) -
కాస్ట్ లీ కారు కొన్న సీరియల్ బ్యూటీ లహరి (ఫొటోలు)
-
చీరలో కుందనపు బొమ్మలా సీరియల్ బ్యూటీ తేజస్విని (ఫొటోలు)
-
పవిత్రతో గత ఐదేళ్లుగా... చందు భార్య శిల్ప
'త్రినయని' సీరియల్ నటి పవిత్రా జయరాం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొన్నిరోజుల క్రితం కారు యాక్సిడెంట్లో ఈమె ప్రాణాలు కోల్పోగా, తాజాగా ఉరివేసుకుని నటుడు చందు చనిపోయాడు. పవిత్ర గురించి గత రెండు మూడు రోజుల నుంచి గుర్తు చేసుకుంటున్న ఇతడు ఇప్పుడు ప్రాణాలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే చందు భార్య శిల్ప బయటకొచ్చింది. తన భర్త గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టింది.(ఇదీ చదవండి: బుల్లితెర నటి పవిత్రా జయరాం కేసులో ట్విస్ట్.. ప్రియుడు చందు సూసైడ్!)'స్కూల్ వయసులోనే నా వెంటపడిన చందు.. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నేనే చందుకి సీరియల్లో మొదటి అవకాశం ఇప్పించాను. ఆ తర్వాత వరసగా ఛాన్సులు వచ్చాయి. 'త్రినయని' సీరియల్ చేస్తున్నప్పటి నుంచి పవిత్రతో చందుకు సంబంధం మొదలైంది. ఆమె మోజులో పడి నన్ను, పిల్లల్ని వదిలేశాడు. పవిత్ర మీద విపరీతమైన ప్రేమ పెంచుకున్నాడు. ఆమె మాయలో పడి చందు ఇలా అయిపోయాడు. మాకు మా పిల్లలకు న్యాయం జరగాలి' అని చందు భార్య శిల్ప ఆవేదన వ్యక్తం చేసింది.ఇకపోతే పవిత్రతో కలిసి 'త్రినయని' సీరియల్ చేస్తున్న చందు.. 'కార్తికదీపం'లోనూ నటిస్తున్నాడు. ఇప్పుడు ఇలా రోజుల వ్యవధిలో పవిత్ర-చందు మృతి చెందడం చాలామందిని షాక్‌కి గురిచేస్తోంది. ఇప్పుడు చందు భార్య శిల్ప చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!) -
కొత్త సీరియల్ సివంగి.. ఎప్పటినుంచి ప్రారంభమంటే?
సీరియల్స్ అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. అందుకే వారికి నచ్చేలా, వారు మెచ్చేలా ఎన్నో రకాల సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో జెమిని టివి "సివంగి” అనే సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. దీన్ని మార్చ్ 25 నుంచి ప్రసారం చేయనుంది. కథేంటంటే.. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్థికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది. ఊళ్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్లిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని, అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన అక్క పెళ్లి చేయగలిగిందా? తిరిగి తన ఊరు వెళ్లగలిగిందా? అనేది తెలియాలంటే సివంగి సీరియల్ చూడాల్సిందే! ఈ ధారావాహిక మార్చి 25న ప్రారంభమవుతోంది. ప్రతిరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం కానుంది. "సివంగి” సీరియల్లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు. -
ఫ్యాన్స్‌తో కలిసి 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ టీమ్ బజ్జీల ఛాలెంజ్
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో 'నువ్వు నేను ప్రేమ' సీరియల్ నటులు టీమ్.. తమ అభిమానులతో కలిసి మిర్చి బజ్జి కాంటెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం గ్రాండ్ జరుపుకుంది. మున్సిపల్ గ్రౌండ్ గణేష్ సర్కిల్ దగ్గర జరిగిన ఈ వేడుక.. ఎంతో సరదాగా జరిగింది. ఇకపోతే అభిమానులు.. 'నువ్వు నేను ప్రేమ' యాక్టర్స్‌తో సెల్ఫీలు తీసుకుని ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్) ఈ అద్భుతమైన ఈవెంట్లో తమ ఆత్మీయ ఆదరణ మరియు భాగస్వామ్యానికి ఖైరతాబాద్ ప్రజలకు సదరు ఛానెల్ యాజమాన్యం కృతజ్ఞతలు చెప్పింది. వీక్షకులను వారి ఇష్టమైన షోలకు మరింత చేరువ చేసే ప్రత్యేకమైన మరియు ఆకర్షణీయమైన అనుభవాలను సృష్టించేందుకు ఛానెల్ కట్టుబడి ఉందని పేర్కొంది. (ఇదీ చదవండి: Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!?) -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నీమధ్య మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు. బిగ్‌బాస్ ఫేమ్ మానస్ పెళ్లి కూడా జరగనుంది. ఇప్పుడు ఓ తెలుగు సీరియల్ హీరోయిన్ కూడా పెళ్లి చేసేసుకుంది. కొన్నాళ్ల ముందు నిశ్చితార్థం చేసుకుని, కాబోయే భర్తని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఎవరిని పెళ్లి చేసుకుంది? (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) తెలుగు సీరియల్స్‌కి సినిమాలకున్నంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలా 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్‌తో తెలుగమ్మాయి ప్రేరణ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పుట్టింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగిందంతా బెంగళూరులో. యాక్టింగ్‌పై ఇష్టంతో పలు కన్నడ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ సీరియల్‌తో హీరోయిన్ అయిపోయింది. క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీపాద అనే క్రురాడిన పెళ్లి చేసుకుంది. అక్టోబరు చివరలో నిశ్చితార్థం చేసుకున్న నటి ప్రేరణ.. ఇప్పుడు కన్నడ సంప్రదాయం ప్రకారం శ్రీపాదని పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె నటి, కానీ భర్తకి మాత్రం ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు ఉంది. కాకపోతే అతడి హీరోలానే హ్యాండ్సమ్గా ఉన్నాడు. దీంతో సీరియల్ అభిమానులు.. కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
తల్లికి దూరమైన కుమారుడు ఏమయ్యాడు?.. ఆసక్తి పెంచుతోన్న సీరియల్!
అమ్మ అంటే దైవం. అమ్మ మన కళ్లు ముందు తిరిగే దేవత. అలాంటి అమ్మకి దూరమైన ఓ కొడుకు ఏమవుతాడు? అసలు ఎందుకు దూరమయ్యాడు? ఇదే "గుండె నిండా గుడిగంటలు" సీరియల్ కథ. విలక్షణమైన కథలతో ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ అందిస్తున్న స్టార్ మా ఈ సారి అమ్మ కథతో అలరించబోతోంది. తెలుగులో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న స్టార్ మా ఇప్పుడు మరిన్ని భావోద్వేగాలతో ప్రేక్షకుల్ని అలరించబోతోంది. అనుబంధం ఎంత గొప్పదో ఈ కథ చెబుతుంది. కన్నీరు ఎంతగా తోడు నిలబడుతుందో ఈ పాత్రలు చెబుతాయి. ప్రేమను పంచడం అంటే ఎలా ఉంటుందో ఈ సీరియల్ సన్నివేశాలు చెబుతాయి. కఠినమైన మనసుని కరిగించే శక్తి ప్రేమకు మాత్రమే ఉంటుందని ఈ కథనం వివరిస్తుంది. అక్టోబర్ 2 నుంచి రాత్రి 9 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం కాబోతోంది. దారి తప్పిన జీవితాన్ని ఒక గాడిలో పెట్టాలనుకునే అమ్మాయి ప్రయత్నం.. ఆ తల్లికి, కుమారుడికి మధ్య దూరాన్ని తగ్గించాలనుకునే తాపత్రయం, తల్లీ, కొడుకుల మధ్య అనూహ్యమైన సంఘటనలతో ఈ సీరియల్ పూర్తిగా కొత్త భావోద్వేగాల్ని అందించబోతోంది. ఒక పసివాడు తల్లి కోసం ఎంత ఆరాట పడతాడో.. తల్లి ఒకసారి కనిపిస్తే బాగుండు అని ఎంతగా కోరుకున్నాడో.. అతని తరవాతి జీవితం ఎలా గడిచిందో తెలియాలంటే "గుండె నిండా గుడి గంటలు" చూడాల్సిందే. -
'కార్తీకదీపం 2'పై క్లారిటీ ఇచ్చిన డాక్టర్‌బాబు!
తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులు, డాక్యుమెంటరీ, ఓటీటీల్లో ఇతర భాషా చిత్రాలు.. ఇలా ఒకటేమిటి నచ్చాలే గానీ ప్రతిదీ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన సీరియల్స్ లో 'కార్తీకదీపం' ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ సీరియల్ కు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు. తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. ఏళ్లకు ఏళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవీ ఉన్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ 'కార్తీకదీపం' మాత్రం అటు ప్రేక్షకుల్ని అలరిస్తూ, టీఆర్పీ రేటింగ్స్ సంపాదించడంలోనూ దాదాపు నాలుగైదేళ్లు సక్సెస్ అయింది. అలాంటిది గతేడాది ఫిబ్రవరిలో దీనికి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కొన్నాళ్లకు తిరిగి మొదలుపెట్టడంతో సంతోషించారు. (ఇదీ చదవండి: దళపతి విజయ్‌పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!) కానీ కొత్తగా మొదలుపెట్టింది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు దాన్ని ఆపేశారు. సీరియల్ ని అయితే నిలిపేశారు గానీ అందులో ప్రధాన పాత్రలు పోషించిన వంటలక్క, డాక్టర్ బాబు గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం 'రాధకు నీవేరా' సీరియల్ చేస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కార్తీకదీపం 2'పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 'ఇప్పటికీ ఎక్కడకి వెళ్లినా 'కార్తీకదీపం', వంటలక్క గురించి ఎక్కువగా అడుగుతుంటారు. నా పేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. నా విశ్లేషణ ప్రకారం.. ప్రతిఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే 'కార్తీకదీపం' సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. ఆమెకి(మంజుల) పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది' ఈ ఇంటర్వ్యూలోనే 'కార్తీకదీపం 2' ఉంటుందా అనే ప్రశ్న డాక్టర్ బాబుకి ఎదురైంది. దీంతో.. 'నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటరేమో. కానీ మా ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు' అని సీరియల్ నటుడు నిరూపమ్ చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!) -
హౌజ్ కీపర్‌గా, సేల్స్ గర్ల్‌గా చేశా: ప్రముఖ నటి పవిత్ర
నటి పవిత్ర జయరామ్.. బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పలు టీవీ సిరియల్స్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన ఆమె ప్రస్తుతం స్టార్ మాలోని త్రినయని సీరియల్లో అలరిస్తున్నారు. ఆమె ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. తాను పెద్దగా చదువుకోలేదని, ఇండస్ట్రీకి రావడానికి ముందు హౌజ్ కీపర్ పని చేశానంది. ‘‘మాది కర్ణాటకలోని మాండ్య. నేను పెద్దగా చదువుకోలేదు. కానీ నాకంటూ సొంత గుర్తింపు ఉండాలనే తపనతో బెంగళూరు వచ్చాను. అయితే నాకు పెద్దగా చదువు లేకపోవడంతో ఎక్కడ ఉద్యోగం దొరకలేదు. దీంతో కొన్ని రోజులు హౌజ్ కీపర్‌గా పని చేశాను. ఆ తరువాత సెల్స్ గర్ల్‌గా, లైబ్రరీలో కూడా వర్క్ చేశాను. వచ్చే ఆదాయం సరిపోక ఆర్థిక ఇబ్బుందులు పడ్డాను. నా ఇబ్బందులను చూసి నా స్నేహితురాలు ఓ ఫిలిం మేకర్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ సిరి గంధం శ్రీనివాసమూర్తిని కలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను. ఆ సమయంలోనే కన్నడ సీరియల్స్‌లో చేయాలన్న ఆలోచన వచ్చింది. పలు సీరియల్స్‌కి ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. చిన్న చిన్న రోల్స్ వస్తే చేశాను. జోకాలి అనే కన్నడ సీరియల్లో హీరోకి చెల్లెలి పాత్రతో సినీరంగ ప్రవేశం చేశాను. అక్కడ నుంచి తెలుగులో ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో అవకాశం వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ‘ఆ సమయంలో తనకు తెలుగు అస్సలు అర్ధమయ్యేది కాదని. ఆ సీరియల్లో నటించే వారంతా తెలుగులో మాట్లాడుతుంటే అర్థమయ్యేది కాదు. ఒకానొక సమయంలో సీరియల్స్ వదిలేసి వెళ్లిపోవాలి అనుకున్నా. అప్పుడు నా పరిస్థితిని అర్థం చేసుకున్న నా తోటి నటులు ధైర్యం చెప్పి.. తెలుగు చదవడం, రాయడం నేర్పించారు. ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడగలుగుతున్నా’ అని చెప్పింది. View this post on Instagram A post shared by Pavithra Jayaram (@jayaram.pavithra) -
"నువ్వు నేను ప్రేమ" అంటున్న స్టార్ మా!
ఇద్దరు మనుషులు ప్రేమగా ఎదురుపడితే, ఒకరినొకరు ఇష్టపడితే ప్రేమ పుడుతుంది. సాధారణంగా జరిగేది ఇదే. కానీ అస్సలు ఇష్టపడే ఛాన్స్ లేని ఓ అమ్మాయి, ఓ అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుడుతుంది? ఇదే స్టార్ మా సరికొత్త సీరియల్ కథ. అదే "నువ్వు నేను ప్రేమ". ఇద్దరి మధ్య శత్రుత్వం సంధించే చాలా కష్టమైన ప్రశ్నలకు అర్ధవంతమైన సమాధానాలు ఇవ్వబోతోంది ఈ సీరియల్ "నువ్వు నేను ప్రేమ". జీవితాన్ని ఆస్వాదించాలి అనుకునే అమ్మాయి, జీవితం అంటే డబ్బు సంపాదించడమే అనుకునే అబ్బాయికి మధ్య ఒక బంధం ఏర్పడితే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అనేదే సింపుల్ గా ఈ సీరియల్ కథ. విభిన్నమైన మనస్తత్వాల మధ్య మొదలయ్యే సంఘర్షణ ఎటు దారితీస్తుందో తెలియని ప్రయాణం చేస్తున్న ఇద్దరి మనుషుల కథ ఇది. స్టార్ మా లో ఈరోజు సాయంత్రం 06.30 గంటలకు ఈ సీరియల్ ప్రారంభం అవుతుంది.ప్రతివారం సోమవారం నుంచి శనివారం వరకు ఈ సీరియల్ బ్రాడ్ కాస్ట్ అవుతుంది. (అడ్వర్టోరియల్) "నువ్వు నేను ప్రేమ" ప్రోమో👇 -
'కార్తీకదీపం' ఫ్యాన్స్‌కి ఊహించని షాక్ ఇచ్చిన డైరెక్టర్
తెలుగు రాష్ట్రాల్లో 'కార్తీకదీపం' సీరియల్ గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. బుల్లితెరపై ఎన్నో రికార్డులను తిరగరాసి నాలుగేళ్లుగా దిగ్విజయంగా దూసుకుపోతుంది ఈ సీరియల్. అయితే తాజాగా ఈ సీరియల్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు డైరెక్టర్. వంటలక్క(దీప), డాక్టర్ బాబు(కార్తీక్)ల కథ విషాదంగా ముగించారు. ఓ రోడ్డు ప్రమాదంలో వీరిద్దరూ చనిపోయినట్లు సీరియల్లో చూపించారు.దీంతో ఇకపై కార్తీకదీపంలో వంటలక్క, డాక్టర్ బాబు కనిపించరు. ఈ విషయాన్ని స్వయంగా డాక్టర్ బాబు ఫేం నిరుపమ్ కూడా తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. కార్తీకదీపం సీరియల్‌కి గుడ్‌బై అంటూ సెట్లో చివరి రోజు షూటింగ్‌ను అభిమానులతో పంచుకున్నాడు. ఇన్నేళ్లుగా తనపై చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశాడు.ఈ విషయం తెలిసి కార్తీక దీపం ఫ్యాన్స్ ఉద్వేగానికి గురవుతున్నారు. సీరియల్లో ట్విస్ట్ ఇవ్వడానికి వంటలక్క, డాక్టర్ బాబును చంపేయడం ఏంట్రా అంటూ డైరెక్టర్‌పై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే సీరియల్ చూడమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సీరియల్ హైలెట్ రోల్స్ అయిన వంటలక్క, డాక్టర్ బాబులను చంపేయడంతో ఇకపై కార్తీకదీపం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అయితే నెక్ట్స్ జనరేషన్లో హిమ దీపలా మారుతుందని, మోనిత కొడుకు డాక్టర్ బాబులా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూడాల్సి ఉంది. View this post on Instagram A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala) -
"అమ్మకు తెలియని కోయిలమ్మ" స్టార్ మాలో
విలక్షణమైన కథలు, వినూత్నమైన కథనాలతో ప్రేక్షకులకు విభిన్నమైన ధారావాహికలను అందిస్తున్న స్టార్ మా.. ఇప్పుడు మరో సరికొత్త కథని సీరియల్ గా అందిస్తోంది. ఆ కథ పేరు "అమ్మకు తెలియని కోయిలమ్మ". అనుబంధాల మధ్య సంఘర్షణ, ఆప్యాయతల మధ్య దూరాలు పెరిగి ఎవరి కథ ఎలా షాక్ ఇవ్వబోతోంది ? ఎవరి కథ ఎందుకలా అయింది ? అసలు ఎందుకు ఇలా జరిగింది ? లాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం "అమ్మకు తెలియని కోయిలమ్మ". అమ్మకీ కోయిలమ్మకీ మధ్య ఎలాంటి సంబంధం ఉంటుందో .. అనుబంధాల ఆధారంగా విశ్లేషించే కథ ఇది. తెలుగు సినిమాల్లో ఎన్నో ముఖ్యమైన కేరక్టర్స్ చేసిన మంజు భార్గవి ఈ కథలో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. ప్రముఖ నటులు చిన్నా, వినోద్ బాల, అశ్వని గౌడ ముఖ్యమైన కేరక్టర్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరోయిన్ గా కావ్యశ్రీ నటిస్తున్నారు. జులై 19 న రాత్రి 9.30 గంటల నుంచి స్టార్ మా లో ప్రసారమయ్యే ఈ సీరియల్ సోమవారం నుంచి శుక్రవారం వరకు స్టార్ మా ప్రేక్షకుల్ని అలరించబోతోంది. -
Karthika Deepam: అర్జెంటుగా అమెరికా వెళ్లిన సౌందర్య, షాక్‌లో మోనిత
కార్తీకదీపం జూలై 7వ ఎపిసోడ్: తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్‌గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ‘నా తల్లి ముందు సుపుత్రుడిగానే నిలబడాలి. మోనిత ముందు తప్పుచేసిన వాడిలా తలదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పొగొట్టుకుంటున్నాను. ఇక ముందు అలా జరగకూడదంటే ఈ కడుపు సంగతేంటో తెల్చుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంటాడు. మరోవైపు మోనిత కార్తీక్‌ను కలవడానికి రెడీ అవుతూ ఉండగా మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. నా భర్త తప్పులేకపోతే మోనిత ఎందుకు గర్భవతి అవుతుంది మా వంటలక్క అనుకుంటోంది. ఇక ఇప్పుడు వాళ్ల జుట్టు, ఇంటి గుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది. దీంతో ప్రియమని అని మీరు అనుకుంటున్నారని మోనితకు షాక్ ఇస్తుంది. ‘దీపమ్మ ఇంటి నుంచి వచ్చేసినా డాక్టర్ బాబు తోకలాగే ఆమె వెనక వచ్చాడు. పోనీ దీపమ్మ ఏం అయిన కార్తీక్ అయ్యాను గెంటెయ్యలేదు కదా.. అటూ తల్లి కూడా కార్తీక్ అయ్యా గురించే బాధపడుతున్నారు తప్ప మీ మీద జాలి చూపించడం లేదు కదా’ అని లాజిక్‌గా మాట్లాడుతుంది. కార్తీక్ అయ్య కూడా అందరి లాంటి మగాడేనని, ఆయన ఏ మహానుభావుడు కాదంటుంది. ఏదైనా తన దాక రాకపోతే ఆడదానితో ఎంత గౌరవంగానైనా ఉంటాడు. అదే కుటుంబానికి, వంశగౌరవానికీ ముప్పు రాబోతుందని తెలిస్తే మాత్రం దెబ్బకు ప్లేట్ పిరాయిస్తాడు. తప్పు చేశానని కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారని, అందులో కార్తీక్ అయ్యా ఉంటారని తనకు నమ్మకం లేదు అంటుంది ప్రియమణి. కాబట్టి మీకే అన్ని తెలుసు అని ధైర్యంగా ఉండకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందా అని ఆలోచించండని మోనితకు హిత బోధ చేస్తుంది. సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కాల్ చేస్తాడు. అది చూసి మోనిత ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా దీప గోడ మీద ఉన్న గీతల వంకే చూస్తూ మోనిత తనవైపు వెక్కిరింతగా చూస్తున్నట్లు తలుచుకుంటోంది. పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది. ఇదిలా ఉండగా కార్తీక్, మోనితలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటారు. చూడు కార్తీక్ నువ్వు నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటుంది మోనిత. ‘పదేళ్లు అబద్దాని నిజమని నమ్మి దీపను దూరం పెట్టావు, ఇప్పుడు నిజాన్ని అబద్దమంటూ నన్ను ఎన్నాళ్లు దూరం పెట్టాలనుకుంటున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటాడు. దీంతో మోనిత నీ ఫ్రెండ్గ్, శ్రేయోభిలాషిగా, నీ వెల్ విషర్‌గా చెబుతున్నాను.. నువ్వు మోనితని పెళ్లి చేసుకోవడమే న్యాయం అంటుంది మోనిత. కార్తీక్ మౌనంగా ఉండటంతో మోనిత ప్రేమగా కార్తీక్ భజం మీద చెయ్యి వేసి ఇవన్నీ వద్దని, తను పెళ్లి వాయిదా వేయను అని చెబుతుంది. నువ్వు నన్ను తల్లిని చేశావు, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి పెళ్లి కావాలంటున్నాను, తన బిడ్డకు తండ్రివి నువ్వే అని సమాజానికి చెప్పుకోవడం కోసం పెళ్లి చేసుకుందాం అంటుంది. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది. తరువాయి భాగం.. కార్తీక్ అనుకున్నట్లు గానే పిల్లలతో సంతోషంగా ఉంటాడు. పిల్లలకు బహుమతులు కొనితెచ్చిస్తాడు. సరదాగా వాళ్లతో మాట్లాడం చూసి దీప ఏంటి ఈ సడెన్ మార్పు అని ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ సెల్ఫీ తీస్తుండగా ఇందులో ఒకరూ మిస్సయ్యారు, నిన్నే దీప నువ్వు కూడా ఉంటే బాగుంటుందంటూ దీపను రాగానే భుజం మీద చేయ్యి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలు బయటకు వెళ్లగానే ‘ఈ నెల 25వ తేదీలోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను నీవాడిని దీప నన్ను నమ్ము. ఇది నాటకం కాదు అని దీప తలపై చెయి పెడతాడు’ కార్తీక్. -
Karthika Deepam: మోనితతో కారెక్కి వెళ్లిన కార్తీక్, కోపంతో రగిలిపోతున్న దీప
కార్తీకదీపం జూన్ 26వ ఎపిసోడ్: దీప పిల్లలు కనబడకపోవడంతో కంగారుగా ఆటూ ఇటూ వెతికగా ఎక్కడ కనిపించకపోవడంతో సౌందర్యకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. పిల్లలు ఇక్కడే ఉన్నారని సౌందర్య చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటుంది దీప. అనంతరం కార్తీక్ గురించి అడగ్గా ఏం సమాధానం చెప్పకుండా ఉంటాను అత్తయ్య అని ఫోన్ పెట్టెస్తుంది. వెంటనే కార్తీక్ వంక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీప లోపలికి వెళ్లిపోవడంతో గతంలో కార్తీక్ ఆమెను అవమానించిన సంఘనలను గుర్తు చేసుకుంటాడు. తన జీవితం ఇలా అయిపోయిందేంటని, శౌర్యను రౌడీలా, హిమను అనాధల చూశాను, తాళి కట్టిన భార్యను కళంకితల చూశాను అంటూ కుమిలిపోతాడు. ఇప్పుడు దీపను ప్రేమగా చూసుకున్న నమ్మదు.. ఎలా అంటూ బాధపడుతుంటాడు కార్తీక్. ఇదిలా ఉండగా పిల్లలు సౌందర్య దగ్గర దీప, కార్తీక్‌ల తీరు గురించి చెప్పి బాధపడుతుంటారు. ఈ మధ్య వాళ్లలో చాలా తేడా వచ్చిందని, వారి పద్దతి మాకు అసలు నచ్చడం లేదని, అమ్మ-నాన్నను చూస్తుంటే విసుగోస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తారు. వారి మాటలకు సౌందర్య షాక్ అవుతుంది. కన్న తల్లిదండ్రుల మీద విసుగు రావడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. అలాగే కార్తీక్ గురించి నిజం తెలిస్తే ఆ విసుగు స్థానంలో అసహ్యం వస్తే కార్తీక్ ఏం అవుతాడని తలుచుకుని కంగారు పడుతుంది. వెంటనే వారితో ‘ఏ అమ్మ-నాన్నలు పిల్లలకు విసుగు వచ్చేలా ఉండరని, మీ అమ్మ-నాన్నకు మీరంటే ప్రాణమని, వాళ్ల మూడ్ బాగాలేదనుకుంటా అందుకు అలా ఉండిఉంటారని శౌర్య, హిమలకు నచ్చజేప్పుతుంది సౌందర్య. మరోవైపు భాగ్యం దీపకు ఈ పరిస్థితి రావడానికి తానే కారణమంటూ చెంపలు కొట్టుకుంటుంది. ఒకప్పుడు దీప తను హింసించిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. తనే గనుక దీపను బాగా చూసుకుంటే అసలు డాక్టర్ బాబును పెళ్లి చేసుకునేదే కాదనీ, బాగా చదివిస్తే ఈ వంటలు, దోసలు వేసుకొకుండా ఏం చక్క ఓ ఆఫీసరు పెళ్లి చేసుకునేదంటూ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది భాగ్యం. వెంటనే దీప కాపురం ఎలాగైనా సెట్ చేస్తానని, ఆ మోనితకు బుద్ధి చెప్పి కార్తీక-దీపలు దగ్గరయ్యాలా చూస్తునంటూ గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక మోనిత వీధి చివరన కారు ఆపి కార్తీక్ రమ్మన్నానని చెప్పి వారణాసిని పంపిస్తుంది. కార్తీక్ బస్తి వాళ్లకు వైద్యం అందిస్తుండగా దీప బట్టలు ఉతికి ఆ పక్కనే ఆరెస్తుంటుంది. ఇంతలో వారణాసి వచ్చి మోనిత పిలుస్తుందని చెప్పగానే దీప ఒక్కసారిగా ఆగి చూస్తుంది. కార్తీక్ కూడా దీప వంక మెల్లిగా చూస్తాడు. మోనిత మేడమ్ పిలుస్తుందని వీధి చివరన ఉందని చెప్పడంతో కార్తీక్ అక్కడికి వెళతాడు. కార్తీక్ రావడంతో మోనిత నవ్వుతూ పలకరించావా అని మోనిత అనగానే నువ్వు వచ్చావని పులకరించి పలకరించాలా? అని కోపంగా అంటాడు కార్తీక్. కాల్ చేసి రమ్మని ఉంటే వచ్చేవాడిని కదా ఇలా గోలచేసి పోతానంటే వచ్చాను. ఎందుకీ బెదిరింపులు.. నాకు దీపకు మధ్య కంచె వేసే ప్రయత్నమా? నన్ను ఒక పంజరంలో బందించే ప్రయత్నమా? అని కార్తీక్ ఆవేశపడుతాడు. మరోవైపు దీప చాటుగా ఆటోలో కూర్చుని వాళ్ల మాటల్ని వింటుంది.కార్తీక్ మాటలకు మోనిత ‘నువ్వు నా కోసం రావట్లేదు కాబట్టి.. నేను నీకోసం వచ్చాను.. నన్ను అవైడ్ చేద్దాం అనుకుంటున్నావా’ అంటుంది బాధగా. ‘నాకు తెలియని కొన్ని క్షణాలని నా జీవితంలో బలవంతంగా నువ్వు రాస్తుంటే.. పుస్తకం మూసేసినట్లు నా ఆలోచనలు మూసేశాను’ అని అంటున్న కార్తీక్ మాటలకు దీప ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక మోనిత తను సౌందర్య దగ్గరికి వెళ్లోచ్చిన విషయం చెబుతుంది వెంటనే కార్తీక్ ‘మా అమ్మ ఇంకా సంస్కారాన్ని మోస్తూనే ఉందా నాలాగా’ అంటాడు కోపంగా. అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని మోనిత అనగానే కార్తీక్ నువ్వే నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావని, పరిచయం లేని ప్రమాదంలా కనిపిస్తున్నావు అంటాడు. ‘ఇంతకు ముందు నువ్వు స్నేహితురాలిగా కనిపించేదానివి.. ఇప్పుడు అలా లేవు.. నడిచే విస్పోటనంలా కనిపిస్తున్నావు’ అంటాడు. అలాగే ‘దీప మీద అప్పట్లో ఉన్న కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే.. కాని అది ఆసరాగా తీసుకుని ఏనాడైనా నిన్ను తాకానా?నీతో ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా? మన మధ్య ఈ తప్పు జరిగిందని నువ్వు వచ్చి చెప్పే వరకూ నాకు తెలియలేదు అంటే అందులో నా ప్రమేయం ఎంతవరకూ ఉందనేది నువ్వే ఆలోచించు’ అంటాడు కార్తీక్. ఆ తర్వాత మోనిత తనదైన శైలిలో తెలివిగా కార్తీక్‌కు సమాధానం ఇచ్చి నోరు మూపిస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్లాలి కారు ఎక్కమని అడగ్గానే కార్తీక్ కారు ఎక్కుతాడు. అది చూసి దీప ఆవేశంగా ఇంటికి వెళ్లిపోతుంది. కోపంతో రగిలిపోతూ వారణాసి ఆటోను కడుగుతూ తన కసి చూపిస్తుంది. ఇంతలో సౌందర్య రాగానే ‘మీరా నేను అవసరమైన పనిలో ఉన్నాను మీరు వెళ్లి లోపల కూర్చోండిని అంటుంది’ దీప. -
ఏదైనా దీవిలో ఇరుక్కుపోయామా అని భయమేస్తోంది అమ్మ: హిమా
కార్తీకదీపం జూన్ 22 ఎపిపోడ్: కార్తీక్ దీప ఇంటి ముందు జనత ఉచిత వైద్యశాల పేరుతో క్టీనిక్ నడుపుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ పేషెంట్స్‌ను చూస్తుండగా సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. కార్తీక్ అతడి రిపోర్ట్స్ చూసి మందులు రాసి ఇస్తాడు. అంతేగాక తన దగ్గర పని చేయాలని అందుకు తనకు రూ. 25 వేల జీతం ఇస్తానని కార్తీక్ చెప్పడంతో లక్ష్మణ్ ఎమోషనల్ అవుతాడు. కార్తీక్ దేవుడు అంటూ పొగుడుతుండగా సరిగ్గా అదే సమయానికి దీప బయటకు వస్తుంది. లక్ష్మణ్ దీపను చూసి దీపమ్మా ఇలా రమ్మా అంటూ పిలిచి వారిద్దరి కాళ్లకు దండం పెట్టుకుంటాడు. మీరిద్దరూ ఆదర్శ దంపతులంటూ మీలో రాముడు, సీత.. శివుడు, పార్వతిలు కనిపిస్తున్నారంటాడు. దీంతో కార్తీక్ ‘ప్రపంచానికి గొప్పగా కనిపిస్తున్న ఈ మనిషి లోపల ఎంత దుర్మార్గుడో వీళ్లకేం తెలుసు అనుకుంటున్నావా దీపా’ అని మనసులో అనుకుంటూ బాధపడతాడు. సరిగ్గా అప్పుడే హిమ బయటికి వచ్చి అమ్మా వెళ్దామా అంటుంది. కార్తీక్ ఎక్కడికి అనడంతో మార్కెట్‌కు వెళ్తున్నామని చెబుతుంది దీప. ఇదిలా ఉండగా భాగ్యం సౌందర్యతో రహస్యంగా మాట్లాడుతుంది. మోనితకు ఇలా సాఫ్ట్‌గా చెబితే పని జరగదని, తను వెళ్లి తన తీరులో మోనితకు వార్నింగ్ ఇస్తానని చెబుతుంది భాగ్యం. లేదంటే మీరైనా క్లాసుగా కాకుండా మాస్‌గా వార్నింగ్ ఇవ్వండి అంటూ సలహా ఇస్తుంది. అది జరగని పని.. మన దగ్గర తప్పు పెట్టుకుని మోనితని ఏం చేయలేమని సౌందర్య అంటుంది. అంతేగాక తన దగ్గర ఇప్పుడు బ్రహ్మస్త్రం ఉందని ఇప్పుడు మోనిత భయపెట్టడం జరగదంటుంది. కానీ భాగ్యం మాత్రం మనసైడు తప్పు ఉన్న తల వంచకుండా తెలివిగా ఆలోచించి మోనిత పని చెప్పాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ ఒంటరిగా కూర్చుని.. గోడపై మోనిత గీసిన గీతలని చూస్తూ టెన్షన్ పడుతూ ఉండగా లోపల నుంచి శౌర్య వస్తుంది. కార్తీక్ ఆ గీతలను చూస్తుండటం చూసి అవి నీ భవిష్యత్తు అన్నావు కదా నాన్న ఇప్పుడు వాటి వల్ల ఎమైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అమాయకంగా. అప్పుడే కార్తీక్‌కు అన్ని గుర్తు చేసుకుంటాడు. దీప ప్రెగ్నెట్ అని తెలియగానే ఆ బిడ్డకు తనకు సంబంధం లేదని గట్టిగా అరిచి చెప్పిన సంఘటన, అలాగే శౌర్య గతంలో నాన్న పిలిచి నువ్వే మా నాన్నవని ఎప్పుడో తెలుసు అనడం, కార్తీక్ హిమని ఎత్తుకుని తిరిగింది అన్ని గుర్తుకు తెచ్చుకుని ఎమోషనల్ అవుతాడు. దీంతో శౌర్యను దగ్గరకు తీసుకుని ఎత్తుకుని తీప్పుతుండగా అప్పుడే సౌందర్య వస్తుంది. అదంతా చూసి ఆనందిస్తుంది. ఇంతలో కార్తీక్ సౌందర్య చూసి నానమ్మ వచ్చిందని చెప్పగానే శౌర్య సంతోషిస్తుంది. లోపలికి వచ్చిన సౌందర్య గోడ మీద ఉన్న గీతలను చూసి శౌర్యతో గ్లాసులో నీళ్లు తెమ్మని చెబుతుంది. ఆ లోపు కార్తీక్‌తో ఆ గీతల్ని చెరపకుండా అలేనే ఉంచుతావా అని ప్రశ్నిస్తుంది. అయినా కార్తీక్ మౌనంగా ఉంటాడు. ‘ఆ గీతల్ని చెరిపి నీ రాతను మార్చుకోరా’ అంటుంది అనడంతో తన వల్ల కాదేమో మమ్మీ అంటాడు కార్తీక్ నిరాశగా.. ఆ మోనిత నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని, తనని బెదరిస్తుంది కానీ దీపకు భయపడుతుంది అంటుంది. అందుకే. సమస్యని దీపకు చెప్పు.. దీప చేతిలో పెట్టు.. ఆ గీతల్ని దీపే చెరిపేస్తుంది అని సౌందర్య చెబుతుంది. దీంతో ఆ కార్తీక్ దీప చూసే చూపుల్లో ఆ గీతల్ని చెరిపే బాధ్యత నీదే అన్నట్టు నాకు అర్థమవుతుంది మమ్మీ.. ఇంకా ఆ గీతల్ని ఎలా చెరిపేస్తుంది అంటాడు కార్తీక్. మరోవైపు ఆటో వస్తుండగా హిమ దీపతో వారణాసి ఎందుకు రాలేదని, ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నాడని ప్రశ్నిస్తుంది. దీంతో ఏదో పని మీద బయటకు వెళ్లాడని దీప సమధానం ఇస్తుంది. ఆ తర్వాత హిమ నాకు చాలా భయంగా ఉందని, ఏదో మనసులో తెలియని బాధ ఉంటోందంటూ కన్నీరు పెట్టుకుంటుంది. మనం అందరం కలిసే ఉన్నా ఏంటో భయం భయంగా అనిపిస్తుందంటూ బాధపడుతుంది. వారణాసి కూడా ఫోన్ ఎత్తకపోతే.. ఇక మీదట వారణాసి కూడా మనతో మాట్లాడడేమోననే భయమేస్తోందని, ఈ ప్రపంచంలో మనషులంతా వేరు, మన నలుగురం వేరేమో.. ఏదైనా దివిలో ఇరుక్కుపోయామోనని అనిపిస్తుంది అమ్మ అంటూ హిమ కన్నీరు పెట్టుకోవడంతో దీప హిమను దగ్గరకు తీసుకుని తాను కూడా ఎమోషనల్ అవుతుంది. -
Karthika Deepam: భార్య స్థానం కోరిన మోనిత, సౌందర్యను సలహా అడిగిన కార్తీక్
కార్తీకదీపం జూన్ 18: మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్‌ని బెదిరిస్తుంది. పది అంటే పదే రోజుల్లో తనకు న్యాయం జరిగే నిర్ణయం చెప్పాలని గోడ మీద 10 గీతలు గీసి కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ హెచ్చరించి వెలుతుంది. ఆ తరువాత కార్తీక్ మోనితకు ఆబార్షన్ చేయించుకోమ్మని చెప్పేందుకు ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ మోనిత కార్తీక్ చెప్పేది వినకుండా తనని పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వమని అడుగుతుంది. దీంతో కార్తీక్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మోనితతో పదేళ్లుగా దీపను అనుమానించానని, ఇప్పుడది తప్పని తేలింది. ఈ సయమంలో అంటూ నానుస్తుండగా.. అయితే దానికి నాకు సంబంధం ఏంటని నిలదీస్తుంది మోనిత. ‘నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? నేనే చేయను. దీప కంటే ముందు నుంచి నిన్న ప్రాణంగా ప్రేమిస్తున్న, మరీ నా మీద ఎందుకు నీ ప్రేమ రాలేదు. కనీసం జాలి అయినా చూపించు కార్తీక్. అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. నీ ప్రమేయం ఉన్నా లేకున్నా జరిగిన దానికి న్యాయం చెయ్యమంటున్నాను.. అంతే’ అంటుంది మోనిత. త్వరలో కార్తీక్‌ను తన నిర్ణయం చెప్పాలని, లేదంటే తనే ఏదోక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటుంది. ఆ తర్వాత ‘నీ యాక్షన్‌ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని చెప్పు’ అంటూ హెచ్చరిస్తుంది మోనిత. మరోవైపు పిల్లలు దీప బెండకాయలు కట్ చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి ఇంతకుముందు నాన్న వస్తే ఇష్టమైనవవి వంటలు అన్ని చేసి పెట్టెదానివి. ఇప్పుడు నాన్న వచ్చి మనతోనే ఉంటున్నా ఈ పిచ్చి వండి పెడుతున్నావు? ఏమైంది అమ్మ నీకు కొన్ని రోజుల నుంచి ఏం మాట్లాడకుండ మౌనంగా ఉంటున్నావు. నాన్నకు, నీకు మధ్య ఏం జరిగిందని పిల్లలు ఆరా తీస్తారు. అలాగే గోడ మీద గీతలు గురించి అడుగుతూ.. కార్తీక్ తన చేతి గీతలని, భవిష్యత్ చెప్పిన మాటలకు అర్థం ఏంటని దీపను ప్రశ్నిస్తారు. అయినా దీప ఏం మట్లాడదు. దీంతో హిమ మీరు చెప్పకపోతే మేమే కనిపెడతామని, శౌర్యతో నువ్వు ఇవన్ని తెలుసుకుంటావు కదా అనగానే ‘నాన్ననే కనిపెట్టిన దాన్ని ఇది నాకు పెద్ద విషయం కాదు’ అంటుంది. శౌర్య తెలుసుకుంటా ఖచ్చితంగా కనిపెడతా అని అక్కడ నుంచి వెళ్లిపోగానే దీప ‘పిల్లలకి నిజంగానే ఆయన చేసిన తప్పు గురించి తెలిస్తే.. ఆయన్ని క్షమిస్తారా? కచ్చితంగా క్షమించరు. అసహించుకుంటారు’ అంటూ మనసులో మదన పడుతుంది. ఇదిలా ఉండగా కార్తీక్ మోనిత దగ్గర జరిగిందంతా సౌందర్యకు చెబుతాడు. ‘ఇందులో నేను చెయ్యగలిగింది ఏం లేదు’ అని సౌందర్య అంటే.. ‘అలా అనకు మమ్మీ.. ఊబిలో కూరికుపోయాను.. చెయ్యి అందించి గట్టుకు చేర్చు మమ్మీ’ సౌందర్యను సలహా అడుగుతాడు. కార్తీక్.. చిన్నప్పుడు నీకు గాజేంద్ర మోక్షం చదివి వినిపించాను గుర్తుందా.. మోనిత ఇప్పుడు నీళ్లలో ఉన్న ముసలిరా.. అది చాలా శక్తివంతురాలు. దాని నోటికి చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నావు. నా దగ్గరకి వచ్చి మొరపెట్టుకుంటే కాపాడటానికి నేను విష్ణుమూర్తిని కాదు.. దాని తల ఛేదించి నిన్ను రక్షించడానికి నా దగ్గర విష్ణు చక్రమూ లేదు’ అని అంటుంది. అలా అనకు మమ్మీ ఎలాగైన నన్ను దీని నుంచి బయట పడే మార్గం చూపించమని కార్తీక్ అడగ్గా.. దీనికి ఒకేట మార్గం ఉందని, మోనిత స్వయంగా తన కడుపు నాటకమని లేదా ఆ కడుపులో బిడ్డకు నువ్వు తండ్రివి కాదని చెప్పాలని అంటుంది. అదే జరిగే పనేనా? అని మోనిత నీళ్లలో ఉన్న మొసలి అని అది నిన్ను ముంచెడయం ఖాయం, నువ్వు తప్పు చేశావు ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దానికి మోక్షం ఆ పైవాడు చూపిస్తాడు అంటూ కార్తీక్‌కు చివాట్లు పెడుతుంది సౌందర్య. రాత్రి ఇంటిక తిరిగి వచ్చేస్తాడు. పిల్లలకు చాక్లేట్స్, బిస్కెట్స్ తీసుకుని వెళుతాడు కార్తీక్. ఇక తెల్లారి దీప లేచి చూసేసరికి కార్తీక్ బయట పడుకుని ఉంటే కాఫీ తీసుకుని వెళ్లిని డాక్టర్ బాబు అంటూ దీప కార్తీక్‌ని నిద్ర లేపుతుంది. ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. -
karthika Deepam: మోనిత ఇంటికి వెళ్లిన కార్తీక్, భార్య స్థానం అడిగిన మోనిత
కార్తీకదీపం జూన్ 17: మోనిత దీప ఇంటికి వస్తుంది. దీప గొప్పది. పురాణాల్లో విన్నామే మహా పతివ్రతల గురించి.. అలాంటిది దీప. భర్త ఎలాంటి వాడైనా పతియే ప్రత్యక్ష దైవం అని నమ్మే పాతకాలం నాటి మనిషి.. భూదేవి అంత సహనం ఉంది కాబట్టి నిన్ను ప్రసన్నం చేసుకోవడానికి పదేళ్లగా ఎదురు చూసింది.. కానీ నాకు అంత ఓపిక లేదందూ గోడ మీద 10 గీతలు గీసి అవి చూపిస్తూ.. పది రోజులు నీకు టైమ్ ఇస్తున్నాను.. పది రోజుల్లో నాకు న్యాయం జరిగే సమాధానం కావాలని లేదంటే నీ కుటుంబం గడగడ వణికిపోయేలా చేస్తానంటూ హెచ్చరిస్తుంది. ఇక మోనిత వెళ్లిపోతూ వెనక్కి తిరిగి ఎక్కువగా ఆలోచించకు దీప.. ఇప్పుడు నువ్వు చెయ్యగలిగింది ఏం లేదు.. ఆరోగ్యం బాగా చూసుకో.. ఎందుకంటే రేపు నాకు పురుడు పొయ్యాల్సింది నువ్వే.. పది మందికి అన్నం పెట్టిన చెయ్యి.. నీ చేత్తో పురుడు పోస్తే చాలా మంచిది అంటూ దిప ఉడికించి వెళ్లిపోతుంది. మరోవైపు భాగ్యం దీప దగ్గరకు వెళ్లి భర్త రాజీపడమని చెబుతానంటూ మురళీ కృష్ణతో చెబుతుంది. దీంతో అతను వద్దని భాగ్యంకు నచ్చజెప్పిన వినకుండా వెళ్తనని మొండిగా అంటుంది. ఇక పిల్లలు ఆడుకుంటూ మోనిత గీసిన గీతల దగ్గరకు వెళ్లి ఏంటవి అని మాట్లాడుకుంటుంటారు. మ్యాథమెటిక్స్ హా, ఆల్జిబ్రా గీతలు అంటూ వాళ్లు మాట్లాడుకుంటుంటే గుమ్మం దగ్గర నుంచి దీప, సోఫాలో కూర్చున్న కార్తీక్ వింటుంటారు. ఆ తర్వాత పిల్లలు దీపని ‘ఇవి ఎవరు గీసారని అడగ్గా దీప కార్తీక్ వైపు చూస్తుంది. దాంతో పిల్లలు కార్తీక్‌ని నువ్వు గీశావా? నాన్న అని అడగ్గా... అవి నా భవిష్యత్ అమ్మ అంటాడు. దాంతో దీప కార్తీక్ తానో తప్పు చేశానని, నా భవిష్యత్‌కి సంబంధించింది. రేపు చెబుతాను అన్ని విషయం గుర్తు చేసుకుంటుంది. కార్తీక్ చెబుతానన్న నిజం మోనిత ప్రెగ్నెంట్ విషయం అయ్యి ఉంటుందని, మోనిత ద్వారానే కార్తీక్ తన పతివ్రత అనే నిజాన్ని నమ్ముతున్నాడని ఆలోచిస్తూ బాధపడుతుంది. మొత్తానికి పిల్లలు కార్తీక్ చెప్పిన పెద్ద పెద్ద మాటలు అర్థం చేసుకోలేక.. ‘మన లెక్కలే బెస్ట్ అర్థమవుతాయి’ అనుకుంటూ వెళ్లిపోతారు. ఇక సౌందర్య దీప, కార్తీక్‌ల గురించి దిగులు పడుతూ ఉండగా.. దీపకు బహుమతిగా ఇవ్వడానికి కార్తీక్ గిఫ్ట్ పేపర్‌తో కవర్ చేసిన శ్రీశ్రీ పుస్తకం సౌందర్య కంటపడుతుంది. ‘దాన్ని తీసి పైన ఉన్న ‘దీపకు ప్రేమతో నీ డాక్టర్ బాబు’ అనేది చదివి.. ఓపెన్ చేసి.. అందులో ఉన్న పుస్తకం చూసి.. ‘అంటే ఈ గిఫ్ట్ వాడి చేతులతో దానికి ఇద్దాం అనుకున్నాడా..? ఎప్పుడు ఇద్దాం అనుకున్నాడు? ఎందుకు ఇవ్వలేదు?’ అని ఆలోచనలో పడుతుంది. బహుశా ఇదే ఆధారాన్ని కార్తీక్ ముందు ఉంచి కార్తీక్‌ని నిలదీస్తే.. దీప పవిత్రత అనే విషయం కార్తీక్‌కి ముందే తెలిసిందని బయటపడుతుంది. అప్పుడు దీప కార్తీక్ కాస్తైనా దగ్గరవుతారని ఆలోచిస్తుంది. మరోవైపు కార్తీక్ మోనిత ఇంటికి వెళతాడు. నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు అనిపిస్తోంది మోనిత అని అంటాడు. ఏ విషయం అని అడుగుతుంది మోనిత. ‘అదే.. ఇంటికి వచ్చి పదిరోజులు గడువు ఇచ్చావు కదా అంటుండగా అందులో తప్పేముంది కార్తీక్ అంటుంది. ఆ తర్వాత కార్తీక్ మన మధ్య జరిగింది అది ప్రేమతోనో, ఇష్టంతోనో కాదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. అలా అని ఏం తెలియనట్లు ఎలా ఉండమంటావని మోనిత అంటుంది. అలాగే దీప మీద ఉన్న ప్రేమతో ఇప్పుడు నాకు అన్యాయం చెయ్యాలని చూడకు కార్తీక్ అంటూ మోనిత రిక్వెస్ట్‌గా అడుగుతుంది. నా ఉద్దేశం అది కాదు అని కార్తీక్ అంటుండగా ‘నేను చెప్పిన మాటల్ని ఎందుకు సీరియస్‌గా తీసుకోవట్లేదు.. అందరి ముందు నా మెడలో తాళి కట్టి దీపకు ఇచ్చినట్లే నాకు భార్య స్థానం ఇవ్వు’ అంటుంది మోనిత. దీంతో కార్తీక్ మోనితా ప్లీజ్ అంటాడు ధీనంగా. తానేం తప్పు మాట్లాడలేదని ఎదురు తిరుగుతుంది మోనిత. అది కాదు మోనితా.. గత పదేళ్లుగా నా భార్యని నేను అనుమానించాను.. ఇప్పడు అది తప్పు అని తెలిసింది.. ఇప్పుడు ఈ టైమ్‌లో అని అంటూ కార్తీక్ ఆగిపోతాడు. దీంతో ‘దానికీ నాకు సంబంధం ఏంటీ కార్తీక్.. నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? సారీ కార్తీక్ నా వల్ల కాదు అన్నీ నీకు అనుకూలంగా ఉండాలంటే నేను అన్యాయం అయిపోతాను.. ఏం కార్తీక్.. ఇప్పుడు దీప మీద ప్రేమ కలిగింది సరే.. మరి దీపకంటే ముందు నుంచే నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే.. మరి నా మీద నీకెందుకు ప్రేమ కలగడం లేదు?’ అని కార్తీక్‌తో అంటుంది. -
karthika Deepam: నాన్న ఏదో తప్పు చేసిన వాడిలా ప్రవర్తిస్తున్నాడు..
కార్తీకదీపం జూన్ 15: దీప దీర్ఘంగా ఆలోచిస్తూ బయట కూర్చుంటే హిమ వచ్చి ఏమైందని, నువ్వు డాడీ ఎందుకలా ఉంటున్నారని ప్రశ్నిస్తుంది. ఈ లోపు అక్కడికి శౌర్య కూడా వస్తుంది. వచ్చిరాగానే ఏంటి ఇక్కడ ఉన్నారంటుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి దీపతో ఆ ఇంటి నుంచి ఎందుకు వచ్చేశావని అడగడంతో పనుందంటూ లోపలికి వెళ్లిపోతుంది దీప. ఆ తర్వాత పిల్లలిద్దరూ ‘అమ్మకు ఏమైంది? నాన్న కూడా ఈ మధ్య ఎలానో ఉంటున్నారు. ఎప్పుడు అమ్మ గురించి అడిగిన చికాకు పడే నాన్న.. నిన్న మనం అడగ్గానే తలదించుకుని ఉన్నాడు. నాతో రండి అంటూ ఇక్కడికి తీసుకువచ్చాడు. ఏదో తప్పు చేసిన వాడిలా సైలెంట్‌గా ఉంటున్నాడు’ అని అనుకుంటారు. దీంతో రౌడీ అదేంటో నేను తెలుసుకుంటా అని హిమతో అంటుంది. అయితే లోపలి నుంచి వాళ్లిద్దరూ మాట్లాడుకునేదంతా దీప వింటుంది. మరోవైపు సౌందర్య దీప ఇంట్లో నిన్న ఏం జరిగి ఉంటుందా? అని ఆలోచిస్తుంది. ఇంతలో కార్తీక్ బ్యాగ్ పట్టుకుని కిందకు వస్తాడు. శ్రావ్య కార్తీక్‌తో టిఫిన్ తీసుకురమ్మంటారా బావగారు అని అడగ్గానే.. ‘వద్దమ్మా నేను మీ అక్క ఇంట్లో.. అదే మా ఇంట్లో చేస్తాను’ అని కార్తీక్ అంటాడు. వెంటనే సౌందర్యతో ‘మీ అక్కా పిల్లలతో కలిసి మా ఇంట్లో భోజనం చేస్తాను.. ఆహా వినడానికి ఎంత సంస్కారవంతంగా ఉందిరా.. ఈ మాట చెప్పడానికి నీకు పదేళ్లు పట్టింది’ అని అంటుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటూ అవును మమ్మీ పెద్ద తప్పు చేశాను.. అదే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానని అనగానే వెంటనే సౌందర్య మరి ఆ తప్పుని(మోనిత ప్రెగ్నెన్సీ విషయం) అంటూ ప్రశ్నిస్తుంది. అలాగే సౌందర్య మాట్లాడుతూ.. చాలా బాధగా ఉంది కార్తీక్.. నిన్ను చూస్తే కాదు.. దీప, పిల్లలు గుర్తోస్తే అంటుంది. అంతేగాక పిల్లలు, దీపా పదేళ్లుగా పడిన కష్టాలను ఆమె కార్తీక్‌కు గుర్తు చేస్తుంది. ‘శౌర్య సొంత తండ్రిని నాన్న అని పిలవడానికి ఎంతలా ఆలోచిందిరా, ఇంత ఐశ్యర్యం ఉన్నా బస్తిల్లో లేనివాళ్లలా ఎన్ని కష్టాలు పడ్డారు. ఇప్పుడు నువ్వు మారిపోయి అంతా బాగుంటుందని సంతోషించే సమయానికి పెద్ద ప్రళయాన్ని సృష్టించావు. రేపు మోనితను కడుపుతో చూసి పిల్లలు ఆమె భర్త ఎవరని అడిగితే ఏం సమాధానం చెబుతవురా’ అని నిలదీస్తుంది సౌందర్య. దీంతో పరిస్థితి అంతవరకు రానివ్వను మమ్మీ అంటాడు కార్తీక్. వెంటనే సౌందర్య కోపంతో ‘పళ్లు రాలగోడతాను’ అని కార్తీక్‌పై అరుస్తుంది. మోనిత అంటే ఆడబొమ్మ కాదురా.. ఆడపల్లి ఆమె ఎలాంటిదైన కానీ ఒక మాగాడి వల్ల తల్లి అవ్వడం అంటే చిన్న విషయం కాదురా. మోనిత పొగరుదే కావచ్చు, పరాయి అడదాని భర్తను కోరుకున్నదే కావచ్చు. పదహారేళ్లుగా చూస్తున్నా మోనితా నిన్ను తప్పా మరే మగాడిని వేరే దృష్టితో చూడలేదు. నువ్వే ప్రాణంగా బతికింది. అందుకే అది ప్రమాదకారి అని ఎన్నోసార్లు హెచ్చరించిన వినలేదు. ఇప్పుడు నువ్వు ప్రమాదంలో పడ్డావు. అందరిని పడేశావు. నువ్వు ఇప్పుడు నా భార్య, పిల్లలు అంటే ఆమె ఊరుకుంటుందా? నా పరిస్థితి ఏంటని కాలర్ పట్టుకుని నిలదీస్తుంది’ అంటుంది సౌందర్య మధ్యలో మోనిత ఫోన్ చేయడంతో కార్తీక్ కట్ చేస్తాడు. అయినా పదే పదే ఫోన్ చేస్తుండటంతో కార్తీక్ ఫోన్ స్విచ్చావ్ చేస్తాడు. దీంతో మోనిత ‘నా ఫోన్ కట్ చేస్తాడా? ఇంతకు ముందు చేస్తున్నాడంటే ఒకే కానీ ఇప్పుడు నా గురించి తెలిసి కూడా కాల్ కట్ చేస్తున్నాడేంటి?’ అంటే కార్తీక్ నన్ను కట్ చేస్తున్నాడా? అలా జరగకూడదు’ అంటూ ఆవేశంతో ఊగిపోతుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తన చీర ఐరన్ చేయమని చెబుతుంది. ఇదిలా ఉండగా దీప పిల్లను తీసుకుని గుడికి వెళ్లి తిరిగి వచ్చేసరికి కార్తీక్ జనతా హాస్పిటల్ అనే బోర్డు పెట్టి ఉచిత వైద్యం అందించబడును అనే బోర్డు పెడతాడు. అది చూసి పిల్లలు దీప షాక్ అవుతారు. లోపలి నుంచి కార్తీక్ బయటకు వస్తాడు. పిల్లలు ఇక ఇక్కడే ఉంటావా నాన్నా అని అడగ్గానే ‘అవునమ్మా ఇక నుంచి ఇక్కడే ఉంటాను.. ఇక్కడే వైద్యం చేస్తాను’ అంటూ దీపను చూస్తూ సమాధానం ఇస్తాడు. ఇక పేదవారికి ఉచిత వైద్యం చేస్తానంటూ దీపతో లక్ష్మణ్‌కు ట్రీట్మ్మెంట్ చేస్తానని చెప్పి రమ్మని చెప్పుమంటాడు. దీంతో హిమ అమ్మా నువ్వు ఇప్పుడు హ్యాపీనేగా అని అడుగుతుంది. దీప మౌనంగా ఉండిపోతుంది. ఇంతలో శౌర్య నాన్న చాలా మంచివాడని తనకు చిన్పప్పుడే తెలుసని, భలబద్రాపురంలో ఉన్నప్పుడు నాన్నని క్యాంప్‌లో చూశాని అప్పటి విషయం గుర్తు చేస్తుంది. ఆ తర్వాత అప్పుడు నీతో పాటు మోనిత ఆంటీ కూడా వచ్చింది కదా నాన్నా అని శౌర్య అనగానే దీప రెండు కనుబొమ్మలు పైకి లేపి కోపంగా చూస్తుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
కార్తీక్‌కు మోనిత వార్నింగ్, 10 రోజులు డెడ్‌లైన్.. లేదంటే నీ ఫ్యామిలీ..
కార్తీకదీపం జూన్ 14: కార్తీక్ దీపతో మాట్లాడుతూ తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దీప మాత్రం కార్తీక్ వంక కోపంగా చూస్తుంటే అలా చూడకు దీప.. ఆ చూపులు తట్టుకోలేను అంటాడు. అదంతా చాటుగా హిమ, శౌర్యలు వింటారు. కానీ దీప మాత్రం కరగదు. సీరియస్‌గా ఒకటి అడుగుతా చేస్తారా? అని అంటుంది. అదేంటో.. దీప కార్తీక్ మాటలకు కరిగిపోతుందా? లేదా! అనేది నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ‘నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు.’ అంటాడు దీప కళ్లల్లోకి చూస్తూ. ‘నువ్వు, పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఏదీ ముఖ్యం కాదు దీపా.. నాకు నువ్వు కావాలి పిల్లలు కావాలి. అంతకంటే ఏమీ వద్దు దీప.. ’ అనే కార్తీక్ మాటలు విని పిల్లలు సంతోషిస్తుంటే.. దీప మాత్రం అవునా అన్నట్లు వెటకారంగా చూస్తుంది. ‘నా మాటల నమ్మనట్టుగా అలా చూడకు దీపా.. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపా.. నేను భరించలేకపోతున్నాను.. ఏదో ఒకటి మాట్లాడు.. ప్లీజ్’ అంటాడు కార్తీక్. కార్తీక్ తను ఏ తప్పు చేయలేదు నమ్ము దీప అని ప్రాధేయపడ్డ కూడా దీప కరగదు. దీంతో కార్తీక్ ‘నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం తిట్టు దీపా.. మనసులోని ఉన్న కోపాన్ని మాటల ద్వారా చూపించి నీ కసి తీర్చుకో’ అంటాడు. దీంతో దీప ఒక మాట అడుగుతాను చేసిపెడతారా? అని అడుగుతుంది. దీంతో కార్తీక్ సంబరపడిపోతూ నువ్వు నోరు తెరిచి అడిగావ్ అది చాలు నాకు.. నువ్వు ఏం అడిగిన సరే అది చేసి పెడతాను.. చెప్పు ఏం చెయ్యమంటావు ఈ దేశాన్నే వదిలి విదేశాలకు వెళ్లిపోదామా? అని అంటాడు. ‘నీకు ఏ దేశమంటే ఇష్టమో చెప్పు పిల్లలని తీసుకుని అక్కడే సెటిలైయిపోదాం.. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోదాం. మనమిద్దరం మనకిద్దరు అన్నట్లు బతుకుదాం’ అంటాడు. దానికి దీప అప్పుడు మోనితకి అన్యాయం చేసినట్లు అవుతుందిగా.. నేను మన సంగతి మాట్లాడటం లేదు.. మాట్లాడను కూడా అంటూ సరోజక్క మరిది లక్ష్మణ్ విషయం అడుగుతుంది. మీ చెయ్యి మీ మనసు మంచిదని నమ్ముతున్నాడు అంటుంది. ఆ నమ్మకాన్ని పోనివ్వకూడదని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నమ్మకాన్ని నిలబెడతారా? మిమ్మల్ని దేవుడు అన్నాడు. వైద్యం చేస్తారా? అతడిని మీ దగ్గరకు పంపించమంటారా? అంటుంది దీప. దీంతో కార్తీక నిరాశగా లేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు సౌందర్య, ఆదిత్య, శ్రావ్యలు కార్తీక్ పిల్లల్ని తీసుకుని తీసుకొస్తాడని నిద్రపోకుండా ఎదురు చూస్తుంటారు. ఆదిత్య కార్తీక్ చేసిన తప్పు గురించి ఎత్తడంతో సౌందర్య కార్తీక్ వైపే మాట్లాడుతుంది. దీంతో ఆదిత్య నేను తప్పుగా అన్నానా మమ్మీ, అన్నయ్య తప్పు చేయలేదంటావా? అని ప్రశ్నించగా సౌందర్య ‘నేను తప్పు కాదు అనడం లేదురా వాడు తిరగబడి నా ఇష్టం అనట్లేదుగా. చేసిన తప్పుకు పశ్చాతాప పుడుతున్నాడు, సిగ్గుతో తలవంచుకుంటున్నాడు. అందుకే వాడంటే జాలి కలుగుతోంది’ అంటుంది బాధగా. కార్తీక్ నిద్రపోతున్న హిమ, శౌర్యను లేపి ఎక్కడ ఉంటారని అడగ్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అని సమాధానం ఇస్తారు. దీంతో నేను వెళ్లి మీ బట్టలు తెస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఇక తెల్లారి హిమకు ఏదో వాసన రావడంతో మెలుక వస్తుంది. కిచెన్‌లోకి వెళ్లి చూడగా పాలన్నీ పొంగి కింద వరకూ ఒలిగిపోతాయి. అది చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తుంది హిమ. దీప బాధగా బయట కూర్చుని ఉండటం చూసి దగ్గరికి వెళ్లి ‘అమ్మా నీకు ఏమైంది. నాన్న మీద ఎందుకు కోపం’ అని అడుగుతుంది. తరువాయి భాగంలో.. మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా పదోరోజులోగా నాకు సరైన సమాధానం, నాకు న్యాయం జరిగే నిర్ణయం రాకపోతే.. మొత్తం నీ ఫ్యామిలీ గడగడా వణికిపోయేలా చేస్తాను బీ రేడి అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. -
హిమ తర్వాత అంతగా నేను ప్రేమించింది నిన్నే దీప: కార్తీక్
కార్తీకదీపం జూన్ 12: అమ్మని మళ్లీ తిట్టి పంపేశావా డాడీ, అమ్మ అంటే నీకు జాలి లేదా?’ అంటూ ఎమోషనల్‌గా ప్రశ్నిస్తుంటారు పిల్లలు. దీంతో నాతో రండీ అని పిల్లల్ని తీసుకుని దీప ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. ఇక మోనిత తన ఫోన్లో పిల్లల ఫొటోలు చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి పాలు తీసుకుని రావస్తుంది. అవి తాగుతూ.. ‘కడుపుతో ఉన్నాను కదా కాస్త కారం, ఉప్పు, మసాలాలు తగ్గించు’ అంటుంది. సరేనమ్మ అన్న ప్రియమణి అనుమానంగా ‘మీరు నిజంగానే కడుపుతో ఉన్నారా? లేక నాటకం ఆడుతున్నారా’ అనడంతో మోనిత ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ‘ఏం మాట్లాడుతున్నావే. ఈ విషయంలో నేనేందుకు అబద్దం ఆడతాను, నేను కడుపుతో ఉన్నాననేది నిజం.. నా ఈ కడుపుకి మీ కార్తీక్ అయ్యే కారణం అన్నది ఇంకా పచ్చినిజం’ అటూ ఆవేశ పడుతుంది మోనిత. మరోవైపు దీప పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండగా హిమ, శౌర్య అమ్మా.. అంటూ వచ్చి ఆనందంగా పట్టుకుంటారు. వెంటనే గుమ్మం దగ్గరే ఆగిపోయిన కార్తీక్‌ని చూసి ‘పిల్లలు రాగానే నన్ను అడిగి ఉంటారు.. నా దగ్గర వదిలపెట్టడానికి తీసుకొచ్చి ఉంటారు’ అని మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి మళ్లీ ఎందుకచ్చావమ్మా నాన్న నిన్ను ఏమైనా అన్నాడా? అని పిల్లలు అడగ్గా దీప నాకెందుకో అంతపెద్ద ఇంట్లో కంఫర్ట్‌గా ఉండటం లేదని సమాధానం ఇస్తుంది. వెంటనే హిమ బాధగా.. ‘మరి డాడీకి ఇక్కడ కంఫర్ట్‌గా ఉండరు కదమ్మా’ అని అనగానే దీప కోపంగా కార్తీక్‌వైపు కళ్లు తిప్పి ‘ఆయనకి ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే.. అక్కడుండొచ్చు’ అంటుంది. దీంతో కార్తీక్ వెంటనే మీ అందరితో కలిసి తను ఇక్కడే ఉంటానని అంటాడు. ఆ తర్వాత కార్తీక్‌తో దీపతో కాస్తా మాట్లాడాలని చెప్పి పిల్లలను పడుకొమ్మంటాడు. అయితే కార్తీక్ భోజనం చేశావా? అని అడగ్గానే తిన్నాని అబద్ధం చెబుతుంది దిప. ఇదిలా ఉండగా మోనితకు తను పురిటినొప్పులతో చనిపోయినట్లు పిడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఇలాంటి పీడకల వచ్చిందేంటని కంగారు పడుతుంది. అన్నట్టు చనిపోయినట్లు కలొస్తే మంచి జరుగుతుంది అంటారు కదా.. నాకూ మంచే జరుగుతుంది. అయినా నేను అంత త్వరగా ఎందుకు చస్తాను.. నా కార్తీక్‌తో సంతోషంగా ఉంటాను అనుకుంటూ పడిపడి నవ్వుకుంటుంది. వెంటనే కార్తీక్ వంటగదిలోకి వెళ్లి గిన్నెలో అన్నం ఉండటం చూసి దీప తినలేదని తెలుసుకుంటాడు. దీపతో మాట్లాడాలని హాల్‌కు తీసుకుని వస్తాడు కార్తీక్. అన్నం పెట్టుకుని కలుపుతూ దీపను తినమన్నట్లు ముద్ద పెడతాడు. కానీ ఆమె సీరియస్‌గా చూసేసరికి చేయి తీసుకుని దీప చేతిలో అన్నం ముద్ద పెడతాడు. ప్లీజ్ తిను దీప అని చెప్పడంతో ఆమె తింటుంది. కార్తీక్ అన్నం కలుపుతూ ‘నేను నటించడం లేదు దీపా.. నా కసలు నటించడం చేతకాదు.. మనసుకి అనిపించింది పైకి అనేస్తాను.. లోలోపల ఏది దాచుకోను. కార్తీక్ అంటే కచ్చితం.. కార్తీక్ అంటే స్పష్టత’ అని తన క్యారెక్టర్ ఏంటో దీపకు చెప్పాలనుకుంటాడు. ఇక కార్తీక్ కాలేజీ రోజుల్లో హిమను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానని, ఆ తర్వాత అంతగా ప్రేమించింది నిన్నే దీప అని చెబుతాడు. ‘హిమ చనిపోయాక కొన్నాళ్లు పిచ్చొడిని ఆయ్యాను, జీవితంలో ఇక పెళ్లి అనే మాటే లేదు అనుకున్నాను నిన్ను చూసేదాక.. నీ ఆత్మ సౌందర్య నాకు నచ్చి.. హిమ తర్వాత నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్నే. నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించదని తెలిసినా నీ మెడలో తాళి కట్టాను.. నెమ్మదిగా కన్విన్స్ చెయ్యొచ్చు అనుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు’ అంటూ దీప కళ్లలోకే చూస్తూ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
దీప ఇంట్లో లేదని కనిపెట్టిన శౌర్య, కార్తీక్‌ను నిలదీసిన హిమ..
కార్తీకదీపం జూన్ 11: హిమ, శౌర్యలు ఇంటికి తిరిగి వస్తారు. వారిని చూసి అంతా షాక్‌లో ఉండిపోతారు. అది గమనించిన పిల్లలు మీలో మేము వచ్చి ఆనందంగా కనిపించకపోగా అప్పుడే ఎందుకొచ్చారా? అన్నట్టు చూస్తున్నారని ప్రశ్నిస్తారు. కాసేపటికి అమ్మ కనిపించడం లేదని అడగ్గానే అందరు ఒకరి మొహలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(జూన్ 11వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడగ్గానే అందరు కంగుతింటారు. ఆ తర్వాత సౌందర్య ముందు ఫ్రెష్ అయ్యి రండి అనడంతో శ్రావ్య బ్యాగ్స్ తీసుకుని పిల్లల్ని పైకి తీసుకుని వెళుతుంది. హిమ మాత్రం కార్తీక్‌నే గమనిస్తూ వెనక్కి వచ్చి ఏం అయ్యింది డాడీ బాగా డల్‌గా కనిపిస్తున్నావని అడగ్గా.. ‘మీ మీద బెంగ పెట్టుకున్నాడే.. ప్రశ్నలు ఆపి వెళ్లు’ అని సౌందర్య పంపిస్తుంది. దీంతో కార్తీక్ కాస్త రిలాక్స్ అవుతాడు. మురళీ కృష్ణ దీప ఇంటి నుంచి తిరిగి వచ్చి అన్ని మర్చిపోయి కార్తీక్‌తో ఉండమని, కాపురం చక్కదిద్దుకొమ్మని చెబుతామనుకుంటే అసలు ఆ విషయమే నాతో చెప్పనివ్వలేదంటూ సలహాలు ఏం ఇవ్వద్దు నాన్నా తినేసి వెళ్లు అందని భాగ్యంతో చెబుతూ బాధపడతాడు. దాంతో భాగ్యం ఆ మోనిత అనుకున్నది మాత్రం సాధించింది అంటూ తిట్టిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత ఇంట్లో వాంతులు (వేగుళ్లు) చేసుకుంటుంది. ప్రియమణి చెవులు మూసి సాయం చేస్తుంది. ఆ తర్వాత మీది ఎవరి పోలిక అమ్మాని మోనితని అడుగుతుంది. మోనిత.. నవ్వుతూ ‘ఈ ప్రపంచంలో నాకు ఎవరితో పోలికే లేదే. నేనో స్పెషల్ అంతే.. కాకపోతే ఇంకా ఆరో నెలల్లో నా పోలికలతోనే మరో ప్రాణి ఈ భూమ్మిద పడదుతుంది’ అంటు మురిసిపోతుంది. దీప సరోజక్క మరిది లక్ష్మణ్ గురించి అతడి రిక్వస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో సరోజక్క వచ్చి ఆమె మరిది లక్ష్మణ్ వచ్చిన విషయం గరించి అడుగుతుంది. ‘అది నువ్వేమీ పట్టించుకోకు దీప, డక్టర్ బాబు, నువ్వు బాగుంటే ఇక్కడకి నువ్వేందుకు వస్తావు. అది కూడా ఆలోచన లేని అమాయకుడు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నువ్వు డాక్టర్ బాబుతో ఏం చెబుతావు? పక్క మనిషి గురించి పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో.. అన్నింటికీ సిద్ధపడే ఉండాలి. అందరితో పాటే ఇతడు కూడా భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే.. బతుకుతాడు. లేదంటే లేదు. పాపం మా చెల్లెల్ని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. సరేలే నువ్వేం ఆలోచించకు. వస్తాను దీపా’ అంటూ వెళ్లిపోతుంది. ఇక సరోజక్క వెళ్లగానే దీప లక్ష్మణ్‌కి వైద్యం చేయించమని డాక్టర్ బాబుతో చెప్పాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో.. ఈ టైమ్‌లో ఈ గోలంతా ఏంటీ అంటారా? అంటూ ఆలస్యం చేయకుండా లక్ష్మణ్ విషయం ఎలగైనా ఆయనకు చెప్పాలని మనసులో అనుకుంటుంది. ఇదిలా ఉండగా శౌర్య తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప గదికి వెళ్లి ఆమె బ్యాగు, కబోర్డ్‌లో బట్టలు చూస్తుంది. అవి ఉండకపోయేసరికి అమ్మ ఇంట్లోంచి మళ్లీ వెళ్లిపోయింది అని తెలిసి ఏడుస్తుంది. అసలు ఎందుకు వెళ్లిందని, నాన్న ఏమైనా అన్నాడా? నాన్న తిట్టి అమ్మను పంపిచాడా? అసలు ఎక్కడ ఉన్నావమ్మా అంటు కుమిలి కుమిలి ఏడుస్తుంది. వెంటనే కార్తీక్‌ని నిలదీయడానికి వెళుతుంది. సరిగ్గా అప్పుడే హిమ తల్లి గురించి కార్తీక్‌ని, సౌందర్యని నిలదీస్తుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన శౌర్య ‘లేదు హిమా.. అమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది’ అంటుంది. ఆ తర్వాత శౌర్య, హిమలు ఏడుస్తూ అమ్మ ఎక్కడికి వెళ్లిందని, నువ్వే పంపించావా నాన్న? అంటు రకరకాల ప్రశ్నలు వేస్తూ కార్తీక్‌ను నిలదీస్తారు. ఏం సమాధానం చెప్పలేక కార్తీక్ తల దించుకుంటాడు. -
కార్తీక్‌ని మాటలతో చంపేసిన సౌందర్య, చివరికి ట్విస్ట్ ఏంటంటే..
కార్తీకదీపం జూన్ 10: దీపను ఇంటికి తీసుకువద్దామని వెళ్లిన కార్తీక్‌కు నిరాశ ఎదురైంది. కార్తీక్ మాట్లాడుతున్న పట్టించుకోనట్లుగా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ కార్తీక్ తప్పు చేశాడన్న విషయాన్ని నమ్ముతున్నట్లు చెప్పకనే చెబుతుంది. దీంతో కార్తీక్ బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వస్తాడు. మరోవైపు మోనిత వీడియో మెసెజ్ పంపి బుల్లి కార్తీక్ పుడతాడంటు మురిసిపోతుంది. కార్తీక్ తన తప్పుకు కుమిలిపోతు బాధతో మేడపైకి వెళ్లగా అప్పటికే సౌందర్య అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్ మేడపైకి వెళ్లగా అక్కడ సౌందర్యను చూసి తలదించుకుని వెనక్కి తిరుగుతాడు. కొడుకుని చూసి సౌందర్య పెద్దోడా.. ఇలా రా అని పిలిసి ‘నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు.. నా కొడుకు యోగ్యుడు, శ్రీరామచంద్రమూర్తి అని మురిసిపోయేదాన్ని. నీ దగ్గర నుంచి ఇది ఊహించలేదురా’ అంటుంది సౌందర్య బాధగా. దీంతో కార్తీక్ తను కూడా ఇది ఊహించలేదు మమ్మీ అంటూ ధీనంగా మొహం పెడతాడు. సౌందర్య ప్రతి ఒక్కరిలోనూ దైవత్యమూ ఉంటుంది రాక్షత్వమూ ఉంటుంది. కానీ బలహీనక్షణాల్లో కూడా లోపలి రాక్షసుడ్ని బయటికి రానివ్వని వాడినే సంస్కారవంతుడు అంటు కార్తీక్‌తో నా కొడుకు సంస్కారవంతుడు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఒక మామూలు మగాడివే అని నిరూపించుకున్నావు అంటుంది. అంతేగాక నీలో అనుమానం తప్ప ఇంకేలోపం లేదని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దీప గర్వంగా తల ఎత్తుకుంది, నువ్వు తలదించుకుని పాతాళానికి దిగజారవు అంటు మట్లాడుతుంది సౌందర్య. అలాగే మీ నాన్నగారు ఫోన్ చేసి పిలలు ఇంటికి వెళ్లిపోదామంటు గోల చేస్తున్నారని చెప్పారు, ఇవాళ రేపో వాళ్లు వస్తే అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం ఇస్తావని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు దీప ఏ తప్పు చేసిందని నిందించావో, దూరం పెట్టావో అదే తప్పు నువ్వు చేశావని పిలలతో చెప్పగలవా? ఈ సారి కాలుష్యం నావైపు వీచింది అని చెబుతావా? ఏం చెప్పాలో తెలియక తప్పు వాళ్ల అమ్మ మీదకు మాత్రం నెట్టకురా.. ఆడవాళ్లంటే నీకు లోకువ కదా.. మగబుద్ధి చూపిస్తావేమోనని చెబుతున్నాను అంటు మాటలతో కార్తీక్‌ను బాధపెడుతుంది సౌందర్య. ఒకవేళ పిల్లలను తీసుకురాకని మీ నాన్నతో చెబితే ఆయన ఎందుకని అడిగితే ఏం చెప్పాలి, మళ్లీ మీరు తాత కాబోతున్నారని నువ్వు చేసిన ఘనకార్యం చెప్పమంటావా? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్ వెంటనే సౌందర్య చేతులు పట్టుకుంటాడు. సౌందర్య ‘భయపడకు కార్తీక్.. చెప్పనులే.. అంతటి శుభవార్త విని ఆయనకు ఏదైనా అయితే భరించాల్సింది నేనే కదా.. నాకంత ధైర్యం లేదు కార్తీక్’ అంటూ సౌందర్య ఏడుస్తుంటే కార్తీక్ కూడా ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.కార్తీక్ తన పాపానికి ప్రాయిశ్చిత్తం లేదని, ఒక పవిత్రమూర్తిని ఏ విషయంలో క్షోభపెట్టానో వాస్తవానికి ఆ నేరం తాను చేసినందుకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తోందంటు ప్రశ్చాతాప పడతాడు. ఈ నరకం అనుభవించే కంటే ఒక్కసారిగా ప్రాణం పోతే బాగుంటుందనిపిస్తోంది మమ్మీ.. నన్ను చంపెయ్ మమ్మీ అంటాడు కార్తీక్. కానీ ఒక్కటి మాత్రం నిజం మమ్మీ.. ఇది ఏదో పొరపాటువల్ల జరిగింది కానీ దీప మీద ప్రేమ లేకో.. మోనిత మీద మోజుతోనూ కాదు నన్ను నమ్ము మమ్మీ.. కోడలు తప్పు చేసిందంటేనే నమ్మని దానివి.. కొడుకు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేశాడంటే నమ్ముతున్నావా అని ధీనంగా అడిగే సరికి సౌందర్య మనసు కాస్త కరుగుతుంది. ‘నువ్వు కావాలని ఈ తప్పు చెయ్యలేనది నేను నమ్ముతాన.. కానీ అది అక్కడ అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుకుని ఉందిరా.. బలహీన క్షణంలో నిన్ను రెచ్చగొట్టి ఉండొచ్చు.. కానీ తప్పు తప్పే కదా కార్తీక్.. ఏదో చిన్న తప్పు అని చెరుపేసుకోలేం కాదుకదా.. ఆ మోనిత మంచిది కాదురా కాపురంలో నిప్పులు పోసే ఆడదిరా అలాంటి వారికి దూరంగా ఉండరా ఎంతటి నీచానికైనా దిగజారుతుందిరా అని నేను నీ భార్య చిలక్కి చెప్పినట్లు చెప్పాం. కానీ నువ్వు పెడచెవిన పెట్టావు. చివరికి ఫలితం అనుభవిస్తున్నావు’ అంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా దీప సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. గతంలో డాక్టర్ బాబు తన వైద్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తాడు. మళ్లీ తనకు కాస్త నీరసం పెరిగిందని, కార్తీక్ దగ్గర వైద్యం ఇప్పించాలని కోరతాడు. దీంతో తనకు కొంచం టైం కావాలంటుంది దీప. సరేనంటు అతడు వెళ్లిపోతాడు. కార్తీక్, సౌందర్య భోజనం చేస్తుంటే సడెన్‌గా శౌర్య, హిమలు వస్తారు. వారిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో పిల్లలు మేము ఎందుకు వచ్చామా అన్నట్లు చూస్తున్నారెంటి, మేము ఇంతా ఆనందంగా ఉంటే అంటు ప్రశ్నిస్తారు. దీంతో సౌందర్య వాళ్లకు ఏదో చెప్పి నచ్చజెబుతుంది. ఆ తర్వాత అమ్మ ఏది అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
బుల్లి కార్తీక్ పుడతాడంటూ.. కార్తీక్‌కు మోనితా వీడియో మెసెజ్
కార్తీకదీపం జూన్ 9: దీప ఇంట్లో నుంచి వెళ్లిపోయి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. ఇంటికి వచ్చేసరికి దీప ఇంట్లో లేదని తెలుసుకున్న సౌందర్య, ఆదిత్యలతో మీరు ఆపలేదా? అని అడగ్గా ఏందుకు ఉండాలి ఇక్కడ? అని ప్రశ్నిస్తుంది సౌందర్య. దీంతో అసలేం జరిగిందో కార్తీక్ చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ సౌందర్య వినిపించుకోకుండా... ఇది నాకు కాదు నీ భార్యకు, నీ వల్ల గర్భవతి అయిన ఆ మోనితకు అంటుంది. ఇక కార్తీక్ దీపను తీసుకురావడానికి శ్రీరాంనగర్ బస్తీకి వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(మంగళవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. దీప శ్రీరామ్ నగర్ బస్తీలో ఇంటి ముందు నిలబడి ఆలోచిస్తూ ఉంటే వారణాసి ఇళ్లంతా కడుగుతూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ వచ్చి దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. వారణాసితో మీ అక్క నాతో ఇంటికి వస్తుందని చెబుతాడు. దీంతో దీప వెంటనే వద్దులే డాక్టర్ బాబు ఎవరు ఎక్కడుండాలనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు.. మీరు నేను కాదు అంటుంది. కార్తీక్ ఏం మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా.. దీప మాట దాటేసే ప్రయత్నం చేస్తుంది. ‘అసలు నీ మనసులో ఏం ఉంది దీపా? నన్ను నువ్వు అనుమానిస్తున్నావా? ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు’ అంటు వివరిస్తుంటాడు. కానీ దీప వినదు. కుర్చీ వెయ్యనా.. భోజనం చేశారా? అంటూ పొంతన లేని సమాధానాలిస్తూ, ఆ విషయం అనవసరం అన్నట్టు ప్రవర్తిస్తుంది. అయినా కార్తీక్ చెప్పే ప్రయత్నం చేస్తుంటే వారణాసిని అడ్డు పెట్టుకుని ‘ఇక చాలు వారణాసీ.. ఎంతసేపు కడుగుతావు.. వదిలెయ్’ అంటు కార్తీక్ వైపు కోపంగా చూస్తుంది. దీంతో కార్తీక్ తనని అర్థం చేసుకునే అవకాశమే లేదని అర్థమైందని తలదించుకుంటాడు. ‘నన్ను క్షమించే ప్రసక్తే లేదని క్లియర్‌గా తెలుస్తోంది.. నీకంటే నేనే దురదృష్టవంతుడ్ని దీపా.. నీకంటే ఎక్కువగా నేనే నష్టపోయాను’ అంటు పశ్చాత్తాపపడతాడు కార్తీక్. అయినా దీప తన తీరు మార్చుకోకుండా ‘మంచి నీళ్లు కూడా తేవాలి వారణాసీ’ అంటుంది. సీన్ వారణాసికి కూడా అర్థమై బాధగా, మౌనంగా చూస్తాడు. ఇక కార్తీక్ వెళ్లొస్తాను అని ముందుకు కదలడంతో భోజనం చెయ్యరా? అని అడుగుతుంది దీప. నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని కార్తీక్ అనగా.. ‘ఈ ఇంట్లో అయినా..ఆ ఇంట్లో అయినా.. మరింకెక్కడైనా భోజనం మాత్రం మానకండి’ అని దీప సమాధానమిస్తుంది. కార్తీక్ తప్పు చేశాడని తాను కూడా నమ్మతున్నట్లు చెప్పకనే చెబుతుంది దీప. మురళీ కృష్ణ దీప గురించి బాధపడుతుంటే.. భాగ్యం వచ్చి దీప జీవితం నిలబడే మార్గం ఒకటుందయ్యా అంటూ.. ‘అల్లుడు తప్పు చేశాడని దీప తనతో తెగతెంపులు చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు.. ఆ మాటకొస్తే నీ మొదటి పెళ్లాం చచ్చిపోతే నువ్వు నన్ను రెండో పెళ్లి చేసుకోలేదా? నేను నీతో కాపురం చెయ్యట్లేదా? ఇదీ అంతేనయ్యా.. కాకపోతే దీప ఉండగానే మోనితకి కడుపు చేశాడు.. ఇప్పుడు గొడవలకు పోయి జీవితం నాశనం చేసుకోవడం కంటే.. రాజీ పడి కలిపోవడం మేలు.. లేదంటే జీవితాంతం బాధపడుతూనే ఉంటుంది. కొంచెం ఆలోచించయ్యా’ అని సలహా ఇస్తుంది భాగ్యం. అది విని మురళీ కృష్ణ నిజమే అంటూ ఆలోచనలో పడతాడు. కార్తీక్ తన రూమ్‌లో జరిగిందంతా తలుచుకుని కుమిలిపోతూ.. ఆ రోజు రాత్రి మోనిత ఇంట్లో డ్రింక్ చేసిన సీన్ గుర్తు చేసుకుని.. అద్దంలో తనని తాను చూసుకుంటూ తిట్టుకుంటాడు. ‘బుద్ది లేదా రా నీకు.. ఎంత క్లోజ్ ఫ్రెండ్ అయితే ఒక ఆడపిల్ల ఇంట్లో డ్రింక్ చెయ్యడమేంట్రా.. ముందు కొడితే.. సంస్కారం ఏం అయిపోయింది.. మమ్మీ ఎప్పుడూ అంటుంది నువ్వు స్టుపిడ్ అని.. నిజంగానే నేను స్టుపిడ్‌ని..’అని తిట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే మోనిత ఓ వీడియో మెసెజ్ పంపిస్తుంది. ఇంతలో మోనిత కార్తీక్‌కు వీడియో మెసేజ్ పంపిస్తుంది. ‘హాయ్ కార్తీక్.. ఎలా ఉన్నావ్.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆడా? మగా? అని డౌట్ వచ్చింది. నేను గైనకాలజిస్ట్ కాబట్టి స్కాన్ చేసి ఈజీగా తెలుసుకోవచ్చు. కానీ అది నేరం.. అయినా డెలివరీ అయ్యేదాకా ఆగితేనే థ్రిల్ అంటుంది. ఇంతకీ నీకు ఎవరు కావాలి పాపా? బాబా? పాప వద్దులే.. ఆల్ రెడీ మనకు ఇద్దరున్నారు కదా.. మనకు బాబే కావాలి. దేవుడ్ని నేను అదే కోరుకుంటాను.. బుల్లి కార్తీక్‌ని ఇవ్వమని.. ఐ లవ్ దట్ ఫీలింగ్ బై' అంటుంది వీడియోలో. అది చూసి కార్తీక్ తలపట్టుకుని మరింత కుంగిపోతాడు. మోనిత మాత్రం సంబరపడిపోతూ ‘ఇదేంటి కార్తీక్ నా మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదు..నన్ను దూరం పెడుతుతున్నాడా? అంటే కార్తీక్ కూడా కొంత మంది మగాళ్లలా అవసరం తీరాక వదిలెయ్యాలనుకుంటున్నాడా? అని ఓ సెకన్ కంగారుపడుతుంది. కానీ అంతలోనే నా కార్తీక్ అలా చేయడు. ఏదో కంగారులో ఉండి సమాధానం ఇవ్వలేదనుకుంటా’ అంటూ సరిపెట్టుకుంటుంది మోనిత. -
kathika Deepam: తప్పు చేశావంటు మోనితను నిలదీసిన కార్తీక్..
కార్తీకదీపం జూన్ 7: మోనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి వెళ్లిపోతుంది. మురళీ కృష్ణ దీపకు అన్యాయం జరిగిందనే బాధలో కార్తీక్‌ని కడిగిపాడేస్తాడు. ఆ తర్వాత దీపను వీళ్ల దగ్గర ఉండోద్దని, మన ఇంటికి పొదామని చేయి పట్టుకుంటాడు. మరీ దీప వెళుతుందా? కార్తీక్ మోనిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నాడో నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. మురళీ కృష్ణ వెళ్లిపోదాం పదమ్మా అని దీప చేయి పట్టుకోగానే ఆమె కార్తీక్, సౌందర్యల వంక చూస్తుంది. ఆ తర్వాత తండ్రి చేయిని విడిపించుకుని దండం పెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నట్లు చేయి చాచి చూపింది. దాంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్లగానే కార్తీక్, దీపల ఫొటో కనిపిస్తుంది. అది నేలపై విసిరికొట్టి కోపంతో రగిలిపోతుంటాడు. భాగ్యం ఏమైందిని అడగ్గా జరిగిన విషయం చెబుతాడు. దీనికి భాగ్యం కూడా ‘నువ్వు చేసిందే కరెక్ట్ అయ్యా.. నేను కూడా రావాల్సింది మోనితను, అల్లుడిని కలిపి కడిగిపారాశేదాన్ని’ అని కోపంగా అంటుంది. మరోవైపు కార్తీక్ మోనిత దగ్గరికి వెళతాడు. అక్కడ ‘తప్పు చేశావ్ మోనిత తాగిన మైకంలో నేను ఏదో తప్పు చేయబోతే కనీసం నువ్వైనా నా చెంపలు చెడామడా కొట్టి ఆపాల్సింది కదా. నువ్వు తప్పు చేసిందే కాక నాతో కూడా తప్పు చేయించావు’ అని అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో మోనిత ‘అదేంటి కార్తీక్ తప్పు అంతా నేను చేసినట్లు మాట్లాడుతున్నావు. నువ్వే కదా హిమను తీసుకువస్తే పెళ్లి చేసుకుంటా అన్నావ్, హిమ వచ్చింది. కానీ నువ్వు పెళ్లి ఊసే ఎత్తలేదు. పైగా వెత్తుక్కుంటు నువ్వే వెళ్లి నీ భార్య, పిల్లలని తెచ్చుకున్నావు’ అంటుంది. అంతేగాక అయినా ఆ రోజు నిన్ను వద్దంటు ఆపాను కానీ నువ్వు పెళ్లి చెసుకుంటానని చెప్పావు అని చెబుతుంది. అలాగే.. ‘పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తూ మరో మగాడికి నా మనసులో చోటు ఇవ్వలేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నాకు నువ్వు పెళ్లి చేసుకుంటా అనేసరికి ఉప్పోంగి పోయాను. అందుకే నిన్ను దూరం పెట్టలేక నన్ను నేను అర్పించుకున్నానంటూ కన్నీరు పెట్టుకుని దీపలా నన్ను వదిలేయకు కార్తీక్ నీకు దండం పెడతాను’ అంటూ కార్తీక్ కాళ్లపై పడుతుంది. కార్తీక్ అలానే షాక్‌లో చూస్తూ, భారంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదిలా ఉండగా.. దీప ఒంటరిగా కూర్చుని పూజ రోజు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటుంది. కార్తీక్ పెద్ద తప్పు చేశానని, సరిదిద్దుకోలేని నేరం చేశాను అంటు దీప కాళ్లు పట్టుకోబోయింది, మోనిత ప్రెగ్నెంట్ అనగానే షటప్ అంటు తిట్టు పంపిచింది అంతా తలచుకుంటుండగా అక్కడికి సౌందర్య వస్తుంది. కొడుకు చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడుస్తూ ఇన్నాళ్లు దీప పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంటుంది. వాడు నువ్వు ఏ తప్పు చేయాలేదని నిరూపించుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిపోయావు, గుడి దగ్గర ప్రసాదాలు తిని బతికావ్.. చివరకు నమ్మే సమయం వచ్చిన అది ఇంత నీచంగానా? వీడి వల్ల ఆ మోనిత కడుపు పండితే నీ సంతానం వాడి సంతానమని నమ్మడమా? ఏంటిది అంటూ దీప భుజంపై వాలి ఏడుస్తుంది. -
karthika Deepam: మోనితపై కార్తీక్ ఫైర్, నీ నిజస్వరూపం ఇప్పుడు తెలిసింది..
కార్తీకదీపం జూన్ 5: కార్తీక్ దీప కాళ్లు పట్టుకుని, నిజం చేప్పేలోపే మోనిత వచ్చి కథ అంతా మారుస్తుంది. తాను గర్భవతిని అని దీవించండి అంటూ సౌందర్యతో అంటుంది. అది విన్న వారంత ఒక్కసారిగా షాక్ అవుతారు. మరీ మోనిత చెప్పింది నమ్ముతారా! మరీ దీప ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నదనేది నేటి(శనివారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. నేను నెల తప్పాను ఆంటీ అని చెప్పగానే సౌందర్య కోపంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్’ అంటుంది ఆవేశంగా. ‘ఇంత చెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ..? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అంటుంది మోనిత. దాంతో అంతా షాక్ అవుతారు. వెంటనే కార్తీక్ కోపంగా ‘స్టాపిట్ మోనితా.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? మతి ఉండే మాట్లాడుతున్నావా? ఇది జోక్ చేసే విషయమా? నీ గురించి అమ్మా దీపా ఎప్పుడు చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పుడు ళ్లారా చూస్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పిలవని పేరంటంలా వచ్చేస్తావ్.. రసాబస చెయ్యాలని చూస్తావ్.. నువ్వు నా ఫ్రెండ్‌వా శత్రువ్వా.. ఎందుకింత దారణంగా మాట్లాడుతున్నావ్?’ అంటాడు ఆవేశంతో ఊగిపోతూ. వెంటనే మోనిత నిజం మాట్లాడుతున్నాను కార్తీక్ అంటు ఎమోషనల్ డ్రామా ప్లే చేస్తుంది. అందరిని నమ్మించేందుకు కార్తీక్ పురషాహంకారం చూపించుకుంటున్నావా ఆడదంటే అంత అలుసా? ప్రెగ్నెంట్ అని అబద్దం చెబుతున్నా అనుకుంటే అది దాస్తే దాగే విషయమా? అంటుంది. పోనీ నా ప్రెగ్నెన్సీకి నువ్వు కారణం కాదంటావా? రేపు డీఎన్ఏ టెస్ట్ చేయిస్తే అది కూడా బటయపడుతుంది కదా.. ఏ ఆడదైనా ఈ విషయంలో అబద్దం చెబుతుందా కార్తీక్.. ఆ దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను.. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు నువ్వే కారణం. నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్ కార్తీక్.. అది అబద్దం అని ఇవాళ నా వల్ల నిర్ధారణ అయ్యింది’ అంటుంది మోనిత. దీప బాధగా తలవంచి నిలబడగా.. మోనిత దీపని చూసి లోలోపల నవ్వుకుంటూ దీపతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ‘నన్ను క్షమించు దీప కార్తీక్ నీ విషయంలో తప్పు జరిగిందని గట్టిగా నమ్మేసరికి.. ఒక ఫ్రెండ్‌గా అతడ్ని సపోర్ట్ చేశాను.. సాటి ఆడదానిగా నీకు అన్యాయం చేశాను.. నువ్వు కళంకితవు కాదు.. పరమ పవిత్రురాలు.. కార్తీక్ ఒక్క క్షణం కాదంటేనే నేను భరించలేకపోయాను. నువ్వు 10 ఏళ్ల పాటు ఈ నింద నువ్వు ఎలా తట్టుకున్నావో ఎలా మోశావో ఊహిచడం నావల్ల కాదు. నువ్వు చాలా గ్రేట్ దీపా హ్యాట్సాప్ టు యూ’ అంటూ దొంగ ఏడుపు ఏడుస్తుంది. ఇక సౌందర్య వైపు తిరుగుతుంది. ‘మీరు చాలా మంచివారు ఆంటీ.. కొడుకు మాట కూడా నమ్మకుండా కోడలికి సపోర్ట్ చేసిన గొప్ప వ్యక్తిత్వం మీది.. నేను ఆడపిల్లనే నాకు ఎలాంటి న్యాయం చేస్తారో మీరే ఆలోచించి మీ అబ్బాయికి చెప్పండి.. ఇంకా మీకు ఎవరికీ నమ్మకం కుదురకపోతే.. ఇదిగో నా ప్రెగ్నెన్సీ రిపోర్ట్’ అని దేవుడు దగ్గర పెట్టి వెళ్లిపోతుంది. మోనిత వెళ్లిపోగానే మురళీ కృష్ణ పెద్దగా నవ్వుతూ.. ‘దీన్ని ఏం అంటారు? మోసమా? కుట్రనా నయవంచనా? ఇంత దారుణమా.. ఇంత నీచత్వమా? ఎలాగో నాకు పిల్లలు పుట్టరనే సాకుతో ఇలా ఆడపిల్ల జీవితాలతో ఆడుకుంటావా? ఇప్పుడు ఆవిడ వల్ల ఈ నిజం బయటపడింది.. బయటపడని బాగోతాలు ఎన్నో? ఇంకెంత మంది అభాగ్యులు ఉన్నారో మీ లిస్ట్‌లో? అంటూ కార్తీక్‌ని ప్రశ్నిస్తాడు. ‘మురళీ కృష్ణ గారు..’ అని అరుస్తాడు కార్తీక్. ‘ఆపవయ్యా.. ఆయనకి మూడ్ వస్తే మావయ్యా అంటాడు.. కోపమొస్తే మురళీ కృష్ణా అంటాడు.. మావయ్యా అంటే మురిసిపోవాలి.. నోరుమూసుకుని పోవాలంటే పోవాలి.. ఎందుకంటే దీనికి పెళ్లి ముందు నాకు పిల్లలు పుట్టరు.. నేను మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను.. ఆ విషయం మీ అమ్మాయికి చెప్పండి అభ్యంతరం లేదంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఇతడిలోని నిజాయితీకి మురిసిపోయాను’ అంటూ మురళీ కృష్ణ ఏడుస్తూ అంటుంటే కార్తీక్ తలదించుకుంటాడు. దీప బొమ్మలా నిలబడి ఉంటుంది. ‘ఎంతైనా మధ్యతరగతి వాడిని కదా.. పిల్లలు పుట్టకపోతే ఏంటిలే దత్తత తీసుకుంటారులే అనుకుని, నా కూతురు ఇంతటి వాడ్ని మిస్ అయిపోకూడదని.. ఆ విషయం నా కూతురుకి కూడా చెప్పకుండా పెళ్లి చేశాను.. వరమో శాపమో దీని కడుపు పండింది. అప్పటి నుంచి దీపను చేడిపోయావంటు కార్తీక్ అవమానించిన రోజులను గుర్తు చేస్తూ కార్తీక్‌పై అసహనం వ్యక్తం చేస్తాడు మురళీ కృష్ట. ఇక వెంటనే సౌందర్య వైపు తిరిగి.. ‘చెయ్యని తప్పుకుని ఇన్నేళ్లు నరకం చూపించిన నీ కొడుక్కి ఎలాంటి శిక్ష వేస్తావమ్మా.. నీ కొడుకు వల్ల జీవితమే నాశనం అయిన నా కూతురికి ఏం న్యాయం చేస్తావమ్మా? అని అడుగుతాడు. దీపతో నువ్వు నా కడుపున పుట్టడమే నీకు శాపం, అంతకన్నా ఏం లేదమ్మా.. పదమ్మా వీళ్లందరికీ దూరంగా వెళ్లిపోదాం అనడంతో దీప కార్తీక్ వైపు చూస్తుంది. ఆ తర్వాత దీప ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, నెక్ట్ మోనిత వేసే ప్లాన్ ఏంటో సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
‘కార్తీకదీపం’ డైరెక్టర్‌తో వంటలక్క.. కాపుగంటిపై నెటిజన్ల కౌంటర్!
కార్తీకదీపం.. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న ఈ సీరియల్ అత్యధిక టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రస్తుతం 1057వ ఎపిసోడ్‌కు చేరుకున్న ఈ ధారా వాహిక ఎన్నో ట్వీస్ట్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచి టీవీలకే అతుక్కుపోయేలా చేస్తుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ సీరియల్‌కు అభిమానులు అయిపోయారు. అంతగా ప్రేక్షక ఆదరణ పొందిన ఈ సీరియల్.. లీడ్ పాత్రల మధ్య గొడవలు పెట్టించి గత రెండున్నారేళ్లుగా వారిని కలపకుండా థీమ్ దర్శకుడు సాగతీస్తున్నాడు. ‘అబ్బబ్బా.. ఇదేం సీరియల్‌రా బాబూ.. ఇలా సాగదీస్తున్నారు. ఇక వంటలక్క, డాక్టర్ బాబును కలిపేయచ్చు కదా, ఆ వంటలక్కను ఇంకేన్నాళ్లు బాధపెడతారు’ అంటూ అందరు డైరెక్టర్‌పై మండపడ్డారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆయన కనిపిస్తే కొట్టేయాలన్నంతా కసితో నెటిజన్లు కామెంట్స్ పెట్టెవాళ్లు. అంతలా సీరియల్‌పై విసుగు తెప్పించిన డైరెక్టర్ ఒక్కసారిగా అనుకోని ట్వీస్టులతో సీరియల్‌ను రక్తికట్టించాడు. అయితే ఈ సీరియల్‌ని అభిమానించేవాళ్లు ఎంతమంది ఉన్నారో తిట్టుకుంటూ చూసేవాళ్లు కూడా అంతేమంది ఉన్నారు. అయితే కార్తీక్‌దీపం డైరెక్టర్ ఎవరనేది ఇప్పటికి చాలా మందికి తెలియదు. తాజాగా ఈ సీరియల్ ఫేం ప్రేమి విశ్వనాథ్(దీప) దర్శకుడు కాపుగంటి రాజేంద్రతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది. అది చూసిన బుల్లితెర ప్రేక్షకులు, నెటిజన్లు తమదైన శైలిలో డైరెక్టర్‌పై విరుచుకుపడుతున్నారు. ‘ఆ మహానుభావుడివి నువ్వేనా సామీ. అబ్బా సీరియల్‌ని ఏం తిప్పారు సర్ మీరు సూపర్. ఇంతవరకూ డాక్టర్ బాబు వంటలక్కని నమ్మలేదు.. ఇప్పుడు వంటలక్క డాక్టర్ బాబుని నమ్మదు.. ఇప్పుడు ఈ కథతో సీరియల్‌ను నడపబోతున్నారా?’ , ‘మళ్లీ మోనిత ప్రెగ్నెంట్ ట్విస్ట్ ఏంటి సారూ.. ఖచ్చితంగా రేటింగ్స్ పడిపోవడం ఖాయం’ అంటు కౌంటర్ ఇస్తున్నారు. కాగా దర్శకుడు కాపుగంటి రాజేంద్ర గతంలో ‘అందం, బంగారు బొమ్మ’ వంటి సీరియల్స్‌తో పాపులర్ అయ్యాడు. ఇక ఆయన దర్శకత్వంలో పలు సినిమాలు కూడా వచ్చాయి. రవిరాజా పినిశెట్టి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన ఆయన.. మోహన్ బాబు ‘శివ్ శంకర్’, అల్లరి నరేష్ ‘రాంబాబు గాడి పెళ్లాం’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కార్తీకదీపం సీరియల్‌తో మళ్లీ దర్శకత్వ బాధతల్ని చేపట్టి బుల్లితెరపై భారీ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. View this post on Instagram A post shared by Premi Vishwanath (@premi_vishwanath) -
karthika Deepam: దీప కాళ్లు పట్టుకున్న కార్తీక్, మోనిత ఎంట్రీ, షాక్‌లో సౌందర్య
కార్తీకదీపం జూన్ 4: పూజకు అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెబుతాడోనన్న టెన్షన్‌తో ఉంటుంది. కార్తీక్ దీపకు గిప్ట్ ఇవ్వాలని శ్రీశ్రీ పుస్తకాన్ని ప్యాక్ చేసి.. ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి పెట్టుకుంటాడు. అదే టైమ్‌కి మోనిత తన ఇంట్లో పూజకు వెళ్లడానికి బాగా రెడీ అవుతుంది. ప్రియమణీతో త్వరలోనే పప్పు అన్నం పెడతానంటు ఏవేవో కబుర్లు చెబుతుంది. ఇక పూజాలో దీపకు చెబుతాన్న విషయం కార్తీక్ చెప్పనున్నాడా? లేదా ఇలోపు మోనిత ఎలాంటి ట్వీస్ట్ ఇవ్వబోతోంది అనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. సౌందర్య ఇంట్లో పూజకు అన్ని రేడి చేస్తారు. దీంతో పూజారి పూజకు టైం అవుతుంది అనడంతో అంతా కిందకి వస్తారు. కానీ కార్తీక్ మాత్రం కిందకు రాడు. దీంతో కార్తీక్ రాకపోవడంతో సౌందర్య ఆదిత్యను అన్నయ్య ఎక్కడ అని అడగడంతో ఇంకా గదిలోనే ఉన్నాడంటూ పైకి చూస్తుండా అప్పడే కార్తీక మెట్లు తిగుతూ వస్తాడు. వస్తూనే క్షమాపణలు ఎలా అడగాలో తెలియడం లేదంటు దీప దగ్గరికి వెళ్లతాడు. వెంటనే కార్తీక్‌కు తను దీపకోసం పెట్టిన గిఫ్ట్ గుర్తొచ్చి దీపకు ఇష్టమైన శ్రీశ్రీ పుస్తకం ఇచ్చి క్షమాపణలు కోరతాను అంటు వెళ్లి తెద్దామని వెనక్కి వెళ్లబోతాడు. దాంతో సౌందర్య ‘టైమ్ అవుతుందిరా.. దేవుడికి దన్నం పెట్టుకుని కూర్చోండి’ అంటుంది. వెంటనే కార్తీక్ వెనక్కి తిరిగి.. దీపవైపు చూస్తూ దేవుడికి కాదు మమ్మీ.. ముందు దేవతకు దండం పెట్టుకోవాలి అంటు దీప ముందు మోకాళ్లపై కూర్చుని తన కాళ్లకు దండం పెట్టబోతాడు కార్తీక్. పడ్డాడు. దీప వెనక్కి జరిగిపోతుంది కంగారుగా. అంతా షాక్‌లో ఉంటారు. తెలియకుండా నవ్వుముఖాలుగా ఉంటాయి ఆదిత్య, శ్రావ్య, దీప తండ్రి, సౌందర్య అంతా ఆనందంతో ముఖాలు వెలిగిపోతాయి. ‘నేను చేసిన తప్పుకు శిక్ష ఏ కోర్టులోనూ ఏ జడ్జ్ వెయ్యలేడు..బయటికి కనిపించని చెప్పుకోలేని నేరం చేశాను.. మాటలతో గుండెల్లో పొడిచి పొడిచి చిత్రవథ చేశాను. అందరినీ క్షోభ పెట్టి జీవితాలతో ఆడుకున్నాను.. నేను చేసిన అపరాధం హత్యానేరం కన్నా పెద్దది. దానికి ఉరిశిక్షవేశానా సరిపోదు.. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప’ అని కార్తీక్ క్షమాపణలు చెప్పడంతో దీప ఎంటో అర్థం కానట్లు అయోమయంలో ఉండిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత సడెన్ ఎంట్రీ ఇస్తుంది. రాగానే ‘అంత తప్పు నువ్వేం చేశావ్?’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ షాక్‌తో వెనక్కి తిరిగి చూస్తు దీప పక్కన నిలబడతాడు. ‘చెప్పు కార్తీక్ అంత పెద్ద తప్పు ఏం చేశావ్? తప్పు తెలుసుకున్నావ్.. సరిదిద్దుకుంటావ్.. ఇన్నాళ్లు నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్.. రిపోర్ట్స్ అలా వచ్చాయ్.. అందుకు నువ్వేం చేస్తావ్? ఎవరిదో రిపోర్ట్ నీవనుకుని ల్యాబ్ టెక్నీషియన్ మార్చేస్తే. నువ్వేం చేస్తావ్? అది మానవ తప్పిదం.. అందులో నిన్ను తప్పు బట్టడానికి ఏం లేదు’ అంటుంది మోనిత. మోనిత మాటలకు అంతా బిత్తరపోతారు. వెంటనే మోనితే మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఇవాలే తేలింది.. 100 పర్సెంట్ నీకు ఆ అర్హత ఉంది.. ఇది సంతోషించాల్సిన విషయమే కాదా? దీనికి క్షమాపణలు కోరుకోవడం దేనికి? నీకు పిల్లలు పుడతారు కార్తీక్.. హిమ, సౌర్య నీ కన్నబిడ్డలు. నీ సంతానమే’ అంటుంది నవ్వుతూ. ‘మోనితా నువ్వేం మాట్లాడుతున్నావ్?’అంటాడు కార్తీక్ అయోమయంగా. ‘శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్.. అసలు అందరికీ ఈ విషయం స్వీట్స్ తినిపించి చెప్పాలనుకున్నాను.. కానీ పట్టరాని ఆనందంలో ఈ వార్త అందరికీ అందజెయ్యాలనే కంగారులో స్వీట్స్ తీసుకుని రావడం మరిచిపోయాను. పోనీలెండీ.. ఇక్కడ అక్షింతలు ఉన్నాయిగా.. అవి నా నెత్తిన వేసి నన్ను ఆశీర్వదించండి ఆంటీ’ అంటూ సౌందర్య కాళ్ల మీద పడుతుంది మోనిత. అంతా షాక్‌లోనే ఉండిపోతారు. సౌందర్య అయోమయంగా.. ‘వాడికి పిల్లలు పుడతారని నువ్వు చెప్పడమేంటీ? నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటీ? నాకేం అర్థం కావట్లేదు’ అంటుంది. వెంటనే పైకి లేచిన మోనిత.. నవ్వుతూ.. ‘నేను నెల తప్పాను ఆంటీ.. ఎస్ అయామ్ ప్రెగ్నెంట్.. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది..’ అంటుంది. వెంటనే సౌందర్య ఆవేశంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్..’ అని అరుస్తుంది. ‘ఇంతచెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అని చెప్పడంతో అందరి మొహాలు తెల్లబోతాయి. ఇక ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: దీపకు కార్తీక్ ప్రత్యేక బహుమతి, ఇంతలో ఫోన్ రింగ్..
కార్తీకదీపం జూ 2: కార్తీక్ రేపు ఏం చెప్పబోతున్నాడో తెలియక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటు కంగారు పడిపోతుంటుంది దీప. ఇంతలో సౌందర్య వచ్చి ధైర్యం చెప్పి కార్తీక్ కాసేపు మాట్లాడమంటు గదిలోకి పంపిస్తుంది. ఆ సమయానికి కార్తీక్ కవితల పుస్తకం చూస్తు కనిపిస్తాడు. మరోవైపు కార్తీక్ చేసిన అవమానానికి మోనిత రగిలిపోతుంది. కార్తీక్ చేతి ఆ పుస్తకం చూసి దీప ఎల స్పందించనుంది, పగతో ఉన్న మోనిత ఏం చేయబోతుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. భాగ్యం ఇస్తీ చేసుకుంటూ దీప ఎందుకు ఫోటోను గోడకు పెట్టనివ్వాలేదు? డాక్టర్ బాబు చేసేది కూడా అలానే ఉంటుందిల.. దీప అనుమానం నిజమే అయ్యి ఉంటుందా? లేక డాక్టర్ బాబు మారిపోయి ఉంటాడా అని తనలో తనే మాట్లాడుకుంటుంది. మరోవైపు దీప కార్తీక్ గదికి వెళ్లేసరికి అతడు ఏదో ఆలోచిస్తు మందు తాగడం చూస్తుంది(కానీ కార్తీక్ దీపని అవమానించిన క్షణాలను తలుచుకుని కుమిలిలోతుంటాడు). అలా కార్తీక్‌ను చూసి తలుపు దగ్గరి నుంచే తిరిగి వెనక్కివచ్చేస్తుంది దీప. కింద సౌందర్య భర్త ఆనందరావుతో మాట్లాడుతుంటే దీప కిందికి రావడం గమనించి ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది అని అడగ్గా డాక్టర్ బాబు ఏదో టెన్షన్లో ఉన్నంటున్నాడు, మందు తాగుతున్నాడని చెబుతుంది దీప. దీంతో సౌందర్య షాక్ అవుతుంది. వాడు తాగడం మానేశాడే.. మొన్నెప్పుడో తాగొస్తే.. మనసు బాలేదు అన్నాడు.. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా మోనిత పొద్దున్నే లేచి కాఫీ చేసి ప్రియమణిని లేపి తాగమని ఇస్తుంది. దీంతో షాక్ అయిన ప్రియమణి కోపం వస్తే కొట్టండి, తిట్టండి కానీ ఇలాంటివి చేయకండని అని అనడంతో.. భవిష్యత్తులో కార్తీక్‌కి పెట్టి ఇవ్వాలిగా.. ప్రాక్టీస్‌గా ఉంటుందని పెట్టాను చెబుతుంది. ఆ తర్వాత ఆ కాఫీ తాగి పైన ఉన్న తన చీర ఇస్తీ చేయి అంటు ‘నేను కార్తీక్ దగ్గరకు వెళ్లాలి.. త్వరగా చేసిపెట్టు అంటుంది. ప్రియమణి మనసులో.. ‘ఈమె హడావుడి చేస్తే దీపమ్మ కొంప ముచ్చేలానే ఉంది’ అనుకుంటుంది. ఇక అటు సౌందర్య ఇంట్లో పూజకు అన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భాగ్య కాలు జారిపడిందని, కాలు నెప్పి పెడ్డటంతో రాలేదని మురళీ కృష్ణ మాత్రమే వస్తాడు పూజకు. ఇక అటు దీప, ఇటు కార్తీక్‌లు వేరు వేరు రూమ్స్‌లో రెడీ అవుతూ ఉంటారు. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెప్పబోతున్నాడోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ పంచెకట్టుకుని. శ్రీ శ్రీ పుస్తకాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి.. దానిపై స్లిప్ అంటించి ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి.. మళ్లీ ఆ స్లిప్ చించి ‘దీపకు ప్రేమతో కార్తీక్’ అని రాసి మురిసిపోతుంటాడు. ఇంతలో కార్తీక్‌కు ఫోన్ రావడంతో ఆ గిఫ్ట్ బెడ్ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అయితే దీపకు శ్రీశ్రీ కవితలంటే పచ్చి. ఆ పిచ్చి కారణంగానే కార్తీక్ దీపను అవమానించేందుకు దారితీసింది. దీంతో అప్పటి నుంచి శ్రీశ్రీ కవితలు వింటేనే రగిలిపోయే కార్తీక్ అదే శ్రీశీ కవిత పుస్తకాన్ని దీపకు బహుమతి ఇచ్చి.. తనలోని అనుమానం నిజం కాదని చేప్పాలని అనుకుంటున్నాడు. అయితే ఆ ఫోన్ ఎవరి దగ్గరి నుంచి వచ్చింది. ఈలోపు మోనిత ఎంట్రి ఇచ్చి కార్తీక్ ప్లాన్ మొత్తం తారుమారు చేయనుందా అనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: మోనితను అవమానించిన కార్తీక్, సంతోషంలో దీప, సౌందర్య
కార్తీకదీపం జూన్ 2: దీప కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదేంటో చెప్పండి డాక్టర్ బాబు అని దీప వేడుకున్ప్పటివకి కార్తీక్ పూజ రోజే చేప్తానని, ఇది నా జీవితానికి సంబంధించిన విషయమంటూ దీప మరింత కంగారు పెట్టడం, ఇటు మోనిత కార్తీక్‌ను తన భర్తను చేసుకునే పెద్ద రహస్యాన్ని బయటపెట్టేందుకు సన్నాహాలు చేయడం ఇలా గత మూడు రోజులుగా ఇదే సాగుతుంది. మరీ ఈ రోజు అయినా ఆ నిజాన్ని కార్తీక్ బయటపెట్టి దీప గుండెదడను తగ్గిస్తాడో లేదో నేటి(జూన్ 2వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి. మోనితా కార్తీక్‌తో అర్జంటుగా మాట్లాడాలనునకుంటుంది. ఇందుకోసం కార్తీక్‌ను ఇంటికి వెళ్లాలనుకుంటుంది. ‘ఎటు నేను పెద్ద జలక్ ఇవ్వబోతున్నాను కదా..అందుకే వాళ్లింటికే వెళ్లి చివరి సారిగా దీప మొగుడిగా నా కార్తీక్‌ని చూడాలి. నా విషయంలో ఆ దీప కానీ.. ఆ సౌందర్య కానీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అది ఈ రోజు వరకే.. ఎందుకంటే రేపటితో సీన్ మొత్తం మారిపోతుందిగా.. పాపం దీప.. కార్తీక్ మారిపోయాడు ఇక తనతోనే ఉండిపోతాడు అనుకుంటోంది.. రేపటితో కార్తీక్ ఆ దీపకు భర్తగా కాదు.. ఈ మోనితకి భర్త కాబోతున్నాడు.. ఇన్నీ సంవత్సరాల నా కల రేపటితో నెరవేరబోతుంది.. కార్తీక్.. వస్తున్నా’ అంటు తెగ మురిసిపోతు బయలుదేరుతుంది మోనిత. మరోవైపు భాగ్యం.. ఇంట్లోని పాత ఫొటోలను తూడుస్తూ దీప, కార్తీక్‌లు కలిసి ఉన్న ఫోటో(గతంలో కార్తీక్ పగలగొట్టిన విషయం గుర్తొచ్చి.. ఈ ఫోటోని గోడకు తగిలించే రోజు ఎప్పుడొస్తుందో? ఏంటో’ అని నిట్టుర్పుగా అంటుంది. అలాగే కార్తీక్ మారిన విషయం, దీప వైద్యం చేయించి బతికుంచుకున్నాడంటే డాక్టర్ బాబు మారినట్లే కదా మరీ ఇంకేందుకు ఈ ఫొటో దాచడమని గోడకు తగిలించబోతుంటే అప్పడే సౌందర్య, దీపలు అక్కడి వస్తారు. దీంతో భాగ్యాన్ని ఏం చేస్తున్నావని సౌందర్య అడగ్గా.. ఈ విషయం చెబుతుంది. ఆలస్యం చేయకుండ ఆ ఫొటోను గోడకు తగిలించమని సౌందర్య చెప్పగా.. దీప వద్దు అని అడ్డుపడుతుంది. రేపు ఆ విషయం ఏంటో చెప్పాక తగిలించోచ్చు లే అనడంతో వారు ఊరుకుండిపోతారు. ఆ తర్వాత భాగ్యంతో రేపు మనింట్లో పూజ ఉందని.. మీరు తప్పకుండా రావాలని పిలుస్తుంది సౌందర్య. ఇక కార్తీక్ బయట నుంచి ఇంటికి వస్తాడు. ఇంట్లో అప్పటికి ఎవరు ఉండకపోవడంతో బాధగా కూర్చుని.. ‘రేపు నా జీవితంలో చాలా భారంగా ఉండబోతుంది. తర్వాత నేను నా మనసులోని భారాన్ని దింపేసుకుని ఫ్రీ కాబోతున్నా.. అప్పుడు అంతా సంతోషమే.. కానీ రేపు గడిచేదెలా’ అంటూ తనలో తనే సంఘర్షణ పడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ‘హాయ్ కార్తీక్’ అంటూ గుమ్మంలోంచి ఎంట్రీ ఇస్తుంది మోనిత. నువ్వేంటి ఇలా వచ్చావ్’అని కార్తీక్ చిరాకు మూడ్‌లో అనడంతో. నేను అంతే అడ్డదారుల్లో రావడం నాకు ఇష్టం ఉండదు.. మనదంతా రహదారి అంటూ పెద్దగా నవ్వుతుంది. ఇంతలో దీప, సౌందర్య భాగ్యం ఇంటి నుంచి వస్తారు. ‘ఏంటి దీపా.. బాగున్నావా? అదేంటి అప్పుడే అత్తా-కోడళ్లు బయట షికార్లు చేస్తున్నారంటు కాస్త రెస్ట్ తీసుకో దీప అని వెటకారంగా ఉంటుంది. వెంటనే కార్తీక్ అప్పుడే ఎందుకు బయటికి వెళ్లావు దీపా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ప్రేమ అనడంతో మోనిత రగిలిపోతుంది. ఇంతలో సౌందర్య.. ‘పిల్లలు ఎక్కడరా కనిపించడం లేదని కార్తీక్‌ని అడుగుతుంది. దీంతో కార్తీక్ వాళ్లను డాడీ దగ్గర ఫామ్ హౌజ్‌లో దింపి వచ్చాను మమ్మీ అంటాడు. అదేంటీ రేపు పూజ పెట్టుకునీ.. అంటు సౌందర్య మోనితని చూసి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయారు ఆంటీ.. పిలవని పేరంటంగా నేను వస్తాననా? నాకు రావాలని ఉంటే పిలవకపోయినా వస్తానుగా.. మీరు ఆగిపోకండి.. మాట్లాడండి’ అంటుంది మోనిత నవ్వుతూ. దాంతో సౌందర్య.. అలా ఎందుకు చేశావురా రేపు పూజలో పిల్లలు లేకుండా ఎలా?అంటుంది సౌందర్య. దాంతో మళ్లీ మోనిత కలుగజేసుకుని.. నిజమే కార్తీక్.. పెళ్లి అయ్యి పదేళ్లు అయినా.. పదేళ్ల కూతుర్లు ఉన్నా.. నీకు ఈ మాత్రం కూడా తెలియదు.. పూజలో ఆడపిల్లలు పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటే ఎంత అందంగా ఉంటుంది.. వెళ్లు.. వెళ్లి తీసుకొచ్చేసెయ్.. వెళ్లు వెళ్లు అంటూ కాస్తా చనువుగా మాట్లాడుతుంది మోనిత. అప్పటికే విసిగిపోయి ఉన్న కార్తీక్ ‘విల్ యు ప్లీజ్ సెట్ యువర్ మౌత్ మోనితా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కదా.. నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావ్? ఎన్నిసార్లు చెప్పినా నీకు కామన్ సెన్స్ లేకుండా పోతుంది’ అని కార్తీక్ మోనితపై అరుస్తాడు. అలా అనేసరికి మోనిత షాక్‌లో దీప, సౌందర్యలు సంతోషంలో ఉంటారు. క్షమించు కార్తీక్. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవడం వల్ల నోరు జారాను.. రియల్లీ సారీ.. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కదా మీరే మాట్లాడుకోండి.. నేనొస్తాను’ అంటూ మోనిత బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెంటనే సౌందర్య ‘పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని చెబుతుంది. దీంతో కార్తీక్ వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించేసి వచ్చాను.రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు. మోనిత కారులో వెళ్తూ జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతుంది. ‘ఇంతకాలం చేదు అయిపోయిన నీ పెళ్లాం ఇప్పుడు బెల్లమైపోయిందా కార్తీక్.. దాని ముందే నన్ను అవమానించావ్ కదూ.. చెబుతా.. రేపు ఈ టైమ్‌కి నువ్వు నా కాళ్ల దగ్గర ఈ కారు క్లచ్లా పడి ఉంటావ్. నిన్ను నేను వదలను’ అంటూ కోపంతో ఊగిపోతుంది. తరువాయి భాగంలో సౌందర్య దీపను కార్తీక్ గదిలో ఒక్కడే ఉన్నాడు. నువ్వు కాస్తా మాటలు కలుపు అని చెబుతుంది. నేను ఇప్పుడు వెళ్లి ఏం మాట్లాడను అత్తయ్య వెళ్లను అంటుంది. అయినా సౌందర్య వెళ్లు ఏం కాదని చెప్పి పంపిస్తుంది. దీప గదిలోకి వెళ్లేసరి కార్తీక్ ఒకప్పుడు తాను చింపేసిన కవిత పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. ఇది చూసి దీప మరింత షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనిత కొత్త స్కెచ్.. భారతిని ఇంటికి పిలిచి..
కార్తీకదీపం జూన్ 1: కార్తీక్ నిజం తెలుసుకున్న విషయం దీపతో చెప్పి క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇటూ మోనిత.. కార్తీక్, దీపలు విడిపోయే పెద్ద సీక్రేట్కు రీవిల్ చేసేందుకు సిద్దమవుతుంది. మరోవైపు కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక దీప కంగారు పడుతూ ఉంటుంది. ఇన్ని సస్పెన్స్‌ల నడుమ కార్తీక్ దీపకు నిజం చెబుతాడా లేదా అనేది నేటి(జూన్ 1వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి. మోనిత డాక్టర్ భారతిని ఇంటికి పిలుస్తుంది. తనకు నచ్చిన మైసూర్ పాక్ స్వీట్‌ను ప్రియమణితో స్పెషల్‌గా చేయిస్తుంది. భారతి మోనిత నానా హడావుడి చేస్తూ భారతి స్వీట్ ఇస్తుంది. గదిలోకి వెళ్లి పండ్లు, చీర తీసుకోచ్చి.. దీపను చావు అంచుల నుంచి లాక్కొంచి కార్తీక్ ఆరోగ్యం అప్పగించావ్ కదా అందుకే ఇది ఇస్తున్నా అంటుంది. కానీ భారతి అది తీసుకునేందుకు ఇష్టపడదు. వద్దంటుంటే బలవంతంగా చీర ఇస్తుంది. ఇదంతా చూసి భారతి ఆలోచనలో పడుతుంది. ఇదేంటి మోనిత ఏమైనా కొత్త నాటకానికి తెరలేపిందా అంటు అనుమానంగా ఆలోచిస్తూ వెళ్లిపోతుంది. ఇక ఆమె వెళ్లిపోగానే మోనిత ‘ఇదంత భారతి కార్తీక్‌కు చెబుతుంది, కార్తీక్ వెళ్లి దీప, సౌందర్యలకు చెబుతాడు, ఆ తర్వాత నా ప్లాన్ ఏంటో తెలియక ఆ అత్త-కోడళ్లు తలలు పట్టుకుంటారు. ఇలోపు నేను చేయాల్సిన పని చేసేస్తా’ అని మనసులో అనుకుంటు నువ్వుకుంటుంది. గదిలో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప ధీనంగా కూర్చోని ఆలోచిస్తుంది. ఇంతలో సౌందర్య దీప కోసం జ్యూస్ తెచ్చి తాగమంటుంది. కార్తీక్ చెప్పబోయే విషయం ఏంటా అని దీప సౌందర్యతో అంటూ ఉండగా.. కార్తీక్ వచ్చి ‘మమ్మీ మోనిత భారతిని పిలిచి చీర పళ్లు పెట్టిందట.. దీప కోలుకునేలా చేశావ్.. థాంక్యూ.. వాళ్లు ఇప్పుడు ఇదంతా ఆలోచించే సమయంలో ఉండిఉండరు. అందుకే వాళ్ల తరపున నేను ఈ చిరు కానుక ఇస్తున్నాను అంటూ భారతికి చీర పెట్టిందట.. పాపం పిచ్చిది’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న సౌందర్య, దీప షాక్ అవుతారు. మోనితని పాపం పిచ్చిది.. అంటున్నాడు ఈ అమాయకుడు అని సౌందర్య తిట్టుకుంటుంది. దీప మనసులో రేపు ఈయన చెప్పబోయే విషయానికి మోనితకి ఏమైనా సంబంధం ఉందా అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే మోనిత బాల్కనీలో కూర్చుని.. ఈ పాటికి ఆ అత్తాకోడళ్లకు తెలిసే ఉంటుంది. అర్థం కాక జుట్టు పీక్కుంటుంటారు. ఇలాగే నా లక్ష్యం కోసం ఏదొక అడుగు వేస్తూ ఏదోరోజు ఒక అడుగు కార్తీక్ ఇంట్లో వేస్తాను.. వెంటనే మంచి ముహూర్తం ఉంటే చూసిపెట్టుకోవాలి అనుకుంటుంది. వెంటనే ప్రియమణిని పిలిచి తనకు తెలిసిన పంతులు ఫోన్ చేసి ఇవ్వమంటుంది. ప్రియమణి ఫోన్ చేసి ఇవ్వగానే మోనిత నేనొక మంచి పని తలపెడుతున్నాను పంతులుగారు.. మంచి ముహూర్తం ఉంటే చూసి చెప్పండి అని అడుగుతుంది మోనిత. దీంతో ఆ పంతులు రేపు మంచి ముహూర్తం ఉందని, ఆ తర్వా మూడు నెలల దాక మంచి ముహుర్తాలు లేవని చెబుతాడు. దాంతో మోనిత వెంటనే మనసులో ‘రేపే అంటే టైమ్ లేదే.. ఇంత తక్కువ టైమ్‌లో అంత పెద్ద స్కెచ్ వెయ్యడం ఎలా అబ్బా? ఏది ఏమైనా సరే.. రేపటితో నేను అనుకున్నది జరగాలి.. జరిగి తీరాలి..’ అని నిర్ణయించుకుంటుంది. కార్తీక్ బయటికి వెళ్లబోతుంటే.. దీప డాక్టర్ అని పిలిచి ఆపగా.. ఏం కావాలి, చీరలా, పండ్లా.. ఏం తేవాలి దీపా అని అడుగుతాడు. అవేం కాదు డాక్టర్ బాబు.. మీరు చెబుతానన్న విషయం ఏంటో.. అది అంటుంది దీప. వెంటనే కార్తీక్ రేపు నేను చెప్పబోయే విషయం.. నా జీవితానికి సంబంధించినది అంటాడు. అంటే నా జీవితానికి సంబంధంలేనిదా అని దీప ప్రశ్నించగా.. ‘నా జీవితంతో ముడిపడే కదా నీ జీవితం’ అంటాడు కార్తీక్. ‘నా మనసు ఆగడం లేదు డాక్టర్ బాబు.. మీరు చెప్పబోయే విషయం ఏంటో తెలుసుకోవాలని ఉంది.. ఇప్పుడే చెప్పొచ్చు కదా? నా గుండె దడ తగ్గుతుంది?’ అంటుంది దీప రిక్వస్ట్‌గా. దీంతో కార్తీక్ తాను తప్పు చేశానని, అది నా నోటితో నేను చెప్పడానికి నన్ను నేను సిద్దం చేసుకోవాలంటే దానికి కొంచం టైం కావాలి అంటాడు. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి కారులో వెళ్లిపోతాడు. అనంతరం దీప ఆలోచనలో పడుతుంది. తరువాయి భాగంలో పూజకు అందరు సిద్దంగా ఉంటారు. దీప, సౌందర్య, కార్తీక్ మాట్లాడుకుంటూ ఉంటారు. పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని సౌందర్య చెప్పగా ‘వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించి రమ్మన్నాను.. రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు..’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరగనుందనేంది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
కార్తీకదీపం: ఆస్పత్రిలో ‘వంటలక్క’.. నెటిజన్ల ఫన్నీ కామెంట్స్
తెలుగు డైలీ సీరియల్ కార్తీకదీపం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డాక్టర్ బాబు నిజం తెలుసుకోవడం, మోనిత ప్రెగ్నెంట్ ట్వీస్ట్, దీప అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడంతో ఏమౌతుందోననే ఉత్సుకతతో బుల్లితెర ప్రేక్షకులంతా టీవీలకే అతక్కుపోతున్నారు. ఇక గత వారమంత హాస్పిటల్లో దీప చావు బతుకుల మధ్య ఉండటం.. డాక్టర్ బాబు కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన కార్తీక్‌దీపం అభిమానులు భావోద్వేగానికి లోనవుతుండగా.. మరోవైపు ఈ ప్రోమోలపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్ క్రియేట్ చేస్తూ, ఫన్నీ కామెంట్స్‌తో స్పందిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీప ఐసియూలో ఆక్సిజన్ అందక కొట్టుకుంటుంటే, కార్తీక్ కంగారు పడుతున్న ప్రోమోను ఆనందయ్య మందుకు సింక్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంఉటన్నాయి. అవుతున్నాయి. ‘దీపక్క.. ఆక్సిజన్ పెట్టుకుని చావుబతుకుల మధ్య ఉంటే.. ఆవిడను ఆనందయ్య దగ్గరకు తీసుకువెళ్ళండి డాక్టర్ బాబు’ , ‘ఈ హాస్పిటల్స్ని నమ్మకండి డాక్టర్ బాబు.. ఆనందయ్య నాటు వైద్యమే వంటలక్కకి కరెక్ట్. లేదంటే దీపక్కకు ఆక్సిజన్ కావాలంటే సోనుసూద్ సాయం తీసుకుందాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. -
karthika Deepam: తప్పు చేశానన్న కార్తీక్.. బాంబు పేల్చడానికి సిద్దమైన మోనిత
కార్తీకదీపం మే 31: బుల్లితెర ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అందరూ కోరుకున్నట్టుగానే దీప కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ తనని పట్టించుకోకుండా దీప మీద ప్రేమ కురిపిస్తుండటంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ పూర్తిగా మారిపోయాడని తెలుసుకున్న మోనిత ఎలాంటి కుట్ర పన్ననున్నందో నేటి(మే 31) ఎపిసోడ్లో తెలుసుకొండి.. దీప కోలుకుని ఇంటికి వస్తుంది. మరోవైపు మోనిత నిరాశగా కూర్చోని దిగులుగా ఉండగా ప్రియమణి.. మోనితకి కాఫీ తెచ్చిస్తుంది. ఎందుకమ్మా అలా ఏడుస్తూ కూర్చుంటారు, కార్తీక్ అయ్యకి.. ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదమ్మా? ఏంటమ్మా మీరు ఏడుస్తున్నారు.. వాళ్లింటికి వెళ్లి ఇష్టమొచ్చినట్లు దులిపెయ్యండి అంటుంది. అంటే కార్తీక్ అయ్యని నమ్ముకున్నవాళ్లలో ఎవరో ఒకరు ఏడవాల్సిందేనా.. మీకేం ఖర్మమ్మా.. మీరు పడే బాధేంటో ఆవిడకు తెలిసి తీరాలని ఏవేవో చెబుతుంది. అది వింటు మోనిత మనసులో ‘ఊరుకో ప్రియమణీ.. నేను దీపని కాదు సర్దుకుపోవడానికి.. మోనితని.. మోసం చేసే వాళ్లని క్షమించను.. కొడతా.. కోలుకోలేని దెబ్బ కొడతా.. నా ప్రేమతో ఆడుకుంటే ప్రేమించినవాడు అని కూడా చూడను.. అతి త్వరలో విడుదల కానుంది ఒక భయంకరమైన చిత్రం’ అంటూ నవ్వుకుంటుంది. సౌందర్య కార్తీక్‌కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చార్రా అని కనుక్కుని పిల్లలతో ఆనందంగా ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని చెప్తుంది. హిమ, శౌర్యలు అమ్మ నాన్నకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాం అంటూ పైకి వెళతారు. ఇంతలో మోనిత ఫోన్ చేయడంతో సౌందర్య.. శుభమా అని దీప కోసం ఎదురు చూస్తుంటే ఇదెందుకు ఇప్పుడు ఫోన్ చేసింది..చూద్దాం అంటు లిఫ్ట్ చేస్తుంది. ఆంటీ దీప ఇంటికి వచ్చిందా? అని అడగ్గా.. ఇంకా రాలేదని చెబుతుంది సౌందర్య. ‘అయ్యో ఏమైందని వెటకారంగా అనడంతో.. ఏం కాలేదు.. ఇకపై ఏం కాదు కూడా.. అయినా ఇంకా రాలేదు అంటే.. దారిలో ఉంది.. వస్తూ ఉందని అర్థం.. ఇది తెలుసుకోవడానికి ఫోన్ చేశావా అని మోనితకు సౌందర్య కౌంటర్ వేస్తుంది. లేదు ఆంటీ దీప ఉంటే విష్ చేద్దామని ఫోన్ చేశాను అంటుంది మోనిత. అంతేగాక ఇక నుంచి నువ్వు మా మీద ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సౌందర్య అనడంతో ఏం.. ఎందుకు ఆంటీ అని అడుగుతుంది మోనిత. అది అంతేలే.. చూడు నేను ఇప్పుడు హ్యాపీ మూడ్‌లో ఉన్నాను.. ఇలా మాట్లాడి దాన్ని కాస్తా చెడగొట్టకని సౌందర్య అనగానే మోనిత నవ్వుతూ.. అలా అనకండి ఆంటీ ఎలాంటి మూడ్‌నైనా చెడగొట్టే టాలెంట్ నాలో ఉంది.. సరే మీరు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు కదా.. ఇలా ఎన్ని రోజలు ఉంటారో నేను చూస్తాను అని మోనిత హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతుంది. అది విని సౌందర్య ‘ఏంటే నువ్వు చూసేది ఇప్పుడు నా కొడుకు చాలా మారిపోయాడు.. నా కోడల్ని బంగారంలా చూసుకుంటున్నాడు.. నువ్వు చెప్పే సోది వినడం అవసరమా చెప్పు.. పెట్టెయ్ ఫోన్’ అని విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ పెట్టేశాక మోనిత మనసులో ‘నీ కోడలు దీప బంగారం అయితే మరి నేనేంటి? ప్లాటినమ్నా? దానికంటే నేనే ఎక్కువని రుజువు చేస్తాను.. ఫేస్ చెయ్యడానికి రెడీగా ఉండండి ఆంటీ అని మనసులో పడిపడి నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా దీప, కార్తీక్‌ల కారు వస్తుంది. దీప దిగగానే కార్తీక్ ఆమె పట్టుకుని నడిపించుకుంటు వస్తాడు. వాళ్లను గుమ్మం దగ్గరే ఆపి సౌందర్య శ్రావ్యను పిలిచి హారతి ఇచ్చి ఆనందంతో మురిసిపోతు ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది సౌందర్య. లోపలికి వెళ్లగానే పిల్లలు తల్లిదండ్రులకు పూలు చల్లి గ్రాండ్ వెల్కం చెబుతారు. సంతోషంగా కిందకు దిగి దీపని హత్తుకుని ముద్దాడతారు. తర్వాత కార్తీక్ దీపల మధ్యకు వచ్చిన రౌడీ.. కార్తీక్ చేతిని దీప చేతికి కలుపుతూ.. ‘మీరిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్సే కదా..’ అంటుంది. కార్తీక్ అవునంటాడు. ఆ తర్వాత శౌర్య ‘నువ్వే మా నాన్నవని తెలిసినప్పుడు, హిమ నా చెల్లి అని తెలిసినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు నాన్నా.. ఏదో వెలితిగా ఉండేది.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది’ అంటు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని తాను తెలుసుకున్న నిజం గురించి చెప్పి దీపను క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇంతలో సౌందర్య శుభవార్తనే అని అడగ్గా మీరందరూ పండగ చేసుకునే వార్త అనడంతో సౌందర్య భాగ్యం చేయించాలనుకున్న పూజ గురించి చెబుతుంది. ఈ శుభావార్త ఏదో దేవుడు ముందు చెప్పమని, అందరికి శుభం జరుగుతుందంటుంది.దీంతో కార్తీక్ కూడా అందరి ముందే చెప్పడమే కరెక్ట్ అంటాడు. అందరు ఉన్నప్పుడు చెబితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. కొంతైనా న్యాయం చేశానేమో అనిపిస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతాడు. దీంతో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప కంగారు పడుతుంది. ఇక తరువాయి భాగంలో.. దీప అదేంటో ఇప్పుడే చెప్పండి డాక్టర్ బాబుని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో నేనొక తప్పు చేశాను దీపా.. అంటాడు కార్తీక్ తలదించుకుని. ‘మీరా..’ అంటుంది దీప అనుమానంగా ఆశ్చర్యంగా. ‘అవును నేనే.. అది నా నోటితో నేను చెప్పడానికి.. చాలా ఎక్స్సైజ్ చెయ్యాలి.. ప్రాక్టీస్ కావాలి.. అందుకే నాకు కొంచెం టైమ్ కావాలి.. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా..’ అంటాడు కార్తీక్ ఎమోషనల్‌గా రిక్వస్ట్‌గా. దీప ఆలోచనగా చూస్తూ ఉంటుంది. మరోవైపు రేపే సరైన సమయం చూసి బాంబు ఎలా పెల్చాలా అని మోనిత ప్లాన్ చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: కార్తీక్ స్పర్శతో కళ్లు తెరిచిన దీప
కార్తీకదీపం మే 28: కార్తీక్, మోనితతో నా భార్య బతకాలి అంటూ దీప మీద ప్రేమ, కన్సర్న్ చూపించడంతో మోనిత తట్టుకోలేపోతుంది. దాంతో తాను అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా దీపకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తనని మత్తలోకి వెళ్లకుండా మెలకువతో ఉండమని చెబుతారు. మరోవైపు సౌందర్య బయట కూర్చోని దీప అరోగ్యంపై దిగులు పడుతూ ఉంటుంది. మరి దీప ఆరోగ్యం బాగావుతుందా, కార్తీక్ ప్రవర్తనతో రగిలిపోతున్న మోనిత ఏం చేయనుందో నేటి ఎపోసిడ్(మే 28) ఇక్కడ చదవండి.. కార్తీక్, సౌందర్య దీప పరిస్థితి గురించి మాట్లాడుకుంటుండగా.. డాక్టర్ భారతి వచ్చి ఫార్మాలిటీస్ మరిచిపోయాను.. సైన్ చెయ్యి అనడంతో కార్తీక్ సైన్ చేస్తాడు. అది చూసి దీపకు ఏమౌంతుందోనంటూ భయపడుతున్న సౌందర్యకు.. దానికి ఏం కాదు మమ్మీ అంటు ధైర్యం చెప్పి ఇంటికి పంపిస్తాడు కార్తీక్. అప్పటికే పిల్లలు దీప కోసం కంగారుపడుతుంటే ఆదిత్య వారికి ఓదార్పు మాటలు చెబుతుండగా.. సౌందర్య ఇంటికి రావడంతో నానమ్మ అంటు హిమ, శౌర్య దగ్గరకి వెళ్లి పట్టుకుని ఏడుస్తారు. అమ్మకు ఏమైనా అవుతుందని భయపడుతున్నారా, అక్కడ దానికి ఏం కాలేదు రెండు రోజుల్లో ఇంటికి వస్తుందంటూ మనసులో భయపడతూనే పిల్లలకు ధైర్యం చెబుతుంది. అది గమనించిన ఆదిత్య పిల్లలు మాలతితో వెళ్లగానే ఏంటి వదిన పరిస్థితి బాగాలేదా అని అడగ్గా అవునని తల ఊపుతుంది, దీప ఆరోగ్య పరిస్థితి గురించి వివరిస్తుంది. ఐసీయూలో పడుకుని ఉన్న దీపను కార్తీక్ బయట డోర్ నుంచి చూస్తూ.. ‘నువ్వు బాగుండాలి దీపా.. నీకేం కాకూడదు.. క్షేమంగా బయటికి రావాలి. ఇక నుంచి నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను దీపా.. కష్టాలే లేని నీ స్వప్నలోకాన్ని నీకు అందిస్తాను’ అంటూ మనసులో అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే దీపకు పల్స్ పడిపోయి, ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుంది. దీంతో కార్తీక్ కంగారుగా భారతి దగ్గరికి పరుగులు తీస్తాడు. ‘భారతి.. గోవర్ధన్... దీపా పల్స్రేట్ పడిపోతుంది.. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది’ అని కంగారుగా పడుతుండటంతో ‘వాట్?’ అంటూ గోవర్ధన్‌తో పాటు భారతి కంగారుపడుతూ.. దీప ఉన్న ఐసీయూలోకి పరుగుతీస్తారు. ‘‘భారతి దీపను చెక్ చేస్తుంటే మధ్యలో కార్తీక్ ఏమైంది.. ఏమైంది అంటూ ఆందోళన పడుతుంటాడు. దీంతో భారతి డాక్టర్ గోవర్ధన్‌తో కార్తీక్‌ని ఐసీయూ నుంచి బయటికి తీసుకెళ్లమని చెబుతుంది. ఇదిలా ఉండగా హాస్పిటల్లో జరిగిదంతా తలుచుకుంటూ మోనిత కోపంతో మండిపోతుంది. అదే సమయంలో ప్రియమణి భోజనం తెస్తుంది. కార్తీక్ దీపల గురించి ఆరా తియ్యడంతో ఆ ప్లేట్ విసిరి కొట్టి.. క్లీన్ చెయ్ అంటూ ముందు గదిలోకి వస్తుంది మోనిత. ‘దీప అనారోగ్యం కార్తీక్‌లో ఇంత మార్పుకు కారణం అవుతుందని నేను అస్సలు అనుకోలేదు.. ఇన్నాళ్లు దీపకు దూరంగా ఉంటే ఏదో ఒకరోజు నాకు దగ్గర కాకపోతాడా అని ఆశతో ఉండేదాన్ని. కానీ ఈ రోజుతో అది అడియాశేనని తేలిపోయింది. ప్రేమగా కార్తీక్‌ని నా కార్తీక్ అనుకోవడానికి కూడా వీల్లేకుండా పోయింది.. నా కార్తీక్‌ని నాకు దూరం చేసిన ఆ దీపని మాత్రం కార్తీక్‌కి దగ్గర అవ్వనివ్వను.. అలాగే ఆ దీపని అస్సలు ఉండనివ్వను. కార్తీక్ దీపలు కలిసి సంతోషంగా ఎలా ఉంటారో నేనూ చూస్తా, ఇప్పుడే కాదు.. ఇంకో 100 ఏళ్లు అయినా మిమ్మల్ని కలవనివ్వకుండా దూరం చేసే ప్లాన్ నా దగ్గర ఉంది.. ఈ మోనిత అంటే ఏంటో చూపిస్తాను’ అంటు ఉన్మాదంగా ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన సౌందర్య.. కార్తీక్ మాటలను గుర్తు చేసుకుంటూ అనుమానమే లేదు పెద్దోడిలో మార్పు వచ్చింది. దీపని కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. కానీ పదేళ్లుగా రాని మార్పు ఈ రెండు రోజుల్లో ఎలా వచ్చింది? ఏం జరిగి ఉంటుంది? అని ఆలోచిస్తుంది. ఏమైతేనేం వాడిలో మార్పు వచ్చింది. కానీ ఆ మార్పు దీప చూస్తుందో లేదా అంతా నీదే భారం స్వామి అని బాధపడుతుంది. మరోవైపు హాస్పిటల్ దగ్గర కార్తీక్ దీప గురించి బాధపడుతూ ఉండగా.. డాక్టర్ భారతి వచ్చి.. నువ్వు మంచివాడివి కార్తీక్.. నీకు ఆ దేవుడు అన్యాయం చేయడు, దీప సేఫ్ అనడంతో ఒక్కసారిగా కార్తీక్ ప్రాణాలు లేచోస్తాయి. దీంతో నేటి ఎపిపోడ్ పూర్తిఅవుతుంది. తరువాయి భాగం.. సృహలో లేని దీప దగ్గరకు కార్తీక్ వెళ్లి.. తల నిమురుతూ.. ‘రెండే రెండు రోజులు ఆగు దీపా ప్రపంచంలో ఏ జంట ఇంత ఆనందంగా ఉండరు అనిపించేలా.. మనం ఉందాం..’ అంటాడు. వెంటనే దీప పక్కనే కూర్చుని.. దీప చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని.. ‘నేను నీ విషయంలో చేసింది మామూలు తప్పు కాదు.. క్షమించరాని ఘోరమైన అపరాదం.. వీటన్నింటికీ నేను క్షమాపణ చెప్పుకోవాలి.. ఎంత మంది ముందైతే అవమానించానో అంతమంది ముందు తలవంచి మరీ క్షమాపణ కోరతాను..’ అంటూ దీప చేతుల్ని ముద్దాడుతూ ఏడుస్తుండగా, ఆ స్పర్శకు దీప కళ్లు తెరిచి చూస్తుంది. -
karthika Deepam: ఎవరు ఎన్ని అనుకుంటే నాకేంటి? నా భార్య బతకాలి..
కార్తీకదీపం మే 27: కార్తీక్ దీపతో సరదాగా మాట్లాడటం, నిన్ను బతికించుకోవడం భర్తగా నా కనీస బాధ్యత అని అనడంతో అది విన్న మోనిత కోపంతో రగిలిపోతుంది. ఇక కార్తీక్ దీప ఆరోగ్యం గురించి దిగులు పడుతుంటాడు. ఇక అక్కడే హాస్పిటల్లో కార్తీక్‌కు ఏమైందంటూ ఆలోచిస్తున్న మోనిత ఏం చేయబోతుంది, కార్తీక్ దీపతో నిజం తెలిసిన విషయం చెబుతాడో లేదో నేటి(మే 27) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.. కార్తీక్‌ను సౌందర్య ఓదారుస్తు అది నిన్ను చివరి క్షణాలంటూ.. నన్ను నమ్మానని చెప్పండి అని అడుగుతుంటే ఎందుకురా నోరు మెదపలేదని అడగ్గా కార్తీక్ ఏమో నోరుకు ఎదో అడ్డుపడినట్లు అయ్యింది అంటాడు. నువ్వు నమ్మానని ఒక్క మాట చెబితే ఆ మాటలతో అది ధైర్యం తెచ్చుకుని మరణంతో కూడా పోరాడి తిరిగోచ్చేది కదరా ఇది నువ్వు ఓ డాక్టర్ బాబుగా కాదు డాక్టర్లా చెప్పు అని సౌందర్య అనగా.. కార్తీక్ అవునన్నట్లు తల ఊపుతాడు. అయిన దానికి ఏం కాదు మమ్మీ.. అది ఎవరూ దీప బతికేస్తుంది.. అది బతకాలి.. బతుకుతుంది అంటాడు కార్తీక్. ఇంతలో మురళీ కృష్ణ యాపిల్ పండ్లు తీసుకువచ్చి సౌందర్య, కార్తీక్‌కు తినమని ఇస్తాడు. కార్తీక్ అవి తీసుకుని సౌందర్యకు ఒకటి ఇచ్చి, మరోకటి మీరు ఏం తినలేదు కదా మామయ్య ఇది మీరు తీసుకోండి అంటు ఆ యాపిల్‌ను మురళీ కృష్ణకు ఇస్తాడు. ఇక అది విన్న సౌందర్య షాక్ అవుతుంది. ఏం అన్నాడు వాడు అని మురళీ కృష్ణను అడగ్గా నోరరా మామయ్య అన్నాడమ్మా అనగానే సౌందర్య సంతోషంతో కార్తీక్‌ను చూస్తుండిపోతుంది. ఇదిలా ఉండగా అక్కడ మోనిత కార్తీక్ ఏంటి దీపతో అల మాట్లాడాడు. అంటే కార్తీక్ ఇప్పటి దాకా నా మీద చూపించింది ప్రేమ కాదు అనుకుంటుంది. కనీసం విజయనగరం నుంచి పెళ్లాం, పిల్లలను విమానంలో తీసుకొచ్చినప్పుడైనా నాకు సిగ్గు ఉండాలి కదా? లేదు నేను కార్తీక్‌ని పెళ్లి చేసుకోవడం కోసం నేను చేసిన దరిద్రగొట్టు పనులన్నీ ఇంకే ఆడది చెయ్యదు.. ఇంత కథ నడిపినా ఇన్నేళ్లకు కూడా నా బతుక్కి మోక్షం లేదు.. చావాలనిపిస్తోంది అంటూ తనలోనే తానే మాట్లాడుకుంటుంది. సరిగ్గా అప్పుడే కార్తీక్ వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అని అడగడంతో.. దీప గురించే అని కవర్ చేస్తుంది మోనిత. అంటే.. భారతి ఏమైనా చెప్పిందా అని కంగారుగా అడగ్గా భారతి నాకు చెప్పడం ఏంటీ? దీప గురించి అంటుంది మోనిత. నా భార్య గురించి నాకు చెబితే నేను తట్టుకోలేనని నీతో ఏమైనా చెప్పిందా? అని అడుగుతున్నాను మోనితా.. చెప్పి ఉంటే నిజం చెప్పు.. అవసరం అయితే స్పెషల్ డాక్టర్స్‌ని పిలిపిస్తాను అని కార్తీక్ అనడంతో మోనిత ఇంకా కోపంతో రగిలిపోతుంది. మొగుడితో చెప్పకుండా నాతో ఎందుకు చెబుతుందని సమాధానం ఇస్తుంది. ఆ తర్వాత మోనిత నువ్వు నిజంగా బాధపడుతున్నావా? పిల్లలు బాధపడతారని బాధపడుతున్నావా అని వెటకారంగా అనడంతో.. ‘పిల్లల గురించి కాదు.. లోకం గురించి కాదు.. భర్తగా ఇది నా బాధ్యత అని కూడా కాదు.. దీప బతకాలి.. బతికి తీరాలి.. ఇన్నాళ్లు దీప ఎన్నో కష్టాలు పడింది.. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రాణాలతో పోరాడుతుంది. ఎవరు ఎన్ని రకాలుగా అనుకుంటే నాకేంటీ? ఐ డోంట్ కేర్..నా భార్య బతకాలి..దట్స్ ఆల్’ అని అంటాడు కార్తీక్ ఆవేశంగా అంటాడు. అది విన్న మోనిత ‘ఇది జాలి కాదు.. మానవత్వం కాదు..మరేదో ఉంది..’ అనుకుంటుంది మనసులో. ఆ తర్వాత మోనిత నేను వెళతాను అనగానే కార్తీక్ మంచిది అని ఇచ్చిన సమాధానాన్ని మోనిత ఊహించలేకపోతుంది. దీంతో ఆమో మొహంలో ఒక్కసారిగా రంగులు మారిపోతాయి. వెంటనే కార్తీక్ ఉండొచ్చు కదా.. భారతికి తోడుగా అనగా నువ్వు ఉన్నావ్‌గా ఫ్రెండ్‌గా అనుకుంటు అక్కడ నుంచి వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు డాక్టర్ భారతి దీపకు ఒక ఇంజక్షన్ ఇస్తూ ఇంజక్షన్ ఇచ్చాక మత్తుగా ఉంటుంది కానీ పడుకోవద్దని చెబుతుంది. ఇంజక్షన్ ఇవ్వగానే దీప మత్తు రావడంతో పడుకుంటుండగా డాక్టర్ భారతి దీపతో పడుకోవద్దని లేపుతుంది. ఆ తర్వాత సౌందర్య, కార్తీక్‌లు అక్కడికి వస్తారు. దీపతో ధైర్యంగా ఉండు.. నిద్ర అసలు పోకుడదంటుంటే దీప సరే అన్నట్లు నవ్వుతూ తల ఊపుతుంది. సౌందర్య కూడా చెప్పడంతో ఆమెనే చూస్తూ దీప చిరునవ్వు చిందిస్తుంది. నాకు ధైర్యం చెప్పడం కాదే నువ్వు ధైర్యంగా ఉండు అని చెబుతుంది. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యలను మీరు వెళ్లండి నేను చూసుకుంటా అని చెప్పి బయటకు పంపిస్తుంది. ఆ తర్వాత కార్తీక్ సౌందర్యతో నువ్వు ఇంటికెళ్లు మమ్మీ నేను ఉంటానంటే, నువ్వే వెళ్లరా ఫ్రెష్ అయ్యి కాస్తా తిని రమ్మనగా అది ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఉంటే నేను ఎలా వెళతాను మమ్మీ.. ఇక్కడే ఉంటానని అంటాడు కార్తీక్. -
Karthika Deepam: దీపకు స్లోపాయిజన్ ఇచ్చారు అనగానే..
కార్తీకదీపం సీరియల్.. దీప ఆరోగ్యం దిగజారిపోవడంతో కార్తీక్ హాస్పిటల్లో అడ్మిట్ చేపిస్తాడు. ఆ విషయం తెలుసుకుని మోనిత ఆస్పత్రికి వచ్చిన మోనిత ఎలాంటి ప్లాన్‌తో ఉందో తెలియదు. మరోవైపు ఎలాగైనా దీపను బతికించుకోవాలని చూస్తున్న డాక్టర్ బాబు ప్రయత్నం తిరుతుందా లేదంటే మోనిత కొత్తగా దీపపై ఎమైనా పన్నాగాలు పన్ననుందా అనేది తెలుసుకోవాలంటే నేటి(మే 26) ఎపిసోడ్ ఇక్కడ చదివేయండి.. కార్తీక్, డాక్టర్ భారతి, డాక్టర్ గోవర్థన్‌లు మాట్లాడుకుంటుంటే మోనిత అక్కడకు వస్తుంది. వారిని పలకరించినప్పటికీ ముగ్గురు మోనితను పట్టించుకోకుండా వారు సీరియస్‌గా డిస్కషన్ చేసుకుంటున్నారు. దీంతో ‘హాలో.. నేను కూడా డాక్టర్నే, నన్న కాస్త గుర్తించండి. నాతో కూడా డిస్కషన్ చేయోచ్చు’ అని మోనిత అంటుంది. దీంతో భారతి మొదటి నుంచి చెప్పలేము.. దీపకు పదేళ్ల క్రితం ఎవరో స్లోపాయిజన్ ఇంజెక్ట్ చేశారు అనగానే మోనిత ఒక్కసారిగా కంగుతింటుంది. అది ఇన్నాళ్లుగా మెల్లిమెల్లిగా ప్రతి టిష్యును డ్యామెజ్ చేసుకుంటు.. ఒక్కో ఆర్గాన్ పనిచేయకుంగా చేస్తూ వస్తోంది. ఆ డ్రగ్ బయటకు వెళ్లే అవకాశం లేదు అందుకే బ్లడ్ ప్యూరిఫై చేయాల్సి వచ్చింది. దానికి డయాలసీస్ తప్ప వేరే మార్గం లేదు’ అని భారతి వివరిస్తుంది. అలాగే డాక్టర్ గోవర్ధన్ కూడా దీప ఆరోగ్య పరిస్థితి మాత్రం విషమంగానే ఉంది అంటాడు. మరోవైపు పిల్లలు(హిమ, శౌర్య) ఇంటి దగ్గర దిగులుగా ఉంటారు. వారణాసి వాళ్లకు అన్నం పెట్టాడు. ఆ తర్వాత వారణాసితో అమ్మకు ఏంకాదు కదా.. ఏం కాదమ్మా.. అక్కడ ఎంతోమంది డాక్టర్లు ఉంటారు, వాళ్లు అమ్మకు ఏం కాకుండా చూస్తారు. మీ డాడి కూడా డాక్టరే కదా అని వారికి సర్ది చెబుతాడు. ఇక హిమ ఇక్కడే ఉంటే అమ్మ గుర్తోస్తుంది నానమ్మ వాళ్ల ఇంటికి వెళదాం.. వారణాసి మమ్మల్ని అక్కడ దీంపుతావా అని అడుగుతుంది. శౌర్య కూడా అవును మనం ఇప్పుడు ఇక్కడ కంటే ఆదిత్య బాబాయ్, పిన్నితో ఉండటమే కరెక్ట్ అని అక్కడి వెళ్లతారు. ఆస్పత్రి దగ్గర మోనిత, భారతిలు దీప దగ్గరికి వెళ్లి పలకరిస్తారు. దీపను ఇప్పుడు ఎలా ఉంది అని భారతి అడగ్గానే ఇంటికి ఎప్పుడు వెళ్లోచ్చు రేపా, ఎల్లుండా అని అనగా.. గుడ్ ఇలా ధైర్యంగా ఉండాలి అంటుంది భారతి. ఆ తర్వాత దీప నా భర్తను చూడాలని ఉంది, ఆయన్ని పిలవండి అని భారతికి చెబుతుంది. ఆ తర్వాత మోనిత పలకరిస్తూ ఎలా ఉన్నావ్ దీప అనగానే నన్ను ఇలాంటివి ఏం చేస్తాయి, నీలాంటి మహమ్మారే ఏం చేయలేకపోయింది అంటూ మోనితకు కౌంటర్ వేస్తుంది దీప. ఆ తర్వాత నాకు తెలుసు నేను లేకపోతే నా భర్తను పెళ్లి చేసుకుంటావని, నీకు ఆ అవకాశం ఇవ్వను. ఎందుకంటే నేను ఉండగా నా భర్తను చేసుకునే ధైర్యం నువ్వు చేయవు అంటుంది దీప. మోనిత కార్తీక్ వస్తున్నట్లు గమనించి.. ‘నువ్వు బతకాలి దీప. నిండు నూరేళ్లు బతికి నీ భర్త, పిల్లలతో హాయిగా ఉండాలి’ అంటు దొంగ ఏడుపు ఏడుస్తుంది. కార్తీక్ రాగానే గెట్ అవుట్ దీప నా భర్తతో మాట్లాడాలి అంటుంది. ఆ తర్వాత మోనిత బయటకు వెళ్లి డోర్ నుంచి వాళ్లను గమనిస్తుంది. ఇక కార్తీక్, దీపలు ఒకరిని ఒకరు అలాగే చూసుకుంటూ ఉంటారు. కార్తీక్ చెప్పు వంటలక్కా అని పిలవగానే దీప నవ్వుతుంది. ఇలా నవ్వుతూ ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి దీప అంటు కాస్త సరదాగా మాట్లాడుతాడు. నువ్వు మీ డార్లీంగ్ అత్తయ్యాతో షాపింగ్ అని తిరగాలి, పిల్లలకు రకరకాల వంటలు వండిపెట్టాలి. దొసకాయ పచ్చడి పిల్లలకే కాదు కాలనీ మొత్తం పంచాలంటూ దీప కార్తీక్‌తో మాట్లాడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఇక నాకు ఏమైన అయితే డాక్టర్ బాబు అనగానే స్టుపిడ్ నీకు ఏం కాదు ఇంకోసారి అలా మాట్లాడకు అని కార్తీక్ అక్కడి నుంచి వెళ్లి సౌందర్య పక్కన కూర్చుంటాడు. బయట సౌందర్య భుజం మీద తల వాల్చగానే సౌందర్యతో అది చివరి క్షణాలు అంటూ ఇప్పటికైనా నమ్మనని చెప్పండి అని చేతిలో చెయ్యేసి అంత ధీనంగా అడిగినప్పుడు కూడా నీకు చెప్పాలనిపించలేదారా, ఏం మాట్లాడకుండ అలా మౌనంగా ఉండిపోయావు అని అడుగుతుంది. ఆ తర్వాత తరువాయి భాగంలో కార్తీక్ దీప రూం బయట నిలుచుని నీకు ఏం కావద్దు నువ్వు బ్రతకాలి దీప అని మనసులో అంటుండగా దీప పల్స్రేట్ పడిపోతుంది. ఊపిరి ఆడక కొట్టుకుంటుంది. వెంటనే కార్తీక్ డాక్టర్ భారతి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి దీప పరిస్థితి గురించి చెబుతాడు. వెంటనే వాళ్లు అక్కడికి వెళ్లి చెక్ చేస్తుంటారు. చదవండి: కార్తీకదీపం: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు -
karthika Deepam: క్షమాపణలు చెప్పే అవకాశం కూడా ఆ దేవుడు ఇవ్వలేదు
కార్తీకదీపం మే 25: దీప టాబ్లెట్ వేసుకున్న మరు క్షణంలో కళ్లు తిరిగి పడిపోతుంది. దీంతో సౌందర్య, పిల్లలు కంగారు పడిపోతుంటారు. తల్లికి ఏమైందోనని శౌర్య, హిమలు భయంతో ఏడుస్తుంటారు. ఇంతలో కార్తీక్, మురళీ కృష్ణ ఇంటికి రాగానే పిల్లల ఏడుపు వినిపించడంతో కంగారు పడుతూ ఇంట్లోకి వస్తారు. అక్కడ దీప జీవచ్చవంలా పడి ఉండటం చూసి మురళీ కృష్ణ షాక్ అవుతాడు. కార్తీక్ దీపకు నీళ్లు తాగించగా అవి బయటకు వచ్చేస్తాయి. అలా షాక్‌లో దీప వంకే చూస్తుండిపోతూ.. ‘కనీసం ఆ దేవుడు నాకు క్షమణలు కోరే అవకాశం కూడా ఇవ్వడం లేదేంటి దీప. నాకు నిజం తెలిసిందని నీకు చెబితే అదే నిన్ను సంజీవినిలా బ్రతికేంచేదని’ కార్తీక్ మనసులో అనుకుంటూ దీపను దగ్గరగా పట్టుకుని హత్తుకుంటాడు. ఇక పిల్లలు ఏడుస్తుంటే అమ్మకు ఏం కాదు మీరు ఊరుకొండమ్మా అని చెప్పి సౌందర్యతో.. మమ్మీ పిల్లలను దగ్గరికి తీసుకో అంటాడు. మురళీ కృష్ణ కూడా అమ్మ దీపా అంటు బాధపడుతుంటే నన్ను నమ్మండి దీపకు ఏంకాదు ఎలాగైనా తనని బ్రతికించుకుంటానని ధైర్యం చెబుతాడు. వెంటనే ఫోన్ తీసి డాక్టర్ గోవర్ధన్ నెంబర్ ఉంటుందని దానికి కాల్ చేసి ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని చెప్పు మమ్మీ అని సౌందర్యకు ఫోన్ ఇస్తాడు. అలాగే డాక్టర్ భారతికి కూడా ఫోన్ చేసి చెప్పిన హాస్పిటల్‌కు రమ్మని చెప్పమంటాడు. ఇక దీపను హాస్పిటల్‌కు తీసుకేళ్లి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్తుంటే నీకు ఏంకాదు ఎలాగైనా బ్రతికించుకుంటాం నువ్వు ధైర్యంగా ఉండు దీప అంటుంది సౌందర్య. అలాగే మురళీ కృష్ణ కూడా ఆ దేవుడు నీ వైపు ఉన్నాడమ్మా నీకు ఏం కాదు అంటాడు. దీప కార్తీక్ వంక చూస్తు దగ్గరగా రమ్మనంటు సైగ చేస్తుంది. దీంతో కార్తీక్ దగ్గరగా వచ్చి దీప చేయిని తన చేతిలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ‘ఇవి నాకు చివరి క్షణాలని నాకు అర్థమవుతుంది డాక్టర్ బాబు... నేను వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త.. ఇప్పటికైనా నన్ను నమ్మానని చెప్పండి డాక్టర్ బాబు హాయిగా కళ్లు మూస్తాను’ అని అంటుండగా డాక్టర్ వచ్చి పెషేంట్ కండీషన్ తెలియదా ఇంక ఇక్కడే ఉంచారేంటని హడవుడి చేస్తాడు. మరోవైపు మోనిత తన హాస్పిటల్‌కు వెళ్లడానికి రెడీ అవుతుంటే ప్రియమణి కాఫీ తీసుకువస్తుంది. కాఫీ తెమ్మని చెప్పిన అరగంటకు తెస్తావా నీకు బద్దకంగా బాగా పెరిగిపోయిందే అంటుంది మోనిత. దీంతో ప్రియమణి.. బద్దకం కాదమ్మా, పని ఎక్కువై అన్ని పనులు నేనే చూసుకోవాలి కదా అంటుంది ప్రియమణి. ఆ కాఫీ తాగి మోనిత హాస్పిటల్‌కు బయలుదేరబోతుంటే డాకర్ భారతి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది. దీంతో మోనిత తెగ ఆనందపడుతూ.. ఫొన్ అవునా!.. వస్తున్న వెంటనే బయలుదేరుతున్నా అంటు బాధపడిపోతున్నట్లు నమ్మిస్తుంది. ‘దీపమ్మ ఆస్పత్రిలో చేరిందనగానే మీ మొహంలో ఆనందం కనిపించిందమ్మ. దయ చేసి దీపమ్మను చంపడం లాంటివి చేయకండి’ అని ప్రియమణి మోనితతో అనగానే నాకు ఇప్పటి వరకు ఇలాంటి ఆలోచనే లేదే నువ్వు అన్నాకే వచ్చింది. చూస్తా అంటు వెళ్లిపోతుంది. మరోవైపు ఆదిత్య ఏమైంది అమ్మ రాగానే వదిన ఆరోగ్యం బాగాలేదని వెళ్లిపోయింది.. ఇప్పటి వరకు ఫోన్ చేయలేదని కంగారు పడుతూ అందరికి ఫోన్ చేస్తాడు. ఎవరు ఫోన్ కాల్స్ ఎత్తకపోవడంతో చిరాకుపడుతుంటాడు. మురళీ కృష్ణ నా కూతురికి ఏమైందమ్మా ఏదైనా ప్రాణాంతక రోగమా అనగానే.. సౌందర్య ఏడుస్తూ దానికి ఏం కాదు, ఇక్కడ నా కొడుకు ఉన్నాడు దీపను ఎలాగైనా బ్రతికించుకుంటాం... ఈ హాస్పిటల్ నుంచి సంతోషంగా నా కోడల్ని తీసుకెళ్తాను అంటూ కన్నీరు పెట్టుకుంటుంది. ఇంతలో మోనిత అక్కడకు వస్తుంది. రేపటి ఎపిసోడ్లో దీప, మోనితలు మాట్లాడుకుంటారు. నాకు తెలుసు నువ్వు ఇక్కడికి వస్తావని తెలుసు నా ప్రాణం పోగానే ఇక్కడే నా భర్తతో తాళి కట్టించుకునేందుకు ఎదురు చూస్తున్నావని తెలుసు అంటుండగా... డాక్టర్ బాబు అక్కడికి వస్తాడు. గెట్ అవుట్ మోనిత నా భర్తతో నేను మాట్లాడాలి అంటుంది దీప. -
karthika Deepam: మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచింది
కార్తీకదీపం మే 24: సౌందర్య దీపతో మాట్లాడుతుంటే మధ్యలో శౌర్య, హిమ వచ్చి.. దీపకు ముద్దులు పెడతారు. ‘ఏంటమ్మా’ అంటే దీప అడగ్గా నాన్నమ్మ మాకో కథ చెప్పిందమ్మ. అందులో ఇద్దరుంటారు. వాళ్లు ఎవరో కాదు నువ్వు.. నాన్నా.. మీరెంత మంచివాళ్లో నాన్నమ్మ మాకు అర్థమయ్యేలా చెప్పింది. అందుకే ముద్దు పెడుతున్నామంటు వారు మురిసిపోతుంటారు. అది వినగానే దీప కాస్త సంతోషంగా నవ్వుతుంది. తర్వాత హిమ నాన్నమ్మా మాకు అమ్మ కూడా ఓ కథ చెప్పింది. ఆవు పులి కథ. అది వింటే మాకు చాలా ఏడుపొచ్చింది అని దీప చెప్పిన కథను సౌందర్యకు వివరిస్తుంటారు. దీంతో ఆ కథ దీపను ఉద్దేశించే చెప్పిందని తెలుసుకుని, కొన్నిసార్లు పులి చెడ్డది కాదమ్మా.. ఆవులోని అమ్మదనాన్ని, ఆ కమ్మదనాన్ని తెలుసుకుంది. బిడ్డలకి త్లలిని దూరం చేయదు, ఎప్పటికీ దూరం చేయదంటూ భావోద్వేగంతో చెబుతుంది సౌందర్య. మరోవైపు ప్రియమణి వంటలో ఉప్పు లేకుండా మోనితకి పెడుతుంది. అది తిని ఇందులో ఉప్పలేదని అడగ్గానే.. దానికి కావాలనే వేయలేదమ్మా.. మీరు కనిపెడతారా లేదా టెస్ట్ చేశా అంటు మోనితకు ప్రియమణి షాకిస్తుంది. దీంతో మోనిత చిరాకుతో తిట్టిపోస్తూ అసహనం చూపిస్తుంటే... ఈ తిట్లన్ని నా మీద కోపంతో కాదమ్మా, కార్తీక్ బాబు ఈ మధ్య ఇటు రావట్లేదనే కదా.. కార్తీక్ అయ్య నీ దగ్గరకు సలహాల కోసం.. బాధ చెప్పుకోవడం కోసం మాత్రమే వస్తాడమ్మా.. మీరే నోరు తెరిచి మీ మనసులో ఉన్నది చెప్పాలి.. వచ్చినప్పుడే మాట్లాడండి.. పోట్లాడండి.. రానప్పుడు మాత్రం ఇలా నీరసంగా కూర్చోకండి’ అని అక్కడ నుంచి వెళ్లగానే.. మోనిత తనలో తను నవ్వుకుంటుంది. ‘పిచ్చి ప్రియమణీ నేను సైలెంట్‌గా ఎందుకు ఉన్నానో తెలుసా? చెవులు పగిలిపోయే సౌండ్ వినిపించాలని’ అంటూ పకపకా నవ్వుకుంటుంది. ఇదిలా ఉండగా దీప ఇంటికి బయలుదేరిన మురళీ కృష్ణ స్కూటీ పెట్రోల్ అయిపోవడంతో మధ్యలో ఆగిపోతుంది. స్కూటీని తోసుకుంటూ వెళుతుంటే మధ్యలో కార్తీక్ చూసి కారు ఆపుతాడు. మురళీ కృష్ణ అలసిపోయి తూలి పడిపోబోతుండగా.. అప్పుడే కార్తీక్ స్కూటీని పట్టుకుని సాయం చేస్తాడు. గతంలో ఎన్నోసార్లు ఆయన్ని అవమానించిన సన్నివేశాలను తలుచుకుంటూ చిన్నబోతాడు కార్తీక్. ‘బాబు మీరా.. మీ దగ్గరికే బయలుదేరాను బాబు.. పెట్రోల్ చూసుకోకుండా వచ్చాను.. పెట్రోల్ పోయించుకుని వస్తాను’ అంటూ స్కూటీ పట్టుకుని కదలబోతాడు మురళీ కృష్ణ. కార్తీక్ వెంటనే బండి సైడ్‌కి పెట్టండంటు స్కూటీని పక్కకు తీసుకెళ్లి పార్క్ చేస్తాడు. వారణాసికి చెప్పి పెట్రోల్ పోయించి తీసుకుర్మమని చెప్తా అంటాడు. అలా అయితే నేను ఎలా రావాలి బాబు అని అడగ్గానే మన కారులో వేళదామనడంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. వెంటనే కార్తీక్ మురళీ కృష్ణ రెండు చేతుల్ని పట్టుకుని మీ పెద్దరికం ముందు నా చిన్నతనం తలవంచిందని క్షమాపణలు కోరతాడు. షాక్‌లో ఉన్న మురళీ కృష్ణ తన చేతుల్ని వెనక్కి లాక్కుని ఏంటిది బాబు.. అనగా.. ఏం లేదు.. రండి మామయ్యా అని పిలుస్తాడు. దీంతో మురళీ కృష్ణ అయోమయంగా చూస్తూ.. ‘మీరు.. నన్ను.. మామయ్యా అని..’ అంటూ కన్నీళ్లుపెట్టుకునేసరికి.. ‘నేను మీ పెద్ద అల్లుడ్ని మామయ్యా.. రండి’ అంటూ కారులోంచి వాటర్ బాటిల్ తీసి తాగమని ఇస్తాడు. ‘బాబూ.. దీప.. బాగానే ఉంది కదా’ అని మురళీ కృష్ణ అగడంతో.. ‘బాగుంది.. బాగుంటుంది. నేను ఉండగా దీపకు ఏం కాదు.. కానివ్వను అంటాడు. దీంతో మురళీ కృష్ణ ‘దీప ఆరోగ్యానికి ప్రమాదామా బాబు’ అని అడగ్గా.. దీప ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుంది.. నా మాట నమ్మండి అని నచ్చజెప్పి కారు ఎక్కమంటాడు. దాంతో మురళీ కృష్ణ.. ‘ఏంటి ఈయన ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడు? నా కూతురు సంతోషంగా ఉంటుంది అంటున్నాడు’ అని ఆలోచించుకుంటూ ఉండగా.. కార్తీక్.. ‘మామయ్యా ఎక్కండి’ అని మరోసారి పిలుస్తాడు. ఇద్దరు కలిసి ఇంటికి బయటుదేరుతారు. ఇదిలా ఉండగా.. సౌందర్య దీపని పిలిచి టాబ్లెట్స్ వేసుకోమని ఇస్తుంది. దీప వేసుకుని.. తన పవిత్రతని నిరూపించుకోలేనందుకు బాధపడుతూ సోఫాలోకి పడిపోతూ సృహ కోల్పోతుంది. కట్ చేస్తే దీపను హాస్పిటల్‌కు తీసుకువెళ్లిన సీన్‌ను తరువాయి భాగంలో చూపిస్తారు. దీప ఇదే తన చివరి క్షణం అన్నట్లుగా కార్తీక్‌తో మాట్లాడుతూ.. ఇప్పటికైన నమ్మానని చెప్పండి డాక్టర్ బాబు ప్రశాంతంగా వెళ్లిపోతానంటూ కళ్లుమూస్తుంది. -
Karthika Deepam: దీప ముందు మనిషిలా నిలబడగలనా!: కార్తీక్
సౌందర్య పిల్లపై కోపపడుతుంది. నా కొడుకు మిమ్మల్ని వదిలి వెళ్లిపోతాడని ఎలా అనుకున్నారే అంటు కాస్త కోపం చూపిస్తుంది. దీంతో హిమ, శౌర్యలు సారీ చెబుతారు. ఆ తర్వాత పిల్లలు నాన్న, అమ్మ ఇద్దరు అసలు సరిగా ఉండటం లేదని చెప్పడంతో సౌందర్య పిల్లలకు అర్థమయ్యే భాషలో వారి మధ్య ఉన్న సమస్య గురించి వివరిస్తుంది. మీ అమ్మకు నాన్నకు మధ్యలో కాలుష్యం ఉందని, అది తొలగిపోతే అంతా సంతోషమే అంటు చెప్పు కొస్తుంది. తర్వాత పిల్లల్ని గుండెలకు హత్తుకుని. ‘మీ అమ్మని ఎంత ఖర్చు అయినా సరే బతికించుకుని తీరాలి’ అని తనలో తనే అనుకుంటు కన్నీరు పెట్టుకుంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్.. కారు డ్రైవ్ చేస్తూ వెళ్తూ.. డాక్టర్ చెప్పిన నిజం గురించి ఆలోచించుకుంటూ ఉంటాడు. మీరు అబద్దం అనేది నిజం.. మీరు నిజం అనుకునేదే అబద్దం.. ఈ నిజానికి అబద్దానికి మధ్య ఉన్న తేడా చెరిగిపోవాలంటే కావాల్సింది నా మీద నమ్మకమని దీప వాదించిన మాటలను, దీప నిప్పురా.. విహారీకి పిల్లలే పుట్టరని తెలిశాక ఇక దీప తప్పు లేనట్లే కదా అన్న సౌందర్య మాటలను గుర్తు చేసుకుంటూ కారు సడన్‌గా ఆపేస్తాడు. ఏడుస్తూ కారు దగ్గర దీప, అమ్మ ఎన్ని చెప్పిన నేను వినలేదు అంటూ పశ్చాత్తాప పడుతాడు కార్తీక్. దీప ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పటి తర్వాత తనకు ఇద్దరు కవలలు పుట్టారనే నిజం తెలుసుకున్న దీప, ఆ విషయాన్ని కార్తీక్‌తో సంతోషంగా చెప్పుకుంటుంది. వారిని నీ కన్న బిడ్డలుగా అక్కున చేర్చుకొమ్మని వారిని అనాథలను చేయకండంటు కార్తీక్ కాళ్లు పట్టుకుని ఏడ్చిన సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ తర్వాత కార్తీక్ ‘విహారి గాడితో ఇద్దరు పిల్లలను కని, వాడిని అన్న అని పిలిచేంతగా దిగాజారావా.. నీతి మాలిన దానా.. అవతలికి పో’ అంటు దీపను కాలితో తన్నిన ఆ సన్నివేశాన్ని తలచుకుంటు కుమిలిపోతాడు. అంతేగాక ‘మమ్మీ నేను తప్పు చేశాను మమ్మీ.. నువ్వు ఎంత చెప్పినా నమ్మకుండా దీపకు నరకం చూపించాను మమ్మీ.. చిత్రవధ చేశాను.. గాయపడిన మనసుకు మళ్లీ మళ్లీ ఎన్నో సార్లు గాయం చేశాను.. నిజంగా దీపా భూదేవి లాంటిదే మమ్మీ.. అది దీప కాబట్టి.. ఇంకా ఇంకా నన్ను ప్రేమిస్తోనే ఉంది. మారతానన్న నమ్మకంతోనే ఉంది’ అని ఏడుస్తూ చాలా మదనపడతాడు. ‘ఎంతో మంది పతివ్రతలు శీల పరీక్ష కోసం అగ్ని ప్రవేశం చేశారు.. అది ఒక్కసారే.. కానీ నేను పదేళ్లగా అగ్ని ప్రవేశం చేస్తూనే ఉన్నా డాక్టర బాబు’ అని దీప అన్న మాటల్ని తలుచుకుని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోతాడు కార్తీక్. ‘దీపా.. ఎప్పటికైనా మీకు నిజం తెలుస్తుందని.. ఆ రోజు నీకంటే నేనే ఎక్కువ బాధపడతానని ఎన్నో సార్లు అన్నావ్.. అది నిజం దీపా.. నాకు నిజం తెలిసింది. కానీ ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాల్చేస్తుంది. నా అహంకారాన్ని బూడిద చేస్తోంది. నేను తప్పు చేశాను.. ఘోరమైన పాపం చేశాను.. అమానుషంగా ప్రవర్తించాను.. నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయివాళ్లలా చూశాను.. నీ మాతృత్వాన్ని చాలా అవమానించాను.. ఏం చేస్తే.. ఈ పాపనికి ప్రాయశ్చిత్తం దొరుకుతుంది? నా చదువు, నా సంస్కారం, నా సర్వస్వం ఇవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయని లోలోపల విలపిస్తాడు. ఇవన్ని నన్ను పేదవాడ్ని చేశాయి దీప, ఉత్త చేతులతో నీ ముందు నిలబడతాను వస్తున్నాను దీపా.. నీ దగ్గరకు వస్తున్నాను’ అంటూ కార్తీక్ కారు స్టార్ట్ చేసి బయలుదేరతాడు. ఇక తరువాయి భాగంలో దీప కళ్లు తిరగిపడిపోవడం, తాను చనిపోతే డాక్టర్ బాబు మోనితను పెళ్లి చేసుకుంటాడా అత్తయ్యా అని దీప భయపడుతుంది. చిన్నప్పుడు నేను సవతి తల్లి దగ్గర పెరిగి నరకం చూశాను అత్తయ్యా.. నా బిడ్డలకు ఆ నరకం వద్దు అంటునే సోఫాలో కుప్పకూలిపోతుంది. ఆ తర్వాత కార్తీక్, పిల్లలు, సౌందర్య, మురళీ కృష్ణ దీపను లేపే ప్రయత్నం చేస్తారు. కానీ దీప లేవదు, కార్తీక్ నీళ్లు తాగించిన ఆ నీరు బయటకు రావడంతో కార్తీక్ షాకవుతున్నట్లు చూపిస్తారు. ఆ తర్వాత ఏమైందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: క్షీణించిన దీప ఆరోగ్యం, పశ్చాతాప పడుతున్న కార్తీక్
కార్తీకదీపం మే 21: సౌందర్య దీపని ఇక్కడికి ఎందుకు వచ్చావని నిలదీస్తుంది. మీ ఇద్దరు ఒకరినినొకరు సరిగ అర్థం చేసుకోవడం లేదని, మిమ్మల్ని అలా వదిలేస్తే మీరే తేల్చుకుంటారనుకొని నేను, మీ మామయ్య ఇంటినుంచి వెళ్లిపోయాం, చివరకు ఇదా నువ్వు తేల్చుకుంది. ఏంటే నా కొడుకు నీకు అవసరం లేదని ఇక్కడకు వచ్చావా అంటు సౌందర్య దీప మీద చిటపటలాడుతుంది. దీంతో దీప ఏ స్త్రీ భర్తను చివరి వరకు వద్దనుకొదు అత్తయ్య అంటుంది. మరేంటి ఇది.. నువ్వు ఇక్కడకు ఎవరు అవసరం లేదని వచ్చావా అనగానే, దీప దీనంగా సౌందర్య వైపు తిరగి ఏడుస్తూ ఆమో కాళ్లపై పడుతుంది. మీ లాంటి పుణ్య స్త్రీలు మనసారా దీవిస్తే అది జరుగుతుంది అత్తయ్యా, నేను నిండు నూరేళ్లు జీవించాలని మనసారా దీవించండి అంటూ కన్నీరు పెట్టుకుంటుంది దీప. అది తెలిసి సౌందర్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. సోఫాలో కూర్చుని గతంలో కార్తీక్‌తో దీపకు నిజం చెప్పు అంటూ తను చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత వాడు నాతో చెప్పనని చెప్పి, నీతో చెప్పాడా అంటుంది. అంటే మీకు కూడా తెలుసా అని దీప అనగానే తెలుసు అంటూ వణుకుతున్న గొంతుతో సమాధానం ఇస్తుంది. నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమమైపోతారు అత్తయ్య అంటు దీప సౌందర్య ఒళ్లో తల పెట్టి ఏడుస్తుంది. దీంతో వాడు(కార్తీక్) నిన్ను పెళ్లి చేసుకుని డాక్టర్ బాబు కాలేదే, నిన్ను కాపాడుకోవడానికే వాడు డాక్టర్ అయ్యాడు, నిన్ను ఎలాగైనా బతికించుకుంటాడు అంటు దీపను ఒదారుస్తుంది. లేదు అత్తయ్యా.. ఆయన నాకు వైద్యం చేయిస్తారు.. అది నిజమే కానీ నేను బతకాలి కదా? ఒకవేళ నా పవిత్రత రుజువు చేసుకోకుండానే చచ్చిపోతానా అత్తయ్య అంటూ దీప కుమిలిపోతుంది. మరోవైపు మోనిత ‘ప్రియమణి అన్నట్లుగా కార్తీక్ దీపని పసిపాపలా చూసుకుంటున్నాడా? నన్ను అవైడ్ చేస్తున్నాడా?.. అంటే దీపకి విహారీకి సంబంధం అంటగట్టి నేను విజయం సాధించాననుకుంటే.. ఇప్పుడు ఆ సంగతే మరిచిపోయి. దీప చచ్చిపోతుందని తెలియగానే.. చేరదీసి సేవ చేస్తున్నాడా? ఇదంతా చూస్తూ నేనెందుకు ఊరుకుంటాను కార్తీక్.. నా కళ్లల్లో నిప్పులు పోసుకుంటాను.. నిన్ను నావాడ్ని చేసుకోవడానికి నేను ఎంతకైనా తెగిస్తాను.. నాప్రేమ నిజం.. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికే పుట్టాను అన్నదీ నిజం.. చూస్తా.. ఎలా రాకుండా ఉంటావో చూస్తాను.. ఎంతకాలం దీప దగ్గరే ఉంటావో చూస్తాను..’ అని తనలో తనే రగిలిపోతుంది. దీప సర్జరీ విషయమై కార్తీక్ హాస్పిటల్‌కు వెళతాడు. అక్కడ ఈ విషయమై డాక్టర్‌తో మాట్లాడుతుండగా తులసి(విహారి భార్య) రిపోర్ట్స్ చూస్తు ఏడుస్తూ వెళుతుంది. ఆవిడకు ఏమైందని కార్తీక్ అడగడంతో డాక్టర్ అసలు విషయం చెప్తాడు. వారికి పిల్లలు పుట్టరని ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితమే చెప్పానని, అయినా నన్ను నమ్మకుండ ఎక్కడెక్కడో టెస్టులు చెయించుకున్నారంటాడు ఆ డాక్టర్. చివరకు అమెరికా వెళ్లి కూడా పరీక్షలు చేయించుకున్నారంటాడు. అక్కడ కూడా లాభం లేకపోయే సరికి ఏవో చెట్ల మందులు వాడారు.. మళ్లీ టెస్టు చేయించుకుంది. అవే రిజల్ట్స్ వచ్చాయని ఆ డాక్టర్ కార్తీక్‌తో చెబుతాడు. దీంతో కార్తీక్ లోపం ఎవరీలో ఉందని తడబడుతూ అడగ్గా.. ఆవిడ భర్తలోనే అని చెప్తాడు డాక్టర్. దీంతో కార్తీక్ గుండె ఒక్కసారిగా బద్దలవుతుంది. వెంటనే దీపను బిడ్డలకు తను తండ్రి కాదని, అంతేగాక పలుమార్లు తులసితో అసభ్యంగా మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ కుమిలిపోతుంటాడు. ఇంతలో దీపకు సీరియస్ అవుతుంది. నేను పోతే ఆయన మోనితని పెళ్లి చేసుకుంటారా అత్తయ్యా? అని కుమిలిపోతుంది. రేపటి భాగంలో కార్తీక్ ‘నేను తప్పు చేశాను దీప నిన్నే కాదు.. మన బిడ్డల్ని కూడా పరాయి వాళ్లలానే చూశాను’ అంటు పశ్చాత్తాపంతో కూలబడిపోతాడు. మరోవైపు దీప ఆరోగ్య పరిస్థితి దిగజారిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింతో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: డాక్టర్ ద్వారా నిజం తెలుసుకున్న కార్తీక్
కార్తీకదీపం మే 20 : కార్తీక్, దీపకు టిఫిన్ పెట్టి టాబ్లెట్ ఇస్తాడు. ఆ తర్వాత వారణాసిని పిలిచి బయట హోటల్ నుంచి డైలీ క్యారెజ్ తీసుకురమ్మంటాడు. దీంతో దీప ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఓపిక వచ్చింది నేనే చేస్తాను మీరు బయట ఫుడ్ తినలేరు కదా డాక్టర్ బాబు అంటుంది. దీంతో కార్తీక్ నన్ను పరాయి వాడిలా చూడకు, మీతోనే ఉంటున్నా కదా మీలాగే నేను ఉంటాను అంటాడు. ఇదిలా ఉండగా తనతో ప్రియమణి ‘పదహారేళ్లు కాదు కదా నూట పదహారేళ్లు వచ్చినా మీకు కార్తీక్ అయ్యకు పెళ్లి జరగదు’ అన్న మాటలను తలుచుకుంటుంది మోనిత. వెంటనే నవ్వుకుంటూ ఈ మోనిత అంటే పూర్తిగా నీకు తెలియదు ప్రియమణీ. నువ్వు చూసింది నాణానికి ఒకవైపే. రెండోవైపు నీకు తెలియదని మనసులో అనుకుంటుంది. నేను చదువులో ఫస్ట్.. గేమ్స్‌లో ఫస్ట్.. కుట్రలు చేయడంలో కూడా ఫస్టే అలాంటిది పదహారేళ్లుగా కార్తీక్‌ని ప్రేమిస్తున్న లవ్‌లో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతాను? నా లెక్కలు నాకున్నాయి. నా అంచనాలు నాకున్నాయి. నేను ప్రయోగించే పద్దతులు నాకున్నాయి. ఇంక కార్తీక్‌తో నా పెళ్లి ఖాయం అని అనుకుని నవ్వుకుంటుంది. మరోవైపు మురళీ కృష్ణ, భాగ్యంలు దీప ఇంటికి నేను వెళతానంటే నేను వెళతానని అని వాదించుకుంటారు. మురళీ కృష్ణ వెళ్లి ఏడుస్తూ ఇంకా దీపలో బాధ పెంచుతాడని భాగ్యం వద్దు తానే వెళతానడంతో.. నువ్వు వెళ్లి సమస్యను పరిష్కరించకపోగా ఇంకా పెద్దది చేస్తావని మురళీ కృష్ణ అంటాడు. ఇక చివరకు ఇద్దరం వెళ్లొద్దని చెప్పుకుని మనసులో ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లాలనుకుంటారు. ఇక శౌర్య, హిమలు అమ్మ ఎందుకు అంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నాన్న బాగానే చూసుకుంటున్నాడు కదా అయినా ఎందుకు డల్‌గా ఉంటుందని అనుమాన పడుతుంటారు. నాన్న మనం లేనప్పుడు అమ్మను తిడుతున్నాడా? అలా అయితే మనం ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోరు కదా అని మాట్లాడుకుంటారు. ఏదో జరుగుతోంది అదేంటో నేను తెలుసుకుంటానని శౌర్య, హిమతో అంటుంది. ఏం తెలుసుకుంటావు అని అనగానే, నేను ఆ రహస్యాలను ఈజీగా తెలుసుకోగలను, నాన్న మా నాన్నే అన్న నిజం తెలుసుకోలేదు, నువ్వు మా అమ్మ కూతురివే అనే నిజం కూడా నీకంటే మొదట నేనే తెలుసుకున్నాను, అన్ని తెలుసుకున్న దాన్ని ఇది తెలుకోలేనా అంటుంది శౌర్య. అయితే అదేంటో తొందరగా కనిపెట్టు మనం నానమ్మకు చెబుతాం అంటుంది హిమ. కార్తీక్‌కు దీప కాఫీ తీసుకువస్తుంది. ఏంటి నిన్ను పెట్టొద్దన్నాను కదా అని వారించే లోపు మీరు పెట్టిందే డాక్టర్ బాబు ఫ్లాస్క్‌లో ఉన్నది పోసుకొచ్చాను అంటుంది. ఆ తర్వాత కాఫీ గ్లాసు తీసుకుని తాగతూ.. కాసేపు ఆగి మజ్జిగ తాగు చేసిపెట్టాను అంటాడు. దాంతో దీప మజ్జిగ నేను చేసుకోలేనా డాక్టర్ బాబు. మజ్జిగ చేసినా చచ్చిపోతానా అనడంతో నవ్వు ఇబ్బంది పడకూడదని చేసిపెట్టానని, అయినా నువ్వు పదే పదే చావు గురించి మాట్లాడకు అని అంటాడు కార్తీక్. మీరు ఆ మాట ఒక్కసారే చెప్పారు, కానీ చచ్చిపోయేది నేను కదా విని వదిలేయలేను అంటుంది దీప. నువ్వు అంత బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రేపో ఎల్లుండో నీకో చిన్న సర్జరీ చేస్తారు అది అయిన వెంటనే ఇంటికి పంపించేస్తారు. మందులు వాడుతూ జాగ్రత్తగా ఉంటే చాలంటాడు కార్తీక్. దీంతో మీరే దగ్గరుండి సర్జరీ చేయిస్తారా? డాక్టర్ బాబు అంటుంది, అవును అయినా అదేం ప్రశ్న అని కార్తీక్ అనగానే.. నిజం చెప్పండి డాక్టర్ బాబు ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నారా అంటుంది దీప. చాలు అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోకు అంటు అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మోనిత ధీనంగా కూర్చుని ఉంటే.. ప్రియమణి వచ్చి ఏంటమ్మా ఏదో జరుగుతోందని అర్థమవుతుంది అంటుంది. వెంటనే మోనిత ఏంటీ అనగడంతో కార్తీక్ అయ్య దీపమ్మని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చిన్నారిపాపలా చూసుకుంటుంటే. మీరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు అనుకున్నా అని అడుగుతుంది. మీ కడుపు బగ్గున మండిపోతుంది అనుకున్నా.. అలాంటిది ఏం జరగకుండా మీరు కూర్చున్నారంటే ఇదంతా నాకు మింగుడు పడటం లేదు అంటుంది. నువ్వు మాట్లాడేవన్నీ నిజలే ప్రియమణీ ఏదో జరుగుతుంది, అదే ఏంటని ప్రియమని అడగ్గా, అదే నిజం అంటుంది మోనిత, అదే ఏం నిజమనగానే మోనిత ‘కార్తీక్ నా కాళ్ల దగ్గరికి వచ్చే’ నిజం అంటు సిరీయస్‌గా అంటుంది మోనిత. దీంతో ప్రియమని భపడుతూ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు భయంగా ఉందంటు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా సౌందర్య దీప దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి ఎందుకు వచ్చేశావ్ అని దీపకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత సౌందర్య వంకే ధీనంగా, బాధతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ డాక్టర్ ద్వారా అసలు నిజంగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: తల్లిపై దిగులు పెంచుకున్న శౌర్య, హిమ
కార్తీకదీపం మే 19: దీప డాక్టర్ బాబును కార్తీక్ అని పిలుస్తుంది. ఇది కూడా తన పదేళ్ల కోరిక అని మిమ్మల్ని ఎప్పుడైన కార్తీక్ అని పిలవాలనిపించేది డాక్టర్ బాబు అని చెబుతుంది. అంతేగాక వారం, పది రోజుల్లో పోయేదాన్ని ఇప్పుడే ఇలాగే మీ ఒడిలో తలపెటుకుని కన్నుమూయాలనుంది అంటూ ఏమోషనల్ అవుతుంది. దీంతో కార్తీక్.. డాక్టర్లు, మందులు ఉన్నవి మనిషి ప్రాణాలు పోతుంటే చూస్తుండటానికి కాదు అని అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లి స్నానం చేసి వస్తే టిఫిన్ పెడతాను, ఆ తర్వాత టాబ్లెట్ ఇస్తా అంటూ దీప చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ తీసుకుని వెళతాడు. ఆ తర్వాత డాక్టర్ బాబు తనను చేతితో తాకడానికి కూడా ఆలోచిస్తున్నాడంటే.. ఇదంత తన మీద ప్రేమతో కాదని జాలితో చేస్తున్నాడనుకుంటుంది. ఆ తర్వాత దీప స్నానానికి వెళ్లడంతో కార్తీక్ పిల్లలతో కలిసి టిఫిన్ చేస్తాడు. ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటే శౌర్య, హిమలు మమ్మీ కూడా మనతో కలిసి టిఫిన్ చేస్తే బాగుండు అనుకుంటారు. అమ్మ రోజు పొద్దున్నే లేచి ఇళ్లు ఉడిచి, ముగ్గు పెట్టి మాకోసం టిఫిన్ తయారు చేసి అప్పడు లేపేది. ఇలా అమ్మను ఎప్పుడు చూడలేదంటు దిగులు పడుతుంటారు పిల్లలు. దీంతో కార్తీక్ మమ్మీకి ఏం కాలేదు కాస్తా నిరసంగా ఉందంతే. టాబ్లెట్స్ వేసుకుని, కొన్ని రోజులు వంట దగ్గరికి రాకుండ ఉంటే చాలు అంటాడు. దీంతో హిమ అయితే మాకు ఇప్పుడు నువ్వు వంట పనుల్లో కొంచం సాయం చేస్తే చాలు, పెద్దాయ్యాక మాకెవరి సాయం లేకుండా మేమే వంట చేస్తామని కార్తీక్‌తో అంటుంది. అంతేగాక అప్పుడు అమ్మను కుర్చోబెట్టి తనకు ఇష్టమైనవన్ని చేసి పెడతామని, అమ్మకు నచ్చిన సినిమాలు, పుస్తకాలు కొనిపెడతామంటూ ఇద్దరూ అంటుంటే.. కార్తీక్ దీప బతకదు అని డాక్టర్ భారతి చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటాడు. ఇదిలా ఉండగా మోనిత చాలా హుషారుగా కనిపిస్తుంది. ప్రియమణి టీ తీసుకురావడానికి ముందే మోనిత లేచి స్నానం చేసి దేవుడికి దీపం ముట్టిస్తుంది. అది తెలుసుకుని ప్రియమణి షాక్ అవుతుంది. మీరేంటి దీపం ముట్టించడమేంటి అమ్మగారు.. అలా మీరు దేవుళ్లను ఇరకాటంలో పెడితే ఏలా అమ్మగారు అంటు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తుంది. ఎప్పటికైనా చేయాలి కదా ప్రియమణి.. రేపు కార్తీక్‌ని పెళ్లి చేసుకున్నాక పొద్దున్నే లేచి స్నానం చేసి కాఫీ కప్పుతో కార్తీక్‌ను లేపాలి కదా అంటు మురిసిపోతుంది. ప్రియమణి కారు కడుగుతుంటే, మోనిత టీ తాగుతూ బయటకు వస్తుంది. ఆడవాళ్లు ఇలా కారు కడగడం మొదటిసారి చూస్తున్నానని మోనిత అనగానే.. ఆడవాళ్లతో కారు కడిగించే వాళ్లను కూడా నేను ఇప్పుడే చూస్తున్నా అంటుంది. నా దగ్గర పని చేస్తే వాళ్లు ప్రపంచంలో ఎక్కడైన బతుకుతారంటూ మోనిత గర్వంగా చెబుతుంది. హా.. నేను పెళ్లి చేసుకుని వెళ్లాక మీకు ఎలాంటి పనివాళ్లు దొరుకుతారో చూస్తా అంటుంది ప్రియమణి. దీంతో నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా చేసుకోను అన్నావ్ కదే అని అంటుంది మోనిత. అప్పుడు అలా అన్నాను కానీ ఇప్పుడు చేసుకుంటా అంటుంది. నా పెళ్లి అయ్యే వరకు నువ్వు పెళ్లి చేసుకునేది లేదు అనగానే ప్రియమణి.. ఏంటమ్మా మీ పెళ్లి అయ్యాకా నేను చేసుకోవాలా.. అప్పటికి నా వయసు కూడా అయిపోతుంది.. మీ పెళ్లి జరుగుతుందనే అనుకుంటున్నారా, కార్తీక్ అయ్య దీపమ్మను తెచ్చి ఇంట్లో పెట్టి.. దీపా పాపా అంటూ మందులు పట్టుకుని ఆవిడ వెనకాలే తిరుగుతూ ఉంటే..మీ పదహారేళ్ల ప్రేమకు 116 ఏళ్లు వచ్చినా మీ పెళ్లి మాత్రం జరగదు అని వాదిస్తుంది . ప్రియమణి మాటలకు మోనిత రగిలిపోతుంది. అయినప్పటికీ కోపాన్ని ఆపుకుంటు ఈ టైంలో అసలు కోపం తెచ్చుకోవద్దు, చూద్దాం ఏం జరుగుతుందో అని మనసులో అనుకుంటుంది. ఇక దీప స్నానం చేసి రెడీ అయ్యి రాగానే కార్తీక్ టిఫిన్ పెట్టి, టాబ్లెట్స్ ఇస్తాడు. ఆ తర్వాత దీప ఇదంతా నా మీద ప్రేమతో కాకుండా జాలితో చేస్తున్నారు కదా డాక్టర్ బాబు అని అడుగుతుంది. దీంతో నేటి ఎపిసోడ్ అయిపోతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: దీప పదేళ్ల కోరిక తీర్చిన డాక్టర్ బాబు
కార్తీకదీపం మే 18: దీప శ్రీరాంనగర్ బస్తీలో కార్తీక్‌తో కలిసి ఉందని తెలిసి మొరళీ కృష్ణ సంతోష్తిస్తాడు. దీప ఎక్కడికి వెళ్లలేదు, ఈ ఊర్లోనే.. అదే ఇంట్లో ఉందంటూ భాగ్యంతో చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తాడు. దీంతో భాగ్యం దానికి ఇంత ఆత్మగౌరం ఎందుకండి, డాక్టర్ బాబే కదా ఇంటికి తీసుకు వచ్చింది హాయిగా అత్తింట్లో ఉండకుండా దానికి ఇదేం పిచ్చి అంటుంది. దీంతో మొరళీ కృష్ణ.. డాక్టర్ బాబులో ఇంకా అనుమానం అలాగే ఉందని, తల్లికి కోడలిగా, పిల్లలకు తల్లి అవరమని ఇంకా దాని ఆరోగ్యం గురించి ఆలోచించి తీసుకువచ్చాడని, అత్తింట్లోనే ఓ అతిథిగా ఉండటమంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకేముంటుంది భాగ్యం అని మురళీ కృష్ణ అంటాడు. అవునండి మీరు చెప్పింది కూడా నిజమే.. కానీ దీప ఎప్పుడు ఇలాగే ఇంట్లో నుంచి వెళ్లిపోతుంటే డాక్టర్ బాబు కూడా ఎన్నాళ్లని ఓపిక పడతాడని, ఇలా చేస్తే విసుగొచ్చి ఆ మోనిత దగ్గరికి వెళ్లిపోతే, ఆమెనే పెళ్లి చేసుకుంటే ఏంటి పరిస్థితి అంటుంది. దీంతో మురళీ కృష్ణ కూడా నిజమేనంటు ఆలోచిస్తాడు. అంతేగాక దీప, కార్తీక్‌లు ఎప్పుడెప్పుడు విడిపోతారాని ఎదురు చూస్తుంది ఆ మోనిత అంటు గుర్తు చేస్తాడు. అందుకే ఈసారి వెళ్లినప్పడు దీపతో అత్తింట్లో సర్ధుకునిపోవాలని కాస్తా గట్టిగా చెప్పండని అంటుంది భాగ్యం. ఇదిలా ఉండగా కార్తీక్ దీప గురించి ఆలోచిస్తుంటాడు. దీప తప్పు చేసిందో లేదో పక్కన పెడితే మనిషిగా తనను హ్యాపీగా చూసుకోవాలని, దీప రక్షించుకోవాలని అనుకుంటాడు. అందుకు దీపను జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటాడు. ఇక తెల్లారినా దీప లేవకపోవడంతో పిల్లలు (శౌర్య, హిమ) రెడీ అయ్యి కార్తీక్ కోసం టిఫిన్ తయారు చేయడానికి వంటగదిలోకి వెలతారు. శౌర్య దోశ వేస్తుంటే హిమ పక్కనే ఉండి చూస్తుంటుంది. అంతేగాక ఇంకా చట్నీ కూడా చేయాలి ఏం చేద్దామని అడుగుతుంది శౌర్యను. ఇదిలా ఉండగ పెనం మీద వేసిన దోవ దానికి అతుక్కుపోయి మాడిపోతుంది. శౌర్య దాన్ని తీసేందుకు కాస్త బలం ఉపయోగించడంతో దోశ ఎగిరి నెలపై పడుతుంది. దీంతో పిల్లలు అయ్యో అని అరవగానే కార్తీక్ పరుగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. వంటగదిలో శౌర్య, హిమలను చూసి ఏమైంది అలా అరిచారని అడగడంతో అమ్మ ఇంకా లేవలేదని, మీకు పొద్దున్నే టిఫిన్ చేసే అలవాటు కదా మీ కోసం దోశ చేసిపెడదామని వచ్చామని చెప్పగానే కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. నా పిల్లలు నాకోసం టిఫిన్ చేస్తారా, ఏం అక్కర్లేదు మీ చిట్టి చేతులకు గాయాలైతే ఈ నాన్న తట్టుకుంటాడా అంటాడు. మీరు వెళ్లండి ఈ రోజు నేను టిఫిన్ చేస్తా అనగానే.. పిల్లలు సరే నాన్న నువ్వు దోశలు వేయి మేం చట్నీకి అవసరమైనవి రెడీ చేస్తామంటారు. ఇక కార్తీక్ దోశలు వేసి దీప కోసం కాఫీ తీసుకుని వెళతాడు. దీపను లేపి కాఫీ చేతికిస్తాడు. లేచారా డాక్టర్ బాబు రాత్రి దోశల పిండి రుబ్బి పెట్టాను టీఫిన్ వేస్తా అనేలోపు.. కార్తీక్ నేనే దోశలు వేశాను. అందరి కోసం వేశాను, దోశలు వేసి హాట్ బాక్స్‌లో పెట్టాను, నువ్వు స్నానం చేసి టిఫిన్ చేశాక టాబ్లెట్స్ ఇస్తా అంటాడు. ఇక అక్కడ నుంచి బయటకు వస్తుంటే దీప డాక్టర్ బాబు అని పిలిచి కూర్చోమంటుంది. నాకు ఎప్పటి నుంచో ఓ కోరిక ఉందని, ఒకే గ్లాస్లో మీతో కాఫీ పంచుకోవాలని పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను. పెళ్లైన కొత్తలో మీకు చెబుదామంటే భయం, ఇక దూరమయ్యాక అడిగే అవకాశం రాలేదు. ఇప్పుడు ఎలాగు వెళ్లిపోతున్నాను కదా అందుకే అడుగుతున్న అని కార్తీక్‌తో అంటుంది దీప. వెంటనే దీప చేతిలోని కాఫీ గ్లాస్ తీసుకుని కొంచం తాగి దీపకు ఇస్తాడు కార్తీక్. అది తాగి దీప మురిసిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: ఈ దేవుడే కాదు.. ఆ దేవుడు కూడా దగా చేశాడు: దీప
కార్తీకదీపం మే 17: నువ్వు ఇలానే బాధపడుతుంటే పిల్లలకి తెలిసిపోతుంది. అప్పుడు పిల్లలు తట్టుకుంటారా అని కార్తీక్ దీపతో అంటాడు. గుర్తుంచుకో నీకు వైద్యం చేయించడానికి నేను ఉన్నాను భయపడకంటూ కార్తీక్ దీపకు ధైర్యం చెబుతుంటే.. కనీసం ఇప్పుడైన నన్ను ముట్టుకోవాలనిపించడం లేదా డాక్టర్ బాబు అని అంటుంది. ఇక కార్తీక్ అదేంలేదు ఏదో ఆలోచిస్తున్నానంటూ దీప భుజం తట్టగా.. కార్తీక్ చేతిని దీప తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత.. ‘ఉన్నంతకాలం చేయి వదిలేశారు. ఈ రోజు దాకా దూరంగానే ఉన్నారు. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా ఉన్నారు. కాపురంలో కలిసి నడవకపోయినా.. నా అంతిమ యాత్రలో కలిసి నడిచి తుది వీడ్కోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థాంక్స్ డాక్టర్ బాబు’ అంటు దీప భావోద్యేగానికి లోనవుతుంది. ఆ తర్వాత లేచి బెడ్రూంకి వెళ్లిపోతుంది. మరోవైపు దీపకు ఏదో జరిగినట్లు మురళీ కృష్ణకు పీడకల రావడంతో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తాడు. అలాగే షాక్‌లో ఉండిపోయిన మురళీ కృష్ణకు భాగ్యం నీళ్లు తాగించి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఏమైందయ్యా అని ఆమె అడగ్గా.. ఇలా దీప గురించి కల వచ్చిందిని చెప్తాడు. ‘నా వల్ల కాదు. నా కూతురి కోసం బాధపడుతూ ఇక్కడే ఉండలేను’ అంటాడు. వెంటనే దీపను వెతకడానికి బయలుదేరుతానంటూ మురళీ కృష్ణ కదులుతుండగా.. భాగ్యం.. ‘ఆగండి కోడలును వెతకడానికి కోట్లు ఖర్చపెట్టైనా వాళ్ల అత్తగారు వెతుకుతారు. కానీ, నీకేమైనా అయితే నేను ఒంటరి దాన్నిఅవుతాను‘అంటూ మురళీ కృష్ణను ఆపుతుంది. ఆ తర్వాత దీప ఫోన్ చేస్తానంటూ భాగ్యం ఫొన్ తీసుకుని దీప నంబర్‌కు కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో కార్తీక్, దీపలకు మెలకువ వస్తుంది. అర్థరాత్రి తండ్రి నుంచి కాల్ రావడంతో నాన్నకు ఏమయినా అయిందేమో మా పిన్ని చేస్తున్నట్టుంది ఫోన్ ఎత్తండి డాక్టర్ బాబు అంటుంది దీప. కార్తీక్ ఫొన్ లిఫ్ట్ చేసి హాలో అనడంతో.. భాగ్యం ఎవరో మగ గొంతు వినిపిస్తుందయ్యా అంటుంది. ఆ తర్వాత మురళీ కృష్ణ ఫోన్ తీసుకుని మాట్లాడగా.. హాలో నేను కార్తీక్ అని చెప్పడంతో అతడికి ఒక్కసారిగా ప్రాణం లేచస్తుంది. ఇక దీప దగ్గరే ఉన్నారా అనగా అవునంటాడు. దీప ఎక్కడుందో చెప్పి.. మీ నాన్నతో మాట్లాడమని దీపకు ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప ఫోన్ తీసుకుని ‘ధగా పడ్డావని ఎవరికీ చెప్పకుండా వెల్లిపోయావమ్మా అని మురళీ కృష్ణ అనడంతో. ‘అవును నాన్నా ఈ దేవుడే కాదు.. నన్ను ఆ దేవుడు కూడా దగా చేశాడని’ మనసులో అనుకుంటుంది. అంత కష్టపడటం దేనికమ్మా.. మనంటికి రామ్మా.. నీకోసం నీ పుట్టింటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటాడు మురళీ కృష్ణ. అందరికీ భారంగా ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అంటుంది దీప. వెంటనే మురళీ కృష్ణ.. ‘సరే ఈ రాత్రికి ఆ మాటలెందుకులే ప్రశాంతంగా పడుకోమ్మా అనగానే దీప.. ఇక నుంచి నాకు అంతా ప్రశాంతతే నాన్న’ అని మనసులోనే అనుకుంటుంది దీప. చాలా సంతోషం తల్లీ నువ్వు ప్రశాంతంగా ఉండటమే కావాలి అంటు ఫొన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
Karthika Deepam: హిమ దూరంగా వెళ్లిపోతావా అనగానే ఉలిక్కి పడ్డ దీప
కార్తీకదీపం మే 15: దీప పడుకొకుండా ఆలోచిస్తుంటే.. అమ్మా! నాన్న మమ్మల్ని పంపించమంటే పంపిస్తావా అని హిమ అడుగుతుంది. దీంతో దీప, లేదు అన్నట్లు తల ఊపుతుంది. మరెందుకమ్మ మమ్మల్ని అక్కడే వదిలేసి వచ్చావు, విజయనగరం వెళ్లినట్టు ఈసారి అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోతావా అని హిమ అనగానే దీప ఉలిక్కిపడుతుంది. దూరంగా.. ఎక్కడికో వెళ్లిపోతానంటుంది.. మీ అందరిని వదిలేసి దూరంగా ఎప్పటికీ తిరిగి రాని చోటుకు అంటూ దీప మనసులోనే ఆవేదన చెందుతుంది. ఇక కార్తీక్‌తో మాట్లాడి సౌర్య బెడ్రూంకి వస్తుంది. ఏంటి ఇంకా పడుకోలేదా అని అడుగుతుండగా.. హిమ నిద్ర పట్టకుంటే సౌర్యకు కథ చెప్పేదానివట కదామ్మా, ఈ రోజు ఎందుకో నిద్ర రావడం లేదు కథ చెప్పమని అడుగుతుంది. దీంతో సౌర్య, హిమలు కలిసి దీపను కథ చెప్పమని మారాం చేస్తారు. దీప ఆవు-దూడ కథ పేరుతో తనను ఉద్దేశిస్తూ చెబుతుంది. ఓ ఆవు అడవి గుండా వెళుతుంటే దానికి పెద్దపులి ఎదురవుతుంది. దీంతో ఆవు భయపడుతుందని, అది చచ్చిపోతానని కాదు, తల్లి లేకపోతే దూడ తల్లిలేనిది అవుతుదని చెబుతుంది. దీంతో ఆవు పెద్దపులితో ‘నేను నీకు ఆహారం కావడం కోసమే పుట్టానని నాకు ఇప్పుడే అర్థమైంది. అలాగే అవుతాను కానీ నా ఆఖరి కోరిక ఉంది తీరుస్తావా అని అడగడంతో పులి సరేనంటుందని చెబుతుంటే హాల్ నుంచి కార్తీక్ కథ వింటు ధీనంగా చూస్తుంటాడు. ఇక దీప ‘ఆవు పులితో.. నాకో బిడ్డ ఉంది. తోటి దూడలతో ఆడుకుంటూ ఈ అమ్మ తిరిగి వస్తుందని ఎదురు చూస్తుంటుంది. పసిబిడ్డ ఆకలితో ఉంటుంది. నేను వెళ్లి దాని కడుపునిండా పాలిచ్చి. తోటి దూడలతో ఎలా మెలగాలో, ఎలా ఉండాలో జాగ్రత్తలు చెప్పి వస్తానంటూ పులిని ఆవు వెడుకుంటుంది. అది విని కరిగిపోయిన పులి మళ్లీ రావాలని చెప్పి పంపిస్తుంది. ఆవు దూడ దగ్గరకు వెళ్లింది. ఆఖరిసారి కదా తనివి తీరా ముద్దులు పెట్టుకుంది. కడుపు నిండా పాలిచ్చింది.. జాగ్రత్తలు చెప్పింది. మందతో వెళ్లినప్పుడు విడిగా వెళ్లొద్దు అని చెప్పింది. అందరితోనూ ప్రేమగా ఉండాలని చెప్పింది. అమ్మ లేదని దిగులు పడొద్దు, నేను ఇంకెప్పటికీ తిరిగి రానంటూ ఆవు, దూడకు చెప్పి వెళ్లిపోతుంది’ అని చెబుతూ దీప కన్నీరు పెట్టుకుంటుంది. ఇక ఆవు తిరిగి రావడంతో పులి దాని నిజాయితికి మెచ్చుకుని వదిలేస్తుందని చెబుతంది దీప. అలాగే ఈ కాలంలో అలా వదిలేస్తుందా’ అని దీప అన్న మాటలు కార్తీక్ గుండెల్లో గుచ్చుకుంటాయి. దీప మనసులో పులిలా పొంచి ఉన్న మృత్యువు.. ఈ అమ్మని జాలి తలిచి వదిలేయకపోతే.. మీరేమైపోతారు అమ్మా అంటు సౌర్య, హిమలను హత్తుకుంటుంది. ఇక మొరళి కృష్ణ కూతురు కనిపించడంలేదనే బాధలో మద్యం తాగుతుంటాడు. దీంతో భాగ్యం వచ్చి ఈ సారి దీప కనిపిస్తే పిల్లలను, దాన్ని మన ఇంట్లోనే ఉంచుకుందాం అంటూ మురళీ కృష్ణకు ధైర్యం చెబుతుంది. మరోవైపు దీప మెట్ల దగ్గర కూర్చోని తాను చిన్నతనంలో సవతి తల్లితో పడిన బాధలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటే కార్తీక్ పక్కనే కూర్చుని ఊరుకో అంటూ ఓదారుస్తాడు. దీంతో దీప ‘ఎందుకో ఈ గమ్యం లేని ప్రయాణం.. ఎందుకో.. ఈ పుట్టుక చావు’ అంటూ వైరాగ్యంతో మాట్లాడుతుంటే కార్తీక్ దీపనే జాలిగా చూస్తుంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్లో చుద్దాం. చదవండి: karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప డాక్టర్ బాబుకు హీరో చాన్స్ అలా మిస్సయిందట.. -
karthika Deepam: ఒంటరిగా వదిలేయండని చేతులు జోడించిన దీప
కార్తీకదీపం మే 14: కార్తీక్ తిరిగి ఇంటికి వెళ్లిపోతూ దీపతో టాబ్లెట్స్ వేసుకో, బాగా విశ్రాంతి తీసుకో జాగ్రత్తగా ఉండని చెబుతూ బయలుదేరుతాడు. దీంతో దీప నన్ను భార్యగా చూడనప్పుడు నా జీవితానికి ఎందుకు అడ్డుపడుతున్నారని కార్తీక్‌ను నిలదీస్తుంది. దీనికి కార్తీక్ ఏం సమాధానం చెప్పకుండా వెళ్లిపోతుంటే అడ్డుకుని నాకు సమధానం కావాలంటుంది. కార్తీక్ చెప్పకుండా దాటేస్తుంటే ఇలా నన్ను బాధపెట్టెకంటే ఒక్కసారిగా చంపేయండి అంటూ కన్నీరు పెట్టుకుంది దీప. అంతేగాక కార్తీక్ చేతులను పట్టుకుని చంపేయండి, చంపేయండి అంటూ అరుస్తుంది. దీంతో కార్తీక్ తన చేతులను విడిపించుకుని.. భావోద్యేగంతో అసలు విషయం బయట పెడతాడు. ‘నిన్ను ఎవరూ చంపనవసరం లేదే.. నువ్వే చావబోతున్నావంటూ’ విలపిస్తాడు. దీంతో దీప అయోమయంగా చూస్తూ నేను చావడం ఏంటి, అయితే పిల్లల పరిస్థితి ఏంటి అంటూ ఆవేదన చెందుతుంది. సమయానికి మందులు వేసుకోవాలి, మంట సెగ తగలనివ్వకూడదు, ఆవిరి పీల్చకూడదు అలాగే ఒత్తిడికి లోనవకుండా ప్రశాంతంగా ఉండాలి, ఇప్పటికే చావు అంచులదాక వెళ్లావు అంటూ దీపను హెచ్చరిస్తాడు కార్తీక్. అలా షాక్‌లో ఉండిపోయన దీప... అయినా నేను శారీరకంగానే చచ్చిపోతున్నాను, మానసికంగా మీరు చంపేస్తూనే ఉన్నారు కదా అంటుండగా.. కార్తీక్ నీ పేరులోని దీపం వేడి కూడా నిన్ను కాల్చేసి చంపేస్తుందే అని అంటాడు. అలా కార్తీక్ మాట్లాడుతుంటే దీప అత్తింట్లో తనతో డాక్టర్‌బాబు ప్రవర్తించి తీరు గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత దీపతో మన ఇంటికి వెళదాం పదా అని అడుగుతుంగా కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ చేతులు జోడించి అడుగుతుంది దీప. దీంతో బయటక వెళ్లిపోతాడు కార్తీక్. ఇదిలా ఉండగా మోనితకు నిద్ర పట్టక సతమతవుతుంది. ‘ఎందుకు నేను ఒంటరిదానిలా ఫీలవుతున్నా.. కార్తీక్ మళ్లీ దీప ఇంటికి వెళ్లాడనా, లేక కార్తీక్, భారతిలు ఎలాగైన దీపను బతికిస్తారనా’ అని తనలో తనే అనుకుంటుంది. ఇక కార్తీక్ నన్ను అసలు పట్టించుకోవడం లేదు, ఎన్నో సార్లు అవమానించాడు, దీప వాళ్లు అవమానించేలా మాట్లాడినా ఏం అనకుండా చూసేవాడు. ఇక నుంచి కార్తీక్ అసలు నాఅంతట నేను ఫోన్ చేయను, ఎలాగైనా కార్తీక్ నా చూట్టు తిరిగేలా చేసుకుని, నా వాణ్ణి చేసుకుంటానంటూ తనని తాను సముదాయించుకుని పడుకుంటుంది. ఇక దీప ఇంట్లోనే హాల్లో కార్తీక్ సోఫాలో పడుకుని ఉండగా జరిగిందంతా గుర్తు రావడంతో నిద్ర నుంచి లేస్తాడు. ఇంతలో వాటర్ కోసం అటు వచ్చిన సౌర్య కార్తీక్‌ను చూసి నిద్ర పట్టలేదా నాన్న అని అడుగుతుంది. అవును రౌడి అంటూ.. ఇక్కడ నన్ను సడెన్‌గా చూసి భయం వేయలేదా అడగ్గా.. రౌడీని కదా వేయలేదంటుంది. ఇక మీ అమ్మ పడుకుందా అని అడుగుతాడు కార్తీక్, దానికి సౌర్య లేదు నాన్న కూర్చోని ఆలోచిస్తూనే ఉందని చెబుతుంది. ఇంతలో బెడ్రూంలో హిమ, దీపలు పడుకుని ఉంటారు. హిమ అమ్మ ఎందుకని అన్ని సౌకర్యాలు ఉన్న ఇంట్లో ఉండకుండా ఏ సౌకర్యాలు లేని ఈ ఇంటికి వచ్చేసింది. అక్కడ అయితే కొత్త బెడ్‌షిట్స్, కొత్త బెడ్లు ఇంట్లో పనివాళ్లు ఉంటారు అక్కడ ఉండక.. ఎందుకు పాత బెడ్లు, పాత బెడిషిట్ ఉన్న ఈ ఇంటికి తిరిగి వచ్చిందని ఆలోచిస్తుంది. ఇటూ కార్తీక్ సౌర్యతో సర్లే వెళ్లి పడుకో ఎలాగోలా ఇక్కడే పడుకుంటానని, మీ అమ్మతో నేను ఇక్కడే ఉన్నట్లు చెప్పకు అంటాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనిత గుట్టు తెలుసుకున్న భారతి
కార్తీకదీపం 10 మే: సౌందర్య సలహా మేరకు కార్తీక్ అసలు నిజం దీపకు చెప్పాలని నిర్ణయించుకుని డాక్టర్ భారతిని తన క్లినిక్‌కు పిలుస్తాడు. భారతితో దీపకు అసలు నిజం చెప్పే సమయం వచ్చిందనడంతో ఆమె షాక్ అవుతుంది. ఒక పెషేంట్తో స్వయంగా బ్రతకని చెప్పడం ప్రమాదం. డాక్టరుగా ఆ పని నువ్వు నేను ఇద్దరం చేయలేం అంటుంది. పెషేంట్ టెన్షనతో నరాలు చిట్లిపోతాయి, తట్టుకొలేరు దానివల్ల ఇంకా ప్రమాదమని భారతి కార్తీక్‌తో అంటుంది. కానీ దీప వినడం లేదు ఎంత వద్దని చెప్పినా పట్టుబట్టి వంటగదిలోనే ఉంటుంది. వంటచేస్తానంటోందని కార్తీక్ చెప్పడంతో.. అయితే చెప్పాల్సిందే అంటుంది భారతి. దీంతో కార్తీక్ ఈ విషయం నువ్వే దీపతో చెప్పాలనడంతో భారతి కంగుతింటుంది. దీపతో నేను చెప్పడం కంటే నువ్వు చెప్పడమే కరెక్ట్ కార్తీక్ అంటుంది భారతి. నువ్వు చెప్తేనే ఇన్నాళ్లు నువ్వు అలా ప్రవర్తించడానికి కారణం దీప అర్థం చేసుకుందుటుందని, దీంతో మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయని భారతి కార్తీక్‌తో చెబుతుంది. ఇక అక్కడి నుంచి భారతి మోనిత ఇంటికి వెళుతుంది. దానికంటే ముందు మోనిత సీరియస్‌గా దీప రీపోర్ట్స్ చూసి, ఆ తర్వాత అక్కడే ఓ పక్కన పెడుతుంది. భారతి రాగానే మోనితతో తలనొప్పిగా ఉందని, టీ కావాలంటుంది. ఒకే ఇప్పుడే తెస్తానంటూ టీ తీసుకురావడానికి వెళ్తుంది మోనిత. ఆ తర్వాత భారతి పాపం ఇన్నాళ్లు మోనిత ఒంటరిగా ఉండటమంటే గ్రేట్ అంటు మనసులో అనుకుటుండగా.. ఇంతలో ఎదురుగా ఉన్న మెడికల్ రిపోర్ట్స్ ఫైల్ భారతి కంట పడతాయి. అవి వెళ్లి చూసేసరికి ఏంటి నా హాస్పిటల్ రిపోర్ట్స్లా ఉన్నాయి ఇక్కడికి ఎలా వచ్చాయని అనుకుంటు రిపోర్ట్స్తెరిచి చూసేసరికి భారతి షాక్ అవుతుంది. ‘దీప రీపోర్ట్స్ ఏంటి ఇక్కడ ఉన్నాయి, మరో కాపి తీసుకుని ఉంటుందా? అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా, ఈ రెడ్ మార్స్ ఏంటి, దీప వెనక మోనితా ఎమైనా కుట్ర చేస్తోందా’ అనుకుంటూ మోనితా రావడం గమనించి మళ్లీ అక్కడే పెట్టెస్తోంది. ఇక మోనిత టీ ఇవ్వగానే ఆలోచనలో పడుతుంది భారతి. ఏమైంది చెప్పు అంటూ భారతి నుంచి కార్తీక్ పిలిచిన విషయం గురించి ఆరా తీస్తుంది మోనిత. దీంతో భారతి.. కార్తీక్ తన భార్య ఆరోగ్యంపై బాగా దిగులు పెంచుకున్నాడు. అంటూ జరిగిన విషయం చెబుతుంది. దీంతో నువ్వు నా ప్రేమకు సపోర్టు చేయకుండా భార్యభర్తులు ఇద్దరూ కలిసే సలహాలు ఇస్తావేంటని భారతిపై మోనిత మండిపడుతుంది. దీంతో ‘భార్య భర్త విషయం ప్రతిసారి నీతో మాట్లాడే కుసంస్కారం నాకు లేదని, ఇక నుంచి నీ ప్రేమకు నేను సాయం కాదు కదా కనీసం మద్దతు కూడా ఇవ్వనంటుంది. అంతేగాక దీప రిపోర్ట్స్ ఎందుకు ఇక్కడ ఉన్నాయని నిలదీస్తుంది. నీది ప్రేమ కాదు, ఉన్మామని, ఆ ఉన్మాదనం వల్ల నీకే ప్రమాదం జాగ్రత్త’ అంటూ మోనితను హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది భారతి. దీప తిరిగి శ్రీరాంనగర్ బస్తీకి వెళుతుంది. మళ్లీ డబ్బావాలాగా మారడం కాకుండా పెళ్లిళ్లకు, శుభాకార్యాలకు వంటలు చేయాలని నిర్ణయించుకుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది రేపటి ఎపిసోడ్ తెలుసుకుందాం. -
karthika Deepam: కార్తీక్‌కు సౌందర్య ట్విస్ట్, షాక్‌లో డాక్టర్ బాబు
కార్తీకదీపం మే 8: దీప మొండితనం చూసి కార్తీక్ అసహనం కోల్పోతాడు. ‘అందరిని బద్ద శత్రువుల్లానే చూస్తోంది. ఏం కోరుకుంటుందో, ఇంకా ఏం ఆశిస్తుందో నాకు తెలియదు. పిల్లల కోసం ఓపిక పడుతున్నాను. వారి మొహం చూసి భరిస్తున్నానని.. ఇంకా నన్ను రెచ్చగొడితే..’ అంటూ ఆగిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో దీప సౌందర్యను నిలదీస్తుంది. మీ సుపుత్రుడు మీరు బాగానే ఉన్నారు మధ్యలో నేనే అక్కరకు రాని చుట్టంలా ఉన్నానంటు ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇక సౌందర్య కార్తీక్ దగ్గరికి వెళ్లీ.. దీపకు నిజం చెప్పే సమయం వచ్చింది పెద్దడో అంటుంది. అదేంటని కార్తీక్ షాక్ అవుతాడు. అవును కార్తీక్ దానికి నిజం చెప్పాల్సిందే.ఇంట్లో వాళ్లందరిని శత్రువల్లా చూస్తోంది. అసలు విషయం చెప్తే తప్పా అర్థం చేసుకునేలా లేదంటుంది. అలాగే ఈ విషయం దీపకు చెప్పే బాధ్యత కూడా నిదేనని, తను చెప్పలేనంటూ.. దీప ఆత్మగౌరవం చూసి అత్తగా కంటే తల్లిగా దాన్ని ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నువ్వు ఇక బతకవే అని చెప్పే ధైర్యం నాకు లేదురా అంటు కన్నీటి పర్యంతరం అవుతుంది. అంతేగాక కార్తీక్‌కు మరో ట్వీస్ట్ ఇస్తుంది. నేను, మీ నాన్న కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకుంటున్నామని చెప్పడంతో కార్తీక్ మరోసారి షాక్ అవుతాడు. ఇలాంటి సమయంలో ఏంటి మమ్మీ ఈ నిర్ణయమని అడగ్గా.. తప్పదు వెళ్లాల్సిందేనంటూ ఇళ్లు, ఇంటి ఇల్లాలు జాగ్రత్త అని బెబుతుంది. దీంతో కార్తీక్ సౌందర్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప నేను ఏం చెప్పిన నమ్మదు.. సో డాక్టర్ భారతితోనే చెప్పిస్తా అని అనుకుంటాడు.ఇదిలా ఉండగా..మోనితా మరో ప్లాన్‌తో డాక్టర్ భారతీ దగ్గరకు వెళుతుంది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో కార్తీక్ భారతికి ఫోన్ చేస్తాడు. మోనిత అక్కడే ఉండి కూడా తను వచ్చినట్లు కార్తీక్‌కి చెప్పోద్దని చెబుతుంది. ఇక భారతి ఫొన్ లిఫ్ట్ చేయగానే కార్తీక్ క్లీనిక్ నుంచి బయలుదేరావా? అని అడుగుతాడు. ఇప్పడే బయలుదేరబోతున్నానంటుంది భారతి. అయితే నా క్లీనిక్ దారి మధ్యలోనే కదా నువ్వు వస్తే నీతో ఓ విషయం చెప్పాలంటాడు. దానికి భారతి అరగంటలో వస్తానని చెప్పి ఫోన్ పెట్టెస్తుంది. ఇలా కార్తీక్ దీపకి అసలు విషయం చెప్పి తనన కాపాడుకొవాలని చూస్తుంటే మరోవైపు దీప బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ వంటలక్కగా మారిపోతుంది. మరి తనని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకువస్తాడా, అసలు సౌందర్య, ఆనందరావులు ఎందుకు ఇంటి నుంచి దూరంగా వెళుతున్నారనేది సోమవారం నాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. -
karthika Deepam: మోనితకు దొరికిన క్లూ, ఏంటది..
కార్తీకదీపం మే 7: దీప విషయంలో ఆదిత్య.. కార్తీక్‌ను నిలదీయాలనుకుని పిలుస్తాడు. అదిత్య క్లాస్ పీకడానికే పిలిచాడని కనిపెట్టిన కార్తీక్ శౌర్యను వెంట తీసుకని వెళ్తాడు. శౌర్య ఉండగా ఏం మాట్లాడలేననే అన్నయ్య కావాలని శౌర్య తీసుకువచ్చాడని అనుకుని నువ్వు చాలా తెలివైనోడివి అన్నయ్య అంటాడు. దీంతో శ్రావ్యకు ఫోన్ చేసి అన్నయ్యతో మాట్లాడాలి నువ్వు వచ్చి శౌర్యను తీసుకెళ్లు అని చెబుతాడు. ఇక కార్తీక్ ఆదిత్యతో నువ్వు నాకంటే తెలివైనోడివారా అంటూ శౌర్యను పిలిచి శ్రావ్య పిన్ని పిలుస్తుందట వెళ్లు అని చెబుతాడు కార్తీక్. ఆదిత్య కార్తీక్‌తో ‘వదినను వేరుగా చూస్తు ఎందుకు అలా అవమానిస్తున్నావు. తను ఈ ఇంటికి పెద్ద కొడలు’ అంటూ కార్తీక్‌ని నిలదీస్తాడు. ఈ విషయంలో ‘నేను ఇలాగే ఉంట. ఇదేదో నాకు చెప్పడం కంటే మా అన్నయ్య చెప్పిట్లు వినొచ్చు కదా అని మీ వదినకే చెప్పోచ్చు కదా’ అంటూ అసహనంగా అక్కడి నుంచి కార్తీక్ వెళ్లిపోతాడు. దీంతో ఆదిత్య అన్నయ్య ఇలా ప్రవర్తించడానికి ఇంకేదో బలమైన కారణం ఉంది ఏంటది అని మనసులో అనుకుంటాడు. ఇదిలా ఉండగా మోనిత దేశాన్ని జయించినంత ఆనందంలో ఉంటుంది.. పుస్తకాలన్ని ఎదురుగా వేసుకుని ఏదో వెతుకుతూ ‘హా దొరికింది. కార్తీక్ నువ్వు ఇక ఎక్కడికీ పోలేవు.. నా పట్ల అటెన్షన్ ప్లే చేసే టైం వచ్చింది. కార్తీక్‌ను నేను సాధించా అని తెగ పొంగిపోతుంటుంది’ మరుసటి రోజు ఉదయం కార్తీక్ రేడి అయ్యి కిందకు వస్తాడు. హాల్లో సౌందర్య పేపర్ చదువుతూ ఉంటుంది. మరోవైపు వంటగదిలోనే ఉన్న దీప.. కార్తీక్, సౌందర్యలను గమనిస్తూ ఉంటుంది. ఆమె ఆ సామ్రాజ్యాన్ని (వంటగది) ఏలుతూనే ఉంటుందా? అని కార్తీక్ సౌందర్యతో అనడంతో.. నేను మీ ఇద్దరి మధ్య ఎంత నలిగిపోతున్నానో నీకు తెలుస్తుందా కార్తీక్ అని అంటుంది. కార్తీక్ ఏదో చెప్పబోతుండగా.. దీపని చూసి ఆగిపోతారు. ఇంతలో దీప వచ్చి కాఫీ అందిస్తుంది.. అయిష్టంగా కాఫీ తీసుకుంటారు కార్తీక్. ఆ తర్వాత మీకు ఉల్లిపెసరట్టు చేస్తా.. ఉప్మా చేస్తా.. మధ్యాహ్నం లంచ్‌కి ఇంటికి రావాలి.. లేదంటే నేను బాక్స్ తీసుకుని వంటలక్కలో హాస్పటల్‌కి వచ్చేస్తా.. అని అనడంతో కార్తీక్ కోపంతో ఊగిపోతాడు. ఇంట్లో ఏమైనా ఫుడ్ ఫెస్టివల్ చేస్తున్నారా నేను చెప్పింది చేయరు.. వద్దన్నదే చేయాలని డిసైడ్ అయ్యారా అని కార్తీక్ ఫైర్ అవుతాడు. ఇక సౌందర్య కూడా ఎందుకు దీప ఇలా చేస్తున్నావని, వాడు ఒకటి అంటాడు.. నువ్వు ఇంకోటి అర్థం చేసుకుంటావ్.. వాడు వద్దన్న పనిని పంతంతో ఎందుకు చేస్తున్నావు, సర్ధుకుపోతే సరిపోయేదానికి ఇంత మొండిగా చేయడం దేనికి అని దీపతో అంటుంది సౌందర్య. దీంతో దీప.. అనారోగ్యం అనే వంకతో నన్ను అన్ని పనులకు దూరంగా పెట్టి.. ఒక వస్తువుగా చూస్తుంటే సర్దుకుని పోవాలా. ఇంట్లో ఈ ఖరీదైన వస్తువుల్లో ఏ వస్తువుగా ఉండను అత్తయ్య అంటూ అసహనాకి లోనవుతుంది. మీ కొడుక్కి భార్యగా వద్దుకానీ.. ఈ ఇంటికి ఓ దిక్కుమాలిన కోడలు కావాలని తీసుకొచ్చి ఈ ఇంట్లో పడేశారని వాదిస్తుంది. దీంతో సౌందర్య వాడు అనడం కాదే.. నేనే అంటున్నా నువ్వు మనుషుల్ని అంచనా వేయడంలో పూర్తి ఫెయిల్ అవుతున్నావు.. అందర్నీ శత్రువుల్లాగే చూస్తున్నావు. ఇది నీకు కరెక్ట్ కాదు.. కొద్దిరోజులు ఓపిక పట్టు అని వేడుకుంటుంది. నా ఓపిక మొత్తం ఖర్చయిపోయింది అత్తయ్యా.. అందుకే ఈ రోజు మాట్లాడుతున్నా అని దీప అనడంతో మూర్ఖులతో మనం వాదించలేం మమ్మీ వదిలెయ్ అని అంటాడు కార్తీక్. అవును మూర్ఖురాలినే నన్ను మీరు ఆ రోజు దిగజారిపోయిన నెరజాన అన్నా కూడా నా భర్త నా కోసం వచ్చాడని మనసు మార్చుకుని మీతో వచ్చేశాను అందుకు నేను మూర్ఖురాలినే అంటూ దీప కడిగిపారేస్తుంది. అది కాదు దీపా.. ఒక్కసారి అపార్థాల తెరలు తొలగించి చూడు.. నిస్వార్థంగా నీ కోసం ఆలోచించే వాళ్లు కనిపిస్తారు.. మీ అత్తింటిలో ఉన్నవాళ్లంతా నీ ఆత్మీయులే అని నీ మనసు గుర్తిస్తుందే అని సౌందర్య దీపని బతిమిలాడుతుంది. అయినా సరే దీప మాత్రం తన మొండి వాదనను కంటిన్యూ చేస్తుంది.చివరికి కార్తీక్ కలగజేసుకుని.. ఇప్పటికే ఇది చాలా మాట్లాడేసింది మమ్మీ.. భరిస్తే ఇది మనల్ని బద్దశత్రువుల్లాగే చూస్తుంది. ఆమె ఏం కోరుకుంటుందో.. ఏమి ఆశిస్తుందో.. పిల్లల కోసం నేను ఇవన్నీ భరిస్తున్నా.. నన్ను ఇంకా ఇంకా రెచ్చగొడితే మాత్రం అంటూ దీపకి వేలు చూపిస్తూ హెచ్చరిస్తాడు కార్తీక్. ఇక తర్వాత ఏం జరిగింది, దీప ఎలాంటి నిర్ణయం తీసుకొనుందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. -
karthika Deepam: మోనితతో చేతులు కలిపిన డాక్టర్ భారతి
కార్తీక దీపం మే 6: డాక్టర్ బాబు తనను గెస్ట్‌లా చూస్తూ.. గెస్ట్ రూంలో ఉంచుతూ పరాయి వ్యక్తిలా చూస్తూన్నాడంటూ దీప బాధపడుతుంటే సౌందర్య ఒదార్చే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికి దీప సౌందర్య మాటలు వినిపించుకోకుండా మీరు మీ అబ్బాయి తరపునా మాట్లాడుతున్నారా అని సౌందర్యను ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ‘నాకు నేనుగా ఇంట్లోనుంచి వెళ్లెపోవాలనే డాక్ట బాబు ఇలా చేస్తున్నారు. నేను చచ్చినా వెళ్లను, ఇది నా ఇళ్లు చస్తే ఇక్కడే చస్తాను’ అంటూ బాధతో వెళ్లిపోతుంది. ఇక మోనిత డాక్టర్ భారతిని తన ఇంటికి డిన్నర్‌కు పిలుస్తుంది. విషయమేంటో చెప్పు ఎదో ఇంపార్టెంట్ విషయం అన్నావ్ ఏంటదని భారతి మోనితతో అంటుంది. దీంతో మోనితా ‘నేను కార్తీక్ పడే బాధచూడలేకపోతున్నాను భారతీ.. దీప పరిస్థితి అస్సలు బాగోలేదా’ అని అడుగుతుంది. బాగోలేదు.. నేను అంతా కార్తీక్‌కి వివరంగా చెప్పాను మోనితా.. అది ఆ భార్యభర్తలకు సంబంధించిన విషయం.. నేను నీతో డిస్కర్స్ చెయ్యడం అంత మంచిది కాదేమో’ భారతి అడనడంతో.. కార్తీక్ ఇప్పటి దాకా ఇక్కడే ఉన్నాడని, చాలా బాధపడుతున్నాడని కార్తీక్ వచ్చిన విషయం దీప గురించి బాధపడుతున్న విషయం చెబుతుంది. నువ్వే చూశావ్ కదా తను ఎంత మొండిదో.. అందుకే అసలు విషయం దీపకే చెబితే అయిపోతుందని మోనిత భారతితో కూడా చెబుతుంది. అదేంటి.. మనం పేషెంట్‌కి డైరెక్ట్‌గా చెప్పేస్తామా’ అంటుంది భారతి కాస్త కఠినంగా. చెప్పేస్తే ప్రాణం మీద తీపితో మందులు వాడుతుందని, వాడకపోతే పీఢపోతుంది తనలో ఉన్న ఆలోచనను బయటపెడుతుంది మోనిత. అది విన్న భారతి అవేం మాటలు.. దీప ఇద్దరు పిల్లల తల్లి.. వాళ్ల కోసమైనా ఆమె బతకాలి అంటుంది. దీంతో మనసులోనే మోనితా హా మరి నేనేం అయిపోవాలి సన్యాసం పుచ్చుకోవాలా అనుకుంటుంది. మోనిత. వెంటనే.. ‘నేను చెప్పేదే నిజం అనిపిస్తోంది.. కార్తీక్ బాగా నలిగిపోతున్నాడు. ఏదో ఇంటర్ పాస్ అయిన దాన్ని చేసుకున్నాడు. ఆవిడకి మంట దగ్గర మగ్గిపోవడం ఓ వ్యసనం.. ఈ దేశోద్దారకుడెమె పాపం నగిలిపోతున్నాడని అంటోంది. ఇక భారతి నవ్వుతూ ‘ప్రకృతి చెబితే నమ్మలేదు.. చూస్తుంటే నిజమే అనిపిస్తోంది’ అంటుంది. వెంటనే మోనిత ‘ఏంటి.. నేను కార్తీక్‌ని ప్రేమిస్తున్నానని చెప్పిందా అని అడగ్గానే ‘పెళ్లి అయిన మగాడ్ని ప్రేమించడం తప్పు కదా’ అంటుంది భారతి. ‘పెళ్లికి ముందే ప్రేమించాను. ప్రేమించాకే పెళ్లి అయ్యింది. అది నా తప్పు కాదు కదా.. నా సంగతి వదిలెయ్.. దీప సంగతి నాతో క్లియర్‌గా చెప్పు.. ఇలా మాట్లాడుతున్నానని తప్పుగా అనుకోకు.. దీప పోతే నాకు ఆ ప్లేస్ దొరుకుతుందనే ఆశతో అడగడం లేదు.. కార్తీక్ అంత బాధపడుతున్నాడంటే దీప బతకడానికి అవకాశం ఉందా’ అని అనుమానంగా అడుగుతుంది మోనిత. ‘పరిస్థితి మాత్రం చాలా సీరియస్‌గా ఉంది ఇక అంతా కార్తీక్ చేతుల్లోనే ఉంది’ అంటుంది డాక్టర్ భారతి. ఇక దీప వంట గదిలో పని చేస్తుంటే కార్తీక్ అక్కడికి వచ్చి అంతా చుట్టు చూసి దీప వంట చేయడం చూసి కోపంగా వెళ్లిపోతాడు. అయితే దీప అది గమనించుకోదు. పిల్లలు వచ్చి చెబితే.. ‘బాగానే వాదిస్తున్నాను’ అని తనని తాను పొగుడుకుంటుంది దీప. ఇక డిన్నర్ అయిపోయాక భారతి, మోనిత నవ్వుకుంటున్నట్లు చూపిస్తారు. ఇంకే భారతి ఇంటికి తిరిగి వెళ్లిపోతుండగా.. నువ్వు చెప్పినట్లే చేద్దామని మోనితతో అంటుంది. దీంతో మోనితా థాంక్యూ భారతి ఫ్రెండ్‌కి ఫ్రెండే కదా సాయపడాలి అంటుంది. ‘నో డౌట్ నా సపోర్ట్ ఎప్పుడూ నీకుంటుంది’ అని భారతి మోనితకు అభయం ఇస్తుంది. దీంతో మోనితా భారతికి థాంక్యూ చెబుతుంది. ‘థాంక్స్ ఎందుకు ఫ్రెండ్‌కి ఫ్రెండే కదా సాయం చెయ్యాలి, నీ ప్రేమ చరిత్రలో నిలిచిపోతుంది’ అంటుంది భారతి. ‘నీకు అర్థమైతే చాలు’ అంటూ మోనితా సబ్బరపడితుంది. ‘థాంక్యూ ఫర్ నైస్ ట్రీట్.. గుడ్ నైట్’ అని భారతి అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత ఏమౌతుందో రేపటి ఎపిసోడ్లో చుద్దాం. -
Karthika Deepam: అసలు ట్విస్ట్ చెప్పేసిన మోనిత!
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ ‘కార్తీకదీపం’. ఇప్పటికి 1000 ఎపిసోడ్లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ను దర్శకుడు రోజురోజుకు ఆసక్తికరంగా మలుస్తున్నాడు. దీప అనారోగ్యం, మోనితా ప్రగ్నెంట్ సస్పెన్స్ ప్లాన్‌తో రసవత్తవరంగా సాగుతోన్న ఈ సీరియల్ నేడు (2021 మే 5)న 1031 ఎపిసోడ్‌కు చేరుకుంది. కార్తీక్ దీప అనారోగ్యం విషయం సౌందర్యకు చెప్పిన సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్లో దీప వంట చేయద్దొన్నా కార్తీక్ మీద కోపంతో మొండిగా పట్టుబట్టి వంటలు చేస్తుంది. అంతేగాక పొద్దున్నే టిఫీన్ కూడా చేస్తుంది. దీంతో కార్తీక్ ఎలా రియాక్ట అయ్యాడు, సౌందర్య దీపకు ఏం చేబుతుందో ఈ రోజు ఎపీసోడ్‌లో తెలుసుకుందాం. కార్తీక్ వద్దన్నా దీప ఉదయం దోసెలు వేస్తుంది. వంట చేయనిస్తేనే టాబ్లెట్స్ వేసుకుంటాను అని కండీషన్ పెడుతుంది. దీంతో కార్తీక్ ఏం చెయ్యలేక.. బయట నుంచి టిఫీన్ తెచ్చుకుని దీప ముందే తింటూ ఆమెకు చేసిన ముట్టుకోకుండా బుద్ధి వచ్చేలా చేస్తాడు. అంతే కాకుండా ‘నేను మాత్రం దాని చేతి వంట తినను. నేను తినకుండా ఎన్ని వంటలు చేస్తే ఏం లాభం మమ్మీ’ అని దీపకు అర్థమయ్యేలా చేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మోనిత బుద్ధిగా సోఫాలో కూర్చుని ఏదో రాస్తూ నవ్వుకుంటూ.. ఊహించుకుంటూ మురిసిపోతూ కనిపిస్తుంది. ఇంతలో ప్రియమణి కూరగాయలు పట్టుకుని అక్కడికి వచ్చి కూర్చుని.. ‘ఏంటమ్మా ఏం రాసుకుంటున్నారని అడుగుతుంది. దీంతో మోనితా పుట్టబోయే బిడ్డ పేర్లు అని సమాధానం ఇస్తుంది. అది విన్న ప్రియమణి ఎవరికి పుట్టబోయే బిడ్డ పేర్లు అయోమయంగా అనగానే.. నీకే.. నీకు పుట్టబోయే బిడ్డే పేర్లు అంటుంది మోనిత కోపంగా. ప్రియమణి ఏం అర్థం కానట్లు చూస్తుంది. ‘రేపు నేను కార్తీక్‌ని పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే.. ఆడపిల్ల అయితే ఏ పేరు పెట్టాలి. మగపిల్లాడైతే ఏ పేరు పెట్టాలని రాసుకుంటున్నాను’ మోనిత మెలికలు తిరుగుతూ అంటుంది. ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని భలే రాసుకుంటున్నారమ్మా’ అంటు వ్యంగ్యంగా అంటుంది ప్రియమణి. వెంటనే మోనితకి కార్తీక్ పిల్లలు పుట్టే రిపోర్ట్ మార్చి. తను చెప్పిన అబద్దాలు గుర్తు చేసుకుని.. ‘నేను ఆడిన అబద్దం నా మెడకే చుట్టుకుంటుందా.. హా ఇంకో అబద్దం చెప్పి నమ్మించేస్తే పోలా’ అని అనుకుంటుంది కూల్‌గా. ఇదిలా ఉండగా మొరళి కృష్ణ, భాగ్యంలా సీన్ వస్తుంది. భాగ్యంతో మొరళి కృష్ణ ‘దీప ఇంటికి వెళుతున్న, వీలైతే దీపను పిల్లలను తీసుకువస్తానడంతో.. అది అసలు వస్తుందా.. అయినా నీ సరదా నేను ఎందుకు కాదానాలి వెళ్లండి’ అంటుంది. ఇక కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లి దీప కావాలనే కిచెన్‌లో ఉంటోంది. వేడి సెగలో మగ్గిపోతుంది. నాకు టెన్షన్ పెరిగిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. దీంతో ‘మరీ మీ అమ్మగారు ఏం చెయ్యట్లేదా.. అసలే కోడలి కొంగుపట్టుకుని తిరిగే అత్తగారు’ అంటూ వెటకారం చేస్తుంది మోనిత. ‘మధ్యలో మా అమ్మను అనకు. ఆవిడ మా మధ్య నలిగిపోతుంది’ అంటాడు కార్తీక్. ‘నువ్వు అందరినీ బాగానే అర్థం చేసుకుంటావ్ కార్తీక్.. నీ అతి మంచితనమే నిన్ను బాధపెడుతుంది.. ఈ టెన్షన్ అంతా దేనికీ కార్తీక్.. దీపేం చిన్నపిల్లకాదుగా.. దీపకి తన పరిస్థితి గురించి చెప్పెయ్.. పిల్లల కోసమైనా బతకాలని అనుకునే అవకాశం ఉంది కదా.. చెప్పేస్తే నీ టెన్షన్ పోతుంది’ అంటూ మోనితా కార్తీక్‌కు సలహా ఇస్తుంది. దీంతో ఏ డాక్టర్ నేరుగా పెషెంట్‌కు మీరు బతకరని చెప్పరు. అలా చెబితే ఒత్తిడి పెరిగిపోయి జీవితం మీద ఆశపోతుంది. భయంతోనే బతుకుతారు. తిండి తినలేరు.. నిద్రపోలేరు. అధికంగా ఆలోచిస్తే తలలో నరాలు చిట్లిపోతాయి’ అంటాడు కార్తీక్. ‘భారతీకంటే ఎక్కువగా నువ్వే దీప కేసు స్టడీ చేస్తున్నట్లున్నావ్.. చేసిన తప్పులన్నీ పక్కనపెట్టి మరీ భార్యని పూలల్లో పెట్టుకుని చూసుకుంటున్నావ్’ అంటూ వెటకారం చేస్తుంది మోనిత. దాంతో కార్తీక్ కోపంగా.. ‘తప్పులు ఆలోచించే టైమ్ కాదు.. గతాన్ని గుర్తుచేయడం కరెక్ట్ కాదు’ అంటూ ఫైర్ అవుతాడు. ఇటూ దీప బాధతో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే.. సౌందర్య అక్కడికి వచ్చి.. ‘పదేళ్లుగా నిన్ను వాడు అపార్థం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకుంటూ వస్తున్నావా’ అంటుంది. ‘నేను డాక్టర్ బాబుని అపార్థం చేసుకుంటూ వస్తున్నానా’ అంటుంది దీప. మరి లేకపోతే ఏంటే. వాడు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పడం కూడా తప్పేనా.?’అనడంతో ‘రెస్ట్ కాదు.. గెస్ట్ అనండి..’ అనే దీప డైలాగ్‌తో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. -
ఓల్డ్ ఈజ్ గోల్డ్: ఈ నటీమణుల డైట్ ఏంటో తెలుసా?
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు ఆ తరం.. దీనికి నిదర్శనం వారి ఆరోగ్యకర జీవన విధానం.. ప్రస్తుతం మనిషి జీవిత కాలం క్షీణిస్తూ, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న తరుణంలో పాతకాలపు ఆహార పద్ధతులను అన్వేస్తున్నారు. నేడు ‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం’ సందర్భంగా ఆ తరం నటీమణుల ఆహార అలవాట్లు, వారి జీవన విధానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.. – సాక్షి, సిటీబ్యూరో గంజినే సూప్‌గా తాగేవాళ్లం.. 66 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంతో ఉన్నానంటే చిన్నప్పుడు నేను పెరిగిన విధానం మాత్రమే. ఇంట్లో అమ్మ చేసిన ఆహారం తప్ప బయటి చిరుతిల్లు ఉండేవి కావు. మా తరంలో పుట్టుసారం బాగుండేది. మా అమ్మ 8 నెలల గర్భిణిగా ఉండే వరకు మొదటి పాపకు పాలను ఇచ్చేది. అప్పుడు బియ్యం, జొన్నల నుంచి తీసిని గంజిని సూప్‌గా ఇచ్చేవారు. చెట్టుపైనే మగ్గిన పండ్లను తినేవాళ్లం. నేను తులసి, కరివేపాకు, వాము, సొంటి, మిరియాలు, ధనియాలు, జిలకర్ర మిశ్రమాల పొడితో కాచిన డికాషన్ మాత్రమే తాగుతాను. – క్రిష్ణవేణి, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్ బతకడానికి తినాలి.. నేను ఆరి్టస్ట్ని.. ఎప్పుడూ ఆక్టివ్‌గా ఉండాలి. దీనికి నా బాల్యంలోని ఆహార పద్ధతులే సహకరించాయి. ఇప్పటికీ నాకు బీపీ, షుగర్లాంటి సమస్యలు లేవు. పస్తుతం నీళ్లు, పాలు, నూనె, కూరగాయలు, బియ్యం ఏది చూసినా కల్తే.. ప్రస్తుతం పలువురు ఆరోగ్య నిపుణులు అధికంగా అన్నం తినకూడదని చెబుతుంటారు. మేమైతే అన్నీ తినేవాళ్లం. దానికి తగ్గ శారీరక శ్రమ చేసేవాళ్లం. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. అన్నం తగ్గించి చిరుధాన్యాలను అధికంగా తీసుకోవాలి. బతకడానికి తినాలి.. తినడానికి బతకకూడదు. – శివపార్వతి. ఇంటి గుట్టు సీరియల్ సౌత్ ఇండియన్ ఫుడ్.. నా ఫిట్నెస్కి ముఖ్య కారణం వర్క్‌హాలిక్‌గా, నాన్ఆల్కాహాలిక్గా ఉండటం. ముఖ్యంగా నాకు ఇష్టమైన దక్షినాదిలోని ఆహారపు అలవాట్లు మంచి ఆరోగ్యాన్నిచ్చాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అయిన ఇడ్లి ఇంటర్నేషనల్ లైట్ బ్రేక్‌ఫాస్ట్ మారింది. మొదటి నుంచి శాఖాహారిని కావడం వలన మానసికంగా శారీరకంగా ఫిట్‌గా ఉన్నాను. స్వచ్ఛమైన నెయ్యిని ఫుడ్‌లో వాడుతుంటాను. ఇది ఆరోగ్యాన్నే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నాలోని డాన్స్ స్కిల్స్ నేను ఫిట్‌గా, గ్లామర్‌గా ఉండటానికి మరో కారణం. – సుధా చంద్రన్, నెంబర్ వన్ కోడలు సీరియల్ మానసిక ఆరోగ్యం అవసరమే.. శారీరకంగానే కాకుండా మానసిక ఆరోగ్యం ముఖ్యం. ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంటూ అన్ని పనులను ఉత్సాహంగా చేస్తున్నానంటే అనవసర విషయాలను పట్టించుకోకపోవడమే. ఈ మానసిక ధృడత్వానికి కారణం నా ఆహార అలవాట్లే. విటమిన్లు, ప్రొటీన్స్ అధికంగా అందించే బొప్పాయి వంటి పండ్లను అధికంగా తింటాను. ఎలాంటి డైట్‌ను పాటించను. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉంటూ అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలకు ప్రాధాన్యం ఇస్తాను. ఫ్రూట్, వెజిటేబుల్ జ్యూస్‌లు తాగుతూ వ్యాయామం చేస్తాను. – లక్ష్మీ ప్రియ, నాగభైరవి సీరియల్ -
కార్తీకదీపం వంటలక్క ఫోటోలు చూడండి
-
‘స్వాతి చినుకులు’ ఫేం భరద్వాజ్‌కు కరోనా
-
కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు పెగుతున్నాయి. ఇప్పటికే పలువురు టెలివిజన్ నటీనటులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ వచ్చింది. బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించారు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా భరద్వాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..) తన ఆరోగ్యానికి సంబంధించి భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేశారు. తనకు లక్షణాలేవి లేవని, ఎవరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహార నియమాలు, మందులతో వ్యాధి నుంచి బయట పడవచ్చని పేర్కొన్నారు. అయితే తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక భరద్వాజ్ కరోనా సోకిన విషయంతో తెలియడంతో అతని అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్) తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్ -
మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం చెలరేగింది. దీంతో మరోసారి షూటింగ్స్‌కు బ్రేక్ పడింది. మంగళవారం ఓ సీరియల్లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో వెంటనే ఆ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేసి యూనిట్ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటనతో మిగతా సీరియల్స్ సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు. షూటింగ్‌లు ఇలాగే కొనసాగిస్తే నటీనటులు, సిబ్బంది కరోనా బారిన పడే అవకాశం ఉందని భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో షూటింగ్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు నటీనటులు, నిర్మాతలు సమావేశం అయ్యారు. (తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం) కరోనా లాక్డౌన్ కారణంగా రెండు నెలలకు పైగా వాయిదా పడిన టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇటీవలే మళ్లీ మొదలయ్యాయి. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్స్ జరుపుతున్నా.. ఓ టీవీ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడం బుల్లితెరను వణికిస్తోంది. ఇక సినిమాల విషయానికి వస్తే షూటింగ్ పూర్తి చేసుకున్న పలు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నాయి. అంతేకాకుండా కొన్ని చిన్న సినిమా షూటింగ్‌లు పలు జాగ్రత్తలతో ప్రారంభమయ్యాయి. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితల నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలు ఈ మధ్యకాలంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. (షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) -
తెలుగు టీవీ పరిశ్రమలో కరోనా కలకలం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు సినిమా పరిశ్రమలో కరోనా కలకలం చోటుచేసుకుంది. ఓ సీరియల్లోని ముఖ్య నటుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో టీవీ సీరియల్ నటుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళితే.. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం టీవీ, సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే షూటింగ్‌లు జరిపేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడంతోపాటుగా.. కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సీరియల్స్, టీవీ షోల షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. (చదవండి : ఆ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ) ఈ క్రమంలో ఓ ప్రముఖ చానల్లో ప్రసారమయ్యే సీరియల్ నటుడికి కరోనా సోకింది. జ్వరం, ఇతర లక్షణాలతో బాధపడుతున్న అతడికి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో నిర్మాతలు ఆ సీరియల్ షూటింగ్‌ను నిలిపివేశారు. యూనిట్ సభ్యులందరిని క్వారంటైన్‌కు పంపించినట్టుగా సమాచారం. కరోనా సోకిన నటుడు.. మరో చానల్లో ప్రసారమయ్యే సీరియల్లో కూడా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ నటుడు ఇప్పటివరకు ఎవరెవరిని కలిసారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక, సినిమాల విషయానికి వస్తే.. కేవలం రెండు, మూడు చిత్రాలు మినహా షూటింగ్‌లు ప్రారంభం కాలేదు. (చదవండి : షూటింగ్‌లు స్టార్ట్.. యాంకర్స్ సందడి) -
మూడుభాషల హీరో
తెలుగు, మలయాలం, తమిళం మూడు భాషల్లోనూ బుల్లితెర నటుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు జై ధనుష్. ‘తూర్పు–పడమర’, ‘కొంచెం ఇష్టం కొంచె కష్టం’, ‘తరంగాలు’, ‘ఆడదే ఆధారం’, ‘నెం.1 కోడలు’.. ఇలా వరుసగా సీరియల్స్చేస్తున్నాడు జైధనుష్. ‘అన్ని వయసులవారి అభిమానాన్ని సంపాదించాలన్నదే నా లక్ష్యం’ అంటూ చెబుతున్న ముచ్చట్లివి.. ‘ఇతర రాష్ట్రాల టీవీ ఆర్టిస్టులు ఇక్కడ సీరియల్స్ చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. తెలుగు నటుడిగా కొనసాగుతూనే తమిళం, మలయా ళం సీరియల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకోవడం ఆనందంగా ఉంది. ఆ రాష్ట్రాల్లో కూడా నన్ను వాళ్లలో మనిషిలో చూస్తున్నారు. మలయాళంలో ‘అలియంబల్’, తమిళంలో ‘చంద్రలేఖ’, ఇక్కడ జీ తెలుగులో ‘నెం.1 కోడలు’లో లీడ్ రోల్ చేస్తున్నాను. ప్రభాస్‌తో కలిసి.. చిన్నప్పటి నుంచి యాక్టింగ్ మీద ఆసక్తి ఉండేది. విశాఖపట్టణంలో మా నాన్నగారికి బిజినెస్ ఉండటంతో కాలేజీ టైమ్‌లో అక్కడ ఉన్నాను. మా ఇంటికి దగ్గరలో యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. సెలవు రోజుల్లో అక్కడకెళ్లి చూసేవాడిని. ఆ ఇన్స్టిట్యూట్ సర్ మా నాన్నగారికి ‘మీ అబ్బాయి యాక్టింగ్‌కి బాగా పనికివస్తాడు. హాలీడేస్ టైమ్‌లో పంపించమ’ని అడిగారు. అలా యాక్టింగ్ నేర్చుకున్నాను. సినీ హీరో ప్రభాస్ నేనూ ఒకే బ్యాచ్. సినీ పరిశ్రమలో మా బ్యాచ్ అందరికీ మంచి అవకాశాలు వచ్చాయి. యాక్టింగ్ కోర్స్ పూర్తయ్యాక నాకు రెండేళ్ల గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత 1–2 ట్రయల్స్‌లోనే ‘పోతేపోనీ’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత మనోరమ, అభిలాషి సినిమాల్లో చేశాను. ఈ సినిమాలకు నంది అవార్డ్సు వచ్చాయి. కానీ, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. ఆశించినంత గుర్తింపు రాలేదు. దీంతో నా దారి సీరియల్స్ వైపుగా మళ్లించుకున్నాను. నటి– నటుడు– ఓ ఫ్యామిలీ సీరియల్ నటి కీర్తి నా భార్య. తనది బెంగళూరు. సీరియల్ నటి పరిటాల మంజుల చెల్లెలు. ‘తూర్పు–పడమర’ సీరియల్లో చేసే సమయంలో ప్రేమించుకున్నాం. ఆరేళ్ల పాటు ఇద్దరం మా కెరియర్స్ చూసుకుంటూనే మా జర్నీ కొనసాగించాం. ఒకరి మీద ఒకరికున్న నమ్మకం, ప్రేమ చూసి ఇరుకుటుంబాలు మా పెళ్లికి అంగీకరించారు. ఇప్పుడు మాకో పాప. తన పేరు తనీహా. వీడియో కాల్‌తో కనెక్ట్ ఇద్దరమూ ఆర్టిస్టులమే అవడంతో ప్లానింగ్ తప్పదు. ఇద్దరమూ తెలుగు, తమిళం సీరియల్స్ చేస్తున్నాం. దీంతో షూట్లో భాగంగా నేను చెన్నై వెళ్లినప్పుడు తను హైదరాబాద్ వస్తుంది. నేను హైదరాబాద్ వస్తే, తను చెన్నై వెళ్లాల్సి వస్తుంది. టూర్‌కి కరెక్ట్‌గా ప్లాన్ చేసినా చాలా సార్లు టికెట్స్ క్యాన్సల్ చేసుకోవాల్సి వస్తోంది. దీంతో ఇన్స్టంట్ ప్లాన్‌కి ఫిక్స్ అయిపోయాం (నవ్వుతూ). నెలలో ఎప్పుడొస్తాయో తెలియని ఐదు రోజుల ఖాళీ సమయం దొరుకుతుంది. మా ఇద్దరి షూటింగ్స్ వల్ల పాప మా పేరెంట్స్‌తో ఎక్కువ ఉంటుంది. షూట్లో ఉన్నా రోజూ పడుకునేముందు అరగంట సమయం వీడియో కాల్లో కలుస్తాం. మా కుటుంబంలోనే నలుగురం టీవీ ఆర్టిస్టులం అవడంతో ఎప్పుడు కలిసినా మా మధ్య సీరియల్ టాపిక్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎవరి బిజీలో వారున్నా ఎవరినీ మిస్సవకుండా చూస్తాం. వాగ్దేవి కొడుకు ‘జీ తెలుగు’లో వచ్చే ‘నెంబర్.1’ కోడలు సీరియల్స్ జాబితాలోనే పెద్ద బడ్జెట్ సీరియల్. నా మీద నమ్మకం పెట్టుకొని లీడ్‌రోల్ ఇచ్చారు. విద్యాసంస్థలు నడిపే వాగ్దేవికి కొడుకుగా చేస్తున్నాను. ఒక మహిళ ఏమనుకున్నా సాధించగలదు అనే క్యారెక్టర్ వాగ్దేవిది. ఏది చేసినా నెం.1 గా ఉండాలనేది తన లక్ష్యం. తన ఇద్దరు పిల్లలు నెం.1 గా ఉండాలి అనుకుంటుంది. నేను కూడా ఆవిడకన్నా ఎక్కువ పంతంతో ఉంటాను. ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలనుకుంటా. ఇలాంటి ఆటిట్యూడ్ ఉన్న నాకు పూర్తి వ్యతిరేక మనస్తత్వం ఉన్న అమ్మాయి పరిచయం అవుతుంది. కానీ, ఆ అమ్మాయి అస్సలు చదువుకోలేదు. ఆమె మా కుటుంబంలోకి ఎలా వస్తుంది, అక్కడ ఎలా ఉంటుంది? అనేది కథ. భిన్నమైన పాత్రలు మూడు భాషల్లో నటించడం వల్ల ఎప్పుడైనా ఇతర దేశాలకు వెళ్లినప్పుడు మూడు భాషల వాళ్లు కలిసి ‘మీ సీరియల్స్ చూస్తాం, చాలా బాగుంటాయి’ అని వారి కుటుంబంలో వ్యక్తిలా కలుపుకుపోయి మాట్లాడుతుంటారు. సీరియల్లో ఒక పాత్ర ద్వారా చాలా భిన్నమైన మనస్తత్వాలు చూపించే అవకాశం లభిస్తుంది. మంచివాడుగా, చెడ్డవాడుగా, ప్రేమికుడిగా.. నిరూపించుకోవచ్చు. మునుపటిలా కాదు ప్రేక్షకుల అభిమానం క్షణాల్లో తెలిసిపోతుంది. సీరియల్ ఎపిసోడ్స్ సోషల్ మీడియాలో చూసిన అభిమానులు వెంటనే కామెంట్స్ పెట్టేస్తున్నారు. నే చేస్తున్న ప్రతీ పాత్రకు ఆ కామెంట్స్ చాలా పాజిటివ్‌గా ఉంటున్నాయి. నటుడిగా ప్రేక్షకులు అభిమానం ఎప్పడూ ఇలా పొందాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాను. అన్ని పాత్రల్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటాను. అలాగే బడికెళ్లే వాళ్ల వయసు నుంచి పెద్దవాళ్ల వరకూ అందరూ వారి కుటుంబంలో ఒకరిగా ఉండాలనుకుంటున్నాను. సహజంగానే ప్రయాణాలంటే ఇష్టపడే నాకు ఎక్కడకు వెళ్లినా తమలో ఒకరిగా చూసే అభిమానం తోడవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. – నిర్మలారెడ్డి -
రాధమ్మ అల్లుడు
‘నటుడిగా నిరూపించుకోవాలనే ఆకాంక్ష ఉండాలే గాని అవకాశాలు ఏదో రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. అది హీరోనా, విలనా.. అనే సందేహాలు పెట్టుకొని ఆగిపోవద్దు’ అంటారు బుల్లితెర నటుడు గోకుల్. తమిళ ఇంటి కుర్రాడు తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘జీ’ టీవీలో వచ్చే ‘రాధమ్మ కూతురు’లో లీడ్ రోల్ పోషిస్తున్న గోకుల్ మోడలింగ్ వైపు వెళ్లి, నటుడిగా ఎదుగుతున్న విధం గురించి ఇలా వివరించాడు... తమిళంలో విలన్ ‘పుట్టి పెరిగింది చెన్నైలో. నాన్నగారు ఉమామహేశ్వరన్. ఎలక్ట్రిసిటీ బోర్డులో వర్క్ చేస్తున్నారు. అమ్మ జయప్రభ గృహిణి. మా బ్రదర్ సింగర్, కంపోజర్. నేను బి.టెక్ పూర్తి చేశాను. కాలేజీ తర్వాత మోడలింగ్‌లో చేరాను. ఆక్కణ్ణుంచే సీరియల్లో అవకాశం వస్తే ఈ ఇండస్ట్రీకి వచ్చాను. నా గడ్డం మీసాలు చూసి విలన్‌గా అయితే బాగుంటుందని ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అలా విలన్‌గా బుల్లితెరకు పరిచయం అయ్యాను. ఆ సమయంలోనే తెలుగు బుల్లితెర నుంచి ‘జ్యోతి’ సీరియల్లో లీడ్ రోల్‌కి ఆఫర్ వచ్చింది. వెంటపడితే చదివాను.. బి.టెక్ అంటే అస్సలు ఇష్టం లేదు. నా చిన్నప్పటి నుంచి ఒకటే కల నటుడిని అవ్వాలని. ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పినప్పుడు అందరూ కనీసం డిగ్రీ అయినా ఉండాలన్నారు. చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం. ఆ విధంగా బిటెక్‌లో ఐటీ చేశాను. కానీ, జాబ్వైపుకు వెళ్లాలనిపించలేదు. ముందు అమ్మనాన్న కాస్త మౌనం వహించారు. కానీ, ఇప్పుడు నాకు వస్తున్న గుర్తింపు, హంగామా చూసి వాళ్లూ సంతోషిస్తుంటారు. నా గురించి ఎవరైనా గొప్పగా మాట్లాడినప్పుడు గర్వంగా ఫీలవుతారు. రాధమ్మ కూతురు ఇప్పుడు ‘జీ టీవీ’లో వచ్చే రాధమ్మ కూతురులో హీరో క్యారెక్టర్ చేస్తున్నాను. దీనికి ముందు జ్యోతి సీరియల్లో రీప్లేస్ క్యారెక్టర్ చేశాను. ఈ సీరియల్ పూర్తవుతుండగా రాధమ్మ కూతురు టీమ్ నుంచి ఆడిషన్స్‌కు పిలిచారు. ఊళ్లో అప్పులు ఇచ్చి, వడ్డీ వసూలు చేసే బుజ్జమ్మ కొడుకు అరవింద్ క్యారెక్టర్ నాది. వడ్డీ వసూలుకు అరవింద్‌ను పింపిస్తుంటుంది బుజ్జమ్మ. తోడుగా ఓ ఐదారుగురు రౌడీలు ఉంటారు. అలాంటి సమయంలో ఓ రోజు హీరోయిన్ అక్షరను చూస్తాడు అరవింద్. అక్షరకు బుజ్జమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు. అందుకని, నేను బుజ్జమ్మ కొడుకుగా కాకుండా చిన్నాగా అక్షర ను పరిచయం చేసుకుంటాను. అబద్దం చెప్పి ఫ్రెండ్షిప్ చేసుకుంటాను. ఒకరోజు నేనే బుజ్జమ్మ కొడుకును అనే విషయం తెలుస్తుంది. దీంతో నా మీద పగ పెంచుకుంటుంది. ఇలా ప్రేమ – పగలతో సీరియల్ నడుస్తుంటుంది. తెలుగు నేర్చుకున్నాను తెలుగు బుల్లితెరకు వచ్చి ఆరునెలలు అయ్యింది. ఈ ఆరునెలల్లో చాలా నేర్చుకున్నాను. అందరి మాటలు వింటూ, నేను మాట్లాడుతూ తెలుగు నేర్చుకున్నాను. ముందు నెల రోజులయితే చాలా ఇబ్బంది పడ్డాను. ఏ భాషలో నటుడిగా కొనసాగాలనుకుంటున్నామో ఆ భాష నేర్చుకుంటే ముందు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ ప్రయత్నంలో విజయం సాధించాను. సినిమా నటుడిని కావాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రెండు సంక్రాంతులు టీవీ షో కోసం మొన్ననే ఓ సంక్రాంతి వేడుకలో పాల్గొన్నాను. చాలా బాగా ఎంజాయ్ చేశాను. పండక్కి చెన్నై వెళుతున్నాను. ఇక్కడ సంక్రాంతి అంటే తమిళ్లో పొంగల్ అంటారు. భోగి, పొంగల్, మట్టు(కౌ)పొంగల్ అని మూడు రోజులూ పండగ చేస్తాం. ఇంట్లో అమ్మ చేసే చక్రపొంగల్ అంటే చాలా చాలా ఇష్టం. ఈ ఏడాది ఒకే పండగను వారం రోజుల్లో రెండు సార్లు జరుపుకోవడం హ్యాపీగా ఉంది. క్యారెక్టర్ని బట్టి.. క్యాస్టూమ్స్! ముందే టీమ్ సజేషన్స్ ఉంటాయి. ఎలాంటి క్యారెక్టర్‌కు ఎలాంటి క్యాస్టూమ్స్ బాగుండాలో డిస్కషన్స్ జరుగుతాయి. నా పాత్రకు తగ్గట్టు రెంగ్యులర్ పాయింట్ షర్ట్ లేదా కుర్తా పైజామా కాకుండా జీన్స్ ప్యాంట్ మీద షార్ట్ కుర్తా వేసుకుని ఉంటాను. ఈ గెటప్ నాకు బాగా నచ్చింది. చాలా మంది ఇండోవెస్ట్రన్ స్టైల్ బాగుందంటూ మెచ్చుకుంటూ ఉంటారు. సంగీతం అంటే ప్రాణం ఏ కాస్త సమయం దొరికినా మ్యూజిక్ వింటుంటాను. చిన్నప్పటి నుంచి ఇండోవెస్ట్రన్ మ్యూజిక్‌ని బాగా ఇష్టపడతాను. సినిమాలు కూడా బాగా చూస్తాను. ఒంటరిగానైనా సరే సినిమాలు చూస్తూనే ఉంటాను. రోజూ కంపల్సరీ ఫిట్నెస్ మీద శ్రద్ధ పెడతాను. అలాగే బైక్ మీద లాంగ్ డ్రైవ్స్‌కి వెళ్లడం చాలా ఇష్టం. అవకాశాలు వస్తున్నంత కాలం సీరియల్ నటుడిగా కొనసాగుతుంటాను. నటనలో మెళకువలు ఎప్పుడూ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతీసారీ కొత్తగానే భావించి, క్యారెక్టర్లో లీనమైనప్పుడే మంచి పేరు వస్తుంది. అలా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. – నిర్మలారెడ్డి -
నా పేరు రామ సీత వాసుదేవ్
చాలా మంది తాము నటించిన పాత్రల పేర్లతో పాప్యులర్ అవుతారు. అయితే నేను నటించిన సూపర్ హిట్ సీరియల్ రామ సీతలో పాత్ర పేరూ నా పేరే కావడంతో స్వంత పేరుతోనే నేను పాపులర్ అయ్యా అంటున్నారు చిన్నితెర నటుడు వాసుదేవ్. పుష్కర కాలం నుంచీ చిన్నితెరపై నటుడిగా వెలుగొందుతున్న వాసుదేవ్ పంచుకున్న కబుర్లు ఇవి... నేను పుట్టింది మెదక్ జిల్లాలోని కొరివి పల్లి అయితే పెరిగిందంతా హైదరాబాద్ అల్వాల్‌లోనే. నాన్నది వ్యవసాయం. అన్నయ్య శ్రీధర్ కూడా నటుడే. నా భార్య గృహిణి. మా ఇద్దరు అబ్బాయిలు చదువుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. నేను అన్నయ్య ఇద్దరం బాగా హైట్, అవసరమైన ఫీచర్స్‌తో ఉండడం వల్ల అందరూ మోడలింగ్‌వైపు ప్రోత్సహించారు. గ్రాసిం మిస్టర్ ఇండియా పోటీల్లో ఎపి నుంచి ఫైనలిస్ట్‌గా నిలిచాను. ఆ తర్వాత మోడలింగ్ అవకాశాలు బాగా వచ్చాయి. బిజీ అయ్యాను. మోడల్‌గా రాణిస్తున్న సమయంలోనే కృష్ణవంశీ గారు చూసి ఖడ్గం సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. అయితే ఆ తర్వాత మూవీ ఆఫర్లు ఏవీ పెద్దగా రాలేదు. దాంతో మోడల్‌గా కంటిన్యూ అయ్యాను. యువ...బ్రేక్ ఖడ్గం విడుదలైన నాలుగేళ్ల తర్వాత అన్నపూర్ణ స్టూడియో వాళ్లు తీసిన టీవీ సీరియల్ ‘యువ’లో అవకాశం వచ్చింది. పెద్ద బ్యానర్ కావడంతో చేశాను. అది చాలా మంచి యూత్‌ఫుల్ సబ్జెక్ట్. అప్పట్లో సీరియల్స్ అంటే ఆడవాళ్లు, ఏడుపులు మాత్రమే అనుకునే సమయంలో చాలా అడ్వాన్స్డ్ ఆలోచనలతో తీసిన సీరియల్ అది. అందులో ప్రస్తుత దర్శకుడు రాజమౌళి, నటి అనుష్క వంటి వారు కూడా కనిపిస్తారు. ‘యువ’ సీరియల్‌తో స్టార్ట్ అయ్యాక అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు వస్తుండడంతో ఇక సినిమాల గురించి మర్చిపోయి టీవీలోనే కంటిన్యూ అయిపోయాను. గరుత్మంతుడిగా... ఎన్ని పాత్రలు చేసినా ఎస్వీబీసీ చానెల్ కోసం చేసిన ‘శ్రీవైనతేయం’ భక్తి సీరియల్లో గరుత్మంతుడి పాత్ర చాలా ప్రత్యేకమైంది. ఆ పాత్ర కోసం బాగా కష్టపడ్డాను. కృత్రిమ ముక్కు వగైరాలతో మేకప్‌కి రెండు గంటలు పట్టేది. ఇప్పటికీ తిరుపతిలో కంపార్ట్ మెంట్స్‌లో మనం కూర్చున్నప్పుడు గరుత్మంతుడి చిత్రం ప్రదర్శిస్తుంటారు. కొంత కాలం తర్వాత నేనూ అదే కంపార్ట్మెంట్లో కూర్చుని అదే సీరియల్ చూడడం భలే వింతైన అనుభవం. అది కాక లవ్, అపరంజి, భార్యామణి, కుంకుమరేఖ ఇలా ఎన్నో సీరియల్స్ చేశాను. ‘రామసీత’ సీరియల్ బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ జనం నన్ను రామసీత వాసుదేవ్ అనే పిలుస్తుంటారు. మల్లీశ్వరి సీరియల్లో మగాడిగా శరీరం ఉన్నా, మనస్తత్వం అంతా అమ్మాయిలా ఉండడం వంటి విచిత్రమైన రాజకీయ నేత పాత్ర పోషించాను. ఇదే నా తొలి నెగిటివ్ క్యారెక్టర్. ఇది కూడా నాకు బాగా నచ్చిన పాత్ర. ప్రస్తుతం ’లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అక్కమొగుడు’ సీరియల్స్ చేస్తున్నా. ఇటీవలే ‘వశం’ అనే క్రౌడ్ ఫండింగ్ మూవీలో ప్రధాన పాత్ర పోషించాను. దీనికి అమెజాన్ ప్రైమ్‌లో మంచి రివ్యూస్ వస్తున్నాయి. వెబ్ సిరీస్, సినిమాల మీద దృష్టి పెడుతున్నాను. మంచి ఛాలెంజింగ్ పాత్రలు చేయాలనుకుంటున్నా. -
బుల్లితెర పెద్దబాబు
ఘట్టమనేని దేవేంద్రగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు పవన్‌సాయి. ‘జీ తెలుగు’లో వచ్చే ‘ముద్దమందారం’ సీరియల్లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు. వరుస సీరియల్స్‌తో పలకరిస్తున్న పవన్‌సాయి తన జర్నీ గురించి ఆనందంగా వివరించాడు. ‘పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను అన్నయ్య, ముగ్గురు అక్కచెల్లెల్లు. అందరికీ మంచి చదువులు చెప్పించారు అమ్మనాన్న. అన్నయ్య ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. యాక్టింగ్ ఫీల్డ్ అన్నప్పుడు మా వాళ్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. ‘నీ ఇష్టమే మా ఇష్టం’ అన్నారు. ఏం చేసినా టాప్‌లో! అనుకోకుండా ఈ రంగం వైపు వచ్చాను. టెన్త్ క్లాస్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఓ రోజు నా స్నేహితుడితో కలిసి ఈవెనింగ్ వాక్‌కి వెళ్లాను. మేం వెళ్లేదారిలో ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య డ్యాన్స్ క్లాస్ ఉంది. అన్నయ్యను కలవాలని తనతో పాటు నన్నూ తీసుకెళ్లాడు నా ఫ్రెండ్. అక్కడికి వెళితే కొంతమంది గ్రూప్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లని చూసి ‘నేనూ డ్యాన్స్ నేర్చుకుంటాను’ అన్నాను. మా ఫ్రెండ్ అన్నయ్య ‘డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్ కూడా నేర్పిస్తా’ అన్నాడు. ముందు డ్యాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్‌గా డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లేవాడిని. ముందుగా వెళ్లిన రోజు యాక్టింగ్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చూసి నేనూ నేర్చుకునేవాడిని. అలా కాలేజీ రోజులూ గడిచిపోయాయి. ఏ పని చేసినా టాప్‌లో ఉండాలనేది నా తపన. అక్కణ్ణుంచి ఫొటోస్ దిగడం, ప్రతీ ఒక్క సినిమా, సీరియల్స్ ప్రొడక్షన్ ఆఫీసులకు ఇవ్వడం చేస్తుండేవాడిని. ఈ ప్రయాణంలో చాలా మంది సహాయపడ్డారు. డ్యాన్స్ నేర్చుకున్న నాటి నుంచి అన్ని ఆఫీసులకు వేల ఫోటోలు ఇచ్చి ఉంటాను. ప్రొడక్షన్ మేనేజర్లకు వారానికి రెండుసార్లు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకునేవాడిని. ఫస్ట్‌టైమ్ కామెడీ రోల్ ఉన్న హ్యాపీడేస్ సీరియల్లో ‘బ్లూటూత్’ అనే క్యారెక్టర్‌కి అవకాశం వచ్చింది. హ్యాపీగా జర్నీ హ్యాపీడేస్ టైమ్‌లోనే గుర్తింపు వచ్చిన మరో సీరియల్ మొగలిరేకులు. ఇది చేస్తుండగానే ముద్దుబిడ్డ సీరియల్‌కు అవకాశం. ముగింపులో ‘శ్రావణసమీరాలు’. ఆ తర్వాత ఏడాదికి ‘ముద్దమందారం’ స్టార్ట్ అయ్యింది. ముద్దమందారం.. పెద్ద కొడుకు ఒక సీరియల్ తర్వాత మరో సీరియల్ అంటూ ఒక నియమం పెట్టుకున్నాను. దీని వల్ల ఆ వర్క్‌లో, ఆ క్యారెక్టర్లో లీనమై నటించే అవకాశం ఉంటుందని నమ్ముతాను. అలా ఐదేళ్లుగా ముద్దమందారం సీరియల్లో నటించాను. టీమ్ అందరితోనూ ఒక మానసికమైన బంధం ఏర్పడింది. టీమ్ అంతా బయట కూడా నన్ను పెద్ద కొడుకులా చూసుకున్నారు. హరితమ్మ, తనూజ, సురేశ్.. అంతా ఇంట్లో పెద్దబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారో అలా చూసేవారు. ఈ జర్నీ చాలా అద్భుతం. ఆటలంటే పిచ్చి నటన తర్వాత పిచ్చి ప్రేమ ఆటలమీదనే. చాలా స్పోర్టీ పర్సన్‌ని. క్రికెట్ కోసం ఎక్కడెక్కడో గ్రౌండ్స్ వెతికేవాడిని. ఇదొక్కటే కాదు బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, షటిల్, వీడియోగేమ్స్.. అన్నీ ఇష్టమే. ఇంట్లో ఉన్నానంటే టీవీకే అంకితం. సమయం అంతా టీవీ చూడ్డంతోనే అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది. ఈ ఇండస్ట్రీలోకి రావడానికి టీవీ చూడ్డం హాబీయే కారణం అనుకుంటాను.’ – నిర్మలారెడ్డి -
ప్రేక్షకుల ప్రేమే∙ నా విజయం
ఏ సీరియల్ చూసినా ఆ కథనంలో ఇమిడిపోయేలా అనిపిస్తారు. భిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. ‘ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉంటే బోర్ అనిపించవచ్చు. కానీ, భిన్నమైన పాత్రల వల్ల పనిని ఎంజాయ్ చేస్తున్నాను. వాటి వల్ల మనల్ని మనం నిరూపించుకోవచ్చు’ అంటున్నారు టీవీ నటుడు నిరుపమ్ పరిటాల. పుష్కరకాలంగా సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటున్న నిరుపమ్ ప్రస్తుతం కుంకుమపువ్వు, కార్తీకదీపం, ప్రేమ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఇవి.. ‘చంద్రముఖి సీరియల్ నా జీవితంలో ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. అది కెరియర్ పరంగానూ, జీవితంలో నిలదొక్కునేలా చేసింది. 2007లో మొదలైన ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాను. నాన్న నో చెప్పారు.. మా నాన్న ఓంకార్ పరిటాల. ఆయన నటుడు, రచయిత. నేను ఈ ఫీల్డ్కి రావడం నాన్నకి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువుకునేటప్పుడు కెరియర్ అంటూ పెద్ద ఆలోచనలేవీ లేవు. సినిమాల్లోకి రావాలని ఉండేది. కానీ, సోర్స్ అంటూ ఏమీ లేదు. నాన్న మాత్రం ‘ముందు చదువుకో, తర్వాత ట్రై చేయవచ్చు’ అనేవారు. మాది విజయవాడ. నాన్న నటుడు కావడంతో నా చదువు అంతా చెన్నైలోనే సాగింది. ఇంజినీరింగ్ తర్వాత ఎంబీయే చేశాను. నేను సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాలనుకున్నాం. ఆ సమయంలోనే నాన్న చనిపోయారు. ఆ టైమ్‌లో రెండు విషయాలు ఆలోచించాను. ఒకటి ఉద్యోగం, రెండు సినిమా ఇండస్ట్రీ. ఆ సమయంలోనే నాన్న స్నేహితుల ద్వారా నాకు సీరియల్ అవకాశం వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పాను. మొదట్లో నాన్న పేరు నన్ను ఎదుటివారు గుర్తించే వరకే ఉపయోగపడింది. ఆ తర్వాత పనిని బట్టే విలువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగాను. తను ఈ ఫీల్డ్ వద్దనడానికి కారణం ‘ఒకనాడు బాగుంటుంది, మరోసారి అంత బాగుండకపోవచ్చు’ అనే ఉద్దేశంతోనే. అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగాను. ఇక్కడ బిహేవియర్, డిసిప్లిన్, డెడికేషన్‌తో ఉంటేనే రాణించడం సాధ్యం. కొంతమంది వైఫల్యాలు చూసి పాఠాలు నేర్చుకున్నాను. భిన్న పాత్రలు ‘కుంకుమపువ్వు’ సీరియల్ చేస్తున్న సమయంలో ‘కార్తీక దీపం’ సీరియల్ డిస్కషన్స్ జరిగాయి. ఆ సీరియల్ ప్రొడ్యూసర్‌తో అప్పటికే ‘మూగమనసులు’ సీరియల్ చేసున్నాను. ఆ తర్వాత కూడా ఆ టీమ్‌తో టచ్‌లో ఉండేవాడిని. కార్తీక దీపం హీరో వెతుకులాటలో నా సలహా అడిగితే ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పాను. వాళ్లతో ఆడిషన్స్ చేసినా క్లియర్ అవ్వలేదు. దీంతో నన్నే చేయమన్నారు. అప్పటివరకు వాళ్ల మనసులో నేను ఉన్నాను అనే విషయం నాకు తెలియదు. ‘అత్తారింటికి దారేది’ సీరియల్లో విలన్ రోల్ చేశాను. జనాలకు ఎప్పుడూ ఒకేలా కనిపించకూడదు.. ‘ఇలాగ కూడా మెప్పించగలడు నిరుపమ్..’ అనుకోవాలి. ఆ ఆలోచనతో ఒప్పుకున్న పాత్ర అది. అందరూ బాగుంది అన్నారు కానీ, కొంతమంది నెగిటివ్ రోల్ వద్దులెండి అని చెప్పేవారు. రచయితగా! ‘నెక్ట్స్ నువ్వే’ అనే సినిమాకి స్క్రిప్ట్ రాశాను. ఇప్పుడలాంటివేమీ లేవు. ఒక సీరియల్‌కి పది రోజుల షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది. డబ్బింగ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పనుల్లోనే ఉన్నాను. మా ఆవిడ మంజుల కూడా ఇదే ఫీల్డ్. చంద్రముఖి సీరియల్లో ఇద్దరం కలిసి చేశాం. ప్రేమిం చి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. సర్దుబాట్లు మంజుల కూడా సీరియల్ నటి కావడంతో ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. తన పని వేరు, నా పని వేరు. ఇద్దరం మెచ్యూర్డ్‌గా ఉంటాం. ఎప్పుడైనా చిన్న చిన్న వాదనలు వచ్చినా అర్థం చేసుకుంటాం. తనకోసం టీవీ షోస్‌లో కపుల్ డ్యాన్స్‌కి అవకాశం ఉంటే, ప్రాక్టీస్ చేసి మరీ ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. టైమ్‌కి సంబంధించి. కంప్లైంట్స్ ఉంటాయి మా ఇద్దరికి. ఏదో విధంగా సర్దిచెప్పుకుంటాను. ప్రొడక్షన్వైపుగా అడుగు చంద్రముఖి నుంచి కార్తీక దీపం వరకు గ్రోత్ పరంగా చూసుకుంటూ ‘జీ తెలుగు’లో ఇప్పుడు ‘ప్రేమ’ సీరియల్‌తో ప్రొడక్షన్ వైపుగానూ వెళ్లాను. అనుకోకుండా వచ్చిన బాధ్యత ఇది. ఇందులో లీడ్ రోల్ కూడా చేస్తున్నాను. అన్నీ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళితే ఏదీ మిస్ చేసుకోలేం. రోజు మొత్తం ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆలోచనలు, షెడ్యూల్.. ఉంటుంది కాబట్టి అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. – నిర్మలారెడ్డి -
స్ఫూర్తిసుధ
అతి చిన్నవయసులోనే నృత్య వేదికలను ఘల్లుమనిపించిన సుధాచంద్రన్.. తన అడుగుల కరతాళ ప్రతిధ్వనులను పూర్తిగా వినకుండానే పదహారేళ్ల వయసులో కాలును పోగొట్టుకున్నారు. పోయింది కాలే కానీ, ఆమె నిబ్బరం కాదు. ఒంటికాలి మీదే దీక్ష పట్టారు. నాట్యతపస్విని అయ్యారు. అనేక విజయ శిఖరాలను అధిరోహిచారు. నర్తకిగా, నటిగా, సమాజ సేవకురాలిగా ఎన్నో పాత్రలు పోషించారు. ఇప్పుడు మళ్లీ మరొకసారి తెలుగులో చిన్ని తెర మీదకు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన సాక్షితో ఆత్మీయంగా ముచ్చటించారు. గంగానది జీవధార. ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఉగ్రరూపం దాలిస్తే అంత భయానకంగా ఉంటుంది. అందుకేనేమో ఈ దేశంలో స్త్రీని గంగానదితో పోలుస్తారు. కల్మషమైన లోకాన్ని స్వచ్ఛంగా మార్చే శక్తి స్త్రీకే ఉంది. అందుకే కావచ్చు సుధ తరచు ‘గంగ’ కాన్సెప్ట్‌తో నృత్యరూపకాలు ప్రదర్శిస్తుంటారు. ఈ ముప్పై ఏళ్లుగా నృత్యంతో పాటు ఆమె హిందీ, మలయాళం, తమిళం, కన్నడ సినీ, టీవీ రంగాలలో పని చేస్తున్నారు. ‘‘ఇప్పుడిక ‘నెంబర్ వన్ కోడలు’ గా మీ వీక్షణకు నోచుకుంటున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది’’ అంటూ తన జీవిత ప్రవాహంలోని మలుపుల తలపుల్లోకి వెళ్లిపోయారు సుధ. కూతురే పుట్టాలని..! అమ్మనాన్నలకు ఒక్కతే కూతుర్ని. నాన్న చంద్రన్‌ది కేరళ అయినా ఉద్యోగరీత్యా ముంబైలో స్థిరపడ్డారు. అమ్మ తంగం గృహిణి. శాస్త్రీయ సంగీతకారిణి. కొన్నాళ్లు క్లాసికల్ డ్యాన్సర్ సుధా దొరైవాన్ దగ్గర స్టెనోగ్రాఫర్‌గా వర్క్ చేసింది. కూతురు పుడితే సుధ అని పేరు పెట్టుకోవాలని, డ్యాన్సర్‌ని చేయాలని కలలు కంది. అందుకే నాకు మూడేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్పించింది. పదహారేళ్ల వయసు వచ్చేటప్పటికే నేను చిన్న చిన్న నృత్య ప్రదర్శనలు ఇవ్వగలిగానంటే అది అమ్మ ప్రయత్నము, పట్టుదలే. ఓ రోజు కారులో ఇంటికి వస్తుంటే జరిగిన ప్రమాదంలో కుడికాలును పోగొట్టుకున్నాను. ప్రపంచం ఒక్కసారిగా చీకటైపోయింది. నాకిక భవిష్యత్తే లేదనిపించింది. ఆ సమయంలో.. ‘‘నువ్వు నిలబడాలి.. నువ్వు డ్యాన్స్ చేయాలి.. ’’ అంటూ అమ్మానాన్న ఇచ్చిన మనోబలం సామాన్యమైనది కాదు. నాన్న దిన, వార పత్రికలు తెచ్చి ఇచ్చి, వాటిల్లోని ఇన్స్పైరింగ్ స్టోరీలను చదవమనేవారు. టీవీలో వచ్చే ప్రతీ సమాచారాన్ని తెలుసుకోమనేవారు. ఏ చిన్న సమాచారం ఎవరు అడిగినా చెప్పేలా నన్ను తీర్చి దిద్దారు. ఇప్పటికీ నాకు చదివే అలవాటు పోలేదు. అమ్మ కూడా దిగులు పడటం మానేసి ధైర్యం తెచ్చుకొని నన్ను నిలబెట్టింది. కృత్రిమ కాలుతో రెండేళ్ల సాధన. రాత్రి–పగలు తేడా లేదు. డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, ఇన్ఫెక్షన్లతో నరకం చూశాను. తర్వాత రెండేళ్లకు ఓ రోజు కృత్రిమ కాలుతో మొదటిసారి స్టేజి మీద మూడుగంటల సేపు నిర్విరామ ప్రదర్శన ఇచ్చాను. హాల్లో వెయ్యిమంది లేచి నిల్చొని తమ చప్పట్ల హోరుతో నాకు అభినందనలు తెలియజేశారు. ఆ సమయంలో మాటల్లో చెప్పలేనంత ఉద్విగ్నతకు లోనయ్యాను. ఉప్పెనలా ముంచేసిన కష్టంలోంచి ఒక్కసారిగా బయట పడినట్లయింది. అత్తింటి అదనపు శక్తి ఇండియా, సౌదీ అరేబియా, అమెరికా, కెనడా, ఖతార్, కువైట్, బహ్రెయిన్, ఒమన్లలో నృత్య ప్రదర్శనలు. దాదాపు అన్ని భాషా చిత్రాలలో నటిగా గుర్తింపు. ఒక కష్టాన్ని అధిగమించాక నాకు వచ్చిన అవకాశాలు ఎన్నో. వాటిల్లో ఒక్కదానినీ వదులుకోలేదు. సినిమాలు చేస్తున్నప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న రవి డంగ్తో పరిచయం ఏర్పడింది. తనది బెంగాలీ కుటుంబం. మానసికంగా దగ్గరయ్యాం. పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం. అనుకున్న రెండు రోజుల్లోనే పెద్దల అంగీకారంతో పెళ్లయ్యింది. నేను దక్షిణాది అమ్మాయిని, తను ఉత్తరాది అబ్బాయి. పద్ధతుల్లో పూర్తి వ్యత్యాసాలున్న కుటుంబ నేపథ్యాలు అయినా అత్తింటివారంతా నన్ను అక్కున చేర్చుకున్నారు. నెంబర్‌వన్ కోడలు జీ తెలుగులో ఈ వారమే మొదలైన ఈ సీరియల్ ద్వారా ‘వాగ్దేవి’గా పరిచయం అవుతున్నాను. విద్యాసంస్థలను నడిపే వ్యక్తిగా తన చుట్టూ ఉన్నవారంతా చదువులో నెంబర్‌వన్‌గా ఉండి తీరాలనుకుంటుంది వాగ్దేవి. అలాంటి వాగ్దేవి ఇంట అక్షరం ముక్క రాని కోడలు అడుగుపెడుతుంది. చేస్తున్న పనిలో నెంబర్ వన్‌గా ఉండాలనే నా తపనకు తగ్గట్లు వచ్చిన అవకాశం ఇది’’ అంటూ ముగించారు సుధాచంద్రన్. జీవితంలో వచ్చే సవాళ్లు ఒక్కోసారి పెను ఉప్పెనలా ముంచేస్తాయి. ఆ ఉప్పెన నుంచి ఉవ్వెత్తున లేవాలంటే పోరాటం చేయాలి. ఆ పోరాటంలో నిలబడిన శక్తి సుధాచంద్రన్. నేర్చుకోవాలనుకునేవారికి ఆమె జీవితం ఎప్పటికీ ఓ కొత్త పాఠం. – నిర్మలారెడ్డి ఫొటో: శివ మల్లాల చిన్న వయసులోనే! ►సుధ పందొమ్మిదేళ్ల వయసులో ‘మయూరి’ సినిమా ద్వారా నాట్యమయూరిగా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. ►సుధ జీవిత చరిత్ర 8–11 ఏళ్ల వయసు స్కూలు పిల్లలకు అనేక రాష్ట్రాలలో పాఠ్యాంశమయింది. ►ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇన్వెర్టిస్ విశ్వవిద్యాలయం సుధను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. -
అంత ఈజీగా ఏమీ సిద్ధించలేదు
‘చిన్నప్పుడు క్రికెట్ ఆడుకొని ఇంటికి వచ్చాక టీవీ చూద్దామంటే ఇంట్లో అమ్మ, అక్కవాళ్లు సీరియల్స్ చూస్తుండేవాళ్లు. సినిమా పెట్టమంటే నన్ను బయటకు వెళ్లమని తిట్టేవారు. ఇప్పుడు నేను సీరియల్స్‌లో చేస్తూ మా అమ్మవాళ్లని చూడమని రిక్వెస్ట్ చేస్తుంటాను’ అని నవ్వుతూ తన నట ప్రయాణాన్ని పంచుకున్నారు సిద్దార్ధ. జీ తెలుగులో వచ్చే గంగ–మంగ సీరియల్లో ‘సిద్ధు’గా బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సిద్ధార్ధ పంచుకున్న కబుర్లివి. ఐదేళ్లు అయ్యింది ఈ ఫీల్డ్కి వచ్చి. సినిమా అవకాశాల కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన కొత్తలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఆదాయం ఏమీ లేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు వచ్చే అవకాశం లేదు. అలాంటి సమయంలో మా కజిన్ నన్ను బాగా చూసుకున్నాడు. బుల్లితెర ప్రయాణం హైదరాబాద్‌లో ఉన్న మా బ్రదర్ తప్ప అంతకుమించి ఎవ్వరూ తెలియదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సినిమా అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉండేవాణ్ణి. ఆరునెలల పాటు అందరి వెనకాల తిరిగాను. అందరూ చేద్దాం, చూద్దాం అంటున్నారు. ఇక ఇలా లాభం లేదని సీరియస్‌గా ట్రై చేద్దామని ఒక సీరియల్ మేనేజర్‌కి కాల్ చేశాను. లొకేషన్‌కి రమ్మనడంతో వెళ్లి మాట్లాడాను. వారం తర్వాత వాళ్లే ఫోన్ చేశారు ఆడిషన్స్‌కి రమ్మని. అలా ‘అమెరికా అమ్మాయి’ సీరియల్‌తో నా టీవీ జర్నీ మొదలయ్యింది. అటు తర్వాత ‘కథలో రాజకుమారి‘, ‘మనసు మమత’ సీరియల్స్ చేశాను. ఇప్పుడు ‘గంగ మంగ’ సీరియల్ చేస్తున్నాను. రేపు ఎలా ఉంటుందో ఇక్కడ గ్యారంటీ ఏమీ లేదు. అవకాశాలు వస్తుంటాయి. వాటిని చేసుకుంటూ వెళ్లడమే. గ్యాప్‌లో సినిమా ఖాళీ దొరికితే చేసే పని సినిమాలు చూడ్డం. ఒకేసారి వరసబెట్టి హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్.. చూస్తూ ఉంటాను. లేదంటే జిమ్‌లో ఉంటాను. ఇంకాస్త టైమ్ ఉంటే ప్రొడక్షన్ ఆఫీసుల వారిని కలుస్తుంటాను. ఒక సీరియల్ చేస్తూ మిగతా 15 రోజులు సినిమాలకు ట్రై చేస్తున్నాను. సినిమా, టీవీ రెండింటిలోనూ రాణించాలన్నది నా కల. ఒకప్పుడు మా ఊళ్లో చుట్టుపక్కల వాళ్లు ‘చదువుకొని కూడా మీ అబ్బాయి ఎందుకు లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నాడు’ అని అనేవారు. ఇప్పుడు మీ వాడు సూపర్ అంటుంటారు. ఈ మాటలు అమ్మానాన్నలు చెబుతుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన పొజిషన్‌ను బట్టి బయటి వాళ్ల మాటలు ఉంటాయి. వారికేది అనిపిస్తే అది మాట్లాడుతుంటారు. గైడ్‌గా నళినమ్మ! సీరియల్ టీమ్ ఒక మంచి కుటుంబంలా కలిసిపోయింది. మాకందరికీ పెద్ద దిక్కు అంటే నళినమ్మ. చాలా మంచావిడ. లొకేషన్‌కి ఉదయం ఏడు గంటలకే రకరకాల వంటకాలు చేసుకొని మరీ మా కోసం తీసుకువస్తారు. ఒక కుటుంబంలా కలిసిపోయాం. నటనలో సలహాలు, సినిమా విశేషాలు ఒకప్పటి హీరోయిన్గా రాణించిన నళినమ్మే చెబుతుంటారు. అవన్నీ నన్ను నేను బెటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. షూటింగ్లో చిన్న గ్యాప్ దొరికినా నళినమ్మ చుట్టూతా కూర్చుంటాం. తను చూసొచ్చిన ఇండస్ట్రీ గురించి విషయాలు చెప్పమని అడుగుతుంటాం. అల్లరి చేస్తూ ఉంటాం. షార్ట్ ఫిల్మ్ ప్లాన్ బీటెక్ చేశాను. అమ్మానాన్న వైజాగ్‌లోనే ఉంటారు. పదవ తరగతి పూర్తయినప్పటì æనుంచే షార్ట్‌ఫిల్మ్ తీయాలనే ప్లాన్‌లో ఉండేది మా స్నేహబృందం. హర్రర్, సస్పెన్స్ షార్ట్ ఫిల్మ్స్‌కి ట్రై చేసేవాణ్ణి. దీంతో కెమెరా, షూట్స్, స్క్రిప్ట్.. ఈ హంగామా అంతా బాగా ఆకట్టుకుంది. ఫ్రెండ్స్ కూడా ఎంకరేజ్ చేశారు. చదువయ్యాక చిన్న మూవీ చేశాను. కానీ రిలీజ్ అవలేదు. ఇలా అయితే టైమ్ వేస్ట్ అవుతుందని హైదరాబాద్ వచ్చేశాను. గంగ – మంగ జీ తెలుగులో వచ్చే గంగ మంగ సీరియల్ కథనం చాలా ఆసక్తిగా ఉంటుంది. ప్రస్తుతం సీరియల్లో గంగకి, సిద్దుకి పెళ్లవదు. గంగ తనే తాళి కట్టేసుకుంటుంది. ఇంట్లో వాళ్లందరినీ ఒప్పించి మళ్లీ పెళ్లి చేసుకోవాలని వాళ్ల ఆలోచన. మధ్యలో అడ్డంకులు వస్తుంటాయి. -
అదృష్టాన్ని నిలబెట్టుకోవడమే విజయం
చిన్నప్పుడు సరదాగా ఆడిన ఆటైనా, ఇష్టంతో నేర్చుకున్న పనైనా.. ప్రతీది జీవితంలో ఉపయోగపడటం అనేది ఒక అదృష్టం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన ప్రయత్నమే. ఆ రెండింటినీ సిన్సియర్‌గా అందిపుచ్చుకున్న సీరియల్ నటుడు నందకిశోర్. ‘జీ తెలుగు’లో వచ్చే ‘రామసక్కని సీత’ సీరియల్లో రామరాజుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న నందకిశోర్ చెబుతున్న ముచ్చట్లివి. ‘మా అమ్మానాన్నలు శారద, వెంకటరమణ. నాన్న రైల్వేలో జాబ్ చేసేవారు. ముగ్గురు అన్నదమ్ములలో నేను చివరి వాడిని. మా నాన్నగారే నా మొదటి గురువు. చిన్నప్పుడు ఆయనే నా ముఖానికి మేకప్ వేశారు. భూమికా థియేటర్ గ్రూప్‌ను నిర్వహించే గరికపాటి ఉదయభాను గారి దగ్గర పదవతరగతి నుంచి నాటకరంగంలో పాల్గొనేవాడిని. కెరియర్ దీర్ఘకాలం కొనసాగాలంటే నాటక రంగం బాగా ఉపయోగపడుతుంది. అదృష్టవశాత్తు అలా నా మూలాలు నాటకరంగంలో పడ్డాయి. అన్నదమ్ముల అనుబంధం ఇంట్లో చిన్నవాyì ని అయినా మా అన్నయ్యల సపోర్ట్ నాకు బాగా ఉండేది. అన్నదమ్ములం అయినా మంచి స్నేహితులుగా ఉంటాం. ఒకమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు ఇంట్లో చిన్నవాడినైనా మా అన్నయ్యలిద్దరూ నాకు ముందు పెళ్లి జరిపించారు. ఇప్పటికీ నాకు వారు అండగా ఉంటారు. నా సతీమణి పేరు లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం అయితే ఈ ఫీల్డ్‌లో ఉన్న నన్ను అర్థం చేసుకోవడం నిజంగా అదృష్టం. మాకు ముగ్గురు కూతుళ్లు. విలన్ నుంచి హీరోగా! 2005 సంవత్సరం నుంచి నా కెరియర్ మొదలైంది అని చెప్పవచ్చు. అంతకుముందు నాలుగైదేళ్లు ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ టైమ్‌లో ఈ రంగంలో పోటీ ఎక్కువ ఉంది. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు అవకాశాలు తక్కువ. పదిహేనేళ్ల క్రితం దూరదర్శన్‌లో వచ్చిన ‘వెలుగు నీడలు’ సీరియల్లో విలన్‌గా చేశాను. అక్కణ్ణుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ చెన్నై ఇండస్ట్రీకి వెళ్లాను. అక్కడ అంకురం సీరియల్లో సైడ్ క్యారెక్టర్ చేశాను. ఆ తర్వాత ర్యాడాన్ ప్రొడక్షన్లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు ఇక్కడ ‘స్రవంతి’ సీరియల్లో అవకాశం వచ్చింది. ఐదేళ్ల పాటు వచ్చిన ఆ సీరియల్ వల్ల నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఈ సీరియల్ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేక, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్ చేసుకుంటూ వస్తున్నాను. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశాను. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణించాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడొక సినిమా కూడా చేస్తున్నాను. సీరియల్ వల్ల నటనలోనూ, ప్రొడక్షన్లోనూ మంచి ఎక్స్‌పీరియెన్స్ వచ్చింది. రామసక్కని సీత రియల్ లైఫ్‌లో మా ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడిని. ‘రామసక్కని సీత’ సీరియల్లో నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడిని. ఇది పూర్తిగా కుటుంబ నేపథ్యం ఉన్న కథనం. నాది రామరాజు పాత్ర. అన్నదమ్ముల సఖ్యత, భార్యా–భర్తల అనురాగం, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి.. ఇలా ఏ దశలో ఎలా ఉండాలో బంధాల ద్వారా చూపుతుంది ఈ సీరియల్. అనుకోని పరిస్థితుల్లో సీత రామరాజు భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది. అమ్మలా చూసే సీత ప్రవర్తనతో తమ్ముళ్లు మారుతారు. మంచి ప్రేక్షకాదరణతో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నటనే జీవితం నటన మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే నా జీవితమైంది. దీంట్లోనే కొనసాగుతాను. నటుడిగా కొనసాగాలంటే ఆరోగ్యం, ఫిట్నెస్, ముఖకాంతి.. ఇవన్నీ తప్పనిసరి. అందుకే ఎన్ని పనులున్నా రోజూ ఉదయం 5:30గంటలకు లేస్తాను. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తాను. షూటింగ్ లేకపోతే సినిమాలు చూడ్డం, స్టోరీ డిస్కషన్స్, కాన్సెప్ట్స్ డెవలప్ చేయడం వంటి వాటిల్లో పాల్గొంటుంటాను. మిగతా టైమ్ నా కుటుంబంతో గడుపుతాను. పూర్తి శాకాహారిని. వంట వచ్చు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కొత్త వంటకాలను ట్రై చేస్తుంటాను. వాటి టేస్ట్‌ను ఇంట్లో వారికి దగ్గరుండి మరీ వడ్డిస్తాను.’ – నిర్మలారెడ్డి ఆల్‌రౌండర్‌గా! చిన్నప్పటి నుంచి ఆటలు, పాటలు, చదువు.. అన్నింటిలోనూ చురుకుగా ఉండేవాడిని. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. ఆటల్లో క్రి కెట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్ లీగ్ జరిగినప్పుడు సినిమా వాళ్లతో కలిసి పాల్గొన్నాను. టీవీ కేటగిరీ నుంచి నా క్రికెట్ స్కిల్స్ చూసి వాళ్ల టీమ్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. చిన్నప్పుడు ఏదైతే ఇష్టంతో నేర్చుకున్నానో అవన్నీ నా జీవితంలో ఉపయోగపడుతూ వచ్చాయి. సింగర్, డ్యాన్సర్, యాక్టర్, ప్లేయర్‌గా.. ఇలా అన్నింటా ఉన్నాను. డ్యాన్సర్‌గా జల్సా, నర్తనశాల, రగడ.. వంటి టీవీ డ్యాన్స్ షోలో పాల్గొన్నాను. స్టేజ్ షోలోనూ ప్రదర్శనలు ఇచ్చాను. అయితే, అప్పటి కష్టానికి ఇప్పటిలా మార్కెట్లేదు. ఇప్పుడు ప్రతీది అప్డేటెడ్గా ఉండాలి. -
గోరింటాకు శ్రీవల్లి
కూతురు అంటే తల్లిదండ్రుల చాటు బిడ్డలా, వారిపై ఆధారపడేలా కాకుండా కుటుంబానికే పెద్ద దిక్కుగా మారే విధానం ‘గోరింటాకు’ సీరియల్లో కనిపిస్తుంది. స్టార్ మా’లో వస్తున్న ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా తెలుగు టీవీ ప్రేక్షకులకు శ్రీవల్లిగా పరిచయం అయ్యింది కావ్య. బెంగుళూరు నుంచి తెలుగింటికి వచ్చిన కావ్య సీరియల్లోని తన పాత్ర గురించి, నిజ జీవితం గురించి ఆనందంగా పంచుకుంది. ‘తండ్రికి గుండెజబ్బు. అతను చేసేది మగ్గం పని. కుటుంబం గడవలేని స్థితిలో తండ్రి స్థానాన్ని శ్రీవల్లి తీసుకుంటుంది. చేనేత చీరల అమ్మకం, అందులోని ఎగుడుదిగుడులను తట్టుకుంటూ తను ముందుకుసాగడం చూసే ప్రేక్షకులు ఇలాంటి ధైర్యవంతురాలైన కూతురు తమ ఇంట్లోనూ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. ఈ మాటలు నాతోనే ప్రేక్షకులు నేరుగా అన్నప్పుడు కలిగిన ఆనందం ఇంతా అంతా కాదు.’ ఆడిషన్స్ ద్వారా ఎంపిక బిఎస్సీ పూర్తి చేశాక కన్నడ సీరియల్స్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు కన్నడలోనూ నీలి, నాయకి సీరియల్స్ చేస్తున్నాను. ముందు ఈ ఫీల్డ్ అనుకోలేదు కానీ, మా అమ్మ భాగ్య నేను నటిని కావాలని ఆశపడేది. ఎక్కడ సీరియల్స్, సినిమా ఆడిషన్స్ జరిగినా అక్కడకు తీసుకెళ్లేది. నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌లో ఆసక్తి ఎక్కువ. ఆ ఆసక్తి గమనించే అమ్మ నన్ను ఈ ఫీల్డ్కి పరిచయం చేయాలనుకున్నారు. కన్నడలో మూడేళ్లుగా సీరియల్స్ చేస్తున్నాను. ఈ ఏడాది తెలుగులో అవకాశం వచ్చింది. నాన్న నటరాజ్ బోర్‌వెల్స్ బిజినెస్ చేస్తారు. నాకో చెల్లెలు. తను డిగ్రీ సెకండియర్ చదువుతోంది. శ్రీవల్లికి పూర్తి వ్యతిరేకం సీరియల్లో శ్రీవల్లికి ఉన్నంత బరువు బాధ్యతలు నాకు లేవు. అలాగే, అందులో శ్రీవల్లి విలన్స్ నుంచి ఎదుర్కొనే టీజింగ్ సీన్స్ లాంటివి కూడా లేవు. నిజం చెప్పాలంటే నా జీవితం శ్రీవల్లి పాత్రకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. భక్తురాలిని... గోరింటాకు సీరియల్లో శ్రీవల్లి చాలా స్ట్రిక్ట్. ఎవరైనా తప్పు చేస్తే అస్సలు సహించదు. ధైర్యంతో పాటు దైవం అంటే భక్తి కూడా ఉంటుంది. మా అమ్మకు దేవుడి మీద బాగా నమ్మకం. రెండు నెలలకోసారి ఇంట్లో హోమాలు, పూజలు తప్పనిసరిగా ఉంటాయి. వాటిలో నేనూ పాల్గొంటాను. కాటన్ చీరలు చేనేత బ్యాక్‌గ్రౌండ్ మీద సీరియల్ థీమ్ నడుస్తుంది. ఈ సీరియల్లో శ్రీవల్లికి చీరల షోరూమ్ కూడా ఉంటుంది. మిగతా సీరియల్స్‌లో లాగా హీరోయిన్‌కి హెవీగా మేకప్, డిజైనర్ డ్రెస్సులు కాకుండా కాటన్ చీరలను యూనిట్ సజెస్ట్ చేసింది. దాంతో మంగళగిరి చేనేత చీరలను ధరిస్తుంటాను. సింపుల్‌గా కాటన్ చీరలో కనిపించడంతో శ్రీవల్లి వ్యక్తిత్వం కూడా ఇందులో ప్రతిఫలిస్తుంటుంది. తొందరపడను చేసే పని ఒకేలా ఉండకూడదు అనుకుంటాను. అందుకే త్వరగా అన్నీ చేసేయాలని కోరుకోను. ఈ పరిశ్రమలో మంచి అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకుంటూనే ఇంకా పై చదువులు చదవాలని ఉంది. అందుకోసం ప్రయత్నాలు చేస్తున్నాను. వేటికీ ఎక్కువ హైరాన పడటం ఉండదు కాబట్టి కాస్త ఖాళీ టైమ్‌ను నా కోసం ఉండేలా జాగ్రత్తపడతాను. అప్పుడేగా మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవచ్చు. ఏ కాస్త తీరికి దొరికినా డ్యాన్స్ చేస్తాను. రాక్, పాప్, ఇండో–వెస్ట్రన్.. ఇలా అన్ని రకాల సంగీతాన్ని ఇష్టపడతాను. అప్పుడప్పుడు బుక్స్ చదువుతుంటాను. నన్ను చూసి నేర్చుకోవాలంటుంది మా చెల్లి డిగ్రీ సెకండియర్ చదువుతోంది. చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలనేది తన తాపత్రయం. ‘అక్కా, ఇద్దరం కలిసే పెరిగాం కదా! నీకింత ధైర్యం ఎలా వచ్చింది’ అని అడుగుతుంటుంది. నన్ను చూసి తనూ ఒక ఫొటో షూట్ ట్రై చేసింది. సూచనలు అడుగుతాను అమ్మానాన్న, చెల్లి నా సీరియల్స్ చూసి సూచనలు చెబుతుంటారు. ఒక్కోసారి వాళ్లు చెప్పకపోయినా నేనే అడుగుతాను. తెలుగు నేర్చుకుంటున్నాను. ప్రతీ డైలాగ్నకి ముందు దాని పూర్తి అర్ధం తెలుసుకుంటాను. ప్రేక్షకులు మెచ్చేలా నటన ఉండాలని తపిస్తాను’ అని వివరించింది కావ్య. – నిర్మలారెడ్డి -
అత్తారింట్లో ఆదిత్య
‘నీవు దీనికి సరికాదు’ అన్న చోటునే ‘నువ్వే ఈ వర్క్‌కి సరైనవాడివి’ అనే కితాబు వస్తే.. ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. అలాంటి ఆనందాన్ని నేను చవిచూశాను. ఆనందాన్ని ఇవ్వలేనిది ఎంత గొప్ప పనైనా ‘నో’ చెప్పడానికి వెనకాడను, నాకు ఏది నప్పుతుందో అదే నన్ను వెతుక్కుంటూ వస్తుంది’ అంటూ ఇలా ఎన్నో కబుర్లు చెప్పుకొచ్చాడు ఆకర్ష్ బైరమూడి. ‘పున్నాగ’ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు అనిరుథ్గా పరిచయమై ‘జీ తెలుగు’లో వచ్చే ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్లో ఆదిత్యగా అలరిస్తున్న ఆకర్ష్ చెప్పే కబుర్లు కూడా అంతే ఆకర్షణీయంగా ఉంటాయి. మరిన్ని విశేషాలు ఆకర్ష్ నోటనే విందాం.. ‘కాలేజీ చదువు పూర్తయ్యాక ‘ఏం చేయాలా’ అని ఆలోచిస్తున్నప్పుడు కన్నడలోని ఓ టీవీ ఛానెల్ సీరియల్లో హీరోపాత్ర రీప్లేస్‌కు అవకాశం వచ్చింది. అప్పటికి అనుమానంగానే ఒప్పుకున్నాను ఆల్రెడీ ఒక పాత్రలో చూసిన జనం నన్ను యాక్సెప్ట్ చేస్తారా..’ అని. పైగా నటనకు కొత్త. కుటుంబ నేపథ్యం కూడా లేదు. సందేహంగానే మూడు నెలలు ఆ సీరియల్లో యాక్ట్ చేశాను. కానీ, అనుకున్నంత గుర్తింపు రాలేదు. పైగా విమర్శలు వచ్చాయి. ‘నువ్వు యాక్టింగ్‌కి సెట్ అవవు’ అన్నారు చానల్‌వాళ్లు. దాంతో బయటకు వచ్చేశాను. ‘ఈ యాక్టింగ్ మనకు సూట్‌కాదు ఏదో జాబ్ చూసుకుందాం’ అనుకున్నాను. బీటెక్ తర్వాత ఎంబీయేలో చేరాను. ఆ టైమ్‌లోనే హైదరాబాద్ ‘జీ తెలుగు’ నుంచి ఫోన్.. ‘ఆడిషన్స్‌కి రమ్మని.’ అప్పటికే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పోయింది. ‘యాక్టింగ్ మానేశాను, రాలేను’ అని చెప్పాను. కానీ, వాళ్లు ఈ సీరియల్‌కి మీరే కరెక్ట్ అనడంతో ఆడిషన్స్‌కి వచ్చాను. వాళ్లిచ్చిన డైలాగ్ ఇంగ్లిష్‌లో రాసుకొని బట్టీ పట్టి అప్పజెప్పాను. కానీ, నాకైతే నమ్మకం లేదు. ‘బెంగుళూరు వాళ్లే రిజెక్ట్ చేశారు. ఇక్కడ తెలుగు భాష కూడా రాదు. ఇక తెలుగులో అవకాశాలేం వస్తాయి..?’ అనుకున్నాను. కానీ మరుసటి రోజే ‘మీరు సెలక్ట్’ అని ఫోన్ కాల్. దీంతో హైదరాబాద్‌లోనే సెటిల్. మూడు నెలల్లో తెలుగు నేర్చుకున్నాను. ఏడాదిన్నరపాటు పున్నాగ సీరియల్లో నటించాను. ఈ సీరియల్ నాకు మంచి పేరును, గుర్తింపును తెచ్చిపెట్టింది. అక్కణ్ణుంచి మంచి మంచి ప్రాజెక్టులు రావడం ప్రారంభించాయి. వద్దన్నవారే పిలిచారు పున్నాగ సీరియల్ తర్వాత కన్నడలో ఏ ఛానెల్ అయితే నన్ను రిజెక్ట్ చేసిందో అదే ఛానెల్ వాళ్లు ఫోన్ చేసి ‘మా సీరియల్లో మీరే చేయాల’ని పట్టుబట్టారు. ముందు వద్దన్నవాళ్లే తర్వాత పిలిచి మరీ ఆఫర్ ఇస్తానంటే ఎందుకు వదులుకోవడం అని వెళ్లాను గానీ అక్కడ వర్క్ నచ్చలేదు. అప్పటికే తెలుగులో మరో సీరియల్‌కి అవకాశం వచ్చింది. తెలుగు నాకు గుర్తింపును, లైఫ్‌ని, సంతోషాన్ని ఇచ్చింది. అందుకే కన్నడ సీరియల్‌కి బై చెప్పి తెలుగు ప్రాజెక్ట్ ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్‌కి వచ్చేశాను. ఆ టైమ్‌లో కన్నడ సీరియల్ వాళ్లు మాపై రివెంజ్ తీర్చుకోవడానికే ఇలా చే శాడు అని విమర్శించారు. నాన్న చాలా హ్యాపీ నాన్న మాకున్న కాఫీ ఎస్టేట్ వర్క్ చూస్తుంటారు. అమ్మ గృహిణి. అన్నయ్య ఇంటీరియర్ డిజైనర్. చేసే వర్క్ పట్ల సంతృప్తి, సంతోషం ఉంటేనే చేయమంటారు వాళ్లు. నేను టీవీ నటుడిని అవడంతో ఆయన చాలా హ్యాపీ. భాష రాకపోయినా నా సీరియల్‌ని తప్పక చూస్తారు. నా స్వెటర్‌ని భద్రంగా దాచుకుంది ఎల్కేజీ రోజుల్లో చదువు కోసం నన్ను ఊటి హాస్టల్లో ఉంచారు అమ్మానాన్నా. ఓ రోజు మా కజిన్ నన్ను ఔటింగ్కని ‘బ్లాక్ థండర్’ ప్లేస్‌కి తీసుకెళ్లారు. అక్కడ నేను తప్పిపోయాను. సెక్యూరిటీ వాళ్లు పేరెంట్స్ పేర్లు అడిగితే చెప్పలేకపోయాను. ఎవరో ఒకావిడ రావడం, వాళ్లతో మాట్లాడడం నన్ను తీసుకెళ్లడం జరిగిపోయింది. నన్ను తీసుకెళుతున్న ఆవిడ గేటు దాటుతుండగా నా స్వెటర్ చూసి గుర్తుపట్టిన మా కజిన్ గట్టిగా పేరు పెట్టి పిలుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆమె నన్ను అక్కడ దించేసి వేగంగా వెళ్లిపోయింది. అప్పుడు నేను ఆమెతో ఆ గేటు దాటి ఉంటే మా పేరెంట్స్‌కు ఎప్పటికీ దొరికుండేవాడిని కానని ఇప్పటికీ అనుకుంటాను. ఆ స్వెటర్‌ని మా అమ్మ భద్రంగా దాచుకుంది. నచ్చినది చేసుకుంటూ వెళ్లడమే! డ్రీమ్ రోల్ అంటూ ఏమీ లేదు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఏంటి అంటే.. ఏమీ చెప్పలేను. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హ్యాపీగా ఉండడమే. నాకు ఏది సూటవుతుందో అదే వస్తుంది అని నా గట్టి నమ్మకం. నిర్మలారెడ్డి -
బంగారు లక్ష్ములు
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు మధురగా కల్పిత సుపరిచితమే. ఇప్పుడు చెల్లి లిఖిత ‘బంగారు పంజరం’తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతోంది. బెంగుళూరులో పుట్టి తెలుగు బుల్లితెర ద్వారా ఆకట్టుకుంటున్న ఈ అక్కాచెల్లెళ్ల టీవీ ప్రయాణం గురించి వారి మాటల్లోనే.. ‘మా నాన్న బిల్డింగ్ కాంట్రాక్టర్. అమ్మ గృహిణి. అక్క, నేను.. ఇదీ మా కుటుంబం. అక్క కాలేజీ రోజుల్లో నటిస్తూనే పీజీ పూర్తి చేసింది. ‘ఒకరికి ఒకరు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైన కల్పిత కన్నడ సీరియల్స్‌లోనూ నటిస్తోంది. మా ఇంట్లో తను ఎంత చెబితే అంత. తనే నాకు అన్ని విషయాల్లో అడ్వైజర్. మోడల్. మంచితనమే ఆభరణంగా! ‘స్టార్ మా టీవీలో వచ్చే ‘బంగారు పంజరం’ సీరియల్లో మహాలక్ష్మిగా నటిస్తున్నాను. ఈ సీరియల్లోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో నేనే పెద్దదాన్ని. అమ్మానాన్నలు చనిపోవడంతో కుటుంబం అంతా తాత బ్రహ్మయ్య బొమ్మల తయారీమీద వచ్చిన ఆదాయంతోనే బతుకుతుంటుంది. తాత బొమ్మలతో పాటు చిన్న చిన్న నగలను కూడా తయారు చేసి అమ్ముతుంటాడు. పేదరికంలో ఉన్నా మా సంతోషాలకు ఎలాంటి లోటూ లేదు. ఒకసారి జమిందారీ కుటుంబం ఆ గ్రామంలోని దేవాలయంలో దేవతా విగ్రహాలను ప్రతిష్టించడానికి పూనుకుంటుంది. అందుకు విగ్రహాలు, నగలు చేయమని ఆ పనిని మా తాతకు అప్పజెబుతుంది. పని అంతా పూర్తి చేస్తాడు మా తాత. ఇది గిట్టని వాళ్లు విగ్రహప్రతిష్టకు ముందు రోజు నన్ను కిడ్నాప్ చేస్తారు. రోజంతా ఒక ఇంట్లో ఉంచి, మరుసటి రోజు వదిలేస్తారు. అందరూ మహాలక్ష్మి శీలాన్ని శంకిస్తుంటారు. దీంతో తాత బ్రహ్మయ్య చాలా బాధపడతాడు. తమవల్ల బ్రహ్మయ్య కుటుంబానికి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి ఆ పేరు పోగొట్టడానికి తమ కంపెనీ మేనేజర్‌తో మహాలక్ష్మిని పెళ్లి చేసుకోమని చెబుతాడు జమిందార్. కానీ పెళ్లి సమయానికి ఆ మేనేజర్ పారిపోవడంతో జమిందారే మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. జమిందార్ ఇంట్లో ఇల్లాలిగా అడుగుపెట్టిన మహాలక్ష్మికి అప్పటికే అతనికి పెళ్లయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిసి షాకవుతుంది. అలా బంగారు పంజరంలో చిక్కుకుపోయి విలవిల్లాడుతుంది. ఎంతో అమాయకత్వం, మరెంతో మంచితనం గల అమ్మాయి మహాలక్ష్మి పాత్ర పోషిస్తున్నందుకు, ఇలా మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చదువంటేనే ఇష్టం అక్క నటిగా మారి నాకూ ఓ మార్గం వేసింది.. అని ఈ సీరియల్ ద్వారా అర్థమైంది. నాచేత ఫొటో షూట్స్ చేయించడం, ఫొటోగ్రాఫ్స్ సీరియల్ టీమ్స్‌కి పంపించడం.. అన్నీ తనే చూసుకుంది. అయితే, ముందు ఇదంతా నాకు తెలియదు. తను చేయమన్నట్టు చేసేదాన్ని. ఒక రోజు సీరియల్ టీమ్ అడుగుతున్నారు, అందులో యాక్ట్ చే యాలి అని తను నన్ను అడిగినప్పుడు చదువంటేనే ఇంట్రస్ట్ అని చెప్పాను. అవకాశాలు అందరికీ రావు, వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి అని తనే నచ్చజెప్పింది. నా చదువుకి ఇబ్బంది లేకపోతే ఓకే అన్నాను. ఎందుకంటే ఇప్పుడు బీకామ్ సెకండియర్ చదువుతున్నాను. సీఎ చేద్దామన్నది నా ఫ్యూచర్ ప్లాన్. మా లెక్చరర్స్, ఫ్రెండ్స్‌ని కలిసి అక్కనే మాట్లాడింది. వాళ్లూ సపోర్ట్ చేస్తామన్నారు. అక్క నా పట్ల చూపిస్తున్న శ్రద్ధ కాదన లేక నటిగానూ ప్రూవ్ చేసుకుందామని ఇలా యాక్టింగ్ వైపు వచ్చాను. లలిత సంగీతం చదువుతోపాటు పాటలు పాడటం, డ్యాన్స్ చేయడం, పెయింటింగ్స్ వేయడం.. వీటి కోసం ఎన్ని గంటల సమయమైనా కేటాయిస్తాను. సింగర్‌గానూ రాణించాలని తొమ్మిదేళ్ల పాటు లలిత సంగీతం నేర్చుకున్నాను. అక్క మాటను కాదనలేక ఒక సీరియల్ అనుకున్నాను. కానీ, నటిగా రాణించడంలోనూ, ప్రూవ్ చేసుకోవడంలోనూ నూటికి నూరుపాళ్లు ఇన్వాల్వ్ అవుతున్నాను. ఇదే ఇకముందు నా ప్రపంచం అనిపిస్తోంది. ఇప్పుడు బాగుంది. ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. నేనూ అక్కలా పీజీ చేసి ఈ ఇండస్ట్రీలోనే స్థిరపడాలని, మరిన్ని మంచి ప్రాజెక్టులు చేయాలని ఇప్పుడు అనుకుంటున్నాను. – ఆరెన్నార్ ఇద్దరిదీ ఒకే మాట మా ఇద్దరి అక్కచెల్లెళ్లది ఒకే మాట. ఇద్దరం సీరియల్స్ చూస్తాం. సీరియస్‌గా డిస్కషన్ చేస్తుంటాం. అందులోని నటీనటుల యాక్టింగ్ గురించి, వారి క్యాస్ట్యూమ్స్ గురించి... ప్రతీది చర్చిస్తుంటాం. ఇద్దరం యాక్టింగ్ పీల్డ్‌లో ఉన్నాం కాబట్టి నటనలో మెలకువల గురించి, ఎలా చేస్తే ఫ్యూచర్ బాగుంటుందో మాట్లాడుకుంటూ ఉంటాం. మా అమ్మానాన్నలు మా ఇద్దరి గురించి ఎవరితోనైనా చెప్పేటప్పుడు ‘మా ఇంటి బంగారు లక్ష్ములు’ అని గర్వంగా చెబుతుంటారు. -
పరుగుల జ్యోతి
బుల్లితెర మీద పరుగుల రాణి ‘జ్యోతి’గా తెలుగువారికి పరిచయమైంది. తెర వెనుక ‘చదువుల తల్లి’ అని అమ్మానాన్నల చేత భేష్ అనిపించుకుంది. శాస్త్రీయ నృత్యంతో ఆకట్టుకుంది. నటన చదువు రెండూ నాకు ఇష్టమే అంటూ తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న ‘జ్యోతి’ సీరియల్ నటి ‘వేద నారాయణ్’ ముచ్చట్లివి. ‘నేను పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ చేశాను. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్నాను. అనుకోకుండా స్నేహితుల ద్వారా వచ్చిన అవకాశంతో నటనవైపు ఆసక్తి చూపాను. కన్నడలో నాలుగు సీరియల్స్ చేశాను. అయితే, అవి మెయిన్ రోల్స్ కాదు. తెలుగులో మా టీవీలో ప్రసారమయ్యే ‘జ్యోతి’ సీరియల్ ద్వారా మెయిన్ రోల్స్‌గా మీ ముందుకు వచ్చాను. ‘జ్యోతి’ సీరియల్లో... ఇందులో జ్యోతి పాత్ర చాలా స్ఫూర్తిమంతంగా ఉంటుంది. పల్లెటూరి అమ్మాయి జ్యోతి. రన్నింగ్ కోసం ఏమైనా చేస్తుంది. ఒకసారి జ్యోతి రోడ్డుపై వెళ్లే వాహనాలతో పోటీ పడి పరిగెత్తుతూ వాటిని ఓవర్టేక్ చేసే సాహసం చేస్తుంది. కోచ్ ఈ అమ్మాయిని చూసి ప్రతిభ ఉందని స్పోర్ట్స్ అకాడెమీకీ సెలక్ట్ చేస్తాడు. అలా ఆ అమ్మాయి పల్లెటూరి నుంచి హైదరాబాద్ స్పోర్ట్స్ అకాడమీలో చేరడం, అక్కడ ఉండే వాతావరణం .. ప్రతీది నేచురల్‌గా ఉంటుంది. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించడమే జ్యోతి ముందున్న లక్ష్యంగా సీరియల్ రన్ అవుతుంది. ఈ సీరియల్లో స్పోర్ట్స్ మాత్రమే కాకుండా సిటీలో జ్యోతికి ఒక చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. నేనూ స్కూల్ రోజుల్లో కబడ్డీ ప్లేయర్‌ని. అకాడమీ వరకు వెళ్లాను. ఈ సీరియల్ స్పోర్ట్స్ థీమ్ ఉన్న లైన్ అవడంతో వెంటనే ఒప్పుకున్నాను. ఎంట్రీ ఇలా... మా నాన్నగారు ప్రభుత్వ ఉద్యోగి. పేరు నారాయణ్. ఈ ఫీల్డ్కి నేను రావడం నాన్నగారికి ఇష్టం లేదు. ‘ఇంజనీయర్ చేశావు, సీరియల్స్ ఏంటి?’ అనేవారు. నాకు ఐటీ వైపు వెళ్లడం ఇష్టం లేదు. అదే విషయం చెప్పాను. అమ్మ మంజుల బ్యూటిషియన్. యాక్టింగ్ ఫీల్డ్ అంటే అమ్మకు ఇంట్రస్ట్ ఉంది. దీంతో నాన్నకు నచ్చజెప్పడం సులువు అయ్యింది(నవ్వుతూ). అమ్మానాన్నల వైపు ఎవరూ టీవీ, సినిమా పరిశ్రమలో లేరు. అయితే, మా తాతగారికి మాత్రం నాటకాలలో ప్రవేశం ఉంది. అలా నాకు ఈ ఆసక్తి వచ్చి ఉంటుందని అమ్మానాన్నలు అంటుంటారు. నాకు ఓ తమ్ముడు. ప్రస్తుతం వాడు చదువుకుంటున్నాడు. వచ్చిన ఆఫర్స్‌ని యాక్సెప్ట్ చేస్తూనే నేనూ ఐఎఎస్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్నాను. ఏ చిన్న లోపమైనా... నాన్నగారు ముందు ఈ ఫీల్డ్ అంటే ఇంట్రస్ట్ చూపకపోయినా ఇప్పుడు నా సీరియల్‌ని తప్పనిసరిగా చూస్తారు. నటనలో ఏ చిన్న లోపం ఉన్నా వెంటనే చెప్పేస్తారు. దాంతో మరోసారి అవి రిపీట్ కాకుండా జాగ్రత్తపడతాను. ఇక అమ్మ అయితే రెగ్యులర్‌గా నా కాస్ట్యూమ్స్, ఇతర యాక్సెసరీస్ అన్నీ తనే సెలక్ట్ చేస్తుంది. నాకేం సూటవుతాయో అమ్మకు బాగా తెలుసు. అందుకే, బెస్ట్ అనిపించే ఆ ఛాయిస్ అమ్మదే. కుటుంబం సపోర్ట్ ఉంటడంతో మరింత హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను. జీవితంలో పరుగులు పెట్టను... సీరియల్లోనే పరుగులు తప్ప జీవితం అంతా పరుగులతో నిండి ఉండాలని అనుకోను. కూల్‌గా, హ్యాపీగా గడిచిపోవాలని కోరుకుంటాను. నా చుట్టూ ఉన్నవారు నన్ను ఎంకరేజ్ చేసేవారే కావడంతో నా జీవితం మరింత సంతోషంగా గడిచిపోతుంది. నటనలో ఇంతవరకే అనే పరిమితులు ఉండవు. కన్నడలో చేసిన సీరియల్స్ అన్నీ నెగిటివ్ పాత్రలే. ఇక్కడ పాజిటివ్... అందులోనూ లీడ్ రోల్ చేస్తున్నాను. కాకపోతే ఎప్పటికైనా ‘అరుంధతి’ సినిమాలో హీరోయిన్లా ఒక రోల్ చేయాలని ఉంది.’ – నిర్మలారెడ్డి -
ఒక రాణి ఇద్దరు రాజులు
ఇండియన్ టెలివిజన్ సిరీస్‌లో మెగా బడ్జెట్ ఫాంటసీ సీరియల్ గురించి చెప్పుకోవాలంటే ప్రప్రథమంగా చంద్రకాంతనే గుర్తు చేసుకోవాలి. ఈ సీరియల్ సృష్టికర్త, రచయిత, నిర్మాత, దర్శకుడు నీర్జా గులేరీ బుల్లితెర మీద ఓ మెగా మాయను సృష్టించారు. మంత్ర తంత్ర విద్యలను కళ్లకు కట్టారు. రాజులు–రాజ్యాల మధ్య జరిగిన యుద్ధ హోరుతో ప్రేక్షకులను కట్టడి చేశారు. ఈ మెగా సీరియల్ ఇండియన్ టెలివిజన్‌లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కథనం హోరు ‘చంద్రకాంత’ ఓ ఊహాజనిత ప్రేమ కథనం. విజయ్‌గఢ్ యువరాణి చంద్రకాంత. అపూర్వ సౌందర్యరాశి. అసామాన్యమైన తెలివితేటలు. రూపంలోనూ, వ్యక్తిత్వంలోనూ దేశదేశాల్లో ఆమె పేరు మార్మోగుతుంటుంది. నవ్‌గఢ్ రాజు వీరేంద్రసింగ్ చంద్రకాంతను ప్రేమిస్తాడు. విజయగఢ్కు పొరుగుననే ఉన్న చునాడ్గఢ్ రాజు శివదత్తుడూ చంద్రకాంతను మోహిస్తాడు. ఒక రాణి కోసం ఈ రెండు ప్రత్యర్థి రాజ్యాల రాజుల మధ్య జరిగిన ప్రేమ పోరాటం కథనమే చంద్రకాంత సీరియల్. కట్టడి చేసే మాయోపాయాలు యువరాణి చంద్రకాంత ఉన్న విజయగఢ్ కోటలోనే క్రూర్సింగ్ అనే వ్యక్తి ఆమెను పెళ్లిచేసుకొని, రాజ్య కిరీటం సొంతం చేసుకోవాలని కలలు కంటుంటాడు. అయితే, పొరుగున ఉన్న చునాడ్గఢ్ రాజు శివదత్తు శక్తివంతమైన రాజు కావడంతో తన పాచికలు పారవని గ్రహించి, అతనికి నమ్మిన బంటుగా మారిపోతాడు. క్రూర్సింగ్ మాయోపాయాలు పన్ని చంద్రకాంతను శివదత్తుని చేత బంధించడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. శివదత్తుడి మాయోపాయాలు, మంత్రతంత్రాలతో చంద్రకాంతను బందీ చేస్తాడు. అతని బందిఖానా నుంచి బయటపడి, పారిపోతున్న చంద్రకాంత్‌ను గుర్తించి శివదత్తకు సమాచారం చేరవేస్తాడు క్రూర్సింగ్. విషయమంతా తెలుసుకున్న వీరేంద్రసింగ్ అయ్యర్ల (గూఢచారులు+సైనికులు) సాయంతో శివదత్తతో పోరాడుతాడు. ఈ కథనం అంతా చంద్రకాంత అపహరణ, ఆమెను కాపాడటం.. వంటివాటితో నడుస్తుంది. చంద్రకాంతను ట్రాప్ చేయడానికి మాయలు, మంత్రవిద్యలు ప్రయోగించడం... వాటిని రాజు వీరేంద్ర తిప్పికొట్టే విధానాలతో నడుస్తుంది. శివదత్తుని మాయోపాయాలన్నీ వీరేంద్ర కనిపెట్టి, వాటిని తిప్పి కొట్టడంతో శివదత్తుడు వెనక్కి తగ్గుతాడు. ఈ పోరాటంలో శివదత్తు తన చునాడ్గడ్ కోటని వదులుకొని వెనుతిరగాల్సి వస్తుంది. వీరేంద్రసింగ్ చంద్రకాంతను పెళ్లి చేసుకొని విజయ్గఢ్ను, తన రాజ్యమైన నవగఢ్ను, శివదత్తుని రాజ్యమైన చునాడ్గఢ్ను కూడా సొంతం చేసుకొని పరిపాలిస్తుంటాడు. దీంతో విధిలేక శివగఢ్ నుంచి పరిపాలన కొనసాగిస్తుంటాడు శివదత్తు. అంతటితో ఊరుకోకుండా వీరేంద్రసింగ్, చంద్రకాంతలపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. శివదత్తు పాలనా వ్యవహారాలను చూస్తున్న పండిట్ జగన్నాథ్ చునాడ్గఢ్ని, చంద్రకాంతను ఎలా కైవసం చేసుకోవాలో భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తుంటాడు. అనుచరులు క్రూర్సింగ్, అహ్మద్, నజిమ్లు వీరేంద్రసింగ్ మీద ప్రతీకారం తీర్చుకోమని శివదత్తుని ప్రేరేపిస్తుంటారు. వీరేంద్రసింగ్‌ను చంపి చంద్రకాంతను పెళ్లి చేసుకోవడానికి శివదత్తే కాదు క్రూర్సింగ్ కూడా ప్రయత్నిస్తుంటాడు. మూలకథకు చాలా దూరం ‘చంద్రకాంత’ నవల నుంచి స్టోరీ లైన్‌ని తీసుకున్నప్పటికీ నవలకి– సీరియల్‌కి పూర్తి భిన్నంగా నడుస్తుంది కథనం. ఈ సీరియల్ ఎన్నో కొత్త కొత్త పాత్రలను పరిచయం చేసింది. చంద్రకాంత మూల కథ రచయిత దేవకి నందన్ ఖత్రీ. ఇతను హిందీ భాషలో మొదటి తరానికి చెందిన ప్రసిద్ధ రచయిత. ఇతను మిస్టరీ నావలిస్ట్‌గా కూడా ప్రసిద్ధి. చంద్రకాంత సీరియల్‌ను 1994 నుంచి 1996 వరకు 130 ఎపిసోడ్లను దూరదర్శన్ ప్రసారం చేసింది. ఈ సీరియల్ నిర్మాత, దర్శకులు నిర్జా గులేరీ, సునీల్ అగ్నిహోత్రి. ఈ సీరియల్ ఒకదశలో వివాదాస్పదం కావడంతో పునః ప్రసారానికి నిర్మాతలు సుప్రీమ్‌కోర్టులో దావా వేశారు. దీంతో 1999లో చంద్రకాంత సీరియల్‌ని తిరిగి ప్రసారం చేశారు. ఇతర టీవీలలో ఆ తర్వాత స్టార్ ప్లస్, సోనీ టెలివిజన్లలోనూ చంద్రకాంత సీరియల్ ప్రసారమైంది. ‘కహానీ చంద్రకాంతకి’ సీరియల్ 2011లో సహారా ఒన్‌లో ప్రసారమయ్యింది. ఆ తర్వాత ‘చంద్రకాంత సంతతి’ పేరుతో దర్శకులు సునిల్ అగ్నిహోత్రి సీరియల్‌గా తీశారు. ఇది దేవకీ నందన్ ఖత్రీ నవలకు అసలు సిసలు రూపం. అయితే, ‘చంద్రకాంత సంతతి’ కథకి, టీవీ సీరియల్ ‘కహానీ చంద్రకాంత’కి చాలా భిన్న సారుప్యాలు ఉన్నాయి. 2017లో స్టార్ భారత్ ‘ప్రేమ్ యా పహేలీ –చంద్రకాంత’ అని మళ్లీ ఈ కథను పరిచయం చేసింది. ఏక్తాకపూర్ తీసిన ‘చంద్రకాంత’ సీరియల్ కలర్స్ టీవీ ప్రసారం చేసింది. విమర్శనాస్త్రాలు నవలా రచయిత దేవకీ నందన్ ఖత్రీ మనవడు కమలపతి ఖత్రీ ‘చంద్రకాంత’ సీరియల్‌కి దర్శకుడు నీర్జాగులేరి న్యాయం చేయలేదని విమర్శించాడు. నవలలోని చిట్టడవి, గూఢచర్యం, మంత్రవిద్యలు వంటి ప్రధానాంశాల పట్ల నిర్లక్ష్యం చేశారని ఆరోపించాడు. చునాగఢ్ కోటలోని పాత్రలు, వరసలను విమర్శిస్తూ అతిశయోక్తిగా ఉందని, అసలు చంద్రకాంతకు ఎంతోదూరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒక ప్రేమ కథకు రూపాలు ఎన్నో ‘చంద్రకాంత’ స్టోరీలైన్ ఒకటే అయినా ఆ తర్వాత రకరకాల రూపాలను నింపుకున్న నవలలు ఎన్నో వచ్చాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగినవి చంద్రకాంత – వీరేంద్రసింగ్ పిల్లల సాహసకృత్యాలతో కూడిన సిరీస్. సినిమా విరమణ ప్రముఖ సినీ నిర్మాత విధు వినోద చోప్రా ‘చంద్రకాంత’ని సినిమాగా తీయాలని ప్లాన్ చేశారు. అమితాబ్‌బచ్చన్, అభిషేక్ బచ్చన్లను ప్రధాన పాత్రలుగా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. దర్శకుడు రామ్మద్వని ఓకే అనుకున్నారు. కానీ, చివరకు చంద్రకాంత సెట్స్ మీదకు వెళ్లలేకపోయింది. – ఎన్.ఆర్ వీరేంద్ర–చంద్రకాంత వీరేంద్రసింగ్గా మెప్పించిన నటుడు షహబజ్ఖాన్. చంద్రకాంతతో పాటు బేతాల్ పచ్చీసి, యుగ్, ది స్వరోద్ టిప్పు సుల్తాన్.. వంటి వాటిలో నటించి ప్రఖ్యాతి చెందాడు. 2018లో చైనీస్ బ్లాక్‌బస్టర్ సినిమా ‘డైయింగ్ టు సర్వైవ్’లో నటించాడు. చంద్రకాంత హీరోయిన్ షిఖా స్వరూప్. 1988 మిస్ ఇండియా ఇంటర్నేషనల్ విజేత షిఖా. మోడల్, బాడ్మింటన్ ప్లేయర్ కూడా. టీవీ సీరియల్స్‌లోనే కాకుండా దాదాపు 11 సినిమాలో నటించి, ప్రేక్షకుల మెప్పు పొందారు షిఖా. -
సంప్రదాయ సిరి
బాలనటిగా వెండితెరపై మెరిసి, సీరియల్ నటిగా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకుంటుంది బ్యూటిఫుల్ గీతాంజలి. జీ తెలుగులో వస్తున్న ‘సూర్యవంశం’ సీరియల్లో ‘సిరి’గా టీవీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. కూచిపూడి నృత్యం అన్నా, చక్కని కథలన్నా, సంప్రదాయ దుస్తులన్నా ప్రాణం అంటూ గీతాంజలి పంచుకున్న కబుర్లు ఇవి. ‘చిన్నప్పుడు సినిమా చూసిన ప్రతీసారి నేనూ సినిమాలో కనిపిస్తా’ అని అమ్మనాన్నలతో చెప్పేదాన్ని. నా ఆసక్తి గమనించిన అమ్మ చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ పరిశ్రమకు పరిచయం చేసింది. అమ్మనాన్నల సపోర్ట్‌తో ‘మహాత్మ, మొగుడు, ఉయ్యాలా జంపాలా..’ వంటి సినిమాల్లో బాలనటిగా చేశాను. అలాగే టీవీ సీరియల్స్‌లోనూ బాలనటిగా చేశాను. ఇప్పుడు టీవీ ఆర్టిస్ట్‌గా మీ అందరికీ పరిచయం అయ్యాను. సింగిల్ రోల్ మొదట ‘అగ్నిపూలు’ సీరియల్లో లీడ్ రోల్ చేశాను. చాలా మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘సూర్యవంశం’లో సిరి పాత్రలో నటిస్తున్నాను. లంగా ఓణీ పాత్రల్లో పల్లెటూరి అమ్మాయిలా ఉండటం అంటే చాలా ఇష్టం. అలాంటి పాత్రలు వస్తే మాత్రం వదులుకోలేను. సంప్రదాయ బద్ధంగా ఉండే ఆ కాస్ట్యూమ్స్‌ని బాగా ఇష్టపడతా. అలాగే, అల్లరిగా గడుసుగా ఉండే అమ్మాయిలా నటించాలని ఉంది. ఇప్పుడు సీరియల్స్‌లోనూ ఇద్దరు–మగ్గురు హీరోయిన్లు ఉంటున్నారు. సింగిల్ హీరోయిన్ కథ వస్తే చేయాలనుంది. అలాగే అవకాశాలు వస్తే సినిమాల్లోనూ మంచి పాత్రల్లో నటించి పేరు తెచ్చుకుంటాను. చదువును వదల్లేదు ‘డ్యాన్స్ అంటే ఉన్న ఇష్టంతో కూచిపూడి నేర్చుకున్నాను. బాలనటిగా చేస్తూనే స్కూల్ చదువు పూర్తి చేశాను. ఆ తర్వాత వరుస షూటింగ్స్‌తో చదువు కుదరలేదు. అయినా, నేను చదువుకు దూరం కాలేదు. దూరవిద్య ద్వారా డిగ్రీ సెకండియర్ చదువుతున్నాను. పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే. నాన్న లోకేశ్వర్ బ్యాంక్ ఉద్యోగి. నాన్నది వైజాగ్ కానీ, హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అమ్మ అరుణ గృహిణి. తమ్ముడు చదువుకుంటున్నాడు. నేనీ రోజు ఇంత సంతోషంగా ఉన్నానంటే మా అమ్మనాన్నల సపోర్టే కారణం. సీరియల్స్ అంటే మొదట్లో అమ్మనాన్న అంతగా చూసేవారు కాదు. ఇప్పుడు నా ప్రతీ ఎపిసోడ్‌ని మిస్ కాకుండా చూస్తూ ఎంకరేజ్ ఏస్తారు. మార్పులు ఉంటే చెప్పేస్తారు. చిన్నమ్మాయి అన్నారు చైల్డ్ ఆరిస్ట్‌గా ఈ పరిశ్రమలోకి వచ్చాను కాబట్టి బయట యాక్టింగ్‌కి ఎలాంటి క్లాసులు తీసుకోలేదు. బాలనటిగా ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ ఉపయోగపడుతుంది. అలాగని నా సొంత నటనే మీదనే పూర్తి నమ్మకం పెట్టుకోను. సీనియర్ ఆర్టిస్టుల నటన గమనిస్తూ ఉంటాను. వారిని చూసి నా నటనలో మార్పులు చేసుకుంటూ ఉంటాను. ‘సూర్యవంశం’ సీరియల్‌కి తీసుకున్నప్పుడు చిన్నమ్మాయిలా ఉన్నానని అన్నారు. కానీ, ఇప్పుడు నా నటన చూసి బెస్ట్ అంటున్నారు. ఈ సీరియల్స్‌లో ముగ్గురు అక్కచెల్లెళ్ల మధ్య స్టోరీ నడుస్తుంది. ఈ ముగ్గురిలో అక్క మీన కి నేను చెల్లెల్లిని. పేరు సిరి. చదువంటే చాలా ఇష్టం. బాగా చదివి కలెక్టర్‌ని అవ్వాలని సిరి కోరిక. అందుకు అక్క బాగా సాయం చేస్తుంటుంది. కానీ, అనుకోని పరిస్థితుల్లో సిరికి ఓ వ్యక్తితో పెళ్లవుతుంది. దీంతో సిరి అక్క, చెల్లితో విడిపోతుంది. అక్కకు దగ్గరవడం కోసం సిరి చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. సెట్స్‌లోనే కాదు బయట కూడా మేం ముగ్గురం కలిశామంటే ఫ్యామిలీ మెంబర్స్‌లా హడావిడి చేస్తాం. బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉంటాం. అక్కచెల్లెళ్లు లేని లోటు ఈ సీరియల్ ద్వారా తీరింది. – నిర్మలారెడ్డి -
సూర్యవంశం అంజలి
‘మనల్ని మనం నిరూపించుకోవాలంటే నిరంతరం కష్టపడుతూనే ఉండాలి. వచ్చిన అవకాశాలను వినియోగించుకోవాలి. మొదట్లో అవకాశాల కోసం చాలా తపన పడ్డాను. విలన్ రోల్స్నీ వదులుకోలేదు. తర్వాత నే కోరుకున్న పాజిటివ్ రోల్స్ వరించాయి’ అంటూ తన గురించి చెప్పడం మొదలుపెట్టిన అంజలి అసలు పేరు మైథిలీ. తెలుగింటి అమ్మాయి మైథిలీ బుల్లితెరపైన రాణించడానికి పడిన తపనను ఈ విధంగా వివరించింది. ‘తెలుగింట పుట్టి తెలుగువారికి టీవీ ద్వారా చేరువకావడం నా అదృష్టంగా భావిస్తుంటాను. నా మొట్టమొదటి సీరియల్ ‘ఆడదే ఆధారం’, ఆ తర్వాత మూడుముళ్ల బంధం. దాదాపు మొదట్లో నాకు వచ్చిన పాత్రలన్నీ విలన్ క్యారెక్టర్లే. దీంతో కొంచెం భయమేసేది అన్నీ నెగిటివ్ క్యారెక్టర్లేనా అని. అష్టాచెమ్మా సీరియల్ తర్వాత మరో అవకాశం కోసం ఎదురుచూస్తూనే డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. నెగిటివ్ నుంచి పాజిటివ్ ఏడాదిన్నర క్రితం జీ తెలుగులో వచ్చే ‘సూర్యవంశం’ సీరియల్లో ‘అంజలి’ పాత్ర నన్ను వరించింది. ఇలాంటి పాత్రకోసం చాలాకాలంగా ఎదురు చూశాను. ఇప్పుడు అంజలిగా చాలా మందికి చేరువయ్యాను. ఇందులో అంజలి చాలా జోవియల్‌గా, కొంచెం సెన్సిటివ్‌గా ఉంటుంది. అంజలి – కార్తీక్లది మంచి జంట. వీరిద్దరి మధ్య ఉండే బంధం చాలా అందంగా ఉంటుంది. ఈ సీరియల్ నుంచి ఇప్పుడు తమిళ్లో మరో అవకాశం వచ్చింది. ఆ పాత్ర డ్యాన్స్ కమ్ పాజిటివ్ రోల్. ‘అష్టాచెమ్మా’ లో మధుర పాత్ర నెగిటివ్ రోల్ అయినా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత సూర్యవంశంలో అంజలి రోల్ మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ రెండు రోల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. కూచిపూడి డ్యాన్సర్ కూచిపూడిలో నాకు సర్టిఫికెట్ కూడా ఉంది. ఆర్టిస్టు అవకాశాలు రాకపోతే కూచిపూడి డ్యాన్సర్‌గా స్థిరపడేదాన్ని. స్కూల్ డేస్‌లో నందనవనం, ధన, పాండురంగడు.. మొదలైన సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాను. ఎక్కడ ఏ ప్రోగ్రామ్స్ ఉన్నా నా ఫొటోలు పంపేదాన్ని. ‘అందమైన భామలు’ టీవీ ప్రోగ్రామ్‌లో టాప్ ఫైవ్ లిస్ట్‌లో ఉన్నాను. అయితే, పోటీలో గెలవలేదు. దీంతో చాలా ఏడ్చాను. చాలా సెన్సిటివ్‌గా ఉండేదాన్ని. అమ్మ నన్ను చాలా మార్చింది. సినిమాల్లో చేయాలని ఉండేది. కానీ, అవకాశాలు ఎలా వస్తాయో తెలియదు. సినిమా ఆఫీస్‌లకు వెళ్లి నా ప్రొఫైల్, ఫొటోలు ఇచ్చి వచ్చేదాన్ని. ఆ తర్వాత ఫోన్ వస్తుందని చాలా ఎదురుచూసేదాన్ని. రాకపోవడంతో డీల్ పడేదాన్ని. సీరియల్స్‌లో అవకాశాలు రావడంతో హ్యాపీగా ఉన్నాను. నటిస్తూనే డిగ్రీ పూర్తిచేశాను. అమ్మ బెస్ట్ ఫ్రెండ్ మాది గుంటూరు. అమ్మానాన్నలకు నేను , అన్నయ్య సంతానం. అన్నయ్య ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నయ్య నాకు చాలా సపోర్ట్. నేను డ్యాన్సర్‌గా రాణించడం కోసం చదువులో వెనకబడకూడదని అన్నయ్య క్లాస్‌లోనే నన్నూ జాయిన్ చేశారు. నేను మిస్ అయిన క్లాసులు అన్నయ్య చెప్పేవాడు. నాకు నోట్స్ రాసిపెట్టేవాడు. మా నాన్నగారు మల్లికార్జునరావు స్కూల్ హెడ్మాస్టర్. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో తరచూ ట్రాన్స్ఫర్లు ఉండేవి. మా అమ్మ లలిత నా విషయంలో ఎక్కువ కేర్ తీసుకుంది. తను క్లాసికల్ డ్యాన్సర్. కానీ, తన కలను నెరవేర్చుకోలేకపోయానని నాకు కళ పట్ల ఆసక్తి కలిగేలా చేసింది. అమ్మ వల్ల నేను కూచిపూడి డ్యాన్సర్‌ని అయ్యాను. అంతేకాదు, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్.. ప్రతీ ఆర్ట్‌లోనూ ప్రవేశం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది అమ్మ. నాన్నగారు మా బాధ్యత అమ్మకే అప్పజెప్పేవారు. ‘పిల్లలు వాళ్లనుకున్న ఫీల్డ్‌లో ఎదిగేలా జాగ్రత్తలు తీసుకో. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది’ అనేవారు. మేం కూడా అవకాశాలను వదులుకోలేదు. ఇప్పటికీ నా ప్రొఫెషన్లో అమ్మ సపోర్ట్ ఉంటుంది. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ చాలా చాలా తక్కువ. మా అమ్మనే నాకు బెస్ట్ ఫ్రెండ్. నాకు బాధనిపించినా, సంతోషమేసినా అమ్మతోనే షేర్ చేసుకుంటాను. – నిర్మలారెడ్డి బిజీ బిజీగా ఉండటం ఇష్టం నన్ను ‘సూర్యవంశం’ అంజలిగా చాలా మంది గుర్తుపడతారు. నా పాత్రను, నటనను మెచ్చుకుంటుంటారు. వచ్చిన అవకాశానికి, చేస్తున్న కృషికి చాలా ఆనందపడుతుంటాను. ఎప్పుడూ బిజీ బిజీగా ఉండటం నాకు ఇష్టం. నెలలో రెండు మూడు సీరియల్స్‌లో యాక్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటాను. సీరియల్స్ షెడ్యూల్ లేని టైమ్‌లో డ్యాన్స్ ప్రోగ్రామ్‌లు ప్లాన్ చేసుకుంటాను. నెలలో కనీసం 2–3 డ్యాన్స్ షోలైనా ఉంటాయి. పెద్ద పెద్ద ఆలోచనలైతే లేవు. క్లాసికల్ డ్యాన్సర్‌ని కాబట్టి డ్యాన్స్ ఇన్స్ట్యూట్ పెట్టాలి. ఇలా యాక్టింగ్‌లోనే కొనసాగాలి. ప్రేక్షకుల నుంచి మంచి పేరు తెచ్చుకోవాలి.’ -
విలన్ అంటే నేనే గుర్తుకు రావాలి
తన సంతోషాన్ని మాత్రమే వెతుక్కునే గుణం, నచ్చనివారికి చెడు జరగాలనే తలంపే విలనిజంలో ప్రధానంగా ఉంటుంది. విలన్‌గా నటనలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. జీ తెలుగులో ప్రసారమవుతున్న ‘ముత్యాల ముగ్గు’ సీరియల్లో నందిక క్యారెక్టర్ ద్వారా తెలుగు బుల్లితెరపై విలనిజాన్ని చూపుతుంది నవ్య. కన్నడ టీవీ సీరియల్లో రాణించి, తెలుగు సీరియల్ ద్వారా విలన్‌గా పరిచయమైన నవ్యారావు పంచుకున్న ముచ్చట్లు ఇవి. నా ఫ్రెండ్స్, బంధువులతో పాటు మా చెల్లెల్లు కూడా ‘ఎందుకు నెగిటివ్ రోల్స్ చేస్తావు. నిన్నందరూ బ్యాడ్ అనుకుంటారు తెలుసా’ అంటుంటారు. ఇలాంటి క్యారెక్టర్స్ వల్ల నటనలో మన ప్రతిభ ఏంటో తెలుస్తుంది. ఈ విషయం పదే పదే వారికి చెప్పలేక నవ్వేసి ఊరుకుంటాను. పాజిటివ్ రోల్స్ చేయాలని నాకూ ఉంది. అవకాశం వస్తే తప్పకుండా ఉపయోగించుకుంటాను. రియాలిటీ షో ఎమ్‌కామ్ పూర్తయ్యాక ఓ రోజు కన్నడ టీవీలో ఒక జ్యువెలరీ షో కోసం యాంకర్స్ కావాలనే ప్రకటన చూశాను. నా ఫొటోలు, వివరాలు వారికి పంపించాను. సెలక్ట్ అయ్యాను. అలా టీవీలోకి వచ్చాను. దీని తర్వాత ఒక రియాలిటీ షోకి అవకాశం వచ్చింది. ‘అండమాన్‌లో పట్టణ ప్రజలు ఎలా ఉంటారు’ అనే టాపిక్ మీద ఆ షో నడిచింది. అక్కడ ఎవరి తిండి వారు వాళ్లే కష్టపడి సంపాదించుకోవాలి, ఫోన్ ఇతరత్రా సదుపాయాలేవీ ఉండవు. అలాంటి చోట పదిహేను రోజులు ఉండటం చాలా కష్టమైంది. కానీ, వర్క్ నచ్చటంతో అంత దూరమైనా లెక్క చేయలేదు. మంచి పేరొచ్చింది. ఆ తర్వాత కన్నడలో ఓ సీరియల్ చేశాను. ఆ తర్వాత తెలుగులో ‘ముత్యాల ముగ్గు’ సీరియల్‌కి అవకాశం వచ్చింది. అయితే, పాజిటివ్ రోల్ కోసం ఎదురుచూస్తున్న నాకు మళ్లీ నెగిటివ్ రోలే వరించింది. ముందు కొంచెం నిరుత్సాహ పడ్డాను. తర్వాత నా రోల్ ప్రాధాన్యత తెలిసి చాలా సంతోషించాను. సరైన ఫీల్డ్ మా నాన్నగారు గణేష్ టీవీ సీరియల్ ఆర్టిస్. నేను ఈ ఫీల్డ్ రావాలని నాన్నగారు ఎప్పుడూ అనుకోలేదు. నేనూ ముందు ఆలోచించలేదు. చదువు తర్వాత లెక్చరర్‌గా స్థిరపడాలనేది నా ఆలోచన. అయితే, నాన్నగారు అనారోగ్యం కారణంగా చనిపోవడంతో సీరియల్ ఆఫర్స్ నాకు వచ్చాయి. అమ్మ, చెల్లి ఉన్నారు. నాన్న తర్వాత ఇంటి బాధ్యత నా మీద ఉంది. అందుకే ఆలోచించి సీరియల్‌కి ఓకే చేశాను. కన్నడ సీరియల్ తర్వాత ఆరునెలల పాటు ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో ఒక కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ జాబ్‌లో చేరాను. అక్కడకు వచ్చినవారు నన్ను కలిసి ‘మీరు ఫలానా సీరియల్లో నటించారు కదా!’ అని దానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతుండేవారు. చాలా ఇబ్బంది అనిపించేది. పనిచేసే చోట ఇలాంటి వాతావరణం ఉండకూడదు అనుకున్నాను. ‘ఏ ఫీల్డ్‌లో గుర్తింపు వచ్చిందో ఆ ఫీల్డ్‌లోనే కొనసాగడం మంచిది’ అని ఆ తర్వాత సీరియల్ ఒప్పుకున్నాను. ముత్యాల ముగ్గు ఈ సీరియల్ తెలుగువారికి నన్ను చాలా చేరువచేసింది. హీరోయిన్ కన్నా పది రెట్ల ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న పాత్ర. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ‘నందిక’ పాత్ర ఎంతో మేలు చేసింది. నా కెరియర్లో ఇదొక టర్నింగ్ పాయింట్. ఈ సీరియల్లో భూమి–అంబిక అక్కచెల్లెళ్లు. భూమి పల్లెటూరి అమ్మాయి, అంబిక సిటీ అమ్మాయి. భూమికి పూర్తి వ్యతిరేక పాత్ర నాది. నాకేదైనా, ఎవరైనా నచ్చారంటే వాళ్లు నాతోనే ఉండాలి. ఆ వస్తువు, ఆ మనిషి నాకే చెందాలి. అందుకోసం ఎంతదూరమైన వెళతాను. భూమి అంటే నాకు పడదు. నాకు నచ్చిన విరాట్‌ను తను పెళ్లి చేసుకుంటుంది. వాళ్లను విడదీసి విరాట్‌ను నేను సొంతం చేసుకోవాలి. ఎవరికి ఎలాంటి చెడు జరిగినా డోన్ట్ కేర్.. అన్నట్టుగా ఉంటుంది నా పాత్ర. నందికలో చాలా మధనం ఉంటుంది. బ్యాడ్ మార్క్ పడకూడదు నెగిటివ్, పాజిటివ్ .. ఏ రోల్ చేసినా ఇక్కడ మన మీద ఒక్క బ్యాడ్ మార్క్ కూడా పడకూడదు. అంత జాగ్రత్తగా ఉండాలి. ఏ రోల్ వేసినా క్యాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్‌స్టైల్ ద్వారా మెప్పించాలి. ఒకసారి ప్రాజెక్ట్‌కి ఓకే చేశాక మన బాధ్యత చాలా ఉంటుంది. ఇండస్ట్రీలో హార్డ్ వర్క్‌కే ఎక్కువ ప్రాధాన్యత. నేనెక్కడా యాక్టింగ్ నేర్చుకోలేదు. క్లాసులకు వెళ్లింది లేదు. మా నాన్నగారు ఈ ఫీల్డ్‌లో ఉండటం వల్ల స్వతహాగా నాకు యాక్టింగ్ వచ్చి ఉంటుంది. అలాగే, నా సీనియర్ ఆర్టిస్టుల నుంచీ నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నాను. – నిర్మలారెడ్డి -
గుండెల్లో గుడారం
సాయంత్రమైతే గిర్రున తిరిగే సర్కస్ లైటు ఫోకస్ ఊరిమీద పడుతుంది.పిల్లలూ పెద్దలూ సంబరంగా బయలుదేరి వెళతారు.పులులూ సింహాలు హంసల్లా అటు నుంచి ఇటుకు ఇటు నుంచి అటుకు ఎగిరే మనుషులు జోకర్లు...సర్కస్ గుడారం ఇచ్చే ఆనందం ఎంతో.కాని ఆ గుడారాన్నే జీవితం చేసుకున్న వాళ్ల మధ్య ఎన్నో అనుబంధాలు ఉంటాయి. ఉద్వేగాలు ఉంటాయి. నవ్వులూ ఏడుపులూ ఉంటాయి.వాటిని మొదటిసారి చూపించి ప్రేక్షకుల గుండెల్లో గుడారం వేసిన సీరియల్ ‘సర్కస్’. ఊయలలూగుతున్న రంగు రంగుల చిలుకలు.. సైకిల్ తొక్కుతూ గిరి గిరా తిరగేసే భారీ ఏనుగు.. రింగ్ మాస్టర్ చెప్పినట్టు ఆడే పులులు.. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు సన్నని తీగలమీద జెండాలు పట్టుకొని మరీ అవలీలగా తిరిగే అమ్మాయిలు.. ఒక వైపు నుంచి మరో వైపుకు గాల్లోనే ఫల్టీలు కొట్టే అబ్బాయిలు..ఇవన్నీ చూస్తున్న పిల్లలు నవ్వులతో కేరింతలు కొట్టారు. పెద్దలు ఊపిరి బిగబట్టి చూశారు. ఇది సినిమా కాదు.. సర్కస్. ఈ పేరు వింటూనే మీ చెవుల్లో ఓ పాట ‘సర్కస్ హై భాయ్ సర్కస్ హై.. ఏ దునియా ఏక్ సర్కస్ హై.. రంగ్ బిరంగీ సర్కస్ హై.. ’ అంటూ రింగులుగా తిరుగుతుండాలి. దాదాపు మూడు దశాబ్దాల క్రితం పెద్ద పెద్ద పట్టణాల్లో సినిమా కాకుండా జనాలకు ఎంటర్టైన్మెంట్కు సర్కస్ పెద్ద వేదికగా ఉండేది. కొన్ని సర్కస్ కంపెనీలు చిన్నా పెద్ద టౌన్లకు కూడా వెళ్లి నెలా రెండు నెలలు వినోదాన్ని పంచి తిరిగి మరో చోటుకు వెళ్లేవి. అలాంటి రోజుల్లో ప్రతి ఇంటికి సర్కస్‌ను మోసుకొచ్చింది దూరదర్శన్. 1989లో పంతొమ్మిది వారాల పాటు సర్కస్ ఫీట్లతో ఇంటిల్లిపాదినీ తన ప్రపంచంలోకి లాక్కొచ్చింది. ప్రపంచంలో ఉన్నదంతా సర్కస్‌లో ఉందని చూపింది. ఎందుకంటే సర్కస్ అనేదే ఓ ప్రపంచం కాబట్టి. అక్కడ రాగద్వేషాలున్నాయి, గుండెదాటని కష్టాలున్నాయి, ఎగిసిపడే కెరటాలున్నాయి. మంచి ఉంది. చెడు ఉంది. దీని కోసం రచయిత దర్శకులు అజీజ్ మిర్జా, కుందన్ షాహ్‌లు కలిసి ఒక సర్కస్ ట్రూప్నే తయారుచేశారు. దీంట్లో షారూఖ్ ఖాన్, రేణుకా సహానే, అశుతోష్ గోవరికర్ వంటి ముఖ్యులు నటించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ప్రసారమైన ఈ సీరియల్‌ని పిల్లలు సర్కస్‌కి వెళ్లినంతగా ఎంజాయ్చేశారు. కళాకారుల నిలయం సర్కస్ అనేది కొంతమంది కలిసి పనులు చేసుకుంటూ, తమకు వచ్చిన కళను ప్రదర్శిస్తూ ఉండే ఒక కంపెనీ మాత్రమే కాదు. కొంతమంది చుట్టూత కలిసి ఉండే జీవితం. అది అపోలో సర్కస్. దాని యజమాని బాబూజీ. సర్కస్ కంపెనీలో ఉన్నవారందరినీ తన బిడ్డల్లానే చూసుకునేంత ఉదాత్తుడు. పై చదువుల కోసం కొడుకు శేఖరన్ని వేరే చోట ఉంచి చదివిస్తుంటాడు. సర్కస్‌లోని కష్టనష్టాలేవీ కొడుకుకు తెలియవు. రోజు రోజుకూ సర్కస్‌ను నడపడం భారంగా అనిపిస్తుంటుంది బాబూజీకి. అయినా, దాంట్లోనే పుట్టి పెరిగిన బాబూజీ సర్కస్ని కాపాడుకోవడమే ధ్యేయంగా జీవిస్తుంటాడు. ఒకసారి జంతువులను అమ్మే సింగ్ బాబూజీని కలిసి, తన దగ్గర ఉన్న ఎలుగును కొనుగోలు చేయమని అడుగుతాడు. కానీ, బాబూజీ తనకున్న ఆర్థిక కష్టాల గురించి చెప్పి వద్దంటాడు. చదువు పూర్తయి తన కొడుకు శేఖరన్ సర్కస్‌కి వస్తున్నాడని అందరికీ చెబుతాడు బాబూజీ. శేఖరన్ చిన్ననాటి నేస్తం మరియతో పాటు అంతా సంతోషిస్తారు. శేఖరన్ వచ్చాక సర్కస్‌లో అంతా పండగ వాతావరణం నెలకొంటుంది. ముందు వద్దనుకున్న ఎలుగును శేఖరన్ కోసం కొనడానికి సిద్ధమవుతాడు బాబూజీ. అయితే, శేఖరన్ సర్కస్ తనకు వద్దని, సొంతంగా ఫ్యాక్టరీ పెట్టాలనే ప్రయత్నాలు మొదలుపెడుతుంటాడు. కొడుకు మాట కాదనలేక బాబూజీ మౌనంగా బాధపడుతుంటాడు. సర్కస్ పనులు వదిలేసి తండ్రిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తిరిగి స్నేహితుల వద్దకు వెళ్లిపోతాడు శేఖరన్. కొడుకు మీద ఆశ వదులుకున్న బాబూజీ సర్కస్‌లో క్లిష్టమైన ఫీట్ చేయడానికి సాహసిస్తాడు. ఆ సమయంలో గుండెపోటు వచ్చి, ఆసుపత్రిలో చేరుతాడు. విషయం తెలిసి శేఖరన్ తండ్రి వద్దకు వస్తాడు. తండ్రి బాగు కోసం సర్కస్ ఎప్పటిమాదిరిగానే నడుస్తుందని, తానే దగ్గరుండి చూసుకుంటానని మాట ఇవ్వడంతో అంతా సంతోషిస్తారు. శేఖరన్ ఆధ్వర్యంలో సర్కస్‌కి కొత్త రూపు వస్తుంది. ప్రమాదాల ప్రయత్నం తాగుబోతైన జొనాథన్‌ని బాబూజీ సర్కస్ నుంచి బయటకు వెళ్లగొట్టకుండా, తాగడానికి డబ్బులు కూడా ఇవ్వడం కంపెనీలో చాలా మందికి అర్థం కాదు. అతని వల్ల కంపెనీకి ఎలాంటి ప్రయోజనం లేదని కొందరు భావిస్తారు. అయితే, జొనాథన్ అపోలో సర్కస్‌కు విశ్వసనీయుడని తెలుసుకుంటారు. జొనాథన్ యువకుడిగా ఉన్నప్పుడు అపోలో సర్కస్‌లో ట్రపీజ్ ఆర్టిస్ట్. ప్రదర్శన సమయంలో జరిగిన ప్రమాదంలో కాలు కోల్పోతాడు. దీంతో తప్పనిసరిగా అతను తన కళ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. కూతురు మరియను తనలా ట్రపీజ్ ఆర్టిస్ట్ కావాలని, సర్కస్ ఫీట్లు చేయాలని బలవంతం చేస్తాడు. సర్కస్‌లోని వారంతా జొనాథన్ తపనను అర్ధం చేసుకొని, సర్దిచెబుతారు. కూతురుని క్షమించమని అడుగుతాడు జొనాథన్. తండ్రి తపించే కళను తనూ నేర్చుకోవాలని రోజూ ఫీట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటుంది మరియ. కానీ, తన వల్ల కాకపోవడంతో బాధపడుతుంది. మాజీ ట్రపీజ్ ఆర్టిస్ట్ షామిలీ మాటలతో స్ఫూర్తి పొందిన మరియ మళ్లీ ప్రయత్నిస్తుంది. తన ప్రయత్నంతో మరియ విజయవంతం అవడంతో జొనాథన్ సంతోషంతో పొంగిపోతాడు. సర్కస్‌లోని వారంతా అభినందిస్తారు. ప్రియమైన సర్కస్ సర్కస్ కంపెనీయే తమ ఇల్లుగా భావించే అందరి మధ్య ఒక విడదీయ లేని ప్రేమ ఉంటుంది. పెద్దవాళ్లు పిల్లల ఆలనపాలనా చూడడటం, పిల్లలు పెద్దవాళ్లతో కలిసిపోవడం.. కుటుంబాన్ని తలపిస్తుంది. అయితే, సర్కస్ సీరియల్ అనగానే షారూఖ్, రేణుకా సహానే ప్రేమే మన కళ్ల ముందు కదులుతుంది. అయితే, అంతకు ముందే షామిలీ– ఆదిత్య ప్రేమ కళ్లకు కడుతుంది. సర్కస్‌లోనే వయోలిన్ ఆర్టిస్ట్ ఆదిత్య, ట్రపీజ్ ఆర్టిస్ట్ షామిలీ ప్రేమించుకుంటారు. అయితే, షామిలీని రింగ్ మాస్టర్ సుబృద్ ప్రేమిస్తాడు. ఆదిత్య మీద తప్పుడు నేరం మోపి జైలు శిక్ష పడేలా చేస్తాడు సుబృద్. ఆ తర్వాత షామిలీని పెళ్లి చేసుకుంటాడు. పదేళ్ల తర్వాత ఆదిత్య జైలు నుంచి తిరిగి వస్తాడు. విషయం తెలిసిన షామిలీ చాలా బాధపడుతుంది. షామిలీ తిరస్కారం సుబృద్ని బాధిస్తుంది. ప్రదర్శన మధ్యలో సుబృద్ పులి పంజా బారిన పడతాడు. పెళ్లి తర్వాత ట్రపీజ్ ఆర్ట్‌కు దూరమైన షామిలీ పదేళ్ల తర్వాత మళ్లీ ప్రాక్టీస్ చేసి తన ఫీట్లతో తిరిగి పాత వైభవాన్ని పొందుతుంది. శారీరక వైకల్యంతో బాధపడే కళందర్ తల్లిదండ్రుల నుంచి ఎలా దూరమయ్యాడో గుర్తుకు తెచ్చుకొని బాధపడుతుంటాడు. దూరమైన తల్లిదండ్రులు ఒకరోజు కళందర్ని సర్కస్‌లో కలుసుకుంటారు. కళందర్ తమ కొడుకు జగదీష్ అని, చిన్నప్పుడే తమ నుంచి దూరమైన బిడ్డ అని, తమతో పాటు రమ్మంటారు. ఈ సర్కసే తన ఇల్లు అని, ఇదే తన ప్రపంచం అని చెప్పి కంటతడిపెట్టిస్తాడు కళందర్. అపోలో సర్కస్‌లో జరుపుకునే పండగలు, జంగూమంగూ చేసే కామెడీ సర్కస్ అంతా సందడిని నింపుతుంది. మనస్ఫూర్తిగా బాధ్యత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన∙బాబూజీ సర్కస్‌లో వచ్చిన మార్పులు చూసి ఆశ్చర్యపోతాడు. సంబరంగా జరుగుతున్న సర్కస్ ప్రదర్శన మధ్యలోనే బాబూజీ ప్రాణాలు వదలుతాడు. సర్కస్‌ను నడపడం తన వల్ల కాదంటాడు శేఖరన్. అంతా బాధలో మునిగిపోతారు. అర్థరాత్రి నిద్రపట్టక కూర్చున్న శేఖరన్‌కి తన తండ్రి ఆ సర్కస్‌లోనే కనిపిస్తుంటాడు. శేఖరన్ వద్దకు వచ్చిన మరియ తెల్లవారేసరికి సర్కస్‌ను వదిలిపెట్టి నీదైన ప్రపంచంలోకి వెళ్లిపొమ్మంటుంది. శేఖరన్ని తీసుకెళ్లడానికి అతని స్నేహితుడు వస్తాడు. బయటి వరకు వచ్చిన శేఖరన్‌కి తండ్రి ఫొటో లోపలే మర్చిపోయానని గుర్తొచ్చి తిరిగి సర్కస్‌లోకి వెళతాడు. అక్కడ తండ్రి తనను విడిచి వెళ్లద్దని అదృశ్యంగా చెప్పే మాటలు శేఖరన్లో మార్పు తీసుకువస్తాయి. శేఖరన్ మనస్ఫూర్తిగా సర్కస్ బాధ్యతలు స్వీకరించడంతో సీరియల్ ముగుస్తుంది. ఒక యువకుడు ఇబ్బందుల్లో ఉన్న తండ్రి సర్కస్‌ను తను తీసుకొని ఎలా మేనేజ్ చేశాడన్నదే ఈ కథ. సర్కస్ కంపెనీతో తండ్రికి ఉండే బంధం, ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి కొడుకుతో పాటు కంపెనీలో ఉన్నవారిందరూ పడే తపన మన కళ్ల ముందు కదలాడుతుంది. – ఎన్.ఆర్ బాలీవుడ్ బాద్షా, సూపర్‌స్టార్ షారూఖ్ ఖాన్ ముప్పై ఏళ్ల క్రితం అప్పుడప్పుడే నటనలో నిలదొక్కుకోవడానికి శ్రమిస్తున్న రోజులు. షారూఖ్‌కి ఫస్ట్ బ్రేక్ ఫౌజీ సీరియల్‌తో టీవీ అవకాశం ఇచ్చినా ఇప్పటికి షారూఖ్ ఇండస్ట్రీలో ఫస్ట్ డేస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సర్కస్ సీరియల్ ప్రస్తావనే వస్తుంది. దూరదర్శన్ షారూఖ్ నటనకి సర్కస్‌తో ఓ పెద్ద వేదికనిచ్చింది. -
కష్టాలకే రేటింగ్ ఎక్కువ!
‘అపరంజి’ బొమ్మగా ఆకట్టుకుని, ‘ఇద్దరమ్మాయిలు’తో మెప్పించి, ‘అష్టాచెమ్మా’ఆడేసి, ఇప్పుడు ‘నా కోడలు బంగారం’ అనిపించుకుంటున్న సుహాసిని తెలుగమ్మాయి.పరిచయం అక్కర్లేని నటి. వెండి తెర నుంచి బుల్లితెర వైపుగా టర్న్ తీసుకొని అందమైన అభినయంతో మెప్పిస్తున్న సుహాసిని ‘సాక్షి’తో పంచుకున్న చిరుజల్లులు మాల. ‘చాలా మంది సీరియల్ పాత్రల పేర్లతోనే పిలుస్తుంటారు. కానీ, నన్ను జనం ‘సుహాసిని’గానే గుర్తుంచుకున్నారు. ఈ గుర్తింపు ‘చంటిగాడు’ సినిమా ఇచ్చింది. చంటిగాడు సినిమా టెన్త్‌క్లాస్‌లో ఉండగా చేశాను. ఆ సినిమా సమయంలో నటన గురించి ఎలాంటి ఐడియా లేదు. ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ లేదు. ఫొటోగ్రఫీ తెలిసిన వారి ద్వారా నా ఫొటోలు దర్శకురాలు జయగారి దగ్గకు వెళ్లాయి. నా ఫొటో చూడగానే పేరు అడక్కుండా, స్క్రీన్ టెస్ట్ చేయకుండా ఈ అమ్మాయే నా సినిమాలో హీరోయిన్ అన్నారట. అలా నేను సినిమాలోకి వచ్చాను. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలు చేశాను. సీరియల్ వైపు ‘అపరంజి’ సీరియల్‌తో మూవీ నుంచి టీవీకి వచ్చాను. ఓకే చేయడానికి ముందు ఆలోచనలో పడ్డాను. ‘సినిమాల్లో చేస్తున్నాను.. టీవీలో చేస్తే ఆఫర్స్ రావేమో’ అని. కానీ, సీరియల్లో లీడ్ రోల్ అంతా నా చుట్టూతానే తిరుగుతుంది, పర్ఫార్మెన్స్కి మంచి స్కోప్ ఉంది.. పైగా అప్పటికి మంచి రోల్ ఉన్న సినిమాలూ కూడా నాకేవీ లేవు. నా కో–యాక్టర్స్ కూడా ఇదే మంచి ఆప్షన్ అన్నారు. యాక్టర్స్‌కి కావల్సింది వర్క్, గుర్తింపు. చంటిగాడుతో నాకు గుర్తింపు వచ్చింది. నాక్కావల్సింది వర్క్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీవీకి టర్న్ అయ్యాను. ఫ్యామిలీ సపోర్ట్ పుట్టిపెరిగింది అంతా నెల్లూరులోనే. మా తాతగారికి నేను సినిమాలో నటించడం అస్సలు ఇష్టం లేదు గ్లామర్ ఫీల్డ్ అని. ఎంతోకొంత చదివించి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనేవారు.. కానీ, మా అమ్మ బాగా సపోర్ట్ చేశారు. నాకు డ్యాన్స్ అంటే బాగా ఇష్టం. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నాకు డ్యాన్స్ నేర్పించింది అమ్మ. ‘ఇలా ఉండాలి’ అని చెబుతారు కానీ, ఇలాగే ఉండి తీరాలి అని మా ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా వర్క్ చేసేముందు మాత్రం ‘ఆలోచించుకో’ అంటారు. మన ఇష్టం లేకుండా ఏదీ చేయలేం కదా! గ్లామర్ రోల్ అంటే ఓకే కానీ నాకూ ఎక్స్పోజింగ్ ఇష్టంలేదు. అందుకే అలాంటి ఆఫర్స్ వచ్చినా ఒప్పుకోలేదు. చేసినంత వరకు మంచి ఆఫర్స్ వచ్చాయి. ‘ప్రేమ, నాకోడలు బంగారం’.. సీరియల్స్‌తో ప్రొడ్యూసర్‌గా మారాను. ఈ అవకాశం నాకు ‘జీ’టీవీ ఇచ్చింది. అన్నింటికన్నా ప్రొడ్యూసర్ టైమ్ చాలా ఇంపార్టెంట్. ప్రతీది దగ్గరుండి చూసుకోవాలి. మా నాన్నగారు, మావారి సపోర్ట్ ఉండటంతో నా వర్క్ ఈజీ అయ్యింది. అందుకే ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్‌గా చేయగలుగుతున్నాను.ఎప్పుడూ రెండు, మూడు సీరియల్స్ ఒకేసారి ఒప్పుకొని టెన్షన్ పడలేదు. ఒకే సీరియల్.. నెలలో పదిహేను రోజులు వర్క్, మిగతా రోజులు ఇల్లు. జీవితాన్ని అలా బ్యాలెన్స్ చేసుకోవడం ఈజీ అయ్యింది. ఎప్పుడైనా విలేజీకి వెళితే.. ‘నీకెన్ని కష్టాలమ్మా! తర్వాత ఏమౌతుందమ్మా’ అంటుంటారు సీరియల్ గురించి మాట్లాడుతూ. సీరియల్స్‌లో కష్టాలు, కన్నీళ్లు ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. అయితే, ప్రేక్షకులు వాటికే ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. టి.ఆర్.పి.. ని బట్టే కంటెంట్ మార్చుకుంటూ వస్తాం. ఆ విధంగా చూస్తే కష్టాలున్న వాటికే రేటింగ్ ఎక్కువ అన్నమాట(నవ్వుతూ). నా కోడలు బంగారం అత్తా–కోడలు అనగానే ఒకరికొకరు పడదు.. అనుకుంటారు. కానీ, ‘నా కోడలు బంగారం’ సీరియల్ మిగతా సీరియల్స్‌కి రివర్స్‌గా ఉంటుంది. ‘జీ’ టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్లో అత్తా–కోడలు తల్లీ కూతురులా ఉంటారు. నిజజీవితంలోనూ మా అత్తగారితో నేను చాలా బాగా ఉంటాను. ఇప్పుడు సీరియల్స్ కేవలం మహిళలు మాత్రమే కాదు యూత్, పిల్లలు కూడా చూస్తున్నారు. వారిని అట్రాక్టివ్ చేసేలా .. కొంత రొమాంటిక్, ఇంకొంత ఫన్ చూపిస్తుంటాం. అలాగే మదర్, ఫాదర్ సెంటిమెంట్ సీన్స్ కూడా మిస్ అవకూడదు. ఇలా ఆడియన్స్ అందరినీ దృష్టిలో పెట్టుకొని సీరియల్ ప్లాన్ నడుస్తుంటుంది. కాస్ట్యూమ్స్ ఎంపిక నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. నెలలో 15 రోజులు షూటింగ్, మిగతా 15 రోజులు షాపింగ్ (నవ్వుతూ) చేయమన్నా విసుగు రాదు. కొత్తబట్టలు.. ఎప్పుడూ కొంటుంటున్నాను. ఏ రోజుకారోజు బెటర్డ్రెస్ అని ఎంపిక చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకీ అలవాటు ఉంది. నేను అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటాను. నా రెమ్యునరేషన్లో సగం మనీ బట్టలకే (నవ్వుతూ). ఇంట్లో నా బట్టలే కట్టలు కట్టలుగా ఉంటాయి. అంత పిచ్చి.. బట్టలంటే. పెళ్ళి.. తర్వాతి జీవితం ఇద్దరమ్మాయిలు సీరియల్ చేస్తున్నప్పుడు నా కో–స్టార్ ధర్మ నేను ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారం పెళ్లి చేసుకున్నాం. తను యాక్టింగ్‌లోకి రాకముందు సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు. తనకు ఆస్ట్రేలియాలో జాబ్ ఆఫర్ వచ్చింది. ‘ఏమంటావు..?’ అని అడిగారు. నేను రాలేను.. అని చెప్పాను. ‘నీ కోసం నేనే జాబ్ వదిలేస్తాను’ అన్నారు. ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్లో తను చాలా తక్కువ టైమ్‌లోనే మంచిపేరు తెచ్చుకున్నారు. నా యాక్టింగ్‌లోనూ సజెషన్స్ ఇస్తుంటారు. ముందు అంతేకదా అనుకుంటాను. తర్వాత మార్చుకుంటాను. పెళ్లయ్యాక మేం కలిసి సీరియల్ చేయలేదు. ఇద్దరమ్మాయిలు సీరియల్లో మాత్రం పోటా పోటీగా చేశాం. తనకు టైమ్ పంక్చువాలిటీ ఎక్కువ. చాలా ఫన్ క్రియేట్ చేస్తారు. రోజూ నిన్నటి కన్నా ఈ రోజు ఇంకొంచెం మంచి అనిపించుకుంటే చాలని, నా వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదని అనుకుంటాను. అందుకే సోషల్‌మీడియాలోనూ లేను. రిప్లై కోసం ఎదురు చూసేవారిని ఇబ్బందిపెట్టినట్టు అవుతుందని నా ఆలోచన. నెగిటివ్ అంటే అస్సలు ఇష్టపడను. ‘నా చుట్టూ మంచి ఉండాలి. అందులో నేను ఉండాలి’ అనే తత్త్వం నాది. – నిర్మలారెడ్డి -
మా మంచి వదినమ్మ
బాలనటిగా మురిపించింది. సినిమా నటిగా మెరిపించింది. టీవీ నటిగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కేరళ కుట్టి అయినా తెలుగమ్మాయే అనిపించింది. ఇప్పుడు తెలుగిళ్లలో ‘మా’టీవీ ద్వారా ‘వదినమ్మ’గా తన స్థానం సుస్థిరం చేసుకోనుంది. ఆ వదినమ్మ పేరు సుజిత. తీరైన కట్టూ బొట్టుతో.. నిండైన రూపంతో ఆకట్టుకుంటున్న సుజిత ‘సాక్షి’ పాఠకులతో పంచుకుంటున్న భావాలు ఇవి. ‘బాలనటిగా, నటిగా అన్ని భాషల సినిమాల్లోనూ చేశాను. కానీ, ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. అలా తెలుగువారికి నేను బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాల్లో చేసినా నన్ను ఇంటింటికీ చేరవేసింది మాత్రం ‘కలిసుందాం రా’ సీరియల్. అప్పడు నేను తొమ్మిదవ తరగతిలో చేరబోతున్నాను. ఆ సమయంలో బాలాజీ టెలీఫిలిమ్స్ నుంచి ఈ ఆఫర్ వచ్చింది. అంత చిన్న వయసులో కాలేజీ చదివే అమ్మాయిలా, ఆ తర్వాత భార్యగా, ఉమ్మడి కుటుంబంలో కోడలిగా.. లీడ్ రోల్ పోషించాను. వయసుకు మించి మెచ్యూరిటీ చూపించడం ఆ సీరియల్ నాకు నేర్పింది. ఇప్పుడు 30 ఫ్లస్‌లో ఎలా ఉన్నానో అలా ఆ వయసులోనే సీరియల్లో కనిపిస్తాను. సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి, కుటుంబసభ్యులతో ఎలా ఉండాలి... ఇలా ఎన్నో విషయాలను ఆ సీరియల్ నాకు నేర్పించింది. కాలేజీ చదువు మిస్ అయ్యాను స్కూల్ ఏజ్‌లోనే సీరియల్స్‌లోకి ఎంటర్ అయినప్పటికీ ఎప్పుడూ స్కూల్ డేస్‌ని మిస్ అవలేదు. అలా ప్లాన్ చేశారు అమ్మానాన్న. స్కూల్ ఉన్నప్పుడు క్లాస్‌కి, లేదంటే షూటింగ్‌కి అన్నట్టుగా ఉండేది. ఆ తర్వాత కాలేజీ చదువు మాత్రం రెగ్యులర్‌గా వెళ్లడం కుదరక మద్రాస్ యూనివర్శిటీ నుంచి ప్రైవేట్‌గా కట్టి చదివాను. మా చెల్లెలి కాలేజీ లైఫ్ చూశాక మాత్రం నేను కాలేజీ చదువుని, టీనేజ్ లైఫ్‌ని మిస్ అయ్యాను అని చాలా బాధపడ్డాను. టీవీ వదినమ్మ ‘పండియాన్ స్టోర్స్’ అని తమిళ్లో సీరియల్ చేస్తున్నాను. అది 200 ఎపిసోడ్స్ వైపుగా వెళుతూ మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సీరియల్‌ను తెలుగులో ‘వదినమ్మ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ ఆఫర్ వచ్చినప్పుడు కొంచెం ఆలోచించాను. ఫ్యామిలీతో గడిపే సమయం తగ్గిపోతుందని. కానీ, ఈ విధంగా మరోసారి తెలుగువారికి దగ్గరకావచ్చు అనిపించింది. అదీ గాక వదినమ్మ రోల్ నన్ను బాగా ఆకట్టుకుంది. మన సంస్కృతి ప్రత్యేకత అంతా ఉమ్మడి కుటుంబంలోనే ఉంటుంది. అమ్మకు సమానంగా ఉంటుంది ఆ రోల్. ఆ కుటుంబం అంతా ఆమె చెప్పినట్టుగా వింటుంది. ‘వదినమ్మ’ సీరియల్లో వదిన పాత్ర పేరు ధనలక్ష్మి. పల్లెటూరిలో పుట్టిపెరిగిన అమాయకత్వం గల అమ్మాయి. కుటుంబం అంటే ఎంతో అభిమానం. సంప్రదాయ బద్ధంగా చీరకట్టు, పెద్ద బొట్టు, గాజులు.. చూడగానే దండం పెట్టాల్సినంత గౌరవంగా ఉంటుంది ఆ పాత్ర. రియల్ లైఫ్‌లో వదినమ్మ మా వారికి తోబుట్టువు ఒక్కరే. అది కూడా తనకు అక్క. మా ఆడపడుచు నాకు వదిన. అమ్మవాళ్లింట్లోనూ అన్నయ్య పెద్ద. (నవ్వుతూ) రియల్ లైఫ్‌లో వదినని కాలేకపోయాను. కానీ, వదిన రోల్ మాత్రం చాలా విలువైనది. వర్క్ – ప్యామిలీ బ్యాలెన్స్ పెళ్లికి ముందు ఒకే టైమ్‌లో 2–3 సీరియల్స్ చేసేదాన్ని. పెళ్లయ్యాక మాత్రం ఒకటే సీరియల్ చేస్తూ అది పూర్తయ్యాకనే మరోటి ఎంచుకుంటున్నాను. ఆ విధంగా నెలలో 10 రోజులు వర్క్‌కి, మిగతా 20 రోజులు ఫ్యామిలీకి అనుకున్నాను. ఇప్పుడు మా బాబు తన్విన్ యూకేజీ చదువుతున్నాడు. వర్క్ పేరుతో వాడిని మిస్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ, ఇప్పుడు తమిళ్, తెలుగు సీరియల్స్ రెండింటి వల్ల వాడిని కొంచెం మిస్ అవుతున్నాను అనిపిస్తోంది. అయితే, ఈ విధంగా తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నానని ఆనందంగా ఉంది. ఈ సీరియల్‌ని ఒప్పుకోవడానికి ముందు మా ఆయన ధనుష్‌తో, అమ్మతో మాట్లాడాను. బాబు పెద్దయి హయ్యర్ స్టడీస్‌కి వచ్చాక ఎలాగూ వాడికే కేటాయించాలి. అందుకే ఈ టైమ్‌లో ఇలా అవకాశాలు వస్తున్నాయి అనుకున్నాను. కోడలుగా అత్తగారితో మా అత్తగారు పూర్తిగా పల్లెటూరి వాతావరణం నుంచి వచ్చిన ఆవిడ. ఆమెనూ అమ్మ అనే పిలుస్తాను. ఆమెతో ఏదైనా సరే మాట్లాడటానికి మొహమాటపడను. ఇద్దరమూ చాలా బాగా ఉంటాం. నాకేదైనా నచ్చకపోతే వెంటనే చెప్పేస్తాను. మా అత్తగారు తమిళ్ సీరియల్స్ బాగా చూస్తారు. సలహాలు మాత్రం ఇవ్వరు. మా వారు మాత్రం నా డ్రెస్సింగ్ కలర్ కాంబినేషన్స్ గురించి చెబుతారు. మా వారు యాడ్ ఫిల్మ్ మేకర్. తన యాడ్ మేకింగ్‌లోనూ నా సజెషన్స్ ఉంటాయి. క్యాస్టింగ్ కౌచ్ దాదాపు నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీలో ఉన్నాను. నాకంతా గ్రీన్‌గానే ఉంది. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అది అలా చూపెడుతుంది. గౌరవం వదిలేసుకొని ఎవరూ గౌరవించడం లేదనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడున్న అమ్మాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఫైనాన్షియల్ పరంగానూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఉండే అవకాశాలు చాలా తక్కువ. ఇష్టాయిష్టాలు ఖాళీ సమయం దొరికితే సినిమా చూడటం బాగా ఇష్టం. ఎంత అలసటగా ఉన్నా సినిమా చూస్తే చాలు రీ ఫ్రెష్ అయిపోతాను. సినిమా తర్వాత లాంగ్ డ్రైవ్ అంటే పిచ్చి. నా లైఫ్ యాంబిషన్ ఈ లోకం చివరి అంచుల దాకా వెళ్లి చూడాలి. ట్రావెలింగ్ అంటే అంత ఇష్టం. ఇప్పటికి కొన్ని ప్లేస్లే చూశాను. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడకైనా వెళితే నాకు ఫుడ్ ప్రాబ్లమ్ లేదు, వాతావరణం మార్పుల గురించి చింత లేదు. అందుకే టైమ్ దొరికితే ట్రావెలింగ్ వైపు మొగ్గు చూపుతాను.’ – నిర్మలారెడ్డి -
విలనిజం నా డ్రీమ్ రోల్
అక్కగా, అర్ధాంగిగా, కోడలిగా.. ‘మా’ టీవీలో వచ్చే ‘లక్ష్మీకళ్యాణం’ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరకు ఆమె సుపరిచితమే. లక్ష్మీ, రంగీ, కృష్ణవేణిగా ఇప్పటివరకు ఆకట్టుకున్న ఈ చిరునవ్వుల రాణి అసలు పేరు హర్షిత వెంకటేష్. కన్నడ ఇంటిలో పుట్టి, తెలుగింటి అభిమానాన్ని పొందిన హర్షిత చిరునవ్వుతోనే తన విషయాలు ఇలా చెప్పుకొచ్చింది. ‘‘లక్ష్మీకళ్యాణం సీరియల్లో అక్కగా, భార్యగా, కోడలిగా లక్ష్మి పోషించే పాత్రలు.. వాటి చుట్టూ అల్లుకున్న అనుబంధాలతో కథ నడుస్తుంది. రెండేళ్లుగా వస్తున్న ఈ సీరియల్ నాకెంతో మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా, ఎంతోమంది అభిమానులను సంపాదించి పెట్టింది. కన్నడ అమ్మాయిని అయినా తెలుగులో నన్ను ఇంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు అందరికీ థ్యాంక్స్. ఇప్పటికే కన్నడలో నాలుగు సీరియల్స్ చేశాను. తమిళ్లోనూ ఒక సీరియల్ చేశాను. తెలుగులో ‘లక్ష్మీకళ్యాణం’ చేస్తూనే ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌కీ వర్క్ చేశాను. కొత్త భాష, కొత్త ప్రాంతం, అక్కడి సంస్కృతుల గురించి తెలుసుకోవడం పట్ల ఆసక్తి ఎక్కువ. ఆ ఇష్టమే నన్నింత దూరం తీసుకొచ్చింది. అయితే, ఈ ప్రొఫెషన్లో చాలా చాలా ఓపిక ఉండాలి. ఎండలో, నీడలో, రాత్రి, పగలు.. వర్క్ చేస్తాం. లొకేషన్ ఎక్కడంటే అక్కడ ఉండాలి. టఫెస్ట్ జాబ్. కానీ, హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైనా వందలో ఒకరు యూనిక్‌గా ఉంటారు. ఆ యూనిక్ని నేను అనుకుంటే హ్యాపీ కదా! సీరియల్స్‌కి రాకముందు మా అమ్మానాన్నలు చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎంబీయే పూర్తి చేశాను. కాలేజీ టైమ్ నుంచే థియేటర్లో నటించిన అనుభవం ఉంది. ముందు సీరియల్లో ఆఫర్ వచ్చినప్పుడు మా పేరెంట్స్ వెంటనే ఓకే చేయలేదు. మా ఫ్యామిలీలోనూ ఎవరూ ఆర్టిస్టులు లేరు. కొంచెం ఆలోచనలో పడ్డారు. నేనూ సీరియల్ ఆర్టిస్టు ప్రొఫెషన్‌గా తీసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఒక సీరియల్ చేసి చూద్దాం అని ట్రై చేశాను. కన్నడలో రెండు సీరియల్స్ చేసిన తర్వాత ఈ వర్కే సీరియస్ అయిపోయింది. అమ్మానాన్న కూడా హ్యాపీ అయ్యారు. కన్నడ సీరియల్ చేసే టైమ్‌లోనే ‘మా’టీవీ నుంచి ఫోన్ వచ్చింది. ‘లక్ష్మీకళ్యాణం’ సీరియల్‌కి వాళ్లు వేరేవాళ్లతోనూ చాలా ఆడిషన్స్ చేశారంట. కానీ, నేను ఆ రోల్‌కి బాగా సూటవుతాను అనుకున్నారు. అలా ఈ ప్రాజెక్ట్ చాలా త్వరగా ఫైనల్ అయిపోయింది. వర్క్ బ్యాలెన్స్ నేను, అమ్మ, నాన్న.. ఇదే మా ఫ్యామిలీ. పుట్టి పెరిగింది బెంగుళూరులోనే. నాన్న వెంకటేష్ గవర్నమెంట్ జాబ్. ఇటీవలే వాలెంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. అమ్మ గాయత్రి టీచర్. ఒక్కత్తే కూతురినని ఎంత గారాబంగా చూసుకుంటారో అంతే ఇండిపెండెంట్‌గా పెంచారు. చదువుతోపాటు ఇంటిపనుల్లోనూ పర్ఫెక్ట్. ఇంటి నుంచి దూరంగా ఉండాల్సి వచ్చినా ఇండివిడ్యువల్‌గా ఎలా ఉండాలో నేర్పించారు. అందుకే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చినా ఇండిపెండెంట్‌గా ఉండగలుగుతున్నాను. వర్క్ ఇంపార్టెన్స్ పెరిగే కొద్దీ ఫ్యామిలీని మిస్ అవుతాం. ఒక్కోసారి నా వర్క్ షెడ్యూల్ వల్ల రెండు మూడు నెలలకోసారి కూడా ఇంటికి వెళ్లలేను. ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వడం అంత సులువు కాదు. ఎంత ముఖ్యమైన ఫంక్షన్ అయినా అటు నుంచి అటే లొకేషన్‌కి వచ్చేసిన రోజులున్నాయి. ఫ్యామిలీ–వర్క్ బ్యాలెన్సింగ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. – నిర్మలారెడ్డి విలన్ రోల్ ‘లక్ష్మీ కళ్యాణం’లో లక్ష్మీగా, రంగీగా ద్విపాత్రాభినయం చేస్తున్నాను. ఈ సీరియల్లో రంగీ రోల్ చాలా పాపులర్ అయ్యింది. ఈ పాత్రకు ఇదే పరిమితి అంటూ హద్దుల్లేవు. నా మనస్తత్వానికి పూర్తి డిఫరెంట్‌గా ఉండే పాత్ర అది. ఛాలెంజింగ్ పాత్రల్లో నటించడం అంటే చాలా చాలా ఇష్టం. అలా ఆ పాత్రను ఛాలెంజింగ్‌గా తీసుకున్నాను. నెక్ట్స్ అంధురాలిగా, విలన్‌గా, దేవత పాత్రలు.. యాక్ట్ చేయాలని ఉంది. లక్ష్మీకళ్యాణంలోని రంగీ పాత్రలో కొంచెం విలనిజం ఉంది. కానీ, ఇంకా పూర్తి విలన్ కాదు(నవ్వుతూ). నా టాలెంట్ చూపించాలనుకుంటే అలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయితే బాగుంటుందనుకుంటున్నాను. సీరియల్స్ కాకుండా డ్యాన్స్, మ్యూజిక్, షాపింగ్ చేయడం అంటే బాగా ఇష్టం.’’ -
నిత్యమైన మంగ
తెలుగు వారింట ‘శశిరేఖ’గా అడుగుపెట్టి ఇంటిల్లిపాదితో ‘మంగతాయారు’గా ముచ్చట్లుచెప్పి ‘నిత్య’మై వెలుగొందుతున్న మేఘనా లోకేష్ జీ తెలుగులో ‘కళ్యాణవైభోగం, రక్తసం బంధం’ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తెలుగువారు మెచ్చిన మేఘన చెబుతున్న ముచ్చట్లు ఇవి. ‘‘సీరియల్స్ అంటే ఏడుపు మాత్రమే ఉంటుందనుకునే రోజులు కావివి. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటారో, తమ జీవితాలతో పాటు కుటుంబ బంధాలను ఎలా సరిదిద్దుతారో చూపుతున్నారు. ఆరేళ్లుగా బుల్లితెర నటిగా ఉంటున్న నాకు నేను నటించిన పాత్రలన్నీ ఎంతో మంచిని నేర్పిస్తూనే ఉన్నాయి. స్ట్రాంగ్‌గా మార్చిన పాత్రలూ ఉన్నాయి. నేను పుట్టిపెరిగింది అంతా మైసూరులోనే. కన్నడ అమ్మాయిని. ఆరేళ్ల క్రితం వరకు చదువు, స్టేజ్ షోలే లోకంగా ఉండేవి. చదువు పూర్తి చేశాను. చదువుతో పాటు స్టేజ్ షోల పట్ల కూడా నాకు ఆసక్తి ఉండేది. నేను వృద్ధిలోకి రావడానికి మా నాన్న చాలా త్యాగాలు చేశారు. స్టేజ్ షోస్‌లో పాల్గొనేటప్పుడు ఆ షోస్ కోసం రోజూ 20 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, తీసుకొచ్చేవారు. టీవీ సీరియల్స్‌లో అవకాశం వచ్చినప్పుడు నాన్న కాస్త డౌట్‌గానే ఓకే చెప్పారు. అయితే, పని పట్ల శ్రద్ధ అవసరం అని తరచూ చెబుతుండేవారు. కన్నడ సీరియల్లో నటించినప్పుడు ఆ రోల్‌కి అవార్డ్ రావడంతో నాన్నకు ధైర్యం వచ్చింది. తర్వాత వచ్చిన సీరియల్స్ అవకాశాలకు ఓకే చెప్పారు. అలా ఈ రంగంలో ఆరేళ్ల నుంచి వున్నాను. సీ‘రియల్ మలుపులు’... సీరియల్స్‌లో కొన్ని ఊహించని మలుపులు ఉంటాయి. అలాగే నా జీవితంలోనూ ఓ మలుపు.. కిందటేడాది క్యాన్సర్ వచ్చి నాన్న నాకు దూరమయ్యారు. క్యాన్సర్ ఉన్నట్టుగా 5–6 నెలల వరకు నాకీ విషయం తెలియనివ్వలేదు నాన్న. రక్తసంబంధం, కళ్యాణవైభోగం సీరియల్‌తో సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉండి మైసూరుకు ఎక్కువ వెళ్లేదాన్ని కాదు. నా వర్క్ ఎక్కడ డిస్ట్రబ్ అవుతుందో అని నాకా విషయం చెప్పద్దన్నారట నాన్న. క్యాన్సర్ చివరి స్టేజ్‌లో నాకా విషయం తెలిసింది. అప్పటికే ఆలస్యం అయ్యింది. నాకు అమ్మ, అన్నయ్య, అమ్మమ్మ ఉన్నారు. ఎప్పుడు పెళ్లి అనే ఆలోచన వచ్చినా నాకు ఓ సమాధానం వస్తుంది. మా నాన్నలా నన్ను కేరింగ్‌గా, ప్రొటెక్టివ్‌గా చూసుకోవాలని. అంతగా లేకపోయినా ప్రేమగా ఉంటే చాలు అనుకుంటున్నాను. నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. ఉన్నవారు కూడా వేరే వేరే చోట్లలో వారి పనుల్లో బిజీ. నేనే మైసూర్ వెళ్లినప్పుడు వారిని కలుస్తుంటాను. ఈ మధ్య ఏడాదికి ఒకసారి స్నేహితులంతా కలిసేలా ప్లాన్ చేసుకున్నాం. సీరియల్స్ అంటే ఏడుపు సీన్లు కాదు చాలా వరకు సీరియల్ నటి అనగానే ఏడుపు సీన్లు ఉంటాయి అంటారు. ఇప్పుడు అలాంటివేవీ లేవు. సీరియల్స్‌లోనూ చాలా మార్పులు వచ్చాయి. రక్తసంబంధం సీరియల్లో తులసి క్యారెక్టర్‌నే తీసుకుంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఈ తరానికి బాగా కనెక్ట్ అయిన పాత్ర అది. స్టోరీ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కళ్యాణ వైభోగం సీరియల్లో ద్విపాత్రాభినయం చేస్తున్నాను. నిత్య–మంగగా రెండూ రెండు భిన్న పాత్రలు. ఇదో సవాల్‌లా ఉంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. తెలుగువారు మెచ్చిన మంగతాయారు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్లన్నీ ఇష్టమైనవే. అయితే, ‘కళ్యాణవైభోగం’ మంగతాయారు పాత్ర అంటే ఇంకా ఇష్టం. మంగ చాలా అమాయకురాలు. అప్పటివరకు ఓ పల్లెటూరు అమ్మాయి ఎంత అమాయకంగా ఉంటుందో కూడా తెలియదు. అలాంటి ఆ అమ్మాయిలో తర్వాత తర్వాత చాలా ప్రతిభ కనిపిస్తుంటుంది. ఇల్లాలిగా, త్యాగమయిగా.. తనను తాను చాలా మార్చుకుంటూ ప్రూవ్ చేసుకుంటుంది. అన్ని వయసుల వారూ ఈ క్యారెక్టర్‌కి కనెక్ట్ అవుతారు. మంగతాయారు పాత్ర ద్వారా నా జీవితంలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ పాత్ర–నేనూ వేరు కాదని అనిపిస్తుంటుంది. శశిరేఖగా అందరికీ పరిచయం అయినా ఈ పాత్ర వల్ల తెలుగువారింట నేనూ ఓ కుటుంబసభ్యురాలినైపోయాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను.’’ నిర్మలారెడ్డి