కార్తీకదీపం జూన్ 12: అమ్మని మళ్లీ తిట్టి పంపేశావా డాడీ, అమ్మ అంటే నీకు జాలి లేదా?’ అంటూ ఎమోషనల్‌గా ప్రశ్నిస్తుంటారు పిల్లలు. దీంతో నాతో రండీ అని పిల్లల్ని తీసుకుని దీప ఇంటికి బయలుదేరతాడు కార్తీక్. ఇక మోనిత తన ఫోన్‌లో పిల్లల ఫొటోలు చూస్తూ మురిసిపోతుండగా ప్రియమణి పాలు తీసుకుని రావస్తుంది. అవి తాగుతూ.. ‘కడుపుతో ఉన్నాను కదా కాస్త కారం, ఉప్పు, మసాలాలు తగ్గించు’ అంటుంది. సరేనమ్మ అన్న ప్రియమణి అనుమానంగా ‘మీరు నిజంగానే కడుపుతో ఉన్నారా? లేక నాటకం ఆడుతున్నారా’ అనడంతో మోనిత ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ‘ఏం మాట్లాడుతున్నావే. ఈ విషయంలో నేనేందుకు అబద్దం ఆడతాను, నేను కడుపుతో ఉన్నాననేది నిజం.. నా ఈ కడుపుకి మీ కార్తీక్ అయ్యే కారణం అన్నది ఇంకా పచ్చినిజం’ అటూ ఆవేశ పడుతుంది మోనిత.
మరోవైపు దీప పిల్లల గురించి ఆలోచిస్తూ ఉండగా హిమ, శౌర్య అమ్మా.. అంటూ వచ్చి ఆనందంగా పట్టుకుంటారు. వెంటనే గుమ్మం దగ్గరే ఆగిపోయిన కార్తీక్‌ని చూసి ‘పిల్లలు రాగానే నన్ను అడిగి ఉంటారు.. నా దగ్గర వదిలపెట్టడానికి తీసుకొచ్చి ఉంటారు’ అని మనసులో దీప అనుకుంటుంది. ఆ తర్వాత ఇక్కడికి మళ్లీ ఎందుకచ్చావమ్మా నాన్న నిన్ను ఏమైనా అన్నాడా? అని పిల్లలు అడగ్గా దీప నాకెందుకో అంతపెద్ద ఇంట్లో కంఫర్ట్‌గా ఉండటం లేదని సమాధానం ఇస్తుంది. వెంటనే హిమ బాధగా.. ‘మరి డాడీకి ఇక్కడ కంఫర్ట్‌గా ఉండరు కదమ్మా’ అని అనగానే దీప కోపంగా కార్తీక్‌వైపు కళ్లు తిప్పి ‘ఆయనకి ఎక్కడ కంఫర్ట్‌గా ఉంటే.. అక్కడుండొచ్చు’ అంటుంది.
దీంతో కార్తీక్ వెంటనే మీ అందరితో కలిసి తను ఇక్కడే ఉంటానని అంటాడు. ఆ తర్వాత కార్తీక్‌తో దీపతో కాస్తా మాట్లాడాలని చెప్పి పిల్లలను పడుకొమ్మంటాడు. అయితే కార్తీక్ భోజనం చేశావా? అని అడగ్గానే తిన్నాని అబద్ధం చెబుతుంది దిప. ఇదిలా ఉండగా మోనితకు తను పురిటినొప్పులతో చనిపోయినట్లు పిడకల రావడంతో ఉలిక్కిపడి లేస్తుంది. ఇలాంటి పీడకల వచ్చిందేంటని కంగారు పడుతుంది. అన్నట్టు చనిపోయినట్లు కలొస్తే మంచి జరుగుతుంది అంటారు కదా.. నాకూ మంచే జరుగుతుంది. అయినా నేను అంత త్వరగా ఎందుకు చస్తాను.. నా కార్తీక్‌తో సంతోషంగా ఉంటాను అనుకుంటూ పడిపడి నవ్వుకుంటుంది.
వెంటనే కార్తీక్ వంటగదిలోకి వెళ్లి గిన్నెలో అన్నం ఉండటం చూసి దీప తినలేదని తెలుసుకుంటాడు. దీపతో మాట్లాడాలని హాల్‌కు తీసుకుని వస్తాడు కార్తీక్. అన్నం పెట్టుకుని కలుపుతూ దీపను తినమన్నట్లు ముద్ద పెడతాడు. కానీ ఆమె సీరియస్‌గా చూసేసరికి చేయి తీసుకుని దీప చేతిలో అన్నం ముద్ద పెడతాడు. ప్లీజ్ తిను దీప అని చెప్పడంతో ఆమె తింటుంది. కార్తీక్ అన్నం కలుపుతూ ‘నేను నటించడం లేదు దీపా.. నా కసలు నటించడం చేతకాదు.. మనసుకి అనిపించింది పైకి అనేస్తాను.. లోలోపల ఏది దాచుకోను. కార్తీక్ అంటే కచ్చితం.. కార్తీక్ అంటే స్పష్టత’ అని తన క్యారెక్టర్ ఏంటో దీపకు చెప్పాలనుకుంటాడు.
ఇక కార్తీక్ కాలేజీ రోజుల్లో హిమను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించానని, ఆ తర్వాత అంతగా ప్రేమించింది నిన్నే దీప అని చెబుతాడు. ‘హిమ చనిపోయాక కొన్నాళ్లు పిచ్చొడిని ఆయ్యాను, జీవితంలో ఇక పెళ్లి అనే మాటే లేదు అనుకున్నాను నిన్ను చూసేదాక.. నీ ఆత్మ సౌందర్య నాకు నచ్చి.. హిమ తర్వాత నేను ఇష్టపడింది ప్రేమించింది నిన్నే. నిన్ను కోడలిగా అమ్మ అంగీకరించదని తెలిసినా నీ మెడలో తాళి కట్టాను.. నెమ్మదిగా కన్విన్స్ చెయ్యొచ్చు అనుకున్నాను. నువ్వు నా జీవితంలోకి వచ్చినందుకు నాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు’ అంటూ దీప కళ్లలోకే చూస్తూ చెబుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరగునుందనేది సోమవారం నాటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment