కార్తీకదీపం జూలై 7వ ఎపిసోడ్: తన సంస్కారం మీద నమ్మకం ఉందని, తను ఏ తప్పు చేయాలేదన్నదే నిజమని, అలాంటప్పుడు తానేందుకు తప్పు చేసినవాడిలా భయపడాలి అంటూ తనని తాను సమాధాన పరుచుకుంటాడు కార్తీక్. అలాగే తన కుటుంబమే ముఖ్యమని, తన పిల్లలు, భార్యతో సంతోషంగా ఉంటానని, అలాగే కొడుకుగా, డాక్టర్‌గా మళ్లీ తన బాధ్యతల్ని స్వీకరిస్తానని అనుకుంటాడు. ‘నా తల్లి ముందు సుపుత్రుడిగానే నిలబడాలి. మోనిత ముందు తప్పుచేసిన వాడిలా తలదించుకోవాల్సిన అవసరం లేదు. అక్కడే నా వ్యక్తిత్వాన్ని పొగొట్టుకుంటున్నాను. ఇక ముందు అలా జరగకూడదంటే ఈ కడుపు సంగతేంటో తెల్చుకోవాలి’ అని గట్టిగా నిర్ణయించుకుంటాడు.
మరోవైపు మోనిత కార్తీక్‌ను కలవడానికి రెడీ అవుతూ ఉండగా మధ్యలో ప్రయమణి వచ్చి ఎక్కడికి అక్కడికేనా అని అడుగుతుంది. తెలిసి ఎందుకు అడుగుతావని మోనిత అనగానే ప్రియమణి ‘మీ మంచికే చెబుతున్నాను. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదు. ఒట్టి మనిషివని కూడా చూడకుండా కొట్టి పంపిస్తారు’ అనగానే మోనిత ‘ఏడ్చారులే.. కార్తీక్ తప్పు చేశాడని మా అందాల అత్త నమ్ముతోంది. నా భర్త తప్పులేకపోతే మోనిత ఎందుకు గర్భవతి అవుతుంది మా వంటలక్క అనుకుంటోంది. ఇక ఇప్పుడు వాళ్ల జుట్టు, ఇంటి గుట్టు నా చేతిలో ఉంది కాబట్టి నాకేం సమస్య లేదు’ అంటుంది.
దీంతో ప్రియమని అని మీరు అనుకుంటున్నారని మోనితకు షాక్ ఇస్తుంది. ‘దీపమ్మ ఇంటి నుంచి వచ్చేసినా డాక్టర్ బాబు తోకలాగే ఆమె వెనక వచ్చాడు. పోనీ దీపమ్మ ఏం అయిన కార్తీక్ అయ్యాను గెంటెయ్యలేదు కదా.. అటూ తల్లి కూడా కార్తీక్ అయ్యా గురించే బాధపడుతున్నారు తప్ప మీ మీద జాలి చూపించడం లేదు కదా’ అని లాజిక్‌గా మాట్లాడుతుంది. కార్తీక్ అయ్య కూడా అందరి లాంటి మగాడేనని, ఆయన ఏ మహానుభావుడు కాదంటుంది. ఏదైనా తన దాక రాకపోతే ఆడదానితో ఎంత గౌరవంగానైనా ఉంటాడు. అదే కుటుంబానికి, వంశగౌరవానికీ ముప్పు రాబోతుందని తెలిస్తే మాత్రం దెబ్బకు ప్లేట్ పిరాయిస్తాడు. తప్పు చేశానని కొంతమంది మాత్రమే ఒప్పుకుంటారని, అందులో కార్తీక్ అయ్యా ఉంటారని తనకు నమ్మకం లేదు అంటుంది ప్రియమణి. కాబట్టి మీకే అన్ని తెలుసు అని ధైర్యంగా ఉండకుండా మీకు న్యాయం ఎలా జరుగుతుందా అని ఆలోచించండని మోనితకు హిత బోధ చేస్తుంది.
సరిగ్గా అదే సమయానికి కార్తీక్ కాల్ చేస్తాడు. అది చూసి మోనిత ఆలోచనలో పడుతుంది. ఇదిలా ఉండగా దీప గోడ మీద ఉన్న గీతల వంకే చూస్తూ మోనిత తనవైపు వెక్కిరింతగా చూస్తున్నట్లు తలుచుకుంటోంది. పదేళ్ల క్రితం తన పరిస్థితి ఎలా ఉందో మళ్లీ అదే పరిస్థితి ఎందురైందని, ఇప్పుడు చేయాలని, మళ్లీ ఆజ్ఞాతంలోకి వెళ్లాలా? అయితే పిల్లల పరిస్థితి ఏంటీ? నా డాక్టర్ బాబు సంగతేంటి? ఆ మోనితకు వదిలేయని మనసులో అనుకుంటూ కుమిలిపోతుంది.
ఇదిలా ఉండగా కార్తీక్, మోనితలు రోడ్డు మీద నిలబడి మాట్లాడుకుంటుంటారు. చూడు కార్తీక్ నువ్వు నన్ను ఇలా బాధపెట్టడం కరెక్ట్ కాదు అంటుంది మోనిత. ‘పదేళ్లు అబద్దాని నిజమని నమ్మి దీపను దూరం పెట్టావు, ఇప్పుడు నిజాన్ని అబద్దమంటూ నన్ను ఎన్నాళ్లు దూరం పెట్టాలనుకుంటున్నావు’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ తలదించుకుంటాడు. దీంతో మోనిత నీ ఫ్రెండ్‌గ్, శ్రేయోభిలాషిగా, నీ వెల్ విషర్‌గా చెబుతున్నాను.. నువ్వు మోనితని పెళ్లి చేసుకోవడమే న్యాయం అంటుంది మోనిత.
కార్తీక్ మౌనంగా ఉండటంతో మోనిత ప్రేమగా కార్తీక్ భజం మీద చెయ్యి వేసి ఇవన్నీ వద్దని, తను పెళ్లి వాయిదా వేయను అని చెబుతుంది. నువ్వు నన్ను తల్లిని చేశావు, బిడ్డకు తండ్రి కావాలి కాబట్టి పెళ్లి కావాలంటున్నాను, తన బిడ్డకు తండ్రివి నువ్వే అని సమాజానికి చెప్పుకోవడం కోసం పెళ్లి చేసుకుందాం అంటుంది. ధర్మం ఎటు ఉందో నువ్వే ఆలోచించు.. ఇంత మాట్లాడుతున్నా నీలో మార్పు రాకుంటే న్యాయం కోసం మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అనగానే కార్తీక్ అమ్మలేదు.. అమెరికా వెళ్లిందని చెబుతాడు. దీంతో మోనిత షాక్ అవుతుంది. అమెరికా ఎందుకు వెళ్లిందనగా తన చెల్లి స్వప్న దగ్గరికి అని చెబుతాడు. దీంతో ఏదో కుట్ర జరుగుతుంది అంటూ మోనిత కంగారు పడుతుంది.
తరువాయి భాగం.. కార్తీక్ అనుకున్నట్లు గానే పిల్లలతో సంతోషంగా ఉంటాడు. పిల్లలకు బహుమతులు కొనితెచ్చిస్తాడు. సరదాగా వాళ్లతో మాట్లాడం చూసి దీప ఏంటి ఈ సడెన్ మార్పు అని ఆలోచనలో పడుతుంది. ఇక కార్తీక్ సెల్ఫీ తీస్తుండగా ఇందులో ఒకరూ మిస్సయ్యారు, నిన్నే దీప నువ్వు కూడా ఉంటే బాగుంటుందంటూ దీపను రాగానే భుజం మీద చేయ్యి వేసి సెల్ఫీ తీస్తాడు. ఆ తర్వాత పిల్లలు బయటకు వెళ్లగానే ‘ఈ నెల 25వ తేదీలోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను నీవాడిని దీప నన్ను నమ్ము. ఇది నాటకం కాదు అని దీప తలపై చెయి పెడతాడు’ కార్తీక్.
Comments
Please login to add a commentAdd a comment