కార్తీకదీపం జూన్ 18: మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్‌ని బెదిరిస్తుంది. పది అంటే పదే రోజుల్లో తనకు న్యాయం జరిగే నిర్ణయం చెప్పాలని గోడ మీద 10 గీతలు గీసి కౌంట్‌డౌన్ స్టార్ట్ అంటూ హెచ్చరించి వెలుతుంది. ఆ తరువాత కార్తీక్ మోనితకు ఆబార్షన్ చేయించుకోమ్మని చెప్పేందుకు ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ మోనిత కార్తీక్ చెప్పేది వినకుండా తనని పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వమని అడుగుతుంది. దీంతో కార్తీక్ ఏ నిర్ణయం తీసుకోనున్నాడనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
కార్తీక్ మోనితతో పదేళ్లుగా దీపను అనుమానించానని, ఇప్పుడది తప్పని తేలింది. ఈ సయమంలో అంటూ నానుస్తుండగా.. అయితే దానికి నాకు సంబంధం ఏంటని నిలదీస్తుంది మోనిత. ‘నీ అనుమానం ఇప్పుడు అభిమానంగా మారితే నాకు జరిగిందంతా మరిచిపోయి అభార్షన్ చేయించుకోమంటావా? నేనే చేయను. దీప కంటే ముందు నుంచి నిన్న ప్రాణంగా ప్రేమిస్తున్న, మరీ నా మీద ఎందుకు నీ ప్రేమ రాలేదు. కనీసం జాలి అయినా చూపించు కార్తీక్. అంతకు మించి నేను ఏం కోరుకోవట్లేదు. నీ ప్రమేయం ఉన్నా లేకున్నా జరిగిన దానికి న్యాయం చెయ్యమంటున్నాను.. అంతే’ అంటుంది మోనిత.
త్వరలో కార్తీక్‌ను తన నిర్ణయం చెప్పాలని, లేదంటే తనే ఏదోక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని అంటుంది. ఆ తర్వాత ‘నీ యాక్షన్‌ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. బాగా ఆలోచించుకుని చెప్పు’ అంటూ హెచ్చరిస్తుంది మోనిత. మరోవైపు పిల్లలు దీప బెండకాయలు కట్ చేస్తుంటే ఆమె దగ్గరికి వచ్చి ఇంతకుముందు నాన్న వస్తే ఇష్టమైనవవి వంటలు అన్ని చేసి పెట్టెదానివి. ఇప్పుడు నాన్న వచ్చి మనతోనే ఉంటున్నా ఈ పిచ్చి వండి పెడుతున్నావు? ఏమైంది అమ్మ నీకు కొన్ని రోజుల నుంచి ఏం మాట్లాడకుండ మౌనంగా ఉంటున్నావు. నాన్నకు, నీకు మధ్య ఏం జరిగిందని పిల్లలు ఆరా తీస్తారు.
అలాగే గోడ మీద గీతలు గురించి అడుగుతూ.. కార్తీక్ తన చేతి గీతలని, భవిష్యత్ చెప్పిన మాటలకు అర్థం ఏంటని దీపను ప్రశ్నిస్తారు. అయినా దీప ఏం మట్లాడదు. దీంతో హిమ మీరు చెప్పకపోతే మేమే కనిపెడతామని, శౌర్యతో నువ్వు ఇవన్ని తెలుసుకుంటావు కదా అనగానే ‘నాన్ననే కనిపెట్టిన దాన్ని ఇది నాకు పెద్ద విషయం కాదు’ అంటుంది. శౌర్య తెలుసుకుంటా ఖచ్చితంగా కనిపెడతా అని అక్కడ నుంచి వెళ్లిపోగానే దీప ‘పిల్లలకి నిజంగానే ఆయన చేసిన తప్పు గురించి తెలిస్తే.. ఆయన్ని క్షమిస్తారా? కచ్చితంగా క్షమించరు. అసహించుకుంటారు’ అంటూ మనసులో మదన పడుతుంది.
ఇదిలా ఉండగా కార్తీక్ మోనిత దగ్గర జరిగిందంతా సౌందర్యకు చెబుతాడు. ‘ఇందులో నేను చెయ్యగలిగింది ఏం లేదు’ అని సౌందర్య అంటే.. ‘అలా అనకు మమ్మీ.. ఊబిలో కూరికుపోయాను.. చెయ్యి అందించి గట్టుకు చేర్చు మమ్మీ’ సౌందర్యను సలహా అడుగుతాడు. కార్తీక్.. చిన్నప్పుడు నీకు గాజేంద్ర మోక్షం చదివి వినిపించాను గుర్తుందా.. మోనిత ఇప్పుడు నీళ్లలో ఉన్న ముసలిరా.. అది చాలా శక్తివంతురాలు. దాని నోటికి చిక్కి గిలగిలా కొట్టుకుంటున్నావు. నా దగ్గరకి వచ్చి మొరపెట్టుకుంటే కాపాడటానికి నేను విష్ణుమూర్తిని కాదు.. దాని తల ఛేదించి నిన్ను రక్షించడానికి నా దగ్గర విష్ణు చక్రమూ లేదు’ అని అంటుంది.
అలా అనకు మమ్మీ ఎలాగైన నన్ను దీని నుంచి బయట పడే మార్గం చూపించమని కార్తీక్ అడగ్గా.. దీనికి ఒకేట మార్గం ఉందని, మోనిత స్వయంగా తన కడుపు నాటకమని లేదా ఆ కడుపులో బిడ్డకు నువ్వు తండ్రివి కాదని చెప్పాలని అంటుంది. అదే జరిగే పనేనా? అని మోనిత నీళ్లలో ఉన్న మొసలి అని అది నిన్ను ముంచెడయం ఖాయం, నువ్వు తప్పు చేశావు ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దానికి మోక్షం ఆ పైవాడు చూపిస్తాడు అంటూ కార్తీక్‌కు చివాట్లు పెడుతుంది సౌందర్య. రాత్రి ఇంటిక తిరిగి వచ్చేస్తాడు. పిల్లలకు చాక్లేట్స్, బిస్కెట్స్ తీసుకుని వెళుతాడు కార్తీక్. ఇక తెల్లారి దీప లేచి చూసేసరికి కార్తీక్ బయట పడుకుని ఉంటే కాఫీ తీసుకుని వెళ్లిని డాక్టర్ బాబు అంటూ దీప కార్తీక్‌ని నిద్ర లేపుతుంది. ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో చుద్దాం.
Comments
Please login to add a commentAdd a comment