కార్తీకదీపం జూన్ 11: హిమ, శౌర్యలు ఇంటికి తిరిగి వస్తారు. వారిని చూసి అంతా షాక్‌లో ఉండిపోతారు. అది గమనించిన పిల్లలు మీలో మేము వచ్చి ఆనందంగా కనిపించకపోగా అప్పుడే ఎందుకొచ్చారా? అన్నట్టు చూస్తున్నారని ప్రశ్నిస్తారు. కాసేపటికి అమ్మ కనిపించడం లేదని అడగ్గానే అందరు ఒకరి మొహలు ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నేటి(జూన్ 11వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
ఇంటికి వచ్చిన పిల్లలు అమ్మ ఎక్కడ కనిపించడం లేదని అడగ్గానే అందరు కంగుతింటారు. ఆ తర్వాత సౌందర్య ముందు ఫ్రెష్ అయ్యి రండి అనడంతో శ్రావ్య బ్యాగ్స్ తీసుకుని పిల్లల్ని పైకి తీసుకుని వెళుతుంది. హిమ మాత్రం కార్తీక్‌నే గమనిస్తూ వెనక్కి వచ్చి ఏం అయ్యింది డాడీ బాగా డల్‌గా కనిపిస్తున్నావని అడగ్గా.. ‘మీ మీద బెంగ పెట్టుకున్నాడే.. ప్రశ్నలు ఆపి వెళ్లు’ అని సౌందర్య పంపిస్తుంది. దీంతో కార్తీక్ కాస్త రిలాక్స్ అవుతాడు. మురళీ కృష్ణ దీప ఇంటి నుంచి తిరిగి వచ్చి అన్ని మర్చిపోయి కార్తీక్‌తో ఉండమని, కాపురం చక్కదిద్దుకొమ్మని చెబుతామనుకుంటే అసలు ఆ విషయమే నాతో చెప్పనివ్వలేదంటూ సలహాలు ఏం ఇవ్వద్దు నాన్నా తినేసి వెళ్లు అందని భాగ్యంతో చెబుతూ బాధపడతాడు.
దాంతో భాగ్యం ఆ మోనిత అనుకున్నది మాత్రం సాధించింది అంటూ తిట్టిపోతుంది. సరిగ్గా అప్పుడే మోనిత ఇంట్లో వాంతులు (వేగుళ్లు) చేసుకుంటుంది. ప్రియమణి చెవులు మూసి సాయం చేస్తుంది. ఆ తర్వాత మీది ఎవరి పోలిక అమ్మాని మోనితని అడుగుతుంది. మోనిత.. నవ్వుతూ ‘ఈ ప్రపంచంలో నాకు ఎవరితో పోలికే లేదే. నేనో స్పెషల్ అంతే.. కాకపోతే ఇంకా ఆరో నెలల్లో నా పోలికలతోనే మరో ప్రాణి ఈ భూమ్మిద పడదుతుంది’ అంటు మురిసిపోతుంది. దీప సరోజక్క మరిది లక్ష్మణ్ గురించి అతడి రిక్వస్ట్ గురించి ఆలోచిస్తుంది. ఇంతలో సరోజక్క వచ్చి ఆమె మరిది లక్ష్మణ్ వచ్చిన విషయం గరించి అడుగుతుంది. ‘అది నువ్వేమీ పట్టించుకోకు దీప, డక్టర్ బాబు, నువ్వు బాగుంటే ఇక్కడకి నువ్వేందుకు వస్తావు.
అది కూడా ఆలోచన లేని అమాయకుడు. ఇలాంటి పరిస్థితిలో నువ్వు నువ్వు డాక్టర్ బాబుతో ఏం చెబుతావు? పక్క మనిషి గురించి పట్టించుకునే రోజులు ఎప్పుడో పోయాయి.. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో.. అన్నింటికీ సిద్ధపడే ఉండాలి. అందరితో పాటే ఇతడు కూడా భూమ్మీద నూకలు రాసిపెట్టి ఉంటే.. బతుకుతాడు. లేదంటే లేదు. పాపం మా చెల్లెల్ని తలుచుకుంటేనే కాస్త బాధగా ఉంది. సరేలే నువ్వేం ఆలోచించకు. వస్తాను దీపా’ అంటూ వెళ్లిపోతుంది. ఇక సరోజక్క వెళ్లగానే దీప లక్ష్మణ్‌కి వైద్యం చేయించమని డాక్టర్ బాబుతో చెప్పాలని అనుకుంటుంది. ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉందో.. ఈ టైమ్‌లో ఈ గోలంతా ఏంటీ అంటారా? అంటూ ఆలస్యం చేయకుండా లక్ష్మణ్ విషయం ఎలగైనా ఆయనకు చెప్పాలని మనసులో అనుకుంటుంది.
ఇదిలా ఉండగా శౌర్య తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. దీప గదికి వెళ్లి ఆమె బ్యాగు, కబోర్డ్‌లో బట్టలు చూస్తుంది. అవి ఉండకపోయేసరికి అమ్మ ఇంట్లోంచి మళ్లీ వెళ్లిపోయింది అని తెలిసి ఏడుస్తుంది. అసలు ఎందుకు వెళ్లిందని, నాన్న ఏమైనా అన్నాడా? నాన్న తిట్టి అమ్మను పంపిచాడా? అసలు ఎక్కడ ఉన్నావమ్మా అంటు కుమిలి కుమిలి ఏడుస్తుంది. వెంటనే కార్తీక్‌ని నిలదీయడానికి వెళుతుంది. సరిగ్గా అప్పుడే హిమ తల్లి గురించి కార్తీక్‌ని, సౌందర్యని నిలదీస్తుంది. అప్పుడే ఆవేశంగా వచ్చిన శౌర్య ‘లేదు హిమా.. అమ్మ బట్టలు సర్దుకుని ఇంట్లోంచి వెళ్లిపోయింది’ అంటుంది. ఆ తర్వాత శౌర్య, హిమలు ఏడుస్తూ అమ్మ ఎక్కడికి వెళ్లిందని, నువ్వే పంపించావా నాన్న? అంటు రకరకాల ప్రశ్నలు వేస్తూ కార్తీక్‌ను నిలదీస్తారు. ఏం సమాధానం చెప్పలేక కార్తీక్ తల దించుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment