
కార్తీకదీపం మే 17: నువ్వు ఇలానే బాధపడుతుంటే పిల్లలకి తెలిసిపోతుంది. అప్పుడు పిల్లలు తట్టుకుంటారా అని కార్తీక్ దీపతో అంటాడు. గుర్తుంచుకో నీకు వైద్యం చేయించడానికి నేను ఉన్నాను భయపడకంటూ కార్తీక్ దీపకు ధైర్యం చెబుతుంటే.. కనీసం ఇప్పుడైన నన్ను ముట్టుకోవాలనిపించడం లేదా డాక్టర్ బాబు అని అంటుంది. ఇక కార్తీక్ అదేంలేదు ఏదో ఆలోచిస్తున్నానంటూ దీప భుజం తట్టగా.. కార్తీక్ చేతిని దీప తన చేతిలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత..
‘ఉన్నంతకాలం చేయి వదిలేశారు. ఈ రోజు దాకా దూరంగానే ఉన్నారు. కనీసం శాశ్వతంగా వెళ్తున్నప్పుడైనా ఉన్నారు. కాపురంలో కలిసి నడవకపోయినా.. నా అంతిమ యాత్రలో కలిసి నడిచి తుది వీడ్కోలు చెప్పడానికైనా పక్కనే ఉన్నారు థాంక్స్ డాక్టర్ బాబు’ అంటు దీప భావోద్యేగానికి లోనవుతుంది. ఆ తర్వాత లేచి బెడ్‌రూంకి వెళ్లిపోతుంది. మరోవైపు దీపకు ఏదో జరిగినట్లు మురళీ కృష్ణకు పీడకల రావడంతో ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తాడు. అలాగే షాక్‌లో ఉండిపోయిన మురళీ కృష్ణకు భాగ్యం నీళ్లు తాగించి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. ఏమైందయ్యా అని ఆమె అడగ్గా.. ఇలా దీప గురించి కల వచ్చిందిని చెప్తాడు. ‘నా వల్ల కాదు. నా కూతురి కోసం బాధపడుతూ ఇక్కడే ఉండలేను’ అంటాడు.
వెంటనే దీపను వెతకడానికి బయలుదేరుతానంటూ మురళీ కృష్ణ కదులుతుండగా.. భాగ్యం.. ‘ఆగండి కోడలును వెతకడానికి కోట్లు ఖర్చపెట్టైనా వాళ్ల అత్తగారు వెతుకుతారు. కానీ, నీకేమైనా అయితే నేను ఒంటరి దాన్నిఅవుతాను‘అంటూ మురళీ కృష్ణను ఆపుతుంది. ఆ తర్వాత దీప ఫోన్ చేస్తానంటూ భాగ్యం ఫొన్ తీసుకుని దీప నంబర్‌కు కాల్ చేస్తుంది. ఫోన్ రింగ్ అవ్వడంతో కార్తీక్, దీపలకు మెలకువ వస్తుంది. అర్థరాత్రి తండ్రి నుంచి కాల్ రావడంతో నాన్నకు ఏమయినా అయిందేమో మా పిన్ని చేస్తున్నట్టుంది ఫోన్ ఎత్తండి డాక్టర్ బాబు అంటుంది దీప. కార్తీక్ ఫొన్ లిఫ్ట్ చేసి హాలో అనడంతో.. భాగ్యం ఎవరో మగ గొంతు వినిపిస్తుందయ్యా అంటుంది. ఆ తర్వాత మురళీ కృష్ణ ఫోన్ తీసుకుని మాట్లాడగా.. హాలో నేను కార్తీక్ అని చెప్పడంతో అతడికి ఒక్కసారిగా ప్రాణం లేచస్తుంది.
ఇక దీప దగ్గరే ఉన్నారా అనగా అవునంటాడు. దీప ఎక్కడుందో చెప్పి.. మీ నాన్నతో మాట్లాడమని దీపకు ఫోన్ ఇస్తాడు కార్తీక్. దీప ఫోన్ తీసుకుని ‘ధగా పడ్డావని ఎవరికీ చెప్పకుండా వెల్లిపోయావమ్మా అని మురళీ కృష్ణ అనడంతో. ‘అవును నాన్నా ఈ దేవుడే కాదు.. నన్ను ఆ దేవుడు కూడా దగా చేశాడని’ మనసులో అనుకుంటుంది. అంత కష్టపడటం దేనికమ్మా.. మనంటికి రామ్మా.. నీకోసం నీ పుట్టింటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయంటాడు మురళీ కృష్ణ. అందరికీ భారంగా ఉండకూడదనే ఇక్కడికి వచ్చాను నాన్న అంటుంది దీప. వెంటనే మురళీ కృష్ణ.. ‘సరే ఈ రాత్రికి ఆ మాటలెందుకులే ప్రశాంతంగా పడుకోమ్మా అనగానే దీప.. ఇక నుంచి నాకు అంతా ప్రశాంతతే నాన్న’ అని మనసులోనే అనుకుంటుంది దీప. చాలా సంతోషం తల్లీ నువ్వు ప్రశాంతంగా ఉండటమే కావాలి అంటు ఫొన్ పెట్టేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment