
తెలుగు డైలీ సీరియల్ కార్తీకదీపం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. డాక్టర్ బాబు నిజం తెలుసుకోవడం, మోనిత ప్రెగ్నెంట్ ట్వీస్ట్, దీప అనారోగ్యంతో ఆస్పత్రి పాలవ్వడంతో ఏమౌతుందోననే ఉత్సుకతతో బుల్లితెర ప్రేక్షకులంతా టీవీలకే అతక్కుపోతున్నారు. ఇక గత వారమంత హాస్పిటల్‌లో దీప చావు బతుకుల మధ్య ఉండటం.. డాక్టర్ బాబు కుమిలి కుమిలి ఏడుస్తున్న ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన కార్తీక్‌దీపం అభిమానులు భావోద్వేగానికి లోనవుతుండగా.. మరోవైపు ఈ ప్రోమోలపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్ క్రియేట్ చేస్తూ, ఫన్నీ కామెంట్స్‌తో స్పందిస్తున్నారు.
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దీప ఐసియూలో ఆక్సిజన్ అందక కొట్టుకుంటుంటే, కార్తీక్ కంగారు పడుతున్న ప్రోమోను ఆనందయ్య మందుకు సింక్ చేస్తూ పెడుతున్న కామెంట్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంఉటన్నాయి. అవుతున్నాయి. ‘దీపక్క.. ఆక్సిజన్ పెట్టుకుని చావుబతుకుల మధ్య ఉంటే.. ఆవిడను ఆనందయ్య దగ్గరకు తీసుకువెళ్ళండి డాక్టర్ బాబు’ , ‘ఈ హాస్పిటల్స్‌ని నమ్మకండి డాక్టర్ బాబు.. ఆనందయ్య నాటు వైద్యమే వంటలక్కకి కరెక్ట్. లేదంటే దీపక్కకు ఆక్సిజన్ కావాలంటే సోనుసూద్ సాయం తీసుకుందాం’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment