Nirupam Paritala (Doctor Babu) Gives Clarity On Karthika Deepam 2 Serial - Sakshi
Sakshi News home page

Karthika Deepam Doctor Babu: వంటలక్క-డాక్టర్‌బాబు మరో సీరియల్?

Jun 26 2023 4:06 PM | Updated on Jun 26 2023 7:00 PM

Doctor Babu Karthika Deepam 2 Serial - Sakshi

తెలుగు ప్రేక్షకులది విశాల హృదయం. సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీసులు, డాక్యుమెంటరీ, ఓటీటీల‍్లో ఇతర భాషా చిత్రాలు.. ఇలా ఒకటేమిటి నచ‍్చాలే గానీ ప్రతిదీ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించిన సీరియల్స్ లో 'కార్తీకదీపం' ఎప్పుడూ టాప్ లో ఉంటుంది. ఇందులో డాక్టర్ బాబు, వంటలక్క గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడీ సీరియల్ కు సీక్వెల్ ఉంటుందా లేదా అనేది డాక్టర్ బాబు క్లారిటీ ఇచ్చేశాడు. 

తెలుగులో ఇప్పటివరకు చాలా సీరియల్స్ వచ్చాయి. ఏళ్లకు ఏళ్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవీ ఉన్నాయి. మిగతా వాటి సంగతేమో గానీ 'కార్తీకదీపం' మాత్రం అటు ప్రేక్షకుల్ని అలరిస్తూ, టీఆర్పీ రేటింగ్స్ సంపాదించడంలోనూ దాదాపు నాలుగైదేళ్లు సక్సెస్ అయింది. అలాంటిది గతేడాది ఫిబ్రవరిలో దీనికి ఎండ్ కార్డ్ వేశారు. దీంతో ఈ సీరియల్ ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. కొన్నాళ్లకు తిరిగి మొదలుపెట్టడంతో సంతోషించారు. 

(ఇదీ చదవండి: దళపతి విజయ్‪‌పై పోలీస్ కేసు.. అలా చేసినందుకు!)

కానీ కొత్తగా మొదలుపెట్టింది పెద్దగా సక్సెస్ కాకపోవడంతో దర్శకనిర్మాతలు దాన్ని ఆపేశారు. సీరియల్ ని అయితే నిలిపేశారు గానీ అందులో ప్రధాన పాత్రలు పోషించిన వంటలక్క, డాక్టర్ బాబు గురించి ఇప్పటికీ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ప్రస్తుతం 'రాధకు నీవేరా' సీరియల్ చేస్తున్న డాక్టర్ బాబు అలియాస్ నిరూపమ్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో 'కార్తీకదీపం 2'పై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. 

'ఇప్పటికీ ఎక్కడకి వెళ్లినా 'కార్తీకదీపం', వంటలక్క గురించి ఎక్కువగా అడుగుతుంటారు. నా పేరు మర్చిపోయి డాక్టర్ బాబు అనే పిలుస్తుంటారు. నా విశ్లేషణ ప్రకారం.. ప్రతిఒక్కరి జీవితాల్లో గొడవలుంటాయి. అందుకే 'కార‍్తీకదీపం' సీరియల్ అందరికీ కనెక్ట్ అయింది. నా భార్యతో బయటకెళ్లినా వంటలక్క గురించే అడుగుతుంటారు. ఆమెకి(మంజుల) పరిస్థితి తెలుసు కాబట్టి నవ్వి ఊరుకుంటుంది'

ఈ ఇంటర్వ్యూలోనే 'కార్తీకదీపం 2' ఉంటుందా అనే ప్రశ్న డాక్టర్ బాబుకి ఎదురైంది. దీంతో.. 'నాకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ రేంజ్ కథ దొరకాలి. అన్నీ కుదిరితే సీజన్ 2 చేయాలి. లేకపోతే టచ్ చేయకపోతేనే బెటరేమో. కానీ మా ఇద్దరి కాంబోలో మరో సీరియల్ చేయొచ్చు' అని సీరియల్ నటుడు నిరూపమ్ చెప్పుకొచ్చాడు. 

(ఇదీ చదవండి: 'ఆదిపురుష్ 2' ప్లాన్.. ఆ క్లారిటీ ఇచ్చేసిన ప్రభాస్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement