
సీరియల్స్ అంటే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. అందుకే వారికి నచ్చేలా, వారు మెచ్చేలా ఎన్నో రకాల సీరియల్స్ తెరకెక్కుతున్నాయి. ఈ క్రమంలో జెమిని టివి "సివంగి” అనే సరికొత్త సీరియల్ తీసుకొస్తోంది. దీన్ని మార్చ్ 25 నుంచి ప్రసారం చేయనుంది. కథేంటంటే.. ఒక పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టి, ఊరిలోని ఆడవాళ్ళ డ్రెస్సులు కుడుతూ అమ్మానాన్నలకు ఆర్థికంగా సహాయపడుతూ , స్నేహితులతో సరదాగా జీవితాన్ని గడిపే అమ్మాయి ఆనంది.
ఊళ్లో ఎవరికీ ఏ కష్టం వచ్చినా సొంత మనిషిలా వెళ్లి సహాయపడుతుంది. అక్క పెళ్లిలో ఏర్పడిన అనుకోని పరిస్థితుల వల్ల ఒక కొడుకులా ఇంటి బాధ్యతలు భుజాన వేసుకొని, అవి నెరవేర్చడానికి సిటీకి ప్రయాణమవుతుంది. సిటీకి వెళ్లిన ఆనంది ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? తన అక్క పెళ్లి చేయగలిగిందా? తిరిగి తన ఊరు వెళ్లగలిగిందా? అనేది తెలియాలంటే సివంగి సీరియల్ చూడాల్సిందే! ఈ ధారావాహిక మార్చి 25న ప్రారంభమవుతోంది. ప్రతిరోజు సాయంత్రం 7.30 గంటలకు ప్రసారం కానుంది. "సివంగి” సీరియల్‌లో ప్రతిమ, రేణుక, నటకుమారి, చంద్రశేఖర్, శ్రీ ప్రియ తదితర నటీనటులు నటించారు.
Comments
Please login to add a commentAdd a comment