
కార్తీకదీపం మే 8: దీప మొండితనం చూసి కార్తీక్ అసహనం కోల్పోతాడు. ‘అందరిని బద్ద శత్రువుల్లానే చూస్తోంది. ఏం కోరుకుంటుందో, ఇంకా ఏం ఆశిస్తుందో నాకు తెలియదు. పిల్లల కోసం ఓపిక పడుతున్నాను. వారి మొహం చూసి భరిస్తున్నానని.. ఇంకా నన్ను రెచ్చగొడితే..’ అంటూ ఆగిపోయి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో దీప సౌందర్యను నిలదీస్తుంది. మీ సుపుత్రుడు మీరు బాగానే ఉన్నారు మధ్యలో నేనే అక్కరకు రాని చుట్టంలా ఉన్నానంటు ఆవేదన వ్యక్తం చేస్తుంది.
ఇక సౌందర్య కార్తీక్ దగ్గరికి వెళ్లీ.. దీపకు నిజం చెప్పే సమయం వచ్చింది పెద్దడో అంటుంది. అదేంటని కార్తీక్ షాక్ అవుతాడు. అవును కార్తీక్ దానికి నిజం చెప్పాల్సిందే.ఇంట్లో వాళ్లందరిని శత్రువల్లా చూస్తోంది. అసలు విషయం చెప్తే తప్పా అర్థం చేసుకునేలా లేదంటుంది. అలాగే ఈ విషయం దీపకు చెప్పే బాధ్యత కూడా నిదేనని, తను చెప్పలేనంటూ.. దీప ఆత్మగౌరవం చూసి అత్తగా కంటే తల్లిగా దాన్ని ఎక్కువగా ప్రేమించాను. అలాంటి నువ్వు ఇక బతకవే అని చెప్పే ధైర్యం నాకు లేదురా అంటు కన్నీటి పర్యంతరం అవుతుంది. అంతేగాక కార్తీక్‌కు మరో ట్వీస్ట్ ఇస్తుంది.
నేను, మీ నాన్న కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకుంటున్నామని చెప్పడంతో కార్తీక్ మరోసారి షాక్ అవుతాడు. ఇలాంటి సమయంలో ఏంటి మమ్మీ ఈ నిర్ణయమని అడగ్గా.. తప్పదు వెళ్లాల్సిందేనంటూ ఇళ్లు, ఇంటి ఇల్లాలు జాగ్రత్త అని బెబుతుంది. దీంతో కార్తీక్ సౌందర్య చెప్పిన విషయం గురించి ఆలోచిస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో దీప నేను ఏం చెప్పిన నమ్మదు.. సో డాక్టర్ భారతితోనే చెప్పిస్తా అని అనుకుంటాడు.ఇదిలా ఉండగా..మోనితా మరో ప్లాన్‌తో డాక్టర్ భారతీ దగ్గరకు వెళుతుంది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగా మధ్యలో కార్తీక్ భారతికి ఫోన్ చేస్తాడు.
మోనిత అక్కడే ఉండి కూడా తను వచ్చినట్లు కార్తీక్‌కి చెప్పోద్దని చెబుతుంది. ఇక భారతి ఫొన్ లిఫ్ట్ చేయగానే కార్తీక్ క్లీనిక్ నుంచి బయలుదేరావా? అని అడుగుతాడు. ఇప్పడే బయలుదేరబోతున్నానంటుంది భారతి. అయితే నా క్లీనిక్ దారి మధ్యలోనే కదా నువ్వు వస్తే నీతో ఓ విషయం చెప్పాలంటాడు. దానికి భారతి అరగంటలో వస్తానని చెప్పి ఫోన్ పెట్టెస్తుంది. ఇలా కార్తీక్ దీపకి అసలు విషయం చెప్పి తనన కాపాడుకొవాలని చూస్తుంటే మరోవైపు దీప బట్టలు సర్దుకుని ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ వంటలక్కగా మారిపోతుంది. మరి తనని కార్తీక్ తిరిగి ఇంటికి తీసుకువస్తాడా, అసలు సౌందర్య, ఆనందరావులు ఎందుకు ఇంటి నుంచి దూరంగా వెళుతున్నారనేది సోమవారం నాటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment