కార్తీకదీపం జూన్ 2: దీప కార్తీక్ ఏం చెప్పబోతున్నాడో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అదేంటో చెప్పండి డాక్టర్ బాబు అని దీప వేడుకున్ప్పటివకి కార్తీక్ పూజ రోజే చేప్తానని, ఇది నా జీవితానికి సంబంధించిన విషయమంటూ దీప మరింత కంగారు పెట్టడం, ఇటు మోనిత కార్తీక్‌ను తన భర్తను చేసుకునే పెద్ద రహస్యాన్ని బయటపెట్టేందుకు సన్నాహాలు చేయడం ఇలా గత మూడు రోజులుగా ఇదే సాగుతుంది. మరీ ఈ రోజు అయినా ఆ నిజాన్ని కార్తీక్ బయటపెట్టి దీప గుండెదడను తగ్గిస్తాడో లేదో నేటి(జూన్ 2వ) ఎపిసోడ్ ఇక్కడ చదవండి.
మోనితా కార్తీక్‌తో అర్జంటుగా మాట్లాడాలనునకుంటుంది. ఇందుకోసం కార్తీక్‌ను ఇంటికి వెళ్లాలనుకుంటుంది. ‘ఎటు నేను పెద్ద జలక్ ఇవ్వబోతున్నాను కదా..అందుకే వాళ్లింటికే వెళ్లి చివరి సారిగా దీప మొగుడిగా నా కార్తీక్‌ని చూడాలి. నా విషయంలో ఆ దీప కానీ.. ఆ సౌందర్య కానీ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా అది ఈ రోజు వరకే.. ఎందుకంటే రేపటితో సీన్ మొత్తం మారిపోతుందిగా.. పాపం దీప.. కార్తీక్ మారిపోయాడు ఇక తనతోనే ఉండిపోతాడు అనుకుంటోంది.. రేపటితో కార్తీక్ ఆ దీపకు భర్తగా కాదు.. ఈ మోనితకి భర్త కాబోతున్నాడు.. ఇన్నీ సంవత్సరాల నా కల రేపటితో నెరవేరబోతుంది.. కార్తీక్.. వస్తున్నా’ అంటు తెగ మురిసిపోతు బయలుదేరుతుంది మోనిత.
మరోవైపు భాగ్యం.. ఇంట్లోని పాత ఫొటోలను తూడుస్తూ దీప, కార్తీక్‌లు కలిసి ఉన్న ఫోటో(గతంలో కార్తీక్ పగలగొట్టిన విషయం గుర్తొచ్చి.. ఈ ఫోటోని గోడకు తగిలించే రోజు ఎప్పుడొస్తుందో? ఏంటో’ అని నిట్టుర్పుగా అంటుంది. అలాగే కార్తీక్ మారిన విషయం, దీప వైద్యం చేయించి బతికుంచుకున్నాడంటే డాక్టర్ బాబు మారినట్లే కదా మరీ ఇంకేందుకు ఈ ఫొటో దాచడమని గోడకు తగిలించబోతుంటే అప్పడే సౌందర్య, దీపలు అక్కడి వస్తారు. దీంతో భాగ్యాన్ని ఏం చేస్తున్నావని సౌందర్య అడగ్గా.. ఈ విషయం చెబుతుంది. ఆలస్యం చేయకుండ ఆ ఫొటోను గోడకు తగిలించమని సౌందర్య చెప్పగా.. దీప వద్దు అని అడ్డుపడుతుంది. రేపు ఆ విషయం ఏంటో చెప్పాక తగిలించోచ్చు లే అనడంతో వారు ఊరుకుండిపోతారు. ఆ తర్వాత భాగ్యంతో రేపు మనింట్లో పూజ ఉందని.. మీరు తప్పకుండా రావాలని పిలుస్తుంది సౌందర్య.
ఇక కార్తీక్ బయట నుంచి ఇంటికి వస్తాడు. ఇంట్లో అప్పటికి ఎవరు ఉండకపోవడంతో బాధగా కూర్చుని.. ‘రేపు నా జీవితంలో చాలా భారంగా ఉండబోతుంది. తర్వాత నేను నా మనసులోని భారాన్ని దింపేసుకుని ఫ్రీ కాబోతున్నా.. అప్పుడు అంతా సంతోషమే.. కానీ రేపు గడిచేదెలా’ అంటూ తనలో తనే సంఘర్షణ పడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే ‘హాయ్ కార్తీక్’ అంటూ గుమ్మంలోంచి ఎంట్రీ ఇస్తుంది మోనిత. నువ్వేంటి ఇలా వచ్చావ్’అని కార్తీక్ చిరాకు మూడ్‌లో అనడంతో. నేను అంతే అడ్డదారుల్లో రావడం నాకు ఇష్టం ఉండదు.. మనదంతా రహదారి అంటూ పెద్దగా నవ్వుతుంది. ఇంతలో దీప, సౌందర్య భాగ్యం ఇంటి నుంచి వస్తారు. ‘ఏంటి దీపా.. బాగున్నావా? అదేంటి అప్పుడే అత్తా-కోడళ్లు బయట షికార్లు చేస్తున్నారంటు కాస్త రెస్ట్ తీసుకో దీప అని వెటకారంగా ఉంటుంది. వెంటనే కార్తీక్ అప్పుడే ఎందుకు బయటికి వెళ్లావు దీపా, విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని ప్రేమ అనడంతో మోనిత రగిలిపోతుంది.
ఇంతలో సౌందర్య.. ‘పిల్లలు ఎక్కడరా కనిపించడం లేదని కార్తీక్‌ని అడుగుతుంది. దీంతో కార్తీక్ వాళ్లను డాడీ దగ్గర ఫామ్ హౌజ్‌లో దింపి వచ్చాను మమ్మీ అంటాడు. అదేంటీ రేపు పూజ పెట్టుకునీ.. అంటు సౌందర్య మోనితని చూసి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయారు ఆంటీ.. పిలవని పేరంటంగా నేను వస్తాననా? నాకు రావాలని ఉంటే పిలవకపోయినా వస్తానుగా.. మీరు ఆగిపోకండి.. మాట్లాడండి’ అంటుంది మోనిత నవ్వుతూ. దాంతో సౌందర్య.. అలా ఎందుకు చేశావురా రేపు పూజలో పిల్లలు లేకుండా ఎలా?అంటుంది సౌందర్య. దాంతో మళ్లీ మోనిత కలుగజేసుకుని.. నిజమే కార్తీక్.. పెళ్లి అయ్యి పదేళ్లు అయినా.. పదేళ్ల కూతుర్లు ఉన్నా.. నీకు ఈ మాత్రం కూడా తెలియదు.. పూజలో ఆడపిల్లలు పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటే ఎంత అందంగా ఉంటుంది.. వెళ్లు.. వెళ్లి తీసుకొచ్చేసెయ్.. వెళ్లు వెళ్లు అంటూ కాస్తా చనువుగా మాట్లాడుతుంది మోనిత.
అప్పటికే విసిగిపోయి ఉన్న కార్తీక్ ‘విల్ యు ప్లీజ్ సెట్ యువర్ మౌత్ మోనితా? ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ కదా.. నువ్వెందుకు కలుగజేసుకుంటున్నావ్? ఎన్నిసార్లు చెప్పినా నీకు కామన్ సెన్స్ లేకుండా పోతుంది’ అని కార్తీక్ మోనితపై అరుస్తాడు. అలా అనేసరికి మోనిత షాక్‌లో దీప, సౌందర్యలు సంతోషంలో ఉంటారు. క్షమించు కార్తీక్. నేను కూడా మీ ఫ్యామిలీ మెంబర్ అనుకోవడం వల్ల నోరు జారాను.. రియల్లీ సారీ.. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ కదా మీరే మాట్లాడుకోండి.. నేనొస్తాను’ అంటూ మోనిత బాధగా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. వెంటనే సౌందర్య ‘పిల్లల్ని తీసుకుని డాడీని బయలుదేరమని ఫోన్ చెయ్యి కార్తీక్ అని చెబుతుంది. దీంతో కార్తీక్ వద్దు మమ్మీ.. నేను కావాలనే వాళ్లని అక్కడ దించేసి వచ్చాను.రేపు నేను ఒక ముఖ్యమైన విషయం చెబుతానన్నాను కదా.. ఆ సమయంలో పిల్లలు ఉండకూడదు.. ఆ మాటలు వాళ్ల వినకూడదు’ అని చెప్పి కార్తీక్ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
మోనిత కారులో వెళ్తూ జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతుంది. ‘ఇంతకాలం చేదు అయిపోయిన నీ పెళ్లాం ఇప్పుడు బెల్లమైపోయిందా కార్తీక్.. దాని ముందే నన్ను అవమానించావ్ కదూ.. చెబుతా.. రేపు ఈ టైమ్‌కి నువ్వు నా కాళ్ల దగ్గర ఈ కారు క్లచ్‌లా పడి ఉంటావ్. నిన్ను నేను వదలను’ అంటూ కోపంతో ఊగిపోతుంది. తరువాయి భాగంలో సౌందర్య దీపను కార్తీక్ గదిలో ఒక్కడే ఉన్నాడు. నువ్వు కాస్తా మాటలు కలుపు అని చెబుతుంది. నేను ఇప్పుడు వెళ్లి ఏం మాట్లాడను అత్తయ్య వెళ్లను అంటుంది. అయినా సౌందర్య వెళ్లు ఏం కాదని చెప్పి పంపిస్తుంది. దీప గదిలోకి వెళ్లేసరి కార్తీక్ ఒకప్పుడు తాను చింపేసిన కవిత పుస్తకం చదువుతూ కూర్చుంటాడు. ఇది చూసి దీప మరింత షాక్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment