కార్తీకదీపం జూన్ 10: దీపను ఇంటికి తీసుకువద్దామని వెళ్లిన కార్తీక్‌కు నిరాశ ఎదురైంది. కార్తీక్ మాట్లాడుతున్న పట్టించుకోనట్లుగా సంబంధం లేని మాటలు మాట్లాడుతూ కార్తీక్ తప్పు చేశాడన్న విషయాన్ని నమ్ముతున్నట్లు చెప్పకనే చెబుతుంది. దీంతో కార్తీక్ బరువెక్కిన గుండెతో ఇంటికి తిరిగి వస్తాడు. మరోవైపు మోనిత వీడియో మెసెజ్ పంపి బుల్లి కార్తీక్ పుడతాడంటు మురిసిపోతుంది. కార్తీక్ తన తప్పుకు కుమిలిపోతు బాధతో మేడపైకి వెళ్లగా అప్పటికే సౌందర్య అక్కడ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగనుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
కార్తీక్ మేడపైకి వెళ్లగా అక్కడ సౌందర్యను చూసి తలదించుకుని వెనక్కి తిరుగుతాడు. కొడుకుని చూసి సౌందర్య పెద్దోడా.. ఇలా రా అని పిలిసి ‘నా కొడుకు నా ముందు తలదించుకున్నాడు.. నా కొడుకు యోగ్యుడు, శ్రీరామచంద్రమూర్తి అని మురిసిపోయేదాన్ని. నీ దగ్గర నుంచి ఇది ఊహించలేదురా’ అంటుంది సౌందర్య బాధగా. దీంతో కార్తీక్ తను కూడా ఇది ఊహించలేదు మమ్మీ అంటూ ధీనంగా మొహం పెడతాడు. సౌందర్య ప్రతి ఒక్కరిలోనూ దైవత్యమూ ఉంటుంది రాక్షత్వమూ ఉంటుంది. కానీ బలహీనక్షణాల్లో కూడా లోపలి రాక్షసుడ్ని బయటికి రానివ్వని వాడినే సంస్కారవంతుడు అంటు కార్తీక్‌తో నా కొడుకు సంస్కారవంతుడు అనుకున్నాను కానీ నువ్వు కూడా ఒక మామూలు మగాడివే అని నిరూపించుకున్నావు అంటుంది.
అంతేగాక నీలో అనుమానం తప్ప ఇంకేలోపం లేదని అనుకునేదాన్ని కానీ ఇప్పుడు దీప గర్వంగా తల ఎత్తుకుంది, నువ్వు తలదించుకుని పాతాళానికి దిగజారవు అంటు మట్లాడుతుంది సౌందర్య. అలాగే మీ నాన్నగారు ఫోన్ చేసి పిలలు ఇంటికి వెళ్లిపోదామంటు గోల చేస్తున్నారని చెప్పారు, ఇవాళ రేపో వాళ్లు వస్తే అమ్మ ఏదని అడిగితే ఏం సమాధానం ఇస్తావని ప్రశ్నిస్తుంది. ఇన్నాళ్లు దీప ఏ తప్పు చేసిందని నిందించావో, దూరం పెట్టావో అదే తప్పు నువ్వు చేశావని పిలలతో చెప్పగలవా? ఈ సారి కాలుష్యం నావైపు వీచింది అని చెబుతావా? ఏం చెప్పాలో తెలియక తప్పు వాళ్ల అమ్మ మీదకు మాత్రం నెట్టకురా.. ఆడవాళ్లంటే నీకు లోకువ కదా.. మగబుద్ధి చూపిస్తావేమోనని చెబుతున్నాను అంటు మాటలతో కార్తీక్‌ను బాధపెడుతుంది సౌందర్య.
ఒకవేళ పిల్లలను తీసుకురాకని మీ నాన్నతో చెబితే ఆయన ఎందుకని అడిగితే ఏం చెప్పాలి, మళ్లీ మీరు తాత కాబోతున్నారని నువ్వు చేసిన ఘనకార్యం చెప్పమంటావా? అంటూ నిలదీస్తుంది. దీంతో కార్తీక్ వెంటనే సౌందర్య చేతులు పట్టుకుంటాడు. సౌందర్య ‘భయపడకు కార్తీక్.. చెప్పనులే.. అంతటి శుభవార్త విని ఆయనకు ఏదైనా అయితే భరించాల్సింది నేనే కదా.. నాకంత ధైర్యం లేదు కార్తీక్’ అంటూ సౌందర్య ఏడుస్తుంటే కార్తీక్ కూడా ప్రశ్చాత్తాపంతో కుమిలిపోతాడు.కార్తీక్ తన పాపానికి ప్రాయిశ్చిత్తం లేదని, ఒక పవిత్రమూర్తిని ఏ విషయంలో క్షోభపెట్టానో వాస్తవానికి ఆ నేరం తాను చేసినందుకు చచ్చిపోతే బాగుండు అనిపిస్తోందంటు ప్రశ్చాతాప పడతాడు.
ఈ నరకం అనుభవించే కంటే ఒక్కసారిగా ప్రాణం పోతే బాగుంటుందనిపిస్తోంది మమ్మీ.. నన్ను చంపెయ్ మమ్మీ అంటాడు కార్తీక్. కానీ ఒక్కటి మాత్రం నిజం మమ్మీ.. ఇది ఏదో పొరపాటువల్ల జరిగింది కానీ దీప మీద ప్రేమ లేకో.. మోనిత మీద మోజుతోనూ కాదు నన్ను నమ్ము మమ్మీ.. కోడలు తప్పు చేసిందంటేనే నమ్మని దానివి.. కొడుకు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేశాడంటే నమ్ముతున్నావా అని ధీనంగా అడిగే సరికి సౌందర్య మనసు కాస్త కరుగుతుంది. ‘నువ్వు కావాలని ఈ తప్పు చెయ్యలేనది నేను నమ్ముతాన.. కానీ అది అక్కడ అవకాశం కోసం గోతికాడ నక్కలా కాచుకుని ఉందిరా.. బలహీన క్షణంలో నిన్ను రెచ్చగొట్టి ఉండొచ్చు.. కానీ తప్పు తప్పే కదా కార్తీక్.. ఏదో చిన్న తప్పు అని చెరుపేసుకోలేం కాదుకదా.. ఆ మోనిత మంచిది కాదురా కాపురంలో నిప్పులు పోసే ఆడదిరా అలాంటి వారికి దూరంగా ఉండరా ఎంతటి నీచానికైనా దిగజారుతుందిరా అని నేను నీ భార్య చిలక్కి చెప్పినట్లు చెప్పాం.
కానీ నువ్వు పెడచెవిన పెట్టావు. చివరికి ఫలితం అనుభవిస్తున్నావు’ అంటుంది సౌందర్య. ఇదిలా ఉండగా దీప సరోజక్క మరిది లక్ష్మణ్ వస్తాడు. గతంలో డాక్టర్ బాబు తన వైద్య చేసిన విషయాన్ని గుర్తు చేస్తాడు. మళ్లీ తనకు కాస్త నీరసం పెరిగిందని, కార్తీక్ దగ్గర వైద్యం ఇప్పించాలని కోరతాడు. దీంతో తనకు కొంచం టైం కావాలంటుంది దీప. సరేనంటు అతడు వెళ్లిపోతాడు. కార్తీక్, సౌందర్య భోజనం చేస్తుంటే సడెన్‌గా శౌర్య, హిమలు వస్తారు. వారిని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. దీంతో పిల్లలు మేము ఎందుకు వచ్చామా అన్నట్లు చూస్తున్నారెంటి, మేము ఇంతా ఆనందంగా ఉంటే అంటు ప్రశ్నిస్తారు. దీంతో సౌందర్య వాళ్లకు ఏదో చెప్పి నచ్చజెబుతుంది. ఆ తర్వాత అమ్మ ఏది అనగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment