Karthika Deepam: అసలు ట్విస్ట్‌ చెప్పేసిన మోనిత! | karthika Deepam Telugu Serial Today Episode 5th May | Sakshi
Sakshi News home page

Karthika Deepam: నలిగిపోతున్న సౌందర్య, మురిసిపోతున్న మోనిత

Published Wed, May 5 2021 3:43 PM | Last Updated on Wed, May 5 2021 6:03 PM

karthika Deepam Telugu Serial Today Episode 5th May - Sakshi

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్‌ ‘కార్తీకదీపం’. ఇప్పటికి 1000 ఎపిసోడ్‌లకు పైగా పూర్తి చేసుకున్న ఈ సీరియల్‌ను దర్శకుడు రోజురోజుకు ఆసక్తికరంగా మలుస్తున్నాడు. దీప అనారోగ్యం, మోనితా ప్రగ్నెంట్‌ సస్పెన్స్‌ ప్లాన్‌తో రసవత్తవరంగా సాగుతోన్న ఈ సీరియల్‌ నేడు (2021 మే 5)న 1031 ఎపిసోడ్‌కు చేరుకుంది. కార్తీక్‌ దీప అనారోగ్యం విషయం సౌందర్యకు చెప్పిన సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్‌లో దీప వంట చేయద్దొన్నా కార్తీక్‌ మీద కోపంతో మొండిగా పట్టుబట్టి వంటలు చేస్తుంది. అంతేగాక పొద్దున్నే టిఫీన్‌ కూడా చేస్తుంది. దీంతో కార్తీక్‌ ఎలా రియాక్ట అయ్యాడు, సౌందర్య దీపకు ఏం చేబుతుందో ఈ రోజు ఎపీసోడ్‌లో తెలుసుకుందాం. 

కార్తీక్ వద్దన్నా దీప ఉదయం దోసెలు వేస్తుంది. వంట చేయనిస్తేనే టాబ్లెట్స్ వేసుకుంటాను అని కండీషన్ పెడుతుంది. దీంతో కార్తీక్ ఏం చెయ్యలేక.. బయట నుంచి టిఫీన్‌ తెచ్చుకుని దీప ముందే తింటూ ఆమెకు చేసిన ముట్టుకోకుండా బుద్ధి వచ్చేలా చేస్తాడు. అంతే కాకుండా ‘నేను మాత్రం దాని చేతి వంట తినను. నేను తినకుండా ఎన్ని వంటలు చేస్తే ఏం లాభం మమ్మీ’ అని దీపకు అర్థమయ్యేలా చేసి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మోనిత బుద్ధిగా సోఫాలో కూర్చుని ఏదో రాస్తూ నవ్వుకుంటూ.. ఊహించుకుంటూ మురిసిపోతూ కనిపిస్తుంది. ఇంతలో ప్రియమణి కూరగాయలు పట్టుకుని అక్కడికి వచ్చి కూర్చుని.. ‘ఏంటమ్మా ఏం రాసుకుంటున్నారని అడుగుతుంది. దీంతో మోనితా పుట్టబోయే బిడ్డ పేర్లు అని సమాధానం ఇస్తుంది.

అది విన్న ప్రియమణి ఎవరికి పుట్టబోయే బిడ్డ పేర్లు అయోమయంగా అనగానే.. నీకే.. నీకు పుట్టబోయే బిడ్డే పేర్లు అంటుంది మోనిత కోపంగా. ప్రియమణి ఏం అర్థం కానట్లు చూస్తుంది. ‘రేపు నేను కార్తీక్‌ని పెళ్లి చేసుకున్నాక పిల్లలు పుడితే.. ఆడపిల్ల అయితే ఏ పేరు పెట్టాలి. మగపిల్లాడైతే ఏ పేరు పెట్టాలని రాసుకుంటున్నాను’ మోనిత మెలికలు తిరుగుతూ అంటుంది. ‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని భలే రాసుకుంటున్నారమ్మా’ అంటు వ్యంగ్యంగా అంటుంది ప్రియమణి. వెంటనే మోనితకి కార్తీక్ పిల్లలు పుట్టే రిపోర్ట్ మార్చి. తను చెప్పిన అబద్దాలు గుర్తు చేసుకుని.. ‘నేను ఆడిన అబద్దం నా మెడకే చుట్టుకుంటుందా.. హా ఇంకో అబద్దం చెప్పి నమ్మించేస్తే పోలా’ అని అనుకుంటుంది కూల్‌గా. ఇదిలా ఉండగా  మొరళి కృష్ణ, భాగ్యంలా సీన్‌ వస్తుంది. భాగ్యంతో మొరళి కృష్ణ ‘దీప ఇంటికి వెళుతున్న, వీలైతే దీపను పిల్లలను తీసుకువస్తానడంతో.. అది అసలు వస్తుందా.. అయినా నీ సరదా నేను ఎందుకు కాదానాలి వెళ్లండి’ అంటుంది.

ఇక కార్తీక్ మోనిత ఇంటికి వెళ్లి దీప కావాలనే కిచెన్‌లో ఉంటోంది. వేడి సెగలో మగ్గిపోతుంది. నాకు టెన్షన్ పెరిగిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. దీంతో ‘మరీ మీ అమ్మగారు ఏం చెయ్యట్లేదా.. అసలే కోడలి కొంగుపట్టుకుని తిరిగే అత్తగారు’ అంటూ వెటకారం చేస్తుంది మోనిత. ‘మధ్యలో మా అమ్మను అనకు. ఆవిడ మా మధ్య నలిగిపోతుంది’ అంటాడు కార్తీక్. ‘నువ్వు అందరినీ బాగానే అర్థం చేసుకుంటావ్ కార్తీక్.. నీ అతి మంచితనమే నిన్ను బాధపెడుతుంది.. ఈ టెన్షన్ అంతా దేనికీ కార్తీక్.. దీపేం చిన్నపిల్లకాదుగా.. దీపకి తన పరిస్థితి గురించి చెప్పెయ్.. పిల్లల కోసమైనా బతకాలని అనుకునే అవకాశం ఉంది కదా.. చెప్పేస్తే నీ టెన్షన్ పోతుంది’  అంటూ మోనితా కార్తీక్‌కు సలహా ఇస్తుంది. దీంతో ఏ డాక్టర్‌ నేరుగా పెషెంట్‌కు మీరు బతకరని చెప్పరు. అలా చెబితే ఒత్తిడి పెరిగిపోయి జీవితం మీద ఆశపోతుంది. భయంతోనే బతుకుతారు. తిండి తినలేరు.. నిద్రపోలేరు.

అధికంగా ఆలోచిస్తే తలలో నరాలు చిట్లిపోతాయి’ అంటాడు కార్తీక్. ‘భారతీకంటే ఎక్కువగా నువ్వే దీప కేసు స్టడీ చేస్తున్నట్లున్నావ్.. చేసిన తప్పులన్నీ పక్కనపెట్టి మరీ భార్యని పూలల్లో పెట్టుకుని చూసుకుంటున్నావ్‌’ అంటూ వెటకారం చేస్తుంది మోనిత. దాంతో కార్తీక్ కోపంగా.. ‘తప్పులు ఆలోచించే టైమ్ కాదు.. గతాన్ని గుర్తుచేయడం కరెక్ట్ కాదు’ అంటూ ఫైర్ అవుతాడు. ఇటూ దీప బాధతో ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటే.. సౌందర్య అక్కడికి వచ్చి.. ‘పదేళ్లుగా నిన్ను వాడు అపార్థం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నువ్వు వాడిని అపార్థం చేసుకుంటూ వస్తున్నావా’ అంటుంది. ‘నేను డాక్టర్ బాబుని అపార్థం చేసుకుంటూ వస్తున్నానా’ అంటుంది దీప. మరి లేకపోతే ఏంటే. వాడు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పడం కూడా తప్పేనా.?’అనడంతో ‘రెస్ట్ కాదు.. గెస్ట్ అనండి..’ అనే దీప డైలాగ్‌తో నేటి ఎపిసోడ్‌ ముగుస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement