కార్తీకదీపం జూన్ 14: కార్తీక్ దీపతో మాట్లాడుతూ తను ఏ తప్పు చేయలేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. దీప మాత్రం కార్తీక్ వంక కోపంగా చూస్తుంటే అలా చూడకు దీప.. ఆ చూపులు తట్టుకోలేను అంటాడు. అదంతా చాటుగా హిమ, శౌర్యలు వింటారు. కానీ దీప మాత్రం కరగదు. సీరియస్‌గా ఒకటి అడుగుతా చేస్తారా? అని అంటుంది. అదేంటో.. దీప కార్తీక్ మాటలకు కరిగిపోతుందా? లేదా! అనేది నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
‘నిజం చెబుతున్నాను దీపా నువ్వు తప్ప నా జీవితంలో ఎవరూ లేరు.’ అంటాడు దీప కళ్లల్లోకి చూస్తూ. ‘నువ్వు, పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎవరు ఏదీ ముఖ్యం కాదు దీపా.. నాకు నువ్వు కావాలి పిల్లలు కావాలి. అంతకంటే ఏమీ వద్దు దీప.. ’ అనే కార్తీక్ మాటలు విని పిల్లలు సంతోషిస్తుంటే.. దీప మాత్రం అవునా అన్నట్లు వెటకారంగా చూస్తుంది. ‘నా మాటల నమ్మనట్టుగా అలా చూడకు దీపా.. ఆ చూపులు నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ దీపా.. నేను భరించలేకపోతున్నాను.. ఏదో ఒకటి మాట్లాడు.. ప్లీజ్’ అంటాడు కార్తీక్.
కార్తీక్ తను ఏ తప్పు చేయలేదు నమ్ము దీప అని ప్రాధేయపడ్డ కూడా దీప కరగదు. దీంతో కార్తీక్ ‘నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం తిట్టు దీపా.. మనసులోని ఉన్న కోపాన్ని మాటల ద్వారా చూపించి నీ కసి తీర్చుకో’ అంటాడు. దీంతో దీప ఒక మాట అడుగుతాను చేసిపెడతారా? అని అడుగుతుంది. దీంతో కార్తీక్ సంబరపడిపోతూ నువ్వు నోరు తెరిచి అడిగావ్ అది చాలు నాకు.. నువ్వు ఏం అడిగిన సరే అది చేసి పెడతాను.. చెప్పు ఏం చెయ్యమంటావు ఈ దేశాన్నే వదిలి విదేశాలకు వెళ్లిపోదామా? అని అంటాడు.
‘నీకు ఏ దేశమంటే ఇష్టమో చెప్పు పిల్లలని తీసుకుని అక్కడే సెటిలైయిపోదాం.. పిల్లల్ని తీసుకుని వెళ్లిపోదాం. మనమిద్దరం మనకిద్దరు అన్నట్లు బతుకుదాం’ అంటాడు. దానికి దీప అప్పుడు మోనితకి అన్యాయం చేసినట్లు అవుతుందిగా.. నేను మన సంగతి మాట్లాడటం లేదు.. మాట్లాడను కూడా అంటూ సరోజక్క మరిది లక్ష్మణ్ విషయం అడుగుతుంది. మీ చెయ్యి మీ మనసు మంచిదని నమ్ముతున్నాడు అంటుంది. ఆ నమ్మకాన్ని పోనివ్వకూడదని మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నమ్మకాన్ని నిలబెడతారా? మిమ్మల్ని దేవుడు అన్నాడు. వైద్యం చేస్తారా? అతడిని మీ దగ్గరకు పంపించమంటారా? అంటుంది దీప. దీంతో కార్తీక నిరాశగా లేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోతాడు.
మరోవైపు సౌందర్య, ఆదిత్య, శ్రావ్యలు కార్తీక్ పిల్లల్ని తీసుకుని తీసుకొస్తాడని నిద్రపోకుండా ఎదురు చూస్తుంటారు. ఆదిత్య కార్తీక్ చేసిన తప్పు గురించి ఎత్తడంతో సౌందర్య కార్తీక్ వైపే మాట్లాడుతుంది. దీంతో ఆదిత్య నేను తప్పుగా అన్నానా మమ్మీ, అన్నయ్య తప్పు చేయలేదంటావా? అని ప్రశ్నించగా సౌందర్య ‘నేను తప్పు కాదు అనడం లేదురా వాడు తిరగబడి నా ఇష్టం అనట్లేదుగా. చేసిన తప్పుకు పశ్చాతాప పుడుతున్నాడు, సిగ్గుతో తలవంచుకుంటున్నాడు. అందుకే వాడంటే జాలి కలుగుతోంది’ అంటుంది బాధగా. కార్తీక్ నిద్రపోతున్న హిమ, శౌర్యను లేపి ఎక్కడ ఉంటారని అడగ్గా మీరు ఎక్కడ ఉంటే అక్కడ అని సమాధానం ఇస్తారు.
దీంతో నేను వెళ్లి మీ బట్టలు తెస్తాను అని చెప్పి బయలుదేరుతాడు. ఇక తెల్లారి హిమకు ఏదో వాసన రావడంతో మెలుక వస్తుంది. కిచెన్‌లోకి వెళ్లి చూడగా పాలన్నీ పొంగి కింద వరకూ ఒలిగిపోతాయి. అది చూసి వెంటనే స్టవ్ ఆఫ్ చేస్తుంది హిమ. దీప బాధగా బయట కూర్చుని ఉండటం చూసి దగ్గరికి వెళ్లి ‘అమ్మా నీకు ఏమైంది. నాన్న మీద ఎందుకు కోపం’ అని అడుగుతుంది. తరువాయి భాగంలో.. మోనిత దీప ఇంటికి వచ్చి కార్తీక్‌కు వార్నింగ్ ఇస్తుంది. సరిగ్గా పదోరోజులోగా నాకు సరైన సమాధానం, నాకు న్యాయం జరిగే నిర్ణయం రాకపోతే.. మొత్తం నీ ఫ్యామిలీ గడగడా వణికిపోయేలా చేస్తాను బీ రేడి అంటూ హెచ్చరించి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment