అదృష్టాన్ని నిలబెట్టుకోవడమే విజయం | Nanda Kishore Entertaining In Telugu Serials | Sakshi
Sakshi News home page

అదృష్టాన్ని నిలబెట్టుకోవడమే విజయం

Published Wed, Dec 4 2019 1:10 AM | Last Updated on Wed, Dec 4 2019 4:17 AM

Nanda Kishore Entertaining In Telugu Serials - Sakshi

చిన్నప్పుడు సరదాగా ఆడిన ఆటైనా, ఇష్టంతో నేర్చుకున్న పనైనా.. ప్రతీది జీవితంలో ఉపయోగపడటం అనేది ఒక అదృష్టం. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన ప్రయత్నమే. ఆ రెండింటినీ సిన్సియర్‌గా అందిపుచ్చుకున్న సీరియల్‌ నటుడు నందకిశోర్‌. ‘జీ తెలుగు’లో వచ్చే ‘రామసక్కని సీత’ సీరియల్‌లో రామరాజుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న నందకిశోర్‌ చెబుతున్న ముచ్చట్లివి.

‘మా అమ్మానాన్నలు శారద, వెంకటరమణ. నాన్న రైల్వేలో జాబ్‌ చేసేవారు. ముగ్గురు అన్నదమ్ములలో నేను చివరి వాడిని. మా నాన్నగారే నా మొదటి గురువు. చిన్నప్పుడు ఆయనే నా ముఖానికి మేకప్‌ వేశారు. భూమికా థియేటర్‌ గ్రూప్‌ను నిర్వహించే గరికపాటి ఉదయభాను గారి దగ్గర పదవతరగతి నుంచి నాటకరంగంలో పాల్గొనేవాడిని. కెరియర్‌ దీర్ఘకాలం కొనసాగాలంటే నాటక రంగం బాగా ఉపయోగపడుతుంది. అదృష్టవశాత్తు అలా నా మూలాలు నాటకరంగంలో పడ్డాయి.

అన్నదమ్ముల అనుబంధం
ఇంట్లో చిన్నవాyì ని అయినా మా అన్నయ్యల సపోర్ట్‌ నాకు బాగా ఉండేది. అన్నదమ్ములం అయినా మంచి స్నేహితులుగా ఉంటాం. ఒకమ్మాయిని ప్రేమించాను అని చెప్పినప్పుడు ఇంట్లో చిన్నవాడినైనా మా అన్నయ్యలిద్దరూ నాకు ముందు పెళ్లి జరిపించారు. ఇప్పటికీ నాకు వారు అండగా ఉంటారు. నా సతీమణి పేరు లక్ష్మి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక అదృష్టం అయితే ఈ ఫీల్డ్‌లో ఉన్న నన్ను అర్థం చేసుకోవడం నిజంగా అదృష్టం. మాకు ముగ్గురు కూతుళ్లు.

విలన్‌ నుంచి హీరోగా!
2005 సంవత్సరం నుంచి నా కెరియర్‌ మొదలైంది అని చెప్పవచ్చు. అంతకుముందు నాలుగైదేళ్లు ఈ రంగంలో నిలదొక్కుకోవడానికి సమస్యలు ఎదుర్కొన్నాను. ఆ టైమ్‌లో ఈ రంగంలో పోటీ ఎక్కువ ఉంది. ఇప్పటితో పోల్చుకుంటే అప్పుడు అవకాశాలు తక్కువ. పదిహేనేళ్ల క్రితం దూరదర్శన్‌లో వచ్చిన ‘వెలుగు నీడలు’ సీరియల్‌లో విలన్‌గా చేశాను. అక్కణ్ణుంచి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ చెన్నై ఇండస్ట్రీకి వెళ్లాను. అక్కడ అంకురం సీరియల్‌లో సైడ్‌ క్యారెక్టర్‌ చేశాను. ఆ తర్వాత ర్యాడాన్‌ ప్రొడక్షన్‌లో అవకాశం వచ్చింది.

ఆ తర్వాత రెండేళ్లకు ఇక్కడ ‘స్రవంతి’ సీరియల్‌లో అవకాశం వచ్చింది. ఐదేళ్ల పాటు వచ్చిన ఆ సీరియల్‌ వల్ల నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. ఈ సీరియల్‌ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేక, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్‌ చేసుకుంటూ వస్తున్నాను. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్‌ చేశాను. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ రాణించాలనే ప్రయత్నంలో ఉన్నాను. ఇప్పుడొక సినిమా కూడా చేస్తున్నాను. సీరియల్‌ వల్ల నటనలోనూ, ప్రొడక్షన్‌లోనూ మంచి ఎక్స్‌పీరియెన్స్‌ వచ్చింది.

రామసక్కని సీత
రియల్‌ లైఫ్‌లో మా ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడిని. ‘రామసక్కని సీత’ సీరియల్‌లో నలుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడిని. ఇది పూర్తిగా కుటుంబ నేపథ్యం ఉన్న కథనం. నాది రామరాజు పాత్ర.  అన్నదమ్ముల సఖ్యత, భార్యా–భర్తల అనురాగం, సమాజంలో మంచి పేరున్న వ్యక్తి.. ఇలా ఏ దశలో ఎలా ఉండాలో బంధాల ద్వారా చూపుతుంది ఈ సీరియల్‌. అనుకోని పరిస్థితుల్లో సీత రామరాజు భార్యగా ఆ ఇంట అడుగుపెడుతుంది. అమ్మలా చూసే సీత ప్రవర్తనతో తమ్ముళ్లు మారుతారు. మంచి ప్రేక్షకాదరణతో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

నటనే జీవితం
నటన మొదలుపెట్టినప్పటి నుంచి ఇదే నా జీవితమైంది. దీంట్లోనే కొనసాగుతాను. నటుడిగా కొనసాగాలంటే ఆరోగ్యం, ఫిట్‌నెస్, ముఖకాంతి.. ఇవన్నీ తప్పనిసరి. అందుకే ఎన్ని పనులున్నా రోజూ ఉదయం 5:30గంటలకు లేస్తాను. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తాను. షూటింగ్‌ లేకపోతే సినిమాలు చూడ్డం, స్టోరీ డిస్కషన్స్, కాన్సెప్ట్స్‌ డెవలప్‌ చేయడం వంటి వాటిల్లో పాల్గొంటుంటాను. మిగతా టైమ్‌ నా కుటుంబంతో గడుపుతాను. పూర్తి శాకాహారిని. వంట వచ్చు కాబట్టి అప్పుడప్పుడు ఇంట్లో కొత్త వంటకాలను ట్రై చేస్తుంటాను. వాటి టేస్ట్‌ను ఇంట్లో వారికి దగ్గరుండి మరీ వడ్డిస్తాను.’
– నిర్మలారెడ్డి

ఆల్‌రౌండర్‌గా!
చిన్నప్పటి నుంచి ఆటలు, పాటలు, చదువు.. అన్నింటిలోనూ చురుకుగా ఉండేవాడిని. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆటల్లో క్రి కెట్‌ అంటే చాలా ఇష్టం. ఇక్కడ క్రికెట్‌ లీగ్‌ జరిగినప్పుడు సినిమా వాళ్లతో కలిసి పాల్గొన్నాను. టీవీ కేటగిరీ నుంచి నా క్రికెట్‌ స్కిల్స్‌ చూసి వాళ్ల టీమ్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. చిన్నప్పుడు ఏదైతే ఇష్టంతో నేర్చుకున్నానో అవన్నీ నా జీవితంలో ఉపయోగపడుతూ వచ్చాయి. సింగర్, డ్యాన్సర్, యాక్టర్, ప్లేయర్‌గా.. ఇలా అన్నింటా ఉన్నాను. డ్యాన్సర్‌గా జల్సా, నర్తనశాల, రగడ.. వంటి టీవీ డ్యాన్స్‌ షోలో పాల్గొన్నాను. స్టేజ్‌ షోలోనూ ప్రదర్శనలు ఇచ్చాను. అయితే, అప్పటి కష్టానికి ఇప్పటిలా మార్కెట్‌లేదు. ఇప్పుడు ప్రతీది అప్‌డేటెడ్‌గా ఉండాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement