
కార్తీకదీపం మే 31: బుల్లితెర ప్రేక్షకులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అందరూ కోరుకున్నట్టుగానే దీప కోలుకుని డిశ్చార్జ్ అయ్యి వెళ్లిపోతుంది. మరోవైపు కార్తీక్ తనని పట్టించుకోకుండా దీప మీద ప్రేమ కురిపిస్తుండటంతో మోనిత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ పూర్తిగా మారిపోయాడని తెలుసుకున్న మోనిత ఎలాంటి కుట్ర పన్ననున్నందో నేటి(మే 31) ఎపిసోడ్‌లో తెలుసుకొండి..
దీప కోలుకుని ఇంటికి వస్తుంది. మరోవైపు మోనిత నిరాశగా కూర్చోని దిగులుగా ఉండగా ప్రియమణి.. మోనితకి కాఫీ తెచ్చిస్తుంది. ఎందుకమ్మా అలా ఏడుస్తూ కూర్చుంటారు, కార్తీక్ అయ్యకి.. ఒక ఫోన్ అయినా చెయ్యొచ్చు కదమ్మా? ఏంటమ్మా మీరు ఏడుస్తున్నారు.. వాళ్లింటికి వెళ్లి ఇష్టమొచ్చినట్లు దులిపెయ్యండి అంటుంది. అంటే కార్తీక్ అయ్యని నమ్ముకున్నవాళ్లలో ఎవరో ఒకరు ఏడవాల్సిందేనా.. మీకేం ఖర్మమ్మా.. మీరు పడే బాధేంటో ఆవిడకు తెలిసి తీరాలని ఏవేవో చెబుతుంది. అది వింటు మోనిత మనసులో ‘ఊరుకో ప్రియమణీ.. నేను దీపని కాదు సర్దుకుపోవడానికి.. మోనితని.. మోసం చేసే వాళ్లని క్షమించను.. కొడతా.. కోలుకోలేని దెబ్బ కొడతా.. నా ప్రేమతో ఆడుకుంటే ప్రేమించినవాడు అని కూడా చూడను.. అతి త్వరలో విడుదల కానుంది ఒక భయంకరమైన చిత్రం’ అంటూ నవ్వుకుంటుంది.
సౌందర్య కార్తీక్‌కి ఫోన్ చేసి ఎక్కడి వరకు వచ్చార్రా అని కనుక్కుని పిల్లలతో ఆనందంగా ఇంకో 10 నిమిషాల్లో వస్తున్నారు అని చెప్తుంది. హిమ, శౌర్యలు అమ్మ నాన్నకు ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాం అంటూ పైకి వెళతారు. ఇంతలో మోనిత ఫోన్ చేయడంతో సౌందర్య.. శుభమా అని దీప కోసం ఎదురు చూస్తుంటే ఇదెందుకు ఇప్పుడు ఫోన్ చేసింది..చూద్దాం అంటు లిఫ్ట్ చేస్తుంది. ఆంటీ దీప ఇంటికి వచ్చిందా? అని అడగ్గా.. ఇంకా రాలేదని చెబుతుంది సౌందర్య. ‘అయ్యో ఏమైందని వెటకారంగా అనడంతో.. ఏం కాలేదు.. ఇకపై ఏం కాదు కూడా.. అయినా ఇంకా రాలేదు అంటే.. దారిలో ఉంది.. వస్తూ ఉందని అర్థం.. ఇది తెలుసుకోవడానికి ఫోన్ చేశావా అని మోనితకు సౌందర్య కౌంటర్ వేస్తుంది. లేదు ఆంటీ దీప ఉంటే విష్ చేద్దామని ఫోన్ చేశాను అంటుంది మోనిత.
అంతేగాక ఇక నుంచి నువ్వు మా మీద ఇంత అభిమానం చూపించాల్సిన అవసరం లేదని సౌందర్య అనడంతో ఏం.. ఎందుకు ఆంటీ అని అడుగుతుంది మోనిత. అది అంతేలే.. చూడు నేను ఇప్పుడు హ్యాపీ మూడ్‌లో ఉన్నాను.. ఇలా మాట్లాడి దాన్ని కాస్తా చెడగొట్టకని సౌందర్య అనగానే మోనిత నవ్వుతూ.. అలా అనకండి ఆంటీ ఎలాంటి మూడ్‌నైనా చెడగొట్టే టాలెంట్ నాలో ఉంది.. సరే మీరు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు కదా.. ఇలా ఎన్ని రోజలు ఉంటారో నేను చూస్తాను అని మోనిత హెచ్చరిస్తున్నట్లు మాట్లాడుతుంది. అది విని సౌందర్య ‘ఏంటే నువ్వు చూసేది ఇప్పుడు నా కొడుకు చాలా మారిపోయాడు.. నా కోడల్ని బంగారంలా చూసుకుంటున్నాడు.. నువ్వు చెప్పే సోది వినడం అవసరమా చెప్పు.. పెట్టెయ్ ఫోన్’ అని విసుగ్గా ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ పెట్టేశాక మోనిత మనసులో ‘నీ కోడలు దీప బంగారం అయితే మరి నేనేంటి? ప్లాటినమ్‌నా? దానికంటే నేనే ఎక్కువని రుజువు చేస్తాను.. ఫేస్ చెయ్యడానికి రెడీగా ఉండండి ఆంటీ అని మనసులో పడిపడి నవ్వుకుంటుంది.
ఇదిలా ఉండగా దీప, కార్తీక్‌ల కారు వస్తుంది. దీప దిగగానే కార్తీక్ ఆమె పట్టుకుని నడిపించుకుంటు వస్తాడు. వాళ్లను గుమ్మం దగ్గరే ఆపి సౌందర్య శ్రావ్యను పిలిచి హారతి ఇచ్చి ఆనందంతో మురిసిపోతు ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది సౌందర్య. లోపలికి వెళ్లగానే పిల్లలు తల్లిదండ్రులకు పూలు చల్లి గ్రాండ్ వెల్‌కం చెబుతారు. సంతోషంగా కిందకు దిగి దీపని హత్తుకుని ముద్దాడతారు. తర్వాత కార్తీక్ దీపల మధ్యకు వచ్చిన రౌడీ.. కార్తీక్ చేతిని దీప చేతికి కలుపుతూ.. ‘మీరిద్దరూ ఇప్పుడు ఫ్రెండ్సే కదా..’ అంటుంది. కార్తీక్ అవునంటాడు. ఆ తర్వాత శౌర్య ‘నువ్వే మా నాన్నవని తెలిసినప్పుడు, హిమ నా చెల్లి అని తెలిసినప్పుడు కూడా ఇంత ఆనందం లేదు నాన్నా.. ఏదో వెలితిగా ఉండేది.. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది’ అంటు ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత కార్తీక్ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని తాను తెలుసుకున్న నిజం గురించి చెప్పి దీపను క్షమాపణలు కోరాలనుకుంటాడు. ఇంతలో సౌందర్య శుభవార్తనే అని అడగ్గా మీరందరూ పండగ చేసుకునే వార్త అనడంతో సౌందర్య భాగ్యం చేయించాలనుకున్న పూజ గురించి చెబుతుంది.
ఈ శుభావార్త ఏదో దేవుడు ముందు చెప్పమని, అందరికి శుభం జరుగుతుందంటుంది.దీంతో కార్తీక్ కూడా అందరి ముందే చెప్పడమే కరెక్ట్ అంటాడు. అందరు ఉన్నప్పుడు చెబితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. కొంతైనా న్యాయం చేశానేమో అనిపిస్తుందంటూ భావోద్వేగానికి లోనవుతాడు. దీంతో కార్తీక్ ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియక దీప కంగారు పడుతుంది. ఇక తరువాయి భాగంలో.. దీప అదేంటో ఇప్పుడే చెప్పండి డాక్టర్ బాబుని రిక్వెస్ట్ చేస్తుంది. దీంతో నేనొక తప్పు చేశాను దీపా.. అంటాడు కార్తీక్ తలదించుకుని. ‘మీరా..’ అంటుంది దీప అనుమానంగా ఆశ్చర్యంగా. ‘అవును నేనే.. అది నా నోటితో నేను చెప్పడానికి.. చాలా ఎక్స్‌సైజ్ చెయ్యాలి.. ప్రాక్టీస్ కావాలి.. అందుకే నాకు కొంచెం టైమ్ కావాలి.. రేపు చెబుతాను.. రేపే చెప్పేస్తాను.. అందాక ఆగు దీపా..’ అంటాడు కార్తీక్ ఎమోషనల్‌గా రిక్వస్ట్‌గా. దీప ఆలోచనగా చూస్తూ ఉంటుంది. మరోవైపు రేపే సరైన సమయం చూసి బాంబు ఎలా పెల్చాలా అని మోనిత ప్లాన్ చేస్తుంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment