
కార్తీకదీపం మే 20 : కార్తీక్, దీపకు టిఫిన్ పెట్టి టాబ్లెట్ ఇస్తాడు. ఆ తర్వాత వారణాసిని పిలిచి బయట హోటల్ నుంచి డైలీ క్యారెజ్ తీసుకురమ్మంటాడు. దీంతో దీప ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా ఓపిక వచ్చింది నేనే చేస్తాను మీరు బయట ఫుడ్ తినలేరు కదా డాక్టర్ బాబు అంటుంది. దీంతో కార్తీక్ నన్ను పరాయి వాడిలా చూడకు, మీతోనే ఉంటున్నా కదా మీలాగే నేను ఉంటాను అంటాడు. ఇదిలా ఉండగా తనతో ప్రియమణి ‘పదహారేళ్లు కాదు కదా నూట పదహారేళ్లు వచ్చినా మీకు కార్తీక్ అయ్యకు పెళ్లి జరగదు’ అన్న మాటలను తలుచుకుంటుంది మోనిత. వెంటనే నవ్వుకుంటూ ఈ మోనిత అంటే పూర్తిగా నీకు తెలియదు ప్రియమణీ. నువ్వు చూసింది నాణానికి ఒకవైపే. రెండోవైపు నీకు తెలియదని మనసులో అనుకుంటుంది.
నేను చదువులో ఫస్ట్.. గేమ్స్‌లో ఫస్ట్.. కుట్రలు చేయడంలో కూడా ఫస్టే అలాంటిది పదహారేళ్లుగా కార్తీక్‌ని ప్రేమిస్తున్న లవ్‌లో మాత్రం ఎందుకు ఫెయిల్ అవుతాను? నా లెక్కలు నాకున్నాయి. నా అంచనాలు నాకున్నాయి. నేను ప్రయోగించే పద్దతులు నాకున్నాయి. ఇంక కార్తీక్‌తో నా పెళ్లి ఖాయం అని అనుకుని నవ్వుకుంటుంది. మరోవైపు మురళీ కృష్ణ, భాగ్యంలు దీప ఇంటికి నేను వెళతానంటే నేను వెళతానని అని వాదించుకుంటారు. మురళీ కృష్ణ వెళ్లి ఏడుస్తూ ఇంకా దీపలో బాధ పెంచుతాడని భాగ్యం వద్దు తానే వెళతానడంతో.. నువ్వు వెళ్లి సమస్యను పరిష్కరించకపోగా ఇంకా పెద్దది చేస్తావని మురళీ కృష్ణ అంటాడు. ఇక చివరకు ఇద్దరం వెళ్లొద్దని చెప్పుకుని మనసులో ఒకరికి తెలియకుండా ఒకరు వెళ్లాలనుకుంటారు. ఇక శౌర్య, హిమలు అమ్మ ఎందుకు అంత బాధగా ఉంటుంది. ఇప్పుడు నాన్న బాగానే చూసుకుంటున్నాడు కదా అయినా ఎందుకు డల్‌గా ఉంటుందని అనుమాన పడుతుంటారు.
నాన్న మనం లేనప్పుడు అమ్మను తిడుతున్నాడా? అలా అయితే మనం ఉన్నప్పుడు కూడా మాట్లాడుకోరు కదా అని మాట్లాడుకుంటారు. ఏదో జరుగుతోంది అదేంటో నేను తెలుసుకుంటానని శౌర్య, హిమతో అంటుంది. ఏం తెలుసుకుంటావు అని అనగానే, నేను ఆ రహస్యాలను ఈజీగా తెలుసుకోగలను, నాన్న మా నాన్నే అన్న నిజం తెలుసుకోలేదు, నువ్వు మా అమ్మ కూతురివే అనే నిజం కూడా నీకంటే మొదట నేనే తెలుసుకున్నాను, అన్ని తెలుసుకున్న దాన్ని ఇది తెలుకోలేనా అంటుంది శౌర్య. అయితే అదేంటో తొందరగా కనిపెట్టు మనం నానమ్మకు చెబుతాం అంటుంది హిమ. కార్తీక్‌కు దీప కాఫీ తీసుకువస్తుంది. ఏంటి నిన్ను పెట్టొద్దన్నాను కదా అని వారించే లోపు మీరు పెట్టిందే డాక్టర్ బాబు ఫ్లాస్క్‌లో ఉన్నది పోసుకొచ్చాను అంటుంది. ఆ తర్వాత కాఫీ గ్లాసు తీసుకుని తాగతూ.. కాసేపు ఆగి మజ్జిగ తాగు చేసిపెట్టాను అంటాడు. దాంతో దీప మజ్జిగ నేను చేసుకోలేనా డాక్టర్ బాబు.
మజ్జిగ చేసినా చచ్చిపోతానా అనడంతో నవ్వు ఇబ్బంది పడకూడదని చేసిపెట్టానని, అయినా నువ్వు పదే పదే చావు గురించి మాట్లాడకు అని అంటాడు కార్తీక్. మీరు ఆ మాట ఒక్కసారే చెప్పారు, కానీ చచ్చిపోయేది నేను కదా విని వదిలేయలేను అంటుంది దీప. నువ్వు అంత బాధ పడాల్సిన పనిలేదు. ఎందుకంటే రేపో ఎల్లుండో నీకో చిన్న సర్జరీ చేస్తారు అది అయిన వెంటనే ఇంటికి పంపించేస్తారు. మందులు వాడుతూ జాగ్రత్తగా ఉంటే చాలంటాడు కార్తీక్. దీంతో మీరే దగ్గరుండి సర్జరీ చేయిస్తారా? డాక్టర్ బాబు అంటుంది, అవును అయినా అదేం ప్రశ్న అని కార్తీక్ అనగానే.. నిజం చెప్పండి డాక్టర్ బాబు ఇదంతా నా మీద ప్రేమతోనే చేస్తున్నారా అంటుంది దీప. చాలు అనవసరమైన ఆలోచనలేం పెట్టుకోకు అంటు అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. మోనిత ధీనంగా కూర్చుని ఉంటే.. ప్రియమణి వచ్చి ఏంటమ్మా ఏదో జరుగుతోందని అర్థమవుతుంది అంటుంది.
వెంటనే మోనిత ఏంటీ అనగడంతో కార్తీక్ అయ్య దీపమ్మని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని చిన్నారిపాపలా చూసుకుంటుంటే. మీరు కళ్లల్లో నిప్పులు పోసుకుంటారు అనుకున్నా అని అడుగుతుంది. మీ కడుపు బగ్గున మండిపోతుంది అనుకున్నా.. అలాంటిది ఏం జరగకుండా మీరు కూర్చున్నారంటే ఇదంతా నాకు మింగుడు పడటం లేదు అంటుంది. నువ్వు మాట్లాడేవన్నీ నిజలే ప్రియమణీ ఏదో జరుగుతుంది, అదే ఏంటని ప్రియమని అడగ్గా, అదే నిజం అంటుంది మోనిత, అదే ఏం నిజమనగానే మోనిత ‘కార్తీక్ నా కాళ్ల దగ్గరికి వచ్చే’ నిజం అంటు సిరీయస్‌గా అంటుంది మోనిత. దీంతో ప్రియమని భపడుతూ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు నాకు భయంగా ఉందంటు అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇదిలా ఉండగా సౌందర్య దీప దగ్గరికి వస్తుంది. అక్కడి నుంచి ఎందుకు వచ్చేశావ్ అని దీపకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత సౌందర్య వంకే ధీనంగా, బాధతో అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో కార్తీక్ డాక్టర్ ద్వారా అసలు నిజంగా తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment