కార్తీకదీపం జూన్ 26వ ఎపిసోడ్: దీప పిల్లలు కనబడకపోవడంతో కంగారుగా ఆటూ ఇటూ వెతికగా ఎక్కడ కనిపించకపోవడంతో సౌందర్యకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. పిల్లలు ఇక్కడే ఉన్నారని సౌందర్య చెప్పడంతో కాస్తా ఊపిరి పీల్చుకుంటుంది దీప. అనంతరం కార్తీక్ గురించి అడగ్గా ఏం సమాధానం చెప్పకుండా ఉంటాను అత్తయ్య అని ఫోన్ పెట్టెస్తుంది. వెంటనే కార్తీక్ వంక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
దీప లోపలికి వెళ్లిపోవడంతో గతంలో కార్తీక్ ఆమెను అవమానించిన సంఘనలను గుర్తు చేసుకుంటాడు. తన జీవితం ఇలా అయిపోయిందేంటని, శౌర్యను రౌడీలా, హిమను అనాధల చూశాను, తాళి కట్టిన భార్యను కళంకితల చూశాను అంటూ కుమిలిపోతాడు. ఇప్పుడు దీపను ప్రేమగా చూసుకున్న నమ్మదు.. ఎలా అంటూ బాధపడుతుంటాడు కార్తీక్. ఇదిలా ఉండగా పిల్లలు సౌందర్య దగ్గర దీప, కార్తీక్‌ల తీరు గురించి చెప్పి బాధపడుతుంటారు. ఈ మధ్య వాళ్లలో చాలా తేడా వచ్చిందని, వారి పద్దతి మాకు అసలు నచ్చడం లేదని, అమ్మ-నాన్నను చూస్తుంటే విసుగోస్తుందంటూ అసహనం వ్యక్తం చేస్తారు.
వారి మాటలకు సౌందర్య షాక్ అవుతుంది. కన్న తల్లిదండ్రుల మీద విసుగు రావడం ఏంటి అని మనసులో అనుకుంటుంది. అలాగే కార్తీక్ గురించి నిజం తెలిస్తే ఆ విసుగు స్థానంలో అసహ్యం వస్తే కార్తీక్ ఏం అవుతాడని తలుచుకుని కంగారు పడుతుంది. వెంటనే వారితో ‘ఏ అమ్మ-నాన్నలు పిల్లలకు విసుగు వచ్చేలా ఉండరని, మీ అమ్మ-నాన్నకు మీరంటే ప్రాణమని, వాళ్ల మూడ్ బాగాలేదనుకుంటా అందుకు అలా ఉండిఉంటారని శౌర్య, హిమలకు నచ్చజేప్పుతుంది సౌందర్య. మరోవైపు భాగ్యం దీపకు ఈ పరిస్థితి రావడానికి తానే కారణమంటూ చెంపలు కొట్టుకుంటుంది.
ఒకప్పుడు దీప తను హింసించిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. తనే గనుక దీపను బాగా చూసుకుంటే అసలు డాక్టర్ బాబును పెళ్లి చేసుకునేదే కాదనీ, బాగా చదివిస్తే ఈ వంటలు, దోసలు వేసుకొకుండా ఏం చక్క ఓ ఆఫీసరు పెళ్లి చేసుకునేదంటూ తాను చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతుంది భాగ్యం. వెంటనే దీప కాపురం ఎలాగైనా సెట్ చేస్తానని, ఆ మోనితకు బుద్ధి చెప్పి కార్తీక-దీపలు దగ్గరయ్యాలా చూస్తునంటూ గట్టిగా నిర్ణయించుకుంటుంది. ఇక మోనిత వీధి చివరన కారు ఆపి కార్తీక్ రమ్మన్నానని చెప్పి వారణాసిని పంపిస్తుంది. కార్తీక్ బస్తి వాళ్లకు వైద్యం అందిస్తుండగా దీప బట్టలు ఉతికి ఆ పక్కనే ఆరెస్తుంటుంది.
ఇంతలో వారణాసి వచ్చి మోనిత పిలుస్తుందని చెప్పగానే దీప ఒక్కసారిగా ఆగి చూస్తుంది. కార్తీక్ కూడా దీప వంక మెల్లిగా చూస్తాడు. మోనిత మేడమ్ పిలుస్తుందని వీధి చివరన ఉందని చెప్పడంతో కార్తీక్ అక్కడికి వెళతాడు. కార్తీక్ రావడంతో మోనిత నవ్వుతూ పలకరించావా అని మోనిత అనగానే నువ్వు వచ్చావని పులకరించి పలకరించాలా? అని కోపంగా అంటాడు కార్తీక్. కాల్ చేసి రమ్మని ఉంటే వచ్చేవాడిని కదా ఇలా గోలచేసి పోతానంటే వచ్చాను. ఎందుకీ బెదిరింపులు.. నాకు దీపకు మధ్య కంచె వేసే ప్రయత్నమా? నన్ను ఒక పంజరంలో బందించే ప్రయత్నమా? అని కార్తీక్ ఆవేశపడుతాడు.
మరోవైపు దీప చాటుగా ఆటోలో కూర్చుని వాళ్ల మాటల్ని వింటుంది.కార్తీక్ మాటలకు మోనిత ‘నువ్వు నా కోసం రావట్లేదు కాబట్టి.. నేను నీకోసం వచ్చాను.. నన్ను అవైడ్ చేద్దాం అనుకుంటున్నావా’ అంటుంది బాధగా. ‘నాకు తెలియని కొన్ని క్షణాలని నా జీవితంలో బలవంతంగా నువ్వు రాస్తుంటే.. పుస్తకం మూసేసినట్లు నా ఆలోచనలు మూసేశాను’ అని అంటున్న కార్తీక్ మాటలకు దీప ఆశ్చర్యంగా చూస్తుంది. ఇక మోనిత తను సౌందర్య దగ్గరికి వెళ్లోచ్చిన విషయం చెబుతుంది వెంటనే కార్తీక్ ‘మా అమ్మ ఇంకా సంస్కారాన్ని మోస్తూనే ఉందా నాలాగా’ అంటాడు కోపంగా.
అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని మోనిత అనగానే కార్తీక్ నువ్వే నాకు చాలా కొత్తగా కనిపిస్తున్నావని, పరిచయం లేని ప్రమాదంలా కనిపిస్తున్నావు అంటాడు. ‘ఇంతకు ముందు నువ్వు స్నేహితురాలిగా కనిపించేదానివి.. ఇప్పుడు అలా లేవు.. నడిచే విస్పోటనంలా కనిపిస్తున్నావు’ అంటాడు. అలాగే ‘దీప మీద అప్పట్లో ఉన్న కోపంతో నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పిన మాట నిజమే.. కాని అది ఆసరాగా తీసుకుని ఏనాడైనా నిన్ను తాకానా?నీతో ఎప్పుడైనా చనువుగా ప్రవర్తించానా?
మన మధ్య ఈ తప్పు జరిగిందని నువ్వు వచ్చి చెప్పే వరకూ నాకు తెలియలేదు అంటే అందులో నా ప్రమేయం ఎంతవరకూ ఉందనేది నువ్వే ఆలోచించు’ అంటాడు కార్తీక్. ఆ తర్వాత మోనిత తనదైన శైలిలో తెలివిగా కార్తీక్‌కు సమాధానం ఇచ్చి నోరు మూపిస్తుంది. ఆ తర్వాత బయటకు వెళ్లాలి కారు ఎక్కమని అడగ్గానే కార్తీక్ కారు ఎక్కుతాడు. అది చూసి దీప ఆవేశంగా ఇంటికి వెళ్లిపోతుంది. కోపంతో రగిలిపోతూ వారణాసి ఆటోను కడుగుతూ తన కసి చూపిస్తుంది. ఇంతలో సౌందర్య రాగానే ‘మీరా నేను అవసరమైన పనిలో ఉన్నాను మీరు వెళ్లి లోపల కూర్చోండిని అంటుంది’ దీప.
Comments
Please login to add a commentAdd a comment