కార్తీకదీపం జూన్ 7: మోనిత కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి వెళ్లిపోతుంది. మురళీ కృష్ణ దీపకు అన్యాయం జరిగిందనే బాధలో కార్తీక్‌ని కడిగిపాడేస్తాడు. ఆ తర్వాత దీపను వీళ్ల దగ్గర ఉండోద్దని, మన ఇంటికి పొదామని చేయి పట్టుకుంటాడు. మరీ దీప వెళుతుందా? కార్తీక్ మోనిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొనున్నాడో నేటి(సోమవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
మురళీ కృష్ణ వెళ్లిపోదాం పదమ్మా అని దీప చేయి పట్టుకోగానే ఆమె కార్తీక్, సౌందర్యల వంక చూస్తుంది. ఆ తర్వాత తండ్రి చేయిని విడిపించుకుని దండం పెట్టి ఇక్కడి నుంచి వెళ్లిపోండి అన్నట్లు చేయి చాచి చూపింది. దాంతో మురళీ కృష్ణ షాక్ అవుతాడు. మరో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి వెళ్లగానే కార్తీక్, దీపల ఫొటో కనిపిస్తుంది. అది నేలపై విసిరికొట్టి కోపంతో రగిలిపోతుంటాడు. భాగ్యం ఏమైందిని అడగ్గా జరిగిన విషయం చెబుతాడు. దీనికి భాగ్యం కూడా ‘నువ్వు చేసిందే కరెక్ట్ అయ్యా.. నేను కూడా రావాల్సింది మోనితను, అల్లుడిని కలిపి కడిగిపారాశేదాన్ని’ అని కోపంగా అంటుంది.
మరోవైపు కార్తీక్ మోనిత దగ్గరికి వెళతాడు. అక్కడ ‘తప్పు చేశావ్ మోనిత తాగిన మైకంలో నేను ఏదో తప్పు చేయబోతే కనీసం నువ్వైనా నా చెంపలు చెడామడా కొట్టి ఆపాల్సింది కదా. నువ్వు తప్పు చేసిందే కాక నాతో కూడా తప్పు చేయించావు’ అని అసహనం వ్యక్తం చేస్తాడు. దీంతో మోనిత ‘అదేంటి కార్తీక్ తప్పు అంతా నేను చేసినట్లు మాట్లాడుతున్నావు. నువ్వే కదా హిమను తీసుకువస్తే పెళ్లి చేసుకుంటా అన్నావ్, హిమ వచ్చింది. కానీ నువ్వు పెళ్లి ఊసే ఎత్తలేదు. పైగా వెత్తుక్కుంటు నువ్వే వెళ్లి నీ భార్య, పిల్లలని తెచ్చుకున్నావు’ అంటుంది.
అంతేగాక అయినా ఆ రోజు నిన్ను వద్దంటు ఆపాను కానీ నువ్వు పెళ్లి చెసుకుంటానని చెప్పావు అని చెబుతుంది. అలాగే.. ‘పదహారేళ్లుగా నిన్నే ప్రేమిస్తూ మరో మగాడికి నా మనసులో చోటు ఇవ్వలేదు. నీ కోసం, నీ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న నాకు నువ్వు పెళ్లి చేసుకుంటా అనేసరికి ఉప్పోంగి పోయాను. అందుకే నిన్ను దూరం పెట్టలేక నన్ను నేను అర్పించుకున్నానంటూ కన్నీరు పెట్టుకుని దీపలా నన్ను వదిలేయకు కార్తీక్ నీకు దండం పెడతాను’ అంటూ కార్తీక్ కాళ్లపై పడుతుంది. కార్తీక్ అలానే షాక్‌లో చూస్తూ, భారంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
ఇదిలా ఉండగా.. దీప ఒంటరిగా కూర్చుని పూజ రోజు జరిగిందంతా తలుచుకుంటూ ఉంటుంది. కార్తీక్ పెద్ద తప్పు చేశానని, సరిదిద్దుకోలేని నేరం చేశాను అంటు దీప కాళ్లు పట్టుకోబోయింది, మోనిత ప్రెగ్నెంట్ అనగానే షటప్ అంటు తిట్టు పంపిచింది అంతా తలచుకుంటుండగా అక్కడికి సౌందర్య వస్తుంది. కొడుకు చేసిన తప్పుకు కుమిలి కుమిలి ఏడుస్తూ ఇన్నాళ్లు దీప పడ్డ కష్టాలను గుర్తుచేస్తుంటుంది. వాడు నువ్వు ఏ తప్పు చేయాలేదని నిరూపించుకోవడానికి ఇంటి నుంచి వెళ్లిపోయావు, గుడి దగ్గర ప్రసాదాలు తిని బతికావ్.. చివరకు నమ్మే సమయం వచ్చిన అది ఇంత నీచంగానా? వీడి వల్ల ఆ మోనిత కడుపు పండితే నీ సంతానం వాడి సంతానమని నమ్మడమా? ఏంటిది అంటూ దీప భుజంపై వాలి ఏడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment