
తెలుగులో ఒకప్పుడు హీరోగా పలు సినిమాలు చేసి సాయి కిరణ్.. త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రస్తుతం తెలుగులో సీరియల్స్ చేస్తున్న ఇతడు.. తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో యాక్ట్ చేస్తున్న స్రవంతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని సదరు నటి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది.
దిగ్గజ గాయని పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ తల్లిదండ్రులు కూడా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. తండ్రి అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ సినిమాల్లో పాటలు పాడారు. దీంతో సాయికిరణ్ సులభంగానే ఇండస్ట్రీలోకి వచ్చాడు. 'నువ్వే కావాలి' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. దీని తర్వాత 'ప్రేమించు', 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా.. 'జగపతి', 'షిరిడి సాయి', 'నక్షత్రం', 'గోపి గోడమీద పిల్లి' సినిమాల్లో సహాయ పాత్రలు చేశాడు.
(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)
ఓవైపు సినిమాల్లో ఆడపాదడపా నటిస్తూనే సీరియల్ నటుడిగానూ సాయి కిరణ్ బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం ఇలా తెలుగు క్రేజీ సీరియల్స్‌లో కీలక పాత్రలు చేస్తూ బాగానే పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
2010లోనే సాయికిరణ్‌కి ఆల్రెడీ వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని, ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇలా సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు 46 ఏళ్ల సాయికిరణ్.. రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే తోటీనటీనటులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)


Comments
Please login to add a commentAdd a comment