
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో ఇది జరగ్గా.. హీరోయిన్ రష్మిక, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ, 'కల్కి' దర్శకుడు నాగ్ అశ్విన్, దర్శకుడు వంశీ పైడిపల్లి.. ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ పెళ్లికి హాజరయ్యారు. నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.
(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి క్యూట్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక)
శ్రావ్య వర్మకి ఫ్యాషన్ డిజైనర్‌గా టాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. కీర్తి సురేశ్‌తో 'గుడ్ లక్ సఖి' అనే సినిమాకు నిర్మాతగానూ వ్యవహరించింది. ఈమె గత కొన్నేళ్లుగా ప్రముఖ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ప్రేమలో ఉంది. కొన్నాళ్ల క్రితం నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు.
రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు తమ ఇన్ స్టా స్టోరీల్లో శ్రావ్యవర్మ, కిదాంబి శ్రీకాంత్ పెళ్లి ఫొటోలు, వీడియోలని పోస్ట్ చేశారు. దీంతో కొత్త జంటకు పలువురు నటీనటులు, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.
(ఇదీ చదవండి: డబుల్ ఎలిమినేషన్.. గంగవ్వతోపాటు హరితేజ కూడా!)





Comments
Please login to add a commentAdd a comment