కార్తీకదీపం జూ 2: కార్తీక్ రేపు ఏం చెప్పబోతున్నాడో తెలియక గతంలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకుంటు కంగారు పడిపోతుంటుంది దీప. ఇంతలో సౌందర్య వచ్చి ధైర్యం చెప్పి కార్తీక్ కాసేపు మాట్లాడమంటు గదిలోకి పంపిస్తుంది. ఆ సమయానికి కార్తీక్ కవితల పుస్తకం చూస్తు కనిపిస్తాడు. మరోవైపు కార్తీక్ చేసిన అవమానానికి మోనిత రగిలిపోతుంది. కార్తీక్ చేతి ఆ పుస్తకం చూసి దీప ఎల స్పందించనుంది, పగతో ఉన్న మోనిత ఏం చేయబోతుందనేది నేటి(గురువారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
భాగ్యం ఇస్తీ చేసుకుంటూ దీప ఎందుకు ఫోటోను గోడకు పెట్టనివ్వాలేదు? డాక్టర్ బాబు చేసేది కూడా అలానే ఉంటుందిల.. దీప అనుమానం నిజమే అయ్యి ఉంటుందా? లేక డాక్టర్ బాబు మారిపోయి ఉంటాడా అని తనలో తనే మాట్లాడుకుంటుంది. మరోవైపు దీప కార్తీక్ గదికి వెళ్లేసరికి అతడు ఏదో ఆలోచిస్తు మందు తాగడం చూస్తుంది(కానీ కార్తీక్ దీపని అవమానించిన క్షణాలను తలుచుకుని కుమిలిలోతుంటాడు). అలా కార్తీక్‌ను చూసి తలుపు దగ్గరి నుంచే తిరిగి వెనక్కివచ్చేస్తుంది దీప. కింద సౌందర్య భర్త ఆనందరావుతో మాట్లాడుతుంటే దీప కిందికి రావడం గమనించి ఫోన్ కట్ చేస్తుంది. ఏమైంది అని అడగ్గా డాక్టర్ బాబు ఏదో టెన్షన్‌లో ఉన్నంటున్నాడు, మందు తాగుతున్నాడని చెబుతుంది దీప.
దీంతో సౌందర్య షాక్ అవుతుంది. వాడు తాగడం మానేశాడే.. మొన్నెప్పుడో తాగొస్తే.. మనసు బాలేదు అన్నాడు.. మరి ఇప్పుడు ఎందుకు తాగుతున్నాడు అని ఆలోచిస్తుంది. ఇదిలా ఉండగా మోనిత పొద్దున్నే లేచి కాఫీ చేసి ప్రియమణిని లేపి తాగమని ఇస్తుంది. దీంతో షాక్ అయిన ప్రియమణి కోపం వస్తే కొట్టండి, తిట్టండి కానీ ఇలాంటివి చేయకండని అని అనడంతో.. భవిష్యత్తులో కార్తీక్‌కి పెట్టి ఇవ్వాలిగా.. ప్రాక్టీస్‌గా ఉంటుందని పెట్టాను చెబుతుంది. ఆ తర్వాత ఆ కాఫీ తాగి పైన ఉన్న తన చీర ఇస్తీ చేయి అంటు ‘నేను కార్తీక్ దగ్గరకు వెళ్లాలి.. త్వరగా చేసిపెట్టు అంటుంది. ప్రియమణి మనసులో.. ‘ఈమె హడావుడి చేస్తే దీపమ్మ కొంప ముచ్చేలానే ఉంది’ అనుకుంటుంది.
ఇక అటు సౌందర్య ఇంట్లో పూజకు అన్నీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. భాగ్య కాలు జారిపడిందని, కాలు నెప్పి పెడ్డటంతో రాలేదని మురళీ కృష్ణ మాత్రమే వస్తాడు పూజకు. ఇక అటు దీప, ఇటు కార్తీక్‌లు వేరు వేరు రూమ్స్‌లో రెడీ అవుతూ ఉంటారు. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెప్పబోతున్నాడోనని టెన్షన్ పడుతూ ఉంటుంది. కార్తీక్ పంచెకట్టుకుని. శ్రీ శ్రీ పుస్తకాన్ని గిఫ్ట్ ప్యాక్ చేసి.. దానిపై స్లిప్ అంటించి ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి.. మళ్లీ ఆ స్లిప్ చించి ‘దీపకు ప్రేమతో కార్తీక్’ అని రాసి మురిసిపోతుంటాడు.
ఇంతలో కార్తీక్‌కు ఫోన్ రావడంతో ఆ గిఫ్ట్ బెడ్ మీద పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. అయితే దీపకు శ్రీశ్రీ కవితలంటే పచ్చి. ఆ పిచ్చి కారణంగానే కార్తీక్ దీపను అవమానించేందుకు దారితీసింది. దీంతో అప్పటి నుంచి శ్రీశ్రీ కవితలు వింటేనే రగిలిపోయే కార్తీక్ అదే శ్రీశీ కవిత పుస్తకాన్ని దీపకు బహుమతి ఇచ్చి.. తనలోని అనుమానం నిజం కాదని చేప్పాలని అనుకుంటున్నాడు. అయితే ఆ ఫోన్ ఎవరి దగ్గరి నుంచి వచ్చింది. ఈలోపు మోనిత ఎంట్రి ఇచ్చి కార్తీక్ ప్లాన్ మొత్తం తారుమారు చేయనుందా అనేది రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment