కార్తీకదీపం జూన్ 4: పూజకు అన్నీ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. దీప రెడీ అవుతూనే కార్తీక్ ఏం చెబుతాడోనన్న టెన్షన్‌తో ఉంటుంది. కార్తీక్ దీపకు గిప్ట్ ఇవ్వాలని శ్రీశ్రీ పుస్తకాన్ని ప్యాక్ చేసి.. ‘దీపకు ప్రేమతో డాక్టర్ బాబు’ అని రాసి పెట్టుకుంటాడు. అదే టైమ్‌కి మోనిత తన ఇంట్లో పూజకు వెళ్లడానికి బాగా రెడీ అవుతుంది. ప్రియమణీతో త్వరలోనే పప్పు అన్నం పెడతానంటు ఏవేవో కబుర్లు చెబుతుంది. ఇక పూజాలో దీపకు చెబుతాన్న విషయం కార్తీక్ చెప్పనున్నాడా? లేదా ఇలోపు మోనిత ఎలాంటి ట్వీస్ట్ ఇవ్వబోతోంది అనేది నేటి(శుక్రవారం) ఎపిసోడ్ ఇక్కడ చదవండి..
సౌందర్య ఇంట్లో పూజకు అన్ని రేడి చేస్తారు. దీంతో పూజారి పూజకు టైం అవుతుంది అనడంతో అంతా కిందకి వస్తారు. కానీ కార్తీక్ మాత్రం కిందకు రాడు. దీంతో కార్తీక్ రాకపోవడంతో సౌందర్య ఆదిత్యను అన్నయ్య ఎక్కడ అని అడగడంతో ఇంకా గదిలోనే ఉన్నాడంటూ పైకి చూస్తుండా అప్పడే కార్తీక మెట్లు తిగుతూ వస్తాడు. వస్తూనే క్షమాపణలు ఎలా అడగాలో తెలియడం లేదంటు దీప దగ్గరికి వెళ్లతాడు. వెంటనే కార్తీక్‌కు తను దీపకోసం పెట్టిన గిఫ్ట్ గుర్తొచ్చి దీపకు ఇష్టమైన శ్రీశ్రీ పుస్తకం ఇచ్చి క్షమాపణలు కోరతాను అంటు వెళ్లి తెద్దామని వెనక్కి వెళ్లబోతాడు. దాంతో సౌందర్య ‘టైమ్ అవుతుందిరా.. దేవుడికి దన్నం పెట్టుకుని కూర్చోండి’ అంటుంది.
వెంటనే కార్తీక్ వెనక్కి తిరిగి.. దీపవైపు చూస్తూ దేవుడికి కాదు మమ్మీ.. ముందు దేవతకు దండం పెట్టుకోవాలి అంటు దీప ముందు మోకాళ్లపై కూర్చుని తన కాళ్లకు దండం పెట్టబోతాడు కార్తీక్. పడ్డాడు. దీప వెనక్కి జరిగిపోతుంది కంగారుగా. అంతా షాక్‌లో ఉంటారు. తెలియకుండా నవ్వుముఖాలుగా ఉంటాయి ఆదిత్య, శ్రావ్య, దీప తండ్రి, సౌందర్య అంతా ఆనందంతో ముఖాలు వెలిగిపోతాయి. ‘నేను చేసిన తప్పుకు శిక్ష ఏ కోర్టులోనూ ఏ జడ్జ్ వెయ్యలేడు..బయటికి కనిపించని చెప్పుకోలేని నేరం చేశాను.. మాటలతో గుండెల్లో పొడిచి పొడిచి చిత్రవథ చేశాను. అందరినీ క్షోభ పెట్టి జీవితాలతో ఆడుకున్నాను.. నేను చేసిన అపరాధం హత్యానేరం కన్నా పెద్దది. దానికి ఉరిశిక్షవేశానా సరిపోదు.. నేను సరిదిద్దుకోలేని తప్పు చేశాను దీప’ అని కార్తీక్ క్షమాపణలు చెప్పడంతో దీప ఎంటో అర్థం కానట్లు అయోమయంలో ఉండిపోతుంది.
సరిగ్గా అప్పుడే మోనిత సడెన్ ఎంట్రీ ఇస్తుంది. రాగానే ‘అంత తప్పు నువ్వేం చేశావ్?’ అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ షాక్‌తో వెనక్కి తిరిగి చూస్తు దీప పక్కన నిలబడతాడు. ‘చెప్పు కార్తీక్ అంత పెద్ద తప్పు ఏం చేశావ్? తప్పు తెలుసుకున్నావ్.. సరిదిద్దుకుంటావ్.. ఇన్నాళ్లు నువ్వు పిల్లలు పుట్టరనే అపోహలో ఉన్నావ్.. రిపోర్ట్స్ అలా వచ్చాయ్.. అందుకు నువ్వేం చేస్తావ్? ఎవరిదో రిపోర్ట్ నీవనుకుని ల్యాబ్ టెక్నీషియన్ మార్చేస్తే. నువ్వేం చేస్తావ్? అది మానవ తప్పిదం.. అందులో నిన్ను తప్పు బట్టడానికి ఏం లేదు’ అంటుంది మోనిత. మోనిత మాటలకు అంతా బిత్తరపోతారు. వెంటనే మోనితే మాట్లాడుతూ.. ‘కంగ్రాట్స్ కార్తీక్.. నీకు పిల్లలు పుట్టే యోగం ఉందని ఇవాలే తేలింది.. 100 పర్సెంట్ నీకు ఆ అర్హత ఉంది.. ఇది సంతోషించాల్సిన విషయమే కాదా? దీనికి క్షమాపణలు కోరుకోవడం దేనికి? నీకు పిల్లలు పుడతారు కార్తీక్.. హిమ, సౌర్య నీ కన్నబిడ్డలు. నీ సంతానమే’ అంటుంది నవ్వుతూ.
‘మోనితా నువ్వేం మాట్లాడుతున్నావ్?’అంటాడు కార్తీక్ అయోమయంగా. ‘శుభవార్త మోసుకొచ్చాను కార్తీక్.. అసలు అందరికీ ఈ విషయం స్వీట్స్ తినిపించి చెప్పాలనుకున్నాను.. కానీ పట్టరాని ఆనందంలో ఈ వార్త అందరికీ అందజెయ్యాలనే కంగారులో స్వీట్స్ తీసుకుని రావడం మరిచిపోయాను. పోనీలెండీ.. ఇక్కడ అక్షింతలు ఉన్నాయిగా.. అవి నా నెత్తిన వేసి నన్ను ఆశీర్వదించండి ఆంటీ’ అంటూ సౌందర్య కాళ్ల మీద పడుతుంది మోనిత. అంతా షాక్‌లోనే ఉండిపోతారు. సౌందర్య అయోమయంగా.. ‘వాడికి పిల్లలు పుడతారని నువ్వు చెప్పడమేంటీ? నేను నిన్ను ఆశీర్వదించడం ఏంటీ? నాకేం అర్థం కావట్లేదు’ అంటుంది.
వెంటనే పైకి లేచిన మోనిత.. నవ్వుతూ.. ‘నేను నెల తప్పాను ఆంటీ.. ఎస్ అయామ్ ప్రెగ్నెంట్.. నా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది..’ అంటుంది. వెంటనే సౌందర్య ఆవేశంగా.. ‘మోనితా.. డోంట్ ఇరిటేట్ మీ.. ఏం చెప్పాలనుకుంటున్నావ్..’ అని అరుస్తుంది. ‘ఇంతచెప్పినా మీకు అర్థం కాకపోవడానికి మీరేమైనా చిన్న పిల్లా ఆంటీ? మీ అబ్బాయి వల్ల నేను గర్భవతిని అయ్యాను’ అని చెప్పడంతో అందరి మొహాలు తెల్లబోతాయి. ఇక ఆ తరువాత ఏం జరగనుందనేది రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం.
Comments
Please login to add a commentAdd a comment