పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే? | Krishna Mukunda Murari Serial Actress Prerana Wedding Video And Trending On Social Media - Sakshi
Sakshi News home page

Prerana Kambam Marriage Video: వివాహ బంధంలోకి 'కృష్ణ ముకుంద మురారీ' బ్యూటీ.. వీడియో వైరల్

Published Wed, Nov 22 2023 6:13 PM | Last Updated on Wed, Nov 22 2023 7:30 PM

Krishna Mukunda Murari Serial Actress Prerana Wedding Video - Sakshi

ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నీమధ్య మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు. బిగ్‌బాస్ ఫేమ్ మానస్ పెళ్లి కూడా జరగనుంది. ఇప్పుడు ఓ తెలుగు సీరియల్ హీరోయిన్ కూడా పెళ్లి చేసేసుకుంది. కొన్నాళ్ల ముందు నిశ్చితార్థం చేసుకుని, కాబోయే భర్తని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఎవరిని పెళ్లి చేసుకుంది?

(ఇదీ చదవండి: కాస్ట్‌లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?)

తెలుగు సీరియల్స్‌కి సినిమాలకున్నంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలా 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్‌తో తెలుగమ్మాయి ప్రేరణ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పుట్టింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగిందంతా బెంగళూరులో. యాక్టింగ్‌పై ఇష్టంతో పలు కన్నడ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ సీరియల్‌తో హీరోయిన్ అయిపోయింది. క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీపాద అనే క్రురాడిన పెళ్లి చేసుకుంది.

అక్టోబరు చివరలో నిశ్చితార్థం చేసుకున్న నటి ప్రేరణ.. ఇప్పుడు కన్నడ సంప్రదాయం ప్రకారం శ్రీపాదని పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె నటి, కానీ భర్తకి మాత్రం ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు ఉంది. కాకపోతే అతడి హీరోలానే హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. దీంతో సీరియల్ అభిమానులు.. కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు.

(ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement