prerana
-
బిగ్‌బాస్ 8: టాప్ 5 ఫైనలిస్టుల బ్యాక్‌గ్రౌండ్ ఇదే! (ఫోటోలు)
-
‘బిగ్‌బాస్ సీజన్ 8’ గ్రాండ్ ఫినాలే...హైలెట్స్ (ఫొటోలు)
-
ప్రేరణకు బిగ్‌బాస్ సర్ప్రైజ్.. హౌస్‌లోకి ఎవరొచ్చారంటే?
ప్రస్తుతం బిగ్‌బాస్ హౌస్‌లో ఎమోషనల్ వీక్ నడుస్తోంది. కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిని పంపిస్తూ ఫుల్ ఎమోషనల్ వీక్‌గా మార్చేశారు. తాజాగా మరో కంటెస్టెంట్ కుటుంబ సభ్యుడు బిగ్‌బాస్ హౌస్‌లో సందడి చేశాడు. హౌస్‌లో ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ప్రేరణ భర్త ఇవాళ హౌస్‌లో అడుగుపెట్టాడు. తన భర్తను చూసి ఆనందంలో గంతులేసింది ప్రేరణ.(ఇది చదవండి: 40 రోజులుగా బ్లీడింగ్.. నేను చేసిన తప్పు ఎవరూ చేయకండి: స్రవంతి)ఆ తర్వాత చాలా బాగా అడుతున్నావంటూ ప్రేరణను మరింత ఎంకరేజ్ చేశాడు ఆమె భర్త. నువ్వు విన్నర్‌గా తిరిగి రావాలంటూ భార్యకు సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఈ జంట హౌస్‌లో కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత ఇంటి సభ్యులందరితో సరదాగా మాట్లాడారు. చివర్లో భార్య, భర్తలిద్దరితో గేమ్ ఆడించాడు బిగ్‌బాస్. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇవాళ హౌస్‌లో ఏం జరిగిందో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. -
'ఇక ఆపేద్దామన్న హరితేజ.. నా మీదే ఎందుకంత కోపం'
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ప్రస్తుతం తొమ్మిదో వారం నడుస్తోంది. గతవారంలో నయని పావని హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. సోమవారం వచ్చిందంటే హౌస్‌లో మాటల యుద్ధమే. ఎందుకంటే నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యేది ఆ రోజు నుంచే. అయితే ఈసారి బిగ్‌బాస్ ఓ చిన్న కండీషన్ పెట్టాడు. ఎప్పుడూ ఇద్దర్ని నామినేట్ చేయాలని చెప్పే బిగ్‌బాస్ ఈసారి మాత్రం ఒక్కరిని మాత్రమే నామినేట్ చేయాలన్నాడు.అలా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. పలు కారణాలతో ఈ వారం యష్మి, ప్రేరణ, గౌతమ్, నిఖిల్, హరితేజ, విష్ణుప్రియ, పృథ్వీ నామినేట్ అయ్యారు. అయితే ఒక్క రోజులోనే ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. మంగళవారం కూడా నామినేషన్స్ కొనసాగాయి. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఈ రోజు నామినేషన్స్ ప్రక్రియలో హరితేజ, ప్రేరణ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇప్పటివరకు జరిగిందంతా చాలు.. ఇక నుంచి ఆపేద్దాం.. నోరు బాగుంటే ఊరు బాగుంటది' అంటూ ప్రేరణను అడిగింది హరితేజ. ఏదైనా స్ట్రాంగ్ పాయింట్ ఉంటే నామినేట్ చేసుకుందాం. అంతేకానీ మనిద్దరికీ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ మాటలకు హరితేజను అభినందిస్తూ మాట్లాడింది ప్రేరణ. ఆ తర్వాత మళ్లీ హరితేజను ఫేక్ అని ప్రేరణ అనడంతో మరింత మాటల యుద్ధం నడిచింది. ప్రతిసారి ఫేక్ అనొద్దు.. మాటలు ముందు సక్కగా మాట్లాడు అంటూ హరితేజ వాదించింది. దీంతో వీరిద్దర మధ్య జరిగిన వార్ పూర్తిగా తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
'నువ్వు ఎవరూ చెప్పడానికి?'.. విష్ణు ప్రియకు ప్రేరణ వార్నింగ్!
తెలుగులో బిగ్‌బాస్ ప్రస్తుతం ఎనిమిదో వారం నడుస్తోంది. గతవారం మణికంఠ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. ఇక సోమవారం మొదలవగానే నామినేషన్స్ గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ హౌస్‌లో ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. ఇక ఇవాళ నామినేషన్స్ ప్రక్రియ ఓ రేంజ్లో జరిగినట్లు తాజా ప్రోమో చూస్తేనే తెలుస్తోంది. ఆ వివారాలేంటో చూసేద్దాం.ఇకపోతే మంగళవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్‌హాట్‌గా సాగింది. విష్ణు ప్రియ, యష్మి గౌడ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఏడు వారాలైనా నీ సొంత గేమ్ ఎక్కడ కనిపించట్లేదు.. కొన్ని మాటలు కూడా చాలా హార్ష్‌గా ఉంటాయని విష్ణుప్రియను యష్మి నామినేట్ చేసింది. వీరి మధ్యలో అనుకోకుండా ప్రేరణ ఎంట్రీ ఇచ్చింది. దీంతో విష్ణుప్రియతో గొడవ తారాస్థాయికి చేరింది. నా పేరు తీయకుండా మాట్లాడాలని ప్రేరణ అనడంతో..అలా అయితే హౌస్ నుంచి వెళ్లిపో అంటూ విష్ణుప్రియ వాదించింది. దీంతో నువ్వు ఎవరూ చెప్పడానికి.. నా గురించి మాట్లాడకు అంటూ ప్రేరణ గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.ఆ తర్వాత మెహబూబ్‌ను నిఖిల్, యష్మి పలు కారణాలు చెప్పి నామినేట్ చేశారు. ఆ తర్వాత పృథ్వీని ముక్కు అవినాశ్ నామినేట్ చేశాడు. బిగ్‌బాస్ రావడానికి మనీ తీసుకుంటావ్.. కానీ బిగ్‌బాస్ ఇస్తే తీసుకోవు అంటూ అవినాశ్ ప్రశ్నించాడు. ఆ తర్వాత మ్యాటర్ కాస్తా పృథ్వీ గడ్డం మీదకు వెళ్లింది. యాభై వేలు ఇచ్చినా నా గడ్డం తీయను బ్రో అంటూ పృథ్వీ గట్టిగానే అరిచేశాడు. మీరేందుకు యాభై వేలకు ఓకే చెప్పారంటూ అవినాశ్‌ను పృథ్వీ అడిగాడు. అది నా ఇష్టమని అవినాశ్ అనడంతో.. ఇది నా ఇష్టం అంటూ పృథ్వీ వాదించడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో మరెంత హాట్‌హాట్‌గా సాగిందో తెలియాలంటే ఇవాల్టి ఫుల్ ఎపిసోడ్ చూసేయండి. కాగా.. ఈ వారం నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, విష్ణుప్రియ, మెహబూబ్, నయని పావని, హరితేజ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. మొన్నీమధ్య మెగాహీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్నాడు. బిగ్‌బాస్ ఫేమ్ మానస్ పెళ్లి కూడా జరగనుంది. ఇప్పుడు ఓ తెలుగు సీరియల్ హీరోయిన్ కూడా పెళ్లి చేసేసుకుంది. కొన్నాళ్ల ముందు నిశ్చితార్థం చేసుకుని, కాబోయే భర్తని పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు అతడితో ఏడడుగులు వేసింది. ఇంతకీ ఎవరా బ్యూటీ? ఎవరిని పెళ్లి చేసుకుంది? (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) తెలుగు సీరియల్స్‌కి సినిమాలకున్నంత క్రేజ్ ఉందని చెప్పొచ్చు. అలా 'కృష్ణ ముకుందా మరారీ' సీరియల్‌తో తెలుగమ్మాయి ప్రేరణ కాస్త గుర్తింపు తెచ్చుకుంది. ఈమె పుట్టింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ.. పెరిగిందంతా బెంగళూరులో. యాక్టింగ్‌పై ఇష్టంతో పలు కన్నడ సినిమాలు చేసింది. ఆ తర్వాత తెలుగులో ఈ సీరియల్‌తో హీరోయిన్ అయిపోయింది. క్యూట్ యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు శ్రీపాద అనే క్రురాడిన పెళ్లి చేసుకుంది. అక్టోబరు చివరలో నిశ్చితార్థం చేసుకున్న నటి ప్రేరణ.. ఇప్పుడు కన్నడ సంప్రదాయం ప్రకారం శ్రీపాదని పెళ్లి చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈమె నటి, కానీ భర్తకి మాత్రం ఇండస్ట్రీతో సంబంధం లేనట్లు ఉంది. కాకపోతే అతడి హీరోలానే హ్యాండ్సమ్గా ఉన్నాడు. దీంతో సీరియల్ అభిమానులు.. కొత్త జంటని ఆశీర్వదిస్తున్నారు. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ కొడుక్కి ఎంగేజ్మెంట్.. ఫొటోలు వైరల్!) -
ఇటీవలే సమాధి వద్ద భార్య సీమంతం.. తండ్రిగా ప్రమోషన్ పొందిన హీరో
కన్నడ హీరో ధ్రువ సర్జా ఇంట పండగ వాతావరణం నెలకొంది. ధ్రువ సర్జా- ప్రేరణ శంకర్ దంపతులు రెండోసారి తల్లిదండ్రులయ్యారు. వినాయక చవితి(సెప్టెంబర్ 18న) రోజు ప్రేరణ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ధ్రువ సర్జా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 'సాధారణ ప్రసవం జరిగింది. బేబీ పుట్టింది' అని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఇటీవల ధ్రువ సర్జా.. తన భార్యకు ఘనంగా సీమంతం ఫంక్షన్ చేసిన సంగతి తెలిసిందే! శ్రీకృష్ణ జన్మాష్టమి రోజే తన భార్యకు సీమంత వేడుక నిర్వహించాడు. ఈ వేడుకను తన అన్నయ్య స్వర్గీయ చిరంజీవి సర్జా సమాధి ఉన్న ఫామ్ హౌస్‌లో సెలబ్రేట్ చేశాడు. అన్నయ్య ఆశీర్వాదాలు తన కుటుంబానికి ఉండాలనే ఈ విధంగా సెలబ్రేషన్స్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) చదవండి: అసిస్టెంట్ పెళ్లిలో ధనుశ్ సందడి.. వీడియో వైరల్ -
60 నిమిషాల్లో మూడు గ్యాడ్జెట్స్‌కి ఒకేసారి చార్జింగ్
అమ్మాయిలు విజయాలు సాధించటంలో మెరుపు వేగంతో ముందుముందుకు పరుగులు తీస్తూ, లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. ఒలింపిక్స్‌లో భారతదేశానికి పతకాలు తెస్తున్నవారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కొత్త పరికరాన్ని కనిపెట్టిన ప్రేరణ వాడేకర్ భారతీయ మహిళల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటుతున్నారు. బెంగళూరుకు చెందిన ప్రేరణ వాడేకర్ పవర్ బ్యాంక్‌ని పోలిన లిథీనియమ్ అయాన్ పోర్టబుల్ బ్యాటరీ కనిపెట్టి, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రతి సంవత్సరం ఇచ్చే ‘వైస్ చాన్సెలర్స్ సోషల్ ఇంపాక్ట్’ అవార్డును అందుకున్నారు. 2010లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఆండ్రూ హ్యామిల్టన్ ప్రారంభించిన ఈ అవార్డును, ఆ విశ్వవిద్యాలయంలో ప్రతిభ కనపరుస్తూ, సమాజంలో మంచి మార్పును తీసుకువచ్చే విద్యార్థులకు అందిస్తారు. ఈ సంవత్సరం ఈ అవార్డును ప్రేరణ వాడేకర్ అందుకున్నారు. నేను ఊహించుకున్నాను... ప్రేరణ వాడేకర్ ‘జీవ గ్లోబల్’ ప్రారంభించి, ఆ సంస్థ ద్వారా ఆక్స్ఫర్డ్షైర్కి వలస వచ్చిన వారికి పది సంవత్సరాలుగా అండగా ఉంటున్నారు. వారికి వ్యక్తిగతంగాను, వృత్తిపరంగాను కావలసిన సహాయసహకారాలు అందిస్తున్నారు. ‘‘జీవ అంటే శక్తిని ఇచ్చేది. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలలో బలహీనపడిన వారికి శక్తినిస్తుంది మా సంస్థ. ఎనర్జీ (కరెంట్) అతి తక్కువ ధరలో, అందరూ వాడుకునేలా, అందరికీ అందుబాటులో ఉండే ప్రపంచాన్ని నేను చాలా సంవత్సరాలుగా ఊహించుకుంటున్నాను’’ అంటున్న ప్రేరణ.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (ఐఐఎం) నుంచి ‘పబ్లిక్ పోలసీ’లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఇప్పుడు తాను తయారుచేసిన పరికరం గురించి, ‘‘ఈ బ్యాటరీ ద్వారా కేవలం అరవై నిమిషాలలో మూడు గ్యాడ్జెట్స్‌ని ఒకేసారి చార్జింగ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఒక వస్తువును బ్యాటరీ ద్వారా చార్జింగ్ చేయటానికి కనీసం ఐదు గంటల సమయం పండుతుంది. కరెంటు సప్లయి ఉన్న ఏ ప్రదేశంలోనైనా ఈ పరికరం పనిచేస్తుంది’’ అంటూ ఎంతో సంబరంగా చెప్పారు ప్రేరణ వాడేకర్. ఈ పరికరం సహాయంతో, హెల్త్ సెంటర్లలో వ్యాక్సినేషన్ ఉన్న రిఫ్రిజిరేటర్ని సైతం చార్జింగ్ చేసుకోవచ్చు. లైట్లు, చిన్న చిన్న టేబుల్ ఫ్యాన్లను కూడా చార్జింగ్ చేసుకోవచ్చు. సుదూర ప్రాంతాలలో ఉండేవారు, గిరిజనులు సైతం దీని ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. అమ్మ చెప్పింది.. ప్రేరణ తల్లి నీనా వాడేకర్. ఆవిడ కూడా బాగా చదువుకున్నారు. సమాజ అభివృద్ధికి సైన్స్ ఎంతగానో తోడ్పడుతుందని తల్లి చిన్ననాటి నుంచి ప్రేరణకు తరచుగా చెప్పేవారు. ‘‘అమ్మ నన్ను కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తి చేయమంది. నా వల్ల సమాజానికి ఎంతో కొంత మేలు జరగాలని చిన్నతనం నుంచి చెప్పేది. అహ్మదాబాద్ ఐఐఎంలో చదువుకునే రోజుల్లో మా ప్రొఫెసర్ అనిల్ గుప్తా భారతీయులలో దాగి ఉన్న ప్రతిభను ప్రశంసించేవారు. ఆయన మాటలు నాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచాయి’’ అంటూ ఎంతో ఆనందంగా చెబుతారు ప్రేరణ. తోపుడు బండి వారి నుంచి... కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ విధించిన సమయంలో, తోపుడు బండివారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలనుకున్నారు. వారికి ఎలాగైనా నా వల్ల సహాయం జరగాలనుకున్నాను’’ అంటున్న ప్రేరణకు పది సంవత్సరాలుగా వివిధ చిరు వ్యాపారుల గురించి పూర్తి అవగాహన ఉంది. తాను తయారుచేసిన పరికరాన్ని ముందుగా తోపుడు బండి వారికి అందచేసి, వారి నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ద్వారా పరికరాన్ని ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ, వారు సౌకర్కయంగా వాడుకునే స్థాయికి తీసుకువచ్చారు. త్వరలో మార్కెట్లోకి... బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ అయిన లివా ఇన్నొవేషన్స్ సంస్థ ఈ ప్రొడక్ట్‌ను కమర్షియల్‌గా అందుబాటులోకి తీసుకు రావడానికి ముందుకు వచ్చారు. ‘‘నేను కనిపెట్టిన ఈ పరికరం అందరికీ అంటే ఆర్థికంగా దిగువస్థాయి వారికి కూడా అందుబాటులోకి రావాలన్నదే నా లక్ష్యం’’ అంటున్నారు ప్రేరణ వాడేకర్. ఈ పరికరాన్ని అధిక స్థాయిలో ఉత్పత్తి చేస్తే ఒక సోలార్ చార్జిబుల్ పరికరం తక్కువ ధరకి అందరికీ అందుబాటులోకి రాగలదని, అంతర్జాతీయంగా దీనిని అందరూ వాడుకోగలుగుతారని ఇందు కోసం ప్రభుత్వ కార్పొరేట్ రంగాలు సహకారం అందించాలని ప్రేరణ అంటున్నారు. -
దాల్చిని @ యాప్
మహిళలు ఆఫీసులలో పనులను సమర్థవంతంగా పూర్తి చేయవచ్చు. గొప్ప గొప్ప ప్రాజెక్టులను అవలీలగా క్లియర్ చేయవచ్చు. కానీ, వారు ఇంటికి తిరిగి రాగానే కుటుంబసభ్యుల నుంచి ‘తినడానికి ఏముంది?’ అనే సాధారణ ప్రశ్నను చాలా మంది ఎదుర్కొంటుంటారు. ఉదయం పనికి వెళ్ళే ముందు కూడా ఆ రోజుకు కావాల్సినవన్నీ అమర్చిపెట్టి వెళుతుంటారు. వంట అనేది మహిళలకు ఓ పెద్ద సమస్య. దీనినే తన వ్యాపారానికి అవకాశంగా మలుచుకుంది ప్రేరణ. దాల్చిని పేరుతో మొబైల్ యాప్, ఐఓటి వెండింగ్ మెషిన్ల ద్వారా ఇంటి వంటను అందిస్తోంది. 2009లో ఐఎమ్‌టిలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సులో రజత పతకం సాధించిన ప్రేరణకు ఎనిమిదేళ్ల కార్పొరేట్ అనుభవం ఉంది. ఒత్తిడి నుంచి ఉపశమనం మహిళలకు రోజువారీ వంట ఒత్తిడి నుండి ఉపశమనం ఇవ్వడమే కాకుండా ఇంట్లో వండిన ఆరోగ్యకరమైన భోజనాన్ని దాల్చిని ద్వారా అందిస్తోంది ప్రేరణ. భార త సంప్రదాయ ఇళ్లలో వండిన ఆహారం కోసం ఏర్పాటు చేసిన భౌతిక మార్కెట్ ఇది. ఐఓటి ఆధారిత వెండింగ్ మెషిన్ల ద్వారా టిఫిన్ సేవల నెట్‌వర్క్‌నూ అందిస్తోంది. 36 ఏళ్ల ప్రేరణ మాట్లాడుతూ– ‘ఇంట్లో వండిన భారతీయ వంటకాలు, రొట్టెలు, స్నాక్స్ వంటివి ఎక్కడైనా, ఎప్పుడైనా అందుబాటులో ఉంచే లక్ష్యంతో దాల్చిని ప్రారంభమైంది’ అని వివరించింది. వైవిధ్యమైన పాత్రలు వ్యాపారిగా, వృత్తి నిపుణురాలిగా, ఆరేళ్ల అమ్మాయికి తల్లిగా ప్రేరణ తన పని గంటల ప్రకారం సమయానుసారంగా కుటుంబసభ్యులకు ఆహారాన్ని పంపిణీ చేయడంలో ఇబ్బందిని గుర్తించింది. దీనినే అవకాశంగా మలుచుకున్న ప్రేరణ... చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. ‘పట్టణ వయోజన శ్రామిక జనాభాలో 69 శాతానికి పైగా పని కోసం బయల్దేరినవారికి ఇంట్లో వండిన ఆహారం లభించదు. హోమ్ టిఫిన్ సేవల్లో ప్రజలు మరింత రుచి, నాణ్యత, నమ్మకం కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోసమే దాల్చిని ఏర్పాటయ్యింది’ అని వివరిస్తుంది ప్రేరణ. మహిళలే కీలకం ఐఓటీ వెండింగ్ మెషన్ దాల్చిని మెనూలో సోయా మసాలా క్రాకర్స్, మహారాష్ట్ర చివ్డా, మామ్ స్టైల్ అజ్వైని పరాఠా, హెల్తీ దాల్ పరాఠా, పార్సీ కేక్ రస్క్, గ్రీన్ బఠానీ మినీ సమోసా, గోబీ మంచూరియా, వెజిటబుల్ బిర్యానీ, మల్టీగ్రెయిన్ కుకీలు, సాస్‌తో వడాపావ్‌లు ఉన్నాయి. ఎంపిక చేసుకున్న తర్వాత, ఆర్డర్ ద్వారా చెల్లింపులు ఉంటాయి. యాప్ ద్వారా ‘ఆర్డర్లలో ముప్పై శాతం రాత్రి 10 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు స్వీకరిస్తాం. వ చ్చిన ఆర్డర్ల ప్రకారం ఆ ప్రాంతంలోని ఇంటి మహిళలకు సమాచారం చేరుతుంది. వారి ద్వారా సమయానుకూలంగా ఆర్డర్ చేసినవారికి వంటను అందిస్తాం. కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంలో మహిళదే కీలకమైన బాధ్యత. పనిచేసే మహిళా నిపుణులకు ఇది సవాల్ లాంటిది. ఇతర వృత్తులలోని మహిళలకు వంట చేసే బాధ్యతను పంచుకునేందుకు తమ ఇంటి నుండి టిఫిన్ సేవలను నడుపుతున్నవారికి దాల్చిని అవకాశం కల్పిస్తుంది. ఇళ్లలోని మహిళా చెఫ్‌లకు అవకాశాలు కల్పించే మంచి యాప్ ఇది. తద్వారా వారు గుర్తింపును పొందుతున్నారు’ అని వివరిస్తుంది ప్రేరణ. -
ధృవ్‌కి కరోనా
ప్రముఖ నటుడు అర్జున్ మేనల్లుడు, హీరో ధృవ్ సర్జా తనకు, తన భార్య ప్రేరణకు కరోనా లక్షణాలు కనిపించాయని బుధవారం తెలిపారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ‘‘త్వరలోనే మేమిద్దరం పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తాం. అయితే ఈ మధ్యకాలంలో మమ్మల్ని కలిసినవార ందరూ దయచేసి కరోనా టెస్ట్ చేయించుకోండి. నాతో తిరిగినవారందరూ ఆరోగ్యంగా, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ధృవ్. ఇదిలా ఉంటే ఇటీవల హఠాన్మరణం పొందిన చిరంజీవి సర్జా సోదరుడే ధృవ్ సర్జా. ఇక కన్నడ పరిశ్రమలో కరోనా బారిన పడిన మరో సెలబ్రిటీ సుమలత. తనకు పాజిటివ్ వచ్చిన విషయాన్ని ఆమె ఇటీవల సోషల్ మీడియా ద్వారా తెలిపిన విషయం గుర్తుండే ఉంటుంది. నిర్మాత రాక్‌లైన్ వెంకటేశ్‌కి కూడా కరోనా లక్షణాలు కనిపించాయని వార్త వచ్చింది. -
వేడుకగా ధ్రువ, ప్రేరణ వివాహం
బొమ్మనహళ్లి : చందనసీమ ప్రిన్స్ ధ్రువసర్జా, ఆయన బాల్య స్నేహితురాలు ప్రేరణ శంకర్ వివాహం ఆదివారం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఇక్కడి జేపీ నగరలోని సంస్కృత బృందవనలోని కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉదయం ఉదయం 7.15 గంటల నుంచి 7.45 గంటల మధ్య వృశ్చిక లగ్నంలో ధ్రువసర్జా, ప్రేరణలు దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టారు. గౌడ సాంప్రదాయ పద్దతిలో వివాహం జరిగింది. వేడుకల్లో ధ్రువసర్జా కుటుంబ సభ్యులతో పాటు ప్రేరణ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. వివాహానికి నటుడు అర్జున్ సర్జా, నటి తారా అనురాధ కుటుంబ సభ్యులు, దర్శకుడు నందకిశోర్, దర్శకుడు ఏపీ అరుఉ్జన్తో పాటు పునీత్ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్ కుమార్ దంపతులు హాజరై ఆశీర్వదించారు. -
కుత్బుల్లాపూర్‌లో రెండు డెంగ్యూ కేసులు
కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): కుత్బుల్లాపూర్ ప్రాంతంలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. షాపూర్ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చింతల్ వెంకటేశ్వరనగర్‌కు చెందిన భవ్యశ్రీ, గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన ప్రేరణ అనే బాలికలు చికిత్స పొందుతున్నారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వారిని కుటుంబసభ్యులు బుధవారం ఆస్పత్రిలో చేరారు. వారిద్దరికీ డెంగ్యూ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.