
Bigg Boss Telugu 8: టాప్ 5 ఫైనలిస్టుల గురించి ఈ విషయాలు తెలుసా?

బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్ విజయవంతంగా ముగిసింది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ షోకు డిసెంబర్ 15న ముగింపు పడింది. మొత్తం 22 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా చివరకు ఐదుగురు మిగిలారు.

అందులో నిఖిల్ విజేతగా అవతరించగా గౌతమ్ కృష్ణ రన్నరప్‌గా నిలిచాడు. నబీల్ సెకండ్ రన్నరప్‌గా, ప్రేరణ నాలుగో స్థానంలో, అవినాష్ ఐదో స్థానంలో ఉండగా ఎలిమినేట్ అయ్యారు. మరి వీరి బ్యాక్‌గ్రౌండ్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..

నిఖిల్ నిఖిల్ మళియక్కల్ కర్ణాటకలోని మైసూర్‌లో జన్మించాడు. స్కూలుకు వెళ్లే రోజుల్లోనే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2016లో కన్నడ భాషలో ఊటీ అనే సినిమా చేశాడు. ఇందులో సహాయక పాత్ర పోషించాడు. అనంతరం కన్నడలో మలయే మంత్రాలయ సీరియల్‌లో నటించాడు. గోరింటాకు సీరియల్‌తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించాడు. విలన్‌గా కనిపించడమే ఎక్కువ ఇష్టమన్న నిఖిల్ బిగ్‌బాస్ షో గెలిచి హీరో అయిపోయాడు.

గౌతమ్ గౌతమ్ కృష్ణ హైదరాబాద్‌వాసి. చిన్నప్పటినుంచే సినిమాలంటే ఇష్టం. కానీ పేరెంట్స్ కోరిక మేరకు డాక్టర్ అయ్యాడు. 2018లో డైరెక్షన్‌లో శిక్షణ పొందాడు. తర్వాతి ఏడాది ఆకాశవీధుల్లో సినిమా కథ రాసుకుని తనే డైరెక్ట్ చేసుకుని హీరోగానూ నటించాడు. హిందీలో సిద్దూ: ది రాక్‌స్టార్ మూవీ చేశాడు. బిగ్‌బాస్ 7లో అడుగుపెట్టిన డాక్టర్ గౌతమ్ కృష్ణ మరోసారి బిగ్‌బాస్ 8లో పాల్గొని ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

నబీల్ నబీల్ పుట్టిపెరిగిందంతా వరంగల్‌లోనే! చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే పిచ్చి. ఎన్నో ఆడిషన్స్‌కు వెళ్లినా ఎవరూ తన టాలెంట్ గుర్తించలేదు. దాంతో వరంగల్ డైరీస్ అని సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టి తన కంటెంట్‌తో నవ్వించాడు, వినోదం పంచాడు. అలా బిగ్‌బాస్ 8లోనూ అడుగుపెట్టి సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు.

ప్రేరణ కర్ణాటకలో పెరిగి అక్కడే నివసిస్తున్న ప్రేరణ పుట్టింది మాత్రం హైదరాబాదులోనే అని తెలుస్తోంది. రష్మిక మందన్నాకు ఈమె క్లోజ్ ఫ్రెండ్ కూడా! కన్నడలో పలు సీరియల్స్, సినిమాలు చేసిన బ్యూటీ బిగ్‌బాస్ 8 ఫైనల్స్ దాకా వెళ్లింది. నాలుగో స్థానంలో ఉండగా ఎలిమినేట్ అయింది.

అవినాష్ అవినాష్ జగిత్యాలవాసి. అందరికీ నవ్వులు పంచే అవినాష్ అవకాశాల కోసం కృష్ణానగర్ చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. చిన్నచిన్న ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కాడు. జబర్దస్త్ కామెడీ షోతో గుర్తింపు పొందాడు. ఎక్కువగా షోలు చేసుకుంటూ పోతున్న అతడు ఓ సినిమా కూడా చేస్తున్నాడు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన అవినాష్ బిగ్‌బాస్ 8లోనూ ఎంట్రీ ఇచ్చి ఏకంగా ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఫైనల్స్‌లో ఐదో స్థానంలో ఉండగా ఎలిమినేట్ అయ్యాడు.

