Gautham
-
అవకాశాలు లేక కాదు, రాక కాదు.. అందుకే సినిమాలు తగ్గించా!
తెలుగు దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) కొన్నేళ్లుగా సినిమాలు తగ్గించేశాడు. ఒకప్పుడు జెట్ స్పీడ్‌లో చిత్రాలు చేసిన ఆయన ఈ మధ్య మాత్రం మూవీస్‌పై అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఏదో అడపాదడపా చిత్రాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు గౌతమ్‌తో కలిసి బ్రహ్మ ఆనందం అనే సినిమా చేశాడు.సినిమాలు ఎందుకు తగ్గించేశానంటే?గురువారం జరిగిన బ్రహ్మ ఆనందం టీజర్ లాంచ్ ఈవెంట్ (Brahma Anandam Teaser Launch Event)లో సినిమాలు తగ్గించడానికి గల కారణాన్ని హాస్య బ్రహ్మ బయటపెట్టాడు. బ్రహ్మానందం మాట్లాడుతూ.. నాకు మంచి ఇమేజ్ ఉంది. దాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈయన కామెడీ అప్పట్లో బాగుండేది.. ఈ మధ్య కామెడీ చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లేదు అన్న మాట కొందరు కమెడియన్ల దగ్గర విన్నాను. అది నాకొద్దు. ఎంత చేసినా ఇంకా ఏదో వెతుకుతూ ఉంటారు.నాకు తెలుసుఅలాగే నా వయసేంటో నాకు తెలుసు. వయసు పెరుగుతోందని అర్థం చేసుకోకుండా నేనింకా యంగ్ అంటే కుదరదు. ఇంతకుముందు చేసినంత యాక్టివ్‌గా నేను చేయలేకపోతున్నాను. నేను చేసిన పాత్రలే మళ్లీ ఆఫర్ చేస్తున్నారు, చేసిన కామెడీనే మళ్లీ చేయించాలని ప్రయత్నిస్తున్నారు.. నన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలంటే ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలి. అందుకే సినిమాలు తగ్గించేయాలని నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను. సినిమాల్లో వేషాలు లేక కాదు, నాకు ఇవ్వక కాదు, నేను చేయలేకా కాదు! ఎంతజాగ్రత్తగా చేసినా దొరికిపోతాం. చేసిన కామెడీ చేస్తున్నాడన్న ఇమేజ్ వద్దనే సినిమాలు తగ్గించాను. ఇండస్ట్రీలో నా వారసత్వాన్ని వెన్నెల కిషోర్ కొనసాగిస్తాడు అని చెప్పాడు.ఆనందో బ్రహ్మ ఎలా ఒప్పుకున్నానంటే?డైరెక్టర్ నిఖిల్.. నా పేరుపైనే ఒక సినిమా రాసుకున్నానని, మీరు ఒప్పుకుంటే సినిమా చేస్తానన్నాడు. నాతో ఒక్క షాట్ అయినా డైరెక్ట్ చేయాలని తన కోరిక అని లేదంటే ఈ సినిమా పక్కనపెట్టేస్తానన్నాడు. అప్పటివరకు పోజు కొడదామనుకున్నాను కానీ నేను ఒప్పుకుంటేనే సినిమా అనేసరికి సరే అని అంగీకరించాను అని బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. హీరో ఎవరు? అని అడిగితే మా అబ్బాయి గౌతమ్ పేరు చెప్పారు. సినిమా కోసం వాడికి నేను తాతనయ్యాను అని చెప్పాడు. బ్రహ్మ ఆనందం సినిమా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. చదవండి: సంక్రాంతి రభస: మోహన్‌బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు -
ఆనందమానందమాయే...
బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ప్రియా వడ్లమాని, ఐశ్వర్యా హోలక్కల్ హీరోయిన్లుగా చేశారు. ఈ చిత్రం ద్వారా ఆర్వీఎస్ నిఖిల్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద’ వంటి హిట్ చిత్రాలు తీసిన స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.శాండిల్య పీసపాటి సంగీతం అందించిన ‘బ్రహ్మా ఆనందం’ నుంచి ‘ఆనందమానందమాయే...’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటని మనీషా ఈరబత్తిని, యశ్వంత్ నాగ్ ఆలపించారు. ‘‘ఆనందమానందమాయే...’ క్యూట్ లవ్ సాంగ్. హీరోపై తన ప్రేమను హీరోయిన్ అందంగా వివరిస్తుంటే, హీరో మాత్రం తనకు డబ్బు మీదున్న ప్రేమ, అవసరాన్ని పాటగా పాడుకుంటున్నారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమేరా: మితేష్ పర్వతనేని. -
బిగ్‌బాస్ 8: టాప్ 5 ఫైనలిస్టుల బ్యాక్‌గ్రౌండ్ ఇదే! (ఫోటోలు)
-
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. -
నవ్వులే నవ్వులు
‘పద్మశ్రీ’ బ్రహ్మానందం కీలక పాత్రలో ఆయన తనయుడు రాజా గౌతమ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్రహ్మ ఆనందం’. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటì స్తున్నారు. సావిత్రి, ఉమేష్ యాదవ్ సమర్పణలో స్వధర్మ్ ఎంటర్టైన్ మెంట్‌పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు.సోమవారం రక్షా బంధన్ సందర్భంగా ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటించి, గ్లింప్స్ రిలీజ్ చే శారు మేకర్స్. ‘‘బ్రహ్మానందం, రాజా గౌతమ్ నటిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్ ‘బ్రహ్మ ఆనందం’. ఈ మూవీలో తాత, మనవడుగా వారు అలరించబోతున్నారు. రాజా గౌతమ్ స్నేహితుని పాత్రలో ‘వెన్నెల’ కిశోర్ ఫుల్ లెంగ్త్ రోల్లో కనిపిస్తారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని
బహుమతులు ఆనందాన్నిస్తాయి... అయితే వస్తువుల రూపంలో కన్నా మాటల రూపంలో ప్రేమను వ్యక్తపరిస్తే ఆ ఫీలింగ్ హృదయంలో నిలిచిపోతుంది. అన్నయ్య గౌతమ్ నుంచి అలాంటి ప్రేమనే ఎక్కువగా కోరుకుంటున్నానని చిన్నారి సితార అంటోంది. సూపర్ స్టార్ మహేశ్‌బాబు, నమ్రతల కుమార్తెగా పన్నెండేళ్ల సితార పాపులర్. ఓ జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్‌గా తనకంటూ పాపులార్టీ తెచ్చుకుంది. సోమవారం రాఖీ పండగ సందర్భంగా ‘సాక్షి’కి సితార చెప్పిన ప్రత్యేకమైన ముచ్చట్లు...రాఖీ పండగను ఇంట్లో చిన్న పూజతో ప్రారంభిస్తాం. ఆ తర్వాత అన్నయ్యకు రాఖీ కట్టి, ఇద్దరం బహుమతులు ఇచ్చి, పుచ్చుకుంటాం. నాకు ఎనిమిది.. తొమ్మిదేళ్లప్పుడు అనుకుంటా... రాఖీకి అసలైన అర్థం తెలిసింది. చేతికి రాఖీ కట్టడం అనేది ఓ ఆచారం కాబట్టి పాటించాలి. అంతవరకే నాకు తెలుసు. అయితే సోదరుడి అనుబంధం, రక్షణ ఎంతో అవసరమని, అది సూచించే విధంగా కట్టే రాఖీకి చాలా ప్రాధాన్యం ఉందని ఈ పండగ అసలు విషయం అర్థమైంది. ఆచారం అర్థం అయ్యాక ఈ ఫెస్టివల్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాను.రాఖీ కొనడానికి చాలా టైమ్ తీసుకుంటాఈ సంవత్సరం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్య పై చదువుల కోసం విదేశాలు వెళుతున్నాడు. ఇప్పటిరకూ ఒక విధంగా ఉండేది.. ఇప్పుడు తనకు దూరంగా ఉండటం అనే మార్పు చాలా స్పష్టంగా కనబడుతుంది. రాఖీ కొనడం అనేది పెద్ద పనే. ఎందుకంటే ఒక పట్టాన సెలక్ట్ చేయలేను. చాలా టైమ్ పడుతుంది. మా అన్నయ్య మనస్తత్వానికి దగ్గరగా ఉన్న రాఖీ కొంటుంటాను.అమ్మ గైడెన్స్‌తో పండగ చేసుకుంటాంఈ పండగ అనే కాదు ప్రతి పండగకీ మా అమ్మ గైడెన్స్ ఉంటుంది. అయితే అన్నయ్యకి హారతి ఇవ్వడం, స్వీటు తినిపించడం... ఇలా నేను మాత్రమే చేయాల్సినవే ఉంటాయి కాబట్టి రాఖీ పండగ అప్పుడు ఎక్కువ గైడెన్స్ ఉంటుంది. అమ్మకు సంప్రదాయాలు పాటించడం చాలా ఇష్టం. మేం కూడా పాటించాలని కోరుకుంటారు. అలాఅని ఒత్తిడి చేయరు. మా స్వేచ్ఛ మాకు ఉంటుంది.నా ప్రేమను మెసేజ్ రూపంలో చెబుతాఒకవేళ వచ్చే ఏడాది మా అన్నయ్య రాఖీ పండగ సమయంలో విదేశాల్లో ఉంటే వీడియో కాల్ చేస్తాను. దాంతో పాటు తన మీద నాకు ఉన్న ప్రేమను ఒక మంచి మెసేజ్ రూపంలో చెబుతాను. ఆ మెసేజ్ హృదయపూర్వకంగా తను నాకెంత ముఖ్యమో చెప్పేలా ఉంటుంది. దూరం అనేది విషయం కాదు అని చెప్పేలా ఉంటుంది.నన్ను సర్ప్రైజ్ చేస్తే ఇష్టంఅన్నయ్య నాకు ఫలానా గిఫ్ట్ ఇవ్వాలని అనుకోను. కానీ నన్ను సర్ప్రైజ్ చేస్తే నాకు ఇష్టం. తను నా గురించి ఆలోచిస్తున్నాడని సూచించే ఏ గిఫ్ట్ అయినా నాకు ఓకే. పుస్తకం అయినా, ఏదైనా జ్యువెలరీ అయినా లేక తన చేతితో రాసిన లెటర్ అయినా సరే... తను నా గురించి ఆలోచిస్తున్నాడనే ఆ ఫీల్ నాకు ముఖ్యం.నా బ్రదర్ నా ఆత్మవిశ్వాసంబ్రదర్ ఒక బెస్ట్ ఫ్రెండ్‌లాంటి వాడు... రక్షణగా నిలబడేవాడు. ఏ విషయంలోనైనా నా బ్రదర్ మీద ఆధారపడిపోవచ్చు అనే భరోసా నాకు ఉంది. తను నా ఆత్మవిశ్వాసం... మా బాండింగ్‌ని నేను చాలా గాఢంగా ఇష్టపడతాను. ఒక బ్రదర్ ఉండటం అనేది ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి పక్కనే ఉండటంలాంటిది. – డి.జి. భవాని -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
స్పెషల్ ట్రైనింగ్?
మహేశ్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘వన్ : నేనొక్కడినే’ (2014). ఈ సినిమాలో మహేశ్‌బాబు చిన్న నాటి సన్నివేశాల్లో ఆయన తనయుడు గౌతమ్ ఘట్టమనేని నటించారు. చైల్డ్ ఆర్టిస్టుగా గౌతమ్‌కి ఇదే తొలి మూవీ. అయితే ‘వన్ : నేనొక్కడినే’ తర్వాత గౌతమ్‌ను స్క్రీన్ పై చూడాలని మహేశ్ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే ఇందుకు తగ్గ పక్కా ప్రణాళికను మహేశ్ రెడీ చేస్తున్నారట. ఇటీవల ప్లస్ టూ గ్రాడ్యుయేషన్ ను విదేశాల్లో పూర్తి చేశాడు గౌతమ్. అయితే విదేశాల్లో కాలేజ్ స్టడీస్ చేసే సమయంలోనే యాక్టింగ్ కోర్సులో కూడా గౌతమ్ జాయిన్ అయ్యేలా మహేశ్ బాబు ఏర్పాట్లు చేస్తున్నారట.ఇందుకోసం ప్రముఖ యాక్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ వివరాలను సేకరించే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. గౌతమ్‌ను యాక్టింగ్ కోర్సులో జాయిన్ చేసే ఆలోచనలో మహేశ్‌బాబు ఉన్నారంటే భవిష్యత్తులో గౌతమ్ హీరోగా చేస్తారని ఆశిస్తున్నారు మహేశ్‌బాబు ఫ్యాన్స్. కాగా ఈ విషయాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కానున్నట్లు తెలిసింది. -
మహేశ్ కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్‌లో నాటకం
సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు. తండ్రి అడుగు జాడల్లో నడించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)గౌతమ్ చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపై కాన్సట్రేట్ చేశాడు. రీసెంట్గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అలానే ఈ మధ్యే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టినట్లు నమ్రతనే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు లండన్‌లో ఓ నాటకంలో స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు నమ్రతనే చెప్పుకొచ్చింది. కొడుకు విషయంలో చాలా గర్వపడుతున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 17 ఏళ్లే. కాబట్టి మరో మూడు నాలుగేళ్ల తర్వాత లాంచ్ చేస్తారేమో. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. నమ్రత పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్‌లో మహేశ్‌ని మీరు చూడొచ్చు.(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
కొడుకు గౌతమ్ తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. మహేశ్ బాబు భార్య ఎమోషనల్ (ఫొటోలు)
-
సూపర్‌స్టార్ ఫ్యామిలీ వారసుడు రెడీ.. వీడియో వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన వారసుడిని రెడీ చేస్తున్నాడా? అంటే అవుననే అనిపిస్తోంది. చిన్నప్పుడు తండ్రి కొడుకులిద్దరూ కలిసి 'వన్ నేనొక్కడినే' మూవీలో నటించారు. ఆ తర్వాత గౌతమ్ మరో మూవీ చేయలేదు. పూర్తిగా చదువుపై దృష్టి పెట్టాడు. కానీ ఇప్పుడు కొడుకు వీడియో షేర్ చేసిన నమ్రత.. అభిమానులకు హింట్ ఇస్తున్నట్లు కనిపిస్తుంది.కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మహేశ్.. తక్కువ టైంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పోకిరి' సినిమాతో ఇండస్ట్రీలో రికార్డులు సెట్ చేశాడు. ఆ తర్వాత పలు మూవీస్‌తో ఆకట్టుకుంటూనే ఉన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నాడు.(ఇదీ చదవండి: విజయ్ సేతుపతి 'మహారాజ' సినిమా రివ్యూ)ఇకపోతే మహేశ్ ఎంత ఫిట్‌గా ఉంటాడనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 50కి దగ్గర పడుతున్నా సరే కుర్రాడిలా మెరిసిపోతుంటాడు. ఇప్పుడు మహేశ్ కొడుకు గౌతమ్ కూడా వర్కౌట్స్ షురూ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇది చూసిన ఫ్యాన్స్.. వారసుడు వచ్చేస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.ప్రస్తుతం గౌతమ్ వయసు 17 ఏళ్లు. ఒకవేళ హీరోగా ఎంట్రీ ఇద్దామనుకున్నా సరే మరో నాలుగైదేళ్లు పట్టొచ్చు. అంతలో ఫిజిక్ అంతా సెట్ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ ఇదే జరిగితే మహేశ్-రాజమౌళి మూవీ రిలీజయ్యేలోపు గౌతమ్ తెరంగేట్రం ఉండొచ్చేమో?(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 'సన్నాఫ్ సత్యమూర్తి' చైల్డ్ ఆర్టిస్ట్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
విజయ్‌కి జోడీగా 'యానిమల్' బ్యూటీ
రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ చిత్రంలోని జోయా పాత్రతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు హీరోయిన్ త్రిప్తి దిమ్రి. ఇప్పుడు ఈ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు ముందు శ్రీలీలను తీసుకున్నారు. కొన్ని కారణాలతో శ్రీలీల ఈప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో, ఈ స్థానంలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తారనే టాక్ వినిపించింది. తాజాగా త్రిప్తి దిమ్రి, రుక్మిణీ వసంత్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి. మరి.. ఈ ఇద్దర్లో ఎవరు విజయ్ దేవరకొండతో జోడీ కడతారు? లేక మరో హీరోయిన్ ఎవరైనా ఈ అవకాశాన్ని దక్కించుకుంటారా? అనేది చూడాలి. ఈ సినిమా షూటింగ్‌ను మార్చిలోప్రారంభించాలనుకుంటున్నారు. సో.. రెండు నెలల్లో కథానాయిక విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది. -
ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!
గడచిన వారంలో స్టాక్‌మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్‌బర్గ్ నివేదికతో కుప్పకూలిన స్టాక్‌లు తిరిగి మార్కెట్ జీవితకాల గరిష్ఠాలను తాకింది. దాంతో అదానీ స్టాక్ల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది. కేవలం ఐదు రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగడంతో అటు గ్రూప్ కంపెనీలకు, ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్నర్స్ అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు. జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్‌లోని ఏడు షేర్లలో ఎల్ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేసింది. ఇదీ చదవండి: దిగ్గజ టెక్ కంపెనీ సీఎఫ్ఓ రాజీనామా.. ఎందుకంటే.. ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏసీసీ మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. గతవారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి. -
కాశ్వీ బన్గయీ కరోడ్‌పతి
ముంబై: ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ కోసం జరిగిన మినీ వేలంలో ఇద్దరు భారత యువ క్రీడాకారిణుల పంట పండింది. చండీగఢ్‌కు చెందిన పేస్ బౌలర్ కాశ్వీ గౌతమ్, కర్నాటక బ్యాటర్ వృందా దినేశ్‌ల పంట పండింది. కాశ్వీని గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్లకు ఎంచుకోగా...వృందాను రూ.1 కోటి 30 లక్షలకు యూపీ వారియర్స్ తీసుకుంది. ఆస్ట్రేలియా యువ క్రీడాకారిణి అనాబెల్ సదర్లాండ్‌ను కూడా ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకే తమ జట్టులోకి చేర్చుకుంది. గత ఏడాదిలాగే ఈ సారి కూడా అద్భుత ఫామ్‌లో ఉన్నా... శ్రీలంక కెపె్టన్ చమరి అటపట్టును వేలంలో ఏ జట్టూ తీసుకోలేదు. మొత్తం 165 మంది ప్లేయర్లు మహిళల లీగ్‌లో వేలం కోసం అందుబాటులోకి రాగా ఐదు జట్లూ కలిపి 30 మందిని ఎంచుకున్నాయి. వీరిలో 9 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. 2024 ఫిబ్రవరిలో డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ మ్యాచ్‌లు జరుగుతాయి. వారిద్దరికి ఎందుకంటే... గత సీజన్ వేలంలో భారత కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు వేలంలో రూ.1.80 కోట్లు పలకగా, ఇప్పటి వరకు భారత్‌కు ఆడని (అన్క్యాప్డ్) కాశ్వీకి అంతకంటే ఎక్కువ మొత్తం లభించడం విశేషం. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన కాశ్వీ కోసం అన్ని జట్లూ పోటీ పడ్డాయి. గత నెలలో జాతీయ టి20 టోర్నీ లో 12 వికెట్లు తీసిన కాశ్వీ ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన ‘ఎ’ సిరీస్‌లో ఆడింది. అంతకు ముందు ఆసియా కప్ అండర్–23లో విజేతగా నిలిచిన జట్టులోనూ సభ్యురాలు. కాశ్వీ కనీస ధర రూ. 10 లక్షలతో వేలం మొదలు కాగా, ప్రధానంగా పోటీ యూపీ, గుజరాత్ మధ్యే నడిచింది. చివరకు గుజరాత్ ఆమెను సొంతం చేసుకుంది. మూడేళ్ల క్రితం అండర్–19 వన్డేలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన రికార్డు కాశ్వీకి ఉంది. 22 ఏళ్ల వృంద దూకుడైన బ్యాటింగ్‌కు మారపేరు. గత రెండు సీజన్లుగా నిలకడగా ఆడిన వృంద ఈ ఏడాది సీనియర్ వన్డే టోర్నీ లో 477 పరుగులతో కర్నాటక ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. అనాబెల్ ఆసీస్ తరఫున 23 వన్డేలు, 22 టి20లు ఆడింది. మన ప్లేయర్లు ముగ్గురు... భారత్ తరఫున 17 టి20లు ఆడిన ఆంధ్ర ఓపెనర్ సబ్బినేని మేఘనను బెంగళూరు రూ. 30 లక్షలకు, ఇంకా సీనియర్ స్థాయిలో ఆడని హైదరాబాద్ బ్యాటర్ ఏడుకొండల త్రిష పూజితను గుజరాత్ జెయింట్స్ రూ. 10 లక్షలకు తీసుకున్నాయి. 2008నుంచి 2014 మధ్య భారత్ తరఫున 50 వన్డేలు, 37 టి20లు ఆడి ఆ తర్వాత జాతీయ జట్టుకు దూరమైన 35 ఏళ్ల హైదరాబాద్ లెఫ్టార్మ్ స్పిన్నర్ గౌహర్ సుల్తానాను రూ. 30 లక్షలకు యూపీ వారియర్స్ ఎంచుకోవడం విశేషం. మరో హైదరాబాద్ అమ్మాయి గొంగిడి త్రిష మాత్రం వేలంలో ఎంపిక కాలేదు. వేలంలో టాప్ అనాబెల్ (ఆ్రస్టేలియా) – రూ. 2 కోట్లు కాశ్వీ గౌతమ్ (భారత్) – రూ. 2 కోట్లు వృంద దినేశ్ (భారత్) – రూ.1.30 కోట్లు షబ్నమ్ (దక్షిణాఫ్రికా) – రూ. 1.20 కోట్లు ఫోబ్ లిచ్‌ఫీల్డ్ (ఆస్ట్రేలియా) – రూ. 1 కోటి ఏక్తా బిస్త్ (భారత్) – రూ. 60 లక్షలు వేర్హమ్ (ఆ్రస్టేలియా) – రూ. 40 లక్షలు -
హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్‌కు ఐదు స్వర్ణాలు
తెలంగాణ స్విమ్మింగ్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అంతర్ జిల్లా జూనియర్, సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ స్విమ్మర్ గౌతమ్ శశివర్ధన్ ఐదు స్వర్ణ పతకాలతో అదరగొట్టాడు. విక్కీ స్విమ్మింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న 14 ఏళ్ల గౌతమ్ బరిలోకి దిగిన ఐదు ఈవెంట్లలోనూ విజేతగా నిలిచాడు. గ్రూప్–2 వయో విభాగంలో గౌతమ్ 50, 100, 200 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్, 200, 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీ ఈవెంట్లలో పసిడి పతకాలు గెలిచాడు. ఈ ప్రదర్శనతో గౌతమ్ ఈనెల 27 నుంచి 29 వరకు బెంగళూరులో జరిగే జాతీయ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్íÙప్లో పాల్గొనే తెలంగాణ జట్టులోకి ఎంపికయ్యాడు. -
కొత్త పంథా.. అదే దందా!
హైదరాబాద్: కబ్జారాయుళ్లు కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న గదుల వద్ద ట్రాన్స్జెండర్లను ముందు పెట్టి.. వెనక కబ్జాల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. గాజుల రామారం డివిజన్ కై సర్ నగర్‌లోని ప్రధాన రహదారిని ఆనుకొని హనుమాన్ దేవాలయానికి ఎదురుగా ఉన్న సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో ఓ కుల సంఘం పేరిట వారం రోజులుగా 200కు పైగా గదులు నిర్మించారు. ఈ నిర్మాణాల వెనక సదరు కుల సంఘం పెద్దగా చెప్పుకుంటున్న ఓ వ్యక్తి తన తతంగాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై సోమవారం ‘ఇదే తరుణం.. కబ్జా చేద్దాం’ అని శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ స్పందించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని. కబ్జాకు పాల్పడుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, రేణుకలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకొని రెండు గదులను కూల్చివేశారు. దీంతో కబ్జా వెనకాల ఉన్న ఓ కుల పెద్ద ట్రాన్స్జెండర్లను రంగంలోకి దింపాడు. కూల్చివేతలను అడ్డుకొని నానా హంగామా చేసి రెవెన్యూ అధికారులను పరుగులెత్తించారు. చేసేదేమీ లేక వెనుదిరగాల్చి వచ్చింది. సదరు వ్యక్తిపై విచారణ.. సర్వే నంబర్ 342/1 ప్రభుత్వ స్థలంలో కుల సంఘం పేరుతో గదులను నిర్మిస్తూ రూ.కోట్లు ఆర్జిస్తున్న వ్యక్తిపై సంబంధిత అధికారులు రహస్యంగా విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి గతంలో చాలాచోట్ల కుల సంఘం పేరిట ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా చేసి, ఒక్కో ప్లాటును నలుగురికి అమ్మి ఎంతో మందిని మోసం చేసినట్లు బహిరంగంగా ఆరోపిస్తున్నారు. -
రెండు భాగాలు?
విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ యాక్షన్ ఫిల్మ్ రూపొందనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్నదనే టాక్ తాజాగా ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఓ సాధారణ కానిస్టేబుల్ గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందనే కోణంలో ఈ సినిమా కథనం ఉంటుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా శ్రీలీలను అనుకున్నారు. కానీ కాల్షీట్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బందులు రావడంతో శ్రీలీల ఈ సినిమా నుంచి తప్పుకున్నారని, ఆమె స్థానంలో రష్మికా మందన్నాను తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో విజయ్–రష్మిక కాంబినేషన్లో ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. -
వైరల్ అవుతున్న మహేష్ బాబు కొడుకు, కూతురు వినాయకుడి నిమజ్జనం
-
వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: తొలిసారి హీరోయిన్గా ట్రాన్స్‌జెండర్.. హీరోగా ఎవరంటే?) తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్‌స్టాలో రాస్తూ 'గణపతి బప్పా మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మహేశ్ రూట్లోనే గౌతమ్.. అదీ చిన్న వయసులో
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అయితే సినిమాలు చేస్తాడు. లేదంటే కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రలకు వెళ్తుంటాడు. మహేశ్ పిల్లల్లో సితార సందడి చేస్తూనే ఉంటుంది. గౌతమ్ మాత్రం చాలా సైలెంట్. పెద్దగా బయట కనిపించడు. అలాంటిది ఇప్పుడు ఓ పనిచేసి తల్లిదండ్రులు పొంగిపోయేలా చేశాడు. ఈ విషయమై నమ్రత సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. తెగ ఆనందపడిపోతుంది. (ఇదీ చదవండి: బర్త్‌డే స్పెషల్.. టాలీవుడ్లో ఆ రికార్డులన్నీ నాగార్జునవే) హీరోగా మహేశ్‌బాబు హిట్, ఫ్లాఫ్స్ ఉండొచ్చు కానీ ఓ మనిషిగా మాత్రం ఇతడిని మెచ్చుకోకుండా ఉండలేం. ఎందుకంటే ఫౌండేషన్ తరఫున ఎంతోమంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేస్తూ అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఇప్పుడు తండ్రి అడుగుజాడల్లోనే గౌతమ్ కూడా వెళ్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహేశ్ ఫౌండేషన్ తరఫున చికిత్స పొందుతున్న పేషెంట్స్ తో గౌతమ్ ముచ్చటించాడు. ఈ పిక్స్‌ని నమ్రత ఇన్ స్టాలో షేర్ చేశారు. 'చిల్డ్రన్ హాస్పిటల్ కు గౌతమ్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాడు. ఇప్పుడు ఇలా వచ్చి సందర్శించాడు. ఎంబీ ఫౌండేషన్, రెయిన్ బో చిల్డ్రన్ హాస్పిటల్స్ కలిసి ఇలా చిన్నారులకు ఫ్రీగా వైద్యం అందిస్తోంది. గౌతమ్ కూడా ఈ కార్యక్రమంలో ఓ భాగస్వామినే. ఇలా ఆంకాలజీ, కార్డియో వార్డుల్లో పిల్లలతో కలిసి ముచ్చటించాడు. వారి ముఖంలో నవ్వు తీసుకొచ్చాడు. వారికి నయమవుతుందని భరోసా ఇచ్చాడు' అని నమ్రత పోస్టులో పేర్కొంది. కొడుకుని చూసి తెగ గర్వపడుతోంది. (ఇదీ చదవండి: 'సలార్' కోసం ఆ సాహసం చేస్తున్న శ్రుతి హాసన్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
వేకేషన్‌కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్‌పోర్ట్‌లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్‌బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. (ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్‌లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్‌కు కాస్త విరామం లభించడంతో వేకేషన్ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జూలై 20న సితార బర్త్‌డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్‌లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్‌గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!) Superstar #MaheshBabu with family off to vacation #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/srs35m2Hoh — 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) July 22, 2023 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకిరా, గౌతమ్
-
ఫార్ములా రేస్ వద్ద సెలబ్రిటీల సందడి
-
త్వరగా వచ్చేయ్.. నిన్ను చాలా మిస్సవుతున్నా: సితార
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. తన పోస్టులతో అభిమానులను ఎప్పుడు అలరిస్తూ ఉంటుంది. ఇటీవల అన్న గౌతమ్ కల్చరల్ ట్రిప్ కోసమని విదేశాలకు వెళ్లాడు. దీంతో అన్నయ్యను చాలా మిస్సవుతున్నానంటూ గౌతమ్‌తో సరదాగా ఆడుకుంటున్న ఫోటోలను పోస్ట్ చేసింది సితార. 'మిస్ యూ అన్నయ్య.. త్వరగా తిరిగిరా' అంటూ పోస్ట్ చేసింది. ఇది ఆమె అభిమానులు కొందరు కంగారు పడ్డారు. మీ అన్నయ్య ఎక్కడికెళ్లారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొందరేమో అన్న- చెల్లి అనుబంధం చాలా గొప్పదని పోస్టులు పెడుతున్నారు. ఇటీవలే మహేశ్ బాబు సతీమణి నమ్రత కూడా ఎమోషనల్ పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni) -
నన్ను విడిచి వెళ్తుంటే చాలా బాధగా ఉంది: నమ్రత ఎమోషనల్
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ మహేశ్‌బాబు-నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. మిస్ ఇండియా కీరిటాన్ని గెలుచుకున్న నమత్ర ఆ తర్వాత సినిమాల్లోకి నటించింది. వంశీ మూవీ సమయంలో మహేశ్ బాబుతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇక వీరి పిల్లలు గౌతమ్, సితార గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉండే మహేశ్ బాబు కుమార్తె సితార గురించి మనందరికీ తెలుసు. నమ్రత శిరోద్కర్ అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులకు టచ్‌లో ఉంటోంది. తాజాగా తన కుమారుడు గౌతమ్ గురించి ఆమె తన ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. నమ్రత తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'గౌతమ్ కల్చరల్ ట్రిప్‌లో భాగంగా మొదటిసారి విదేశీ పర్యటనకు వెళ్లాడు. అంతా తన సొంతంగానే చక్కబెట్టుకోవాలి. ఇది తలుచుకుంటే నాలో కొంత భాగం నన్ను విడిచిపెట్టినట్లు అనిపించింది. అతను వెళ్లిన రోజంతా శూన్యంగా ఉంది. గౌతమ్ తిరిగి వచ్చే వరకు ఇదో బాధకరమైన అనుభూతి. మా ఇంట్లో, మా కళ్ల ముందు తిరగాల్సిన చిన్న పిల్లవాడు సొంతంగా బయటికి వెళ్లే స్థాయికి చేరాడు. ఒక వారం వినోదం, ఆనందం, సాహసం అన్నింటికీ మించి నువ్వు ఇంకా తెలుసుకోవాలని కోరుకుంటున్నా. ఈ యాత్ర నీకు విలువైందని ఆశిస్తున్నా. బేబీ.. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటా.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన పోస్ట్‌లో గౌతమ్ సహ విద్యార్థులతో దిగిన ఫొటోలను నమ్రత పంచుకున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar)