మహేష్ బాబు కూతురు తెరంగేట్రం | Maheshs Daughter sitara likely to cast In Brahmotsavam | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు కూతురు తెరంగేట్రం

Published Wed, Feb 24 2016 2:32 PM | Last Updated on Sun, Sep 3 2017 6:20 PM

మహేష్ బాబు కూతురు తెరంగేట్రం

మహేష్ బాబు కూతురు తెరంగేట్రం

ఘట్టమనేని వంశం నుంచి మరో స్టార్ వెండితెర మీద దర్శనమివ్వనుంది. ఇప్పటికే మహేష్ బాబు సూపర్ స్టార్గా వెలుగొందుతుండగా, సుధీర్ బాబు హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల వన్ నేనొక్కడినే సినిమాతో మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ సినిమా ఫలితం నిరాశపరిచినా, గౌతమ్కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబు కూతురు సితార కూడా వెండితెర మీద తళుక్కుమననుందట.

ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాలో ఓ చిన్న పాత్రను సితారతో చేయించాలని భావిస్తున్నాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఇప్పటికే ఈ విషయం పై మహేష్ బాబుతో చర్చించిన శ్రీకాంత్, మహేష్ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాడు. సితార సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై మహేష్ ఫ్యామిలీ కూడా సుముఖంగానే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న బ్రహ్మోత్సవం సినిమాను పీవీపీ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది. మే చివరి వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement