స్పెషల్‌ ట్రైనింగ్‌? | Mahesh Babu Son Gautham Undergoing Training | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ ట్రైనింగ్‌?

Published Mon, Jul 15 2024 2:17 AM | Last Updated on Mon, Jul 15 2024 10:49 AM

Mahesh Babu Son Gautham Undergoing Training

మహేశ్‌బాబు హీరోగా నటించిన చిత్రం ‘వన్ : నేనొక్కడినే’ (2014). ఈ సినిమాలో మహేశ్‌బాబు చిన్న నాటి సన్నివేశాల్లో ఆయన తనయుడు గౌతమ్‌ ఘట్టమనేని నటించారు. చైల్డ్‌ ఆర్టిస్టుగా గౌతమ్‌కి ఇదే తొలి మూవీ. అయితే ‘వన్ : నేనొక్కడినే’ తర్వాత గౌతమ్‌ను స్క్రీన్ పై చూడాలని మహేశ్‌ అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. అయితే ఇందుకు తగ్గ పక్కా ప్రణాళికను మహేశ్‌ రెడీ చేస్తున్నారట. ఇటీవల ప్లస్‌ టూ గ్రాడ్యుయేషన్ ను విదేశాల్లో పూర్తి చేశాడు గౌతమ్‌. అయితే విదేశాల్లో కాలేజ్‌ స్టడీస్‌ చేసే సమయంలోనే యాక్టింగ్‌ కోర్సులో కూడా గౌతమ్‌ జాయిన్  అయ్యేలా మహేశ్‌ బాబు ఏర్పాట్లు చేస్తున్నారట.

ఇందుకోసం ప్రముఖ యాక్టింగ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వివరాలను సేకరించే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా. గౌతమ్‌ను యాక్టింగ్‌ కోర్సులో జాయిన్  చేసే ఆలోచనలో మహేశ్‌బాబు ఉన్నారంటే భవిష్యత్తులో గౌతమ్‌ హీరోగా చేస్తారని ఆశిస్తున్నారు మహేశ్‌బాబు ఫ్యాన్స్. కాగా ఈ విషయాలపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబరులో ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్‌ కానున్నట్లు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement