మహేశ్ కొడుకు మొదలుపెట్టేశాడు.. లండన్‌లో నాటకం | Gautam Ghattamaneni Stage Performance In London Namratha Post Viral | Sakshi
Sakshi News home page

Gautham Ghattamaneni: తొలి స్టేజీ ఫెర్ఫార్మెన్స్.. తల్లి నమ్రత ఎమోషనల్

Published Sun, Jun 23 2024 8:31 AM | Last Updated on Sun, Jun 23 2024 9:38 AM

Gautam Ghattamaneni Stage Performance In London Namratha Post Viral

సూపర్ స్టార్ మహేశ్ బాబు కొడుకు మొదలుపెట్టేశాడు. తండ్రి అడుగు జాడల్లో నడించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేశాడు. ఈ క్రమంలోనే నమ్రత ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. గర్వపడుతున్నానని చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

(ఇదీ చదవండి: చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!)

గౌతమ్ చిన్న వయసులో మహేశ్ 'వన్ నేనొక్కడినే' సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా చేశాడు. ఆ తర్వాత పూర్తిగా చదువుపై కాన్సట్రేట్ చేశాడు. రీసెంట్‌గా ప్లస్ టూ పూర్తి చేశాడు. అలానే ఈ మధ్యే వర్కౌట్స్ కూడా మొదలుపెట్టినట్లు నమ్రతనే ఓ వీడియో పోస్ట్ చేసింది. ఇప్పుడు లండన్‌లో ఓ నాటకంలో స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు నమ్రతనే చెప్పుకొచ్చింది. కొడుకు విషయంలో చాలా గర్వపడుతున్నానని ఇన్ స్టాలో రాసుకొచ్చింది.

ఇదంతా చూస్తుంటే మహేశ్ వారసుడు ఎంట్రీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు 17 ఏళ్లే. కాబట్టి మరో మూడు నాలుగేళ్ల తర్వాత లాంచ్ చేస్తారేమో. ఇదిలా ఉండగా మహేశ్ ప్రస్తుతం రాజమౌళి మూవీ కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నాడు. ఇందులో భాగంగానే జుత్తు బాగా పెంచుతున్నాడు. నమ్రత పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోస్‌లో మహేశ్‌ని మీరు చూడొచ్చు.

(ఇదీ చదవండి: తెలంగాణలో 'కల్కి' టికెట్ ధరలు పెంపు.. ఒక్కొక్కటి ఏకంగా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement