సినిమా హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే కోట్ల రూపాయలే గుర్తొస్తాయి. కానీ అదే సినిమాకు పనిచేసిన చాలామందికి మాత్రం వేలల్లోనే జీతాలు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు హీరోయిన్ రకుల్ భర్త జాకీ భగ్నానీ. బాలీవుడ్‌లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట ఇతడికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్‌గా బయట పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
1986లో పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత పలు మూవీస్ చేస్తున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్‌గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ తీసింది. ఘోరమైన నష్టాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పనిచేసినందుకు గానూ తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)
బాలీవుడ్ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు అందలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు పబ్లిక్‌గా చెబుతున్నారు. వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.
మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటింగ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందన ఏమిటనేది చూడాలి?
(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి)
Comments
Please login to add a commentAdd a comment