Jackky Bhagnani
-
మోస్ట్ ఫ్యాషనబుల్ సూపర్ కపుల్ పిక్స్ వైరల్ (ఫోటోలు)
-
రకుల్ భర్త జాకీ భగ్నానికి అండగా నిలిచిన అక్షయ్ కుమార్
అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడేమియా ఛోటేమియా’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే నష్టాలు మిగిలాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషి చిల్లర్, అలయా ఎఫ్ ,ఇమ్రాన్ హష్మి, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.‘బడేమియా ఛోటేమియా’ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సంస్థపై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, ఆయన తండ్రి వాసు భగ్నానీ అనేక చిత్రాలను నిర్మించారు. కానీ, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం కోసం రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో వారికి కేవలం రూ. 110 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు కూడా పూర్తి చెల్లింపులు చేయలేకపోయింది. బాలీవుడ్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనుసు చేసుకొని తమకు అండగా నిలిచారని ఆ చిత్ర నిర్మాత కుమారుడు జాకీ భగ్నాని తాజాగా తెలిపారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని ఆయన అన్నారు. అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్‌కే ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయినా సరే తనను నమ్మి సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఇబ్బందులో పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వారి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ముందకు వచ్చారట.ఈ క్లిష్ట సమయంలో తన సహాయాన్ని అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జాకీ భగ్నాని కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్ తనని ఇటీవల కలిశారని పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారని జాకీ తెలిపాడు. 'అక్షయ్ సర్ .. కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు. మా పట్ల ఆయన చూపించిన ప్రేమకు మేము చాలా కృతజ్ఞులం' అని జాకీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
ఒక్క సినిమా దెబ్బకు కార్యాలయం అమ్మేసిన స్టార్ హీరోయిన్ భర్త!
బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీ ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్‌ను పెళ్లాడారు. నిర్మాతగా, నటుడిగా జాకీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన నటనతో పాటు పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో బ్యానర్‌ను నడుపుతున్నారు. ఇటీవల ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన పూజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్‌ను తెరకెక్కించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ముంబయిలోని ఏడంతస్తుల పూజా ఎంటర్టైన్మెంట్ కార్యాలయాన్ని అమ్మేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించారు. బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.59 కోట్లు మాత్రమే రాబట్టింది.దీంతో ఈ నిర్మాణ సంస్థకు దాదాపు రూ.250 కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు సమాచారం. అందువల్లే జాకీ భగ్నానీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. ముంబయిలోని ఓ ప్రముఖ బిల్డర్‌కు ఈ భవనాన్ని విక్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అమ్మకానికి ఒక్క రోజు ముందే జీతాలు సకాలంలో చెల్లించడం లేదంటూ పలువురు సిబ్బంది ఆరోపించారు.అయితే కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థ నిర్మించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వైఫల్యాలే అమ్మకానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జీతాలు ఇవ్వలేక దాదాపు 80 శాతం సిబ్బందిని తొలగించి.. తాత్కాలికంగా జుహులోని ఫ్లాట్‌కు కార్యాలయాన్ని తరలించారని ఓ నివేదిక వెల్లడించింది. కాగా.. పూజా ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను 1986లో ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్లో కూలీ నెం.1, బీవీ నెం.1, రంగేజ్, షాదీ నెం.1, జవానీ జానేమాన్ లాంటి చిత్రాలు నిర్మించారు. ఈ బ్యానర్లో చివరిసారిగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ రూపొందించారు. -
చిక్కుల్లో హీరోయిన్ రకుల్ భర్త.. ఉద్యోగుల్ని మోసం చేస్తూ!
సినిమా హీరోహీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుంటే కోట్ల రూపాయలే గుర్తొస్తాయి. కానీ అదే సినిమాకు పనిచేసిన చాలామందికి మాత్రం వేలల్లోనే జీతాలు ఉంటాయి. ఇప్పుడు అది కూడా ఇవ్వకుండా మోసం చేస్తున్నాడు హీరోయిన్ రకుల్ భర్త జాకీ భగ్నానీ. బాలీవుడ్లో పూజా ఎంటర్టైన్మెంట్స్ పేరిట ఇతడికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఉంది. ఇప్పుడు అందులో ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని పబ్లిక్‌గా బయట పెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.1986లో పూజా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఏర్పాటైంది. కూలీ నంబర్ 1, బడేమియా చోటే మియా (1998), బీవీ నంబర్ 1, ఖామోషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసింది. ఆ తర్వాత పలు మూవీస్ చేస్తున్నప్పటికీ సక్సెస్ రావడం లేదు. రీసెంట్గా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా బడే మియా చోటే మియా అనే యాక్షన్ మూవీ తీసింది. ఘోరమైన నష్టాల్ని చవిచూసింది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు పనిచేసినందుకు గానూ తమకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వట్లేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)బాలీవుడ్ రూల్స్ ప్రకారం.. సినిమా పూర్తయిన 45-60 రోజుల్లో బకాయిలన్నీ చెల్లించాలి. కానీ ఇప్పటివరకు తమకు 2 నెలల జీతాలు అందలేదని.. పూజా సంస్థలో పనిచేసిన ఉద్యోగులు పబ్లిక్‌గా చెబుతున్నారు. వైష్ణవి అనే ఉద్యోగి మాట్లాడుతూ.. తనతో పాటు పనిచేసిన 100 మందికి.. తమకు ఇవ్వాల్సిన జీతాల కోసం గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది.మరో ఉద్యోగి స్పందిస్తూ.. ఔట్ డోర్ షూటింగ్స్ జరిగేటప్పుడు తమకు సరైన తిండి కూడా పెట్టరని ఆరోపించారు. 3 నెలలు పనిచేస్తే రెండు నెలల జీతం ఎగ్గొడతారని చెప్పాడు. ఇప్పుడు తాము ఈ విషయాన్ని బయటకు చెప్పడం వల్ల మిగతా వాళ్లయినా జాగ్రత్త పడతారని అందుకే ఇలా పోస్టులు పెడుతున్నామని అన్నారు. మరి ఈ ఆరోపణలపై నిర్మాణ సంస్థ స్పందన ఏమిటనేది చూడాలి?(ఇదీ చదవండి: కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి) -
యోగాసనాలతో ‘పవర్ కపుల్’ రకుల్-జాకీ ఇంటర్నెట్లో హల్చల్
అందంతో పాటు ఫిట్‌నెస్‌కు ఫ్రిఫరెన్స్ ఇచ్చే హీరోయిన్స్‌లో ఒకరు రకుల్ ప్రీతి సింగ్. రకరకాల యోగాసనాలను వేయడంలో ఆమె దిట్ట. దీనికి సంబంధించి గతంలో చాలా వీడియోను ఇన్‌స్టా పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ఇటీవల ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడిన రకుల్ భర్తతో కలిసి రకరకాల భంగామల్లో యోగాసనాలను అదరగొట్టేసింది. ఈ కొత్త జంట యోగాసనాలు ఇపుడు ఇన్‌స్టాలో హల్చల్ చేస్తున్నాయి. ఆరోగ్యంలోనూ, అన్నింటిలోనే కలిసి ఉంటే ఆనందం.. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ వరుస ఫోటోలను షేర్ చేశారు ఈ లవ్‌బర్డ్స్."పార్ట్నర్ స్ట్రెచెస్"తో ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ జంట ఆసనాలో ఇంటర్నెట్లో ఆకర్షణీయంగా మారాయి. మొదటి భంగిమగా భాగస్వామి సహాయంతో బడ్డీ బోట్ భంగిమ అంటే నౌకాసనంలో కనిపించారు. ఇంకా లెగ్ ఫార్వర్డ్ బెండ్, కోబ్రా పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
ఆధ్యాత్మిక బాటలో రకుల్ ప్రీత్ సింగ్.. పెళ్లి తర్వాత తొలిసారిగా!
టాలీవుడ్ హీరోయిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే వివాహాబంధంలోకి అడుగుపెట్టింది. నటుడు, నిర్మాత అయిన తన ప్రియుడు జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో జరిగిన వీరి పెళ్లికి పలువురు సినీ తారలు కూడా హాజరయ్యారు. ఫిబ్రవరి 21 వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ ముచ్చటగా పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత రకుల్, భగ్నానీ జంట బిజీగా మారిపోయింది. తన భర్తతో కలిసి ఆధ్యాత్మిక బాట పట్టింది. కుటుంబసభ్యులతో పాటు దేవుళ్ల ఆశీర్వాదాలు తీసుకుంటోంది. తాజాగా అస్సాం గువహటిలోని కామాఖ్య దేవి అమ్మవారిని రకుల్ దర్శించుకున్నారు. కొత్త జీవితం ప్రారంభించిన నూతన దంపతులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
గోవాలో ఘనంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి న్యూ ఫోటోలు
-
Rakul-Jackky Wedding : ఫస్ట్ వీడియో వచ్చేసింది, ఫ్యాన్స్ ఫిదా!
లవ్ బర్డ్స్ రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ మూడు ముళ్ల బంధంతో కపుల్‌గా మారిపోయారు. గోవాలో అత్యంత ఘనంగా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇపుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా వీరి పెళ్లి సందడి కబుర్లే. రకుల్-భగ్నానీ వెడ్డింగ్ వేడుకుల వీడియోలు, ఫోటోలు కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈక్రమంలో ఇప్పటికి ఈ జంట ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు మెహిందీ, సంగీత వేడుక వీడియోను బ్రైడ్స్ టుడేఇన్ ఇన్‌స్టా షేర్ చేసింది. ఇందలో తుం బినే సాంగ్‌కు వీరిద్దరూ స్టెప్పులేయడం ఫ్యాన్స్‌ను ఆకట్టుకుటోంది. View this post on Instagram A post shared by Brides Today (@bridestodayin) -
రకుల్-భగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్ వైరల్
PM Modi Wishes to Rakul-Jackky: మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన నూతన జంట రకుల్ ప్రీత్ సింగ్-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్‌ను స్వయంగా రకుల్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. Your blessings touch our hearts deeply, Prime Minister @narendramodi ji. Thank you for your kind wishes as we begin this meaningful new chapter.@Rakulpreet pic.twitter.com/6VOfWhzl68 — Jackky Bhagnani (@jackkybhagnani) February 22, 2024 ఫిబ్రవరి 21న గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు రకుల్-జాకీ జంట. దీంతో కొత్తగా పెళ్లయిన ఈ జంటకు అందరూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ జాబితాలో దేశ ప్రధాని మోదీ చేరడం విశేషంగా నిలిచింది. తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరుకాలేక పోయానని తెలిపిన మోదీ నూతన దంపతులకు స్పెషల్ ఆశీర్వాదాలు అందించారు. తనకు ఆహ్వానం పంపినందుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా, పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్‌ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. -
ప్రియుడిని పెళ్లాడిన రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికూతురిగా ముస్తాబైంది. మనసిచ్చినవాడితో మనువాడింది. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేసింది. గోవాలో బుధవారం (ఫిబ్రవరి 21న) మధ్యాహ్నం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆనంద్ కరాజ్ అనే పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో వీరి పెళ్లి కన్నుల పండుగ్గా జరిగింది. వరుడి సాంప్రదాయం ప్రకారం సింధి పద్ధతిలోనూ మరోసారి ముచ్చటగా పెళ్లి చేసుకోనున్నారు. మూడు రోజుల నుంచే సంబరాలు ఫిబ్రవరి 19 నుంచే వీరి పెళ్లి సంబరాలు షురూ అయ్యాయి. వీరి హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా దంపతులు సహా తదితరులు సంగీత్‌లో స్టెప్పులేశారు. తాజాగా బాలీవుడ్, టాలీవుడ్ తారలు పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అప్పుడే లీక్ చేసింది కాగా రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రేమ విషయాన్ని 2021 అక్టోబర్‌లో బయటపెట్టింది. అప్పటినుంచి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ బ్యూటీ కెరీర్‌తో పాటు పర్సనల్ లైఫ్‌పైనా ఫోకస్ చేసింది. ఇన్నాళ్లకు ప్రియుడితో కలిసి కొత్త జీవితం ప్రారంభించింది. ప్రస్తుతం ఆమె ఇండియన్ 2 సినిమా చేస్తోంది. జాకీ భగ్నానీ విషయానికి వస్తే అతడు నిర్మించిన బడే మియా చోటే మియా సినిమా ఈద్ పండగకు థియేటర్లలో రిలీజ్ కానుంది. చదవండి: సద్గురు హాలీవుడ్ ఎంట్రీ.. జెన్నిఫర్ లోపెజ్ సినిమాలో అలా! -
Rakul-Jackky Wedding : జాకీ స్పెషల్ సర్ప్రైజ్, ఫోటోలు వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ , నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ పెళ్లి ముహూర్తం వచ్చేసింది. ఈరోజు గోవాలో ఫిబ్రవరి 21 న వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. దీనికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ వేడుకలు, తరలి వెళుతున్న సెలబ్రిటీల ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రకుల్, జాకీ పెళ్లికి భగ్నానీ & సింగ్ కుటుంబం స్వాగతం పలుతుకున్న వేదిక దగ్గర్నించి, RJ లవ్‌బర్డ్స్ పేర్ల తొలి అక్షరాలను రాసిన కొబ్బరికాయ, గోవా చేరుకుంటున్న పలువురు సినీరంగ ప్రముఖుల ఫోటోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. రకుల్ జాకీ వారి మెహందీ, సంగీత వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగీత్‌లో వరుణ్ 'కూలీ నంబర్ 1' లోని 'హస్న్ హై సుహానా'కి డ్యాన్స్ చేయగా,. వరుణ్‌తో పాటు శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా , ఇతర కుటుంబ సభ్యులు కూడా స్టెప్పులేశారు. అంతేకాదు జాకీ భగ్నాని తన లవ్ లేడీని ఓ పాటతో సర్ ప్రైజ్ చేయాలని ప్లాన్ చేశాడట. వారి ప్రేమకథను సూచించే బిన్ తేరే అంటూ సాగే ఈ పాట వేడుకకు ఓ ప్రత్యేకతను తీసుకొచ్చిందట. ఈ పాటకు మయూర్ పూరి సాహిత్యం అందించగా, తనిష్క్ బాగ్చి కంపోజిషన్‌లో జహ్రా ఎస్ ఖాన్, రోమీ మతనిష్క్ బాగ్చి పాడారు. రకుల్‌కి గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఈ పాటను ప్లాన్ చేశాడట. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) పంజాబీ వెడ్డింగ్లంటే చుడా వేడుక అతిముఖ్యమైంది. వధువు మేనమామ పాలతో శుద్ధి చేసిన గాజులను అందిస్తాడు. ఇద్దరు మేనమామలుంటే, ఎవరు ఎక్కువ గాజులు పెడతారనే అందమైన పోటీ ఉంటుంది ఇద్దరి మధ్యా. ఉదయం 'చుడా' వేడుక ఆ తర్వాత గోవా ITC గ్రాండ్ సౌత్ 'సాథ్ ఫేరా' ఉంటుందని సమాచారం. రకుల్ , జాకీ రెండు సాంప్రదాయల ప్రకారం పెళ్లిళ్లు చేసుకుంటారని తెలుస్తోంది. అంగరంగ వైభవంగా ఈ పెళ్లి వేడుకలో జాకీ భగ్నాని తండ్రి వాషు భగ్నాని సన్నిహిత మిత్రుడు రాజ్‌కుంద్రా, ఆయన భార్య నటి శిల్పా శెట్టి ఈ వేడుకలో ప్రత్యేకంగా కనిపించనున్నారు. నటుడు వరుణ్ ధావన్, భార్య నటాషా దలాల్ ఇప్పటికే గోవాలో సందడి చేస్తున్నారు. కొన్నేళ్ల డేటింగ్ తరువాత, రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానీ తమ ప్రేమ బంధాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా 2021,అక్టోబర్ అధికారంగా షేర్ చేసిన సంగతి తెలిసిందే. #WATCH The Gorgeous actress #PragyaJaiswal was snapped arriving at Goa airport to attend bestie #RakulPreetSingh & #JackkyBhagnani's wedding. She was seen posing with fans at the airport. The pair decided to skip overseas weddings and marry in a beautiful hotel in South Goa. pic.twitter.com/Sn2LxraSWh — E Global news (@eglobalnews23) February 20, 2024 -
బాయ్ ఫ్రెండ్‌తో హీరోయిన్ రకుల్ పెళ్లి.. ఈ జోడీ ఆస్తి ఎంతో తెలుసా?
హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లికి రెడీ అయిపోయింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఏడడుగులు వేయబోతుంది. ఫిబ్రవరి 21న ఈకో-ఫ్రెండ్లీ పద్ధతిలో ఈ వేడుక జరగనుంది. గత కొన్ని రోజుల నుంచి పెళ్లి హడావుడి నడుస్తుండగా.. మరోవైపు పెళ్లికి హాజరవడం కోసం ఇప్పటికే అతిథులు అందరూ గోవాకు చేరుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో రకుల్-ఈమె భర్తకు సంబంధించిన ఆస్తుల వివరాలు చర్చనీయాంశంగా మారిపోయాయి. (ఇదీ చదవండి: బాలీవుడ్లో డబ్బులిచ్చి ఆ పని చేయించుకుంటారు: ప్రియమణి) దిల్లీకి చెందిన రకుల్ ప్రీత్.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు హిందీలో కొన్ని సినిమాలు చేసింది గానీ పెద్దగా పేరు రాలేదు. తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చేసిన తర్వాత రకుల్ ఫేట్ మారిపోయింది. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతానికి మాత్రం హిందీలో మాత్రమే మూవస్ చేస్తోంది. కరోనా లాక్ డౌన్ టైంలో బాలీవడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో పడ్డ రకుల్.. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచింది. 2021 అక్టోబరులో అధికారికంగా ప్రకటించేశారు. అప్పటి నుంచి వీళ్లిద్దరూ చాలాసార్లు కలిసి కనిపిస్తూ వచ్చారు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యారు. బుధవారం (ఫిబ్రవరి 21) గోవాలో పెళ్లి చేసుకోనున్నారు. (ఇదీ చదవండి: తల్లి కాబోతున్న హీరోయిన్ దీపికా పదుకొణె.. పెళ్లయిన ఆరేళ్లకు ఇలా!) ఇక రకుల్ ఆస్తుల విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నంలో మూడు జిమ్స్ ఉన్నాయి. వీటితో పాటు మెర్సిడెజ్ బెంజ్ (రూ.కోటి), రేంజ్ రోవర్ స్పోర్ట్స్ (రూ.70 లక్షలు), బీఎండబ్ల్యూ 520డీ (రూ.75 లక్షలు), ఆడీ Q3 (రూ.35 లక్షలు), మెర్సిడెజ్ మెబాజ్ జీఎల్ఎస్600 (రూ.2.96 కోట్లు) కార్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ఈమె దగ్గర రూ.49 కోట్లు విలువైన ఆస్తి ఉందట. మరోవైపు రకుల్ కాబోయే భర్త జాకీ భగ్నానీ ఆస్తుల విషయానికొస్తే.. నిర్మాతగా పలు సినిమాలు చేస్తున్న ఇతడి దగ్గర పోర్స్ కేయన్ని (రూ.1.36 కోట్లు), మెర్సిడెజ్ బెంజ్ సీఎల్ఎస్ (రూ.84 లక్షలు), మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ.2.11 కోట్లు), రేంజ్ రోవల్ వాగ్ (రూ.2.39 కోట్లు) కార్లు ఉన్నాయి. పలు స్థిరాస్తులతో కలిపి ఓవరాల్‌గా ఇతడి దగ్గర రూ.35 కోట్ల విలువైన ఆస్తి ఉందట. ఇలా ఇద్దరి దగ్గర కలిపి రూ.84 కోట్ల వరకు ఆస్తులు ఉన్నాయని సమాచారం. (ఇదీ చదవండి: కొత్త పెళ్లి కూతురిలా సన్నీ లియోన్.. మంచు లక్ష్మీ అలాంటి లుక్!) -
నా తొలి రెమ్యునరేషన్ ఇదే: రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ కుటుంబానికి చెందిన ఈ బ్యూటీ గిల్లి అనే కన్నడ సినిమాతో 2009లో మొదటిసారి వెండితెరపై మెరిసింది. టాలీవుడ్లో కెరటం అనే చిన్న సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత తన టాలెంట్‌తో సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో నటిస్తూనే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అలా మోడలింగ్ నుంచి హీరోయిన్గా మంచి గుర్తింపు పొందే స్థాయికి రకుల్ చేరుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో తన ప్రియుడు బాలీవుడ్ అగ్ర నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న గోవాలో వారి వివాహం ఘనంగా జరగనుంది. ఈ క్రమంలో ఆమె జర్నీని ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంది. జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు వెన్నంటి ఉండి సాయం చేసే వ్యక్తులు మన చుట్టూ లేకుంటే సమస్యలు తలెత్తుతాయని ఆమె తెలిపింది. 'నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు నుంచి నాకు 25 ఏళ్లు వచ్చే వరకు మా అమ్మ ఎప్పుడూ తోడుగా నిలిచింది. నా కెరియర్ మోడలింగ్‌తోనే ప్రారంభమైంది. అలా నేను మొదట అందుకున్న రెమ్యునరేషన్ రూ.5 వేలు.. అక్కడి నుంచి నేడు ఈ స్థాయికి చేరుకున్నానంటే అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, సన్నిహితులు మాత్రమే.. నా వెంట వాళ్లు లేకుంటే ఎన్నో సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చేది.' అంటూ రకుల్ తెలిపింది. ప్రస్తుతం రకూల్ మేరీ పత్నీ కా రీమేక్, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
రకుల్, జాకీ పెళ్లి సందడి : వెడ్డింగ్ కార్డ్ వైరల్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో పెళ్లిసందడికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. చాలాకాలంగా ప్రేమలో ఉన్న ఈ లవ్‌బర్డ్స్ తమ రిలేషన్ షిప్లో మరో అడుగు వేయబోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజగా వీరి పెళ్లికి సంబందించిన వెడ్డింగ్ కార్డ్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఫిబ్రవరి 21న రకుల్, జాకీ భగ్నానీ ల వివాహం గోవాలో జరగబోతోంది. వివాహ సన్నాహాలు పూర్తి స్వింగ్‌లో ఉన్నాయి. వీరి వెడ్డింగ్ స్పెషల్‌గా , చిరకాలం గుర్తుండిపోయేలా అంగరంగ వైభవంగా జరిపేందుకు రెండు కుటుంబాలు బిజీగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నీలం, తెలుపు రంగుల్లో రకుల్, జాకీ భగ్నానీ పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శుభలేఖలో కొబ్బరి చెట్లు, బీచ్ దృశ్యాలతోపాటు గోవా అందాలు కనిపించేలా ముద్రించడం విశేషం. అందమైన సోఫా నీలం , తెలుపురంగుల్లో క్యూట్ క్యూట్ కుషన్లు.. మరో పూలద్వారం గుండా నీలిరంగు గేటు అందమైన బీచ్‌కి దారి తీస్తూ, రకుల్, జాగీ పెళ్లి ముహూర్తం విశేషం ఇందులో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నట్టు వీరి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా హాట్ టాపిక్కే. ఎందుకంటే వీరి ద్దరి ప్రేమ కూడా ఇక్కడే మొదలైందట. అందుకే గోవాను ఎంచుకున్నట్టు సమాచారం. -
Rakul, Jackky Wedding: పెళ్లి విషయంలో రకుల్ యూ టర్న్.. అదే కారణమా?
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిల్లీ భామ తెలుగులో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీతో అభిమానుల్లో పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత లౌక్యం, కరెంటు తీగ, కిక్ -2, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, స్పైడర్ సినిమాల్లో స్టార్ హీరోలతో నటించింది. అయితే గత రెండేళ్లుగా బాలీవుడ్‌కు మకాం మార్చింది. అక్కడ అటాక్, రన్ వే -34, ఛత్రీవాలీ, ఐ లవ్ యూ లాంటి సినిమాలు చేసింది. అయితే గత కొన్నాళ్లుగా నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమాయణం కొనసాగిస్తోంది ముద్దుగుమ్మ. ఇప్పటికే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఇక త్వరలోనే అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతోంది భామ. ఈ జంట తమ వివాహా వేడుక కోసం డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. విదేశాల్లో పెళ్లి చేసుకోవాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు. గోవాకు మారిన వెడ్డింగ్.. అయితే రకుల్ ప్రీత్ సింగ్ సడన్‌గా యూ టర్న్ తీసుకుంది. తన పెళ్లి కోసం విదేశాలకు వెళ్లడం లేదని తెలుస్తోంది. పెళ్లి వేదికను ఇండియాలోని గోవాకు మార్చుకుంది. ఫిబ్రవరి 22న వీరిద్దరి వివాహా వేడుక గోవాలో జరగనుంది. అయితే చివరి నిమిషంలో లొకేషన్‌ను ఇండియాకు మార్చడానికి నిర్ణయం తీసుకోవడానికి అదే కారణమా అంటూ నెటిజన్స్ తెగ చర్చించుకుంటున్నారు. అదేంటో తెలుసుకుందాం. మోదీ పిలుపే కారణమా? రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని మొదట్లో విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌ని ప్లాన్ చేశారు. కానీ సడన్‌గా ఈ నిర్ణయం మార్చుకోవడం వెనుక మన ప్రధాని మోదీనే కారణమని వార్త నెట్టింట వైరలవుతోంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో ధనిక, వ్యాపార, సెలబ్రిటీల కుటుంబాలు తమ పెద్ద పెద్ద ఈవెంట్లకు భారతదేశాన్ని వేదికగా ఎంచుకోవాలని పీఎం పిలుపునిచ్చారు. అందువల్లే రకుల్, జాకీ విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇటీవలే లక్షద్వీప్ వెళ్లిన మోదీ చేసిన ఫొటోషూట్ తర్వాత మాల్దీవుల మంత్రులు చేసిన కామెంట్స్‌తో వివాదం మొదలైంది. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు అక్కడి వెకేషన్లను సైతం రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఇటీవలే ఈ జంట ముంబైలోని రామమందిరంలో ప్రార్థనలు చేశారు. ఈ విషయాన్ని తమ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. గోవాలో ఫిబ్రవరి 22న జరగబోయే వీరి వివాహానికి బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండస్ట్రీకి చెందిన సన్నిహితులు హాజరుకానున్నారు. -
బాయ్ ఫ్రెండ్ తో ఏడు అడుగులు..ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్?
-
Rakul Marriage: ఫిబ్రవరిలో పెళ్లి?
జాకీ భగ్నానీ, రకుల్‌ప్రీత్ సింగ్ ఫిబ్రవరిలో ఏడడుగులు వేయనున్నారనే వార్త గుప్పుమంది. హీరోయిన్ రకుల్, హీరో–నిర్మాత జాకీ దాదాపు రెండు మూడేళ్లుగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమను పెళ్లి వరకూ తీసుకెళ్లాలని ఈ ఇద్దరూ నిర్ణయించుకున్నారట. ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని సమాచారం. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నారట. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో రకుల్, జాకీల పెళ్లి జరగనుందని భోగట్టా. సోమవారం ఈ పెళ్లి వార్త వైరల్‌గా మారినప్పటికీ రకుల్, జాకీ నుంచి ఎలాంటి స్పందన లేదు. -
హీరోయిన్ రకుల్ ప్రీత్ పెళ్లి ఫిక్స్.. కాబోయే భర్త ఎవరో తెలుసా?
2023 నవంబరు-డిసెంబరులో చాలామంది సెలబ్రిటీలు పెళ్లి చేసుకున్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మెగాహీరో వరుణ్ తేజ్‌తో పాటు పలువురు సీరియల్ బ్యూటీస్ కూడా ఏడడుగుల బంధంలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా మ్యారేజ్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్, డేట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం వినిపిస్తోంది. దిల్లీకి చెందిన ఈ బ్యూటీ.. 2009లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే తెలుగు మూవీతో ఈమె కెరీర్ పరంగా బ్రేక్ అందుకుంది. దీంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలానే తెలుగులో స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) ప్రస్తుతం రకుల్‌కి తెలుగు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. హిందీలో ఒకటో రెండో మూవీస్ చేస్తోంది. వ్యక్తిగత విషయానికొస్తే 2021లో తన ప్రియుడ్ని అందరికీ పరిచయం చేసింది. ఇతడి పేరు జాకీ భగ్నానీ. బాలీవుడ్లో నిర్మాతగా కాస్త గుర్తింపు తెచ్చుకున్నాడు. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారు. అయితే 2024 ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పీటలెక్కనుందని సమాచారం బయటకొచ్చింది. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. ఈ ఫిబ్రవరి 22న గోవా వేదికగా రకుల్ ప్రీత్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తోందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత? మిగతా విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సుడిగాలి సుధీర్ లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ప్రియుడికి స్పెషల్ విషెస్ చెప్పిన 'సరైనోడు' భామ.. పోస్ట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాల్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆమె ప్రియుడితో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఆమె బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషల్ విషెస్ చేసింది ముద్దుగుమ్మ. ఇవాళ అతని బర్త్ డే కావడంతో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీ జీవితంలో ప్రతిరోజు అనుకునవన్నీ జరగాలని కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేసింది. నీలాంటి అమాయకత్వం, దయ, నవ్వించే గుణంతో ఎవరూ ఉండరేమో అంటూ కొనియాడారు. ఇలాగే జీవితంలో మరింత ముందుకు సాగాలని ఆశిస్తున్నట్లు రకుల్ రాసుకొచ్చింది. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
రకుల్ భామకు బాయ్‌ఫ్రెండ్ స్పెషల్ విషెస్.. ఇన్‌స్టా పోస్ట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్ దక్షిణాదిలో పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. కెరటం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిత్రంలో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత లౌక్యం, సరైనోడు, నాన్నకు ప్రేమతో, ధృవ, కిక్-2 లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం ఇండియన్-2, అయాలన్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనెల 10న 32వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె బాయ్‌ఫ్రెండ్, బాలీవుడ్ హీరో జాకీ భగ్నానీ స్పెషళ్ విషెస్ చెప్పాడు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలతో ఓ వీడియోను రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్‌స్టాలో జాకీ రాస్తూ..'మీ ఈ ప్రత్యేకమైన రోజున.. నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసే వ్యక్తి పట్ల నా అభిమానాన్ని తెలియజేయాలనుకుంటున్నా. మీతో ఉంటే ప్రతి రోజు ఒక అద్భుతమైన ప్రయాణంలా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా అలసిపోయినట్లు అనిపించదు. మీరు నా సహచరుడి కంటే ఎక్కువ. నువ్వే నా ధైర్యం.. ప్రతి అడుగులో నువ్వే నా భాగస్వామి. నా జీవితాన్ని ప్రేమ, సంతోషంతో నింపే వ్యక్తి నువ్వే. ఈ గొప్ప రోజున, మీరు కలలుగన్నవన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. మీ కలలన్నీ నిజమవుతాయి.. ఎందుకంటే మీరు మాత్రమే జీవితంలో ఉత్తమమైన వాటిని సాధించడానికి అర్హులు. ప్రతి రోజును ఎక్స్ట్రార్డినరీగా మార్చే వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు! ' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీ డేటింగ్లో ఉన్నట్లు గతేడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. జాకీ భగ్నానీ హీరో, నిర్మాత, వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆయన 2009లో కల్ కిస్నే దేఖా సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. View this post on Instagram A post shared by JACKKY BHAGNANI (@jackkybhagnani) -
బాయ్‌ఫ్రెండ్‌తో వెడ్డింగ్‌కు హాజరైన స్టార్ హీరోయిన్!
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. శాండల్‌వుడ్‌లో కెరీర్ ప్రారంభించిన ముద్దుగుమ్మ తెలుగులో కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించింది. లౌక్యం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. గతేడాది ఛత్రివాలి సినిమాతో ప్రేక్షకుల అలరించిన భామ.. తాజాగా 'బూ' అనే హార్రర్ చిత్రంతో ముందుకొచ్చింది. (ఇది చదవండి: పెళ్లి వేడుకల్లో మనోజ్- మౌనిక.. ఆమెను ఇలా ఎప్పుడైనా చూశారా? ) అయితే తాజాగా ముంబయిలో జరిగిన ప్రముఖ నిర్మాత మధు మంతెన పెళ్లిలో తళుక్కున మెరిసింది. తన ప్రియుడు, నిర్మాత జాకీ భగ్నానితో కలిసి వెడ్డింగ్ వేడుకల్లో సందడి చేసింది. కాగా.. 2021లో రకుల్ ప్రీత్ సింగ్ బర్త్‌డే సందర్భంగా జాకీ భగ్నానీ ఇన్‌స్టాగ్రామ్‌లో విష్ చేయడంతో డేటింగ్ రూమర్స్ వైరలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పలు సందర్భాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. తాజాగా మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి నిర్మాత మధుమంతెన- ఐరా త్రివేది పెళ్లిలో సందడి చేసింది. దీంతో ఈ ప్రేమజంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
గతేడాది నవంబర్లోనే పెళ్లైపోయింది!: రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో ముగిని తేలుతున్న సంగతి తెలిసిందే! ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అప్పుడప్పుడూ మీడియాకు సైతం చిక్కుతుంటారు. అయితే రకుల్ ప్రియుడితో పెళ్లికి రెడీ అయిందంటూ తరచూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం సర్వసాధారణమైపోయింది. రకుల్ సోదరుడు అమన్ సైతం వారి పెళ్లి వార్తలను ధృవీకరించాడని లేటెస్ట్గా ఓ రూమర్ మొదలైంది. తాజాగా దీనిపై స్పందించిందీ బ్యూటీ. 'నా పెళ్లి గురించి ప్రతివారం ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. దాని ప్రకారం నేను గతేడాది నవంబర్లోనే పెళ్లి చేసుకున్నాను. ఇంతకీ మా పెళ్లి ఎలా జరిగిందో చెప్పనేలేదు? ప్రస్తుతానికి మా బిజీలో మేమున్నాం. పని గురించి తప్ప మాకు వేరే ధ్యాస లేదు' అని క్లారిటీ ఇచ్చింది. ఇంకా మాట్లాడుతూ.. 'సాధారణంగా నేను గూగుల్‌లో ఫుడ్ గురించి సెర్చ్ చేస్తుంటా.. దేంట్లో ఎంత క్యాలరీస్ ఉంటాయనేది తెలుసుకుంటా. కేవలం ఫుడ్, క్యాలరీస్, ఆరోగ్యం గురించే శోధిస్తుంటాను. కానీ నాకు వంట మాత్రం రాదు. పరమ దరిద్రంగా ఎలా వండాలో మీక్కావాలంటే నేను నేర్పిస్తాను. అది అందరికీ రాదు' అని పేర్కొంది రకుల్. -
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న రకుల్ ప్రీత్ సింగ్
నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు యమ ఖుషీగా ఉన్నారు. ఈ ఉత్తరాది బ్యూటీ తొలుత కన్నడంలో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత కెరటం చిత్రంతో టాలీవుడ్‌కు, తడయార తాక్క చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అయ్యారు. తొలి రోజుల్లో సరైన సక్సెస్‌లు లేక నిరాశ పడినా ఆ తరువాత దక్షిణాదిలో వరుస విజయాలతో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్నారు. ప్రస్తుతం పెద్ద క్రేజ్ లేకపోయినా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో అవకాశాలు వస్తనే ఉన్నాయి. తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటిస్తున్న అయలాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం కమలహాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు పదుల వయసు దాటిన రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బద్నానితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు. ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ గురించి బహిరంగంగా వెల్లడించారు. అంతేకాదు బాయ్ ఫ్రెండ్‌తో చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇటీవల తన పుట్టిన రోజును కూడా జాకీ బద్నానితో ఖుషీ ఖుషీగా జరుపుకున్నారు. ఆ ఫొటోలు సామాజిక వధ్యమాల్లో వైరల్ అయ్యాయి. తాజాగా తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్ స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి తనకు శాంతా ఇచ్చిన గిఫ్ట్ జాకీ అని పేర్కొన్నారు. కాగా వచ్చే ఏడాది ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
నా పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చావా..? తమ్ముడిని ప్రశ్నించిన రకుల్
ఒకప్పుడు టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకెళ్లిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం తెలుగు తెరకు కాస్త దూరంగా ఉంటుంది. ‘కొండపొలం’ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. దీంతో రకుల్ ఇక టాలీవుడ్లో సినిమాల్లో నటించదా? అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే తాను మాత్రం కచ్చితంగా మళ్లీ టాలీవుడ్ సినిమాల్లో నటిస్తానని చెబుతోంది రకుల్. త్వరలోనే తెలుగు తెరపై సందడి చేస్తానని, టాలీవుడ్ ప్రేక్షకుల ప్రేమను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకొనని చెబుతోంది. (చదవండి: అది మన దురదృష్టం..మనుషుల్లో అది కూడా ఒక భాగమే) ఇదిలా ఉంటే.. త్వరలోనే రకుల్ పెళ్లి చేసుకోబోతుందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో రకుల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకుల్ ప్రీత్ తమ్ముడు అమన్ ప్రీత్ చెప్పినట్లు ఓ జాతీయ పత్రికలో వార్తలు వచ్చాయి. దీనిపై రకుల్ కాస్త వ్యంగ్యంగా స్పందించింది. ‘అమన్.. నా పెళ్లి గురించి నిజంగానే నువ్వు క్లారిటీ ఇచ్చావా? నా పెళ్లి గురించి నాక్కూడా చెప్పాలి కదా బ్రో..! నా జీవితం గురించి నాకే తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉంది’అని రకుల్ ట్వీట్ చేసింది. కాగా, రకుల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘డాక్టర్ జీ’ ఈ నెల 14న విడుదల కాబోతుంది. ప్రస్తుతం ‘థ్యాంక్ గాడ్, ఛత్రివాలి, ఇండియన్-2 చిత్రాల్లో నటిస్తోంది. 😂 @AmanPreetOffl you confirmed ? Aur mujhe bataya bhi nahi bro .. it’s funny how I don’t have news about my life .. https://t.co/ZSZgNjW2BW — Rakul Singh (@Rakulpreet) October 12, 2022